Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_26</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_26" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షడ్వింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">శ్రీరాముడు తాటకను సంహరించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాఘవః ప్రాఞ్జలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దృఢవ్రతః = దృఢమైన నియమములు గల</span>, <span xml:lang="en-US">నరవరాత్మజః = రాజశ్రేష్ఠుని కుమారుడైన</span>, <span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">అక్లీబమ్ = దృఢనిశ్చయపూర్వకమైన</span>, <span xml:lang="en-US">మునేః = మునియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడు</span>, <span xml:lang="en-US">భూత్వా = అయి</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నిశ్చయపూర్వకముగ పలికిన విశ్వామిత్రుని మాటలు విని</span>, <span xml:lang="en-US">దృఢ మైన నియమము కలవాడును</span>, <span xml:lang="en-US">రాజశ్రేష్ఠుని కుమారుడును అగు రాముడు</span>, <span xml:lang="en-US">అంజలి ఘటించి పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పితుర్వచననిర్దేశాత్పితుర్వచనగౌరవాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశఙ్కయా. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పితుః = తండ్రిగారియొక్క</span>, <span xml:lang="en-US">వచననిర్దేశాత్ = ఆజ్ఞావచనమువలనను</span>, <span xml:lang="en-US">పితుః = తండ్రిగారియొక్క</span>, <span xml:lang="en-US">వచనగౌరవాత్ = మాటయందు గౌరవమువలనను</span>, <span xml:lang="en-US">కౌశికస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ ఇతి = వాక్య మనెడు కారణమువలనను</span>, <span xml:lang="en-US">అవిశఙ్కయా = సందేహము లేకుండగ</span>, <span xml:lang="en-US">కర్తవ్యమ్ = చేయదగినదే.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మా తండ్రిగారి ఆజ్ఞవలనను</span>, <span xml:lang="en-US">ఆయన వాక్యమునందు నా కున్న గౌరవము వలనను</span>, <span xml:lang="en-US">నీ వాక్య మగుటవలనను ఈ కార్యము నిస్సందేహముగ చేయదగినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అనుశిష్టోఽస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పిత్రా దశరథేనాహం నామజ్ఞేయం హి తద్వచః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అయోధ్యాయామ్ = అయోధ్యలో</span>, <span xml:lang="en-US">గురుమధ్యే = పెద్దల మధ్యయందు</span>, <span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">పిత్రా = తండ్రి యైన</span>, <span xml:lang="en-US">దశరథేన = దశరథునిచేత</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">అనుశిష్టః అస్మి = ఆజ్ఞాపింపబడితిని</span>, <span xml:lang="en-US">తద్వచః = ఆయనవాక్యము</span>, <span xml:lang="en-US">నావజ్ఞేయం హి = ఉల్లంఘింపదగినది కాదు కదా<a/></span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అయోధ్యానగరములో</span>, <span xml:lang="en-US">వసిష్ఠాదిగురుజనుల మధ్య</span>, <span xml:lang="en-US">మహాత్ముడైన మా తండ్రి దశరథమహారాజు </span>‘‘<span xml:lang="en-US">విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయుము</span>’’ <span xml:lang="en-US">అని ఆజ్ఞాపించినాడు. ఆయన మాటను ఉల్లఘింపరాదు కదా</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సోఽహం పితుర్వచః శ్రుత్వా శాసనాద్బ్రహ్మవాదినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కరిష్యామి న సన్దేహస్తాటకావధముత్తమమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః అహమ్ = అట్టి నేను</span>, <span xml:lang="en-US">పితుః = తండ్రియొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">బ్రహ్మవాదినః = వేదాధ్యయనసంపన్నుడ వైన నీయొక్క</span>, <span xml:lang="en-US">శాసనాత్ = ఆజ్ఞవలన</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">తాటకావధమ్ = తాటకయొక్క వధను</span>, <span xml:lang="en-US">కరిష్యామి = చేయగలను</span>; <span xml:lang="en-US">సన్దేహః = సందేహము</span>, <span xml:lang="en-US">న = లేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నేను తండ్రిగారి ఆజ్ఞప్రకారము</span>, <span xml:lang="en-US">బ్రహ్మవాది వైన నీ మాట పాటించి తప్పక తాటకను సంహరించెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">గోబ్రాహ్మణహితార్థాయ = గోబ్రాహ్మణుల హితముకొరకును</span>, <span xml:lang="en-US">అస్య = ఈ</span>, <span xml:lang="en-US">దేశస్య = దేశముయొక్క</span>, <span xml:lang="en-US">సుఖాయ చ = సుఖముకొరకును</span>, <span xml:lang="en-US">అప్రమేయస్య = అమేయమైన శక్తి గల</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">ఉద్యతః = సిద్ధముగ నున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గోబ్రాహ్మణుల సుఖముకొరకును</span>, <span xml:lang="en-US">ఈ దేశముయొక్క సుఖముకొరకును</span>, <span xml:lang="en-US">అప్రమేయప్రభావశాలి వగు నీ ఆజ్ఞప్రకారము చేయుటకు సిద్ధముగా నున్నాను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిమరిన్దమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జ్యాశబ్దమకరోత్తీవ్రం దిశశ్శబ్దేన నాదయన్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అరిందమః = శత్రువులను నశింపచేయు రాముడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా </span><span xml:lang="en-US">= పలికి</span>, <span xml:lang="en-US">ధనుర్మధ్యే = ధనుస్సుయొక్క మధ్యమునందు</span>, <span xml:lang="en-US">ముష్టిమ్ = పిడికిలిని</span>, <span xml:lang="en-US">బద్ధ్వా = బంధించి</span>, <span xml:lang="en-US">శబ్దేన = శబ్దముచేత</span>, <span xml:lang="en-US">దిశః = దిక్కులను</span>, <span xml:lang="en-US">నాదయన్ = ధ్వనింపచేయుచు</span>, <span xml:lang="en-US">తీవ్రమ్ = తీవ్రమైన</span>, <span xml:lang="en-US">జ్యాశబ్దమ్ = నారియొక్క శబ్దమును</span>, <span xml:lang="en-US">అకరోత్ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శత్రుసంహారకు డగు రాముడు ఈ విధముగ పలికి</span>, <span xml:lang="en-US">పిడికిలితో ధనుర్మధ్యము నందు గట్టిగా పట్టి</span>, <span xml:lang="en-US">దిక్కులు ప్రతిధ్వనించునట్లు తీవ్రమైన టంకార ధ్వనిని చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తేన శబ్దేన విత్రస్తాస్తాటకావనవాసినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తాటకా చ సుసంక్రుద్ధా తేన శబ్దేన మోహితా. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తాటకావనవాసినః = తాటకయొక్క అరణ్యములో నివసించు సర్వప్రాణులును</span>, <span xml:lang="en-US">తేన శబ్దేన = ఆ ధ్వనిచేత</span>, <span xml:lang="en-US">విత్రస్తాః = భయపడినవి. తాటకా చ = తాటక కూడ</span>, <span xml:lang="en-US">తేన శబ్దేన = ఆ శబ్దముచేత</span>, <span xml:lang="en-US">సుసంక్రుద్ధా = చాల కోపించినదై</span>, <span xml:lang="en-US">మోహితా = మోహింప చేయబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>తాటకావనములో అన్ని ప్రాణులును ఆ ధ్వనికి భయపడినవి. తాటక కూడ ఆ శబ్దముచేత మిక్కిలి కోపించి దిగ్భ్రాంతి చెందెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రుత్వా చాభ్యద్రవద్వేగాద్యతః శబ్దో వినిస్సృతః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాక్షసీ = ఆ రాక్షసి</span>, <span xml:lang="en-US">తం శబ్దమ్ = ఆ శబ్దమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">క్రోధమూర్ఛితా = క్రోధావిష్టురాలై</span>, <span xml:lang="en-US">అభినిధ్యాయ = ఆలోచించి</span>, <span xml:lang="en-US">యతః = ఏ వైపునుండి</span>, <span xml:lang="en-US">శబ్దః = శబ్దము</span>, <span xml:lang="en-US">వినిస్సృతః = బయలుదేరినదో</span>, <span xml:lang="en-US">ఆ వైపునకు</span>, <span xml:lang="en-US">వేగాత్ = వేగమువలన</span>, <span xml:lang="en-US">అభ్యద్రవత్ = పరుగెత్తెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ శబ్దము వినగనే కోపావిష్టురా లైన తాటక</span>, <span xml:lang="en-US">క్షణకాల మాలోచించి ఆ శబ్దమువచ్చిన వైపు శీఘ్రముగ పరుగెత్తెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధాం వికృతం వికృతాననామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం సోఽభ్యభాషత. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః రాఘవః = ఆ రాముడు</span>, <span xml:lang="en-US">క్రుద్ధామ్ = కోపగించినదియు</span>, <span xml:lang="en-US">వికృతామ్ = వికారముగా ఉన్నదియు</span>, <span xml:lang="en-US">వికృతాననామ్ = వికృత మైన ముఖము కలదియు</span>, <span xml:lang="en-US">ప్రమాణేన = ప్రమాణముచేత</span>, <span xml:lang="en-US">అతివృద్ధాం చ = చాల పెద్దదియు అగు</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">లక్ష్మణం = లక్ష్మణునిగూర్చి</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వికారముగా ఉన్న ముఖముతో</span>, <span xml:lang="en-US">పెద్ద దేహముతో నున్న కోపించిన ఆమెను చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భిద్యేరన్ దర్శనాదస్యా భీరూణాం హృదయాని చ. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లక్ష్మణ = లక్ష్మణా! యక్షిణ్యాః = ఈ యక్షిణియొక్క</span>, <span xml:lang="en-US">భైరవమ్ = భయంకరమైన</span>, <span xml:lang="en-US">దారుణమ్ = క్రూరమైన</span>, <span xml:lang="en-US">వపుః = శరీరమును</span>, <span xml:lang="en-US">పశ్య = చూడుము. అస్యాః = ఈమెయొక్క</span>, <span xml:lang="en-US">దర్శనాత్ = దర్శనమువలన</span>, <span xml:lang="en-US">భీరూణామ్ = పిరికివారియొక్క</span>, <span xml:lang="en-US">హృదయాని = హృదయములు</span>, <span xml:lang="en-US">భిద్యేరన్ = పగిలిపోవును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లక్ష్మణా! ఈ యక్షిణి ఆకారము ఎంత భయంకరముగను</span>, <span xml:lang="en-US">క్రూరముగను ఉన్నదో చూడుము. ఈమెను చూడగనే పిరికివాళ్ల గుండెలు పగిలిపోవును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏనాం పశ్య దురాధర్షాం మాయాబలసమన్వితామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికామ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దురాధర్షామ్ = ఎదిరింప శక్యము కానిదియు</span>, <span xml:lang="en-US">మాయాబలసమన్వితామ్ = మాయాబలముతో కూడినదియు అగు</span>, <span xml:lang="en-US">ఏనామ్ = ఈమెను</span>, <span xml:lang="en-US">హృతకర్ణాగ్రనాసికామ్ = హరింపబడిన చెవులు నాసికాగ్రము కలిగి</span>, <span xml:lang="en-US">వినివృత్తామ్ = మరలిపోవుదానినిగా</span>, <span xml:lang="en-US">అద్య = ఇప్పుడు</span>, <span xml:lang="en-US">కరోమి = చేయుదును</span>, <span xml:lang="en-US">పశ్య = చూడుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మాయాబలముచే ఎదిరింప శక్యము కాక ఉన్న ఈమెను</span>, <span xml:lang="en-US">చెవులును నాసాగ్రమును ఖండించి వెనుకకు మరలిపోవు నట్లు చేసెదను చూడుము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న హ్యేనాముత్సహే హన్తుం స్త్రీస్వభావేన రక్షితామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వీర్యం చాస్యాం గతిం చాపి హనిష్యామీతి మే మతిః. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">స్త్రీస్వభావేన = స్త్రీఅగుటచే</span>, <span xml:lang="en-US">రక్షితామ్ = రక్షింపబడిన</span>, <span xml:lang="en-US">ఏనామ్ = ఈమెను</span>, <span xml:lang="en-US">హన్తుమ్ = చంపుటకు</span>, <span xml:lang="en-US">న ఉత్సహే = యత్నించను</span>, <span xml:lang="en-US">అస్యామ్ = ఈమెయందలి</span>, <span xml:lang="en-US">వీర్యమ్ = పరాక్రమమును</span>, <span xml:lang="en-US">గతిం చాపి = గమనశక్తిని</span>, <span xml:lang="en-US">హనిష్యామీతి = తొలగించెదను అని</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">మతిః = అభిప్రాయము.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆడు దగుటయే ఈమెను రక్షించుచున్నది. ఈమెను చంపుటకు యత్నింపక ఈమె పరాక్రమమును</span>, <span xml:lang="en-US">గమనశక్తిని నశింపచేయ వలె నని అనుకొనుచున్నాను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉద్యమ్య బాహూ గర్జన్తీ రామమేవాభ్యధావత. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామే = రాముడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">బ్రువాణే = పలుకుచుండగనే</span>, <span xml:lang="en-US">తాటకా = తాటక</span>, <span xml:lang="en-US">క్రోధమూర్ఛితా = కోపముచే వ్యాపింపబడినదై</span>, <span xml:lang="en-US">బాహూ = బాహువులను</span>, <span xml:lang="en-US">ఉద్యమ్య = ఎత్తి</span>, <span xml:lang="en-US">రామమేవ = రాముని గూర్చియే</span>, <span xml:lang="en-US">అభ్యధావత = పరుగెత్తెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు ఇట్లు పలుకుచుండగనే తాటక క్రోధావిష్టురాలై</span>, <span xml:lang="en-US">చేతులు ఎత్తి</span>, <span xml:lang="en-US">గర్జించుచు</span>, <span xml:lang="en-US">రామునిమీదికే పరుగెత్తెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిర్హుంకారేణాభిభర్త్స్య తామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మర్షిః = బ్రహ్మర్షియైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడైతే</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">హుంకారేణ = హుంకారముచేత</span>, <span xml:lang="en-US">అభిభర్త్స్య = భయపెట్టి</span>, <span xml:lang="en-US">రాఘవయోః = రామలక్ష్మణులకు</span>, <span xml:lang="en-US">స్వస్తి = క్షేమము</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక అనియు</span>, <span xml:lang="en-US">జయం చైవ = విజయమును</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బ్రహ్మర్షియైన విశ్వామిత్రుడు హుంకారముచేత ఆమెను అదలించి</span>, ‘‘<span xml:lang="en-US">రామలక్ష్మణులకు స్వస్తి అగుగాక</span>’’ <span xml:lang="en-US">అని పలికి </span>‘‘<span xml:lang="en-US">జయము కలుగు గాక</span>’’ <span xml:lang="en-US">అని కూడ పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఉద్ధూనానా రజో ఘోరం తాటకా రాఘవావుభౌ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రజోమోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా తాటకా = ఆ తాటక</span>, <span xml:lang="en-US">ఘోరమ్ = భయంకర మైన</span>, <span xml:lang="en-US">రజః = పరాగమును</span>, <span xml:lang="en-US">ఉద్ధూనానా = చిమ్ముచు</span>, <span xml:lang="en-US">రాఘవౌ = రామలక్ష్మణులను</span>, <span xml:lang="en-US">ఉభౌ = ఇద్దరిని</span>, <span xml:lang="en-US">ముహూర్తమ్ = క్షణకాలము పాటు</span>, <span xml:lang="en-US">మహతా = గొప్ప</span>, <span xml:lang="en-US">రజోమోహేన = పరాగముచే కలిగిన మోహముచే</span>, <span xml:lang="en-US">వ్యమోహయత్ = మోహింపచేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ తాటక భయంకర మైన పరాగమును చిమ్ముచు</span>, <span xml:lang="en-US">ఆ రామలక్ష్మణులను</span>, <span xml:lang="en-US">క్షణకాలము పాటు</span>, <span xml:lang="en-US">ఆ పరాగములో ఏమియు తోచకుండ చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అవాకిరత్సుమహతా తతశ్చుక్రోధ రాఘవః </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మాయామ్ = మాయను</span>, <span xml:lang="en-US">సమాస్థాయ = అవలంబించి</span>, <span xml:lang="en-US">సుమహతా = చాల గొప్పదైన</span>, <span xml:lang="en-US">శిలావర్షేణ = రాళ్ల వర్షముచేత</span>, <span xml:lang="en-US">రాఘవౌ = రామలక్ష్మణులను</span>, <span xml:lang="en-US">అవాకిరత్ = వెదజల్లెను. తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">చుక్రోధ = కోపించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>పిమ్మట మాయాప్రభావముచే రామలక్ష్మణులపై గొప్ప శిలావర్షమును కురిపించెను. దానితో రామునకు కోపము వచ్చెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రతిహత్యోపధావన్త్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్పదైన</span>, <span xml:lang="en-US">శిలావర్షమ్ = శిలావర్షమును</span>, <span xml:lang="en-US">శరవర్షేణ = బాణవర్షముచేత</span>, <span xml:lang="en-US">ప్రతిహత్య = కొట్టివేసి</span>, <span xml:lang="en-US">ఉపధావన్త్యాః = పరుగెత్తి మీదికి వచ్చుచున్న ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">కరౌ = హస్తములను</span>, <span xml:lang="en-US">పత్రిభిః = బాణములచేత</span>, <span xml:lang="en-US">చిచ్ఛేద = ఛేదించెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు</span>, <span xml:lang="en-US">ఆమె కురిపించిన శిలావర్షమును బాణవర్షముచేత వారించెను. ఆమె మీదికి వచ్చుచుండగా ఆమె హస్తములను బాణములచే ఛేదించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతశ్ఛిన్నభుజాం శ్రాన్తామభ్యాశే పరిగర్జతీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సౌమిత్రిరకరోత్క్రోధాద్ధతకర్ణాగ్రనాసికామ్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">ఛిన్నభుజామ్ = ఛేదింపబడిన భుజములు కలదియు</span>, <span xml:lang="en-US">శ్రాన్తామ్ = అలసిపోయినదియు</span>, <span xml:lang="en-US">అభ్యాశే = సమీపమునందు</span>, <span xml:lang="en-US">పరిగర్జతీమ్ = గర్జించుచున్న ఆమెను</span>, <span xml:lang="en-US">సౌమిత్రిః = లక్ష్మణుడు</span>, <span xml:lang="en-US">క్రోధాత్ = క్రోధము వలన</span>, <span xml:lang="en-US">హృతకర్ణాగ్రనాసికామ్ = ఛేదింపబడిన కర్ణములు</span>, <span xml:lang="en-US">నాసికాగ్రము కలదానినిగా</span>, <span xml:lang="en-US">అకరోత్ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">చేతులు తెగి</span>, <span xml:lang="en-US">అలసిపోయి</span>, <span xml:lang="en-US">సమీపమునందు గర్జించుచున్న ఆ తాటక చెవులను</span>, <span xml:lang="en-US">ముక్కును</span>, <span xml:lang="en-US">లక్ష్మణుడు క్రోధముతో ఛేదించివేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అన్తర్ధానం గతా యక్షీ మోహయన్తీవ మాయయా</span>, <span class="fr">19</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> అశ్మవర్షం విముఞ్చన్తీ భైరవం విచచార హ.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కామరూపధరా = ఇచ్ఛానుసారముగ రూపములను ధరించు ఆ తాటక</span>, <span xml:lang="en-US">సద్యః = వెంటనే</span>, <span xml:lang="en-US">అనేకశః = అనేక విధములుగ</span>, <span xml:lang="en-US">రూపాణి = రూపములను</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">అశ్మవర్షమ్ = శిలావర్షమును</span>, <span xml:lang="en-US">విముఞ్చన్తీ = విడచుచు</span>, <span xml:lang="en-US">భైరవమ్ = భయంకరముగా</span>, <span xml:lang="en-US">విచచార హ = సంచరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఇష్టము ప్రకారము రూపములను ధరింప గల ఆ తాటక అనేక విధములైన రూపములను ధరించుచు</span>, <span xml:lang="en-US">రాళ్లవాన కురిపించుచు</span>, <span xml:lang="en-US">అతిభయంకరముగ సంచరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమన్తతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దృష్ట్వా గాధిసుతః శ్రీమానిదం వచనమబ్రవీత్. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సమన్తతః = అంతటను</span>, <span xml:lang="en-US">అశ్మవర్షేణ = రాళ్లవానచేత</span>, <span xml:lang="en-US">కీర్యమాణౌ = కప్పబడుచున్న</span>, <span xml:lang="en-US">తౌ = ఆ రామలక్ష్మణులను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">శ్రీమాన్ = కాంతి గల</span>, <span xml:lang="en-US">గాధిసుతః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఇదం వచనమ్ = ఈ వచనమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>నలువైపులనుండి రాళ్లవానచే కొట్టబడుచున్న ఆ రామలక్ష్మణులను చూచి విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అలం తే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞవిఘ్నకరీ యక్షీ పురా వర్ధతి మాయయా. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! తే = నీకు</span>, <span xml:lang="en-US">ఘృణయా = జాలిచేత</span>, <span xml:lang="en-US">అలమ్ = చాలును. పాపా = పాపాత్మురాలును</span>, <span xml:lang="en-US">దుష్టచారిణీ = దుర్మార్గురాలును</span>, <span xml:lang="en-US">యజ్ఞవిఘ్నకరీ = యజ్ఞములకు విఘ్నము చేయునదియు అగు</span>, <span xml:lang="en-US">ఏషా యక్షీ = ఈ యక్షిణి</span>, <span xml:lang="en-US">మాయయా = మాయచేత</span>, <span xml:lang="en-US">పురావర్ధతి = వృద్ధి పొందగలదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>‘‘<span xml:lang="en-US">రామా! ఈమె పై జాలి చూపకుము. యజ్ఞములకు విఘ్నము చేయు</span>, <span xml:lang="en-US">పాపాత్మురాలు</span>, <span xml:lang="en-US">దుర్మార్గురాలు అయిన ఈ యక్షిణి మాయాబలముచే వృద్ధి పొందగలదు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వధ్యతాం తావదేవైషా పురా సన్ధ్యా ప్రవర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రక్షాంసి సన్ధ్యాకాలేషు దుర్ధర్షాణి భవన్తి వై. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సన్ధ్యా = సంధ్య</span>, <span xml:lang="en-US">పురా ప్రవర్తతే = ప్రవర్తింప నున్నది. తావదేవ = అంతలోనే</span>, <span xml:lang="en-US">ఏషా = ఈమె</span>, <span xml:lang="en-US">వధ్యతామ్ = చంపబడుగాక. సన్ధ్యాకాలేషు = సంధ్యాకాలములయందు</span>, <span xml:lang="en-US">రక్షాంసి = రాక్షసులు</span>, <span xml:lang="en-US">దుర్ధర్షాణి = ఎదిరింప శక్యము కానివారు</span>, <span xml:lang="en-US">భవన్తి వై = అగుదురు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>సంధ్యాకాలము రాబోవుచున్నది. ఈ లోపుగనే ఈమెను చంపివేయుము. సంధ్యాకాలమునందు రాక్షసులను ఎదిరింప శక్యము కాదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇత్యుక్తస్తు తదా యక్షీమశ్మవృష్ట్యాభివర్షతీమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధ స సాయకైః.</span> <span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇతి = ఈ విధముగ</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలుకబడిన</span>, <span xml:lang="en-US">సః = ఆ రాముడు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">శబ్దవేధిత్వమ్ = శబ్దవేధిత్వమును</span>, <span xml:lang="en-US">దర్శయన్ = చూపుచున్నవాడై</span>, <span xml:lang="en-US">అశ్మవృష్ట్యా = రాళ్ల వానచే</span>, <span xml:lang="en-US">అభివర్షతీమ్ = వర్షించుచున్న</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">యక్షీమ్ = తాటకను</span>, <span xml:lang="en-US">సాయకైః = బాణములచే</span>, <span xml:lang="en-US">రురోధ = అడ్డగించెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రు డిట్లు చెప్పగా రాముడు తన శబ్దవేధిత్వ సామర్థ్యమును చూపుచు</span>, <span xml:lang="en-US">రాళ్లవాన కురిపించుచున్న ఆ తాటకను బాణములచే అడ్డుపెట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">వి. </span>శబ్ద మెచటినుండి వచ్చుచున్నదో దానినిబట్టి ఆ శబ్దము చేయు వ్యక్తి కనబడకున్నను ఆతనిని కొట్టగల సామర్థ్యము శబ్దవేధిత్వము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సా రుద్ధా శరజాలేన మాయాబలసమన్వితా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభిదుద్రావ కాకుత్స్థం లక్ష్మణం చ వినేదుషీ.</span> <span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శరజాలేన = బాణసముదాయముచేత</span>, <span xml:lang="en-US">రుద్ధా = అడ్డుకొనబడిన</span>, <span xml:lang="en-US">మాయాబల సమన్వితా = మాయాబలము గల</span>, <span xml:lang="en-US">సా = ఆమె</span>, <span xml:lang="en-US">వినేదుషీ = గర్జించుచు</span>, <span xml:lang="en-US">కాకుత్థ్సమ్ = రాముని</span>, <span xml:lang="en-US">లక్ష్మణం చ = లక్ష్మణుని గూర్చి</span>, <span xml:lang="en-US">అభిదుద్రావ = పరుగెత్తెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మాయాబలము గల ఆ తాటక బాణజాలముచే అడ్డుకొనబడినదై</span>, <span xml:lang="en-US">గర్జించుచు రామలక్ష్మణుల మీదికి పరుగెత్తికొని వచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తామాపతన్తీం వేగేన విక్రాన్తామశనీమివ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శరేణోరసి వివ్యాధ సా పపాత మమార చ. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విక్రాన్తామ్ = పరాక్రమము చూపుచు</span>, <span xml:lang="en-US">అశనీమివ = పిడుగు వలె</span>, <span xml:lang="en-US">వేగేన = వేగముతో</span>, <span xml:lang="en-US">ఆపతన్తీమ్ = వచ్చి మీద పడుచున్న</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">శరేణ = బాణముతో</span>, <span xml:lang="en-US">ఉరసి = వక్షఃస్థలమునందు</span>, <span xml:lang="en-US">వివ్యాధ = కొట్టెను</span>, <span xml:lang="en-US">సా = ఆమె</span>, <span xml:lang="en-US">పపాత = క్రిందపడిపోయెను</span>, <span xml:lang="en-US">మమార చ = మరణించెను కూడ. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పరాక్రమము చూపుచు పిడుగు వలె వేగముగ వచ్చి మీద పడుచున్న ఆమెను రాముడు</span>, <span xml:lang="en-US">బాణముచే వక్షఃస్థలమునందు కొట్టెను. ఆమె క్రింద పడి చనిపోయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాం హతాం భీమసఙ్కాశాం దృష్ట్వా సురపతిస్తదా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాధు సాధ్వితి కాకుత్స్థం సురాశ్చ సమపూజయన్.</span> <span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సురపతిః = దేవేంద్రుడును</span>, <span xml:lang="en-US">సురాశ్చ = దేవతలును</span>, <span xml:lang="en-US">హతామ్ = చంపబడిన</span>, <span xml:lang="en-US">భీమసఙ్కాశామ్ = భయంకరురాలుగా ఉన్న</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">సాధు సాధు</span>, <span xml:lang="en-US">ఇతి = </span>‘‘<span xml:lang="en-US">బాగు బాగు</span>’’ <span xml:lang="en-US">అని</span>, <span xml:lang="en-US">కాకుత్థ్సమ్ = రాముని</span>, <span xml:lang="en-US">సమపూజయన్ = పూజించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">భయంకరురా లైన ఆ తాటక మరణమును చూచి</span>, <span xml:lang="en-US">దేవతలును</span>, <span xml:lang="en-US">దేవేంద్రుడును</span>, ‘‘<span xml:lang="en-US">బాగు బాగు</span>’’ <span xml:lang="en-US">అని రాముని ప్రశంసించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పురన్దరః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సురాశ్చ సర్వే సంహృష్టా విశ్వామిత్రమథాబ్రువన్.</span> <span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">సహస్రాక్షః = వేయి నేత్రములు గల</span>, <span xml:lang="en-US">పురన్దరః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">పరమప్రీతః = చాల సంతోషించినవాడై</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="en-US">సురాశ్చ = దేవతలును</span>, <span xml:lang="en-US">సంహృష్టాః = సంతోషించిన వారై</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>సహస్రాక్షు డైన దేవేంద్రుడు దేవత లందరును కూడ సంతసించి విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మునే కౌశిక భద్రం తే సేన్ద్రాస్సర్వే మరుద్గణాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తోషితాః కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే.</span> <span class="fr">28</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కౌశికమునే = ఓ విశ్వామిత్రమహామునీ</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమమగుగాక. సేన్ద్రాః = ఇంద్రునితో కూడిన</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="en-US">మరుద్గణాః = దేవతలు</span>, <span xml:lang="en-US">అనేన = ఈ</span>, <span xml:lang="en-US">కర్మణా = కర్మచేత</span>, <span xml:lang="en-US">తోషితాః = సంతోషింపచేయబడినారు. రాఘవే = రాముని విషయమున</span>, <span xml:lang="en-US">స్నేహమ్ = స్నేహమును</span>, <span xml:lang="en-US">దర్శయ = చూపుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రమహర్షీ! నీకు క్షేమ మగుగాక. ఈ పనిచేత సకల దేవతలును</span>, <span xml:lang="en-US">ఇంద్రుడును చాల సంతోషింపచేయబడినారు. రామునియందు ప్రేమను చూపుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ప్రజాపతేర్భృశాశ్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ! ప్రజాపతేః = ప్రజాపతి యైన</span>, <span xml:lang="en-US">భృశాశ్వస్య = భృశాశ్వుని యొక్క</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = పుత్రులును</span>, <span xml:lang="en-US">సత్యపరాక్రమాన్ = సత్య మైన పరాక్రమము కలవియు</span>, <span xml:lang="en-US">తపోబలభృతాన్ = తపోబలముచే పోషింపబడినవియు</span>, <span xml:lang="en-US">అగు అస్త్రములను</span>, <span xml:lang="en-US">రాఘవాయ = రామునకు</span>, <span xml:lang="en-US">నివేదయ = ఇమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ మహ</span><span class="CharOverride-4" xml:lang="en-US">ర్షీ!</span><span xml:lang="en-US"> ప్రజాపతి యైన భృశాశ్వుని పుత్రులును</span>, <span xml:lang="en-US">సత్య మైన పరాక్రమము కలవియు</span>, <span xml:lang="en-US">తపోబలముచే పోషింపబడినవియు అగు అస్త్రములను రామునకు ఉపదేశింపుము.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పాత్రభూతశ్చ తే బ్రహ్మం స్తవానుగమనే ధృతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా.</span> <span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ! తవ = నీ యొక్క</span>, <span xml:lang="en-US">అనుగమనే = అనుసరించి</span> <span xml:lang="en-US">వెళ్లుటయందు</span>, <span xml:lang="en-US">ధృతః = స్థిరు డైన ఈ రాముడు</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">పాత్రభూతః చ = సత్పాత్ర మైనవాడు</span>, <span xml:lang="en-US">రాజసూనునా = ఈ రాజకుమారునిచే</span>, <span xml:lang="en-US">సురాణామ్ = దేవతలయొక్క</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్ప</span>, <span xml:lang="en-US">కర్మ = పని</span>, <span xml:lang="en-US">కర్తవ్యం చ = చేయతగియున్నది కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ విశ్వామిత్రా! భక్తితో</span>, <span xml:lang="en-US">స్థిరచిత్తముతో నిన్ను అనుసరించి వచ్చుచున్న ఈ రాముడు అస్త్రములను ఉపదేశించుటకు తగిన సత్పాత్రము. ఈ రాముడు గొప్ప దేవకార్యమును చేయవలసి యున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్త్వా సురాః సర్వే హృష్టా జగ్ముర్యథాగతమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం పురస్కృత్య తతః సన్ధ్యా ప్రవర్తతే. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">హృష్టాః = సంతసించిన వారై</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రం = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = పూజించి</span>, <span xml:lang="en-US">యథాగతమ్ = వచ్చినట్లు</span>, <span xml:lang="en-US">జగ్ముః = వెళ్ళిరి</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సన్ధ్యా = సంధ్య</span>, <span xml:lang="en-US">ప్రవర్తతే = ప్రవర్తించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ విధముగ పలికి</span>, <span xml:lang="en-US">దేవత లందరును సంతసించినవారై</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని పూజించి తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి. పిమ్మట సంధ్యాసమయ మయ్యెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతో మునివరః ప్రీతస్తాటకావధతోషితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్.</span> <span class="fr">32</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మునివరః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">ప్రీతః = ప్రీతియుక్తుడై</span>, <span xml:lang="en-US">తాటకావధతోషితః = తాటకయొక్క సంహారముచేత సంతోషింపచేయబడినవాడై</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">మూర్ధ్ని = శిరస్సుపై</span>, <span xml:lang="en-US">ఉపాఘ్రాయ = వాసన చూచి</span>, <span xml:lang="en-US">ఇదం వచనమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>పిమ్మట తాటకాసంహారముచే సంతోషించిన విశ్వామిత్రుడు రాముని శిరస్సు పై వాసన చూచి ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్వః ప్రభాతే గమిష్యామస్తదాశ్రమపదం మమ.</span> <span class="fr">33</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శుభదర్శన = శుభ మైన దర్శనము గల</span>, <span xml:lang="en-US">రామ = రామా! అద్య = ఈనాడు</span>, <span xml:lang="en-US">రజనీమ్ = ఈ రాత్రి</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">వసేమ = నివసించెదము</span>, <span xml:lang="en-US">శ్వః = రేపు</span>, <span xml:lang="en-US">ప్రభాతే = ప్రాతఃకాలమున</span>, <span xml:lang="en-US">మమ = నా యొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ఆశ్రమపదమ్ = ఆశ్రమమును గూర్చి</span>, <span xml:lang="en-US">గమిష్యామః = వెళ్లెదము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>దర్శనమాత్రమున శుభముల నిచ్చు ఓ రామా! ఈ రాత్రి ఇచటనే నివసించి రేపు ప్రాతఃకాలమున నా ఆశ్రమమునకు వెళ్లెదము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాస రజనీం తత్ర తాటకాయా వనే సుఖమ్. </span><span class="fr">34</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని మాటలను</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">దశరథాత్మజః = రాముడు</span>, <span xml:lang="en-US">హృష్టః = సంతసించినవాడై</span>, <span xml:lang="en-US">తత్ర = ఆ</span>, <span xml:lang="en-US">తాటకాయాః = వనే తాటకయొక్క వనమునందు</span>, <span xml:lang="en-US">సుఖమ్ = సుఖముగా</span>, <span xml:lang="en-US">రజనీమ్ = ఆ రాత్రి</span>, <span xml:lang="en-US">ఉవాస = నివసించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి</span>, <span xml:lang="en-US">ఆ రాత్రి తాటకావనములో సుఖముగా నివసించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనమ్. </span><span class="fr">35</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">అహని ఏవ = దినమునందే</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వనం చ = వనము కూడ</span>, <span xml:lang="en-US">ముక్తశాపమ్ = విడువబడిన శాపము కలదై</span>, <span xml:lang="en-US">చైత్రరథమ్ = చైత్రరథ మనెడు</span>, <span xml:lang="en-US">వనమ్ = వనము</span>, <span xml:lang="en-US">యథా = ఎట్లో</span>, <span xml:lang="en-US">అట్లే</span>, <span xml:lang="en-US">రమణీయమ్ = సుందర మైనదై</span>, <span xml:lang="en-US">విబభ్రాజ = ప్రకాశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ వనముకూడ</span>, <span xml:lang="en-US">ఆ దినమునందే శాపమునుండి విముక్తమై కుబేరుని చైత్రరథోద్యానము వలె సుందరమై ప్రకాశించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. </span>నిహత్య తాం యక్షసుతాం స రామః</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రశస్యమానః సురసిద్ధసంఘైః</span>,</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> ఉవాస తస్మిన్మునినా సహైవ</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"> ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః. <span class="fr">36</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షడ్వింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః రామః = ఆ రాముడు</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">యక్షసుతామ్ = యక్షుని కుమార్తెను</span>, <span xml:lang="en-US">నిహత్య = చంపి</span>, <span xml:lang="en-US">సురసిద్ధసంఘైః = దేవతలయొక్కయు సిద్ధులయొక్కయు సంఘములచేత</span>, <span xml:lang="en-US">ప్రశస్యమానః = ప్రశంసింపబడు చున్నవాడై</span>, <span xml:lang="en-US">మునినా సహ = విశ్వామిత్రునితో కూడ</span>, <span xml:lang="en-US">తస్మిన్నేవ = ఆ వనమునందే</span>, <span xml:lang="en-US">ప్రభాతవేలామ్ = ప్రాతఃకాలమున</span>, <span xml:lang="en-US">ప్రతిబోధ్యమానః = మేల్కొలుపబడు చున్నవాడై</span>, <span xml:lang="en-US">ఉవాస = నివసించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు తాటకను చంపి</span>, <span xml:lang="en-US">దేవతలు సిద్ధులు మొదలగు వారిచే ప్రశంసింపబడుచు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రునితో ఆ రాత్రి</span>, <span xml:lang="en-US">ఆ వనమునందే వసించెను. ప్రభాతసమయమున విశ్వామిత్రుడు అతనిని మేల్కొలిపెను.</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ఇరువది యారవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter