Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_36</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_36" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షట్త్రింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">దేవతలు పార్వతీశివుల రతిక్రీడలు విఘ్నము కలిగింపగా పార్వతి దేవతలకును</span>, <span xml:lang="en-US">భూదేవికిని శాపము నిచ్చుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ.</span><span xml:lang="en-US"> ఉక్తవాక్యే మునౌ తస్మిన్నుభౌ రాఘవలక్ష్మణౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రతినన్ద్య కథాం వీరావూచతుర్మునిపుఙ్గవమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">మునౌ = ముని</span>, <span xml:lang="en-US">ఉక్తవాక్యే = చెప్పబడిన వాక్యము కలవాడగుచుండగా</span>, <span xml:lang="en-US">వీరౌ = వీరు లైన</span>, <span xml:lang="en-US">రాఘవలక్ష్మణౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">ఉభౌ = ఇరువురును</span>, <span xml:lang="en-US">కథామ్ = కథను</span>, <span xml:lang="en-US">ప్రతినన్ద్య = అభినందించి</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవమ్ = ఆ మునిశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఊచతుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> విశ్వామిత్రుని వాక్యము విని రామలక్ష్మణులు ఆ కథను మెచ్చుకొని</span>, <span xml:lang="en-US">ఆ మునిపుంగవునితో ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> విస్తరం విస్తరజ్ఞోఽసి దివ్యమానుషసంభవమ్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ! ధర్మయుక్తమ్ = ధర్మముతో కూడిన</span>, <span xml:lang="en-US">పరమమ్ = ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఇది</span>, <span xml:lang="en-US">త్వయా = నీచేత</span>, <span xml:lang="en-US">కథితమ్ = చెప్పబడినది. శైలరాజస్య = హిమవంతునియొక్క</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠాయాః దుహితుః = పెద్ద కుమార్తెయొక్క</span>, <span xml:lang="en-US">దివ్యమానుష సంభవమ్ = దేవలోకమునందును</span>, <span xml:lang="en-US">మనుష్యలోకమునందును జరిగిన</span>, <span xml:lang="en-US">విస్తరమ్ = కథా విస్తరమును</span>, <span xml:lang="en-US">వక్తుమ్ = చెప్పుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగి ఉన్నావు. విస్తరజ్ఞః = కథా విస్తరములు తెలిసినవాడవుగా</span>, <span xml:lang="en-US">అసి = అయి ఉన్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మునీంద్రా! ధర్మయుక్త మైన ఈ ఉత్తమకథను చెప్పినావు. హిమవంతుని పెద్ద కుమార్తెకు సంబంధించిన దేవలోకమనుష్యలోకములలో జరిగిన కథను సవిస్తరముగ చెప్పుము. నీవు కథావిస్తరములు తెలిసినవాడవు కదా.</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">త్రీన్ పథో హేతునా కేన ప్లావయేల్లోకపావనీ. </span><span class="fr">3</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కథం గఙ్గా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్వితా. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లోకపావనీ = లోకములను పవిత్రింపచేయు గంగ</span>, <span xml:lang="en-US">కేన హేతునా = ఏ కారణముచేత</span>, <span xml:lang="en-US">త్రీన్ = మూడు</span>, <span xml:lang="en-US">పథః = మార్గములను</span>, <span xml:lang="en-US">ప్లావయేత్ = ఉదకముచే నింపినది</span>? <span xml:lang="en-US">ధర్మజ్ఞ = ధర్మములను ఎరిగినవాడా! త్రిపథగా = మూడు మార్గములందు ప్రవహించు</span>, <span xml:lang="en-US">గఙ్గా = గంగ</span>, <span xml:lang="en-US">కైః = ఏ</span>, <span xml:lang="en-US">కర్మభిః = కర్మలతో</span>, <span xml:lang="en-US">అన్వితా = కూడినదై</span>, <span xml:lang="en-US">త్రిషు లోకేషు = మూడు లోకములలో</span>, <span xml:lang="en-US">సరిదుత్తమా = నదులలో ఉత్తమ మైనదిగా</span>, <span xml:lang="en-US">విశ్రుతా = ప్రసిద్ధ మైనది </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లోకపావని యైన గంగ ఏ కారణముచేత మూడు మార్గములలో ప్రవహించు చున్నది</span>? <span xml:lang="en-US">ఓ ధర్మజ్ఞుడా! త్రిపథగ యైన ఈ గంగ</span>, <span xml:lang="en-US">ఏ కర్మలను పట్టి</span>, <span xml:lang="en-US">మూడు లోకములలో ఉత్తమనది యని ప్రసిద్ధి పొందినది </span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తథా బ్రువతి కాకుత్థ్సే విశ్వామిత్రస్తపోధనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిఖిలేన కథాం సర్వా మృషిమధ్యే న్యవేదయత్. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్సే = రాముడు</span>, <span xml:lang="en-US">తథా = ఆ విధముగా</span>, <span xml:lang="en-US">బ్రువతి = పలుకుచుండగా</span>, <span xml:lang="en-US">తపోధనః = తపస్సే ధనముగా గల విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సర్వామ్ = సమస్తమైన</span>, <span xml:lang="en-US">కథామ్ = కథను</span>, <span xml:lang="en-US">నిఖిలేన = పూర్తిగా</span>, <span xml:lang="en-US">ఋషిమధ్యే = ఋషులమధ్యయందు</span>, <span xml:lang="en-US">న్యవేదయత్ = తెలిపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముని మాటలు విని విశ్వామిత్రమహర్షి ఆ కథ నంతను సంపూర్ణముగా</span>, <span xml:lang="en-US">ఋషులమధ్యయందు చెప్పెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పురా రామ కృతోద్వాహో</span> <span xml:lang="en-US">నీలకణ్ఠో మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">కృ తోద్వాహః = చేసికొనబడిన వివాహము గల</span>, <span xml:lang="en-US">మహాతపాః = మహాతపఃశాలి యైన</span>, <span xml:lang="en-US">నీలకణ్ఠః = శివుడు</span>, <span xml:lang="en-US">దేవీమ్ = దేవిని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">స్పృహయా = ఆసక్తితో</span>, <span xml:lang="en-US">మైథునాయ = మైథునమునకు</span>, <span xml:lang="en-US">ఉపచక్రమే = ప్రారంభించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! మహాతపఃశాలి యగు ఈశ్వరుడు పూర్వము వివాహము చేసికొని</span>, <span xml:lang="en-US">దేవిని చూచి</span>, <span xml:lang="en-US">అత్యాసక్తితో మైథునమునకు ఉపక్రమించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శితికణ్ఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న చాపి తనయో రామ తస్యామాసీత్పరంతప. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరంతప = శత్రువును పీడించు</span>, <span xml:lang="en-US">రామ = రామా!, దేవస్య = దేవుడైన</span>, <span xml:lang="en-US">శితికంఠస్య = ఈశ్వరునకు</span>, <span xml:lang="en-US">దివ్యమ్ = దివ్య మైన</span>, <span xml:lang="en-US">వర్షశతమ్ = సంవత్సరముల శతము</span>, <span xml:lang="en-US">గతమ్ = కడచినది. అపిచ = అయినను</span>, <span xml:lang="en-US">తస్యామ్ = ఆమెయందు</span>, <span xml:lang="en-US">తనయః = కుమారుడు</span>, <span xml:lang="en-US">న అసీత్ = పుట్టలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈశ్వరు డీ విధముగ క్రీడించుచుండగా నూరు దివ్య వర్షములు కడచిపోయినవి. కాని ఆ దేవియందు కుమారుడు జనించలేదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో దేవాః సముద్విగ్నాః పితామహపురోగమాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యదిహోత్పద్యతే భూతం క స్తత్ప్రతిసహిష్యతే. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">పితామహపురోగమాః = బ్రహ్మ మొదలైన</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">ఇహ = ఈ దేవియందు</span>, <span xml:lang="en-US">యత్ = ఏ</span>, <span xml:lang="en-US">భూతమ్ = ప్రాణి</span>, <span xml:lang="en-US">ఉత్పద్యతే = పుట్టునో</span>, <span xml:lang="en-US">తత్ = దానిని</span>, <span xml:lang="en-US">కః = ఎవడు</span>, <span xml:lang="en-US">ప్రతిసహిష్యతే = సహింపగలడు అని</span>, <span xml:lang="en-US">సముద్విగ్నాః = కలత చెందిరి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">ఈ దేవియందు పుట్టబోవు భూతమును ఎవ్వడైన సహింపగలడా</span>?’’ <span xml:lang="en-US">అని బ్రహ్మదేవుడు మొదలైన దేవత లందరును కలత చెందిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అభిగమ్య సురాస్సర్వే ప్రణిపత్యేదమబ్రువన్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితే రత. </span><span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">అభిగమ్య = ఈశ్వరుని వద్దకు వెళ్లి</span>, <span xml:lang="en-US">ప్రణిపత్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి. దేవదేవ = దేవతలకు దేవుడా! అస్య = ఈ</span>, <span xml:lang="en-US">లోకస్య = లోకముయొక్క</span>, <span xml:lang="en-US">హితే = హితమునందు</span>, <span xml:lang="en-US">రత = ఆసక్తుడా! మహాదేవ = మహాదేవుడా! సురాణామ్ = దేవతలమైన మాయొక్క</span>, <span xml:lang="en-US">ప్రణిపాతేన = నమస్కారముచేత</span>, <span xml:lang="en-US">ప్రసాదమ్ = అనుగ్రహమును</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తదియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ లోకమునకు హితము చేయుటయందు ఆసక్తి గల</span>, <span xml:lang="en-US">దేవాధిదేవుడ వైన మహాదేవా! దేవతలము మేము నమస్కరించుచున్నాము</span>; <span xml:lang="en-US">అనుగ్రహింపుము. </span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">న లోకా ధారయిష్యన్తి తవ తేజః సురోత్తమ. </span><span class="fr">10</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురోత్తమ = ఓ దేవతాశ్రేష్ఠుడా! తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">తేజః = తేజస్సును</span>, <span xml:lang="en-US">లోకాః = లోకములు</span>, <span xml:lang="en-US">న ధారయిష్యన్తి = ధరింపజాలవు. బ్రాహ్మేణ = వేదోక్తమైన</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుతో</span>, <span xml:lang="en-US">యుక్తః = కూడినవాడవై</span>, <span xml:lang="en-US">దేవ్యా సహ = పార్వతితో గూడ</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">చర = చేయుము. త్రైలోక్యహితకామార్థమ్ = త్రైలోక్యముయొక్క హితమునందు కోరికతో</span>, <span xml:lang="en-US">తేజః = తేజస్సును</span>, <span xml:lang="en-US">తేజసి = తేజస్సునందు</span>, <span xml:lang="en-US">ధారయ = నిలుపుము. </span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ సురోత్తమా! నీ తేజస్సును లోకములు ధరింపజాలవు. దేవితో కూడ వేదోక్తప్రకారమున తపస్సు చేయుము. తేజస్సును నీ తేజస్సునందే ధరించి మూడు లోకములకును హితము చేకూర్చుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బాఢమిత్యబ్రవీత్సర్వాన్ పునశ్చేదమువాచ హ. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వలోకమహేశ్వరః = ఆ సర్వలోక ప్రభువు</span>, <span xml:lang="en-US">దేవతానామ్ = దేవతలయొక్క</span>, <span xml:lang="en-US">వచః </span><span xml:lang="en-US">= వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">బాఢమ్ = తప్పక అట్లే అగుగాక</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span><span xml:lang="en-US"> పునశ్చ = మరల</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ హ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ సర్వలోకమహేశ్వరుడు దేవతల వాక్యము విని తప్పక అటులనే అగుగాక అని పలికి మరల ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేవ సహోమయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్ఛతు. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఉమయా సహ = ఉమాదేవితో గూడ</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తేజః = తేజస్సును</span>, <span xml:lang="en-US">తేజస్యేవ = తేజస్సునందే</span>, <span xml:lang="en-US">ధారయిష్యామి = ధరించగలను. త్రిదశాః = దేవతలును</span>, <span xml:lang="en-US">పృథివీ చైవ = భూమియు</span>, <span xml:lang="en-US">నిర్వాణమ్ = సుఖమును</span>, <span xml:lang="en-US">అధిగచ్ఛతు = పొందుగాక.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఉమాసహితుడ నైన నేను నా తేజస్సును (రేతస్సును) తేజస్సునందే (నా శరీరమునందే) ధరించెదను. దేవతలును</span>, <span xml:lang="en-US">పృథివియు భయపడకుందురు గాక. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యదిదం క్షుభితం స్థానాన్మమ తేజో హ్యనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధారయిష్యతి కస్తన్మే బ్రువన్తు సురసత్తమాః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మమ = నా యొక్క</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = శ్రేష్ఠమైన</span>, <span xml:lang="en-US">యత్ = ఏ</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">తేజః = తేజస్సు</span>, <span xml:lang="en-US">స్థానాత్ = స్వస్థానమునుండి</span>, <span xml:lang="en-US">క్షుభితమ్ = క్షోభింపచేయబడినదో</span>, <span xml:lang="en-US">తత్ = దానిని</span>, <span xml:lang="en-US">కః = ఎవడు</span>, <span xml:lang="en-US">ధారయిష్యతి = ధరించగలడు</span>? <span xml:lang="en-US">సురసత్తమాః = దేవతాశ్రేష్ఠులారా! మే = నాకు</span>, <span xml:lang="en-US">బ్రువన్తు = చెప్పుదురు గాక.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>దేవతలారా! స్వస్థానమునుండి చలించిన నా యీ శ్రేష్ఠ మైన తేజస్సును ఎవరు ధరింతురో చెప్పుడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తాః సురాస్సర్వే ప్రత్యూచుర్వృషభధ్వజమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యత్తేజః క్షుభితం హ్యేతత్తద్ధరా ధారయిష్యతి. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తాః = పలకబడిన</span>, <span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">వృషభధ్వజమ్ = వృషభము ధ్వజమునందు గల ఈశ్వరుని గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రత్యూచుః = తిరిగి పలికిరి. యత్ = ఏ</span>, <span xml:lang="en-US">తేజః = తేజస్సు</span>, <span xml:lang="en-US">క్షుభితమ్ = చలించినదో</span>, <span xml:lang="en-US">తత్ = దానిని</span>, <span xml:lang="en-US">ధరా = భూమి</span>, <span xml:lang="en-US">ధారయిష్యతి = ధరించగలదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ మాటలు విని దేవతలు ఈశ్వరునితో ఇట్లు అనిరి -- </span>‘‘<span xml:lang="en-US">చలించిన తేజస్సును భూమి ధరించగలదు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికాననా. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగ</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="en-US">సురపతిః = మహేశ్వరుడు</span>, <span xml:lang="en-US">యేన = ఏ</span>, <span xml:lang="en-US">తేజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="en-US">సగిరికాననా = పర్వతములతోడను అడవులతోడను గూడిన</span>, <span xml:lang="en-US">పృథివీ = భూమి</span>, <span xml:lang="en-US">వ్యాప్తా = వ్యాపింపబడినదో</span>, <span xml:lang="en-US">అట్టి తేజస్సును</span>, <span xml:lang="en-US">మహీతలే = భూమియందు</span>, <span xml:lang="en-US">ప్రముమోచ = విడచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>దేవతలు చెప్పిన విధముగ మహేశ్వరుడు తేజస్సును భూమిపై విడువగా అది పర్వతారణ్యాదులతో సహా భూమిపై అంతటను వ్యాపించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో దేవాః పునరిదమూచుశ్చాథ హుతాశనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">హుతాశమ్ = అగ్నిని</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">ఊచుః = పలికిరి. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">వాయుసమన్వితః = వాయువుతో కూడినవాడవై</span>, <span xml:lang="en-US">రౌద్రమ్ = రుద్రునిసంబంధమైన</span>, <span xml:lang="en-US">మహాతేజః = గొప్ప తేజస్సును</span>, <span xml:lang="en-US">ప్రవిశ = ప్రవేశించుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అది చూచి దేవతలు </span>‘‘<span xml:lang="en-US">వాయువుతో కూడినవాడవై ఈ ఈశ్వర తేజస్సులో ప్రవేశించుము</span>’’ <span xml:lang="en-US">అని అగ్నిని ఆదేశించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దివ్యం శరవణం చైవ పావకాదిత్యసంనిభమ్. </span><span class="fr">18</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> యత్ర జాతో మహాతేజాః కార్తికేయోఽగ్నిసంభవః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అగ్నినా = అగ్నిచేత</span>, <span xml:lang="en-US">వ్యాప్తమ్ = వ్యాప్త మైన</span>, <span xml:lang="en-US">తత్ = ఆ తేజస్సు</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">శ్వేతపర్వతః = తెల్లని పర్వతముగా</span>, <span xml:lang="en-US">సంజాతః = అయినది. పావకాదిత్యసంనిభమ్ = అగ్నితోడను ఆదిత్యునితోడను సమాన మైన</span>, <span xml:lang="en-US">దివ్యమ్ = దివ్యమైన</span>, <span xml:lang="en-US">శరవణం చైవ = ఱెల్లుగడ్డి వనము గాను</span>, <span xml:lang="en-US">అయినది. యత్ర = దేనియందు</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">అగ్నిసంభవః = అగ్ని నుండి పుట్టినవాడును అగు</span>, <span xml:lang="en-US">కార్తికేయః = కృత్తికాకుమారు డైన కుమారస్వామి</span>, <span xml:lang="en-US">జాతః = పుట్టెనో.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ తేజస్సు అగ్నిచేత వ్యాప్తమై శ్వేతపర్వతముగ అయినది. అచటనే అగ్య్నాదిత్యులతో సమాన మైన</span>, <span xml:lang="en-US">దివ్య మైన</span>, <span xml:lang="en-US">శరవణము కూడ బయలుదేరినది. దానియందే మహాతేజఃశాలియు</span>, <span xml:lang="en-US">అగ్నినుండి పుట్టిన వాడును</span>, <span xml:lang="en-US">కృత్తికల కుమారుడును అగు కుమారస్వామి జనించెను. </span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> కుమారస్వామి అగ్నిచే ధరింపబడిన మహేశ్వరతేజస్సునుండి పుట్టుటచే </span>‘<span xml:lang="en-US">అగ్నిసంభవః</span>’ <span xml:lang="en-US">అనియు</span>, <span xml:lang="en-US">కృత్తికలు పెంచుటచే </span>‘<span xml:lang="en-US">కార్తికేయః</span>’ <span xml:lang="en-US">అనియు చెప్పబడినాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథోమాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పూజయామాసురత్యర్థం సుప్రీతమనసస్తతః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">సర్షిగణాః = ఋషులగణములతో కూడిన</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">తతః = అ</span><span xml:lang="en-US">ట్లు జరుగుటవలన</span>, <span xml:lang="en-US">సుప్రీతమనసః = చాల సంతోషించిన మనస్సులు కలవారై</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ఉమాం చ = ఉమాదేవిని</span>, <span xml:lang="en-US">శివం చైవ = శివుని</span>, <span xml:lang="en-US">అత్యర్థమ్ = మిక్కిలి</span>, <span xml:lang="en-US">పూజయామాసుః = పూజించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట దేవతలును</span>, <span xml:lang="en-US">మహర్షులును చాల సంతసించినవారై ఉమాదేవిని</span>, <span xml:lang="en-US">పరమేశ్వరుని ఎక్కువగా పూజించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ శైలసుతా రామ త్రిదశానిదమబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సమన్యురశపత్సర్వాన్ క్రోధసంరక్తలోచనా. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">శైలసుతా = ఉమాదేవి</span>, <span xml:lang="en-US">సమన్యుః = కోపముతో కూడినదై</span>, <span xml:lang="en-US">త్రిదశాన్ = దేవతలను గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. క్రోధసంరక్తలోచనా = క్రోధముచేత ఎఱ్ఱ నైన నేత్రములు కలదై</span>, <span xml:lang="en-US">సర్వాన్ = అందరిని</span>, <span xml:lang="en-US">అశపత్ = శపించెను.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఉమాదేవి కోపించినదై</span>, <span xml:lang="en-US">ఎఱ్ఱబడిన నేత్రములతో</span>, <span xml:lang="en-US">దేవతల నందరిని శపించుచు ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యస్మాత్ = ఎందువలన</span>, <span xml:lang="en-US">పుత్రకామ్యయా = పుత్రుడు కావలె నను కోరికతో</span>, <span xml:lang="en-US">సంగతిః = మేము చేయుచున్న సంగమము</span>, <span xml:lang="en-US">నివారితా = నివారింపబడినదో</span>, <span xml:lang="en-US">తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">స్వేషు = తమ</span>, <span xml:lang="en-US">దారేషు = భార్యలయందు</span>, <span xml:lang="en-US">అపత్యమ్ = సంతానమును</span>, <span xml:lang="en-US">నోత్పాదయిష్యథ = పుట్టింపకుందురుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">పుత్రుడు కావలె నను కోరికచే మేమిరువురము చేయుచున్న సంభోగమునకు అడ్డు తగిలినారు గాన మీకు మీ భార్యలయందు సంతానము కలుగుకుండుగాక.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అద్యప్రభృతి యుష్మాకమప్రజాః సన్తు పత్నయః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి. <span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అద్యప్రభృతి = నేడు మొదలు</span>, <span xml:lang="en-US">యుష్మాకమ్ = మీయొక్క</span>, <span xml:lang="en-US">పత్నయః = భార్యలు</span>, <span xml:lang="en-US">అప్రజాః = సంతానము లేనివారుగా</span>, <span xml:lang="en-US">సన్తు = అగుదురుగాక. సర్వాన్ సురాన్ = అందరు దేవతలను</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">పృథివీమపి = భూమిని కూడ</span>, <span xml:lang="en-US">శశాప = శపించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">నేడు మొదలు మీ భార్యలకు సంతానము కలుగుకుండుగాక</span>’’ <span xml:lang="en-US">దేవతల నందరిని ఈ విధముగ శపించి</span>, <span xml:lang="en-US">ఉమాదేవి పృథివిని గూడ ఇట్లు శపించెను.</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి. </span><span class="fr">23</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధకలుషీకృతా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్ఛతీ. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అవనే = ఓ భూమీ! త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">నైకరూపా = అనేక రూపములు గలదానవై</span>, <span xml:lang="en-US">బహుభార్యా = చాలామందికి భార్యవు</span>, <span xml:lang="en-US">భవిష్యసి = కాగలవు. సుదుర్మేధే = చాల చెడ్డబుద్ధి కలదానా! మమ = నాకు</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుడు కలుగుటకు</span>, <span xml:lang="en-US">అనిచ్ఛతీ = ఇష్టపడని</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">మత్క్రోధకలుషీకృతా = నా యొక్క క్రోధముచేత పీడితురాలవై</span>, <span xml:lang="en-US">పుత్రకృతామ్ = పుత్రులవలన కలుగు</span>, <span xml:lang="en-US">ప్రీతిం చ = ఆనందమును గూడ</span>, <span xml:lang="en-US">న ప్రాప్స్యసి = పొందవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">ఓ భూమీ! నీవు అనేక రూపములు కలదానవుగాను</span>, <span xml:lang="en-US">అనేకులకు భార్యవుగాను అగుదువుగాక. చాల చెడ్డబుద్ధి గలదానా! నాకు పుత్రుడు జనించుటకు ఇష్టపడని నీవు నా కోపమునకు ఫలితముగా</span>, <span xml:lang="en-US">పుత్రానందమును పొందకుందువుగాక.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గమనాయోపచక్రామ దిశం వరుణపాలితామ్. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురపతిః = మహేశ్వరుడు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">వ్రీడితాన్ = సిగ్గుచెందిన</span>, <span xml:lang="en-US">తాన్ = ఆ</span>, <span xml:lang="en-US">సర్వాన్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">సురాన్ = దేవతలను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">వరుణపాలితామ్ = వరుణునిచే పాలింపబడిన</span>, <span xml:lang="en-US">దిశమ్ = దిక్కును గూర్చి</span>, <span xml:lang="en-US">గమనాయ = వెళ్లుటకు</span>,<span xml:lang="en-US">ఉపచక్రామ = ఉపక్రమించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు మహేశ్వరుడు సిగ్గుచెందిన సురుల నందరిని చూచి</span>, <span xml:lang="en-US">అచటి నుండి పశ్చిమదిక్కు వైపు వెళ్లుటకు బయలుదేరెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స గత్వా తప ఆతిష్ఠత్పార్శ్వే తస్యోత్తరే గిరేః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హిమవత్ప్రభవే శృఙ్గే దేవ్యా సహ మహేశ్వరః. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">మహేశ్వరః = మహేశ్వరుడు</span>, <span xml:lang="en-US">గత్వా = పశ్చిమము వైపు వెళ్లి</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">గిరేః = హిమవత్పర్వతముయొక్క</span>, <span xml:lang="en-US">ఉత్తరే = ఉత్తరమునందున్న</span>, <span xml:lang="en-US">పార్శ్వే = పార్శ్వమునందు</span>, <span xml:lang="en-US">హిమవత్ప్రభవే = హిమవత్పర్వతమునందు పుట్టిన</span>, <span xml:lang="en-US">శృఙ్గే = శిఖరమునందు</span>, <span xml:lang="en-US">దేవ్యా సహ = ఉమాదేవితో గూడ</span>, <span xml:lang="en-US">తవః = తపస్సును</span>, <span xml:lang="en-US">ఆతిష్ఠత్ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహేశ్వరుడు హిమవత్పర్వతమునందే పశ్చిమదిక్కుగా వెళ్లి</span>, <span xml:lang="en-US">ఆ హిమవత్ప ర్వతము ఉత్తరపార్శ్వమునం దున్న శిఖరము పై</span>, <span xml:lang="en-US">ఉమాసమేతుడై తపస్సు చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏష తే విస్తరో రామ శైలపుత్య్రా నివేదితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గఙ్గాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">షట్త్రింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! శైలపుత్య్రాః = ఉమాదేవికి సంబంధించిన</span>, <span xml:lang="en-US">ఏషః = ఈ</span>, <span xml:lang="en-US">విస్తరః = కథావిస్తరము</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">కథితః = చెప్పబడినది. గఙ్గాయాః = గంగ యొక్క; ప్రభవమ్ </span><span xml:lang="en-US">= పుట్టుకను; సహ లక్ష్మణః = లక్ష్మణుని తో కూడియున్నవాడవై మే = నా వలన; శృణు = వినుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఉమాదేవికి సంబంధించిన కథ చెప్పితిని. ఇపుడు నీవును</span>, <span xml:lang="en-US">లక్ష్మణుడును</span>, <span xml:lang="en-US">గంగాప్రభావమును వినుడు.</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ముప్పదియారవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter