Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_59</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_59" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకోనషష్టితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="te-IN">విశ్వామిత్రుడు త్రిశంకువునకు ధైర్యము చెప్పి ఆతనిచే యజ్ఞము చేయించుటకై ఋషుల నాహ్వానించుట. తనను అధిక్షేపించిన మహోదయుని</span>, <span xml:lang="te-IN">వసిష్ఠపుత్రులను శపించుట.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రవీన్మధురం వాక్యం సాక్షాచ్చణ్డాలరూపిణమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఉక్తవాక్యం = పలకబడిన వాక్యము కలవాడును</span>, <span xml:lang="te-IN">సాక్షాత్ = ప్రత్యక్షముగా</span>, <span xml:lang="te-IN">చణ్డాలరూపిణమ్ = చండాలరూపము గలవాడును అగు</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజును గూర్చి</span>, <span xml:lang="te-IN">కృపయా = జాలితో</span>, <span xml:lang="te-IN">కుశికాత్మజః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">మధురమ్ = మధురమైన</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పూర్తిగా చండాలరూపు డైన ఆ రాజు మాటలు విని విశ్వామిత్రుడు జాలిచెంది</span>, <span xml:lang="te-IN">అతనితో మధుర మైన వాక్యము పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శరణం తే భవిష్యామి మా భైషీర్నృపపుఙ్గవ. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఐక్ష్వాక = ఇక్ష్వాకువంశమునందు పుట్టిన</span>, <span xml:lang="te-IN">వత్స = ఓ వత్సా!, స్వాగతమ్ = నీకు స్వాగత మగుగాక. త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="te-IN">సుధార్మికమ్ = మంచి ధార్మికునిగా</span>, <span xml:lang="te-IN">జానామి = నే నెరుగుదును. నృపపుఙ్గవ = ఓ రాజశ్రేష్ఠా! మాభైషీః = భయపడకుము. తే = నీకు</span>, <span xml:lang="te-IN">శరణమ్ = రక్షకుడను</span>, <span xml:lang="te-IN">భవిష్యామి = కాగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇక్ష్వాకువంశసంజాతుడ వైన ఓ వత్స్ఙా నీకు స్వాగతము. నీవు ధార్మికుడ వని నాకు తెలియును. ఓ రాజశ్రే</span><span class="CharOverride-4" xml:lang="te-IN">ష్ఠా</span><span xml:lang="te-IN"> నేను నీకు రక్ష నొసగెదను</span>; <span xml:lang="te-IN">భయపడకుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అహమామన్త్రయే సర్వాన్మహర్షీన్ పుణ్యకర్మణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృతః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">పుణ్యకర్మణః = పుణ్యమైన కర్మలుగల</span>, <span xml:lang="te-IN">యజ్ఞసాహ్యకరాన్ = యజ్ఞమునందు సాహాయ్యము చేయు</span>, <span xml:lang="te-IN">సర్వాన్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">మహర్షీన్ = మహర్షులను</span>, <span xml:lang="te-IN">ఆమన్త్రయే = ఆహ్వానించెదను. నిర్వృతః = ఆనందము కలవాడవై</span>, <span xml:lang="te-IN">యక్ష్యసి = యాగము చేయగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రాజా! పుణ్యాత్ము లైన మహర్షులను యజ్ఞములో సాహాయ్యము చేయుటకై నేను ఆహ్వానించెదను. నీవు నిశ్చింతగ యజ్ఞము చేయగలవు. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గురుశాపకృతమ్ = గురువుయొక్క శాపముచేత చేయబడిన</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">రూపమ్ = రూపము</span>, <span xml:lang="te-IN">త్వయి = నీయందు</span>, <span xml:lang="te-IN">వర్తతే = ఉన్నదో</span>, <span xml:lang="te-IN">అనేన = ఈ</span>, <span xml:lang="te-IN">రూపేణ సహ = రూపముతో కూడ</span>, <span xml:lang="te-IN">సశరీరః = శరీరసహితుడవై</span>, <span xml:lang="te-IN">గమిష్యసి = వెళ్లగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">గురుశాపముచే ఏర్పడిన ఈ రూపముతో</span>, <span xml:lang="te-IN">సశరీరుడవై స్వర్గమునకు వెళ్లగలవు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నరాధిప = రాజా!, యః = ఏ</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">శరణ్యమ్ = శరణుపొంద దగిన</span>, <span xml:lang="te-IN">కౌశికమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="te-IN">ఆగమ్య = చేరి</span>, <span xml:lang="te-IN">శరణాగతః = శరణు చొచ్చితివో</span>, <span xml:lang="te-IN">తవ = అట్టి నీకు</span>, <span xml:lang="te-IN">స్వర్గమ్ = స్వర్గమును</span>, <span xml:lang="te-IN">హస్తప్రాప్తమ్ = చేతికి అందినదానినిగా</span>, <span xml:lang="te-IN">మన్యే = తలచెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రాజా! శరణాగతరక్షకు డైన విశ్వామిత్రుని శరణు జొచ్చితివి. ఇక స్వర్గము నీ చేతిలో నున్నది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞసంభారకారణాత్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">పరమధార్మికాన్ = మిక్కిలి ధార్మికులును</span>, <span xml:lang="te-IN">మహాప్రాజ్ఞాన్ = గొప్ప బుద్ధి కలవారును అగు</span>, <span xml:lang="te-IN">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="te-IN">యజ్ఞసంభార కారణాత్ = యజ్ఞసంభారములను సమకూర్చుటకై</span>, <span xml:lang="te-IN">వ్యాదిదేశ = ఆజ్ఞాపించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి యజ్ఞ సంభారములను సమకూర్చు డని</span>, <span xml:lang="te-IN">పరమధార్మికులును</span>, <span xml:lang="te-IN">గొప్ప బుద్ధిమంతులును అగు కుమారులను ఆజ్ఞాపించెను. </span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యమేతదువాచ హ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వానృషిగణాన్వత్సా ఆనయధ్వం మమాజ్ఞయా</span>, <span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> సశిష్యసుహృదశ్చైవ సర్త్విజః సబహుశ్రుతాన్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వాన్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">శిష్యాన్ = శిష్యులను</span>, <span xml:lang="te-IN">సమాహూయ = పిలచి</span>, <span xml:lang="te-IN">ఏతత్ = ఈ</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">ఉవాచ హ = పలికెను. వత్సాః = ఓ శిష్యులా</span><span class="CharOverride-5" xml:lang="te-IN">రా!</span><span xml:lang="te-IN"> మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">ఆజ్ఞయా = ఆజ్ఞచేత</span>, <span xml:lang="te-IN">సశిష్యసుహృదశ్చైవ = శిష్యులతోడను స్నేహితులతోడను కూడిన</span>, <span xml:lang="te-IN">సర్త్విజః = ఋత్విక్కులతో కూడిన</span>, <span xml:lang="te-IN">సబహుశ్రుతాన్ = బహువిద్యావంతులతో కూడిన</span>, <span xml:lang="te-IN">సర్వాన్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">ఋషిగణాన్ = ఋషిగణములను</span>, <span xml:lang="te-IN">ఆనయధ్వమ్ = తీసికొనిరండి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుడు శిష్యు లందరిని పిలచి ఇట్లు పలికెను. </span>‘‘<span xml:lang="te-IN">ఓవత్సలారా! నా ఆజ్ఞానుసారముగా వెళ్లి శిష్యులతోడను</span>, <span xml:lang="te-IN">స్నేహితులతోడను</span>, <span xml:lang="te-IN">ఋత్విక్కులతోడను</span>, <span xml:lang="te-IN">విద్యావంతులతోడను కూడిన ఋషుల నందరిని తీసికొనిరండు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యదన్యో వచనం బ్రూతే మద్వాక్యబలచోదితః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతమ్. <span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అన్యః = ఇతరుడు</span>, <span xml:lang="te-IN">మద్వాక్యబలచోదితః = నా వాక్యముయొక్క బలముచేత ప్రేరేపింపబడిన వాడై</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">బ్రూతే = పలుకునో</span>, <span xml:lang="te-IN">అఖిలేన = అందరిచేతను</span>, <span xml:lang="te-IN">ఉక్తమ్ = పలకబడిన</span>, <span xml:lang="te-IN">అనాదృతమ్ = అనాదరపూర్వకమైన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = అంతయు</span>, <span xml:lang="te-IN">మమ = నాకు</span>, <span xml:lang="te-IN">ఆఖ్యేయమ్ = చెప్పదగినది.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>నా సందేశమును విని ఎవరెవరు అనాదరపూర్వకముగా ఏ మాటలు పలుకుదురో ఆ మాట లన్నియు నాకు చెప్పవలెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ఆజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః. <span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్య = ఆతని యొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">తదాజ్ఞయా = ఆతని ఆజ్ఞచే</span>, <span xml:lang="te-IN">దిశః = దిక్కులను</span>, <span xml:lang="te-IN">గూర్చి</span>, <span xml:lang="te-IN">జగ్ముః = వెళ్లిరి. అథ = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సర్వేభ్యః = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">దేశేభ్యః = దేశములనుండి</span>, <span xml:lang="te-IN">బ్రహ్మవాదినః = వేదాధ్యయనసంపన్ను లైన మునులు</span>, <span xml:lang="te-IN">ఆజగ్ముః = వచ్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము శిష్యులు నలుదిక్కులకును వెళ్లి ఆహ్వానింపగా వేదాద్యయనసంపన్ను లైన బ్రాహ్మణులు అన్ని దేశములనుండియు వచ్చిరి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలితతేజసమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినామ్. <span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = ఆ</span>, <span xml:lang="te-IN">శిష్యాః = శిష్యులు</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">సమాగమ్య = తిరిగి వచ్చి</span>, <span xml:lang="te-IN">జ్వలితతేజసమ్ = ప్రకాశించుచున్న తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">మునిమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">సర్వేషామ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">బ్రహ్మవాదినామ్ = వేదాధ్యయన సంపన్నుల యొక్క</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">ఊచుశ్చ = చెప్పిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">తిరిగి వచ్చిన ఆ శిష్యు లందరును</span>, <span xml:lang="te-IN">తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ విశ్వామిత్రునితో</span>, <span xml:lang="te-IN">వేదాధ్యయన సంపన్ను లగు బ్రాహ్మణు లందరును పలికిన మాటలను చెప్పిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span>శ్రుత్వా తే వచనం సర్వే సమాయాన్తి ద్విజాతయః. </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వదేశేషు చాగచ్ఛన్ వర్జయిత్వా మహోదయమ్.</span> <span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">ద్విజాతయః = బ్రాహ్మణులు</span>, <span xml:lang="te-IN">సమాయాన్తి = వచ్చుచున్నారు. మహోదయం వర్జయిత్వా = మహోదయుని మినహాయించి</span>, <span xml:lang="te-IN">సర్వదేశేషు = సమస్త దేశములం దున్నవారు</span>, <span xml:lang="te-IN">ఆగచ్ఛన్ = వచ్చిరి.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మీ సందేశము విని బ్రాహ్మణు లందరును వచ్చుచున్నారు. మహోదయుడు తక్క</span>, <span xml:lang="te-IN">సకలదేశముల లోని బ్రాహ్మణులును వచ్చినారు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వాసిష్ఠం తచ్ఛతం సర్వం క్రోధపర్యాకులాక్షరమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యదాహ వచనం సర్వం శృణు త్వం మునిపుఙ్గవ.</span> <span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా! సర్వమ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వాసిష్ఠం శతమ్ = వసిష్ఠకుమారుల శతము</span>, <span xml:lang="te-IN">క్రోధవర్యాకులాక్షరమ్ = క్రోధముచే వ్యాకుల మైన అక్షరములు గల</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">ఆహ = పలికెనో</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = దాని నంతనూ</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">శృణు = వినుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మునిశ్రేష్ఠా! నీ వాక్యము విని వసిష్ఠకుమారులు నూర్వురును</span>, <span xml:lang="te-IN">ఏమనిరో వినుము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">క్షత్రియో యాజకో యస్య చణ్డాలస్య విశేషతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః. </span> 13</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">యస్య = ఎవనికి</span>, <span xml:lang="te-IN">క్షత్రియః = క్షత్రియుడు</span>, <span xml:lang="te-IN">యాజకః = యజ్ఞము చేయించువాడో</span>, <span xml:lang="te-IN">విశేషతః = విశేషించి</span>, <span xml:lang="te-IN">చణ్డాలస్య = చండాలుడైన</span>, <span xml:lang="te-IN">తస్య = వాని యొక్క</span>, <span xml:lang="te-IN">సదసి = యజ్ఞ సదస్సునందు</span>, <span xml:lang="te-IN">సురర్షయః = సురులును ఋషులును</span>, <span xml:lang="te-IN">హవిః = హవిస్సును</span>, <span xml:lang="te-IN">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="te-IN">భోక్తారః = భుజించగలరు </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">క్షత్రియుని యాజకునిగా స్వీకరించినవాడు</span>, <span xml:lang="te-IN">విశేషించి చండాలుడు</span>, <span xml:lang="te-IN">సమర్పించు హవిస్సును యాగములో దేవతలును</span>, <span xml:lang="te-IN">ఋషులును ఎట్లు గ్రహింతురు</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చణ్డాలభోజనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కథం స్వర్గం గమిష్యన్తి విశ్వామిత్రేణ పాలితాః.</span> <span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత</span>, <span xml:lang="te-IN">పాలితాః = పాలింపబడిన</span>, <span xml:lang="te-IN">మహాత్మానః = మహాత్ము లైన</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మణాః వా = బ్రాహ్మణు లైనను</span>, <span xml:lang="te-IN">చణ్డాల భోజనమ్ = చండాలుని భోజనమును</span>, <span xml:lang="te-IN">భుక్త్వా = భుజించి</span>, <span xml:lang="te-IN">స్వర్గమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="te-IN">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="te-IN">గమిష్యన్తి = వెళ్లగలరు </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుని మాటలు విని చండాలుని అన్నము భుజించిన మహాత్ము లైన బ్రాహ్మణు లైనను స్వర్గమున కెట్లు వెళ్లెదరు</span>? </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతద్వచననైష్ఠుర్యమూచుస్సంరక్తలోచనాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః.</span> <span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిశార్దూల = ఓ మునిశ్రే</span><span class="CharOverride-5" xml:lang="te-IN">ష్ఠా!,</span><span xml:lang="te-IN"> సమహోదయాః = మహోదయునితో కూడిన</span>, <span xml:lang="te-IN">తే = ఆ</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">వాసిష్ఠాః = వసిష్ఠకుమారులు</span>, <span xml:lang="te-IN">సంరక్తలోచనాః = ఎఱ్ఱనైన నేత్రములు కలవారై</span>, <span xml:lang="te-IN">ఏతత్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">వచననైష్ఠుర్యమ్ = వచనములో నైష్ఠుర్య ముండునట్లుగా</span>, <span xml:lang="te-IN">ఊచుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మునిశ్రేష్ఠా! మహోదయుడును</span>, <span xml:lang="te-IN">వసిష్ఠకుమారు లందరును</span>, <span xml:lang="te-IN">క్రోధముచే ఎఱ్ఱ నైన నేత్రములతో ఈ విధముగ పరుషముగా మాట్లాడిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుఙ్గవః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> క్రోధసంరక్తనయనః సరోషమిద మబ్రవీత్. </span> 16</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిపుఙ్గవః = ఆ మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="te-IN">తేషాం సర్వేషామ్ = ఆ అందరియొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">క్రోధసంరక్తనయనః = క్రోధముచే ఎఱ్ఱ నైన నేత్రములు కలవాడై</span>, <span xml:lang="te-IN">సరోషమ్ = కోపముతో</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మునిశ్రేష్ఠు డైన ఆ విశ్వామిత్రుడు వారి మాటలు విని</span>, <span xml:lang="te-IN">క్రోధముతో నేత్రములు ఎఱ్ఱబారగా</span>, <span xml:lang="te-IN">ఇట్లు పలికెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యే దూషయన్త్యదుష్టం మాం తప ఉగ్రం సమాస్థితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భస్మీభూతా దురాత్మానో భవిష్యన్తి న సంశయః. </span> 17</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఉగ్రమ్ = ఉగ్ర మైన</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సును</span>, <span xml:lang="te-IN">ఆస్థితమ్ = ఆవలంబించినవాడను</span>, <span xml:lang="te-IN">అదుష్టమ్ = దుష్టుడు కానివాడను అగు</span>, <span xml:lang="te-IN">మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">యే = ఎవరు</span>, <span xml:lang="te-IN">దూషయన్తి = దూషించుచున్నారో</span>, <span xml:lang="te-IN">అట్టి</span>, <span xml:lang="te-IN">దురాత్మానః = దురాత్ములు</span>, <span xml:lang="te-IN">భస్మీభూతాః = భస్మ మైన వారుగా</span>, <span xml:lang="te-IN">భవిష్యన్తి = కాగలరు. సంశయః = సంశయము</span>, <span xml:lang="te-IN">న = లేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఎట్టి దోషములును లేక ఉగ్ర మైన తపస్సు ఆచరించుచున్న నన్ను దూషించు ఆ దురాత్ములు భస్మమై పోయెదరు. సంశయము లేదు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అద్య తే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సప్తజాతిశతాన్యేవ మృతపాః సన్తు సర్వశః.</span> <span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = వారు</span>, <span xml:lang="te-IN">అద్య = ఇప్పుడు</span>, <span xml:lang="te-IN">కాలపాశేన = యమపాశముచేత</span>, <span xml:lang="te-IN">వైవస్వతక్షయమ్ = యముని గృహమును గూర్చి</span>, <span xml:lang="te-IN">నీతాః = తీసికొని వెళ్లబడిన వారై</span>, <span xml:lang="te-IN">సప్తజాతిశతాన్యేవ = ఏడువందల జన్మముల పాటు</span>, <span xml:lang="te-IN">సర్వశః = అన్ని విధముల</span>, <span xml:lang="te-IN">మృతపాః = శవభక్షకులుగా</span>, <span xml:lang="te-IN">సన్తు = అగుదురుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>వాళ్లందరును ఈ నాడే యమపాశబద్ధులై యమలోకమునకు పోయి ఏడువందల జన్మములు పాటు శవభక్షకులుగా ఉందురుగాక.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శ్వమాంసనియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరన్త్విమాన్.</span> <span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నిర్ఘృణాః = జాలిలేని</span>, <span xml:lang="te-IN">ముష్టికాః నామ = ముష్టికు లనే జాతి వారుగా పుట్టి</span>, <span xml:lang="te-IN">శ్వమాంసనియతాహారాః = కుక్కమాంసమునే నిత్యము భక్షించుచు</span>, <span xml:lang="te-IN">వికృతాశ్చ = వికారము కలవారై</span>, <span xml:lang="te-IN">విరూపాశ్చ = చెడ్డ రూపము కలవారై</span>, <span xml:lang="te-IN">ఇమాన్ = ఈ</span>, <span xml:lang="te-IN">లోకాన్ = లోకములను (లో)</span>, <span xml:lang="te-IN">అనుచరన్తు = సంచరింతురుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠపుత్రు లందరును జాలి లేని ముష్టికజాతిలో పుట్టి</span>, <span xml:lang="te-IN">నిత్యము కుక్కమాంసమును భక్షించుచు</span>, <span xml:lang="te-IN">వికృతరూపములతో ఈ లోకమునందు సంచరించెదరు గాక. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">మహోదయస్తు దుర్భుద్ధిర్మామదూష్యం హ్యదూషయత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి.</span> <span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దుర్బుద్ధిః = చెడ్డ బుద్ధి గల</span>, <span xml:lang="te-IN">మహోదయస్తు = మహోదయు డైతే</span>, <span xml:lang="te-IN">అదూష్యమ్ = దూషింపకూడని</span>, <span xml:lang="te-IN">మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">అదూషయత్ హి = దూషించినాడు కదా. సర్వలోకేషు = సకలలోకములయందును</span>, <span xml:lang="te-IN">దూషితః = దూషింపబడినవాడై</span>, <span xml:lang="te-IN">నిషాదత్వమ్ = నిషాదత్వమును</span>, <span xml:lang="te-IN">గమిష్యతి = పొందగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు సకలజనులును దూషించు నిషాదజాతిలో పుట్టగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రాణాతిపాతనిరతో నిరనుక్రోశతాం గతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దీర్ఘకాలం మమ క్రోధాద్దుర్గతిం వర్తయిష్యతి.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">క్రోధాత్ = కోపమువలన</span>, <span xml:lang="te-IN">ప్రాణాతిపాతని రతః = ప్రాణము లను తీయుటయందు ఆసక్తి కలవాడై</span>, <span xml:lang="te-IN">నిరనుక్రోశతామ్ = దయారాహిత్యమును</span>, <span xml:lang="te-IN">గతః = పొందిన వాడై</span>, <span xml:lang="te-IN">దీర్ఘకాలమ్ = చాల కాలము</span>, <span xml:lang="te-IN">దుర్గతిమ్ = చెడ్డ జీవన విధానమును</span>, <span xml:lang="te-IN">వర్తయిష్యతి = అనుసరించగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నా కోపమునకు ఫలితముగ ఆ మహోదయుడు</span>, <span xml:lang="te-IN">దయావిహీనుడై</span>, <span xml:lang="te-IN">ప్రాణములు తీయుటయందు ఆసక్తి కలవాడై</span>, <span xml:lang="te-IN">చాలకాలము దుష్ట మైన జీవికను పొందగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనషష్టితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="te-IN">మహామునిః = మహామునియు అగు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">ఋషి మధ్యే = ఋషులమధ్యయందు ఏతావత్ = ఇంతమాత్రము</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">విరరామ = విరమించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజశ్శాలి యగు విశ్వామిత్రమహాముని</span>, <span xml:lang="te-IN">ఋషుల మధ్య ఇట్లు పలికి విరమించెను.</span> </p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబది తొమ్మిదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter