Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_63</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_63" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ త్రిషష్టితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">విశ్వామిత్రుడు </span>‘‘<span xml:lang="en-US">మహర్షిత్వమును</span>’’ <span xml:lang="en-US">పొందుట. మేనక ఆతని తపస్సుకు భంగము కలిగించుట. </span>‘‘<span xml:lang="en-US">బ్రహ్మర్షిత్వము</span>’’ <span xml:lang="en-US">సంపాదించుటకై విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేయుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పూర్ణే వర్షసహస్రే తు వ్రతస్నాతం మహామునిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభ్యాగచ్ఛన్ సురాః సర్వే తపఃఫలచికీర్షవః. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వర్షసహస్రే = వేయిసంవత్సరముల కాలము</span>, <span xml:lang="en-US">పూర్ణే = నిండిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">తపఃఫలచికీర్షవః = తపస్సునకు ఫలమును ఇవ్వగోరినవారై</span>, <span xml:lang="en-US">వ్రతస్నాతమ్ = వ్రతాంతమునందు స్నానము చేసిన</span>, <span xml:lang="en-US">మహామునిమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అభ్యాగచ్ఛన్ = సమీపించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>వేయి సంవత్సరములు గడచిన పిమ్మట ఆ మహాముని వ్రతము పూర్తి చేసికొని యుండగా దేవత లందరును అతని తపస్సునకు ఫలము ఇవ్వగోరి వచ్చిరి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అబ్రవీత్సుమహాతేజా బ్రహ్మా సురుచిరం వచః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సుమహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">బ్రహ్మా = బ్రహ్మ</span>, <span xml:lang="en-US">సురుచిరమ్ = చాల అంద మైన</span>, <span xml:lang="en-US">వచః = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">స్వార్జితైః = నీచేత సంపాదింపబడిన</span>, <span xml:lang="en-US">శుభైః కర్మభిః = పుణ్య కర్మలచే</span>, <span xml:lang="en-US">ఋషిః అసి = ఋషి అయితివి. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళ మగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజస్సు గల బ్రహ్మ - </span>‘‘<span xml:lang="en-US">నీవు ఆచరించిన శుభకర్మలచేత</span>, <span xml:lang="en-US">ఋషి వయినావు. నీకు క్షేమ మగుగాక</span>’’ <span xml:lang="en-US">అని విశ్వామిత్రునితో మధుర మైన వాక్యమును పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తమేవముక్త్వా దేవేశస్త్రిదివం పునరభ్యగాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రో మహాతేజా భూయస్తే పే మహత్తపః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవేశః = దేవతల ప్రభు వైన బ్రహ్మ</span>, <span xml:lang="en-US">తమ్ = ఆతనిని గూర్చి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">పునః = తిరిగి</span>, <span xml:lang="en-US">త్రిదివమ్ = స్వర్గమునుగూర్చి</span>, <span xml:lang="en-US">అభ్యగాత్ = వెళ్లెను. మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">భూయః = మరల</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్ప</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికి స్వర్గమునకు వెళ్లిపోయెను. గొప్ప తేజస్సు గల విశ్వామిత్రుడు మరల గొప్ప తపస్సు చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహతా = గొప్ప</span>, <span xml:lang="en-US">కాలేన = కాలముచేత</span>, <span xml:lang="en-US">మేనకా = మేనక యనెడు</span>, <span xml:lang="en-US">పరమాప్సరాః = గొప్ప అప్సరస్త్రీ</span>, <span xml:lang="en-US">పుష్కరేషు = పుష్కరమునందు</span>, <span xml:lang="en-US">స్నాతుమ్ = స్నానముచేయుటకు</span>, <span xml:lang="en-US">సముపచక్రమే = ప్రారంభించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! పిమ్మట చాలకాలమునకు మేనక యనెడు గొప్ప అప్సరస పుష్కరమునందు స్నాన మాడ మొదలిడెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తాం దదర్శ మహాతేజా మేనకాం కుశికాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రూపేణాప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">కుశికాత్మజః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తత్ర = ఆ పుష్కరమునందు</span>, <span xml:lang="en-US">జలదే = మేఘమునందు</span>, <span xml:lang="en-US">విద్యుతం యథా = మెరుపు వలె నున్న</span>, <span xml:lang="en-US">రూపేణ = రూపముచేత</span>, <span xml:lang="en-US">అప్రతిమామ్ = సాటి లేని</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">మేనకామ్ = మేనకను</span>, <span xml:lang="en-US">దదర్శ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజశ్శాలి యగు విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఆ పుష్కరతీర్థములో</span>, <span xml:lang="en-US">మేఘములో మెరుపు వలె నున్న</span>, <span xml:lang="en-US">సాటి లేని రూపము గల ఆ మేనకను చూచెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దృష్ట్వా కన్దర్పవశగో మునిస్తామిదమబ్రవీత్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అప్సరః స్వాగతం తేఽస్తు వస చేహ మమాశ్రమే</span>, <span class="fr">6</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> అనుగృహ్ణీష్వ భద్రం తే మదనేన సుమోహితమ్.</p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">మునిః = ముని</span>, <span xml:lang="en-US">కన్దర్పవశగః = మన్మథునకు వశమైనవాడై</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. అప్సరః = ఓ అప్సరసా!, తే = నీకు</span>, <span xml:lang="en-US">స్వాగతమ్ అస్తు = స్వాగత మగు గాక. మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">ఇహ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమే = ఆశ్రమమునందు</span>, <span xml:lang="en-US">వస చ = నివసింపుము. మదనేన = మన్మథునిచేత</span>, <span xml:lang="en-US">సుమోహితమ్ = అధికముగా మోహితుడ నైన నన్ను</span>, <span xml:lang="en-US">అనుగృహ్ణీష్వ = అనుగ్రహింపుము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆమెను చూడగనే కామపరవశు డైన విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను — ఓ అప్సరసా! నీకు స్వాగతము. నా యీ ఆశ్రమములో నివసింపుము. మన్మథునిచే మిక్కిలి మోహితుడ నైన నన్ను అనుగ్రహింపుము. నీకు క్షేమ మగుగాక.</span>’’</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసమథాకరోత్. </span><span class="fr">7</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్యాం వసన్త్యాం వర్షాణి పఞ్చ పఞ్చ చ రాఘవ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామితాశ్రమే రామ సుఖేన వ్యతిచక్రముః. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా!, సా = ఆ</span>, <span xml:lang="en-US">వరారోహా = స్త్రీ</span>, <span xml:lang="en-US">ఇతి = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్తా = పలుకబడినదై</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">వాసమ్ = నివాసమును</span>, <span xml:lang="en-US">అకరోత్ = చేసెను. రామ = రామా! తస్యామ్ = ఆమె</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రాశ్రమే = విశ్వామిత్రుని ఆశ్రమమునందు, వసన్త్యామ్ = నివసించుచుండగా</span>, <span xml:lang="en-US">పఞ్చ పఞ్చ చ = పది</span>, <span xml:lang="en-US">వర్షాణి = సంవత్సరములు</span>, <span xml:lang="en-US">సుఖేన = సుఖముగా</span>, <span xml:lang="en-US">వ్యతిచక్రముః = గడచి పోయినవి.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>విశ్వామిత్రు డిట్లు పలుకగా ఆ అప్సరస అచట నివసించెను. ఆమె విశ్వామిత్రాశ్రమములో నివసించుచుండగా పది సంవత్సరములు సుఖముగ గడచిపోయినవి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ కాలే గతే తస్మిన్విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సవ్రీళ ఇవ సంవృత్తశ్చిన్తాశోకపరాయణః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">తస్మిన్ కాలే = ఆ (పది సంవత్సరముల) కాలము</span>, <span xml:lang="en-US">గతే = గడచిపోయిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">చిన్తాశోకపరాయణః = చింతాశోకములతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">సవ్రీళ ఇవ = సిగ్గు కలవాడుగా</span>, <span xml:lang="en-US">సంవృత్తః = అయినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పది సంవత్సరములు గడచిన తరువాత విశ్వామిత్రమహాముని చింతాదుఃఖములతో నిండినవాడై సిగ్గుపడెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బుద్ధిర్మునేః సముత్పన్నా సామర్షా రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సర్వం సురాణాం కర్మైతత్తపోపహరణం మహత్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, మునేః = మునికి</span>, <span xml:lang="en-US">సామర్షా = కోపముతో కూడిన</span>, <span xml:lang="en-US">బుద్ధిః = బుద్ధి</span>, <span xml:lang="en-US">సముత్పన్నా = పుట్టినది. ఏతత్ సర్వమ్ = ఇది యంతయు</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">తపోపహరణమ్ = తపస్సును అపహరించు</span>, <span xml:lang="en-US">సురాణామ్ = దేవతలయొక్క</span>, <span xml:lang="en-US">కర్మ = కర్మ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! అపుడు విశ్వామిత్రునకు కోపముతో కూడిన ఆలోచన ఒకటి కలిగినది -- </span>‘‘<span xml:lang="en-US">ఇది అంతయు</span>, <span xml:lang="en-US">నా తపస్సు హరించుటకై దేవతలు చేసిన పని.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అహోరాత్రాపదేశేన గతాః సంవత్సరా దశ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కామమోహాభిభూతస్య విఘ్నోఽయం సముపస్థితః. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కామమోహాభిభూతస్య = కామమోహములచేత ఆవహింపబడిన నాకు</span>, <span xml:lang="en-US">దశ సంవత్సరాః = పది సంవత్సరములు</span>, <span xml:lang="en-US">అహోరాత్రాపదేశేన = పగళ్లు రాత్రులు అను మిషచేత</span>, <span xml:lang="en-US">గతాః = గడచిపోయినవి. ఆయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">విఘ్నః = విఘ్నము</span>, <span xml:lang="en-US">సముపస్థితః = వచ్చినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పగలు</span>, <span xml:lang="en-US">రాత్రి అని అనుకొనుచుండగనే కామమోహములో చిక్కుకొనియున్న నాకు పది సంవత్సరములు గడచిపోయినవి. ఈ విధముగ పెద్ద విఘ్నము వచ్చి పడినది.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వినిశ్శ్వసన్మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భీతామప్సరసం దృష్ట్వా వేపన్తీం ప్రాఞ్జలిం స్థితామ్. </span><span class="fr">12</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మేనకాం మధురైర్వాకైర్విసృజ్య కుశికాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామ హ. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, మునివరః = మునిశ్రేష్ఠుడైన</span>, <span xml:lang="en-US">కుశికాత్మజః = కుశికుని కుమారు డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">పశ్చాత్తాపేన = పశ్చాత్తాపముచేత</span>, <span xml:lang="en-US">దుఃఖితః = దుఃఖించిన వాడై</span>, <span xml:lang="en-US">వినిశ్శ్వసన్ = నిట్టూర్చుచు</span>, <span xml:lang="en-US">భీతామ్ = భయపడినదియు</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిం స్థితామ్ = దోసిలికట్టి నిలచినదియు</span>, <span xml:lang="en-US">వేపన్తీమ్ = వణకుచున్నదియు</span>, <span xml:lang="en-US">అప్సరసమ్ = అప్సరస యైన</span>, <span xml:lang="en-US">మేనకామ్ = మేనకను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">మధురైః = మధురము లైన, వాక్యైః = వాక్యముల చేత</span>, <span xml:lang="en-US">విసృజ్య = విడచి</span>, <span xml:lang="en-US">ఉత్తరం పర్వతమ్ = హిమవత్పర్వతమును గూర్చి</span>, <span xml:lang="en-US">జగామ హ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! విశ్వామిత్రమహాముని పశ్చాత్తాపముచే పీడితుడై</span>, <span xml:lang="en-US">నిట్టూర్చుచున్నవాడై</span>, <span xml:lang="en-US">తన ఎదుట అంజలి ఘటించి వణకుచు నిలచిన మేనక భయపడినదని గ్రహించి</span>, <span xml:lang="en-US">ఆమెని తీయని మాటలతో పంపివేసి</span>, <span xml:lang="en-US">హిమవత్పర్వతమునకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స కృత్వా నైష్ఠికీం బుద్ధిం జేతుకామో మహాయశాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కౌశికీతీరమాసాద్య తపస్తేపే సుదారుణమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">సః = ఆతడు</span>, <span xml:lang="en-US">నైష్ఠికీమ్ = నిష్ఠకు సంబంధించిన</span>, <span xml:lang="en-US">బుద్ధిమ్ = బుద్ధిని</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">జేతుకామః = జయింపవలె నను కోరిక గలవాడై</span>, <span xml:lang="en-US">కౌశికీతీరమ్ = కౌశికీనదీతీరమును</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది</span>, <span xml:lang="en-US">సుదారుణమ్ = మిక్కిలి భయంకర మైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు నిష్ఠ నవలంబింపవలె నని దృఢనిశ్చయము చేసికొని</span>, <span xml:lang="en-US">ఇంద్రియములను (లేదా వసిష్ఠుని) జయింపగోరుచున్నవాడై</span>, <span xml:lang="en-US">కౌశికీనదీతీరము చేరి అతితీవ్ర మైన తపస్సు చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య వర్షసహస్రం తు ఘోరం తప ఉపాసతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్తరే పర్వతే రామ దేవతానామభూద్భయమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, తస్య = అతడు</span>, <span xml:lang="en-US">ఉత్తరే పర్వతే = హిమవత్పర్వతముమీద</span>, <span xml:lang="en-US">వర్షసహస్రమ్ = వేయిసంవత్సరములు</span>, <span xml:lang="en-US">ఘోరమ్ = ఘోర మైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">ఉపాసతః = చేయుచుండగా</span>, <span xml:lang="en-US">దేవతానామ్ = దేవతలకు</span>, <span xml:lang="en-US">భయమ్ = భయము</span>, <span xml:lang="en-US">అభూత్ = కలిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>విశ్వామిత్రుడు హిమవత్పర్వతముపై వేయి సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేయుచుండగా దేవతలకు భయము కలిగెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఆమన్త్రయన్ సమాగమ్య సర్వే సర్షిగణాః సురాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహర్షిశబ్దం లభతాం సాధ్వయం కుశికాత్మజః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్షిగణాః = ఋషిగణములతో కూడిన</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సమాగమ్య = కలిసి</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">కుశికాత్మజః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సాధు = బాగుగా</span>, <span xml:lang="en-US">మహర్షిశబ్దమ్ = మహర్షి అను పేరును</span>, <span xml:lang="en-US">లభతామ్ = పొందుగాక అని</span>, <span xml:lang="en-US">ఆమంత్రయన్ = ఆలోచించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఋషులును</span>, <span xml:lang="en-US">దేవత లందరును కలిసి ఈ విశ్వామిత్రుని </span>‘‘<span xml:lang="en-US">మహర్షి</span>’’ <span xml:lang="en-US">అనవచ్చును అని నిశ్చయించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వలోకపితామహః = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">దేవతానామ్ = దేవతలయొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">తపోధనమ్ = తపస్సే ధనముగా గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">మధురమ్ = మధుర మైన</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవతల అభిప్రాయము ననుసరించి బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రునితో మధుర మైన వాక్యము పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహత్త్వమృషిముఖ్యత్వం దదామి తవ కౌశిక. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహర్షే = మహర్షీ!, వత్స = నాయనా! స్వాగతమ్ = స్వాగతమగుగాక. ఉగ్రేణ = ఉగ్ర మైన</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">తోషితః = సంతోషింప చేయబడితిని. కౌశిక = విశ్వామిత్రా!, తవ = నీకు</span>, <span xml:lang="en-US">మహత్త్వమ్ = గొప్పతనమును</span>, <span xml:lang="en-US">ఋషిముఖ్యత్వమ్ = ఋషులలో శ్రేష్ఠత్వమును</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహర్షీ! నీవు చేసిన ఉగ్ర తపస్సుకు సంతోషించినాను. నీకు మహత్త్వమును</span>, <span xml:lang="en-US">ఋషిత్వమును</span>, (<span xml:lang="en-US">అనగా మహర్షిత్వమును) ఇచ్చుచున్నాను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బ్రహ్మణః స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న విషణ్ణో న సన్తుష్టో విశ్వామిత్రస్తపోధనః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తపోధనః = తపోధనుడైన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సర్వలోకేశ్వరస్య = సర్వలోకాధిపతి యైన</span>, <span xml:lang="en-US">బ్రహ్మణః = బ్రహ్మయొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్కును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">న విషణ్ణః = విషాదము పొందలేదు</span>, <span xml:lang="en-US">న సన్తుష్టః = సంతోషించ లేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>సర్వలోకాధీశ్వరు డైన బ్రహ్మ మాటలను విన్న ఆ విశ్వామిత్ర మహామునికి విషాదము కలుగలేదు. సంతోషము కలుగలేదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రాఞ్జలిః ప్రణతో భూత్వా సర్వలోకపితామహమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహామునిః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">ప్రణతః = నమ్రుడుగా</span>, <span xml:lang="en-US">భూత్వా = అయి</span>, <span xml:lang="en-US">సర్వలోకపితామహమ్ = బ్రహ్మదేవుని గూర్చి</span>, <span xml:lang="en-US">వాచమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట ఆ విశ్వామిత్ర మహాముని అంజలి ఘటించి</span>, <span xml:lang="en-US">నమ్రుడై బ్రహ్మదేవునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మహర్షిశబ్దమతులం స్వార్జితైః కర్మభిః శుభైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యది మే భగవానాహ తతోఽహం విజితేన్ద్రియః. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవాన్ = పూజ్యుడ వైన నీవు</span>, <span xml:lang="en-US">స్వార్జితైః = నాచే చేయబడిన</span>, <span xml:lang="en-US">శుభైః = శుభములైన</span>, <span xml:lang="en-US">కర్మభిః = కర్మలచేత</span>, <span xml:lang="en-US">అతులమ్ = సాటిలేని</span>, <span xml:lang="en-US">మహర్షి శబ్దమ్ = </span>‘<span xml:lang="en-US">మహర్షి</span>’ <span xml:lang="en-US">అను పేరును</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">ఆహ యది = చెప్పినట్లయితే</span>, <span xml:lang="en-US">తతః = అందువలన</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">విజితేన్ర్దియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>నేను చేసిన శుభకర్మలచే నాకు మహర్షిత్వము లభించిన దని పూజ్యుడ వైన నీవు చెప్పుచున్నావు కదా. అందుచే నేను జితేంద్రియుడ నైతిని.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తమువాచ తతో బ్రహ్మా న తావత్త్వం జితేన్ద్రియః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యతస్వ మునిశార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">బ్రహ్మా = బ్రహ్మ</span>, <span xml:lang="en-US">తమ్ = ఆతనిని</span>, <span xml:lang="en-US">గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">జితేన్ద్రియస్తావత్ = ఇంద్రియములను జయించినవాడవు మాత్రము</span>, <span xml:lang="en-US">న = కాదు. మునిశార్దూల = ఓ మునిశ్రేష్ఠుడా! యతస్వ = ఇంకను ప్రయత్నింపుము. ఇతి = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">త్రిదివమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="en-US">గతః = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">నీవు జితేంద్రియుడవు మాత్రము కావు. ఇంకను ప్రయత్నింపుము</span>’’ <span xml:lang="en-US">అని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికి స్వర్గమునకు వెళ్లెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఊర్ధ్వబాహుర్నిరాలమ్బో వాయుభక్షస్తపశ్చరన్. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవేషు = దేవతలు</span>, <span xml:lang="en-US">విప్రస్థితేషు సత్సు = ప్రయాణ మైనవా రగు చుండగా</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఊర్ధ్వబాహుః = పైకి ఎత్తబడిన బాహువులు కలవాడై</span>, <span xml:lang="en-US">నిరాలంబః = ఆలంబనము (ఊత) లేనివాడై</span>, <span xml:lang="en-US">వాయుభక్షః = వాయువును భక్షించుచున్నవాడై</span>, <span xml:lang="en-US">తపః చరన్ = తపస్సు చేయుచు ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవత లందరును వెడలిపోయిన పిమ్మట</span>, <span xml:lang="en-US">విశ్వామిత్ర మహాముని</span>, <span xml:lang="en-US">చేతులు పైకెత్తి ఆలంబన మేదియు లేకుండ నిలచి</span>, <span xml:lang="en-US">వాయువును మాత్రమే ఆహారముగ గొని తపస్సు చేయ మొదలిడెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఘర్మే పఞ్చతపా భూత్వా వర్షాస్వాకాశసంశ్రయః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శిశిరే సలిలస్థాయీ రాత్య్రహాని తపోధనః. </span><span class="fr">24</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> ఏవం వర్షసహస్రం హి తపో ఘోరముపాగమత్.</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తపోధనః = ఆ విశ్వామిత్రమహర్షి</span>, <span xml:lang="en-US">ఘర్మే = గ్రీష్మర్తువు నందు</span>, <span xml:lang="en-US">పఞ్చతపాః = అయిదు అగ్నుల మధ్య తపస్సు చేయువాడు</span>, <span xml:lang="en-US">భూత్వా = అయి</span>, <span xml:lang="en-US">వర్షాసు = వర్షకాలమునందు</span>, <span xml:lang="en-US">ఆకాశసంశ్రయః = బయటనే నివసించుచు</span>, <span xml:lang="en-US">శిశిరే = శిశిరర్తువునందు</span>, <span xml:lang="en-US">రాత్య్రహాని = రేయింబగళ్లు</span>, <span xml:lang="en-US">సలిలస్థాయీ = నీటిలో నిలచినవాడై</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">వర్షసహస్రమ్ = వేయి సంవత్సరములు</span>, <span xml:lang="en-US">ఘోరమ్ = ఘోరమైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">ఉపాగమత్ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రమహర్షి గ్రీష్మమునందు పంచాగ్నిమధ్య తపస్సు చేయుచు</span>, <span xml:lang="en-US">వర్షాకాలము నందు ఆరుబైటనే వసించుచు</span>, <span xml:lang="en-US">శీతకాలమున రేయింబగళ్లు జలమునందు నిలచుచు</span>, <span xml:lang="en-US">వేయి సంవత్సరములపాటు ఘోరతపస్సు చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్మిన్ సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునౌ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంభ్రమః సుమహానాసీత్సురాణాం వాసవస్య చ.</span> <span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునౌ = మహాముని యైన</span>, <span xml:lang="en-US">తస్మిమ్ = ఆ</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రే = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సంతప్యమానే = తపము చేయుచుండగా</span>, <span xml:lang="en-US">సురాణామ్ = దేవతలకును</span>, <span xml:lang="en-US">వాసవస్య చ = దేవేంద్రునకును</span>, <span xml:lang="en-US">సుమహాన్ = చాల గొప్ప దైన</span>, <span xml:lang="en-US">సంభ్రమః = భయము</span>, <span xml:lang="en-US">ఆసీత్ = కలిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రమహాముని ఈ విధముగ తపస్సు చేయుట చూచి దేవేంద్రుడును</span>, <span xml:lang="en-US">దేవతలును చాల భయపడిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రమ్భామప్సరసం శక్రః సహ సర్వైర్మరుద్గణైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఉవాచాత్మహితం వాక్యమహితం కౌశికస్య చ. </span><span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రిషష్టితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">సర్వైః = సమస్త మైన</span>, <span xml:lang="en-US">మరుద్గణైః సహ = దేవతాగణములతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">ఆత్మహితమ్ = తనకు హిత మైనదియు</span>, <span xml:lang="en-US">కౌశికస్య = విశ్వామిత్రునకు</span>, <span xml:lang="en-US">అహితం చ = హితము కానిదియు అగు</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">రమ్భామ్ = రంభ అనెడు</span>, <span xml:lang="en-US">అప్సరసమ్ </span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="en-US">= అప్సరస్త్రీని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సకలదేవతాసమేతు డైన దేవేంద్రుడు రంభ యను అప్సరసతో</span>, <span xml:lang="en-US">తనకు హితకరమును</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రునకు అహితకరమును అగు వాక్యము పలికెను.</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో అరువది మూడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter