Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>End_Matter</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_9.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="End_Matter" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అనుబంధము</p> <p class="Head2" xml:lang="en-GB">కొన్ని శ్లోకాలకు వ్యాఖ్యావిశేషాలు</p> <p class="Head2" xml:lang="en-GB">1</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః.</span></p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">కైకేయ్యె చావశిష్టార్ధం దదౌ పుత్రార్థకారణాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమం</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్.</span></p> <p class="Prati" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">బాల. </span>16<span xml:lang="te-IN"> స. </span>27-29</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పాయసవిభాగమునుగూర్చి చెప్పు పై శ్లోకాల భావమును వ్యాఖ్యాతలు వివిధరీతుల తెలిపియున్నారు.</span></p> <p class="Prati" xml:lang="en-GB">1. <span xml:lang="te-IN">మహేశ్వరతీర్థ గోవిందరాజుల వ్యాఖ్యప్రకారము - దశరథుడు పాయసములో సగము కౌసల్యకును</span>, <span xml:lang="te-IN">నాల్గవపాలు సుమిత్రకును</span>, <span xml:lang="te-IN">ఎనిమిదవపాలు కైకేయికిని</span>, <span xml:lang="te-IN">మఱల మిగిలిన యెనిమిదవ పాలు సుమిత్రకును ఇచ్చెను. ఈ వ్యాఖ్య శ్లోకాక్షరానుగుణముగా ఉన్నది.</span></p> <p class="Prati" xml:lang="en-GB">2. <span xml:lang="te-IN">మునిభావ ప్రకాశికాకారుల వ్యాఖ్య మాత్రము మఱియొక విధముగా ఉన్నది. తదా <br/>= అప్పుడు</span>, <span xml:lang="te-IN">పుత్రార్థకారణాత్ = పుత్ర ప్రయోజనము నిమిత్తము</span>, <span xml:lang="te-IN">నరపతిః = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">కౌసల్యాయై = కౌసల్యకొరకు</span>, <span xml:lang="te-IN">పాయసార్ధమ్ = పాయసము యొక్క సగమును</span>, <span xml:lang="te-IN">దదౌ = ఇచ్చెను. నరాధిపః = రాజు</span>, <span xml:lang="te-IN">సుమిత్రాయై చాపి = సుమిత్రకొఱకును</span>, <span xml:lang="te-IN">శేషస్య (అధ్యాహారము) = కౌసల్య కివ్వగా మిగిలిన సగముయొక్క అర్ధాత్ = సగమును</span>, (<span xml:lang="te-IN">ఎనిమిదవ భాగమును)</span>, <span xml:lang="te-IN">దదౌ = ఇచ్చెను. కైకేయ్యె చ = కైకేయికొరకును</span>, <span xml:lang="te-IN">అవశిష్టార్ధమ్ = కౌసల్యకీయగా మిగిలిన సగములో సుమిత్ర కిచ్చుటకు రెండు భాగములు చేసిన సగము పోగా సగమును</span>, <span xml:lang="te-IN">అనగా నాల్గవ భాగమును</span>, <span xml:lang="te-IN">దదౌ <br/>= ఇచ్చెను. మహీపతిః = దశరథుడు</span>, <span xml:lang="te-IN">అనుచిన్త్య = ఆలోచించి</span>, <span xml:lang="te-IN">పునరేవ = మరల</span>, <span xml:lang="te-IN">సుమిత్రాయై <br/>= సుమిత్రకు</span>, <span xml:lang="te-IN">అమృతోపమమ్ = అమృతముతో సమాన మైన</span>, <span xml:lang="te-IN">పాయసస్య = పాయసముయొక్క</span>, <span xml:lang="te-IN">అవశిష్టార్ధం చ = పూర్వము సుమిత్ర కిచ్చుటకై రెండు భాగములు చేసిన నాల్గవ భాగములో అపుడు సుమిత్ర కివ్వగా మిగిలిన సగమును</span>, (<span xml:lang="te-IN">అనగా రెండవ ఎనిమిదవ భాగమును) ప్రదదౌ <br/>= ఇచ్చెను. మిగిలినది పూర్వము వలెనే.<a/></span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఈ అర్థము ప్రకారము - కౌసల్యకు సగము</span>, <span xml:lang="te-IN">సుమిత్రకు సగములోని సగములో సగము</span>, <span xml:lang="te-IN">అనగా ఎనిమిదవ భాగమును</span>, <span xml:lang="te-IN">సుమిత్రకై విభజించిన నాల్గవ పాలుగాక మిగిలిన నాల్గవపాలును కైకేయికిని ఇచ్చెను. పూర్వమొక నాల్గవ పాలు విభజించి అందు సగము సుమిత్ర కియ్యగా మిగిలిన సగమును (రెండవదగు ఎనిమిదవ భాగమును) మరల సుమిత్రకే ఇచ్చెను. అనగా కౌసల్యకు పాయసములోని సగము</span>, <span xml:lang="te-IN">కైకేయికి నాల్గవపాలు</span>, <span xml:lang="te-IN">సుమిత్రకు రెండు ఎనిమిదవ పాళ్లు లభించెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB">3. <span xml:lang="te-IN">పురాణాంతరములతో విరోధము లేకుండుటకై మరొక అర్థము కూడ చెప్పబడినది-కౌసల్యకు నాల్గవపాలును</span>, <span xml:lang="te-IN">సుమిత్రకు నాల్గవపాలును</span>, <span xml:lang="te-IN">కైకేయికి నాల్గవపాలును</span>, <span xml:lang="te-IN">మిగిలిన నాల్గవపాలు మరల సుమిత్రకును ఇచ్చెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">దశరథుడు పాయసమును రెండు సమభాగములుగ చేసి కౌసల్యా కైకేయిల కీయగా వారు తమ తమ భాగములనుండి సగమును సుమిత్ర కిచ్చినట్లు అధ్యాత్మ రామాయణములో ఉన్నది. దీనిని పట్టియే పై మూడవ వ్యాఖ్యానము చేయబడినది. అయితే దశరథుడే సుమిత్ర కిచ్చినట్లు ఈ రామాయణములో ఉండగా కౌసల్యా కైకేయు లిచ్చినట్లు అధ్యాత్మరామాయణములో ఉన్నది గాన గ్రంథవిరోధము ఉండనే ఉన్నది.</span></p> <p class="Prati" xml:lang="en-GB">దశరథుడు వసిష్ఠ ఋశ్యశృంగుల ఆజ్ఞప్రకారము పాయసమును కౌసల్యా కైకేయీల కిచ్చినట్లు అధ్యాత్మరామాయణములో ఉన్నది. తమ భర్త అభిప్రాయమునకు విరుద్ధముగా వారు (తాము మాత్రమే భుజింపక) సుమిత్రకు కూడ ఎట్లు ఇచ్చినారు అని ప్రశ్న. దీనికి సమాధానముగా - ఆ మునులు త్రికాలద్రష్టలుగాన సుమిత్రాగర్భమున లక్ష్మణశత్రుఘ్ను లుదయించవలసియున్నదని తెలిసి ఆమెకు కూడ పాయస మీయవలెనని దశరథునకు చెప్పియే ఉందురు. ఈ విషయ మెరిగినవా రగుటచే కౌసల్యా కైకేయిలు సుమిత్రకు కూడ ఇచ్చినారని మన మూహించుకొనవలెనని ఒక వ్యాఖ్యాత.</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మరొక వ్యాఖ్య :- దశరథుడు మొదట కౌసల్యకు పాయసములో సగము తీసి ఇచ్చెను. మరల ఆ ఇచ్చిన పాయసమునే రెండు భాగములు చేసి ఒక భాగము సుమిత్ర కిచ్చి</span>, <span xml:lang="te-IN">రెండవ భాగము కౌసల్య కిచ్చెను. అనగా కౌసల్యాసుమిత్రలకు రెండు నాల్గవభాగములు ముట్టినవి. మిగిలిన సగమును కైకేయి కిచ్చెను. సుమిత్ర కిద్దరు కుమారులు పుట్ట దగియుండుట నెరిగిన మునుల ప్రేరణచే మరల ఆ సగమును రెండు భాగములు చేసి ఒక భాగము మాత్రమే కైకేయి కిచ్చి మిగిలినది సుమిత్ర కిచ్చెను. అనగా కైకేయితోబాటు మరల సుమిత్రకు మరొక నాల్గవ భాగము లభించెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB">ఈ శ్లోకాల కీ అర్థము లెట్టు వచ్చునో ఆ వ్యాఖ్యాతలకే తెలియవలెను. శ్రీమద్రామాయణము ఆదికావ్యము. వైదికవాఙ్మయము తప్ప ఇతర వాఙ్మయమంతయు దీని తరువాతనే వచ్చినది. వాటిలో చెప్పిన విషయాలతో విరోధము వచ్చునని రామాయణ శ్లోకాలకు ఇలాంటి అర్థాలు కల్పించుట ఎంతవరకు సమంజసమో సహృదయులే ప్రమాణము. ఈ చివరి వ్యాఖ్యానము ప్రకారము పాయసము నాలుగులాళ్లకును నలుగురు పుత్రులు పుట్టిరి అని చెప్పినట్లయినది. అనగా విష్ణువు అంశ నలుగురిలోను సమమైన పాళ్లలోనే ఉన్నదని చెప్పవలసి ఉన్నది. ఇలా చెప్పిన పక్షాన -</p> <p class="Poem2" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="te-IN">కౌసల్యాఽజనయద్రామం సర్వలక్షణసంయుతమ్</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకవర్ధనమ్</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః సర్వెః సముదితో గుణైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">ఆథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధసమన్వితౌ.</span>’’</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">అని అష్టాదశసర్గలో చెప్పనున్నదానితో విరోధము వచ్చును. </span>‘‘<span xml:lang="te-IN">కౌసల్యా యై నరపతిః</span>’’ <span xml:lang="te-IN">ఇత్యాది (</span>27 - 29) <span xml:lang="te-IN">శ్లోకాల సృష్టార్థానికి కూడ దీనితో విరోధము వచ్చుచున్నది. దానిని పట్టి రాముడు విష్ణువు యొక్క అర్ధభాగము</span>, <span xml:lang="te-IN">లక్ష్మణుడు చతుర్థభాగము</span>, <span xml:lang="te-IN">భరతుడు అష్టమభాగము</span>, <span xml:lang="te-IN">శత్రుఘ్నుడు కూడ అష్టమభాగము కావలెను. ఈ శ్లోకాలలో రాముడు అర్ధభాగమనీ</span>, <span xml:lang="te-IN">భరతుడు చతుర్థాంశమనీ</span>, <span xml:lang="te-IN">లక్ష్మణశత్రుఘ్నులు అర్ధరూపులనీ చెప్పబడినది. అందుచేత మహేశ్వరతీర్థ గోవిందరాజులు </span>‘‘<span xml:lang="te-IN">విష్ణోః చతుర్భాగ</span>’’ <span xml:lang="te-IN">అనుదానికి విష్ణువు యొక్క ఎనిమిదవభాగమనీ</span>, ‘‘<span xml:lang="te-IN">విష్ణోః అర్ధసమన్వితాః</span>’’ <span xml:lang="te-IN">అనుదానికి విష్ణువుయొక్క అంశతో కూడినవారనీ అర్థం చెప్పినారు. </span>‘<span xml:lang="te-IN">చతుర్భాగః</span>’ <span xml:lang="te-IN">అనుదానికి అష్టమభాగమనే అర్థము ఎట్లు లభించినదో తెలియదు.</span></p> <p class="Prati" xml:lang="en-GB">విష్ణ్వంశ పాయసాంశాలని పట్టి ఉండునని ఎచటను చెప్పలేదు గాన ఈ శ్లోకాలకును పాయసవిభాగశ్లోకాలకును విరోధము లేదని ఒక సమాధానము.</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పాయసవిభాగశ్లోకాలలో ఉన్న </span>‘<span xml:lang="te-IN">అర్ధ</span>’ <span xml:lang="te-IN">శబ్దానికి సగము అనే అర్థము గ్రహించక అంశము</span>, <span xml:lang="te-IN">భాగము అను అర్థమును మాత్రమే (అంతటను) గ్రహించినటో ఈ ప్రయాస ఏదియు ఉండదని నా అభిప్రాయము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మన ప్రాంతములో ఉన్న రామాయణం దాక్షిణాత్యపాఠము. దీనికి ఉత్తర దేశపాఠము మరొక్కటి ఉన్నది. దీనిలో కూడా కొంచెము భేదాలతో ఈశాన్య ప్రాంత పాఠమనియు</span>, <span xml:lang="te-IN">వాయవ్య ప్రాంతపాఠమనియు రెండు పాఠములున్నవి. ఈశాన్య ప్రాంత పాఠానికి ప్రాచ్యపాఠమని కూడ పేరు. దీనిని </span>1843-67<span xml:lang="te-IN"> సంవత్సరాలలో</span>, <span xml:lang="te-IN">గార్రెసియో అను ఇటలీ దేశ పండితుడు పదకొండు సంపుటాలలో ప్రచురించెను. ఈతడు ఇటలీలోని టూరిన్ విశ్వవిద్యాలయంలో సంస్కత ప్రొఫెసర్గా ఉండెను. వీటిలో ఏడు సంపుటాలు మూలము నాలుగు సంపుటాలు ఇటాలియన్ భాషలోనికి అనువాదము. ఈ సంపుటాలను </span>1981<span xml:lang="te-IN"> లో మరల మద్రాసు నుండి ప్రచురించుట జరిగినది. దానిలో ఈ ఘట్టాలలో ఉన్న పాఠాలు చూచినచో ఈ వ్యాఖ్యాభేదాలన్నియు అనావశ్యములని తోచక మానదు. అయితే మా పాఠమే సరియైన పాఠము అనే వాదం ఉండనే ఉంటుంది. అచట శ్లోకములు ఈ విధముగా ఉన్నవి.</span></p> <p class="Poem2" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">పుత్రీయం పాయసం దేవి ప్రాశేదం హితమాత్మనః</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యె హవిషోఽర్ధం నరాధిపః</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">స్వయమేవ సమం కృత్వా భాగం భాగచతుష్టయమ్</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">అర్ధాదర్ధం దదౌ చాపి కైకేయ్యె స నరాధిపః</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">చతుర్భాగం ద్విధా కృత్వా సుమిత్రాయై దదౌ తదా</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">ప్రదదౌ చావశిష్టం తత్ పాయసం దేవనిర్మితమ్</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">అనుచిన్త్య సుమిత్రాయై పునరేవ నరాధిపః.</span>’’</p> <p class="Prati" xml:lang="en-GB"> (<span xml:lang="te-IN">ఆదికాండ </span>15<span xml:lang="te-IN">వ సర్గ </span>21-23<span xml:lang="te-IN"> శ్లోకాలు)</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పుత్రుల నిచ్చు ఈ పాయసమును భక్షింపు మని చెప్పి అతడు సమముగా సగము అగునట్లు గను</span>, <span xml:lang="te-IN">మొత్తము నాలుగుభాగములు అగునట్లుగను స్వయముగనే విభజించి కౌసల్యకు సగము భాగమును ఇచ్చెను (అనగా కౌసల్యకు సగము పాయసము లభించినది). సగములో సగము కైకేయి కిచ్చెను (ఆమెకు నాల్గవవంతు లభించినది.) మిగిలిన నాల్గవవంతును రెండు భాగములు చేసి ఒక భాగము సుమిత్ర కిచ్చెను. మరల ఆలోచించి రెండవభాగము కూడ సుమిత్రకే ఇచ్చెను (ఆమెకు రెండు ఎనిమిదవ భాగములు లభించినవి).</span></p> <p class="Prati" xml:lang="en-GB">రామాదుల ఉత్పత్తిని వర్ణించు ఘట్టములో కూడ పాఠము వేరుగా నున్నది. అది పాయసభాగాలకు అనుగుణముగా ఉన్నది.</p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">జన్మతేజోగుణజ్యేష్ఠం పుత్రమప్రతిమౌజసమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">కౌసల్యాజనయద్రామం విష్ణుతుల్యపరాక్రమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">యథాధిపేన దేవానామదితి ర్వజ్రపాణినా</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">భవాయ స హి లోకానాం రావణస్య వధాయ చ.</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">విష్ణోర్వీర్యార్ధతో జజ్ఞే రామో రాజీవలోచనః</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">తేజోవీర్యాధికః శూరః శ్రీమాన్ గుణగణాకరః</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">బభూవానవరశ్చెవ శక్రాద్విష్ణోశ్చ పౌరుషే.</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">తథాలక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">దృఢభక్తిమహోత్సాహౌ రామస్యావరజౌ గుణైః</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">తావప్యాస్తాం చతుర్భాగౌ విష్ణోః సంపిణ్డితావుభౌ</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">ఏక ఏక చతుర్భాగాదపరస్మాదజాయత</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">భరతో నామ కైకేయ్యాః పుత్రః సత్యపరాక్రమః</span></p> <p class="Prati" xml:lang="en-GB"> (<span xml:lang="te-IN">ఆదికాండము. </span>15<span xml:lang="te-IN">వ సర్గ. శ్లో. </span>10-16)</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇచట రాముడు అర్ధభాగమనియు</span>, <span xml:lang="te-IN">లక్ష్మణశత్రుఘ్ను లిరువురును కలిసి ఒక చతుర్థభాగమనియు</span>, <span xml:lang="te-IN">భరతుడు మరొకచతుర్థభాగమనియు స్పష్యముగా చెప్పబడినది. ఇది పాయసభాగాలకు కూడ అనుగుణముగా ఉన్నది.</span></p> <p class="Head2" xml:lang="en-GB">2</p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">ఉత్తిష్ఠ నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికమ్. </span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> (బా. కా. </span>23<span xml:lang="te-IN"> స. </span>2<span xml:lang="te-IN"> శ్లో.)</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">విశేషార్థములు :- మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేలుకొలుప వచ్చి రాముని అచింత్యాద్భుతరూపము చూడగనే ఆశ్చర్యపడి</span>, <span xml:lang="te-IN">తాను వచ్చిన పని మరచి </span>‘‘<span xml:lang="te-IN">నిన్ను గన్న తల్లి ఎంత ధన్యాత్మురాలో కదా</span>’’ <span xml:lang="te-IN">అని చెప్పుచున్నాడు. రామ = సర్వోత్తమసౌందర్యవంతుడగు ఓ రామా! కౌసల్యా = సర్వేశ్వరుడ వైన నిన్ను గన్న కౌసల్య</span>, <span xml:lang="te-IN">సుప్రజాః = నీవు కొడుకుగా పుట్టుట వలన మంచి కొడుకుగలది. లేదా మాతృశుశ్రూష చక్కగా చేయు నీచేత కౌసల్య సత్పుత్రవతి అయినది.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">లేదా రాముని అమేయ స్వరూపమును చూచి విశ్వామిత్రుడు మనస్సులో ఈ విధముగ వితర్కించుకొనుచున్నాడు. కౌసల్యా = ఇట్టి రాముని కన్న కౌసల్యాదేవి</span>, <span xml:lang="te-IN">సుప్రజాః = మంచి సంతానము కలది. (ఈ అర్థమున </span>‘‘<span xml:lang="te-IN">రామ</span>’’ <span xml:lang="te-IN">అనునది తరువాతి వాక్యమున అన్వయించును). రాముడు కుమారుడుగా పుట్టుటచే మంచి కుమారుడు కలిగి యుండుట కౌసల్యకు దశరథునకును సమానమే అయినను </span>‘‘<span xml:lang="te-IN">పితుః శతగుణం మాతా (తండ్రి కంటె తల్లి నూరింతలు)</span>’’ <span xml:lang="te-IN">అని స్మతిలో చెప్పుటచే కౌసల్యాదేవి మాత్రము మంచి కొడుకుగలది అని ఇక్కడ వర్ణింపబడినది.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">కౌసల్యాదశరథులకు చాల అంతరమున్నది. విశ్వామిత్రుడు </span>‘‘<span xml:lang="te-IN">అహం వేద్మి మహాత్మానమ్</span>’’ <span xml:lang="te-IN">ఇత్యాదివిధముల ఎంతగా చెప్పినను దశరథుడు రాముని విశ్వామిత్రున కిచ్చుటకు సంశయించెను. కౌసల్య స్త్రీయైనను</span>, <span xml:lang="te-IN">దశరథుని కన్న రెండింతలు పుత్రవాత్సల్యము కలదైనను ఎంత మాత్రమును సందేహించలేదు. అందుచే కౌసల్య పేరు చెప్పబడినది. రామ = రాముడా్ఙ పూర్వా సన్ధ్యా ప్రవర్తతే = తూర్పు దిక్కునందు కలుగు సంధ్య ప్రవర్తించుచున్నది. నీవు కౌసల్యకు చేసినట్లు ఈ సంధ్యకు కూడ ఉపచారము చేయవలెను. లేదా - ఇంక సూర్యు డుదయింపనున్నాడు. సూర్యునకు వలె నీకును ఇంక శత్రువులను చంప సమయము వచ్చినది. లేదా - పూర్వా సన్ధ్యా ప్రవర్తతే <br/>= అంధకారము పోయినది. తెల్లవారవచ్చినది. నా అజ్ఞానము నశించినది. భగవంతుడవైన నీ దర్శనము కలిగినది. ఉత్తిష్ఠః = లెమ్ము</span>, <span xml:lang="te-IN">నీ నిద్రాకాలలక్ష్మిని (నీవు నిద్రించు సమయమున ఉండు లక్ష్మిని) చూచితిని. ఇక ప్రబోధలక్ష్మిని చూడగోరుచున్నాను. నరశార్దూలః = పురుషశ్రేష్ఠుడా! నరశ్రేష్ఠుడవు కావున </span>‘‘<span xml:lang="te-IN">యద్యదాచరతి శ్రేష్ఠసత్తదేవేతరో జనః</span>’’ <span xml:lang="te-IN">అన్నట్లు నీవును సంధ్యను ఉపాసింపవలసినదే కదా </span>? <span xml:lang="te-IN">లేదా - నీవు ఆశ్రితులను రక్షింపవలెను. దుష్టులను శిక్షింపవలెను. నీకు నిద్రించుట కవకాశమెక్కడిది</span>?</p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">దైవమ్ ఆహ్నికం-కర్తవ్యమ్- దైవమ్ = దేవునిచే</span>, <span xml:lang="te-IN">అనగా సర్వేశ్వరునిచే ఏర్పరుపబడిన</span>, <span xml:lang="te-IN">అహ్నికమ్ = నిత్యకర్మము</span>, <span xml:lang="te-IN">కర్తవ్యమ్ = చేయదగినది. లేదా - ఇచట </span>‘<span xml:lang="te-IN">దేవ</span>’ ‘<span xml:lang="te-IN">శబ్దమునకు</span>’ ‘<span xml:lang="te-IN">నీవు</span>’ <span xml:lang="te-IN">అని అర్థము. దైవమ్ = నీచే ఏర్పరుపబడిన</span>, <span xml:lang="te-IN">ఆహ్నికమ్ కర్తవ్యమ్ = నీ వేర్పరచిన నియమమును నీవే అనుష్ఠింపక పోరాదు కదా అని భావము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">లేదా నేను నీచే ఆజ్ఞాపింపబడిన భగత్పూజనరూప మైన నిత్యకర్మము చేయవలెను కదా. దానిని ప్రతిగ్రహించుటకు లెమ్ము అని భావము. ఇట్లు ఇంకను అనేకార్థములు బుద్ధిమంతు లూహించు కొనవలెను అని గోవిందరాజులు.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">కౌసల్యా సుప్రజాః</span>’’ <span xml:lang="te-IN">అను పదమునకు </span>‘‘<span xml:lang="te-IN">కౌసల్యయొక్క సుపుత్రుడా! </span>’’ <span xml:lang="te-IN">అని అర్థము చెప్పి సంబోధన ప్రథమా విభక్తిగా గ్రహించుటకు వీలులేదు. అపుడు అది </span>‘‘<span xml:lang="te-IN">కౌసల్యా సుప్రజాః</span>’’ <span xml:lang="te-IN">అని కావలెను. అందుచేత </span>‘‘<span xml:lang="te-IN">కౌసల్యా = కౌసల్య</span>, <span xml:lang="te-IN">సుప్రజాః = మంచి సంతానము కలది</span>’’ <span xml:lang="te-IN">ఇత్యాది విధముల అర్థములు కల్పించవలసి వచ్చినది. వాస్తవమున దీనిని ఆర్షప్రయోగముగ గ్రహించి సంబోధన ప్రథమా విభక్తిగా అంగీకరించవచ్చును. పాణినీయ విరుద్ధము లైన ఎన్నో ప్రయోగాలు వాల్మీకిరామాయణంలో ఉన్నవి. ప్రాచ్యపాఠంలో ఈ శ్లోకము పూర్తిగా భిన్నముగా ఉన్నది. </span></p> <p class="Poem2" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">కౌసల్యామాతరుత్తిష్ఠ పూర్వాసంధ్యా ఉపాస్యతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పౌర్వాహ్ణికం విధిం కర్తుం తాత కాలో-యమాగతః</span>’’</p> <p class="Prati" xml:lang="en-GB"> (<span xml:lang="te-IN">ఆ. కాం. </span>26. 2)</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN">3</span></p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> (బా. కాం. </span>73.26)</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">విశేషార్థములు :- </span>1. <span xml:lang="te-IN">ఇయమ్ = ఇదిగో. నీవు పరాక్రమముచేత శివధనస్సు విరచి జయించుకొన్న సీత ఇదిగో. ఈమె రూపసౌందర్యలావణ్యములు చూడుము. సీతా = సీత అనగా నాగటి చాలు</span>, <span xml:lang="te-IN">అందుబుట్టినదగుటచే సీత అను పేరు గలది. ఈమె అనుపమ సౌందర్యాదులు కలది మాత్రమే కాదు. నాగటి చాలునందు పుట్టినది. అయోనిజ. అందుచే ఈమెయందు సమస్తసద్గుణములును ఒప్పి ఉండును.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇయం సీతా :- </span>‘‘<span xml:lang="te-IN">జనకునివద్ద శివధనస్సు ఉన్నది. దానిని వంచిన వానికి అతడు తన కుమార్తె యైన సీత నిచ్చి పెండ్లి చేయును</span>’’ <span xml:lang="te-IN">అని నీవు సిద్ధాశ్రమములో విన్న నాటినుండియు ఏ సీతను చూడవలెనని కుతూహలము చెంది ఉన్నావో </span>‘‘<span xml:lang="te-IN">ఆ సీత ఇదిగో</span>’’ <span xml:lang="te-IN">చూడుము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">లేదా - సీత మెరుపు వంటిది గాన సీతను చూడగానే</span>, <span xml:lang="te-IN">మెరుపును చూచినట్లు రామున కేమియు కనబడలేదు. ఈ విధముగ సీతాశరీరకాంతిని చూడగనే కండ్లు మిరుమిట్లు గొలిపి సీతాశరీరమును చూడజాల కున్న రాముని జూచి జనకుడు </span>‘‘<span xml:lang="te-IN">ఇయం సీతా</span>’’ ‘‘<span xml:lang="te-IN">ఇదిగో సీత</span>’’ <span xml:lang="te-IN">అని చెప్పుచున్నాడు.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">లేదా - సిద్ధాశ్రమములో సీతను గూర్చి విన్నది మొదలు రాముని మనస్సులో సీతా దర్శన కూతూహలము తీవ్రముగా ఉండుటచే </span>‘‘<span xml:lang="te-IN">ప్రాసాదే సా పథి పథి చ సా పృష్ఠతః సా పురః సా</span>’’ (<span xml:lang="te-IN">మేడపైనను ఆమెయే</span>, <span xml:lang="te-IN">ప్రతిమార్గమునందును ఆమెయే</span>; <span xml:lang="te-IN">వెనుకను ఆమెయే. ముందును ఆమెయే) అని చెప్పినట్లు</span>, <span xml:lang="te-IN">విరహిజనులకు భావనావిశేషముచే</span>, <span xml:lang="te-IN">అంతటను</span>, <span xml:lang="te-IN">ప్రియజనము కనబడుచుండును గాన</span>, <span xml:lang="te-IN">అతడు ప్రపంచమంతయు సీతామయముగనే చూచుచుండెను. అందుచే తా నీయ బోవు సీత సరిగా తెలియుటకై జనకుడు </span>‘‘<span xml:lang="te-IN">ఇయం సీతా</span>’’ <span xml:lang="te-IN">అని చెప్పుచున్నాడు.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మమ సుతా = నాకూతురు ఈమె సౌందర్యవతియైనను</span>, <span xml:lang="te-IN">అయోనిజ యైనను</span>, <span xml:lang="te-IN">దుష్టకులనివాసముచే దూషితయను సందేహము వలదు. కర్మఠులమని ప్రసిద్ధి కెక్కిన మాచే పోషింపబడినది కావున జన్మశుద్ధి మాత్రమే కాక కులశుద్ధి కూడ కలిగియున్నది.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">లేదా - నా కూతురు</span>, <span xml:lang="te-IN">నీ వెట్లు దశరథునకు ప్రియకుమారుడవో అట్లే ఈమెయు నాకు ప్రియపుత్రి. కావున ఈమెయందు స్థిర మైన ప్రేమను ఉంచవలెను. సహధర్మచరీ తవ = నీకు ధర్మపత్ని కాగలదు. ఈమె భోగమునకు మాత్రమే అని తలపకుము</span>, <span xml:lang="te-IN">ఈమెతో నీవు ధర్మము లాచరించుచు ఈమెనే ధర్మపత్నిగా చేసికొనుము. అయోనిజత్వ మను జన్మశుద్ధి గల మరొక కన్య లభింపదు. దానితో కులశుద్ధి కూడ ఉన్నది దఞరక దని వేరుగా చెప్పనవసరము లేదు. కావున ఈమెను తప్ప మరెవ్వరిని ధర్మపత్నిగా చేసికొనుట యుక్తము కాదు.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">లేదా - తవ సహధర్మచరీ - నీకు సరి యైన ధర్మ మాచరించునది. అనగా నీవు ఎట్లు</span>, <span xml:lang="te-IN">ఏ ధర్మము నాచరింతువో ఈమెయును అట్లే ఆ ధర్మమును ఆచరించునది. లోకములో ఒకరు మరియొకరి వలె ఉండదు. ఈమె అట్లు కాదు. లోక విలక్షణముగా సర్వధా నీవలెనే ప్రవర్తించును గాన నీకే ఈమె తగినది. ఈమె తప్ప మరి ఏ వనితయు నీకు పత్ని యగుటకు తగదు.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఏనాం ప్రతీచ్ఛ చ = ఈ సీతను ప్రతిగ్రహింపుము. </span>‘<span xml:lang="te-IN">చ</span>’ <span xml:lang="te-IN">కారముచే ధర్మపత్నిగా చేసికొనుము అని అర్థము. ఈమె ఇట్టి లక్షణముకలది గాన</span>, ‘‘<span xml:lang="te-IN">నేను నా పరాక్రమముచే జయించుకొంటిని</span>’’ <span xml:lang="te-IN">అను సాధారణబుద్ధి యుంచక నేను చెప్పినట్లు ఈమెనే ధర్మపత్నిగా వరింపుము.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">తే భద్రమ్ = నీకు మంగళ మగు గాక. ఇట్టి శుభలక్షణములు కలదానిని పెండ్లాడుట వలన నీకు సమస్త మంగళములును ఘటిల్లును. లేదా - దృష్టి దోషము కలుగకుండు గాక.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పాణినాం పాణిం గృహ్ణీష్వ = నీ హస్తముచే ఈమె హస్తమును పట్టుకొనుము. ప్రణయకోపము కలిగిన సందర్భములలో నీ హస్తముతో ఈమె పాదము పట్టుకొనుటయు ఘటిల్లవచ్చును. ఇప్పుడు మాత్రము హస్తమునే పట్టుకొనుము.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">లేదా - సిద్ధాశ్రమములో సీతను గూర్చి వినిన నాటి నుండియు రామునకు సీతపై అనురాగము కలిగి యుండుటచేత భావనాబలముచే సీతకు ప్రణయ కోపము కలిగినట్లు తోచి ఆమె పాదమునే పట్టుకొనుట సంభవించు నని తలచి </span>‘‘<span xml:lang="te-IN">పాణిం గృహ్ణీష్వ పాణినా</span>’’ <span xml:lang="te-IN">అని చెప్పుచున్నాడు.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB">2. <span xml:lang="te-IN">ఎవ్వరును కదల్పజాలని శివధనస్సును రాముడు అనాయాసముగ విరచుటవలనను ఆతని అప్రమేయ మగు రూపమువలనను</span>, <span xml:lang="te-IN">ఆ కాలమునందు కలిగిన సంవిధానవైచిత్య్రము వలనను జనకుడు బ్రహ్మనిష్ఠు డగుట వలనను రాముడు విష్ణుదేవు డనియు</span>, <span xml:lang="te-IN">సీత మహాలక్ష్మి యనియు తెలిసికొని</span>, <span xml:lang="te-IN">ఈ దేవరహస్యము ఇతరులకు తెలియకుండుటకై</span>, <span xml:lang="te-IN">ధ్వనివృత్తిచే సీతారాముల అనాది సంబంధమును సూచించు చున్నాడు - ఇయమ్ = ఇదిగో జగత్సష్ట్యాది కారణభూతుడవును</span>, <span xml:lang="te-IN">సాక్షాద్వష్ణుదేవుడవును అగు నీవు రామ రూపమున అవతరించినట్లే లక్ష్మియు సీతా రూపమున అవతరించి ఉన్నది. చూడుము. మీ దాంపత్యము నిత్యమే యైనను మనుష్య ధర్మము ననుసరించి సీతను శీఘ్రముగ పెండ్లియాడుము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">సీతా = నాగటి చాలున పుట్టుటచే అయోనిజ</span>, <span xml:lang="te-IN">నీవు దేవకార్యార్థమై కౌసల్యా గర్భమున పుట్టినావు. అట్లు పుట్టుకయే లేనిదై నిన్ను అనుసరించుట కై కేవలము మనుష్యత్వము మాత్ర మవలంబించి</span>, <span xml:lang="te-IN">నిన్నే వరించుచు తనకు నీతో నిత్యదాంపత్య మున్నట్లు సూచించుచున్నది.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మమ సుతా - నా కూతురు నా యింటిలో పెరుగుటచే నేను కూతురుగా భావించి నీకిచ్చుచున్నాను.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">తవ సహధర్మచరీ - నీకు ధర్మపత్ని. నీవలెనే ధర్మముల నాచరించునది. నీవలెనే ఉండునది. నీ కవినాభూతయై జగత్సష్ట్యాదులందు నీకు సహకరించుచుండునది.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఏనాం ప్రతీచ్ఛ చ - ఈమెను అంగీకరింపుము. నిత్యపత్నిగా యున్న దైనను ఇపుడు మనుష్యత్వమును అభినయించుటకై అంగీకరింపుము.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">తే భద్రమ్ :- నీకు మంగళమగుగాక నీ వెంత మనుష్యుడవై యున్నను</span>, <span xml:lang="te-IN">జగదీశ్వరుడ వగు నీకు నిత్యసిద్ధయగు ఈమె నిచ్చెదను అని చెప్పుటకు నేను సాహసించినందులకు మన్నింపవలెను.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పాణినా పాణింగృహ్ణీష్వ :- నీ వెల్లప్పుడును వక్ష స్థలముపై ధరించిన వాడవు. ఇపుడు మనుష్య ధర్మము ననుసరించుటకై హస్తమును పట్టుకొనుము. లేదా - నీ విదివర కెన్నిమారులో ప్రణయకోపకాలమునందు హస్తముచే ఈమె పాదము పట్టుకొని యుందువు. ఇప్పుడు చిరవియోగము కలిగినది గాన విరహిజన సాధారణ మైన ఉత్కంఠచే</span>, <span xml:lang="te-IN">ఈమెను అనునయించుటకై పాదములు పట్టెదవేమో. అట్లు చేయకుము. వివాహమునందు మేము చేయునట్లు</span>, <span xml:lang="te-IN">ఇప్పుడు మాత్రము</span>, <span xml:lang="te-IN">చేయి పట్టుకొనుము.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB">3. <span xml:lang="te-IN">ఇయమ్ = ఈ </span>‘‘<span xml:lang="te-IN">ఈమె వీర్యశుల్క. పరాక్రమము చూపి క్రయము చేతవలె కొనబడినది. శివధనువును విరచినందున నాచే జయింపబడినది.</span>’’ <span xml:lang="te-IN">అని అలతిగా తలపకుము. మెరుపు వలె మెరయుచున్నది. </span>‘‘<span xml:lang="te-IN">ఇదిగో.</span>’’ <span xml:lang="te-IN">చూడుము. నీకును గౌరవింప దగినది. నీవెంతగా గౌరవించినను దానికి తగినది.</span></p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">సీతా :- నాగటి చాలున పుట్టినది. నీవు మొదలు సమస్త జంతుజాలమును భరించుచున్న సాక్షాద్భూదేవికి కూతురు. కావున నీవిప్పుడవశ్యము ఈవిడ యందు బహుమానముంచవలెను. భార్యగా నున్నపుడు విశేషము అభిమానముంచవలెనని చెప్పనవసరమే లేదు. మరియు</span>, <span xml:lang="te-IN">సీతా = ఈమె అయోనిజ. నీవు కౌసల్యకు పుట్టినావు. అందుచే ఈమెకును నీకును చాల అంతరమున్నది. అందుచేత కూడ నీవు ఈమె విషయమున చాల గౌరవబుద్ధి ఉంచవలెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB">మమ సుతా = నా కూతురు. రాజరాజు నైన నేను పెంచినది. కావున నాయందుండు గౌరవమును నీవు ఈమె యందు చూపవలెను.</p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB">మమ సుతా = నా కూతురు. నేను బ్రహ్మనిష్ఠుడను. చాల తపస్విని. ఈమెను గౌరవించకున్నచో నాకు కోపము కలుగును. దానిచే నీకు కీడు వాటిల్లును.</p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB">తవ సహధర్మచరీ - నీవు ఈమెను అగ్రపత్నిగా ఉంచుకొనవలెను.</p> <p class="Prati ParaOverride-2" xml:lang="en-GB">ఏనాం ప్రతీచ్ఛ చ - ఈమెను ప్రతిగ్రహింపుము. తే భద్రమ్ - అట్లు మేము చెప్పినట్లు చేసిన నీకు మంగళము కలుగును.</p> <p class="Prati" xml:lang="en-GB">4. <span xml:lang="te-IN">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">ఎవ్వరికిని కదిలింప శక్యము కాని శివధనస్సును రెండుగా విరిచి</span>, <span xml:lang="te-IN">అసదృశపరాక్రమము చూపి నీవు జయించినది ఈమెనే. నీ పరాక్రమమునకు సరి యైనది కాకున్నను కరుణింపవలెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">సీతా = నాగటి చాలున పుట్టినది. తల్లి లేనిది. లోకములో తల్లి కాని బిడ్డపై ప్రేమ హెచ్చుగా చేయుదురు. నీవును ఈమె యందు దయయుంచవలెను.</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మమ సుతా = నా కూతురు. నేను పెంచినవాడను మాత్రమే. నేను బ్రహ్మనిష్ఠుడను గాన నావలన పెంపుడు సౌఖ్యము ఈమెకు కలిగియుండదు. నేను బ్రహ్మనిష్ఠుడ నగుటచే</span>, <span xml:lang="te-IN">నీవు ఈమె నుపేక్షించినను విచారించువారు లేక పోవుటచే అట్లు చేయక</span>, <span xml:lang="te-IN">ఈమెపై దృఢమగు ప్రేమ నుంచవలెనని ఇప్పుడే చెప్పుచున్నాను.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">తవ సహధర్మచరీ :- నీవు ఈమెను ధర్మపత్నిగా గ్రహించిన చాలును. మేము కర్మఠులము కావున అదియే మాకు ప్రార్థనీయము. </span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఏనాం ప్రతీచ్ఛ :- ఈమెను అంగీకరింపుము. చాల గౌరవము గల తలిదండ్రు లివ్వగా గ్రహించుటకు తామే త్వరపడుదురు. ఇట్టి కన్యను గ్రహించుటకు కొంత ప్రార్థించిననే గాని కాదని అర్థము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">తే భద్రమ్ :- నీకు మంగళము అగుగాక. ఇట్టి వారియందు ప్రేమ ఉంచుటవలనను</span>, <span xml:lang="te-IN">బ్రహ్మనిష్ఠుల మైన మా మాట వినుట వలనను నీకు మంగళము కలుగును (గోవింద రాజ మహేశ్వర తీర్థులు).</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB">5. (<span xml:lang="te-IN">తనిశ్లోకి) ఇయమ్:-ఇదిగో</span>, <span xml:lang="te-IN">రూపసౌందర్యములచే నేనే గొప్ప వాడనని అనుకొనకుము. నీవలె సౌందర్యము గల ఈ సీతను చూడుము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">సీతా = నాగటి చాలున పుట్టినది. బంగారు తీగెయు భూమియందే పుట్టును. బంగారు తీగెవంటిది గాన భూమియందు పుట్టినది. ఈ విధముగ అయోనిజగాన ఆభిజాత్యాదు లను గూర్చి విచారింప బనిలేదు.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మమ సుతా = నా కొమార్తె</span>, <span xml:lang="te-IN">ఇట్టి దానిని పెంచుటచే నేను ధన్యుడనైతిని.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">తవ సహధర్మచరీ :- నీకు </span>‘‘<span xml:lang="te-IN">కూడ ధర్మమాచరించునది</span>’’ <span xml:lang="te-IN">ధర్మమాచరించుటకు సహాయురాలు. నీవు చేయు ధర్మములకు సహాయురాలు. నీవు చేయు ధర్మములకు ప్రవర్తకురాలు.</span></p> <p class="Prati" xml:lang="en-GB">ఏనాం ప్రతీచ్ఛ :- నిన్ను వరించియున్న ఈమెను విడిచి పెట్టక ఆదరించి గ్రహింపుము.</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">భద్రం తే :- నీకు మంగళమగు గాక. ముందు ప్రార్థింపబోవు కార్యము విషయమున అనుకూలుడ వగుము.</span></p> <p class="Prati" xml:lang="en-GB">పాణినా పాణిం గృహ్ణీష్వ :- హస్తముచే హస్తము పట్టుకొనుము. ఎవ్వరికిని కదిలించుటకు కూడ శక్యము కాని శివధనస్సును లీలగా విరచిన హస్తము కలవాడవు నీవు. సీత హస్తము అతిమృదులము. కావున సరిగా పట్టుకొనుము.</p> <p class="Prati" xml:lang="en-GB">6. (<span xml:lang="te-IN">మరికొందరి వ్యాఖ్య) ఇయమ్ = ఈ </span>; <span xml:lang="te-IN">నిన్ను విడువనప్పుడు మాత్రమే ఈమె జీవించియుండగలదు. </span>‘‘<span xml:lang="te-IN">ఆర్తార్తే ముదితే హృష్టా ప్రోషితే మలినా కృశా</span>, <span xml:lang="te-IN">మృతే మ్రియేత యా నారీ సా స్త్రీ జ్ఞేయా పతివ్రతా</span>’’ (<span xml:lang="te-IN">ఏ స్త్రీ భర్త దుఃఖితుడైనపుడు దుఃఖించునో</span>, <span xml:lang="te-IN">సంతుష్టుడైనపుడు సంతోషించునో</span>, <span xml:lang="te-IN">అతడు ప్రవాసములో నున్నపుడు మలినయై కృశించునో</span>, <span xml:lang="te-IN">మరణించునపుడు మరణించునో ఆమె పతివ్రత) అని చెప్పినట్లు సాధారణపతివ్రతయే భర్తను విడచి యుండజాలనప్పుడు శాస్త్రములలో చెప్పిన సర్వలక్షణములు కలిగి లోకవిలక్షణయై</span>, <span xml:lang="te-IN">సర్వోత్తమురాలుగా ఉన్న ఈమె విషయము చెప్పవలెనా </span>?</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">నీ ఆత్మయనియు</span>, <span xml:lang="te-IN">నీ శరీరమనియు</span>, <span xml:lang="te-IN">నీ ఛాయయనియు వేదములలో చెప్పబడినది కావున ఈమె నిర్దోషయే. ఒకవేళ దోషమున్నను అది నీదే కదా </span>? <span xml:lang="te-IN">స్వాత్మదోషము కాని</span>, <span xml:lang="te-IN">స్వశరీర దోషము కాని</span>, <span xml:lang="te-IN">స్వచ్ఛాయా దోషము కాని</span>, <span xml:lang="te-IN">తనదే అగును కదా ! నీ వెట్లు నిర్దోషుడవో ఈమెయు అట్లే నిర్దోషురాలు.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">సీతా :- నాగటి చాలున పుట్టినది. </span>‘‘<span xml:lang="te-IN">మాతరమఙ్గనాః</span>’’ (<span xml:lang="te-IN">స్త్రీలు తల్లిని పోలియుందురు) అని చెప్పినట్లు భూదేవి కుమార్తె అగుటచే ఈమె యందు క్షమాది సద్గుణములన్నియు ఉన్నవని చెప్ప పని లేదు.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మమ సుతా :- నా కుమార్తె</span>, <span xml:lang="te-IN">భూమి కుమార్తె యైనను నేను పురాకృత పుణ్యవశముచేత ఈమెను పెంచినవాడ నగుటవలన నీ కిచ్చు చున్నాను.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఏనాం ప్రతీచ్ఛ చ :- ఇట్టి దానిని అంగీకరింపుము. ఇట్టి దానిని నీవంటి ప్రాజ్ఞులు తామే కోరుదురు. </span>‘<span xml:lang="te-IN">కావున అంగీకరింపుమని చెప్పుటగూడ ఉపచారార్థమే</span>’.</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">భద్రం తే :- నీకు మంగళమగు గాక. ఈమెయందు ఇట్టి సల్లక్షణము లుండుట నీకే ఫలము. భోగ్యపదార్థము పుష్కలముగా నున్నచో భోక్తకే కదా ఫలము లభించును!</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పాణినా పాణిం గృహ్ణీష్వ :- నీ హస్తముచే ఈమె హస్తమును గ్రహింపుము. సీత ముగ్ధ గావున చేయి చాచి నీ చేయి పట్టుకొనజాలదు. కావున నీవే పట్టుకొనుము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">వ్యాఖ్యాతలు ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఊహించి వాల్మీకికి ఆపాదించినారు. వినే వారికి ఓపిక ఉండవలెను గాని వాగ్ధాటి గలవారు ఇంకా ఎన్నెన్నో అర్థాలు చెప్ప వచ్చును. జనకుడు లక్ష్మణుని ఉద్దేశించి కూడ -</span></p> <p class="Poem2" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళాముద్యతాం మయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ప్రతీచ్ఛ పాణి గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః</span>’’</p> <p class="Prati" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">బా. కా. </span>73. 30</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">అని చెప్పినాడు. దానికి వ్యాఖ్యాత లీ యర్థాలేవీ చెప్పలేదు. పఠితలు స్వయముగనే ఊహించుకొనగలరని విడిచినారేమో! </span></p> <p class="Prati" xml:lang="en-GB"> ప్రాచ్య పాఠంలో ఈ శ్లోకం (ఇయం సీతా అనునది) మరొక విధంగా ఉన్నది.</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">గృహాణ పాణినా పాణిం త్వమస్యా రఘునన్దన</span>’’</p> <p class="Prati" xml:lang="en-GB"> (<span xml:lang="te-IN">ఆ. కాం. </span>75. 19)</p> <p class="Prati" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">ఈ శ్లోకం తరువాత దాక్షిణాత్య పాఠంలో ఉన్న -</span></p> <p class="Poem2" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా</span>’’</p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">అను వాక్యము ప్రాచ్యపాఠంలో లేదు.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN"></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter