Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_191-200</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/3/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/3/css/idGeneratedStyles_9.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_191-200" xml:lang="en-GB"> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">ఏకనవత్యధిక శతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Tat"><span class="CharOverride-2">భరద్వాజ ఉవాచ </span>- భరద్వాజు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">దానస్య కింఫలం ప్రాహు ర్ధర్మస్య చరితస్య చ, </p> <p class="Poem2">తపసశ్చ సుతప్తస్య స్వాధ్యాయస్య హుతస్య వా 1 </p> <p class="Tat">దానము, చక్కగా ఆచరించిన ధర్మము, మిక్కిలి శ్రద్ధతో చేసిన తపస్సు. స్వాధ్యాయము, హోమకార్యము అనువాని ఫలము ఏమని చెప్పుదురు? </p> <p class="Tat"><span class="CharOverride-2">భృగు రువాచ </span>- భృగు విట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-1">హుతేన శామ్యతే పాపం స్వాధ్యాయైః శాన్తి రుత్తమా, </p> <p class="Poem2">దానేన భోగా నిత్యాహు స్తపసా స్వర్గ మాప్నుయాత్. 2 </p> <p class="Tat">హుతముచేత పాపమణగును. వేదాధ్యయనములచేత ఉత్తమమగుశాంతి లభించును. దానముచేత భోగములు కలుగును. తపస్సుచేత నరుడు స్వర్గమును పొందును. </p> <p class="Poem-1 ParaOverride-1">దానం తు ద్వివిధం ప్రాహుః పరత్రార్థ మిహైవ చ, </p> <p class="Poem2">సద్భ్యో యద్దీయతే కిఞ్చి త్తత్పర త్రోపతిష్ఠతే. 3 </p> <p class="Tat">దానము రెండు విధములని చెప్పుదురు. పరలోకము కొఱకు, ఈ లోకము కొరకును అని. ఉత్తమ గుణములు కలవారి కిచ్చిన దేకొంచెమైనను అది పరలోకమునందు నిలుచును. </p> <p class="Poem-1">అసద్భ్యో దీయతే యత్తు తద్దాన మిహ భుజ్యతే, </p> <p class="Poem2">యాదృశం దీయతే దానం తాదృశం ఫలమశ్నుతే. 4 </p> <p class="Tat">చెడునడవడి కలవారి కిచ్చినది ఈ లోకమునందే అనుభవమునకు వచ్చునది. ఏ విధమగు దానము చేసినచో ఆ విధమగు ఫలము కలుగును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భరద్వాజ ఉవాచ</span> - భరద్వాజు డిట్లనెను. </p> <p class="Poem2 ParaOverride-2">కిం కస్య ధర్మాచరణం కిం వా ధర్మస్య లక్షణమ్, </p> <p class="Poem2">ధర్మః కతివిధో వాఽపి తద్భవాన్ వక్తు మర్హతి. 5 </p> <p class="Tat ParaOverride-3">ఏది ఎవనికి ధర్మాచరణ మగును? ధర్మము లక్షణమేమి? ధర్మము ఎన్ని విధములైనది? దీనిని తమరు చెప్పవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భృగు రువాచ </span>- భృగు విట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-3">స్వధర్మాచరణే యుక్తా యే భవన్తి మనీషిణః, </p> <p class="Poem2">తేషాం స్వర్గఫలావాప్తి ర్యోఽన్యథా స విముహ్యతి. 6 </p> <p class="Tat ParaOverride-1">ఏ బుద్ధిశాలులు తమ ధర్మము నాచరించుటయందు శ్రద్ధ గలవారో వారికి స్వర్గ ఫలము లభించును. వేరు విధముగా చేయువాడు మోహము నందును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భరద్వాజ ఉవాచ </span>- భరద్వాజు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">యదేత చ్చాతురాశ్రమ్యం బ్రహ్మర్షి విహితం పురా </p> <p class="Poem2">తేషాం స్వేస్వే సమాచారా స్తన్మే వక్తు మిహార్హసి. 7 </p> <p class="Tat">మునుపు బ్రహ్మర్షు లేర్పరచిన నాలుగు ఆశ్రమముల ధర్మమును, వారికి ఆయా ఆశ్రమములందు పాటింపదగిన చక్కని ఆచారములను, నాకు తమరు తెలుపవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భృగు రువాచ </span>- భృగు విట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-1">పూర్వమేవ భగవతా బ్రహ్మణా లోకహిత మనుతిష్ఠతా ధర్మ సంరక్షణార్థ మాశ్రమా శ్చత్వారోఽభి నిర్దిష్టాః- </p> <p class="Tat">మొదటనే భగవంతుడు బ్రహ్మ లోకహితమును చేయగోరినవాడై ధర్మ సంరక్షణము కొరకు నాలుగు ఆశ్రమములను ఏర్పరచెను. </p> <p class="Poem-1">తత్ర గురుకులవాస మేవ ప్రథమ మాశ్రమ ముదాహరన్తి. </p> <p class="Tat">అందు గురుకులవాసమే మొదటి ఆశ్రమముగా చెప్పుదురు. </p> <p class="Poem2">సమ్యగ్యత్ర శౌచ సంస్కార నియమవ్రత వినియతాత్మా ఉభే సన్ద్యే భాస్కరాగ్ని దైవతాన్యుపస్థాయ, విహాయ తన్ద్రాలస్యే, గురోరభివాదన వేదాభ్యాసశ్రవణ పవిత్రీకృతాంత రాత్మా త్రిషవణ ముపస్పృశ్య బ్రహ్మచర్యాగ్ని పరిచరణ గురుశుశ్రూషా నిత్యభిక్షా భైక్ష్యాది సర్వనివేదితాంతరాత్మా గురువచన నిర్దేశానుష్ఠానా ప్రతికూలో గురుప్రసాద లబ్ధస్వాధ్యాయతత్పరః స్యాత్. 8 </p> <p class="Tat">ఇందు సరిగా శౌచము సంస్కారము నియమములు, వ్రతములు మొదలగు వానిచేత మనస్సును అదుపున నుంచుకొన్నవాడును, రెండు సంధ్యలయందును సూర్యుడు, అగ్ని, దేవతలు అనువానిని ఉపాసించి, కునుకుపాటు, సోమరితనములను వదలివైచి,గురువునకు అభివాదనము చేయుట, వేదముల నభ్యసించుట, వినుట అనువానిచేత పవిత్రత నందిన అంతరాత్మ కలవాడును, మూడు సమయములలో స్నానముచేయుచు, బ్రహ్మచర్యము, అగ్నిపూజ, గురుశుశ్రూష, నిత్యభిక్ష చేయువాడును, భిక్షావృత్తితో వచ్చిన దానిని సర్వమును గురువునకు/దైవమునకు నివేదించెడు బుద్ధి కలవాడును, గురువుల వాక్యములు నిర్దేశించినదానిని ఆచరించుటలో వ్యతిరేకభావము లేనివాడును, గురువు అనుగ్రహముతో పొందిన వేద విద్యయందు శ్రద్ధ కలవాడును కావలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భవతి చాత్ర శ్లోకః</span> - ఇచట నొక శ్లోకము కలదు. </p> <p class="Poem-1">గురుం యస్తు సమారాధ్య ద్విజో వేద మవాప్నుయాత్, </p> <p class="Poem2">తస్య స్వర్గఫలావాప్తిః సిధ్యతే చాస్య మానసమ్. – ఇతి 9</p> <p class="Tat"> గురువును చక్కగా ఆరాధించిన ద్విజుడు వేదమును పొందును. అతనికి స్వర్గఫలము లభించును. దానివలన మానససిద్ధిని పొందును. </p> <p class="Poem-1">గార్హస్థ్యం ఖలు ద్వితీయ మాశ్రమం వదన్తి. </p> <p class="Tat">గృహస్థ స్థితిని రెండవ ఆశ్రమముగా పలుకుదురు. </p> <p class="Poem-1">తస్య సముదాచార లక్షణం సర్వ మను వ్యాఖ్యాస్యామః. </p> <p class="Tat">దాని సముదాచార లక్షణము నంతటిని వరుసగా వ్యాఖ్యానించెదము. </p> <p class="Poem-1">సమావృత్తానాం సదాచారాణాం సహ ధర్మచర్య ఫలార్థినాం గృహా శ్రమో విధీయతే. </p> <p class="Tat">గురుకుల విద్యను ముగించుకొని సదాచారము కలవారై సహధర్మ చర్య ఫలమును కోరువారికి గృహాశ్రమమును శాస్త్రము విధించినది. </p> <p class="Poem2 ParaOverride-2">ధర్మార్థ కామావాప్తి ర్హ్యత్ర త్రివర్గ సాధన మపేక్ష్య అగర్హితేన కర్మణా ధనాన్యాదాయ స్వాధ్యాయోపలబ్ధప్రకర్షేణ వా బ్రహ్మర్షినిర్మితేన వా అద్రిసారగతేన వా, హవ్యకవ్య నియమాభ్యాస దైవత ప్రసాదోపలబ్ధేన వా ధనేన గృహస్థో గార్హస్థ్యం వర్తయేత్. </p> <p class="Tat ParaOverride-1">ధర్మము, అర్థము, కామము అనువానిని పొందుట యెందు గలదో అది గార్హస్థ్యము. మూడింటి వర్గమునకు సాధనమును కోరి ఎవ్వరు నిందింపని కర్మముతో ధనములను గ్రహించి దీనిని నిర్వహింపవలయును. వేదాధ్యయనము చేయుటచేత లభించిన మహిమచేతనో, బ్రహ్మర్షులు నిర్మించిన విధానము చేతనో, మణులు, దివ్యౌషధములు మొదలగువానిచేతనో, హవ్యము, కవ్యము, నియమము, అభ్యాసము, దేవతా ప్రసాదము మొదలగు వానివలన దొరకిన దానిచేతనో అయిన ధనములతో గృహస్థుడు గృహస్థ ధర్మమును నిర్వహింపవలయును. </p> <p class="Poem-1 ParaOverride-3">తద్ధి సర్వాశ్రమాణాం మూల ముదాహరన్తి. </p> <p class="Tat ParaOverride-1">దానిని తక్కిన ఆశ్రమము లన్నింటికి కుదురుగా చెప్పుదురు. </p> <p class="Poem-1 ParaOverride-1">గురుకుల నివాసినః పరివ్రాజకా యే చాన్యే సంకల్పితవ్రత నియమ</p> <p class="Poem2">ధర్మానుష్ఠాయిన స్తేషా మప్యత ఏవ భిక్షాబలి సంవిభాగాః ప్రవర్తన్తే. 10 </p> <p class="Tat ParaOverride-1">గురుకులములందు నివసించెడు బ్రహ్మచారులు, పరివ్రాజకులు, ఇంకను మరియు సంకల్పించిన వ్రతనియమ ధర్మములను అనుష్ఠించువారును ఎవరెవరు కలరో వారికి ఈగృహస్థుని నుండియే భిక్షలో బలిలో భాగములు ఏర్పడుచున్నవి. </p> <p class="Poem-1 ParaOverride-1">వానప్రస్థానాం చ ద్రవ్యోపస్కార ఇతి ప్రాయశః ఖల్వేతే సాధవః</p> <p class="Poem2">సాధు పథ్యౌదనాః స్వాధ్యాయ ప్రసఙ్గిన స్తీర్థాభిగమన దేశదర్శనార్థం పృథివీం పర్యటన్తి. </p> <p class="Tat">ఇక వానప్రస్థులకు ద్రవ్యము కూడబెట్టుట ఉండరాదు. సాధారణముగా వీరు సాధువులు, మంచిది, పథ్యమైనది అగు ఆహారము కలవారు. స్వాధ్యాయమును గూర్చియే ప్రసంగము కలవారు. తీర్థములను సేవించుకొరకును, ఆయా ప్రదేశములను దర్శించుట కొరకును భూమిపై తిరుగుచుందురు. </p> <p class="Poem-1">తేషాం ప్రత్యుత్థానాభివాదనానసూయ వాక్ర్పదాన సుఖ శక్త్యాసన </p> <p class="Poem2">సుఖశయనాభ్యవహార సత్ర్కియా చేతి. 11 </p> <p class="Tat">వారికి లేచి ఎదురేగి అభివాదనము, అసూయలేని మంచి మాటలాడుట, సుఖశక్తితో ఆసనము, మంచిశయనము, భోజనము మొదలగునవి కూర్చి సత్కారము చేయవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భవతి చాత్ర శ్లోకః </span></p> <p class="Tat">ఇచట నొక శ్లోకము కూడ కలదు. </p> <p class="Poem-1">అతిథి ర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే, </p> <p class="Poem2">స దత్వా దుష్కృతం తస్మై పుణ్య మాదాయ గచ్చతి. 12 </p> <p class="Tat">ఎవని యింటనుండి అతిథి ఆశాభంగము పొంది మరలిపోవునో అతని కతడు పాపము నొసగి అతని పుణ్యమును గైకొని పోవును. </p> <p class="Poem-1">అపి చాత్ర యజ్ఞ క్రియాదిభి ర్దేవతాః ప్రీయన్తే నివాపేన పితరో విద్యాభ్యాస </p> <p class="Poem2">శ్రవణధారణేన ఋషయః అపత్యోత్పాదనేన ప్రజాపతి రితి. 13 </p> <p class="Tat">మరియు నిందు (గృహస్థ ధర్మము నందు) యజ్ఞ క్రియ మొదలగువాని చేత ఋషులు, పితృతర్పణముచేత పితృదేవతలు, విద్యాభ్యాసము, శ్రవణము, ధారణములచేత ఋషులు, సంతానమును పొందుటచేత ప్రజాపతియు ప్రీతు లగుదురు. </p> <p class="Tat"><span class="CharOverride-2">శ్లోకౌ చాత్ర భవతః </span></p> <p class="Tat">ఇందు రెండు శ్లోకములు కలవు.</p> <p class="Poem-1">వాత్సల్యా త్సర్వభూతేభ్యో వాచ్యాః శ్రోత్రసుఖా గిరః, </p> <p class="Poem2">పరితాపోపఘాతశ్చ పారుష్యం చాత్ర గర్హితమ్. 14 </p> <p class="Tat">సర్వభూతముల యెడలను వాత్సల్యభావమువలన చెవికింపైన పలుకులను పలుకవలయును. బాధించుట, పీడించుట, పరుషముగా నుండుట అనునవి ఇందు దోషము. </p> <p class="Poem-1">అవజ్ఞాన మహంకారో దంభశ్చైవ విగర్హితః, </p> <p class="Poem2">అహింసా సత్య మక్రోధః సర్వాశ్రమగతం తపః . 15 </p> <p class="Tat">అవమానించుట, అహంకరించుట, దంభము ఇందు నిందితములు. అహింస, సత్యము, క్రోధము లేకుండుట అనునది అన్ని ఆశ్రమములకు చెందిన తపస్సు. </p> <p class="Poem-1">అపి చాత్ర మాల్యాభరణ వస్త్రాభ్యంగ నిత్యోపభోగ నృత్యగీత వాదిత్ర</p> <p class="Poem2">శ్రుతిసుఖ నయనాభి రామదర్శనానాం ప్రాప్తి ర్భక్ష్య భోజ్య లేహ్య </p> <p class="Poem2">పేయచోష్యాణా మభ్యవహార్యాణాం వివిధానా ముపభోగః స్వ విహార </p> <p class="Poem2">సంతోషః కామసుఖా వాప్తి రితి. 16 </p> <p class="Tat">మరియు నిందు మాల్యములు, ఆభరణములు, వస్త్రములు, తలంటు స్నానము, నిత్య భోగములు, నృత్యము, గీతములు, వాద్యములు, చెవికింపైన, కనుటకు మనోహరమైన వాని దర్శనములు లభించుటయు, భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, పేయములు, చోష్యము అను పెక్కింటి భోజన పదార్థముల ఉపభోగము, తమ విహారములకు సంబంధించిన సంతోషము, కామ సుఖము లభించుట అనునవి కలుగును. </p> <p class="Poem-1">త్రి వర్గగుణ నిర్వృత్తి ర్యస్య నిత్యం గృహాశ్రమే, </p> <p class="Poem2">స సుఖాన్యనుభూయేహ శిష్టానాం గతి మాప్నుయాత్. 17 </p> <p class="Tat">మూడింటి సముదాయముతో కూడి గుణములు కృతార్థతయు గృహస్థాశ్రమమున ఎవనికి సర్వకాలములందును కలుగునో అతడు ఇచట సుఖము లన్నింటి ననుభవించి పిదప శిష్టులగతిని పొందును. </p> <p class="Poem-1">ఉఞ్ఛ వృత్తి ర్గృహస్థా యః స్వధర్మాచరణే రతః, </p> <p class="Poem2">త్యక్త కామ సుఖారంభః స్వర్గ స్తస్య న దుర్లభః . 18 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహా భారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి <br/>భృగుభరద్వాజ సంవాదే ఏకనవత్యధికశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">గింజలేరుకొని తిను బ్రతుకు తెరువుగల గృహస్థుడు తన ధర్మము నాచరించుటలో ఆసక్తి కలవాడై కామసుఖములకు సంబంధించిన పనులు వదలి వైచినచో అతనికి స్వర్గము దుర్లభము కాదు. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున భృగు <br/>భరద్వాజ సంవాదము గల నూట తొంబది యొకటవ అధ్యాయము.</p> <p class="Tat"><span class="CharOverride-2">భృగు రువాచ : </span>భృగు విట్లు పలికెను. </p> <p class="Poem3">వానప్రస్థాః ఖల్వపి ధర్మమనుసరన్తః పుణ్యాని తీర్థాని నదీ ప్రస్రవణాని సువివిక్తే ష్వరణ్యేషు మృగ మహిష వరాహ శార్దూల వనగజా కీర్లేషు తపస్యన్తోఽను సంచరన్తి. త్యక్త గ్రామ్య వస్త్రా భ్యవహా రోపభోగా వన్యౌషధి ఫలమూల పర్ణ పరిమిత విచిత్ర నియతాహారాః స్థానాసనినో భూమిపాషాణ సికతా శర్కరా వాలుకా భస్మశాయినః, కాశకుశచర్మ వల్కల సంవృతాంగాః కేశశ్మశ్రు నఖ రోమ ధారిణో, నియతకాలోపస్పర్శనా అస్కన్దిత కాలబలి హోమానుష్ఠాయినః సమిత్కుశ కుసుమాపహార సంమార్జన లబ్ధ విశ్రామాః శీతోష్ణ వర్షపవన విష్టంభ విభిన్న సర్వత్వచః వివిధ నియమోపభోగ చర్యానుష్ఠాన విహిత పరిశుష్క మాంసశోణిత త్వగస్థిభూతా ధృతిపరాః సత్త్వయోగా చ్ఛరీరాణ్యుద్వహన్తే. 1 </p> <p class="Tat">వానప్రస్థులును ధర్మముననుసరించుచు పుణ్యతీర్థములను నదీప్రవాహములను సేవించుచు, పూర్తిగా ఏకాంతము గల అరణ్యములయందు - లేళ్లు, దున్నలు, అడవి పందులు, పెద్దపులులు, అడవి యేనుగులు మొదలగువానితో నిండియున్న అరణ్యములందు - తపస్సు చేసికొనుచు తిరుగుచుందురు. గ్రామములకు చెందిన వస్త్రములను భోజనములను వదలివైచి అడవులలో దొరకెడు తృణలతలు, పండ్లు, ఆకులు మొదలగు వానితో పరిమితము, విచిత్రము, నియతమునగు ఆహారము కలవారై యుందురు. నేలయే ఆసనము, భూమి,రాలు, ఇసుక, గులకరాల నేల, రాలతో నిండిన నేల, బూడిద అను వానియందు పడు కొందురు. రెల్లు, దర్భ, చర్మము, నారబట్టలు అనువానితో దేహమును కప్పుకొందురు. జుట్టు, గడ్డములు, గోళ్లు, రోమములను ధరింతురు. నిర్ణయించిన కాలమందు స్నానములు చేయుచుందురు. హద్దుమీరని కాలమున బలి, హోమము అనువాని ననుష్ఠింతురు. సమిధలు, దర్భలు, పూవులు తెచ్చుట, ఊడ్చుట అనువానిచేత విశ్రాంతిని పొందుదురు. చలి, వేడి, వాన, గాలి అనువానిని విలాసముగా సహించుటచేత పగుళ్లు వారిన చర్మము గలిగియుందురు. పెక్కువిధములగు నియమములతో కూడిన భోజనముల చేతను, అనుష్ఠానముల చేతను బాగుగా ఎండి పోయిన మాంసము, రక్తము, చర్మము, ఎముకలు కలిగియుందురు. ధైర్యమును విడనాడరు. సత్యయోగము వలన శరీరములను నిలుపుకొని యుందురు. </p> <p class="Poem-1">యస్త్వేతాం నియత శ్చర్యాం బ్రహ్మర్షి విహితాం చరేత్, </p> <p class="Poem2">స దహేదగ్నివ ద్దోషాన్ జయే ల్లోకాంశ్చ దుర్జయాన్. 2 </p> <p class="Tat">నియమము తప్పక, బ్రహ్మర్షులు ఏర్పరచిన ఈ వానప్రస్థచర్యను ఆచరించు వాడు, అగ్నివలె, అన్ని దోషములను కాల్చివేయును, గెలువనలవి కాని లోకములను కూడ గెలుచును. </p> <p class="Poem-1 ParaOverride-3">పరివ్రాజకానాం పునరాచారః తద్యథా విముచ్యాగ్ని ధన కలత్ర </p> <p class="Poem2">పరిబర్హణం సంగేష్వాత్మనః స్నేహపాశా నవధూయ పరివ్రజన్తి. </p> <p class="Tat ParaOverride-5">ఇక పరివ్రాజకుల ఆచారము ఎట్టిదనగా వారు అగ్ని, ధనము, భార్య, శయ్యమొదలగు భోగ సామగ్రి అనువానిని వదలివైచి తగులముల యందు తనకున్న స్నేహ పాశమును త్రెంచి వైచుకొని తిరుగుచుందురు. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-3">సమలోష్ఠాశ్మకాంచనా స్త్రి వర్గ ప్రవృత్తే ష్వసక్తబుద్ధయోఽ రిమిత్రోదాసీనానాం తుల్యదర్శనాః స్థావర జరాయుజాండజ స్వేదజోద్భిజ్జానాం భూతానాం వాఙ్మనః క</span><span class="CharOverride-3">ర్మభి రనభిద్రోహిణోఽ నికేతాః పర్వత పులిన వృక్షమూల దేవతాయతనా న్యను చరన్తో వాసార్థ ముపేయు</span><span class="CharOverride-3"> ర్నగరం గ్రామం వా నగరే పఞ్చరాత్రికాః గ్రామే చైకరాత్రికాః ప్రవిశ్య చ ప్రాణ ధారణార్థం ద్విజాతీనాం భవనా న్యసంకీర్ణ కర్మణా ముపతిష్ఠేయుః </span><span class="CharOverride-3">పాత్రపతితాయాచిత భైక్ష్క్ష్యాః కామక్రోధ దర్పలోభ మోహ కార్పణ్యదంభ పరివాదాభిమాన హింసాని</span><span class="CharOverride-3">వృత్తా ఇతి.</span><span class="CharOverride-3"> 3 </span></p> <p class="Tat ParaOverride-1">మట్టి బెడ్డ, రాయి, బంగారము అనువానియందు ఒకే విధమగు భావన కలవారు, ధర్మార్థ కామముల ప్రవృత్తులయందు తగులము లేని బుద్ధి కలవారు, శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అనువారిని ఒకే విధముగా చూడగలవారు, స్థావరములు, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్జములు అను ప్రాణులకు మాటతో గాని మనసుతో గాని చేష్టతో గాని ద్రోహము చేయనివారు, ఇల్లు లేని వారు, కొండలు, ఇసుకతిప్పలు, చెట్లమొదళ్లు, దేవాలయములు, అనువాని యందు తిరుగుచుండువారు, ఎప్పుడైన ఉండుటకై నగరమునో గ్రామమునో చేరినను నగరమునందు అయిదు రాత్రుల కాలము, గ్రామమునందు ఒక్క రాత్రి కాలము అను నియమముతో ప్రాణధారణకై, సంకరము పొందని కర్మములు గల ద్విజుల యిండ్లయందు, పాత్రలోపడిన, అడుగుకొనని భిక్షాపదార్థమును మాత్రము భుజించువారు, కామము, క్రోధము, లోభము, మోహము, దీనత, పొగరు, నిందించుట, అభిమానము, హింస అనువానిని విడచివైచినవారు. (పరివ్రాజకులు). <span class="CharOverride-2">భవన్తి చాత్ర శ్లోకాః </span></p> <p class="Tat">ఇచట కొన్ని శ్లోకములు కలవు. </p> <p class="Poem-1 ParaOverride-1">అభయం సర్వభూతేభ్యో దత్వా యశ్చరతే మునిః, </p> <p class="Poem2">న తస్య సర్వభూతేభ్యో భయ ముత్పద్యతే క్వచిత్. 4 </p> <p class="Tat ParaOverride-1">మునియై సర్వభూతములకు అభయమొసగి ప్రవర్తించుమనుజునకు సర్వభూతములవలనను ఎందును భయము కలుగదు. </p> <p class="Poem-1 ParaOverride-6">కృత్వాగ్ని హోత్రం స్వశరీర సంస్థం </p> <p class="Poem2 ParaOverride-7">శారీర మగ్నిం స్వముఖే జుహోతి, </p> <p class="Poem2">విప్రస్తు భైక్ష్యోపగతై ర్హవిర్భి </p> <p class="Poem2 ParaOverride-2">శ్చితాగ్నినాం సవ్రజతే హి లోకమ్. 5 </p> <p class="Tat">తన శరీరమందున్న అగ్నిని ఏర్పరచుకొని శరీరమునందలి అగ్నిని భిక్షవలన వచ్చిన హవిస్సులతో తన ముఖమున వ్రేల్చుకొనువాడు చితాగ్నుల లోకములను పొందును. </p> <p class="Poem-1">మోక్షాశ్రమం యశ్చరతే యథోక్తం </p> <p class="Poem2 ParaOverride-2">శుచిః సుసంకల్పిత ముక్తబుద్ధిః, </p> <p class="Poem2 ParaOverride-2">అనిన్దనం జ్యోతి రివ ప్రశాన్తం </p> <p class="Poem2 ParaOverride-2">స బ్రహ్మలోకం శ్రయతే మనుష్యః . 6 </p> <p class="Tat">శాస్త్రము చెప్పిన విధముగా శుచియై చక్కగా వదలివైచిన సంకల్పముగల బుద్ధి కలవాడై మోక్షాశ్రమధర్మము నాచరించువాడు ఇంధనములేని జ్యోతివలె ప్రశాంతమగు బ్రహ్మలోకమును చేరుకొనును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భరద్వాజ ఉవాచ </span>- భరద్వాజు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">అస్మాల్లోకాత్పరో లోకః శ్రూయతే నోపలభ్యతే, </p> <p class="Poem2">తమహం జ్ఞాతు మిచ్ఛామి తద్భవాన్ వక్తు మర్హతి. 7 </p> <p class="Tat">ఈ లోకముకంటె వేరైన లోక మొకటి వినవచ్చుచున్నది. కాని దొరకుటలేదు. దానిని నేను తెలిసికొనగోరుచున్నాను. దానిని తమరు నాకు చెప్పవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భృగు రువాచ </span>- భృగు విట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-1">ఉత్తరే హిమవత్పార్శ్వే పుణ్యే సర్వగుణాన్వితే, </p> <p class="Poem2">పుణ్యః క్షేమ్యశ్చ కామ్యశ్చ సపరో లోక ఉచ్యతే. 8 </p> <p class="Tat ParaOverride-1">ఉత్తరదిక్కునందు హిమవత్పర్వతము పార్శ్వమున సర్వగుణములతో కూడినది అగుచోట పుణ్యము, క్షేమముతో కూడినది, అందరకు కోరదగినది యగు స్వర్గమే పరలోకమని చెప్పబడును. </p> <p class="Poem3 ParaOverride-1">తత్ర హ్యపాపకర్మాణః శుచయోఽ త్యన్త నిర్మలాః, 9 </p> <p class="Poem2">లోభమోహ పరిత్యక్తా మానవా ననిరుపద్రవాః . </p> <p class="Tat ParaOverride-1">అందు పాపకర్మములు లేనివారు, పవిత్రులు, మిక్కిలి నిర్మలతకలవారు, లోభమోహములను వదలివైచిన వారు నగు మానవులు ఏ ఉపద్రవములు లేక ఉందురు. </p> <p class="Poem-1 ParaOverride-3">స స్వర్గ సదృశో దేశ స్తత్ర హ్యుక్తాః శుభా గుణాః, </p> <p class="Poem2">కాలే మృత్యుః ప్రభవతి స్పృశన్తి వ్యాధయో న చ . 10 </p> <p class="Tat ParaOverride-1">స్వర్గమునకు సాటి వచ్చునది ఆదేశము. అందు మంచి గుణములన్నియు నుండును. కాలమున అమృత్యువు వచ్చును. రోగములు మనుజులను తాకవు. </p> <p class="Poem-1 ParaOverride-1">న లోభః పరదారేషు స్వదారనిరతో జనః, </p> <p class="Poem2 ParaOverride-2">నాన్యోన్యం బధ్యతే తత్ర ద్రవ్యేషు చ న విస్మయః, </p> <p class="Poem2 ParaOverride-2">పరో హ్యధర్మో నైవాస్తి సందేహో నాపి జాయతే. 11 </p> <p class="Tat"><span class="CharOverride-4">పరుల భార్యలయందు లోభము లేదు. అజనుడై తన భార్యయందు ప్రీతి కలిగియుండును. అందొకరి కొకరు అందు చిక్కువడరు. పరమైన అధర్మము లేనేలేదు. సందేహము కూడ కలుగదు.</span> </p> <p class="Poem-1 ParaOverride-1">కృతస్య తు ఫలం తత్ర ప్రత్యక్ష ముపలభ్యతే, </p> <p class="Poem2">పానాసనాశనోపేతాః ప్రాసాద భవనాశ్రయాః. 12 </p> <p class="Tat ParaOverride-1">చేసినదాని ఫలము అందు ప్రత్యక్షముగా చేతికందును. పానము, ఆసనము, భోజనములతో కూడినవారును, ప్రాసాదభవనములు చేరుకొన్నవారును అగుదురు. </p> <p class="Poem-1 ParaOverride-1">సర్వకామై ర్వృతాః కేచి ద్ధేమాభరణ భూషితాః,</p> <p class="Poem2 ParaOverride-2">ప్రాణధారణ మాత్రం తు కేషాంచి దుపపద్యతే . 13 </p> <p class="Poem2 ParaOverride-2">శ్రమేణ మహతా కేచి త్కుర్వన్తి ప్రాణధారణమ్,</p> <p class="Poem2">ఇహధర్మపరాః కేచిత్ కేచిన్నైకృతికా నరాః, </p> <p class="Poem2 ParaOverride-2">సుఖితా దుఃఖితాః కేచి న్నిర్ధనా ధనినోఽపరే . 14 </p> <p class="Tat ParaOverride-1">ఇందు కొందరు యోగులు సర్వకామములతో చుట్టుకొనబడి హేమాభరణ భూషితులై యుందురు. కొందరికి ప్రాణమునందు ధారణము లభించును. మరికొందరు గొప్ప శ్రమతో ప్రాణధారణము చేయుదురు. కొందరు ధర్మపరులు, కొందరు ఆత్మవంచనపరులు. కొందరు సుఖము కలవారు, మరికొందరు దుఃఖితులు - కొందరు ధనహీనులు, ఇతరులు ధనవంతులు. </p> <p class="Poem-1 ParaOverride-3">ఇహ శ్రమో భయం మోహః క్షుధా తీవ్రా చ జాయతే, </p> <p class="Poem2">లోభశ్చార్థకృతో నౄణాం యేన ముహ్యన్త్యపణ్డితాః . 15 </p> <p class="Tat">ఇందు శ్రమ, భయము, మోహము, తీవ్రమగు ఆకలి కలుగును. అర్థ సంబంధముగా నరులకు లోభము కలుగును. దానితో పండితులును మోహపడుదురు. </p> <p class="Poem-1 ParaOverride-3">ఇహ వార్తా బహువిధా ధర్మాధర్మస్య కారిణః, </p> <p class="Poem2">యస్తద్వేదోభయం ప్రాజ్ఞః పాప్మనా న స లిప్యతే. 16 </p> <p class="Tat">ఇచట కుశలులు పెక్కు వాదముల వారు, ధర్మాధర్మములను చేయుచుందురు. ఈ ధర్మాధర్మములను రెంటిని తెలిసిన వాడు ప్రజ్ఞావంతుడు. అతనికి పాపమంటదు. </p> <p class="Poem-1 ParaOverride-1">సోపధం నికృతి స్తేయం పరీవాదో హ్యసూయితా, </p> <p class="Poem2 ParaOverride-2">పరోపఘాతో హింసాచ పైశున్య మనృతం తథా . 17 </p> <p class="Poem2 ParaOverride-2">ఏతా నాసేవతే యస్తు తప స్తస్య ప్రహీయతే, </p> <p class="Poem2 ParaOverride-2">యస్త్వేతా న్నాచరే ద్విద్వాం స్తప స్తస్య ప్రవర్ధతే . 18 </p> <p class="Tat">ఆర్భాటము, అపకారము, దొంగతనము, నింద, అసూయపడుట, ఇతరులను పీడించుట, హింస, పిసినిగొట్టుతనము, అనృతము - వీనిని సేవించువాని తపస్సు మిక్కిలిగా తరిగిపోవును. వీనిని చేయని విద్వాంసుని తపస్సు వృద్ధి పొందును. </p> <p class="Poem-1">ఇహచిన్తా బహువిధా ధర్మాధర్మస్య కర్మణః, </p> <p class="Poem2 ParaOverride-2">కర్మభూమి రియం లోకా ఇహ కృత్వా శుభాశుభమ్,</p> <p class="Poem2 ParaOverride-2">శుభైః శుభ మవాప్నోతి తథా శుభ మథాన్యధా . 19 </p> <p class="Tat">ధర్మాధర్మకర్మమునకు సంబంధించిన విచారణను ఇచట పలువిధములుగా చేయవలయును. ఇది కర్మభూమి. ఈలోకమున శుభము, అశుభము అను కర్మమును చేసి శుభ కర్మములతో శుభమును, అశుభ కర్మముతో అశుభమును పొందును. </p> <p class="Poem-1 ParaOverride-3">ఇహ ప్రజాపతిః పూర్వం దేవాః సర్షిగణా స్తథా,</p> <p class="Poem2">ఇష్ట్వేష్టతపసః పూతా బ్రహ్మలోక ముపాశ్రితాః . 20 </p> <p class="Tat">ఇచట మునుపు ప్రజాపతియు, ఋషుల గణములతో కూడిన దేవతలును ఇష్టమైన తపస్సు నాచరించి పవిత్రులై బ్రహ్మలోకమునకు చేరుకొనిరి. </p> <p class="Poem-1">ఉత్తరః పృథివీభాగః సర్వపుణ్యతమః శుభః, </p> <p class="Poem2">ఇహస్థా స్తత్ర జాయన్తో యేవై పుణ్యకృతో జనాః. 21 </p> <p class="Tat">ఉత్తరమైన భూమిభాగము అన్నింటికంటె మిక్కిలి పుణ్యము కలది. శుభ మైనది. ఈలోకము నందలి పుణ్యములు చేసిన జనులు అందు పుట్టుదురు. </p> <p class="Poem-1">యది సత్కార మృచ్ఛన్తి తిర్యగ్యోనిషు చాపరే, </p> <p class="Poem2">క్షీణాయుష స్తథా చాన్యే నశ్యన్తి పృథివీతలే. 22 </p> <p class="Tat">కోరినచో యోగమున ఆదరమును పొందుదురు. ఇతరులు పశుపక్ష్యాదుల కడుపులలో పుట్టుదురు. ఆయువు తరిగి పోయిన వారై పృథివీతలమున నశింతురు. </p> <p class="Poem-1">అన్యోన్య భక్షణాసక్తా లోభమోహ సమన్వితాః, </p> <p class="Poem2">ఇహైవ పరివర్తన్తే న తే యాన్త్యుత్తరాం దిశమ్. 23 </p> <p class="Tat">ఒకరినొకరు మ్రింగుకొనునాసక్తి కలవారై లోభమోహములు పైకొన్నవారై ఇందే తిరుగాడుచుందురు. వారు ఉత్తర దిక్కున కరుగరు. </p> <p class="Poem-1">యే గురూన్ పర్యుపాసన్తో నియతా బ్రహ్మచారిణః, </p> <p class="Poem2">పన్థానం సర్వలోకానాం విజానన్తి మనీషిణః. 24 </p> <p class="Tat">నియమములు కలవారై గురువులను చక్కగా ఉపాసించుచు బ్రహ్మచారులైనవారు, బుద్ధిమంతులై సర్వలోకముల మార్గము నెరుగుదురు. </p> <p class="Poem-1">ఇత్యుక్తోఽ యం మయా ధర్మః సంక్షిప్తో బ్రహ్మనిర్మితః, </p> <p class="Poem2">ధర్మాధర్మౌహి లోకస్య యోవై వేత్తి స బుద్ధిమాన్. 25 </p> <p class="Tat">వేదము వెల్లడి చేసిన ధర్మమును నీకు సంక్షిప్తముగా చెప్పితిని. లోకమునకు సంబంధించిన ధర్మాధర్మములను తెలిసినవాడు బుద్ధిమంతుడు. </p> <p class="Tat">భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను. </p> <p class="Poem-1">ఇత్యుక్తో భృగుణా రాజన్ భరద్వాజః ప్రతాపవాన్, </p> <p class="Poem2">భృగుం పరమధర్మాత్మా విస్మితః ప్రత్యపూజయత్. 26 </p> <p class="Tat">ఇట్లు ప్రతాపముగలవాడు, పరమధర్మాత్ముడునగు భరద్వాజుడు భృగు విట్లు చెప్పగా విని విస్మితుడై అతనిని మిక్కిలి గౌరవముతో పూజించెను. </p> <p class="Poem-1">ఏష తే ప్రసవో రాజన్ జగతః సంప్రకీర్తితః, </p> <p class="Poem2">నిఖిలేన మహాప్రాజ్ఞ కిం భూయః శ్రోతుమిచ్ఛసి. 27 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>భృగు భరద్వాజ సంవాదే ద్వినవత్యధికశత తమోఽధ్యాయః</span> </p> <p class="Tat">రాజా! ఇది జగత్తు పుట్టుక అని మొత్తముగా ఉన్నదంతయు నీకు చెప్పితిని. మహాప్రాజ్ఞా! ఇంకను ఏమి వినగోరెదవు? </p> <p class="Tat ParaOverride-8">ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున <br/>భృగుభరద్వాజ సంవాదము గల నూటతొంబది రెండవ అధ్యాయము.</p> <p class="Tat">సంక్షిప్తముగా వెనుక చెప్పిన ఆచారమును యోగమును విస్తరించి ప్రతిపాదించుటకై మూడు అధ్యాయముల భాగమును ప్రారంభించుచున్నారు. </p> <p class="Tat"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ </span>- ధర్మరా జిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">ఆచారస్య విధిం తాత ప్రోచ్యమానం త్వయాఽ నఘ, </p> <p class="Poem2">శ్రోతు మిచ్ఛామి ధర్మజ్ఞ సర్వజ్ఞో హ్యసి మే మతః. 1 </p> <p class="Tat">తాతా! ధర్మజ్ఞా! నీవు సర్వజ్ఞుడవని నా అభిప్రాయము. ఆచారవిధిని గూర్చి నీవు చెప్పుచుండగా వినగోరెదను. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ - </span>భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-1">దురాచారా దుర్విచేష్టా దుష్ప్రజ్ఞాః ప్రియసాహసాః, </p> <p class="Poem2">అసన్త స్త్వితి విఖ్యాతాః సన్త శ్చాచార లక్షణాః. 2 </p> <p class="Tat"><span class="CharOverride-4">చెడు ఆచారములు, పాడుచేష్టలు, పాపపు తెలివితేటలు, తొందరపాటుతనము పై ప్రీతి గలవారు అసత్పురుషులని పేరుగాంచెదరు. సత్పురుషులనగా ఆచార లక్షణము కలవారు.</span></p> <p class="Poem-1 ParaOverride-1">పురీషం యది వా మూత్రం యే న కుర్వన్తి మానవాః, </p> <p class="Poem2">రాజమార్గే గవాం మధ్యే ధాన్యమధ్యే చ తే శుభాః . 3 </p> <p class="Tat ParaOverride-1">రాజమార్గమునందును, గోవులనడుమను, ధాన్యమున్నచోటునను మలమూత్రములను వదలని మానవులు మంచివారు. </p> <p class="Poem-1 ParaOverride-1">శౌచ మావశ్యకం కృత్వా దేవతానాం చ తర్పణమ్, </p> <p class="Poem2">ధర్మ మాహు ర్మనుష్యాణా ముపస్పృశ్య నదీం తరేత్. 4 </p> <p class="Tat">శుచికర్మము నాచరించి ఆచమనము చేసి నదియందు స్నానము చేయ వలయును. అటుపై దేవతలకు తర్పణము చేయవలయును. ఇది మనుష్యులకు ధర్మమని చెప్పుదురు. </p> <p class="Poem-1">సూర్యం సదోపతిష్ఠేత న చ సూర్యోదయే స్వపేత్, </p> <p class="Poem2">సాయంప్రాత ర్జపే త్సంధ్యాం తిష్ఠన్ పూర్వాం తథేతరామ్ . 5 </p> <p class="Tat">ఎల్లవేళల సూర్యుని ఆరాధింపవలయును. సూర్యోదయకాలమునందు నిద్రింపరాదు. సాయంకాలమునందు, పడమర వైపునకును, ఉదయకాలమునందు తూర్పునకును మొగము పెట్టి సంధ్యను జపింపవలయును. </p> <p class="Poem-1">పఞ్చార్ద్రో భోజనం భుంజ్యాత్ ప్రాఙ్ముఖో మౌన మాస్థితః, </p> <p class="Poem2">న నిన్ద్య దన్నభక్ష్యాంశ్చ స్వాదు స్వాదు చ భక్షయేత్ . 6 </p> <p class="Tat">తడిగా అయిదు అవయవములుండునట్లుగా, తూర్పునకు మొగముపెట్టి మౌనమును పాటించుచు భోజనము చేయవలయును. అన్నములను, భక్ష్యములను నిందింపరాదు. రుచిగానుండు వానిని తినవలయును. </p> <p class="Poem-1">ఆర్ద్రపాణిః సముత్తిష్ఠే న్నార్ద్రపాదః స్వపే న్నిశి, </p> <p class="Poem2">దేవర్షి ర్నారదః ప్రాహ ఏత దాచారలక్షణమ్. 7 </p> <p class="Tat">తడిచేతులతో లేవవలయును. రాత్రియందు తడికాళ్లతో నిద్రింపరాదు. ఇది ఆచారలక్షణమని దేవర్షి నారదుడు చెప్పెను. </p> <p class="Poem-1">శుచిం దేశ మనడ్వాహం దేవగోష్ఠం చతుష్పథమ్, </p> <p class="Poem2">బ్రాహ్మణం ధార్మికం చైత్యం నిత్యం కుర్యాత్ప్రదక్షిణమ్ . 8 </p> <p class="Tat">పవిత్రమగు దేశమును, ఎద్దును, దేహప్రతిమను నాలుగువీధుల కూడలిని, ధార్మికుడైన బ్రాహ్మణుని, చైత్యమును ప్రదక్షిణము చేయవలయును. </p> <p class="Poem-1">అతిథీనాం చ సర్వేషాం ప్రేష్యాణాం స్వజనస్య చ </p> <p class="Poem2">సామాన్యం భోజనం భృత్యైః పురుషస్య ప్రశస్యతే . 9 </p> <p class="Tat ParaOverride-1">అతిథులందరకును, సేవకులకును, తనవారికిని, తనపై ఆధారపడి బ్రదుకు వారికిని సమానమగు భోజనము పెట్టుట మనుజునకు ప్రశస్తము. </p> <p class="Poem-1 ParaOverride-1">సాయం ప్రాత ర్మనుష్యాణా మశనం వేదనిర్మితమ్, </p> <p class="Poem2">నాన్తరా భోజనం దృష్ట ముపవాసీ తథా భవేత్. 10 </p> <p class="Tat ParaOverride-1">ఉదయ సాయంకాలములందు మనుష్యులకు భోజనము వేదము చెప్పినట్టిది. నడుమ నడుమ తినుట శాస్త్రము అంగీకరించినది కాదు. ఈ విధముగా భోజనము చేయువాడు ఉపవాసము చేసినవాడే యగును. </p> <p class="Poem-1 ParaOverride-1">హోమకాలే తథా జుహ్వన్నృతు కాలే తథా వ్రజన్, </p> <p class="Poem2">అనన్యస్త్రీజనః ప్రాజ్ఞో బ్రహ్మచారీ తథా భవేత్. 11 </p> <p class="Tat ParaOverride-1">హోమకాలమున హోమము చేయుచు ఋతుకాలమున భార్యను పొందుచు, అన్యస్త్రీలను భావింపకుండువాడు బ్రహ్మచారి యగును. </p> <p class="Poem-1 ParaOverride-1">అమృతం బ్రాహ్మణోచ్ఛిష్టం జనన్యా హృదయం కృతమ్, </p> <p class="Poem2">తజ్జనాః పర్యుపాసన్తే సత్యం సన్తః సమాసతే. 12 </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-4">బ్రాహ్మణులు తినగా మిగిలినది తల్లి హృదయమువలె అమృతము వంటిదిగా బ్రహ్మ ఏర్పరచెను. దానిని ఆ విధముగా ఉపాసించు జనులు సత్పురుషులు బ్రహ్మమునే చేరుకొందురు.</span> </p> <p class="Poem-1 ParaOverride-1">లోష్ఠమర్దీ తృణచ్ఛేదీ నఖఖాదీ తు యో నరః, </p> <p class="Poem2">నిత్యోచ్ఛిష్టః సంకుసుకో నేహాయు ర్విన్దతే మహత్. 13 </p> <p class="Tat">మట్టి పిసుకువాడు, దర్భలను త్రుంచువాడు, గోళ్లుకొరుకువాడు, నిత్యము ఉచ్ఛిష్టమును తినువాడు సంకుసుకుడై పెద్దకాలము ఆయువును పొందడు. </p> <p class="Poem-1 ParaOverride-3">యజుషా సంస్కృతం మాంసం నివృత్తో మాంసభక్షణాత్, </p> <p class="Poem2">నభక్షయే ద్వృథామాంసం పృష్ఠమాంసం చ వర్జయేత్ . 14 </p> <p class="Tat">యజ్ఞమునందు సంస్కారము పొందిన మాంసమునైనను యజుర్వేదవేత్త తినరాదు. సంస్కారమును పొందని మాంసమును, శ్రాద్ధశేషమైన మాంసమును వదలవలయును. </p> <p class="Poem-1 ParaOverride-3">స్వదేశే పరదేశే వా అతిథిం నోపవాసయేత్, </p> <p class="Poem2">కామ్య కర్మ ఫలం లబ్ధ్వా గురూణా ముపపాదయేత్ . 15 </p> <p class="Tat">స్వదేశమున గాని పరదేశమున గాని అతిథిని ఉపవసింప జేయరాదు. కామ్యకర్మము ఫలముగా పొందిన అన్నమును గురువులకు నివేదింపవలయును. </p> <p class="Poem-1 ParaOverride-3">గురుభ్య ఆసనం దేయం కర్తవ్యం చాభివాదనమ్, </p> <p class="Poem2">గురూ నభ్యర్చ్య యుజ్యన్తే ఆయుషా యశసా శ్రియా . 16 </p> <p class="Tat">గురువులకు ఆసనమొసగవలయును. అభివాదనము చేయవలయును. గురువులను చక్కగా పూజించి మానవులు ఆయువుతో, కీర్తితో, సంపదతో కూడిన వారగుదురు. </p> <p class="Poem-1 ParaOverride-1">నేక్షేతాదిత్య ముద్యన్తం న చ నగ్నాం పరస్త్రియమ్, </p> <p class="Poem2">మైథునం సతతం ధర్మ్యం గుహ్యే చైవ సమాచరేత్ . 17 </p> <p class="Tat">ఉదయించుచున్న సూర్యుని చూడరాదు. బట్టలు లేని పరస్త్రీని చూడరాదు. ధర్మము తప్పని భార్యసంగమమును రహస్యమున ఆచరింపవలయును. </p> <p class="Poem-1">తీర్థానాం హృదయం తీర్థం శుచీనాం హృదయం శుచిః, </p> <p class="Poem2">సర్వ మార్య కృతం చౌక్ష్యం వాలసంస్పర్శనాని చ . 18 </p> <p class="Tat">తీర్థముల రహస్యము గురువు. పవిత్రుల హృదయము అగ్ని. ఆర్యులు చేసిన మంచి పనులన్నియు ప్రశంసింప దగినవి. ఆవుల తోకను స్పృశించుట మొదలగునవి చేయదగిన పనులు. </p> <p class="Poem-1">దర్శనే దర్శనే నిత్యం సుఖ ప్రశ్న ముదాహరేత్, </p> <p class="Poem2">సాయంప్రాత శ్చ విప్రాణాం ప్రదిష్ట మభివాదనమ్ . 19 </p> <p class="Tat">పెద్దలను, గురువులను చూచినపుడెల్ల సుఖము నడుగుచుండవలెను. ఉదయ సాయంసమయములలో విద్యావంతులకు అభివాదనము శాస్త్రము చెప్పుచున్నది. </p> <p class="Poem-1">దేవాగారే గవాం మధ్యే బ్రాహ్మణానాం క్రియాపథే, </p> <p class="Poem2">స్వాధ్యాయే భోజనే చైవ దక్షిణం పాణి ముద్ధరేత్. 20 </p> <p class="Tat">దేవాలయమునందును, గోవులనడుమను, బ్రాహ్మణులు చేయు శ్రౌతస్మార్త కర్మముల అనుష్ఠానమునందును, వేదము నభ్యసించునపుడును, భోజన సమయము నందును కుడిచేతి నెత్తవలయును. (యజ్ఞోపవీతమును కుడిచేతి క్రిందికి ధరింపవలయును. దీనినే '<span class="CharOverride-2">ఉపవీతి</span>' గా నుండుట యందురు.) </p> <p class="Poem-1 ParaOverride-1">సాయంప్రాతశ్చ విప్రాణాం పూజనం చ యథావిధి, </p> <p class="Poem2 ParaOverride-2">పుణ్యానాం శోభతే పుణ్యం కృషీణాం బాద్యతే కృషిః, </p> <p class="Poem2 ParaOverride-2">బహుకారం చ సస్యానాం వాహ్యేవాహో గవాం తథా . 21</p> <p class="Tat">ఉదయసాయంకాలములందు శాస్త్రవిధి ననుసరించి విప్రుల పూజనము చేయవలయును. అది పుణ్యముల కెల్ల పుణ్యమై శోభిల్లును. కృషులలో కృషియై స్థిరముగా నిలుచును. పంటలను అధికముగా చేయును. గోవులను పొందవలసిన చోటిని పొందించునది అగును. </p> <p class="Poem-1">సంపన్నం భోజనే నిత్యం పానీయే తర్పణం తథా, </p> <p class="Poem2">సుశ్రుతం పాయసే బ్రూయా ద్యవాగ్వాం కృసరే తథా. 22 </p> <p class="Tat">భోజనసమయమున ‘సంపన్నమా’ అనియు, నీరొసగినపుడు 'తర్పణమా' అనియు, పాయసవిషయమునను, గంజి, కృసరమునందును 'శ్రుతమా' అనియు ఆడుగవలయును. </p> <p class="Poem-1">శ్మశ్రు కర్మణి సంప్రాప్తే క్షుతే స్నానేఽథ భోజనే, </p> <p class="Poem2">వ్యాధితానాం చ సర్వేషా మాయుష్య మభినన్దనమ్. 23 </p> <p class="Tat">క్షురకర్మము చేసికొనినపుడును, తుమ్మినపుడు, స్నానము, భోజనము చేసినపుడును విప్రుల కభివందనము చేయవలయును. అది వ్యాధులు పొందిన వారికందరకును ఆయువును పెంచునది అగును. </p> <p class="Poem-1">ప్రత్యాదిత్యం న మేహేత న పశ్యేదాత్మనః శకృత్, </p> <p class="Poem2">సహ స్త్రియాఽథ శయనం సహ భోజ్యం చ వర్జయేత్. 24 </p> <p class="Tat">సూర్యునివైపునకు తిరిగి మూత్రము చేయరాదు. తాను విసర్జించిన మలమును చూడరాదు. స్త్రీతో శయనము, భోజనము చేయుటను వదలవలయును. </p> <p class="Poem-1">త్వంకారం నామధేయం చ జ్యేష్ఠానాం పరివర్జయేత్,</p> <p class="Poem2">అవరాణాం సమానానా ముభయేషాం న దుష్యతి . 25 </p> <p class="Tat">'నీవు' అనుట, పేరుపెట్టి వ్యవహరించుట పెద్దవారి విషయమున వదలవలయును. చిన్నవారి, సమానుల విషయమున ఇట్టి వ్యవహారము తప్పుకాదు. </p> <p class="Poem-1">హృదయం పాపవృత్తానాం పాపమాఖ్యాతి వైకృతమ్, </p> <p class="Poem2">జ్ఞానపూర్వం వినశ్యన్తి గూహమానా మహాజనే . 26 </p> <p class="Tat">పాపపు నడవడి గలవారి పాపమును వారి హృదయ వికారమే తెలియజేయును. మహాజనులకడ వారు పాపమును దాచుకొన్నను అది అందరకు ఎరుకపడగా నశింతురు. </p> <p class="Poem-1">జ్ఞానపూర్వకృతం పాపం ఛాదయత్యబహుశ్రుతః, </p> <p class="Poem2">నైనం మనుష్యాః పశ్యన్తి పశ్యన్త్యేవ దివౌకసః . 27 </p> <p class="Tat">తెలిసి తెలిసి చేసిన పాపమును, చక్కని చదువు లేనివాడు కప్పుకొనును. దానిని ఇతరమనుజులు తెలియకున్నను దేవతలు దానిని చూచెదరు. </p> <p class="Poem-1">పాపేనాపిహితం పాపం పాప మేవానువర్తతే, </p> <p class="Poem2">ధర్మేణాపిహితో ధర్మో ధర్మ మేవానువర్తతే, </p> <p class="Poem2">ధార్మికేణ కృతో ధర్మో ధర్మ మేవానువర్తతే . 28 </p> <p class="Tat">పాపము కప్పిన పాపిని పాపమే వెంటనంటును. ధర్మముతో కప్పిన ధర్మమునే అనుసరించును. ధార్మికుడు చేసిన ధర్మము ధర్మమునే అనుసరించును. </p> <p class="Poem-1">పాపం కృతం న స్మరతీహ మూఢో </p> <p class="Poem2">నివర్తమానస్య తదేతి కర్తుః, </p> <p class="Poem2">రాహు ర్యథా చన్ద్ర ముపైతి చాపి </p> <p class="Poem2">తథాఽ బుధం పాప ముపైతి కర్మ. 29 </p> <p class="Tat">మూఢుడు చేసిన పాపమును స్మరింపడు. శాస్త్ర విరుద్ధముగా నడచు కర్తనే అది వచ్చి చేరుకొనును. రాహువు చంద్రుని చేరు విధముగా, వివేకములేని వానిని పాపకర్మము చేరుకొనును. </p> <p class="Poem-1">ఆశయా సఞ్చితం ద్రవ్యం దుఃఖం నైవోపభుజ్యతే, </p> <p class="Poem2">తద్బుధా న ప్రశంసన్తి మరణం న ప్రతీక్షతే. 30 </p> <p class="Tat">ఆశతో కూడబెట్టిన సొమ్ము దుఃఖమే. అది అనుభవమునకు రాదు. దానిని వివేకము కలవారు మెచ్చుకొనరు. మరణము వేచిచూడదు. </p> <p class="Poem-1">మానసం సర్వభూతానాం ధర్మ మాహు ర్మనీషిణః, </p> <p class="Poem2">తస్మాత్సర్వేషు భూతేషు మనసా శివమాచరేత్ . 31 </p> <p class="Tat">సర్వప్రాణులకును మానసధర్మమే ఉత్తమమని వివేకము కలవారు చెప్పుదురు. అందువలన సర్వభూతముల విషయమునను మనస్సుతో శుభమునే చేయ వలయును. </p> <p class="Poem-1">ఏక ఏవ చరేద్ధర్మం నాస్తి ధర్మే సహాయతా, </p> <p class="Poem2">కేవలం విధి మాసాద్య సహాయః కిం కరిష్యతి . 32 </p> <p class="Tat">తానొక్కడే ధర్మమునాచరింపవలయును. ధర్మవిషయమున తోడు అనునది లేదు. కేవలము ధర్మమును సాధించినచో సహాయ మేమి చేయును? </p> <p class="Poem-1">ధర్మో యోని ర్మనుష్యాణాం దేవానా మమృతం దివి </p> <p class="Poem2">ప్రేత్యభావే సుఖం ధర్మా చ్ఛశ్వత్తై రుపభుజ్యతే. 33 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>భీష్మయుధిష్ఠిర సంవాదే ఆచారవిధౌ త్రినవత్యధిక శతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">మనుష్యులకు ధర్మమే యోని. అది స్వర్గమున దేవతలకు అమృతము. మరణించిన తర్వాత సుఖము ధర్మమువలననే లభించును. నిత్యసుఖమును మానవుడు ధర్మప్రవృత్తులచేత అనుభవించును. </p> <p class="Tat ParaOverride-8">ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున <br/>భీష్మయుధిష్ఠిర సంవాదమునందు ఆచారవిధిగల <br/>నూటతొంబదిమూడవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ </span>- ధర్మరా జిట్లు పలికెను. </p> <p class="Poem-1">అధ్యాత్మం నామ యదిదం పురుషస్యేహ చిన్త్యతే, </p> <p class="Poem2">యదధ్యాత్మం యథా చైతత్ తన్మే బ్రూహి పితామహ. 1 </p> <p class="Tat">అధ్యాత్మమని మానవుడు చింతించునది అది యేది? దేనిని అధ్యాత్మ మందురు. దాని తీరుతెన్నులెట్టివి? తాతా! దానిని నాకు చెప్పుము. </p> <p class="Poem-1">కుతః సృష్ట మిదం విశ్వం బ్రహ్మన్ స్థావరజంగమమ్, </p> <p class="Poem2">ప్రళయే కథ మభ్యేతి తన్మే వక్తు మిహార్హసి. 2 </p> <p class="Tat">ఓ బ్రహ్మజ్ఞా! ఈ విశ్వమంతయు - స్థావరజంగమాత్మకమైనది - ఎచటినుండి ఏర్పడినది? ప్రళయమున ఎట్లు పోవును? దీనిని నాకు చెప్పవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1">అధ్యాత్మ మితి మాం పార్థ యదేత దనుపృచ్ఛసి, </p> <p class="Poem2">తద్వ్యాఖ్యాస్యామి తే తాత శ్రేయస్కరతమం సుఖమ్ . 3</p> <p class="Tat">కుంతీకుమారా! ఆధ్యాత్మమను దానినిగూర్చి నీవు అడుగుచున్నదానిని వ్యాఖ్యానించెదను. నాయనా! అది శ్రేయస్సును గూర్చువానిలో అన్నింటికంటె మించిన సుఖము. </p> <p class="Poem-1">సృష్టి ప్రళయసంయుక్త మాచార్యైః పరిదర్శితమ్, </p> <p class="Poem2">యద్జ్ఞాత్వా పురుషో లోకే ప్రీతిం సౌఖ్యం చ విన్దతి, </p> <p class="Poem2">ఫలలాభశ్చ తస్య స్యాత్ సర్వభూతహితం చ తత్ . 4 </p> <p class="Tat">ఇది సృష్టి ప్రళయములతో కూడినదని ఆచార్యులు కనుగొనిరి. దానిని తెలిసికొని పురుషుడు లోకమున ప్రీతిని సౌఖ్యమును పొందును. అతనికి ఫలలాభమును కలుగును. అది సర్వభూతములకు హితమైనది. </p> <p class="Poem-1">పృథివీ వాయు రాకాశ మాపో జ్యోతిశ్చ పఞ్చమమ్, </p> <p class="Poem2">మహాభూతాని భూతానాం సర్వేషాం ప్రభవాప్యయౌ . 5 </p> <p class="Tat">భూమి, వాయువు, ఆకాశము, జలములు, అగ్ని అను మహాభూతములు సర్వభూతములకు ఉత్పత్తి లయస్థానములు. </p> <p class="Poem-1">యతః సృష్టాని తత్రైవ తాని యాన్తి పునః పునః, </p> <p class="Poem2">మహాభూతాని భూతేభ్యః సాగర స్యోర్మయో యథా . 6 </p> <p class="Tat">దేనినుండి వెలువడినవో వానినే మరల మరల చేరుకొనును. సముద్రముల తరంగముల వలె భూతములనుండి మహాభూతములు వెలువడుచున్నవి. కలిసిపోవుచున్నవి. </p> <p class="Poem-1">ప్రసార్య చ యథాఙ్గాని కూర్మః సంహరతే పునః, </p> <p class="Poem2">తద్వద్భూతాని భూతాత్మా సృష్టాని హరతే పునః . 7 </p> <p class="Tat">తాబేలు తన అవయవములను బయటకు వెలువరించి మరల లోనికి తీసికొనునట్లు భూతాత్మ భూతములను సృజించి మరల హరించును. </p> <p class="Poem-1 ParaOverride-1">మహాభూతాని పఞ్చైవ సర్వభూతేషు భూతకృత్, </p> <p class="Poem2">అకరో త్తేషు వైషమ్యం తత్తు జీవో న పశ్యతి . 8 </p> <p class="Tat ParaOverride-1">సర్వభూతములయందును మహాభూతములు అయిదే కలవు. భూతములను సృజించినవాడు వానియందు వైషమ్యమును చేసెను. జీవుడు దానిని చూడకున్నాడు. </p> <p class="Poem-1 ParaOverride-1">శబ్దః శ్రోత్రం తథా ఖాని త్రయ మాకాశ యోనిజమ్, </p> <p class="Poem2">వాయోః స్పర్శ స్తథా చేష్టా త్వక్చైవ త్రితయం స్మృతమ్. 9</p> <p class="Tat ParaOverride-1">శబ్దము, శ్రోత్రము, అట్లే రంధ్రములు - ఈ మూడును ఆకాశము కారణముగా పుట్టినవి. స్పర్శము, చేష్ట, చర్మము అను మూడును వాయువునుండి ఏర్పడినవి. </p> <p class="Poem-1 ParaOverride-9"><span class="CharOverride-5">రూపం చక్షు స్తథా పాక స్త్రివిధం తేజ ఉచ్యతే, </span></p> <p class="Poem2 ParaOverride-10"><span class="CharOverride-5">రసః క్లేదశ్చ జిహ్వాచ త్రయో జలగుణాః స్మృతాః . 10 </span></p> <p class="Tat ParaOverride-11"><span class="CharOverride-5">రూపము, కన్ను, పాకము అను మూడువిధములు కలది తేజము (అగ్ని). రసము, ద్రవము, నాలుక అను మూడును నీటి గుణములు. </span></p> <p class="Poem-1 ParaOverride-9"><span class="CharOverride-5">ఘ్రేయం ఘ్రాణం శరీరం చ ఏతే భూమిగుణాః స్మృతాః, </span></p> <p class="Poem2 ParaOverride-10"><span class="CharOverride-5">మహాభూతాని పఞ్చైవ షష్ఠం చ మన ఉచ్యతే . 11 </span></p> <p class="Tat ParaOverride-11"><span class="CharOverride-5">వాసన, ముక్కు, శరీరము ఈ మూడును భూమి గుణములు. మహాభూతములు అయిదే. ఆరవది మనస్సు అని చెప్పుదురు. </span></p> <p class="Poem-1 ParaOverride-12"><span class="CharOverride-5">ఇన్ద్రియాణి మనశ్చైవ విజ్ఞానాన్యస్య భారత, </span></p> <p class="Poem2 ParaOverride-10"><span class="CharOverride-5">సప్తమీ బుద్ధి రిత్యాహుః క్షేత్రజ్ఞః పున రష్టమః . 12 </span></p> <p class="Tat ParaOverride-11"><span class="CharOverride-5">ఇంద్రియములు మనస్సును అతని విజ్ఞానములు. ఏడవది బుద్ధి. క్షేత్రజ్ఞుడు ఎనిమిదవవాడు. </span></p> <p class="Poem-1 ParaOverride-9"><span class="CharOverride-5">చక్షురాలోచనా యైవ సంశయం కురుతే మనః, </span></p> <p class="Poem2 ParaOverride-10"><span class="CharOverride-5">బుద్ధి రధ్యవసానాయ క్షేత్రజ్ఞః సాక్షివత్ స్థితః . 13 </span></p> <p class="Tat ParaOverride-11"><span class="CharOverride-5">కన్ను మొదలగునవి ఆలోచనకొరకు అయినవి. మనస్సు సంశయమును కలుగజేయును. బుద్ధి నిశ్చయముకొరకు అయినది. క్షేత్రజ్ఞుడు సాక్షివలె నిలిచియుండును. </span></p> <p class="Poem-1 ParaOverride-13"><span class="CharOverride-5">ఊర్ధ్వం పాదతలాభ్యాం యదర్వా క్చోర్ధ్వంచ పశ్యతి, </span></p> <p class="Poem2 ParaOverride-10"><span class="CharOverride-5">ఏతేన సర్వ మేవేదం విద్ధ్యభివ్యాప్త మన్తరమ్ . 14 </span></p> <p class="Tat">పాదతలములు మొదలుకొని పైకి వ్యాపించి యున్న శరీరమును పైకి క్రిందికి వ్యాపించియున్న చైతన్యము అను సాక్షి చూచుచున్నది. దీనిచేత ఇది యంతయు లోపల వ్యాపించియున్నదని తెలియుము. </p> <p class="Poem-1">పురుషై రిన్ద్రియాణీహ వేదితవ్యాని కృత్స్నశః, </p> <p class="Poem2">తమో రజశ్చ సత్త్వం చ తేఽపి భావా స్తదాశ్రితాః. 15 </p> <p class="Tat ParaOverride-1">మనుజులు ఈ ఇంద్రియములను మొత్తముగా తెలియవలయును. తమస్సు, రజస్సు, సత్త్వము అనువాని నాశ్రయించిన భావములను కూడ తెలియవలయును. </p> <p class="Poem-1">ఏతాం బుద్ధ్వా నరో బుద్ధ్యా భూతానా మాగతిం గతిమ్, </p> <p class="Poem2">సమవేక్ష్య శనై శ్చైవ లభతే శమముత్తమమ్ . 16 </p> <p class="Tat ParaOverride-1">నరుడు దీనిని బుద్ధితో తెలిసికొని భూతముల రాకపోకలను చక్కగా గమనించి మెల్లమెల్లగా ఉత్తమమగు శమమును పొందును. </p> <p class="Poem-1">గుణై ర్నేనీయతే బుద్ధి ర్బుద్ధి రేవేన్ద్రియా ణ్యపి, </p> <p class="Poem2">మనః షష్ఠాని భూతాని తదభావే కుతో గుణాః . 17 </p> <p class="Tat ParaOverride-1">బుద్ధి గుణములచేత మిక్కిలిగా రూపొందుచుండును. బుద్ధియే మనస్సు ఆరవదిగా గల ఇంద్రియములు. భూతములు అదియే. బుద్ధి లేనిచో గుణము లెక్కడివి? </p> <p class="Poem-1 ParaOverride-1">ఇతి తన్మయ మేవైత త్సర్వం స్థావరజంగమమ్, </p> <p class="Poem2">ప్రలీయతే చోద్భవతి తస్మా న్నిర్దిశ్యతే యథా . 18 </p> <p class="Tat ParaOverride-1">కావున స్థావరజంగమాత్మకమయిన సర్వము బుద్ధిమయమే. అందే అంతయు అణగుచున్నది. ఏర్పడుచున్నది. దానివలననే కానవచ్చుచున్నది. </p> <p class="Poem-1">యేన పశ్యతి తచ్చక్షుః శృణోతి శ్రోత్ర ముచ్యతే, </p> <p class="Poem2 ParaOverride-2">జిఘ్రతి ఘ్రాణ మిత్యాహుః రసం జానాతి జిహ్వయా. 19 </p> <p class="Poem2 ParaOverride-2">త్వచా స్పర్శయతే స్పర్శం బుద్ధి ర్విక్రియతే సకృత్, </p> <p class="Poem2 ParaOverride-2">యేన ప్రార్థయతే కిఞ్చిత్తదా భవతి తన్మయః . 20 </p> <p class="Tat">ఆ బుద్ధి దేనితో చూచుచున్నదో అది కన్ను. వినుచున్నదో అది చెవి. వాసన చూచుచున్నదో అది ముక్కు. రసము నాలుకతో తెలియుచున్నది. చర్మముతో స్పర్శను ఎరుగుచున్నది. ఇట్లు బుద్ధియే పెక్కుమారులు ఆయా వికారములను పొందుచున్నది. దాని నేది కోరుచుండునో అది తన్మయముగా నగుచుండును. </p> <p class="Poem-1 ParaOverride-3">అధిష్ఠానాని బుద్దేర్హి పృథగర్ణాని పఞ్చధా, </p> <p class="Poem2">ఇన్ద్రియాణీతి యాన్యాహు స్తాన్యదృశ్యోఽధితిష్ఠతి . 21 </p> <p class="Tat">బుద్ధికి అధిష్ఠానములు వేరువేరు ప్రయోజనములు గలిగి అయిదుగానైనవి. వానినే యింద్రియములందురు. చిదాత్మ అదృశ్యుడై వాని నధివసించి యుండును. </p> <p class="Poem-1">పురుషే తిష్ఠతీ బుద్ధి స్త్రీషు భావేషు వర్తతే, </p> <p class="Poem2">కదాచి ల్లభతే ప్రీతిం కదాచి దనుశోచతి . 22 </p> <p class="Tat">పురుషునియందు నిలిచియున్నదై ఈ బుద్ధి మూడు భావములందు తిరుగుచుండును. ఒకప్పుడు ప్రీతిని పొందును. మరియొక సమయమున శోకము పొందుచుండును. </p> <p class="Poem-1 ParaOverride-3">న సుఖేన న దుఃఖేన కదాచిదపి వర్తతే, </p> <p class="Poem2">ఏవం నరాణాం మనసి త్రిషు భావే ష్వవస్థితా . 23 </p> <p class="Tat">ఒకప్పుడు సుఖదుఃఖములు రెండును లేక ప్రవర్తించుచుండును. ఇట్లు నరుల మనస్సునందు బుద్ధి మూడు భావములయందు నెలకొనియుండును. </p> <p class="Poem-1 ParaOverride-3">సేయం భావాత్మికా భావాం స్త్రీ నేతా నతివర్తతే, </p> <p class="Poem2">సరితాం సాగరో భర్తా మహావేలా మివోర్మివాన్. 24 </p> <p class="Tat">ఇట్లీ భావాత్మిక అయిన బుద్ది ఈ మూడు భావములను, నదుల భర్త సాగరుడు, పెద్ద అలలతో చెలియలికట్టను వలె, అతిక్రమించును. </p> <p class="Poem-1 ParaOverride-1">అతిభావగతా బుద్ధి ర్భావే మనసి వర్తతే, </p> <p class="Poem2">ప్రవర్తమానం తు రజ స్తద్భావ మనువర్తతే. 25 </p> <p class="Tat ParaOverride-1">భావముల నతిక్రమించిన బుద్ధి భావమునందు మెలగుచుండును. ప్రవర్తమానమగురజస్సు మాత్రము బుద్ధిభావమును వెంటనంటుచుండును. </p> <p class="Poem-1 ParaOverride-14">ఇన్ద్రియాణి హి సర్వాణి ప్రవర్తయతి సా తదా, </p> <p class="Poem2">తతః సత్త్వం తమోభావః ప్రీతియోగా త్ప్రవర్తతే . 26 </p> <p class="Tat">అప్పుడా బుద్ధి ఇంద్రియములన్నింటిని ప్రవర్తింపజేయును. అప్పుడు సత్త్వము ఏర్పడును. ప్రీతియోగమువలన తమోభావము ప్రవర్తించును. </p> <p class="Poem-1 ParaOverride-15">ప్రీతిః సత్త్వం రజ శ్శోక స్తమో మోహస్తు తే త్రయః, </p> <p class="Poem2">యే యే చ భావా లోకేఽ స్మిన్ సర్వేష్వేతేషు వై త్రిషు. 27 </p> <p class="Tat ParaOverride-1">సత్త్వము, ప్రీతి, రజస్సుశోకము, తమస్సు మోహము. ఈ మూడును ఈ విధమైనవి. ఈ లోకమునగల ఇట్టి భావములన్నియు ఈ మూడింటియందే రూపొందును. </p> <p class="Poem-1">ఇతి బుద్ధిగతిః సర్వా వ్యాఖ్యాతా తవ భారత, </p> <p class="Poem2">ఇన్ద్రియాణి చ సర్వాణి విజేతవ్యాని ధీమతా . 28 </p> <p class="Tat ParaOverride-1">భారతా! ఇదిగో నీకు సర్వమైన బుద్ధిగతిని వివరించి చెప్పితిని. బుద్ధిమంతుడు ఇంద్రియముల నన్నింటిని గెలువవలయును. </p> <p class="Poem-1 ParaOverride-16">సత్త్వం రజ స్తమ శ్చైవ ప్రాణినాం సంశ్రితాః సదా, </p> <p class="Poem2">త్రివిధా వేదనా చైవ సర్వసత్త్వేషు దృశ్యతే, </p> <p class="Poem2">సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి భారత. 29 </p> <p class="Tat">సత్త్వము, రజస్సు, తమస్సు అను ఈ మూడు గుణములును ఎల్లప్పుడు ప్రాణులను ఆశ్రయించుకొని యుండును. ప్రాణు లన్నింటియందును మూడు విధములైన వేదన కానవచ్చును. అది సాత్త్వికి, రాజసి, తామసి అనునదిగా నుండును. </p> <p class="Poem-1 ParaOverride-17">సుఖస్పర్శః సత్త్వగుణో దుఃఖస్పర్శో రజోగుణః, </p> <p class="Poem2">తమోగుణేన సంయుక్తౌ భవతో వ్యావహారికౌ . 30 </p> <p class="Tat">సుఖస్పర్శ సత్త్వగుణము, దుఃఖస్పర్శ రజోగుణము. తమోగుణము కలుగగా ఈ వ్యావహారికములైన సుఖ దుఃఖములు రెండును కలుగవు. </p> <p class="Poem-1 ParaOverride-17">తత్ర యత్ప్రీతి సంయుక్తం కాయే మనసి వా భవేత్ . </p> <p class="Poem2">వర్తతే సాత్త్వికో భావ ఇత్యాచక్షీత తత్తథా . 31 </p> <p class="Tat">శరీరమునందును, మనస్సునందును ప్రీతితో కూడినదై మెలగునది సాత్త్వికభావము అని పెద్దలు చెప్పుదురు. </p> <p class="Poem-1">అథ యద్దుఃఖ సంయుక్త మప్రీతికర మాత్మనః, </p> <p class="Poem2">ప్రవృత్తం రజ ఇత్యేవ తన్న సంరభ్య చిన్తయేత్ . 32</p> <p class="Tat">దుఃఖములతో కలసియున్నది, ఆత్మకు ప్రీతికరము కానిదియు అయి మెలగునది రజస్సు. దానిని భయముతో చింతింపరాదు. </p> <p class="Poem-1 ParaOverride-3">అథ యన్మోహసంయుక్త మవ్యక్త విషయం భవేత్, </p> <p class="Poem2">అప్రతర్క్య మవిజ్ఞేయం తమస్త దుపధారయేత్. 33 </p> <p class="Tat">ఇక ఏది మోహముతో కూడినదియు, వ్యక్తము కాని విషయములు కలదియు, ఊహింపనలవి కానిదియు, తెలియరానిదియునగునో దానిని తమస్సుగా నిర్ణయించుకొనవలయును. </p> <p class="Poem-1">ప్రహర్షః ప్రీతి రానన్దః సుఖం సంశాన్తచిత్తతా, </p> <p class="Poem2">కథఞ్చి దభివర్తన్త ఇత్యేతే సాత్త్వికా గుణాః - 34 </p> <p class="Tat">ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము, ప్రశాంతచిత్తత అనునవి సాత్త్వికగుణములు. ఇవి మిక్కిలి దుర్లభములై ఏర్పడుచుండును. </p> <p class="Poem-1 ParaOverride-3">అతుష్టిః పరితాపశ్చ శోకో లోభ స్తథా క్షమా, </p> <p class="Poem2">లిఙ్గాని రజస స్తాని దృశ్యన్తే హేత్వహేతుభిః . 35 </p> <p class="Tat">తుష్టిలేకుండుట, పరితాపము, శోకము, లోభము, అసహనము అనునవి. రజస్సు లింగములు (గుర్తులు). ఇవి హేతువులతో, అహేతువులతో కూడ కానవచ్చును. </p> <p class="Poem-1 ParaOverride-3">అవమాన స్తథా మోహః ప్రమాదః స్వప్న తన్ద్రితా, </p> <p class="Poem2">కథఞ్చి దభివర్తన్తే వివిధా స్తామసా గుణాః . 36 </p> <p class="Tat">అవమానము, ఒడలు తెలియని తనము, ప్రమాదము, నిద్ర, కునుకుపాటు అను పెక్కువిధములైన తామసగుణములు ఎట్లో ఏర్పడుచుండును. </p> <p class="Poem-1 ParaOverride-1">దూరగం బహుధాగామి ప్రార్థనా సంశయాత్మకమ్, </p> <p class="Poem2">మనః సునియతం యస్య స సుఖీ ప్రేత్య చేహ చ. 37 </p> <p class="Tat ParaOverride-1">దూరము పోవునది, పెక్కువిధములుగా తిరుగునది, ప్రార్థనలతో సంశ యాత్మకమైనది అగు మనస్సును గట్టిగా అదుపున నుంచుకొనువాడు ఇందును, పరలోకమునందును సుఖము కలవాడగును. </p> <p class="Poem-1 ParaOverride-1">సత్త్యక్షేత్రజ్ఞయో రేత దన్తరం పశ్య సూక్ష్మయోః, </p> <p class="Poem2">సృజతే తు గుణానేక ఏకోన సృజతే గుణాన్. 38 </p> <p class="Tat">సూక్ష్మములగు సత్యము, క్షేత్రజ్ఞుడు అనువాని విశేషమును చూడుము. ఒకటి గుణములను సృజించును. ఇంకొకటి సృజింపదు. </p> <p class="Poem-1 ParaOverride-1">మశకోదుమ్బరౌ వాఽ పి సంప్రయుక్తౌ యథా సదా, </p> <p class="Poem2">అన్యోన్య మేతౌ స్యాతాం చ సంప్రయోగ స్తథా తయోః. 39 </p> <p class="Tat ParaOverride-1">దోమ మేడిపండులవలె ఈ రెండును కలిసియుండును. ఈ సత్త్వక్షేత్రజ్ఞుల కలయిక అటువంటిది. </p> <p class="Poem-1 ParaOverride-1">పృథగ్భూతౌ ప్రకృత్యా తౌ సంప్రయుక్తౌ చ సర్వదా, </p> <p class="Poem2">యథా మత్స్యో జలం చైవ సంప్రయుక్తౌ తధైవ తౌ. 40 </p> <p class="Tat ParaOverride-1">సహజముగా అవి రెండును వేరువేరుగా నయినట్టివి. కాని యెల్లవేళల కలసియే యుండును. ఈ కలయిక చేప, నీరు అనువాని కలయిక వంటిది. </p> <p class="Poem-1 ParaOverride-1">న గుణా విదు రాత్మానం స గుణా న్వేత్తి సర్వశః, </p> <p class="Poem2">పరిద్రష్టా గుణానాం తు సంసృష్టా న్మన్యతే తథా. 41 </p> <p class="Tat">గుణములు ఆత్మను ఎరుగజాలవు. ఆత్మ అన్నివిధముల గుణముల నెరుగును. ఆత్మగుణములను చక్కగా చూచునది అయి తనతో కలసియున్న వానినిగా భావించును. </p> <p class="Poem-1 ParaOverride-6">ఇన్ద్రియై స్తు ప్రదీపార్థం కురుతే బుద్ధిసప్తమైః </p> <p class="Poem2">నిర్విచేష్టై రజానద్భిః పరమాత్మా ప్రదీపవత్. 42 </p> <p class="Tat">బుద్ధితోపాటు ఏడైన ఇంద్రియములు, చేష్టలు లేనివి, ఏమియు నెరుగనివి అయి పెద్దవెలుగుకొరకు ప్రయత్నించుచుండును. పరమాత్మ ఆ ప్రదీపము వంటిది. </p> <p class="Poem-1 ParaOverride-6">సృజతే హి గుణాన్ సత్త్వం క్షేత్రజ్ఞః పరిపశ్యతి, </p> <p class="Poem2">సంప్రయోగ స్తయో రేష సత్త్వ క్షేత్రజ్ఞయో ర్ధ్రువః . 43 </p> <p class="Tat">సత్త్వము గుణములను సృజించును. క్షేత్రజ్ఞుడు వానిని అన్నివైపులనుండి చూచుచుండును. సత్వక్షేత్రజ్ఞులకు గల సంబంధము ఇట్లు ధ్రువము (అనాది సిద్ధము). </p> <p class="Poem-1 ParaOverride-6">ఆశ్రయో నాస్తి సత్త్వస్య క్షేత్రజ్ఞస్య చ కశ్చన, </p> <p class="Poem2">సత్త్వం మనః సంసృజతే న గుణాన్ వై కదాచన. 44 </p> <p class="Tat">సత్త్వమునకు క్షేత్రజ్ఞనకు ఏవిధమైన ఆశ్రయమును లేదు. సత్వము మనస్సును నిర్దేశించును. కాని ఎన్నటికిని గుణములను కాదు. </p> <p class="Poem-1">రశ్మీంస్తేషాం స మనసా యదా సమ్య ఙ్నియచ్ఛతి, </p> <p class="Poem2">తదా ప్రకాశతేఽ స్యాత్మా ఘటే దీపో జ్వల న్నివ. 45 </p> <p class="Tat">క్షేత్రజ్ఞుడు సత్వము కిరణములవంటి ఇంద్రియములను ఎప్పుడు చక్కగా నిలువరించునో అప్పుడు అది కుండయందలి దీపమువలె ప్రకాశించును. </p> <p class="Poem-1">త్యక్త్వా యః ప్రాకృతం కర్మ నిత్య మాత్మరతి ర్మునిః, </p> <p class="Poem2">సర్వభూతాత్మభూ స్తస్మాత్ స గచ్ఛే దుత్తమాం గతిమ్ . 46 </p> <p class="Tat">ఎవడు ప్రాకృత కర్మమును వదలివైచి నిత్యము ఆత్మమునందే ప్రీతికలవాడై, మునియై, సర్వభూతముల ఆత్మయే అయినవాడగునో అతడు దానివలన ఉత్తమ గతి కరుగును. </p> <p class="Poem-1">యథా వారిచరః పక్షీ సలిలేన న లిప్యతే, </p> <p class="Poem2">ఏవమేవ కృతప్రజ్ఞో భూతేషు పరివర్తతే . 47 </p> <p class="Tat">నీటిలో తిరిగెడు పక్షికి నీరు అంటని విధమున ప్రజ్ఞ పండినవాడు భూతముల యందు అంటులేకుండ తిరుగుచుండును. </p> <p class="Poem-1">ఏవం స్వభావ మే వైతత్స్వ బుద్ధ్యా విహరే న్నరః, </p> <p class="Poem2">అశోచ న్నప్రహృష్యంశ్చ సమో విగతమత్సరః . 48 </p> <p class="Tat">ఇట్లు అంటులేని ఈ స్వభావమును స్వబుద్ధితో నిశ్చయించుకొని దుఃఖములతో క్రుంగిపోక, సంతోషముతో పొంగిపోక, రెంటియందును సముడై మత్సరమును విడనాడి నరుడు తిరుగుచుండవలయును. </p> <p class="Poem-1 ParaOverride-3">స్వభావయుక్త్యా యుక్తస్తు స నిత్యం సృజతే గుణాన్, </p> <p class="Poem2">ఊర్ణనాభి ర్యథా సూత్రం విజ్ఞేయా స్తంతువద్గుణాః. 49 </p> <p class="Tat ParaOverride-3">ఈ విధముగా తత్త్వమెరిగినవాడు స్వభావమునందలి యోగముతో కూడినవాడై, సాలెపురుగు దారమును నిర్మించినట్లు, నిత్యము గుణములను సృజించును. గుణములు దారములవంటివని తెలియనగును. </p> <p class="Poem-1 ParaOverride-1">ప్రధ్వస్తా న వివర్తన్తే నివృత్తి ర్నోపలభ్యతే, </p> <p class="Poem2 ParaOverride-2">ప్రత్యక్షేణ పరోక్షం తదనుమానేన సిధ్యతి. 50 </p> <p class="Poem2 ParaOverride-2">ఏవమేకేఽ ధ్యవస్యన్తి నివృత్తి రితి చాపరే, </p> <p class="Poem2 ParaOverride-2">ఉభయం సంప్రధార్యైత ద్వ్యవస్యేత యథామతి. 51 </p> <p class="Tat ParaOverride-3">కొందరు అట్టినరుల గుణములు నశింపవందురు. కొందరు అవి యన్నియు రూపుమాసిపోవు నందురు. ఈ స్థితి ప్రత్యక్ష ప్రమాణముతో తెలియదగినది కాదు. అనుమాన ప్రమాణముతో సిద్ధించును. </p> <p class="Tat">ఇట్లు కొందరు నిర్ణయింతురు. ఇతరులు నివృత్తి కూడ ప్రత్యక్షమే అందురు. ఈ రెంటిని చక్కగా విచారించి తన బుద్ధిని బట్టి నిర్ణయించుకొనవలయును. </p> <p class="Poem-1">ఇతీమం హృదయగ్రన్ధిం బుద్ధిభేదమయం దృఢమ్, </p> <p class="Poem2">విముచ్య సుఖ మాసీత నశోచే చ్ఛిన్నసంశయః. 52</p> <p class="Tat">బుద్ధిభేదమువలన ఏర్పడిన ఈ ఎదలోని పీటముడిని విడగొట్టుకొని సుఖముగా నుండవలయును. సంశయము విడిపోయినవాడు శోకింపడు. </p> <p class="Poem-1 ParaOverride-1">మలినాః ప్రాప్నుయుః సిద్ధిం యథా పూర్ణాం నదీం నరాః, </p> <p class="Poem2">అవగాహ్య సువిద్వాంసో విద్ధి జ్ఞాన మిదం తథా . 53 </p> <p class="Tat">మాలిన్యము గల నరుడు నిండునదిలో మునిగి సిద్ధిని పొందినట్లు గొప్ప విద్వాంసులు జ్ఞానసిద్ధిని పొందుదురు. ఈ జ్ఞానమట్టిదని ఎరుగుము. </p> <p class="Poem-1">మహానద్యా హి పారజ్ఞ స్తప్యతే న తదన్యథా, </p> <p class="Poem2">న తు తప్యతి తత్త్వజ్ఞః ఫలే జ్ఞాతే తరత్యుత. 54 </p> <p class="Tat">మహానది ఆవలిఒడ్డును తెలిసినవాడు కృతార్థుడు కాడు. తత్త్వమెరిగినవాడు బాధపడడు. ఫలము తెలియరాగా సాధనముతో దానిని దాటును. </p> <p class="Poem2">ఏవం యే విదు రాధ్యాత్మం కేవలం జ్ఞానముత్తమమ్. 55 </p> <p class="Tat ParaOverride-1">ఇట్లు కేవలము, ఉత్తమము అయిన, అధ్యాత్మజ్ఞానమును ఎరిగినవారు మాత్రమే ఈ సంసారమును దాటుదురు. </p> <p class="Poem-1 ParaOverride-6">ఏతాం బుద్ధ్వా నరః సర్వాం భూతానా మాగతిం గతిమ్, </p> <p class="Poem2">అవేక్ష్య చ శనై ర్బుద్ధ్యా లభతే శమనం తతః. 56 </p> <p class="Tat">ఇట్లు భూతముల రాకపోకలను తెలిసికొని నరుడు, బుద్ధితో దాని తత్త్వమును మెల్లగా పట్టుకొని అనంతమైన సుఖమును పొందును. </p> <p class="Poem-1">త్రివర్గో యస్య విదితః ప్రేక్ష్య యశ్చ విముఞ్చతి, </p> <p class="Poem2">అన్విష్య మనసా యుక్త స్తత్త్వదర్శీ నిరుత్సుకః. 57 </p> <p class="Tat">ఎవడు త్రివర్గమును చక్కగా తెలిసికొని, పరికించి వదలివైచి, మనసుతో కూడినవాడై తత్వదర్శియగునో వాడు నిరుత్సుకుడు - ఏ కోరికలు లేనివాడు - అగును. </p> <p class="Poem-1">న చాత్మా శక్యతే ద్రష్టు మిన్రియై శ్చ విభాగశః, </p> <p class="Poem2">తత్ర తత్ర విసృష్టైశ్చ దుర్వార్యై శ్చాకృతాత్మభిః. 58 </p> <p class="Tat">అందందు చెదిరినవి, వారింపనలవి కానివి, బుద్ధిపండనివి అగు ఇంద్రియములకు విస్పష్టముగా ఆత్మను దర్శించుట సాధ్యము కాదు. </p> <p class="Poem-1 ParaOverride-6">ఏత ద్బుద్ధ్వా భవద్బుద్ధః కిమన్య ద్బుద్ధ లక్షణమ్, </p> <p class="Poem2">విజ్ఞాయ తద్ధి మన్యన్తే కృతకృత్యా మనీషిణః 59 </p> <p class="Tat">ఇది తెలిసికొన్న వాడే నిజముగా తెలివిగల వాడగును. ఇంతకంటె బుద్ధ లక్షణము మరియేమి కలదు? దానిని చక్కగా ఎరిగిన జ్ఞానసంపన్నులు తమ్ము కృతకృత్యులుగా భావింతురు. </p> <p class="Poem-1 ParaOverride-1">న భవతి విదుషాం తతో భయం </p> <p class="Poem2 ParaOverride-2">యదవిదుషాం సుమహద్భయం భవత్, </p> <p class="Poem2 ParaOverride-2">న హి గతి రధికాఽస్తి కస్యచిత్ </p> <p class="Poem2 ParaOverride-2">సతి హి గుణే ప్రవదన్త్యతుల్యతామ్ . 60 </p> <p class="Tat">చక్కగా తెలిసినవారికి భయము కలుగదు. తెలియనివారికి పెనుభయము కలుగును. దీనికంటె గొప్పదియగు గతి ఎవ్వనికిని లేదు. గుణమున్నచో హెచ్చు తగ్గులను చెప్పుదురు. </p> <p class="Poem-1 ParaOverride-1">యః కరో త్యనభిసంధిపూర్వకం </p> <p class="Poem2 ParaOverride-2">తచ్చ నిర్ణుదతి యత్పురాకృతమ్, </p> <p class="Poem2 ParaOverride-2">నాప్రియం తదుభయం కుతః ప్రియం </p> <p class="Poem2 ParaOverride-2">తస్య తజ్జనయతీహ సర్వతః . 61 </p> <p class="Tat ParaOverride-1">తగులములు లేకుండ కర్మములు చేయువానికి అది పూర్వజన్మ కర్మమును కూడ తొలగించి వేయును. అట్టివానికి ప్రియము, అప్రియమును - రెండును ఉండవు. అతనికి అది అన్నియెడల పుణ్యపాపములను పుట్టింపదు. </p> <p class="Poem-1 ParaOverride-3">లోకమాతుర మసూయతే జన, </p> <p class="Poem2">స్తస్య తజ్జనయతీహ సర్వతః . 62 </p> <p class="Tat">జనుడు ఆతురమైన లోకమునెడ అసూయ పొందుచుండును. అట్టివానికది అన్నియెడల పుణ్యపాపములను పుట్టించును. </p> <p class="Poem-1">లోక ఆతురజనా న్నిరావిశం </p> <p class="Poem2 ParaOverride-2">స్తత్త దేవ బహు పశ్య శోచతః, </p> <p class="Poem2 ParaOverride-2">తత్ర పశ్య కుశలా నశోచతో </p> <p class="Poem2 ParaOverride-2">యే విదు స్తదుభయం పదం సతామ్. 63 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి <br/>అధ్యాత్మకథనే చతుర్న వత్యధిక శతతమోఽధ్యాయః</span> </p> <p class="Tat">లోకమునందు చక్కని పరిశీలన బుద్ధి కలవాడవగుచు ఆతురులైన జనులను, పెల్లుగా శోకించువారిని చూడుము. మరియు నందే జ్ఞానసంపన్నులై దుఃఖింపని వారిని కూడ చూడుము. ఆ ఉభయమును చక్కగా ఎరిగినవారే ఉపాసకులకు పదము. </p> <p class="Tat ParaOverride-8">ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున <br/>అధ్యాత్మకథనము గల నూటతొంబదినాలుగవ అధ్యాయము.</p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ</span> - భీష్ము డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">హన్త వక్ష్యామి తే పార్థ ధ్యానయోగం చతుర్విధమ్, </p> <p class="Poem2">యం జ్ఞాత్వా శాశ్వతీం సిద్ధిం గచ్ఛ న్తీహ మహర్షయః. 1 </p> <p class="Tat">నాయనా! పార్థా! నాలుగు విధములైన ధ్యానయోగములను నీకు చెప్పెదను. దీని నెరిగియే మహర్షులు శాశ్వతసిద్ధిని పొందుచున్నారు. </p> <p class="Poem-1 ParaOverride-3">యథా స్వనుష్ఠితం ధ్యానం తథా కుర్వన్తి యోగినః, </p> <p class="Poem2">మహర్షయో జ్ఞానతృప్తా నిర్వాణ గత మానసాః. 2 </p> <p class="Tat">జ్ఞానముచేత తృప్తినందినవారు, నిర్వాణమునందు లగ్నమైన మనస్సు కలవారు యోగులునగు మహర్షులు ధ్యానమును చక్కగా అభ్యసించి చేయుచుందురు. </p> <p class="Poem-1">నావర్తన్తే పునః పార్థ ముక్తాః సంసారదోషతః, </p> <p class="Poem2">జన్మదోష పరిక్షీణాః స్వభావే పర్యవస్థితాః. 3</p> <p class="Tat ParaOverride-1">అట్టివారు సంసారదోషములనుండి విడివడిన వారు, జన్మ దోషములను ఎండ గట్టినవారు, స్వరూపము నందు స్థిరముగా నున్నవారునై మరల తిరిగి రారు. (వారికి మరల జన్మము లేదు). </p> <p class="Poem-1 ParaOverride-1">నిర్ద్వన్ద్వా నిత్యసత్త్వస్థా విముక్తా నియమస్థితాః, </p> <p class="Poem2">అసఙ్గా న్యవివాదీని మనఃశాన్తి కరాణి చ. 4 </p> <p class="Tat ParaOverride-1">ద్వంద్వములను వదలినవారు, నిత్యము ప్రకాశమునందున్నవారు, లోభాదులను విడనాడినవారు, నియమములందు నిలిచి యున్నవారు. సంగములు లేనివి, వివాదములు లేనివి, మనస్సును ప్రసన్నము చేయునవి యగు స్థానములను సేవించువారు - నగుదురు. </p> <p class="Poem-1 ParaOverride-1">తత్ర ధ్యానేన సంశ్లిష్ట మేవాగ్రం ధారయేన్మనః, </p> <p class="Poem2">పిణ్డీకృత్యేన్ద్రియగ్రామ మాసీనః కాష్ఠవన్మునిః. 5 </p> <p class="Tat ParaOverride-3">అట్టి స్థానములందు ధ్యానముతో కూడియున్న మనస్సును ఏకాగ్రముగా పట్టుకొన వలయును. ఇంద్రియముల సముదాయమును ముద్దగా చేసి కొయ్యవలె కూర్చుండి మౌనమును పాటింపవలయును. </p> <p class="Poem-1 ParaOverride-16">శబ్దం న విన్దే చ్ఛ్రోత్రేణ స్పర్శం త్వచా న వేదయేత్, </p> <p class="Poem2">రూపం న చక్షుషా, విద్యా జ్జిహ్వయా న రసాంస్తథా. 6 </p> <p class="Tat">చెవితో శబ్దమును, చర్మముతో స్పర్శను, కంటితో రూపమును, నాలుకతో రుచులను గ్రహింపరాదు. </p> <p class="Poem-1 ParaOverride-6">ఘ్రేయాణ్యపి చ సర్వాణి జహ్యా ద్ధ్యానేన యోగవిత్, </p> <p class="Poem2">పఞ్చవర్గప్రమాథీని నేచ్ఛేచ్చైతాని వీర్యవాన్. 7 </p> <p class="Tat">యోగము నెరిగినవాడు ధ్యానముతో వాసనల నన్నింటిని వదలివేయ వలయును. చెవి మొదలగు అయిదింటిని వ్యాకుల పరిచెడు ఈ శబ్దాదులను కోరరాదు. </p> <p class="Poem-1">తతో మనసి సంగృహ్య పఞ్చవర్గం విచక్షణః, </p> <p class="Poem2">సమాదధ్యా న్మనో భ్రాంత మిన్ద్రియైః సహ పంచభిః. 8 </p> <p class="Tat">ఈ అయిదింటిని మనస్సున సంగ్రహించి భ్రమ చెందెడు మనస్సును ఇంద్రియములతో పాటు చెదరకుండ నిలుపవలయును. </p> <p class="Poem-1">విసంచారి నిరాలంబం పఞ్చద్వారం చలాచలమ్, </p> <p class="Poem2">పూర్వం ధ్యాన పథే ధీరః సమాదధ్యా న్మనోఽన్తరా. 9 </p> <p class="Tat">పెక్కు తీరుల సంచరించునదియు, అయిదు ఇంద్రియములే ద్వారములుగా కలదియు, చలించు విషయములయందు కదలకుండునదియు నగుమనస్సును, హార్దాకాశమున ఆలంబనములేనిదిగా చేసి ధ్యానమార్గమున స్థిరముగా నుండునట్లు చేయవలయును. </p> <p class="Poem-1 ParaOverride-15">ఇన్ద్రియాణి మనశ్చైవ యదా పిండీకరో త్యయమ్, </p> <p class="Poem2">ఏష ధ్యానపథః పూర్వో మయా సమనువర్ణితః. 10</p> <p class="Tat">ఇంద్రియములను మనస్సును ముద్దగా చేయుట అనునదియే ముఖ్యమైన ధ్యాన పథము. నేను ఇంతకు ముందు వర్ణించినది అదియే. </p> <p class="Poem-1">తస్య తత్పూర్వ సంరుద్ధ మాత్మనః షష్ఠ మాన్తరమ్,</p> <p class="Poem2">స్ఫురిష్యతి సముద్భ్రాన్తా విద్యుదంబుధరే యథా. 11 </p> <p class="Tat">ఆ ఆత్మలోపలి ఆరవ అంగమగు మనస్సు మునుపు బాగుగా అరికట్టబడినప్పటికిని, మేఘమునందు మెరపు చకచక అటునిటు కదలినట్లు సంచలించును. </p> <p class="Poem-1">జలబిన్దు ర్యథా లోలః పర్ణస్థః సర్వత శ్చలః, </p> <p class="Poem2">ఏవ మేవాస్య చిత్తం చ భవతి ధ్యానవర్త్మని. 12 </p> <p class="Tat">ఆకుపై నున్న నీటి బిందువు చంచలమై అంతట కదలుచున్నట్లు ఈతని చిత్తము కూడ ధ్యానమార్గమున కదలిపోవుచుండును. </p> <p class="Poem-1">సమాహితం క్షణం కిఞ్చి ద్ధ్యానావర్త్మని తిష్ఠతి, </p> <p class="Poem2">పున ర్వాయుపథం భ్రాన్తం మనో భవతి వాయువత్. 13 </p> <p class="Tat">ఒక్క క్షణము ధ్యాన మార్గమున నిలువరింప బడినదై నిలిచి యుండును. కాని మనస్సు వాయు మార్గమును చేరుకొని వాయువు వలె భ్రమించునది యగును. </p> <p class="Poem-1">అనిర్వేదో గతక్లేశో గతతన్ద్రి రమత్సరీ, </p> <p class="Poem2">సమాదధ్యా త్పున శ్చేతో ధ్యానేన ధ్యానయోగవిత్. 14 </p> <p class="Tat">క్లేశము పొందినవాడయ్యు నిర్వేదమును విడనాడినవాడును, అలసత, మత్సరములేనివాడై ధ్యానయోగము నెరిగినవాడు ధ్యానముతో మరల చిత్తమును కదలకుండ చేయవలయును. </p> <p class="Poem-1">విచారశ్చ వివేకశ్చ వితర్కశ్చోపజాయతే, </p> <p class="Poem2">మునేః సమాదధానస్య ప్రథమం ధ్యానమాదితః. 15 </p> <p class="Tat">మొదట ధ్యానము చేయబోవు మునికి విచారము, వివేకము, వితర్కము పుట్టుచుండును. </p> <p class="Poem3">మనసా క్లిశ్యమానస్తు సమాధానం చ కారయేత్, 16 </p> <p class="Poem2">న నిర్వేదం మునిర్గచ్ఛేత్కుర్యా దేవాత్మనో హితమ్.</p> <p class="Tat ParaOverride-1">మనస్సుతో నలిగిపోవుచున్నవాడైనను, సమాధిని చేయవలయును. ముని నిర్వేదమును పొందరాదు. తనకు హితమునే చేయవలయును. </p> <p class="Poem-1 ParaOverride-1">పాంసుభస్మకరీషాణాం యథా వై రాశయ శ్చితాః, </p> <p class="Poem2">సహసా వారిణా సిక్తా న యాన్తి పరిభావినమ్. 17 </p> <p class="Tat ParaOverride-1">దుమ్ము, బూడిద, ఎండుపిడకలపొడి అనువాని కుప్పలు ఒక్క పెట్టున నీటితో తడుపబడినను ప్రతిమలుగా మారుట లేదు. </p> <p class="Poem-1 ParaOverride-1">కిఞ్చిత్ స్నిగ్ధం యథా చ స్యా చ్ఛుష్క చూర్ణ మభావితమ్, </p> <p class="Poem2">క్రమశస్తు శనై ర్గచ్చేత్ సర్వం తత్పరిభావనమ్. 18 </p> <p class="Tat ParaOverride-1">ఆ ఎండు పొడిని కొంచెము తడిచేసి నానబెట్టినచో క్రమముగా మెల్లగా అది అంతయు విగ్రహము చేయు స్థితిని పొందును. </p> <p class="Poem-1 ParaOverride-14">ఏవ మేవేన్ద్రియగ్రామం శనైః సంపరిభావయేత్, </p> <p class="Poem2">సంహరేత్ క్రమశ శ్చైవ స సమ్యక్ ప్రశమిష్యతి. 19 </p> <p class="Tat ParaOverride-1">ఇట్లే ఇంద్రియముల సముదాయమును మెల్లగా పాకమునకు తేవలయును. క్రమముగా దానిని ఉపసంహరింప వలయును. అప్పుడది చక్కగా అణగారును. </p> <p class="Poem-1">స్వయమేవ మనశ్చైవం పంచవర్గం చ భారత, </p> <p class="Poem2">పూర్వం ధ్యానపథే స్థాప్య నిత్యయోగేన శామ్యతి. 20 </p> <p class="Tat">ఈ విధముగా మనస్సును, అయిదింద్రియముల గణమును మొదట ధ్యానపథమున నిలుపగా నిత్యయోగముచేత అవియే అణగారిపోవును. </p> <p class="Poem-1">న తత్పురుషకారేణ న చ దైవేన కేనచిత్, </p> <p class="Poem2">సుఖ మేష్యతి తత్తస్య యదేవం సంయతాత్మనః. 21 </p> <p class="Tat">పురుష ప్రయత్నముతో కాని ఏదేని దైవముచేత కాని మనస్సును నిలువరించినవాడు పొందెడు ఈ సుఖమును పొందుట (ఇతరులకు) సాధ్యము కాదు. </p> <p class="Poem-1">సుఖేన తేన సంయుక్తో రంస్యతే ధ్యానకర్మణి, </p> <p class="Poem2">గచ్ఛన్తి యోగినో హ్యేవం నిర్వాణం సన్నిరామయమ్. 22 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>ధ్యాన యోగకథనే పఞ్చనవత్యధిక శతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">ఈ ఆనందముతో కూడినవాడు ధ్యాన కర్మమునందే రమించుచుండును. యోగులు కూడ ఇదే విధముగా ఇతర వాసనలు లేని కైవల్యమును పొందెదరు. </p> <p class="Tat ParaOverride-8">ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున ధ్యాన యోగ కథనముగల నూట తొంబదియైదవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ</span> - యుధిష్ఠిరు డిట్లనెను. </p> <p class="Poem-1">చాతురాశ్రమ్య యుక్తం తే రాజధర్మా స్తథైవ చ, </p> <p class="Poem2">నానాశ్రయాశ్చ బహవ ఇతిహాసాః పృథగ్విధాః. 1 </p> <p class="Tat">నీవు నాలుగాశ్రమములను గూర్చి చెప్పితివి. అట్లే రాజధర్మములను వివరించితివి. పెక్కు భావముల నాశ్రయించిన పెక్కు అంశములను, వేరు వేరు విధములుగల ఇతిహాసములను కూడ నీవలన వింటిమి. </p> <p class="Poem-1 ParaOverride-6">శ్రుతా స్త్వత్తః కథాశ్చైవ ధర్మయుక్తా మహామతే, </p> <p class="Poem2">సందేహోఽస్తి తు కశ్చిన్మే తద్భవాన్ వక్తు మర్హతి. 2 </p> <p class="Tat">ఓ మహామునీ! ధర్మముతో కూడిన కథల నెన్నింటినో నీ వలన వింటిని. ఒక్క సందేహము మాత్రము కలదు. దానిని నీవు తీర్పవలయును. </p> <p class="Poem-1">జాపకానాం ఫలావాప్తిం శ్రోతు మిచ్ఛామి భారత, </p> <p class="Poem2">కిం ఫలం జపతా ముక్తం క్వ వా తిష్ఠన్తి జాపకాః. 3 </p> <p class="Tat">జపము చేయువారెట్టి ఫలమును పొందుదురో వినగోరుచున్నాను. జపించువారు పొందెడు ఫలమేమి? జపము చేయువారు ఎందు నిలుతురు? </p> <p class="Poem-1 ParaOverride-6">జప్యస్య చ విధిం కృత్స్నం వక్తు మర్హసి మేఽనఘ, </p> <p class="Poem2">జాపకా ఇతి కిఞ్చైతత్ సాంఖ్యయోగ క్రియావిధిః. 4</p> <p class="Tat">పుణ్యాత్మా! జపసంబంధమైన దాని విధిని మొత్తముగా నాకు చెప్పుడు. జాపకులు అనువారు వేదాంతవిచారము, యోగము, యోగాదికర్మములు అనునవి చేయువారిలో ఏ విభాగమునకు చెందినవారు? </p> <p class="Poem-1">కిం యజ్ఞవిధి రేవైష కిమేత జ్జప్య ముచ్యతే, </p> <p class="Poem2">ఏతన్మే సర్వమాచక్ష్వ సర్వజ్ఞో హ్యసి మే మతః. 5 </p> <p class="Tat">లేక ఇది బ్రహ్మయజ్ఞ విధియా? జపమునకు సంబంధించినది ఇది ఏది? దీని నంతయు నాకు తెలియ జెప్పుము. నా అభిప్రాయమున నీవు సర్వము తెలిసినవాడవు. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1">అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్, </p> <p class="Poem2">యమస్య యత్పురా వృత్తం కాలస్య బ్రాహ్మణస్య చ. 6 </p> <p class="Tat">ఈ విషయమునందును ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుచుందురు. యముడు, కాలము, బ్రాహ్మణుడు అను వారికి సంబంధించి జరిగినదీ కథ. </p> <p class="Poem-1">సాంఖ్యయోగౌ తు యావుక్తౌ మునిభి ర్మోక్షదర్శిభిః, </p> <p class="Poem2">సంన్యాస ఏవ వేదాన్తే వర్తతే జపనం ప్రతి. </p> <p class="Poem2">వేదవాదాశ్చ నిర్వృత్తాః శాన్తా బ్రహ్మణ్యవస్థితాః. 7</p> <p class="Tat">మోక్షమును దర్శించిన మునులు సాంఖ్యమును యోగమును తెలిపియున్నారు. అందు వేదాంతమున జపమును గూర్చి సంన్యాసమే ఫలముగా నగుచున్నది. ఏలయన వేదవాదములన్నియు బ్రహ్మమునందే పర్యవసించునవి. శాంతములు నిర్వృత్తములు. </p> <p class="Poem-1 ParaOverride-3">సాంఖ్యయోగౌ తు యావుక్తౌ మునిభిః సమదర్శిభిః, </p> <p class="Poem2">మార్గౌ తావప్యుభా వేతౌ సంశ్రితౌ న చ సంశ్రుతౌ. 8 </p> <p class="Tat">సమమును దర్శించెడు మునులు చెప్పెడు సాంఖ్యము యోగము అను రెండు మార్గములును జపమును ఆశ్రయించి యున్నట్టివే. మరియు సంబంధింపనివే. </p> <p class="Poem-1 ParaOverride-3">యథా సంశ్రూయతే రాజన్ కారణం చాత్ర వక్ష్యతే, </p> <p class="Poem2">మనః సమాధి రత్రాపి తథేన్ద్రియజయః స్మృతః. 9 </p> <p class="Tat ParaOverride-1">రాజా! ఇందు వినవచ్చెడు కారణమును చెప్పుచున్నాము. ఇందును మనస్సును నిగ్రహించుట, ఇంద్రియములను గెలుచుట అనునవి కలవు. </p> <p class="Poem-1">సత్య మగ్నిపరీచారో వివిక్తానాం చ సేవనమ్, </p> <p class="Poem2 ParaOverride-2">ధ్యానం తపో దమః క్షాన్తి రనసూయా మితాశనమ్. 10 </p> <p class="Poem2 ParaOverride-2">విషయప్రతి సంహారో మితజల్ప స్తథా శమః, </p> <p class="Poem2 ParaOverride-2">ఏష ప్రవర్తకో యజ్ఞో నివర్తక మథో శృణు. 11</p> <p class="Tat">సత్యము, అగ్ని పరిచర్య, ఏకాంత ప్రదేశములను సేవించుట, ధ్యానము, తపస్సు, దమము, క్షమ, అసూయ లేకుండుట, మిత భోజనము, విషయములను జయించుట, మితముగా పలుకుట, శమము అనునవి జపమునకు అంగమగు ప్రవర్తక ధర్మము. ఇక నివర్తకమగు ధర్మమును గూర్చి వినుము. </p> <p class="Poem-1">యథా నివర్తతే కర్మ జపతో బ్రహ్మచారిణః, </p> <p class="Poem2">ఏతత్సర్వ మశేషేణ యథోక్తం పరివర్తయేత్. 12 </p> <p class="Tat">జపమొనరించు, బ్రహ్మచారికి కర్మము మరలిపోవు విధమున ఇంతకుముందు చెప్పిన మనస్సును నిలువరించుకొనుట మొదలగునది అంతయు నిష్కామరూపమున మారిపోవలయును. </p> <p class="Poem3">నివృత్తం మార్గ మాసాద్య వ్యక్తావ్యక్త మనాశ్రయమ్. 13 </p> <p class="Tat">వ్యక్తమును గాని అవ్యక్తమును గాని ఆశ్రయింపని వెనుకకు మరలిన మార్గమును అవలంబింపవలయును. </p> <p class="Poem-1">కుశోచ్చయనిషణ్ణ స్సన్ కుశహస్తః కుశైః శిఖీ, </p> <p class="Poem2">కుశైః పరివృత స్తస్మిన్ మధ్యేచ్ఛన్నః కుశై స్తథా. 14 </p> <p class="Tat">కుశల సముదాయముపై కూర్చున్నవాడై, కుశములు చేత దాల్చిన వాడై, కుశములతో శిఖలు కలవాడై, కుశలనే అన్ని వైపుల నుంచుకొన్నవాడై, కుశముల నడుమ కప్పబడిన వాడై యుండవలయును. </p> <p class="Poem-1">విషయేభ్యో నమస్కుర్యా ద్విషయా న్న చ భావయేత్, </p> <p class="Poem2">సామ్య ముత్పాద్య మనసా మనస్యేవ మనో దధత్. 15 </p> <p class="Tat">విషయములకు నమస్కరింపవలయును. విషయములను భావింపరాదు. మనస్సుతో సమస్థితిని ఏర్పరచుకొని మనస్సునందే మనస్సును పట్టియుంచుచుండ వలయును. </p> <p class="Poem-1">తద్ధియా ధ్యాయతి బ్రహ్మ జపన్ వై సంహితాం హితామ్, </p> <p class="Poem2">సంన్న్య స్య త్యథవా తాం వై సమాధౌ పర్యవస్థితః. 16 </p> <p class="Tat">ఆ సమత్వము పొందిన బుద్ధితో బ్రహ్మమును ధ్యానించును. మేలుగూర్చు సంహితను (వేద భాగమును) జపించుచుండును. సమాధియందు చక్కగా నెలకొన్నవాడై పిదప సంన్యసించును. </p> <p class="Poem-1">ధ్యానముత్పాదయ త్యత్ర సంహితా బలసంశ్రయాత్, </p> <p class="Poem2">శుద్ధాత్మా తపసాదాన్తో నివృత ద్వేష కామవాన్. </p> <p class="Poem2">అరోగమోహో నిర్దన్ద్వో న శోచతి న సజ్జతే. 17 </p> <p class="Tat">బలము పుంజుకొనుటవలన సంహిత అతనియందు ధ్యానమును పుట్టించును. దానితో నతడు శుద్ధమైన బుద్ధి కలవాడు, తపస్సు చేత అలవడిన ఇంద్రియనిగ్రహము కలవాడు, రోగ మోహములు లేనివాడు, ద్వంద్వములు రూపు మాపినవాడు నయి శోకింపడు, తగులము పొందడు. </p> <p class="Poem3">న కర్తా కారణానాం చ నకార్యాణా మితి స్థితిః. 18</p> <p class="Poem2">న చాహంకార యోగేన మనః ప్రస్థాపయే త్క్వచిత్, </p> <p class="Poem2">న చార్థగ్రహణే యుక్తో నావమానీ నచాక్రియః 19 </p> <p class="Tat">అట్టి దశలో అతడు కారణములకు కార్యములకు కర్త కారాదు. అహంకార సంబంధము చేత మనస్సును ఎందును తగులుకొన నీయరాదు. ధనాదుల రాబడియందు తగులము ఉండదు. అవమానములను లెక్క చేయడు. అట్లని నిష్క్రియుడై ఉండడు. </p> <p class="Poem-1">ధ్యానక్రియాపరో యుక్తో ధ్యానవాన్ ధ్యాననిశ్చయః, </p> <p class="Poem2">ధ్యానే సమాధి ముత్పాద్య తదపి త్యజతి క్రమాత్. 20 </p> <p class="Tat">ధ్యానక్రియయే సర్వము అయినవాడు, ధ్యాననిష్ఠ కలవాడు, ధ్యానమునందు నిశ్చయముకలవాడునై ధ్యానసమాధిని ఏర్పరచుకొని క్రమముగా దానిని కూడ త్యజించును. </p> <p class="Poem-1 ParaOverride-1">సవై తస్యా మవస్థాయాం సర్వత్యాగ కృతః సుఖమ్, </p> <p class="Poem2">నిరిచ్ఛ స్త్యజతి ప్రాణాన్ బ్రాహ్మీం సంవిశతే తనుమ్. 21 </p> <p class="Tat">అతడు అట్టి అవస్థయందు సర్వ త్యాగము చేసిన వాని సుఖమును పొందును. కోరికలు లేనివాడై ప్రాణములను వదలును. బ్రాహ్మియగు తనువును ప్రవేశించును. </p> <p class="Poem-1 ParaOverride-3">అథవా నేచ్ఛతే తత్ర బ్రహ్మకాయ నిషేవణమ్, </p> <p class="Poem2">ఉత్క్రామతి చ మార్గస్థో నైవ క్వచన జాయతే. 22 </p> <p class="Tat">ఆ స్థితిలో బ్రహ్మ కాయమును పొందుట కతడు ఇష్టపడనిచో, మార్గమునందున్నవాడై పైకి వెడలును. మఱి యెందును పుట్టడు. </p> <p class="Poem-1 ParaOverride-3">ఆత్మబుద్ధ్యా సమాస్థాయ శాన్తీభూతో నిరామయః, </p> <p class="Poem2">అమృతం విరజః శుద్ధ మాత్మానం ప్రతిపద్యతే. 23 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>జాపకోపాఖ్యానే షణ్ణవత్యధిక శతతమోఽధ్యాయః</span> </p> <p class="Tat">ఆత్మ బుద్ధితో స్థిరముగా నిలిచి శాంతిగా రూపొందినవాడై చావు, ముదిమి లేనివాడై అమృతము, విరజము, శుద్ధము నగు ఆత్మను పొందును. </p> <p class="Tat ParaOverride-8">ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మపర్వమున <br/>జాపకోపాఖ్యానము గల నూట తొంబది ఆరవ అధ్యాయము.</p> <p class="Tat"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ</span> - యుధిష్ఠిరు డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">గతీనా ముత్తమ ప్రాప్తిః కథితా జాపకే ష్విహ, </p> <p class="Poem2">ఏకై వైషా గతి స్త్వేషా ముత యాన్త్యపరా మపి. 1 </p> <p class="Tat ParaOverride-1">జపపరాయణులైన వారి విషయమున గతులలో ఉత్తమగతి లభించునని చెప్పితివి. వీరికి ఇదియే గతియా? మరియొక గతిని కూడ వారు పొందుదురా? </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-1">శృణుష్వావహితో రాజన్ జాపకానాం గతిం విభో, </p> <p class="Poem2">యథా గచ్ఛన్తి నిరయా ననేకాన్ పురుషర్షభ. 2 </p> <p class="Tat ParaOverride-1">పురుష శ్రేష్ఠా! విభూ! రాజా! జపపరాయణుల గతిని గూర్చి చెదరని మనసు కలవాడవై వినుము. అట్లే వారు పెక్కు నిరయములను ఎట్లు పొందుదురో దానిని కూడ వినుము. </p> <p class="Poem-1 ParaOverride-1">యథోక్త పూర్వం పూర్వం యో నానుతిష్ఠతి జాపకః, </p> <p class="Poem2">ఏకదేశక్రియ శ్చాత్ర నిర్ణయం స చ గచ్ఛతి. 3 </p> <p class="Tat ParaOverride-1">జాపకుడు ఇంతకుమునుపు చెప్పినదానిని ముందు అనుష్ఠింపక ఒక భాగమున మాత్రమే జపకార్యము కలవాడైనచో అతడు నరకమునకు పోవును. </p> <p class="Poem-1 ParaOverride-1">అవమానేన కురుతే న ప్రియతి న హృష్యతి, </p> <p class="Poem2">ఈదృశో జాపకో యాతి నిర్ణయం నాత్ర సంశయః. 4 </p> <p class="Tat">శ్రద్ధ లేకుండ జపము చేయువాడు, ప్రీతి పొందని వాడు, హర్షము పొందనివాడునగు జాపకుడు నరకము పొందును. ఇందు సంశయము లేదు. </p> <p class="Poem-1 ParaOverride-1">అహఙ్కార కృత శ్చైవ సర్వే నిరయగామినః, </p> <p class="Poem2">పరావమానీ పురుషో భవితా నిరయోపగః. 5 </p> <p class="Tat ParaOverride-1">అహంకారముతో జపము చేయువారందరు నరకమునకు పోవువారే. ఇతరుల నవమానించు జాపకుడు నరకమునకు పోవువాడే యగును. </p> <p class="Poem-1 ParaOverride-1">అభిధ్యాపూర్వకం జప్యం కురుతే యశ్చ మోహితః, </p> <p class="Poem2">యత్రాస్య రాగః పతతి తత్ర తత్రోపపద్యతే. 6 </p> <p class="Tat ParaOverride-1">ఫలముమీది ఆశతో మోహముకలవాడై జపముచేయువాడు, అతని రాగ మెందుపడునో, అందందు జన్మమెత్తును. </p> <p class="Poem-1 ParaOverride-3">అథైశ్వర్య ప్రవృత్తేషు జాపక స్తత్ర రజ్యతే, </p> <p class="Poem2">స ఏవ నిరయ స్తస్య నాసౌ తస్మాత్ప్రముచ్యతే. 7 </p> <p class="Tat ParaOverride-1">అట్లే అణిమ మొదలగు సిద్ధులయందు అనురాగము పొందు జాపకునకు అదియే నరకము. అతడు దానినుండి ఎన్నటికిని విముక్తి పొందడు. </p> <p class="Poem-1 ParaOverride-3">రాగేణ జాపకో జప్యం కురుతే తత్ర మోహితః, </p> <p class="Poem2">యత్రాస్య రాగః పతతి తత్ర తత్రోపపద్యతే. 8 </p> <p class="Tat ParaOverride-1">మోహము కలవాడై రాగముతో జాపకుడు జపమాచరించునేని యెందెందు అతని రాగము పడునో అందందు పుట్టుచుండును. </p> <p class="Poem-1 ParaOverride-1">దుర్భుద్ధి రకృతప్రజ్ఞ శ్చలే మనసి తిష్ఠతి, </p> <p class="Poem2">చలా మేవ గతిం యాతి నిరయం వా నియచ్ఛతి. 9 </p> <p class="Tat ParaOverride-1">చెడినబుద్ధికలవాడు, పండనిప్రజ్ఞకలవాడునై చంచలమగుమనస్సునందే నిలుచువాడు చంచలమగు గతికే యరుగును. నరకమునందే స్థిరముగా నిలుచును. </p> <p class="Poem-1">అకృత ప్రజ్ఞకో బాలో మోహం గచ్ఛతి జాపకః, </p> <p class="Poem2">స మోహా న్నిరయం యాతి తత్ర గత్వాఽనుశోచతి. 10 </p> <p class="Tat">ప్రజ్ఞ నిలువని బాలుడగు జాపకుడు మోహమును పొందును. ఆ మోహమువలన నతడు నిరయమున కరుగును. అచట కరిగి దుఃఖించుచునే యుండును. </p> <p class="Poem-1 ParaOverride-3">దృఢగ్రాహీ కరోమీతి జాప్యం జపతి జాపకః, </p> <p class="Poem2">న సంపూర్ణో న సంయుక్తో నిరయం సోఽనుగచ్ఛతి. 11 </p> <p class="Tat">గట్టిపట్టు పట్టి చేయుదునని జపమును జపించు జాపకుడు సంపూర్ణుడు కాడు. దానియందు లగ్నమగు బుద్ధి కలవాడును కాడు. అట్టివాడు నరకమున కరుగును. </p> <p class="Tat"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ </span>- యుధిష్ఠిరు డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">అనివృత్తం పరం యత్త దవ్యక్తం బ్రహ్మణి స్థితమ్, </p> <p class="Poem2">తద్భూతో జాపకః కస్మా త్స శరీర మిహావిశేత్. 12 </p> <p class="Tat">స్వభావ సిద్ధము, పరము, అవ్యక్తము, బ్రహ్మమునందు నెలకొని యున్నది. యగు ఏది కలదో అదియే అయి పోయిన జాపకుడు దేనివలన ఈ శరీరమును మరల ప్రవేశించును? </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-3">దుష్ప్రజ్ఞానేన నిరయా బహవః సముదాహృతాః, </p> <p class="Poem2">ప్రశస్తం జాపకత్వం చ దోషా శ్చైతే తదాత్మకాః. 13 </p> <p class="Tat ParaOverride-18"><span class="CharOverride-3">ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>జాపకోపాఖ్యానే సప్తనవత్యధిక శతతమోఽధ్యాయః. </span></p> <p class="Tat">పాడుబడిన ప్రజ్ఞానముచేత ఏర్పడు నరకములు పెక్కింటిని చెప్పియున్నారు. జపపరాయణత ప్రశస్తమైనది. దానికి సంబంధించిన దోషములు కూడ చెప్పబడినవి. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున </p> <p class="Tat ParaOverride-4">జాపకోపాఖ్యానమున నూటతొంబది యేడవ అధ్యాయము.</p> <p class="Tat ParaOverride-19"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ </span>- యుధిష్ఠిరు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">కీదృశం నిరయం యాతి జాపకో వర్ణయస్వ మే, </p> <p class="Poem2">కౌతూహలం హి రాజ న్మే తద్భవాన్ వక్తు మర్హసి. 1 </p> <p class="Tat ParaOverride-1">జప మొనరించు వాడు (భ్రష్టుడై) ఎటువంటి నరకమును పొందునో నాకు వర్ణించి చెప్పుము. రాజా! నాకు ఉత్కంఠ చెలరేగుచున్నది. నీవు చెప్పవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">ధర్మ స్యాంశప్రసూతోఽసి ధర్మిష్ఠోఽసి స్వభావతః, </p> <p class="Poem2">ధర్మమూలాశ్రయం వాక్యం శృణుష్వావహితోఽనఘ. 2 </p> <p class="Tat ParaOverride-1">పుణ్యాత్మా! నీవు ధర్ముని అంశతో పుట్టినవాడవు. స్వభావమును బట్టి ధర్మిష్ఠుడవు. ధర్మమూలము నాశ్రయించిన వాక్యమును చెదరని మనస్సుతో ఆలకింపుము. </p> <p class="Poem-1 ParaOverride-1">అమూని యాని స్థానాని దేవానాం పరమాత్మనామ్, </p> <p class="Poem2">నానాసంస్థాన వర్ణాని నానారూప ఫలాని చ. 3 </p> <p class="Tat ParaOverride-1">దొడ్డబుద్ధి గల ఈ దివ్య దేహము కలవారి ఈ స్థానములు పెక్కు విధములగు ఆకృతులు, వర్ణములు, పెక్కు రూపములు గల ఫలములు అనువానిని తెలిపెదను వినుము.. </p> <p class="Poem-1 ParaOverride-1">దివ్యాని కామచారీణి విమానాని సభా స్తథా, </p> <p class="Poem2">ఆక్రీడా వివిధా రాజన్ పద్మిన్యశ్చైవ కాంచనా. 4</p> <p class="Poem2">చతుర్ణాం లోక పాలానాం శుక్రస్యాథ బృహస్పతేః, </p> <p class="Poem2 ParaOverride-2">మరుతాం విశ్వదేవానాం సాధ్యానా మశ్వినో రపి. 5</p> <p class="Poem2 ParaOverride-2">రుద్రాదిత్యవసూనాం చ తథాన్యేషాం దివౌకసామ్, </p> <p class="Poem2 ParaOverride-2">ఏతే వై నిరయా స్తాత స్థానస్య పరమాత్మనః. 6</p> <p class="Tat">దివ్యములు, కోరినతీరున సంచరించునవి యగు విమానములు, సభలు, పెక్కువిధములగు ఉద్యానవనములు, బంగారు తామరతీగలు, నలుగురు లోకపాలురకు, శుక్రునకు, బృహస్పతికి, మరుత్తులకు, విశ్వదేవులకు, సాధ్యులకు అశ్వులకు, రుద్రులు, ఆ దిత్యులు, వస్తువులు - అనువారికి అట్లే ఇతరులగు స్వర్గవాసులకు కలవు. ఇవియే, పరమాత్మకంటె వేరుకాని స్థానము కోరుకొనువారికి, నాయనా!, నరకములు.</p> <p class="Poem-1">అభయం చానిమిత్తం చ న తత్ల్కేశ సమావృతమ్, </p> <p class="Poem2">ద్వాభ్యాం ముక్తం త్రిభిర్ముక్త మష్టాభి స్త్రిభిరేవ చ. 7 </p> <p class="Tat">ఆ పరమాత్మ స్థానము భయములేనిది, స్వభావసిద్ధమైనది, క్లేశములు చుట్టుముట్టనిది, రెంటిని వదలినది, మూటిని వదలినది, ఎనిమిదింటిని వదలినది, మరల మూటిని వదలినది. </p> <p class="Poem-1">చతుర్లక్షణ వర్ణంతు చతుష్కారణ వర్జితమ్, </p> <p class="Poem2">అప్రహర్ష మనానన్ద మశోకం విగతక్లమమ్. 8 </p> <p class="Tat">నాలుగు లక్షణములను వదలినది, నాలుగు కారణములను విడచివైచినది, హర్షము, ఆనందము, శోకము, రోగములు అనునవి లేనట్టిది. </p> <p class="Poem-1">కాలః సంపద్యతే తత్ర కాల స్తత్ర న వై ప్రభుః, </p> <p class="Poem2">స కాలస్య ప్రభూ రాజన్ స్వర్గస్యాపి తథేశ్వరః. 9 </p> <p class="Tat">కాలము ఆ పరమాత్మనుండియే ఏర్పడుచున్నది. కాలము ఆ పరమాత్మ విషయమున సమర్థము కాదు. అతడే కాలమునకు ప్రభువు, స్వర్గమునకును ఈశ్వరుడు. </p> <p class="Poem-1">ఆత్మకేవలతాం ప్రాప్త స్తత్ర గత్వా న శోచతి, </p> <p class="Poem2">ఈదృశం పరమం స్థానం నిరయా స్తే చ తాదృశాః. 10 </p> <p class="Tat">ఆత్మ కైవల్యమును పొందినవాడు అందేగి శోకమునందడు. అది యిట్టి పరమస్థానము. ఇక నిరయములు దీనికంటె వేరైనట్టివి. </p> <p class="Poem-1">ఏ తే తే నిరయాః ప్రోక్తాః సర్వఏవ యథాతథమ్, </p> <p class="Poem2">తస్య స్థాన వరస్యేహ సర్వే నిరయసంజ్ఞితాః. 11</p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>జాపకోపాఖ్యానే అష్టనవత్యధిక శతతమోఽధ్యాయః.</span> </p> <p class="Tat">ఈ నిర్ణయములన్నియు ఉన్నవున్నట్లు నీకు చెప్పితిని. ఆ శ్రేష్ఠమగు స్థానము దృష్టితో ఇచట తక్కిన వన్నియు నిరయమను పేరు కలవియే. </p> <p class="Tat ParaOverride-8">ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మ పర్వమున <br/>జాపకోపాఖ్యానమున నూట తొంబది యెనిమిదవ అధ్యాయము. </p> <p class="Tat">ఆఖ్యాయికముఖమున జాపకునకు యమాదులు వశ్యులగుదురనియు, అతడు తన్ను, ఇతరులను కూడ తరింపజేయుననియు, అతడు సత్యాదికమును రక్షింప వలయుననియు, దంభాదికమును వదలవలయుననియు రెండధ్యాయములతో నిరూపించుచున్నారు. </p> <p class="Tat"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ </span>- యుధిష్ఠిరు డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">కాల మృత్యుయమానాం తే ఇక్ష్వాకో ర్బ్రాహ్మణస్య చ, </p> <p class="Poem2">వివాదో వ్యాహృతః పూర్వం తద్భవాన్ వక్తు మర్హసి. 1 </p> <p class="Tat">కాలుడు, మృత్యువు, యముడు, ఇక్ష్వాకుడు, బ్రాహ్మణుడు అనువాని సంవాదము ఇంతకుమున్ను ప్రస్తావనకు వచ్చినది. దానిని నీవు వివరించి చెప్పవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1 ParaOverride-3">అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్, </p> <p class="Poem2">ఇక్ష్వాకోః సూర్యపుత్రస్య యద్వృత్తం బ్రాహ్మణస్య చ. 2 </p> <p class="Tat">ఇందును ప్రాతకాలపు ఇతిహాసము నొకదానిని చెప్పుకొందురు. అది సూర్యుని కుమారుడగు యమునకు ఇక్ష్వాకువునకు ఒక బ్రాహ్మణునకు నడుమ జరిగినది. </p> <p class="Poem-1 ParaOverride-3">కాలస్య మృత్యోశ్చ తథా యద్వృత్తం త న్నిబోధ మే, </p> <p class="Poem2">ప్రథా స తేషాం సంవాదో యస్మిన్ స్థానేఽపి చాభవత్. 3 </p> <p class="Tat">అట్లే అది కాలమునకు, మృత్యువునకును సంబంధించి జరిగినది. దానిని నా నుండి తెలిసికొనుము. అది యెట్లు జరిగెనో, ఏ స్థానమున జరిగెనో చెప్పెదను. </p> <p class="Poem-1">బ్రాహ్మణో జాపకః కశ్చి ద్ధర్మవృత్తో మహాయశాః, </p> <p class="Poem2">షడఙ్గవిన్మహాప్రాజ్ఞః పైప్పలాదిః స కౌశికః. 4 </p> <p class="Tat">ఒకానొక జాపకుడు ధర్మమైన నడవడి కలవాడు, గొప్ప కీర్తి కలవాడు, ఆరు అంగములతో వేదము నెరిగిన గొప్ప ప్రజ్ఞాశాలి ఉండెడివాడు. అతని పేరు కౌశికుడు. పిప్పలాదుని కుమారుడు. </p> <p class="Poem-1 ParaOverride-3">తస్యాపరోక్షం విజ్ఞానం షడఙ్గేషు బభూవ హ, </p> <p class="Poem2">వేదేషు చైవ నిష్ణాతో హిమవత్పాదసంశ్రయః. 5 </p> <p class="Tat">అతనికి వేదమునంగము లారింటి యందును తత్త్వదర్శనాత్మకమైన విజ్ఞానముండెడిది. వేదములయందును నిష్ణాతుడు. హిమవత్పర్వత సమీపమున నుండెడివాడు. </p> <p class="Poem-1 ParaOverride-3">సోద్యం బ్రాహ్మం తప స్తేపే సంహితాం సంయతో జపన్, </p> <p class="Poem2">తస్య వర్షసహస్రం తు నియమేన తథా గతమ్. 6 </p> <p class="Tat">జ్ఞానసహితముగా అతడు బ్రహ్మమునకు సంబంధించిన తపస్సును, సంహితను జపించుచు, నిష్ఠతో చేసెను. అట్లా నియమముతో అతనికి వేయి యేండ్లు గడచెను. </p> <p class="Poem-1">స దేవ్యా దర్శితః సాక్షాత్ ప్రీతాఽస్మీతి తదా కిల, </p> <p class="Poem2">జప్య మావర్తయం స్తూష్ణీం న స తాం కిఞ్చిదబ్రవీత్. 7 </p> <p class="Tat">సాక్షాత్తు దేవి అతనికి ప్రత్యక్షమై ప్రీతురాలనైతి నని పలికెనట. అతడు జపమును అట్లే చేయుచు ఆమెతో ఏమియు పలుకకుండెను. </p> <p class="Poem-1">తస్యానుకంపయా దేవీ ప్రీతా సమభవత్తదా, </p> <p class="Poem2">వేదమాతా తత స్తస్య తజ్జప్యం సమపూజయత్. 8 </p> <p class="Tat">అతనిపై దయతో దేవి ప్రీతురాలయ్యెను. ఆ వేదమాత అంత నతని జపమును మన్నించెను. </p> <p class="Poem-1">సమాప్యజప్య స్తూత్థాయ శిరసా పాదయో స్తదా, </p> <p class="Poem2">పపాత దేవ్యా ధర్మాత్మా వచనం చేద మబ్రవీత్. 9 </p> <p class="Tat">జపకార్యమును ముగించుకొని లేచి ఆతడు ఆదేవి పాదములపై పడి శిరముతో నమస్కరించెను. ఆ ధర్మాత్ముడు మరియు నిట్లు పలికెను. </p> <p class="Poem-1">దిష్ట్యా దేవి ప్రసన్నా త్వం దర్శనం చాగతా మమ, </p> <p class="Poem2">యది చాపి ప్రసన్నాఽసి జప్యే మే రమతాం మనః. 10 </p> <p class="Tat">దేవీ! అదృష్టవశమున నీవు ప్రసన్నవయితివి. నాకు దర్శనమును కూడ అనుగ్రహించితివి. నీకు నాపై దయగలదేని నా మనస్సు ఈ జపకార్యమునందే రమించు గాక!</p> <p class="Tat"><span class="CharOverride-2">సావిత్ర్యువాచ </span>- సావిత్రీ దేవి యిట్లు పలికెను. </p> <p class="Poem-1">కిం ప్రార్థయసి విప్రర్షే కిం చేష్టం కరవాణి తే, </p> <p class="Poem2">ప్రబ్రూహి జపతాం శ్రేష్ఠ సర్వం తత్తే భవిష్యతి. 11 </p> <p class="Tat">ఓ విప్రర్షీ! నీవేమి కోరెదవు. నీ ఇష్టమును నేను తీర్చెదను. ఓయి జాపకశ్రేష్ఠా! ఆలోచించి చెప్పుము. నీవడిగిన దెల్ల కాగలదు. </p> <p class="Poem-1">ఇత్యుక్తః స తదా దేవ్యా విప్రః ప్రోవాచ ధర్మవిత్, </p> <p class="Poem2">జప్యం ప్రతి మమేచ్ఛేయం వర్ధత్వితి పునః పునః. 12 </p> <p class="Tat">ఆదేవి అట్లు పలుకగా ఆమెతో ధర్మమెరిగిన ఆ విప్రుడు అమ్మా! జపకార్యమును గూర్చిన నా యిచ్ఛ పెరుగుచుండు గాక! అని మరల మరల పలికెను. </p> <p class="Poem-1">మనసశ్చ సమాధి ర్మే వర్ధేతాహరహః శుభే, </p> <p class="Poem2">తత్తథేతి తతో దేవీ మధురం ప్రత్యభాషత. 13 </p> <p class="Tat">'నా మనస్సునియమము ప్రతిదినము పెరుగుచుండవలయును' అని పలుకగా ఆదేవి అది యట్లే యగుగాక అని మధురముగా బదులు పలికెను. </p> <p class="Poem-1">ఇదం చైవాపరం ప్రాహ దేవీ తత్ప్రియకామ్యయా, </p> <p class="Poem2">నిరయం నైవ యాతా త్వం యత్ర యాతా ద్విజర్షభాః. 14 </p> <p class="Tat">మరియు నాదేవి అతనికి ప్రియము చేయుకోరిక కలదియై మరియొక మాట చెప్పెను. నాయనా! శ్రేష్ఠులగు ద్విజులు కూడ పోయెడు నిరయమునకు నీవు ఎన్నటికిని పోకుందువు.</p> <p class="Poem-1">యాస్యసి బ్రహ్మణః స్థాన మనిమిత్త మనిన్దితమ్, </p> <p class="Poem2">సాధయే భవితా చైత ద్యత్త్వయాఽహ మిహార్థితా. 15 </p> <p class="Tat">పునరావృత్తియు, ఏదోషములును లేనిది యగు బ్రహ్మ స్థానమునకు నీవరుగుదువు. నన్ను నీవు కోరిన విధముగా నేను దీనిని సాధింతును. నీవట్లు అగుదువు. </p> <p class="Poem-1 ParaOverride-1">నియతో జప చైకాగ్రో ధర్మ స్త్వాం సముపైష్యతి, </p> <p class="Poem2 ParaOverride-15">కాలో మృత్యు ర్యమ శ్చైవ సమాయాస్యన్తి తేఽన్తికమ్. 16 </p> <p class="Poem2 ParaOverride-2">భవితా చ వివాదోఽత్ర తవ తేషాం చ ధర్మతః. </p> <p class="Tat">నియమము కలవాడవు, నిశ్చలబుద్ధి కలవాడవునై జపము చేయుము. ధర్మదేవత నీకడకు వచ్చును. కాలుడు, మృత్యువు, యముడు నీకడకు వత్తురు. ఈ విషయమున వారికి నీతో ధర్మమునకు సంబంధించిన వివాదము కలుగును. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ</span> - భీష్ము డిట్లు పలికెను. </p> <p class="Poem3 ParaOverride-1">ఏవ ముక్త్వా భగవతీ జగామ భవనం స్వకమ్. 17 </p> <p class="Poem2 ParaOverride-2">బ్రాహ్మణోఽపి జప న్నాస్తే దివ్యం వర్షశతం తథా, </p> <p class="Poem2 ParaOverride-2">సదా దాన్తో జితక్రోధః సత్యసంధోఽ నసూయకః. 18 </p> <p class="Tat">ఇట్లు పలికి ఆ భగవతి తన భవనమున కరిగెను. బ్రాహ్మణుడును ఎల్లవేళల ఇంద్రియ నిగ్రహము కలవాడు, క్రోధమును జయించినవాడు, సత్యమునందు పట్టుదల కలవాడు, అసూయ లేనివాడునై దేవతల వేయి యేండ్లు జపించుచుండెను. </p> <p class="Poem-1">సమాప్తే నియమే తస్మిన్నథ విప్రస్య ధీమతః, </p> <p class="Poem2">సాక్షాత్ప్రీత స్తదా ధర్మో దర్శయామాస తం ద్విజమ్. 19 </p> <p class="Tat">ధీమంతుడగు ఆవిప్రుని ఆనియమము ముగియగా ప్రీతినొందిన ధర్ముడు స్వయముగా ఆ బ్రాహ్మణునకు సాక్షాత్కరించెను. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">ధర్మ ఉవాచ </span>- ధర్ము డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-17">ద్విజాతే పశ్య మాం ధర్మ మహం త్వాం ద్రష్టుమాగతః,</p> <p class="Poem2"> జప్యస్యాస్య ఫలం యత్తత్సంప్రాప్తం తచ్చ మే శృణు. 20 </p> <p class="Tat ParaOverride-1">ఓయి బ్రాహ్మణా! ధర్ముడను నన్ను చూడుము. నిన్ను చూచుటకై నేను వచ్చితిని. నీవు పొందిన ఈ జపకార్య ఫలమెట్టిదో చెప్పెదను, వినుము.</p> <p class="Poem-1">జితా లోకా స్త్వయా సర్వే యే దివ్యా యే చ మానుషాః, </p> <p class="Poem2">దేవానాం నిలయాన్ సాధో సర్వానుత్క్రమ్య యాస్యసి. 21 </p> <p class="Tat ParaOverride-1">దేవతలకు, మానవులకు చెందిన లోకముల నన్నింటిని నీవు గెలిచితివి. దేవలోకముల నన్నింటిని దాటి నీవు పైకి అరిగెదవు. </p> <p class="Poem-1">ప్రాణత్యాగం కురు మునే గచ్ఛ లోకాన్ యథేప్సితాన్, </p> <p class="Poem2">త్యక్త్వాత్మనః శరీరం చ తతో లోకా నవాప్స్యసి. 22 </p> <p class="Tat">ఓ మునీ! ప్రాణత్యాగమొనరింపుము. కోరిన లోకముల కరుగుము. నీ శరీరమును వదలివైచి అటుపై లోకములను పొందెదవు. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">కింను లోకై ర్హిమే ధర్మ గచ్ఛ త్వం చ యథాసుఖమ్, </p> <p class="Poem2">బహుదుఃఖ సుఖం దేహం నోత్సృజేయ మహం ప్రభో. 23 </p> <p class="Tat">ధర్ముడా! నాకు లోకములతో పనియేమి? నీవు సుఖముగా నరుగుము. జాపకుడనైన నేను పెక్కు సుఖదుఃఖములుగల మరియొక దేహమును, ప్రభూ! కల్పించుకొనను. </p> <p class="Tat"><span class="CharOverride-2">ధర్మ ఉవాచ </span>- ధర్ము డిట్లు పలికెను. </p> <p class="Poem-1">అవశ్యం భోః శరీరం తే త్యక్తవ్యం మునిపుఙ్గవ, </p> <p class="Poem2">స్వర్గ మారోహ భో విప్ర కిం వా వై రోచతేఽనఘ. 24 </p> <p class="Tat">ఓ ముని పుంగవా! నీవు తప్పక శరీరమును వదలవలయును. ఓ విప్రా! నీ కిష్టమైనచో స్వర్గము నధిరోహింపుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1">న రోచయే స్వర్గమహం వినా దేహ మహం విభో, </p> <p class="Poem2">గచ్ఛ ధర్మ న మే శ్రద్ధా స్వర్గం గన్తుం వినాత్మనా. 25 </p> <p class="Tat">ధర్మా! ఈ ఆత్మలేని స్వర్గమును నే నిష్టపడను. నీవు వెళ్లు. ఆత్మలేక స్వర్గమునకు పోవు శ్రద్ధ నాకు లేదు. </p> <p class="Tat"><span class="CharOverride-2">ధర్మ ఉవాచ </span>- ధర్ము డిట్లనెను. </p> <p class="Poem-1">అలం దేహే మనః కృత్వా త్యక్త్వా దేహం సుఖీ భవ, </p> <p class="Poem2">గచ్ఛ లోకా నరజసో యత్ర గత్వా న శోచసి. 26 </p> <p class="Tat">ఓయి! దేహమునందు మనసుపెట్టకు. దేహమును వదలి సుఖవంతుడవు కమ్ము. ఎందేగి శోకింపకుందువో అట్టి పాపములేని లోకముల కరుగుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">రమే జపన్ మహాభాగ కిం ను లోకైః సనాతనైః, </p> <p class="Poem2">సశరీరేణ గన్తవ్యం మయా స్వర్గం నవా విభో. 27 </p> <p class="Tat">పుణ్యాత్ముడా! నేను జపించుచు ఆనందమందుచున్నాను. ఇంక సనాతనము లగు లోకములతో నాకు పని యేమి? దేహముతో నేను స్వర్గమునకు పోవలయును. లేదా ఆ స్వర్గము నాకు వలదు. </p> <p class="Tat"><span class="CharOverride-2">ధర్మ ఉవాచ </span>- ధర్ము డిట్లనెను. </p> <p class="Poem-1">యది త్వం నేచ్ఛసే త్యక్తుం శరీరం పశ్య వై ద్విజ, </p> <p class="Poem2">ఏష కాల స్తథా మృత్యు ర్యమశ్చ త్వాముపాగతాః. 28 </p> <p class="Tat">నీవు శరీరమును వదలగోరవేని, ఓ ద్విజా! చూడు ఇదిగో కాలుడు, మృత్యువు, యముడు నీకడకు వచ్చి యున్నారు. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డనెను. </p> <p class="Poem-1">అథ వైవస్వతః కాలో మృత్యుశ్చ త్రితయం విభో, </p> <p class="Poem2">బ్రాహ్మణం తం మహాభాగ ముపగమ్యేద మబ్రవీత్. 29 </p> <p class="Tat">అంత యముడు, కాలుడు, మృత్యువునను మువ్వురును ఆ పుణ్యాత్ముడగు బ్రాహ్మణుని సమీపించి యిట్లు పలికిరి. </p> <p class="Tat"><span class="CharOverride-2">యమ ఉవాచ </span>- యము డిట్లనెను. </p> <p class="Poem-1">తపసోఽస్య సుతప్తస్య తథా సుచరితస్య చ, </p> <p class="Poem2">ఫలప్రాప్తి స్తవ శ్రేష్ఠా యమోఽహం త్వా ముపబ్రువే. 30 </p> <p class="Tat">నీవు చక్కగా ఆచరించిన తపస్సునకు, మంచి నడవడికి చక్కని ఫలము దొరకుట మేలైనది. నేను యముడను. నిన్ను పలుకరించుచున్నాను. </p> <p class="Tat"><span class="CharOverride-2">కాల ఉవాచ</span> - కాలు డిట్లనెను. </p> <p class="Poem-1">యథావదస్య జప్యస్య ఫలం ప్రాప్త మనుత్తమమ్, </p> <p class="Poem2">కాల స్తే స్వర్గ మారోఢుం కాలోఽహం త్వా ముపాగతః. 31 </p> <p class="Tat">నీవు నియమము తప్పక చేసిన జపమునకు మేలైన ఫలము పొందవలయును. ఇది నీవు స్వర్గ మెక్కుటకు తగిన కాలము. నేను కాలుడను. నీకడకు వచ్చితిని. </p> <p class="Tat"><span class="CharOverride-2">మృత్యు రువాచ </span>- మృత్యు విట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">మృత్యుం మాం విద్ధి ధర్మజ్ఞ రూపిణం స్వయ మాగతమ్, </p> <p class="Poem2">కాలేన చోదితో విప్ర త్వామితో నేతు మద్య వై. 32 </p> <p class="Tat">ఓ ధర్మజ్ఞా! నన్ను మృత్యువుగా నెరుగుము. రూపము ధరించి స్వయముగా వచ్చితిని. కాలుడు ప్రేరణ చేయగా నిన్నిటనుండి కొనిపోవుటకై నేడు నీకడకు వచ్చితిని. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">స్వాగతం సూర్య పుత్రాయ కాలాయ చ మహాత్మనే, </p> <p class="Poem2">మృత్యవే చాథ ధర్మాయ కిం కార్యం కరవాణి వః. 33 </p> <p class="Tat">సూర్యపుత్రునకు, మహాత్ముడగు కాలునకు, మృత్యువునకు, ధర్మునకు స్వాగతము. నేను మీకేమి చేయుదును? </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">అర్ఘ్యం పాద్యం చ దత్త్వా స తేభ్య స్తత్ర సమాగమే, </p> <p class="Poem2">అబ్రవీ త్పరమ ప్రీతః స్వశక్త్యా కింకరోమి వః. 34 </p> <p class="Tat">అంత నతడు వారికి అర్ఘ్యమును పాద్యమును ఒసగి పరమ ప్రీతితో ఇట్లు పలికెను. నా శక్తితో నేను మీకేమి చేయగలవాడను? </p> <p class="Poem-1">తస్మిన్నే వాథ కాలే తు తీర్థయాత్రా ముపాగతః, </p> <p class="Poem2">ఇక్ష్వాకు రగమ త్తత్ర సమేతా యత్ర తే విభో. 35 </p> <p class="Tat ParaOverride-1">అదే సమయమున వారు కూడియున్న చోటికి తీర్థయాత్రలు చేయుచున్న ఇక్ష్వాకుడను రాజు వచ్చెను. </p> <p class="Poem-1 ParaOverride-3">సర్వానేవ తు రాజర్షిః సంపూజ్యాథ ప్రణమ్య చ,</p> <p class="Poem2"> కుశల ప్రశ్న మకరోత్ సర్వేషాం రాజసత్తమః. 36 </p> <p class="Tat ParaOverride-1">అంత నారాజర్షి, రాజులలో శ్రేష్ఠుడు వారందరిని పూజించి ప్రణమిల్లి కుశల ప్రశ్న మడిగెను. </p> <p class="Poem-1 ParaOverride-1">తస్మై సోఽథాసనం దత్త్వా పాద్యమర్ఘ్యం తథైవ చ, </p> <p class="Poem2">అబ్రవీ ద్ర్బాహ్మణో వాక్యం కృత్వా కుశల సంవిదమ్. 37 </p> <p class="Tat">ఆ బ్రాహ్మణుడును అతని కాసన మొసగి అర్ఘ్యమును, పాద్యమును ఇచ్చి కుశల ప్రశ్న మడిగి యిట్లు పలికెను. </p> <p class="Poem-1">స్వాగతం తే మహారాజ బ్రూహి యద్య దిహేచ్ఛసి, </p> <p class="Poem2">స్వశక్త్యా కిం కరోమీహ తద్భవాన్ ప్రబ్రవీతు మామ్. 38 </p> <p class="Tat ParaOverride-1">ఓ మహారాజా! నీకు స్వాగతము. ఏదేది కోరుదువో దానిని చెప్పుము. నా శక్తి మేరకు నేనేమి చేయుదునో నీవు పలుక వలయును. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-1">రాజాఽహం బ్రాహ్మణ శ్చ త్వం యదా షట్కర్మసంస్థితః, </p> <p class="Poem2">దదాని వసు కించిత్తే ప్రథితం త ద్వదస్వ మే. 39 </p> <p class="Tat">నేను రాజను. నీవు ఆరుకర్మములందు నిష్ఠకల బ్రాహ్మణుడవు. నీకు మేలైన ధన మిత్తును. ఏమేమి కోరెదవో చెప్పుము. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">ద్వివిధా బ్రాహ్మణా రాజన్ ధర్మశ్చ ద్వివిధః స్మృతః, </p> <p class="Poem2">ప్రవృత్తాశ్చ నివృత్తాశ్చ నివృత్తోఽ హం ప్రతిగ్రహాత్. 40 </p> <p class="Tat">రాజా! బ్రాహ్మణు లిరుతెరగులవారు. ధర్మము కూడ రెండువిధములైనదిగా జనులు భావింతురు. ప్రవృత్తులు, నివృత్తులు అని ఆ రెండు విధముల వారు. నేను పుచ్చుకొనుట అను కర్మమునుండి మరలినవాడను. </p> <p class="Poem-1 ParaOverride-1">తేభ్యః ప్రయచ్ఛ దానాని యే ప్రవృత్తా నరాధిప, </p> <p class="Poem2 ParaOverride-2">అహం న ప్రతిగృహ్ణామి కిమిష్టం కిం దదామి తే.</p> <p class="Poem2 ParaOverride-2">బ్రూహి త్వం నృపతిశ్రేష్ఠ తపసా సాధయామి కిమ్. 41 </p> <p class="Tat ParaOverride-1">ఎవరు ప్రవృత్తిధర్మముకలవారో, రాజా! దానములు వారి కొసగుము. నేను నీ నుండి యేదియు గ్రహింపను. నీకేది యిష్టమో దాని నొసగెదను. అడుగుము. దేనిని తపస్సుతో సాధింతునో చెప్పుము. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">క్షత్రియోఽహం న జానామి దేహీతి వచనం క్వచిత్, </p> <p class="Poem2">ప్రయచ్ఛ యుద్ధ మిత్యేవం వాదినః స్మో ద్విజోత్తమ. 42 </p> <p class="Tat ParaOverride-1">నేను క్షత్రియుడను. దేహి(ఇమ్ము) అను పదము నెందును ఎరుగను. మాకు యుద్ధ మొసగుమని మాత్రమే పలుకువారము. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1">తుష్యసి త్వం స్వధర్మేణ తథా తుష్టా వయం నృప, </p> <p class="Poem2">అన్యోన్యస్యాన్తరం నాస్తి యదిష్టం తత్సమాచర. 43 </p> <p class="Tat">నృపా! నీవు నీ ధర్మముతో తుష్టుడవగుచున్నావు. మేమును అట్లే. మన యిరువురకు భేదము లేదు. నీకేది యిష్టమో దాని నాచరింపుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లనెను. </p> <p class="Poem-1">స్వశక్త్యాఽహం దదానీతి త్వయా పూర్వ ముదాహృతమ్, </p> <p class="Poem2">యాచే త్వాం దీయతాం మహ్యం జప్యస్యాస్య ఫలం ద్విజ. 44 </p> <p class="Tat">నా శక్తి మేర కిత్తునని నీవు ఇంతకు ముందు పలికితివి. కనుక నిన్ను అడుగుచున్నాను. నాకు నీ జపక్రియా ఫలము నొసగుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">యుద్ధం మమ సదా వాణీ యాచతీతి వికత్థసే, </p> <p class="Poem2">న చ యుద్ధం మయా సార్థం కిమర్థం యాచసే నృప. 45 </p> <p class="Tat">నా వాక్కు ఎల్లవేళల యుద్ధమునే కోరునని గొప్పలు పలికితివి. నాతో పాటు యుద్ధము నేల కోరుకొనవు? </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లు పలికెను. </p> <p class="Poem-1">వాగ్వజ్రా బ్రాహ్మణాః ప్రోక్తాః క్షత్రియా బాహుజీవినః, </p> <p class="Poem2">వాగ్యుద్ధం తదిదం తీవ్రం మమ విప్ర త్వయా సహ. 46 </p> <p class="Tat">బ్రాహ్మణులు వాక్కులే వజ్రముగా గలవారందురు. క్షత్రియులు బాహువులతో బ్రదుకువారు. ఆ ఈ తీవ్రమగు వాగ్యుద్ధము నీతో నాకు నగుచున్నది. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1">సైవాద్యాపి ప్రతిజ్ఞా మే స్వశక్త్యా కిం ప్రదీయతామ్, </p> <p class="Poem2">బ్రూహి దాస్యామి రాజేన్ద్ర విభవే సతి మాచిరమ్. 47 </p> <p class="Tat">రాజేంద్రా! ఇప్పటికిని నా ప్రతిజ్ఞ అదియే. నా శక్తి మేరకు ఏమి ఈయవలయును చెప్పు ఇత్తును. విభవము ఉండగా ఆలసింపరాదు.</p> <p class="Tat"> <span class="CharOverride-2">రాజోవాచ</span> - రాజిట్లనెను. </p> <p class="Poem-1">యత్తద్వర్షశతం పూర్ణం జప్యం వై జపతా త్వయా, </p> <p class="Poem2">ఫలం ప్రాప్తం తత్ప్రయచ్ఛ మమ దిత్సు ర్భవాన్ యది. 48</p> <p class="Tat ParaOverride-1">నీవు నాకు దానమొసగు కోరిక కలవాడవైనచో నిండు నూరేండ్లు నీవు చేసిన జపము ఫలమును నాకొసగుము. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">పరమం గృహ్యతాం తస్య ఫలం యజ్జపితం మయా, </p> <p class="Poem2">అర్ధం త్వమవిచారేణ ఫలం తస్య హ్యవాప్నుహి. 49 </p> <p class="Tat ParaOverride-1">నేను చేసిన జపముయొక్క పరమ ఫలము నందలి సగమును నీవు విచారింపక గ్రహింపుము. </p> <p class="Poem-1 ParaOverride-3">అథవా సర్వ మేవేహ మామకం జాపకం ఫలమ్, </p> <p class="Poem2">రాజన్ ప్రాప్నుహి కామం త్వం యది సర్వ మిహేచ్ఛసి. 50 </p> <p class="Tat ParaOverride-1">లేదా నా జపఫలము మొత్తమును, రాజా నీవు కోరిన యెడల కైకొనుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లనెను. </p> <p class="Poem-1">కృతం సర్వేణ భద్రం తే జప్యం యద్యాచితం మయా, </p> <p class="Poem2">స్వస్తి తేఽస్తు గమిష్యామి కిఞ్చ తస్యఫలం వద. 51 </p> <p class="Tat ParaOverride-1">మొత్తము జపఫలము, నేనడిగినది నాకు అక్కరలేదు. నీకు మేలగుగాక! నేను పోయి వచ్చెదను. కాని దాని ఫలమేమో నాకు చెప్పుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ - </span>బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">ఫలప్రాప్తిం న జానామి దత్తం యజ్జపితం మయా, </p> <p class="Poem2">అయం ధర్మశ్చ కాలశ్చ యమో మృత్యుశ్చ సాక్షిణః. 52 </p> <p class="Tat ParaOverride-1">నేను జపించిన దాని ఫలమును గూర్చి నేనెఱుగను. నీకిచ్చితిని. ఈ ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు దీనికి సాక్షులు. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ</span> - రాజనెను. </p> <p class="Poem-1 ParaOverride-1">అజ్ఞాత మస్య ధర్మస్య ఫలం కిం మే కరిష్యతి, </p> <p class="Poem2 ParaOverride-2">ఫలం బ్రవీషి ధర్మస్య న చేజ్జప్యకృతస్య మామ్ </p> <p class="Poem2">ప్రాప్నోతు తత్ఫలం విప్రో నాహ మిచ్ఛే ససంశయమ్. 53 </p> <p class="Tat">తెలియని ఈ ధర్మపు ఫలము నాకేమి యొరిగించును. ఈ జపము చేసిన ధర్మపు ఫలమును నాకు చెప్పవేని ఆ ఫలము విప్రుడవగు నిన్నే చేరుగాక. సంశయముతో కూడిన దానిని నేను కోరను. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">నాదదేఽపరవక్తవ్యం దత్తం చాస్యఫలం మయా, </p> <p class="Poem2">వాక్యం ప్రమాణం రాజర్షే మమాద్య తవ చైవ హి. 54 </p> <p class="Tat ParaOverride-1">చెప్పవలసిన మరియొక మాట నాకు లేదు. దీని ఫలమును నేను నీ కిచ్చి వైచితిని. రాజర్షీ! నీకు గాని నాకు గాని మాటయే ప్రమాణము. </p> <p class="Poem-1 ParaOverride-3">నాభిసంధి ర్మయా జప్యే కృత పూర్వః కదాచన, </p> <p class="Poem2">జప్యస్య రాజశార్దూల కథం వేత్స్యా మ్యహం ఫలమ్. 55 </p> <p class="Tat ParaOverride-1">రాజా! నేను మునుపెన్నడు ఈ జపమునకు ఫలము పై కోరిక పెట్టలేదు. అట్టియెడ ఈ జపము ఫలమేమో నాకెట్లు తెలియును? </p> <p class="Poem-1 ParaOverride-1">దదస్వేతి త్వయా చోక్తం దదానీతి మయా తథా, </p> <p class="Poem2">న వాచం దూషయిష్యామి సత్యం రక్ష స్థిరో భవ. 56 </p> <p class="Tat ParaOverride-1">ఇమ్మని నీవంటివి. ఇత్తునని నేను పలికితిని. మాటను చెడగొట్ట జాలను. సత్యమును రక్షింపుము. స్థిరుడవు కమ్ము. </p> <p class="Poem-1 ParaOverride-3">అథైవం వదతో మేఽద్య వచనం న కరిష్యసి, </p> <p class="Poem2">మహానధర్మో భవితా తవ రాజన్ మృషా కృతః. 57 </p> <p class="Tat ParaOverride-1">ఇట్లు పలుకుచున్న నా మాటను నీవు పాటింపకున్నచో, నాకు అసత్యదోషము కల్పించునీకు గొప్ప అధర్మము కలుగును. </p> <p class="Poem-1 ParaOverride-3">న యుక్తం తు మృషా వాణీ త్వయా వక్తు మరిందమ, </p> <p class="Poem2">తథా మయాప్యభిహితం మిథ్యా కర్తుం న శక్యతే. 58 </p> <p class="Tat ParaOverride-1">ఓ అరిమర్దనా! నీవు నీ మాటను పొల్లు చేయుట తగదు. అట్లే నేనును పలికిన దానిని కాదనజాలను. </p> <p class="Poem-1 ParaOverride-3">సంశ్రుతం చ మయా పూర్వం దదానీ త్యవిచారితమ్, </p> <p class="Poem2">తద్గృహ్ణీ ష్వావిచారేణ యది సత్యే స్థితో భవాన్. 59 </p> <p class="Tat ParaOverride-1">నేను ఏమియు విచారింపక ఇత్తునని పూర్వము మాట యిచ్చితిని. నీవును మాటపై నిలుచువాడ వైనచో సంకోచింపక దానిని గ్రహింపుము. </p> <p class="Poem-1 ParaOverride-1">ఇహా గమ్య హి మాం రాజన్ జాప్యం ఫల మయాచథాః, </p> <p class="Poem2">తన్మే నిసృష్టం గృహ్ణీష్వ భవ సత్యే స్థిరోఽపి చ. 60 </p> <p class="Tat ParaOverride-1">నీ విచటకు వచ్చి, రాజా! నన్ను ఫలమును కోరితివి. నేను దాని నొసగితిని. గ్రహింపుము. మాటపై గట్టిగా నిలబడుము. </p> <p class="Poem-1">నాయం లోకోఽస్తి నపరో నచ పూర్వాన్ సతారయేత్, </p> <p class="Poem2">కుత ఏవ జనిష్యాంస్తు మృషా వాద పరాయణః. 61 </p> <p class="Tat">కల్లలాడుటయే పని యైనవానికి ఈలోకము గాని, పరలోకము గాని లేదు. అతడు తనమునుపటి వంశమువారిని తరింపజేయుడు. ఇక పుట్టబోవు వారి సంగతి చెప్పనేల? </p> <p class="Poem-1">నయజ్ఞ ఫల దానాని నియమా స్తారయన్తి హి, </p> <p class="Poem2">యథా సత్యం పరే లోకే తథేహ పురుషర్షభ. 62 </p> <p class="Tat">ఓయి పురుషవరా! సత్యము పరలోకమున తరింపజేయునట్లు, యజ్ఞ ఫలదానములు నియమములు తరింపజేయ జాలవట! </p> <p class="Poem-1">తపాంసి యాని చీర్ణాని చరిష్యన్తి చ యత్తపః, </p> <p class="Poem2">శతైః శతసహస్రైశ్చ తైః సత్యాన్న విశిష్యతే. 63 </p> <p class="Tat">ఇంతకు మునుపు చేసిన తపములు, ఇటుపై చేయబోవు తపములు, వందలు, వందల వేలు అయినను సత్యము కంటె మించవు. </p> <p class="Poem-1">సత్య మేకాక్షరం బ్రహ్మ సత్య మేకాక్షరం తపః, </p> <p class="Poem2">సత్య మేకాక్షరో యజ్ఞః సత్య మేకాక్షరం శ్రుతమ్. 64 </p> <p class="Tat">సత్యము సాటిలేని, వినాశము లేని బ్రహ్మము. సత్యము ఏకాక్షరమగు తపము. సత్య మేకాక్షరమగు యజ్ఞము. సత్యము ఏకాక్షరమగు జ్ఞానము. </p> <p class="Poem-1">సత్యం వేదేషు జాగర్తి ఫలం సత్యే పరం స్మృతమ్, </p> <p class="Poem2">సత్యా ద్ధర్మో దమశ్చైవ సర్వం సత్యే ప్రతిష్ఠితమ్. 65 </p> <p class="Tat">సత్యము వేదములయందు మేల్కొని యుండును. సత్యమునందలి ఫలము పరమమైనది. సత్యమువలన ధర్మము దమము కలుగును. సత్యము నందంతయు నెలకొని యున్నది. </p> <p class="Poem-1">సత్యం వేదా స్తథాఙ్గాని సత్యం విద్యా స్తథా విధిః, </p> <p class="Poem2">వ్రతచర్యా తథా సత్య మోఙ్కారః సత్య మేవచ. 66 </p> <p class="Tat">వేదములు, అంగములు, విద్యలు, విధులు, వ్రతచర్యలు అన్నియు సత్యమే. ఓంకారము కూడ సత్యస్వరూపమే. </p> <p class="Poem-1">ప్రాణినాం జననం సత్యం సత్యం సన్తతి రేవ చ, </p> <p class="Poem2">సత్యేన వాయు రభ్యేతి సత్యేన తపతే రవిః. 67 </p> <p class="Tat">ప్రాణుల పుట్టుక, సంతానము అనునదంతయు సత్యస్వరూపమే. సత్యముచేతనే వాయువు కదలుచున్నది. సత్యము చేతనే సూర్యుడు వెలుగొందుచున్నాడు. </p> <p class="Poem-1">సత్యేన చాగ్ని ర్దహతి స్వర్గః సత్యే ప్రతిష్ఠితః, </p> <p class="Poem2">సత్యం యజ్ఞ స్తపో వేదాః స్తోభా మన్త్రాః సరస్వతీ. 68 </p> <p class="Tat">సత్యముచేతనే అగ్ని కాలుచున్నది. సత్యమునందే స్వర్గము ప్రతిష్ఠ నొందుచున్నది. సత్యమే యజ్ఞము, తపస్సు, వేదములు, స్తోభములు, మంత్రములు, సరస్వతియు. </p> <p class="Poem-1">తులా మారోపితో ధర్మః సత్యం చైవేతి నఃశ్రుతమ్, </p> <p class="Poem2">సమకక్షాం తులయతో యతః సత్యం తతోఽధికమ్. 69 </p> <p class="Tat">ధర్మమును సత్యమును తులపై నుంచిరని మేము వినియుంటిమి. తూచుటకై చేసిన ఆ పనిలో సత్యమున్న వైపే మొగ్గు చూపినది. </p> <p class="Poem-1">యతో ధర్మ స్తతః సత్యం సర్వం సత్యేన వర్ధతే, </p> <p class="Poem2">కిమర్థ మనృతం కర్మ కర్తుం రాజం స్త్వ మిచ్ఛసి. 70 </p> <p class="Tat">ధర్మ మెటు వైపున నుండునో సత్య మచటనే యుండును. సర్వమును సత్యము చేతనే వృద్ధి పొందును. రాజా! అసత్యమగు కర్మము నాచరింపగోరుదు వేల? </p> <p class="Poem-1">సత్యే కురు స్థిరం భావం మా రాజ న్ననృతం కృథాః, </p> <p class="Poem2">కస్మాత్త్వ మనృతం వాక్యం దేహీతి కురుషేఽశుభమ్. 71 </p> <p class="Tat">రాజా! సత్యమున స్థిరభావమును చేయుము. అనృతము చేయకుము. ‘ఇమ్ము’ అను వాక్యమును అశుభము, అనృతము అయినదిగా ఏల చేయుదువు? </p> <p class="Poem-1">యది జప్యఫలం దత్తం మయా నైషిష్యసే నృప, </p> <p class="Poem2">ధర్మేభ్యః సంపరిభ్రష్టో లోకా ననుచరిష్యసి. 72 </p> <p class="Tat">నేను జపఫలము నొసగగా నీవు దానిని అంగీకరింప కుందువేని ధర్మములనుండి పరిభ్రష్టుడవై పాపలోకములకు పోవుదువు. </p> <p class="Poem-1">సంశ్రుత్య యో న దిత్సేత యాచిత్వా యశ్చ నేచ్ఛతి, </p> <p class="Poem2">ఉభా వనృతకా వేతౌ నమృషా కర్తుమర్హసి. 73 </p> <p class="Tat">మాటయిచ్చి ఈయగోరనివాడు, అడుగుకొని పుచ్చుకొనగోరనివాడు - ఈ యిరువురును అబద్ధాల కోరులే యగుదురు. కనుక అసత్యము చేయగోరకుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ</span> - రాజు పలికెను. </p> <p class="Poem-1">యోద్ధవ్యం రక్షితవ్యం చ క్షత్రధర్మః కిల ద్విజ, </p> <p class="Poem2">దాతారః క్షత్రియాః ప్రోక్తా గృహ్ణీయాం భవతః కథమ్. 74 </p> <p class="Tat">పోరొనర్చుట, రక్షించుట అనునవి కదా క్షత్రధర్మములు. రాజులు దాతలని చెప్పబడుదురు. అట్టి నేను నీనుండి యెట్లు గ్రహింతును? </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">నచ్ఛందయామి తే రాజ న్నాపి తే గృహ మావ్రజమ్, </p> <p class="Poem2">ఇహాగమ్యతు యాచిత్వా న గృహీషే పునః కథమ్. 75 </p> <p class="Tat">రాజా! నేను నీ యింటికి రాలేదు. నన్నడుగుమని ఒత్తిడి చేయలేదు. నీవై యిచటకు వచ్చి, అడిగి, గ్రహింపవిది యేమి? </p> <p class="Tat"><span class="CharOverride-2">ధర్మ ఉవాచ </span>- ధర్ము డిట్లనెను. </p> <p class="Poem-1">అవివాదోఽస్తు యువయో ర్విత్తం మాం ధర్మ మాగతమ్, </p> <p class="Poem2">ద్విజో దానఫలై ర్యుక్తో రాజా సత్యఫలేన చ. 76 </p> <p class="Tat">మీ యిరువురకు వివాదమింక వలదు. ఇటకు వచ్చిన ధర్మునిగా మీరిరువురు నన్నెరుగుడు. ఈ ద్విజుడు దానఫలములను, రాజు సత్యఫలములను పొందుదురు గాక!</p> <p class="Tat"><span class="CharOverride-2">స్వర్గ ఉవాచ </span>- స్వర్గ మిట్లనెను. </p> <p class="Poem-1">స్వర్గం మాం విద్ధి రాజేన్ద్ర రూపిణం స్వయమాగతమ్, </p> <p class="Poem2">అవివాదోఽస్తు యువయో రుభౌ తుల్యఫలౌ యువామ్ . 77 </p> <p class="Tat">రాజేంద్రా! నన్ను రూపము తాల్చి స్వయముగా వచ్చిన స్వర్గముగా నెరుగుడు. మీ యిరువురకు వివాదము లేకుండుగాక! ఇద్దరు సమానమగు ఫలము కలవారగుదురు గాక! </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ</span> - రాజిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">కృతం స్వర్గేణ మే కార్యం గచ్ఛ స్వర్గం యథాగతమ్, </p> <p class="Poem2">విప్రో యదీచ్ఛతే గన్తుం చీర్ణం గృహ్ణాతు మే ఫలమ్ . 78 </p> <p class="Tat">నాకు స్వర్గముతో పని తీరిపోయినది. స్వర్గమా! నీవు నీ స్వర్గమునకు వచ్చినట్లే యరుగుము. ఈ విప్రు డచటికి పోగోరునేని నేను కూడబెట్టిన ఫలమును గ్రహించుగాక! </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ</span> - బ్రాహ్మణుడు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">బాల్యే యది స్యాదజ్ఞానా న్మయా హస్తః ప్రసారితః, </p> <p class="Poem2">నివృత్తలక్షణం ధర్మ ముపాసే సంహితం జపన్ . 79 </p> <p class="Tat">చిన్ననాడు తెలియక ఒకవేళ నేను చేయి చాచితినేమో! ఇప్పుడు నివృత్తి లక్షణముగల ధర్మమును, మంత్రమును జపించుచు, ఉపాసించుచున్నాను.</p> <p class="Poem-1 ParaOverride-3">నివృత్తం మాం చిరా ద్రాజన్ విప్ర లోభయసే కథమ్,</p> <p class="Poem2">స్వేన కార్యం కరిష్యామి త్వత్తో నేచ్ఛే ఫలం నృప.</p> <p class="Poem2">తపః స్వాధ్యాయశీలోఽహం నివృత్తశ్చ ప్రతిగ్రహాత్. 80 </p> <p class="Tat">రాజా! ప్రతిగ్రహమునుండి మరల నన్నూరక ఊరింతువేల? నా పనిని నాయంత నేను చేసికొనగలను. నీనుండి ఫలము నపేక్షింపను. తపస్సు, వేదాధ్యయనము అనునవి శీలముగా గల నేను ప్రతిగ్రహమునుండి మరలితిని. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ</span> - రాజు ఇట్లనెను. </p> <p class="Poem-1">యది విప్ర విసృష్టం తే జప్యస్య ఫల ముత్తమమ్, </p> <p class="Poem2">ఆవయో ర్యత్ఫలం కిఞ్చిత్సహితం నౌ తదస్త్విహ . 81 </p> <p class="Tat">విప్రా! నీవు నీ జపఫలమును ఉత్తమమైన దానిని ఇచ్చివేసితివి. కనుక మన యిరువురి ఆ ఫలము ఇచట కూడినది యగుగాక! </p> <p class="Poem-1">ద్విజాః ప్రతిగ్రహే యుక్తా దాతారో రాజవంశజాః, </p> <p class="Poem2">యది ధర్మః శ్రుతో విప్ర సహైవ ఫలమస్తు నౌ . 82 </p> <p class="Tat">బ్రాహ్మణులు దానము పుచ్చుకొనుట కర్హులు. రాజవంశము వారు దాతలు, ఓ విప్రా! ఈ ధర్మము నీచెవిని బడియున్నచో మనయిరువురి ఫలము కలిసియే ప్రవర్తిల్లును గాక! </p> <p class="Poem-1">మా వా భూత్సహభోజ్యం నౌ మదీయం ఫల మాప్నుహి, </p> <p class="Poem2">ప్రతీచ్ఛ మత్కృతం ధర్మం యది తే మయ్యనుగ్రహః . 83 </p> <p class="Tat">అది యట్లు మన యిరువురము కలిసి అనుభవించెడిది కాకున్నచో నాదైన ధర్మఫలమును నీవు పొందుము. నాయందనుగ్రహము ఉన్నచో నేను చేసిన ధర్మములు స్వీకరింపుము. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ</span> - భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1">తతో వికృతరూపౌ ద్వౌ పురుషౌ సముపస్థితౌ, </p> <p class="Poem2">గృహీత్వాఽన్యోన్య మావేష్ట్య కుచైలా వూచతు ర్వచః . 84 </p> <p class="Tat">అంత నచటికి వికృతరూపులగు పురుషు లిరువురు వచ్చిరి. వారి నొకరి నొకరు చుట్టబెట్టుకొని లాగుకొనుచు చినుగు గుడ్డలవారై యిట్లు పలికిరి. </p> <p class="Poem-1">న మే ధారయసీ త్యేకో ధారయామీతి చాపరః, </p> <p class="Poem2">ఇహాస్తి నౌ వివాదోఽయ మయం రాజానుశాసకః . 85 </p> <p class="Tat">నీవు నాకప్పుపడలేదని యొకడు, పడితినని మరియొకడు పలుకుచు ఇదిగో మాకీ వివాదము కలిగినది. ఇతడు ధర్మమును శాసించు రాజు - అనుచు వచ్చిరి. </p> <p class="Poem-1 ParaOverride-1">సత్యం బ్రవీమ్యహ మిదం న మే ధారయతే భవాన్, </p> <p class="Poem2 ParaOverride-2">అనృతం వద సీహ త్వ మృణం తే ధారయా మ్యహమ్. 86 </p> <p class="Tat">నేను సత్యము పలుకుచున్నాను. నీవు నాకు ఋణపడియుండలేదు. నీవు అబద్ధము పలుకుచున్నావు. నేను నీకు అప్పుపడియున్నాను.” </p> <p class="Poem-1">తావుభౌ సుభృశం తప్తౌ రాజాన మిద మూచతుః, </p> <p class="Poem2">పరీక్ష్య త్వం యథా స్యావో నావా మిహ విగర్హితా. 87 </p> <p class="Tat">వారిద్దరు మిక్కిలి ఉడికిపోవుచున్నవారై రాజుతో ఇట్లనిరి. నీవు పరీక్షించి మే మిరువురము నిందనొందకుండు విధమును చేయవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-2">విరూప ఉవాచ</span> - విరూపు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">ధారయామి నరవ్యాఘ్ర వికృతస్యేహ గోఃఫలమ్, </p> <p class="Poem2">దదతశ్చన గృహ్ణాతి వికృతో మే మహీపతే . 88 </p> <p class="Tat">రాజా! ఈ వికృతునకు నేను జపఫలమును అప్పుపడితిని. ఈ వికృతుడు నేను ఇచ్చుచుండగా గ్రహింపకున్నాడు.</p> <p class="Tat"><span class="CharOverride-2">వికృత ఉవాచ </span>- వికృతు డిట్లనెను. </p> <p class="Poem-1">నమే ధారయతే కిఞ్చి ద్విరూపోఽయం నరాధిప, </p> <p class="Poem2">మిథ్యా బ్రవీత్యయం హి త్వాం సత్యాభాసం నరాధిప. 89 </p> <p class="Tat">రాజా! ఈ విరూపుడు నాకేమియు అప్పుపడలేదు. పైకి సత్యమువలె కన్పట్టు అబద్ధమును నీతో పలుకుచున్నాడు. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ</span> - రాజిట్లనెను. </p> <p class="Poem-1">విరూప కిం ధారయతే భవా నస్య బ్రవీతు మే, </p> <p class="Poem2">శ్రుత్వా తథా కరిష్యేఽ హ మితి మే ధీయతే మనః . 90 </p> <p class="Tat">ఏమోయి విరూపా! నిజము చెప్పుము. నీవు ఈతనికి అప్పుపడితివా? అది విని నేను చేయవలసిన దానిని చేసెదను. నామనసిట్లు భావించుచున్నది. </p> <p class="Tat"><span class="CharOverride-2">విరూప ఉవాచ</span> - విరూపు డిట్లనెను. </p> <p class="Poem-1">శృణు ష్వావహితో రాజన్ యథైతద్ధారయామ్యహమ్, </p> <p class="Poem2">వికృతస్యాస్య రాజర్షే నిఖిలేన నరాధిప . 91 </p> <p class="Tat">ఓ రాజర్షీ! ఈ వికృతునకు నేనెట్లు ఋణపడితినో అంతయు చెప్పెదను. శ్రద్ధగా వినుము. </p> <p class="Poem-1">అనేన ధర్మప్రాప్త్యర్థం శుభా దత్తా పురాఽనఘ, </p> <p class="Poem2">ధేను ర్విప్రాయ రాజర్షే తపః స్వాధ్యాయ శీలినే . 92 </p> <p class="Tat">మునుపితడు మంచిగోవును ధర్మము పొందుటకొరకు, తపస్సు, వేదాధ్యయనము శీలముగా గల విప్రున కొసగెను. </p> <p class="Poem-1">తస్యా శ్చాయం మయా రాజన్ ఫలమభ్యేత్య యాచితః, </p> <p class="Poem2">వికృతేన చ మే దత్తం విశుద్ధే నాస్తరాత్మనా. 93 </p> <p class="Tat">నేను ఈతనికడ కరిగి దాని ఫలమును యాచించితిని. స్వచ్ఛమగు అంతరాత్మతో ఈ వికృతుడు దానిని నాకు దానమిచ్చెను. </p> <p class="Poem-1">తతో మే సుకృతం కర్మ.కృత మాత్మవిశుద్ధయే, </p> <p class="Poem2">గావౌ చ కపిలే క్రీత్వా వత్సలే బహుదోహనే. 94 </p> <p class="Poem2">తే చోంఛ వృత్తయే రాజ న్మయా సమపవర్జితే,</p> <p class="Poem2">యథావిధి యథా శ్రద్ధం తదస్యాహం పునః ప్రభో. 95 </p> <p class="Poem2">ఇహాద్యైవ గృహీత్వా తు ప్రయచ్ఛే ద్ద్విగుణం ఫలమ్,</p> <p class="Poem2">ఏవం స్యాత్పురుష వ్యాఘ్ర కఃశుద్ధః కోఽత్ర దోషవాన్ . 96 </p> <p class="Tat">అటుపై నేను పుణ్యకార్యమును ఆత్మవిశుద్ధి కొరకు చేసితిని. ఎక్కువ పాలిచ్చునవి, దూడలు కలవియునగు రెండు ఆవులను కొని వానిని యథావిధిగ శ్రద్ధకు తగినట్లుగా ఉంఛవృత్తి గల ఈతనికి దానమొసగుటకై తెచ్చితిని. ఇప్పుడు ఇక్కడనే గ్రహించి యిచ్చినచో ఫలము రెట్టింపగును. ఇది యిట్లుండగా ఇందు శుద్ధుడెవడు? దోషము కలవాడెవడు? </p> <p class="Poem-1">ఏవం వివదమానౌ స్వస్త్వామిహా భ్యాగతౌ నృప, </p> <p class="Poem2">కురు ధర్మ మధర్మం వా వినయే నౌ సమాదధ . 97 </p> <p class="Tat">ఇట్లు మేము వాదులాడుచు ఇచట నీకడకు వచ్చితిమి. ధర్మమో, అధర్మమో నీవే నిర్ణయింపుము. మాకు సరియగు సమాధానము చెప్పుము. </p> <p class="Poem-1">యది నేచ్ఛతి మే దానం యథా దత్త మనేన వై, </p> <p class="Poem2">భవా నత్ర స్థిరో భూత్వా మార్గే స్థాపయితాఽద్య నౌ . 98 </p> <p class="Tat">నా దానము నీతడు ఇష్టపడని నాకెట్లు ఈతడు దానమొసగెను? ఇందు నీవు గట్టిగా నిలబడి మా యిద్దరిని ఒక దారిలో పెట్టుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ</span> - రాజిట్లనెను. </p> <p class="Poem-1">దీయమానం నగృహ్ణాసి ఋణం కస్మాత్త్వమద్య వై,</p> <p class="Poem2">యథైవ తేఽభ్యనుజ్ఞాతం తథా గృహ్ణీష్వ మాచిరమ్. 99 </p> <p class="Tat">తిరిగి ఇచ్చుచున్న ఋణమును నీ వేకారణమున గ్రహింపవు? నీ అనుమతిని పొందిన విధముగా ఇచ్చెడు దానిని ఆలసింపక తీసికొనుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">వికృత ఉవాచ</span> - వికృతు డిట్లనెను. </p> <p class="Poem-1">ధారయామీత్యనేనోక్తం దదానీతి తథా మయా, </p> <p class="Poem2">నాయం మే ధారయత్యద్య గచ్ఛతాం యత్ర వాంఛతి. 100 </p> <p class="Tat ParaOverride-1">ఇతడు అప్పుపడెనని పలికెను. ఇచ్చెదను అని నేనంటిని. నేను ఇప్పుడు అప్పుపడలేదు. అతడు కోరినచోటి కరుగవచ్చును. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">దదతోఽస్య న గృహ్ణాసి విషమం ప్రతిభాతి మే, </p> <p class="Poem2">దణ్డ్యో హి త్వం మమ మతో నాస్త్యత్ర ఖలు సంశయః. 101 </p> <p class="Tat ParaOverride-1">ఇత డిచ్చుచుండగా నీవు తీసికొనకున్నావు. ఇది నాకు విపరీతముగా కన్పట్టుచున్నది. నా అభిప్రాయములో నీవు దండింపదగినవాడవు. ఇందు సంశయము లేదు. </p> <p class="Tat"><span class="CharOverride-2">వికృత ఉవాచ </span>- వికృతుడిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">మయాస్య దత్తం రాజర్షే గృహ్ణీయాం తత్కథం పునః, </p> <p class="Poem2">కామ మత్రాపరాధో మే దణ్డ మాజ్ఞాపయ ప్రభో. 102 </p> <p class="Tat ParaOverride-1">రాజర్షీ! నేనతని కొసగినదానిని మరల ఎట్లు పుచ్చుకొందును? ఇందు నా అపరాధమేమో గుర్తించి దండమును ఆజ్ఞాపింపుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">విరూప ఉవాచ</span> - విరూపు గిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">దీయమానం యది మయా నేషిష్యసి కథంచన, </p> <p class="Poem2">నియంస్యతి త్వాం నృపతి రయం ధర్మాను శాసకః. 103 </p> <p class="Tat ParaOverride-1">నేనిచ్చుదానిని నీవెన్నటికి గ్రహింపవేని, ధర్మమును పాలించు ఈ రాజు నిన్ను నిగ్రహించును. </p> <p class="Tat"><span class="CharOverride-2">వికృత ఉవాచ </span>- వికృతు డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-3">స్వం మయా యాచితే నేహ దత్తం కథమిహాద్యతత్, </p> <p class="Poem2">గృహ్ణీయాం గచ్ఛతు భవా నభ్యనుజ్ఞాం దదాని తే. 104 </p> <p class="Tat ParaOverride-1">నన్నడుగగా సొమ్మునిచ్చితిని. మరల ఇప్పుడు దానిని నేనెట్లు తీసికొందును? నీవరుగుము. నీ కనుమతి నిచ్చెదను. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span> - బ్రాహ్మణుడిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">శ్రుత మేతత్త్వయా రాజ న్ననయోః కథితం ద్వయోః,</p> <p class="Poem2"> ప్రతిజ్ఞాతం మయా యత్తే తద్గృహాణా విచారితమ్ . 105 </p> <p class="Tat">రాజా! ఈ యిరువురు చెప్పిన మాట వింటివా? అట్లే నేనును ఇత్తునని చెప్పినదానిని ఆలోచింపక గ్రహింపుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లు పలికెను. </p> <p class="Poem-1">ప్రస్తుతం సుమహత్కార్య మనయో ర్గహ్వరం యథా, </p> <p class="Poem2">జాపకస్య దృఢీకారః కథ మేత ద్భవిష్యతి . 106 </p> <p class="Tat">ప్రస్తుతమగు ఈ మహాకార్యము వీరిరువురి కార్యమువలె మిక్కిలి గంభీరమైనది. జాపకుని గట్టితనమను నిది ఏమి కానున్నది? </p> <p class="Poem-1">యది తావ న్నగృహ్ణామి బ్రాహ్మణే నాపవర్జితమ్, </p> <p class="Poem2">కథం లిప్యేయ మహం పాపేన మహతాఽద్య వై . 107 </p> <p class="Tat">బ్రాహ్మణుడు వదలిన దీనిని గ్రహింపకుందునేని గొప్ప పాపము అంటక నేనెట్లుందును? </p> <p class="Poem-1">తౌ చోవాచ స రాజర్షిః కృతకార్యౌ గమిష్యథ, </p> <p class="Poem2">నేదానీం మామిహాసాద్య రాజధర్మో భవేన్మృషా . 108 </p> <p class="Tat">ఆ రాజర్షి వారిరువురితో ఇట్లనెను. మీరు కార్యము తీరినవారై వెళ్లెదరు. నన్ను చేరుకొని రాజధర్మము అబద్ధము కారాదు. </p> <p class="Poem-1">స్వధర్మః పరిపాల్యస్తు రాజ్ఞా మితి వినిశ్చయః, </p> <p class="Poem2">విప్రధర్మశ్చ గహనో మామనాత్మాన మావిశత్. 109 </p> <p class="Tat">రాజులు స్వధర్మమును చక్కగా పాలింపవలయునని నిర్ణయము. చొరనలవికాని విప్రధర్మము నా నీచబుద్ధిని ఆవేశించెను. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1">గృహాణ ధారయేఽహం చ యాచితం సంశ్రుతం మయా, </p> <p class="Poem2">న చేద్గ్రహీష్యసే రాజన్ శపిష్యే త్వాం న సంశయః . 110 </p> <p class="Tat">నేను నీకప్పు పడితిని. తీసికొనుము. నీవు నన్నడిగితివి. నేను మాట యిచ్చితిని. నీవు గ్రహింపకున్నచో రాజా! నేను నిన్ను శపింతును. సంశయము లేదు. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లు పలికెను. </p> <p class="Poem-1">ధిగ్రాజధర్మం యస్యాయం కార్యస్యేహ వినిశ్చయః, </p> <p class="Poem2">ఇత్యర్థం మేగ్రహీతవ్యం కథం తుల్యం భవేదితి . 111 </p> <p class="Tat">ఛీ! రాజ ధర్మమెంత నీచమైనది! ఈ పని నిర్ణయము ఇటువంటిదాయెను. ఈ అర్థమును నేను గ్రహింపవలయును. ఈ రాజధర్మము బ్రాహ్మణ ధర్మముతో ఎట్లు తుల్యమగును? </p> <p class="Poem-1">ఏష పాణి ర పూర్వం మే నిక్షేపార్థం ప్రసారితః, </p> <p class="Poem2">యన్మే ధారయసే విప్ర తదిదానీం ప్రదీయతామ్. 112 </p> <p class="Tat">ఈ నా చేతిని ఇంతకు మునుపు నిక్షేపముకొరకు చూచియుండలేదు. ఓయి విప్రా! నాకు అప్పుపడిన దానిని ఇప్పు డిమ్ము. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">సంహితాం జపతా యావాన్ గుణః కశ్చిత్కృతో మయా, </p> <p class="Poem2">తత్సర్వం ప్రతిగృహ్ణీష్వ యది కిఞ్చిదిహాస్తి మే . 113 </p> <p class="Tat">సంహితను జపించుచు నేను ఎంత గుణమును సాధించినది ఏది యేది కలదో, దానినంతటిని తీసికొనుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ </span>- రాజిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">జల మేత న్నిపతితం మమ పాణౌ ద్విజోత్తమ, </p> <p class="Poem2">సమమస్తు సహైవాస్తు ప్రతిగృహ్ణాతు వై భవాన్. 114 </p> <p class="Tat">బ్రాహ్మణోత్తమా! ఈ జలము నాచేతియందు ఉంచబడినది. ఇది సమమగు గాక! కలిసియే యుండుగాక! తమరు స్వీకరింపుడు. </p> <p class="Tat"><span class="CharOverride-2">విరూప ఉవాచ</span> - విరూపు డిట్లనెను. </p> <p class="Poem-1 ParaOverride-3">కామక్రోధౌ విద్ధి నౌ త్వమావాభ్యాం కారితో భవాన్, </p> <p class="Poem2">సహేతి చ యదుక్తం తే సమా లోకా స్తవాస్య చ. 115</p> <p class="Tat">రాజా! మమ్ములను కామక్రోధములుగా ఎరుగుము. నిన్ను మేమే యిట్లు చేసితిమి. 'కలిసి' అని నీవు పలికినట్లు నీకును, ఇతనికిని లోకములు సమములే యగుగాక! </p> <p class="Poem-1">నాయం ధారయతే కిఞ్చి జ్జిజ్ఞాసా త్వత్కృతే కృతా, </p> <p class="Poem2">కాలో ధర్మస్తథా మృత్యుః కామక్రోధౌ తథా యువామ్. 116 </p> <p class="Poem-1">సర్వమన్యోన్య నిష్కర్షే నిఘృష్టం పశ్యత స్తవ, </p> <p class="Poem2">గచ్ఛ లోకాన్ జితాన్ స్వేన కర్మణా యత్ర వాంఛసి. 117 </p> <p class="Tat">ఇత డే కొంచెము ఋణపడలేదు. నీకు జ్ఞానబోధ చేయుటకై యిది యంతయు ఏర్పాటుచేయబడినది. కాలుడు, ధర్ముడు, మృత్యువు, కామ క్రోధములు, మీరిరువురు - ఒకరినొకరు చర్చించుకొని నీవు చూచుచుండగా నిన్ను పరీక్షించిరి. ఈ నీదగు కర్మముతో పుణ్యలోకముల నన్నింటిని జయించితివి. కోరినచోటి కరుగుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ముడిట్లు చెప్పెను. </p> <p class="Poem-1">జాపకానాం ఫలా వాప్తి ర్మయా తే సంప్రదర్శితా,</p> <p class="Poem2"> గతిః స్థానం చ లోకాశ్చ జాపకేన యథా జితాః. 118 </p> <p class="Tat">జపపరాయణులు ఫలము పొందుట యెట్లో నేను నీకు నిరూపించితిని. వారి గతి, స్థానము, లోకములు అనునవి సాధింపబడు తీరులను వివరించెదను. </p> <p class="Poem-1">ప్రయాతి సంహితాధ్యాయీ బ్రహ్మాణం పరమేష్ఠినమ్, </p> <p class="Poem2">అథవాఽగ్నిం సమాయాతి సూర్య మావిశతేఽపి వా. 119 </p> <p class="Tat">వేదసంహితను అధ్యయనము చేయువాడు పరమేష్ఠియగు బ్రహ్మనో, అగ్నినో, సూర్యునో చేరుకొనును. </p> <p class="Poem-1">స తైజసేన భావేన యది తత్ర రమత్యుత, </p> <p class="Poem2">గుణాం స్తేషాం సమాధత్తే రాగేణ ప్రతిమోహితః. 120 </p> <p class="Tat">ఆతడు తేజోమయభావముతో అందు ఆనందపడునేని రాగముతో ప్రతిమోహితుడై వారి గుణములను పొందును. </p> <p class="Poem-1">ఏవం సోమే తథా వాయౌ భూమ్యాకాశశరీరగః, </p> <p class="Poem2">సరాగ స్తత్ర వసతి గుణాంస్తేషాం సమాచరన్. 121 </p> <p class="Tat">అట్లే చంద్రునియందు, వాయువునందు, భూమి, ఆకాశము అనువాని శరీరములను పొంది సంచరించువాడై, అందు రాగము కలవాడై వారి గుణములను సమాచరించుచు అందే వసించును. </p> <p class="Poem-1">అథ తత్ర విరాగీ స గచ్ఛతి త్వథ సంశయమ్, </p> <p class="Poem2">పర మవ్యయ మిచ్ఛన్ స తమే వావిశతే పునః. 122 </p> <p class="Tat">అట్లుకాక అందు విరాగములేనివాడైనచో, లేదా సంశయము పొందినవాడైనచో, పరము, అవ్యయమునగు తత్త్వమును కాంక్షించుచు ఆ పరమేష్ఠినే చేరుకొనును. </p> <p class="Poem-1">అమృతాచ్చామృతం ప్రాప్తః శాన్తీభూతో నిరాత్మవాన్, </p> <p class="Poem2">బ్రహ్మభూతః స నిర్ద్వన్ద్వః సుఖీ శాన్తో నిరామయః. 123 </p> <p class="Tat">అమృతమునుండి అమృతమును పొందినవాడు, శాంతీభూతుడు, నిరాత్ముడు, బ్రహ్మభూతుడు, ద్వంద్వములేని వాడు, సుఖవంతుడు, శాంతుడు, నిరామయుడు నగును. </p> <p class="Poem-1">బ్రహ్మస్థాన మనావర్త మేక మక్షర సంజ్ఞకమ్, </p> <p class="Poem2">అదుఃఖ మజరం శాస్త్రం స్థానం తత్ప్రతిపద్యతే. 124 </p> <p class="Tat">తిరిగివచ్చెడు స్థితిలేనిది, ఏకము, అక్షరమను పేరుకలది, దుఃఖము లేనిది, ముదిమిలేనిది, శాంతము అగు బ్రహ్మస్థానము నతడు పొందును. </p> <p class="Poem-1">చతుర్భి ర్లక్షణై ర్హీనం తథా షడ్భిః సషోడశైః, </p> <p class="Poem2">పురుషం తమతిక్రమ్య ఆకాశం ప్రతిపద్యతే. 125 </p> <p class="Tat">నాలుగు లక్షణములులేనివాడు, అట్లే ఆరింటితో, పదునారింటితో కూడనివాడు అగు పురుషుని, ఆకాశము నతిక్రమించి, చేరుకొనును. </p> <p class="Poem-1">అథ నేచ్ఛతి రాగాత్మా సర్వం తదధితిష్ఠతి, </p> <p class="Poem2">యచ్చ ప్రార్థయతే తచ్చ మనసా ప్రతిపద్యతే. 126 </p> <p class="Tat">అట్లుకాక రాగమునందు బుద్ధికలవాడై ఆ పురుషుని కోరనివాడైనచో సర్వము నధిష్ఠించి మనస్సు దేనిని కోరునో ఆ రూపమును పొందును. </p> <p class="Poem-1">అథవా చేక్షతే లోకాన్ సర్వా న్నిరయసంశ్రితాన్, </p> <p class="Poem2">నిఃస్పృహాః సర్వతో ముక్త స్తత్ర వై రమతే సుఖమ్. 127 </p> <p class="Tat">అట్లు కాక లోకములన్నియు నిరయమునాశ్రయించినవని పరిశీలించువాడైనచో నిస్పృహుడై అన్నింటినుండి ముక్తిపొందినవాడై అందు సుఖముగా రమించును. </p> <p class="Poem-1">ఏవ మేవ మహారాజ జాపకస్య గతి ర్యథా, </p> <p class="Poem2">ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతు మర్హసి. 128 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి <br/>జాపకోపాఖ్యానే </span><span class="CharOverride-2">న</span><span class="CharOverride-2">వ</span><span class="CharOverride-2">న</span><span class="CharOverride-2">వత్యధిక శతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">మహారాజా! ఇట్లు నీకు జాపకుని గతిని గూర్చి సర్వమును చెప్పితిని. ఇంకను ఏమి వినగోరుదువు? </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున <br/>జాపకోపాఖ్యానము గల నూటతొంబది తొమ్మిదవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-2">యుధిష్ఠిర ఉవాచ </span>- యుధిష్ఠిరుడిట్లు పలికెను. </p> <p class="Poem-1">కి ముత్తరం తదా తౌ స్మ చక్రతు స్తస్యభాషితే, </p> <p class="Poem2">బ్రాహ్మణో వాఽథ వా రాజా తన్మే బ్రూహి పితామహ . 1 </p> <p class="Tat">ఆ విరూపుని మాటను విన్న తరువాత ఆ బ్రాహ్మణుడును, ఆ రాజును ఏమి చేసిరో తాతా! దానిని నాకు చెప్పుము. </p> <p class="Poem-1 ParaOverride-3">అథవా తౌ గతౌ తత్ర యదేత త్కీర్తితం త్వయా, </p> <p class="Poem2">సంవాదో వా తయోః కోఽభూత్ కిం వా తౌ తత్ర చక్రతుః . 2 </p> <p class="Tat">లేక వారిరువురు నీవు చెప్పినలోకముల కరిగిరా? పిదప వారిరువురకు నయిన సంవాదమెట్టిది? అందు వారేమి చేసిరి? </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ముడిట్లు చెప్పెను. </p> <p class="Poem-1">తథేత్యేవం ప్రతిశ్రుత్య ధర్మం సంపూజ్య చ ప్రభో, </p> <p class="Poem2 ParaOverride-2">యమం కాలం చ మృత్యుం చ స్వర్గం సంపూజ్య చార్హతః . 3 </p> <p class="Poem2">పూర్వం యే చాపరే తత్ర సమేతా బ్రాహ్మణర్షభాః, </p> <p class="Poem2 ParaOverride-2">సర్వాన్ సంపూజ్య శిరసా రాజానం సోఽబ్రవీ ద్ద్విజః . 4 </p> <p class="Tat">అట్లే యని మాటనొసగి ధర్ముని, యముని, కాలుని, మృత్యువును, స్వర్గమును, ఇతర పూజ్యులను చక్కగా పూజించి, మరియు అచటకు చేరవచ్చిన బ్రాహ్మణ శ్రేష్ఠులను తలవంచి గౌరవించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను. </p> <p class="Poem-1">ఫలే నానేన సంయుక్తో రాజర్షే గచ్ఛ ముఖ్యతామ్, </p> <p class="Poem2">భవతా చాభ్యనుజ్ఞాతో జపేయం భూయ ఏవ హి . 5 </p> <p class="Tat">రాజర్షీ! ఈ ఫలముతో కూడినవాడవై నీవు గణనీయస్థితిని పొందుము. నీ వనుమతింపగా నేనును మరల జపము చేసికొందును. </p> <p class="Poem-1">వరశ్చ మమ పూర్వం హి దత్తో దేవ్యా మహాబల, </p> <p class="Poem2">శ్రద్ధా తే జపతో నిత్యం భవత్వితి విశాంపతే. 6 </p> <p class="Tat">ఓ మహాబలా! పూర్వము దేవి నాకు జపమొనరించు నీకు చెడని శ్రద్ధ కలుగుగాక! అని వరమును కూడ ఇచ్చెను. </p> <p class="Tat"><span class="CharOverride-2">రాజోవాచ -</span> రాజిట్లనెను. </p> <p class="Poem-1">యద్యేవ మఫలా సిద్ధిః శ్రద్ధా చ జపితుం తవ, </p> <p class="Poem2">గచ్ఛ విప్ర మయా సార్ధం జాపకం ఫల మాప్నుహి . 7 </p> <p class="Tat">ఈ విధముగా నీసిద్ది ఫలములేనిది అయినను ఓ విప్రుడా! పొమ్ము. నాతోపాటు జపమువలన కలిగెడు ఫలమును పొందుము. </p> <p class="Tat"><span class="CharOverride-2">బ్రాహ్మణ ఉవాచ </span>- బ్రాహ్మణు డిట్లనెను. </p> <p class="Poem-1">కృతః ప్రయత్నః సుమహాన్ సర్వేషాం సన్నిధా విహ, </p> <p class="Poem2">సహ తుల్య ఫలా వావాం గచ్ఛావో యత్ర నౌ గతిః . 8 </p> <p class="Tat">ఈ అందరి యెదుట పెద్ద ప్రయత్నము చేసితిమి. కలిసి సమానమగు ఫలము పొందిన మన మిరువురము మన మన తావుల కరుగుదము. </p> <p class="Poem-1">వ్యవసాయం తయో స్తత్ర విదిత్వా త్రిదశేశ్వరః,</p> <p class="Poem2"> సహ దేవై రుపయయౌ లోకపాలై స్తథైవ చ . 9 </p> <p class="Tat">ఆ యిద్దరి వ్యవసాయమును తెలిసికొని దేవేంద్రుడు, దేవతలతో, లోకపాలురతో పాటుగా నచటకు వచ్చెను. </p> <p class="Poem-1">సాధ్యాశ్చ విశ్వే మరుతో వాద్యాని సుమహాన్తి చ,</p> <p class="Poem2 ParaOverride-2"> నద్యః శైలాః సముద్రాశ్చ తీర్థాని వివిధాని చ. 10 </p> <p class="Poem2 ParaOverride-2">తపాంసి సంయోగవిధి ర్వేదాః స్తోభాః సరస్వతీ, </p> <p class="Poem2 ParaOverride-2">నారదః పర్వతశ్చైవ విశ్వావసు ర్హహా హుహూః . 11 </p> <p class="Poem2 ParaOverride-2">గన్ధర్వ శ్చిత్రసేనశ్చ పరివారగణై ర్యుతః, </p> <p class="Poem2 ParaOverride-2">నాగాః సిద్ధాశ్చ మునయో దేవదేవః ప్రజాపతిః, 12 </p> <p class="Poem2 ParaOverride-2">విష్ణుః సహస్రశీర్షశ్చ దేవోఽ చిన్త్యః సమాగమత్. </p> <p class="Tat ParaOverride-1">సాధ్యులు, విశ్వదేవతలు, మరుత్తులు, గొప్పవాద్యములు, నదులు, కొండలు, సముద్రములు, వివిధములగు తీర్థములు, తపస్సులు, వేదాంతములు, వేదములు, స్తోభములు, సరస్వతి, నారదుడు, విశ్వావసువు, హహాహుహువు, పరివారగణములతో కూడిన గంధర్వుడు చిత్రసేనుడు, నాగులు, సిద్ధులు, మునులు, దేవదేవుడగు ప్రజాపతి, వేయి తలలు గలవాడు, ఊహకందని వాడునగు విష్ణుదేవుడు - వీరందరు వచ్చిరి. </p> <p class="Poem3 ParaOverride-1">అవాద్యన్తా న్తరిక్షే చ భేర్య స్తూర్యాణి వా విఖో, 13 </p> <p class="Poem2"> పుష్పవర్షాణి దివ్యాని తత్ర తేషాం మహాత్మనామ్, </p> <p class="Poem2">ననృతు శ్చాప్సరః సంఘా స్తత్ర తత్ర సమస్తతః . 14 </p> <p class="Tat ParaOverride-1">అంతరిక్షమున భేరులు, వాద్యములు మ్రోగినవి. అందామహాత్ముల దివ్యములగు పూలవానలు కురిసినవి. అప్సరసల గుంపులు అందందు నిండుగా నృత్యములొనర్చెను. </p> <p class="Poem-1 ParaOverride-1">అథ స్వర్గ స్తథా రూపీ బ్రాహ్మణం వాక్య మబ్రవీత్, </p> <p class="Poem2">సంసిద్ధ స్త్వం మహాభాగ స్త్వం చ సిద్ధ స్తథా నృప . 15 </p> <p class="Tat">అంత రూపముతాల్చి వచ్చిన స్వర్గము బ్రాహ్మణునితో ఇట్లు పలికెను. ఓయి! నీవు పుణ్యాత్ముడవు సంసిద్ధి నందితివి. ఓ రాజా! నీవును సిద్ధుడవయితివి. </p> <p class="Poem-1 ParaOverride-1">అథ తౌ సహితౌ రాజ న్నన్యోన్యవిధినా తతః, </p> <p class="Poem2">విషయ ప్రతి సంహార ముభా వేవ ప్రచక్రతుః . 16 </p> <p class="Tat ParaOverride-1">రాజా! అంత నాయిరువురు ఒకరినొకరు ఉపకారము చేసికొను పనితో కలిసినవారై విషయములను అణచివేయుటను ఇద్దరు ఆచరించిరి. </p> <p class="Poem-1">ప్రాణాపానౌ తథోదానం సమానం వ్యాన మేవ చ, </p> <p class="Poem2">ఏవం తౌ మనసి స్థాప్య దధతుః ప్రాణయో ర్మనః. 17 </p> <p class="Tat">ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అనువానిని మనస్సునందు నెలకొల్పి ప్రాణములను మనస్సునందు నిలిపిరి. </p> <p class="Poem-1">ఉపస్థితకృతౌ తౌ చ నాసికాగ్ర మధో భ్రువోః, </p> <p class="Poem2">భ్రుకుట్యా చైవ మనసా శనై ర్ధారయత స్తదా. 18 </p> <p class="Tat">పద్మాసనము వేసికొన్నవారై కనుబొమల క్రింద నాసికాగ్రమును చూచుచు, మనస్సుతోపాటు ఆ ప్రాణాపానములను కనుబొమల నడుమ ప్రదేశమున మెల్లగా నిలుపుకొనిరి. </p> <p class="Poem-1">నిశ్చేష్టాభ్యాం శరీరాభ్యాం స్థిరదృష్టీ సమాహితౌ, </p> <p class="Poem2">జితాత్మానౌ తథాఽఽదాయ మూర్ధన్యాత్మాన మేవ చ 19 </p> <p class="Tat">చేష్టలుడిగిన శరీరములతో, కదలని దృష్టులు కలవారై, నిశ్చలభావముతో, మనస్సును జయించినవారై ఆత్మను తలయందు నెలకొల్పుకొనియుండిరి. </p> <p class="Poem-1">తాలుదేశ మథోద్దాల్య బ్రాహ్మణస్య మహాత్మనః, </p> <p class="Poem2">జ్యోతి ర్జ్వాలా సుమహతీ జగామ త్రిదివం తదా. 20 </p> <p class="Tat">అప్పుడు మహాత్ముడగు బ్రాహ్మణుని బ్రహ్మరంధ్రమును పగులగొట్టి మిక్కిలి పెద్దదియగు జ్యోతిర్జ్వాల స్వర్గమున కరిగెను. </p> <p class="Poem-1 ParaOverride-1">మహాకార స్తథా దిక్షు సర్వేషాం సుమహా నభూత్,</p> <p class="Poem2"> తజ్జ్యోతిః స్తూయమానం స్మ బ్రహ్మాణం ప్రావిశత్తదా. 21 </p> <p class="Tat">అందరి హాహాకారము పెద్ద పెట్టున దిక్కులందు చెలరేగెను. అందరు కొనియాడుచుండగా ఆ జ్యోతి అప్పుడు బ్రహ్మను చేరుకొనెను. </p> <p class="Poem-1">తతః స్వాగత మిత్యాహ తత్తేజః ప్రపితామహః,</p> <p class="Poem2"> ప్రాదేశమాత్రం పురుషం ప్రత్యుద్గమ్య విశాంపతే. 22 </p> <p class="Tat ParaOverride-1">జానెడు కొలతగల పురుష స్వరూపమైన ఆ వెలుగునకు ఎదురేగి బ్రహ్మ స్వాగతము పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-20">భూయశ్చైవాపరం ప్రాహ వచనం మధురం తదా, </p> <p class="Poem2">జాపకై స్తుల్యఫలతా యోగానాం నాత్ర సంశయః. 23 </p> <p class="Tat ParaOverride-1">మరియు మధురమగు నొక వాక్యము నిట్లు అతడు పలికెను. యోగులకు జాపకులతో సమానమగు ఫలము కలదు. ఇందు సంశయము లేదు. </p> <p class="Poem-1 ParaOverride-1">యోగస్య తావ దేతేభ్యః ప్రత్యక్షం ఫలదర్శనమ్, </p> <p class="Poem2">జాపకానాం విశిష్టం తు ప్రత్యుత్థానం సమాహితమ్ . 24 </p> <p class="Tat ParaOverride-1">యోగియొక్క ఫలదర్శనము వీరికి ప్రత్యక్షము. జాపకులకన్ననో బ్రహ్మ ఎదురేగుట విశిష్టముగా ఏర్పడినది. </p> <p class="Poem-1 ParaOverride-3">ఉష్యతాం మయి చేత్యుక్త్యా చేతయత్సతతం పునః,</p> <p class="Poem2"> అథాస్యం ప్రవిశేశాస్య బ్రాహ్మణో విగతజ్వరః . 25 </p> <p class="Tat ParaOverride-1">నాయందు నీవు వసింతువు గాక అని పలికి ఆ జ్యోతికి మరల ఒకసారి చైతన్యము కలిపించెను. అంత నా బ్రాహ్మణుడు, ఎట్టి బాధలు లేనివాడై ఆ బ్రహ్మదేవుని ముఖములోనికి ప్రవేశించెను. </p> <p class="Poem-1 ParaOverride-1">రాజాప్యేతేన విధినా భగవంతం పితామహమ్, </p> <p class="Poem2">యథైవ ద్విజశార్దూల స్తథైవ ప్రావిశ త్తదా . 26 </p> <p class="Tat ParaOverride-1">ఆ బ్రాహ్మణుడెట్లో అట్లే ఆ నృపతియు ఇదే విధితో భగవంతుడగు బ్రహ్మలోనికి ప్రవేశించెను. </p> <p class="Poem-1 ParaOverride-1">స్వయంభువ మథో దేవా అభివాద్య తతోఽబ్రువన్, </p> <p class="Poem2">జాపకానాం విశిష్టం తు ప్రత్యుత్థానం సమాహితమ్ . 27 </p> <p class="Tat ParaOverride-1">అప్పుడు దేవతలందరు బ్రహ్మకు అభివాదము చేసి యిట్లు పలికిరి; జాపకులకు విశిష్టమగు ప్రత్యుత్థానము ఏర్పరచిరి. </p> <p class="Poem-1 ParaOverride-1">జాపకార్థమయం యత్నో యదర్థం వయ మాగతాః, </p> <p class="Poem2">కృతపూజా విమౌ తుల్యౌ త్వయా తుల్యఫలా విమౌ . 28 </p> <p class="Tat ParaOverride-1">జాపకులకొరకు ఈ ప్రయత్నమని మేమందరము ఇచటకు వచ్చితిమి. పూజచేసిన వీరిరువురు సమానులు. అట్లే నీవు వీరిని సమానఫలము గలవారినిగా చేసితివి. </p> <p class="Poem-1 ParaOverride-1">యోగ జాపకయో ర్దృష్టం ఫలం సుమహ దద్య వై, </p> <p class="Poem2">సర్వాన్ లోకా నతిక్రమ్య గచ్ఛేతాం యత్ర వాంఛితమ్. 29 </p> <p class="Tat ParaOverride-1">యోగులయు జాపకులయు గొప్పఫలమెట్టిదో ఈనాడు ప్రత్యక్షముగా చూచితిమి. లోకములనన్నింటిని దాటి వీరిరువురు అనంతసుఖము కల కోరిన చోటి కరుగుదురు. </p> <p class="Tat ParaOverride-1"><span class="CharOverride-2">బ్రహ్మోవాచ </span>- బ్రహ్మ యిట్లు పలికెను. </p> <p class="Poem-1">మహాస్మృతిం పఠేద్యస్తు తథైవానుస్మృతిం శుభామ్,</p> <p class="Poem2">తావప్యేతేన విధినా గచ్ఛేతాం మత్సలోకతామ్. 30 </p> <p class="Tat">మహాస్మృతిని పఠించువాడును, శుభమైన అనుస్మృతిని పఠించువాడును ఇదే విధానముతో నా సాలోక్యమున కరుగుదురు. </p> <p class="Poem-1">యశ్చ యోగే భవేద్భక్తః సోఽపి నాస్త్యత్ర సంశయః, </p> <p class="Poem2">విధినానేన దేహాన్తే మమ లోకా నవాప్నుయాత్. </p> <p class="Poem2">సాధయే గమ్యతాం చైవ యథాస్థానాని సిద్ధయే 31 </p> <p class="Tat">యోగమునందు భక్తిగలవాడును ఇదే విధానముతో దేహమునశించిన పిదప నాలోకములను పొందును. ఇందు సందియము లేదు. </p> <p class="Tat">మీ అందరి ఇష్టమును నేను నెరవేర్తును. సిద్ధికొరకు మీమీ స్థానముల కరుగుడు. </p> <p class="Tat"><span class="CharOverride-2">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు పలికెను. </p> <p class="Poem-1">ఇత్యుక్త్యా తు తదా దేవ స్తత్రై వాంతరధీయత, </p> <p class="Poem2">ఆమన్త్య్ర చ తతో దేవా యయుః స్వంస్వం నివేశనమ్ . 32 </p> <p class="Tat">అని పలికి ఆ దేవు డచటనే అంతర్ధానమందెను. దేవతలును సెలవుగైకొని తమతమ నెలవుల కరిగిరి. </p> <p class="Poem-1">తే చ సర్వే మహాత్మానో ధర్మం సత్కృత్య తత్ర వై, </p> <p class="Poem2">పృష్ఠతో ఽనుయయూ రాజన్ సర్వే సుప్రీతచేతసః . 33 </p> <p class="Tat"> తక్కిన ఆ మహాత్ములందరు ధర్ముని సత్కరించి వారివెంటనే మిక్కిలి ప్రీతినొందిన హృదయములతో నరిగిరి. </p> <p class="Poem-1">ఏతత్ఫలం జాపకానాం గతిశ్చైషా ప్రకీర్తితా, </p> <p class="Poem2">యథాశ్రుతం మహారాజ కిం భూయః శ్రోతు మిచ్ఛసి . 34 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-2">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి <br/>జాపకోపాఖ్యానే ద్విశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">మహారాజా! జపపరాయణులు పొందు ఫలమిట్టిది. గతి యిట్టిది. విన్న మేరకు, నీకు చెప్పితిని. ఇంకను ఏమి వినగోరుదువు. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున <br/>జాపకోపాఖ్యానము గల రెండువందల సంఖ్యగల అధ్యాయము. </p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. ఇట్లు అనృతము వలన తమస్సు పుట్టును మొదలగు గ్రంథ భాగమును వినుట చేత దుఃఖము వలన ఉద్విగ్నుడై మోక్షము దుర్లభమని తలచుచు చిత్తశుద్ధి ద్వారమున మోక్షమును పొందించెడు పుణ్యమే శ్రేయమని నిశ్చయించుకొని దాని విశేష ఫలములను గూర్చి, సారాసార వివేకము కొరకు, ప్రశ్నించుచున్నాడు. </p> <p class="Footer">2. <span class="CharOverride-6">శాంతి</span> అనగా ఉపరతి - ప్రవృత్తి నుండి మరలుట. </p> <p class="Footer">5. <span class="CharOverride-6">కస్య</span><span class="CharOverride-7"> </span>- ఏ అధికారికి, <span class="CharOverride-6">కిమ్</span> - ఏవిధమగు ధర్మాచరణము </p> <p class="Footer">6. <span class="CharOverride-7"> </span><span class="CharOverride-6">స్వధర్మః</span><span class="CharOverride-8"> </span>- తమ తమ వర్ణములకు, ఆశ్రమములకు నియతమగు ధర్మము, దానిని ఆచరించుట </p> <p class="Footer"> యందు, <span class="CharOverride-6">యుక్తాః</span> - శ్రద్ధ గలవారు, యః <span class="CharOverride-6">అన్యథా</span> - విపరీతాచారములు గలవాడు </p> <p class="Footer">7. తనకు ఉచితమైన ధర్మమును గూర్చియే అడుగుచున్నాడు. నాలుగు ఆశ్రమములకు సంబంధించిన ధర్మమే చాతురాశ్రమ్యము. <span class="CharOverride-6">తేషామ్</span> - ఆ ఆశ్రమముల; </p> <p class="Footer">8. <span class="CharOverride-6">తన్ద్రీ</span> - కునుకుట, <span class="CharOverride-6">ఆలస్యమ్</span> - సోమరితనము; <span class="CharOverride-6">అభ్యాసః</span> - అక్షరరూపమున గ్రహించుట; <span class="CharOverride-6">శ్రవణమ్ </span>- దాని యర్థమును విని విచారించుట; </p> <p class="Footer">10. <span class="CharOverride-6">భిక్ష</span> -అతిథులకు; <span class="CharOverride-6">బలి</span> - నేలపై చేయు హోమము; <span class="CharOverride-6">సంవిభాగః</span><span class="CharOverride-8"> </span>- పుత్రాదులకు విభజనము. </p> <p class="Footer">11. <span class="CharOverride-6">ద్రవ్యోపస్కారః</span><span class="CharOverride-8"> </span>- ధనము లేకుండుట; <span class="CharOverride-6">సుఖశక్త్యా</span> - సుఖము కలిగినట్టిది, శక్తికి తగనట్టిది; దేహపీడ లేకుండు ఆసనాదికములతో సత్కారము. </p> <p class="Footer">13. <span class="CharOverride-6">నివాపేన</span>- పితృతర్పణముచేత; </p> <p class="Footer">16. <span class="CharOverride-6">అత్ర</span>- ఈ గృహస్థ ధర్మమునందు వాత్సల్యము మొదలగు విశేషధర్మములను పాటించు నపుడు మాల్యాదుల లాభము సంకల్ప సమకాలమునందే సిద్ధించునని భావము. </p> <p class="Footer">17.<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">త్రివర్గః</span> - ధర్మార్థకామములు - వానితో కూడిన గుణములు - సత్త్వరజస్తమస్సులు - వాని; <span class="CharOverride-6">నిర్వృత్తిః</span> - కృతార్థత ( ముక్తి కారణముగా ) సత్వగుణము గల పురుషుడు - అని కాక ఇతరమైన ఖ్యాతి కల జననము వలన అధికారము - యోగ్యత నశించినవాడగునని భావము. <span class="CharOverride-6">శిష్టానాం</span> - 'తత్త్యమసి' మొదలగు వాక్యములను గురువుల వలన ఉపదేశము పొందిన వారి;</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">191</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">బ్రహ్మచర్యము, గార్హస్థ్య ముల<br/> ధర్మములు</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">191</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">ద్వినవత్యధిక శతతమోఽ ధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">192</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2 ParaOverride-2"><span class="CharOverride-10">వానప్రస్థము, సంన్యాసము <br/>అనువాని ధర్మములు</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">192</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. <span class="CharOverride-7"> </span><span class="CharOverride-6">సికతాః</span> - ఇసుకనేల; <span class="CharOverride-6">శర్కరాః</span> - గులకరాల నేల;<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">వాలుకాః</span><span class="CharOverride-7"> </span>- కంకరరాల వంటి వానితో కూడిన ఇసుక; <span class="CharOverride-6">ఉపస్పర్శవమ్</span> - స్నానము; <span class="CharOverride-6">బలిః</span> - భూమియందు ఇచ్చెడు ఆహుతి; <span class="CharOverride-6">హోమః</span> - అగ్నియందు ఉంచెడు ఆహుతి; <span class="CharOverride-6">విష్టంభః</span> - విలాసముగా - లెక్కచేయక సహించుట; <span class="CharOverride-6">నియమః</span> - అయిదు అగ్నుల నడుమ నుండి సాధనముచేయుట; <span class="CharOverride-6">ఉపయోగః</span> - ఆహారమును తగ్గించుట; <span class="CharOverride-6">చర్యా</span> - పర్యటనము; విహితమ్ - విధానము. </p> <p class="Footer">3. <span class="CharOverride-6">పరిబర్హణమ్</span><span class="CharOverride-8"> </span>: శయ్యమొదలగు భోగసామగ్రి. </p> <p class="Footer">5. తనయందు అగ్నులను చక్కగా ఆరోపించుకొని అగ్ని నుద్దేశించి హవిస్సులతో హోమము చేయవలయును. మునిబృందములతో కూడి అగ్నిచయనము చేసిన వారి లోకమును - ప్రాజాపత్యమను దానిని - అట్టివాడు పొందును. </p> <p class="Footer"> శ్లోకమునకు మరియొక యర్థము. </p> <p class="Footer"><span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">స్వశరీర సంస్థమ్</span> - తన శరీరమునందలి ప్రాణమను అగ్ని హోత్రమును, భైక్లోసగతైః హవిర్బిః - భిక్షావృత్తి చేవచ్చిన హవిస్సులతో; <span class="CharOverride-6">కృత్వా</span><span class="CharOverride-8"> -</span> చేసికొని - భిక్షువుగా నయి అని భావము. <span class="CharOverride-6">శారీరమ్ </span>- శరీరమునందలి, <span class="CharOverride-7">అగ్నిమ్</span> - అగ్ని వలె ప్రకాశించుచుండెడు జీవుని; <span class="CharOverride-6">స్వముఖే</span> - తన ముఖమనెడు వెలువడు మార్గమునందు - పరమాత్మయందు, <span class="CharOverride-6">జుహోతి</span> - వ్రేల్చును; జీవుని బ్రహ్మమునందు ప్రవిలాపనము చేయువాడు - అని భావము; సః - అట్టివాడు; <span class="CharOverride-6">చితాగ్నినామ్</span> - నష్టమైన అగ్నులుగల వారి; <span class="CharOverride-6">లోకమ్</span> - లోకమును - అవ్యక్త భావమును; పొందునని భావము. 'చి' ధాతువునకు నాశము అనునర్థము మంత్రములందు గలదు. </p> <p class="Footer">6. సుసంకల్పితముక్త బుద్ధిః- పూర్తిగా, సంకల్పములను వదలిన బుద్ధికలవాడు, <span class="CharOverride-6">బ్రహ్మలోకమ్</span> - బ్రహ్మమే లోకము - దానిని; </p> <p class="Footer">7. ఇట్లు సాధనములతో కూడిన బ్రహ్మవిద్యను గూర్చి విని బ్రహ్మ సాక్షాత్కారోపాయమును తెలిసికొనగోరినవాడై అడుగుచున్నాడు. </p> <p class="Footer"> <span class="CharOverride-6">పరోలోకః</span><span class="CharOverride-8"> </span>- పరమాత్మ; <span class="CharOverride-6">జ్ఞాతుమ్</span><span class="CharOverride-8"> </span>సాక్షాత్కరించుకొనుటకు;<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">ఇచ్ఛామి</span> - కోరుచున్నాను. </p> <p class="Footer ParaOverride-1">8. ఇచట ఈ విషయమును తెలియవలయును. ఇచట కేవలము హిమత్పర్వతమునకు ఉత్తరమున నున్నది పరలోకముగా ప్రసిద్ధి కెక్కినది యగు స్వర్గమునే చెప్పుచున్నారా? లేక శ్రుతియందు ప్రసిద్ధమైన పరమాత్మనా? స్వర్గము వంటి పుణ్యములు చేయువారు పొందెడు భూభాగమే మూడు ఆశ్రమముల ధర్మఫలముగా నిర్ణయింతుమన్నచో - చెప్పెదము. <span class="CharOverride-8">‘</span><span class="CharOverride-6">అవిన్దనం జ్యోతిరిన ప్రశాస్త్రం పబ్రహ్మలోకం శ్రయతే మనుష్యః</span><span class="CharOverride-8">’</span> - 'ఇంధనములేని జ్యోతివలె ప్రకాశవంతమగు బ్రహ్మలోకమును ఆ మనుష్యుడు ఆశ్రయించును' అను ఈ వాక్యమునకు వెనువెంటనే పుట్టిన ప్రశ్నకు ఆ సంబంధమే ఉత్తరములకు - బ్రహ్మవిద్యా ప్రకరణము నందలి వాక్యములకును ఉండవలయును గదా! అంతేకాని సంబంధములేని మునుపటి మూడు ఆశ్రముల ధర్మఫలమును చెప్పుటలో ఉపసంహారము పొసగదు. ఆ ఆశ్రమములకు అందందు స్వర్గఫలము పొందుట ఫలమనుట సిద్ధించుచునేయున్నది. అట్టి సాధకునకు మానసమను స్వర్గము దుర్లభము కాదనియు తెలియుచున్నది. <span class="CharOverride-8">‘</span><span class="CharOverride-6">పు</span><span class="CharOverride-6">దహే దగ్ని వద్దోషాన్ జయేల్లో కాంశ్చ దుర్జయావ్</span><span class="CharOverride-8">’</span> - ‘అతడు అగ్నివలె దోషములను కాల్చివేయును. గెలువనలవికాని లోకములను గెలుచును’ - అని ఫలము యొక్క ఉపసంహార రూపముగా అది (స్వర్గము) యిచట చెప్పుట అనవసరము. దానివలన ఆనర్థక్య ప్రతిహతములతో బలాబలములు తారుమారగును - అను న్యాయము ననుసరించి శ్రుతియే చెడెడు ప్రమాదము కలదు. ఎట్లనగా<span class="CharOverride-8"> </span><span class="CharOverride-8">“</span><span class="CharOverride-6">ఆకాశాస్తల్లింగా దిత్యత్ర సర్వాణి హ వా ఇ మాని భూతాన్యా కాశాదేవ సముత్పద్యన్తే</span><span class="CharOverride-8">’’ </span>ఆకాశము తల్లింగము వలన- అనుచోట సర్వభూతములును ఆకాశము వలననే ఏర్పడుచున్నవి. అన్నప్పుడు సర్వభూతముల ఉత్పాదకత అను కారణమును బట్టి ఆకాశము - భూతాకాశమును చెప్పునదే అయినను బ్రహ్మపరముగా నిర్ణయింపబడినది - అట్లేయిందును చూడదగును. </p> <p class="Footer ParaOverride-1">9. అపాపకర్మత మొదలగు నాలుగు గుణములు కలవారై మానవులయందు చేరుకొని ఉపద్రవములు లేని వారగుదురని శ్లోకభావము. శ్రుతియు నట్లే చెప్పుచున్నది. - <span class="CharOverride-8">“</span><span class="CharOverride-6">తం వా ఏతం పేతుం తీర్త్వాఽన్ద సన్న వన్ధోభవతి ఉపతాపీ సన్నమపతాపీ భవతి</span><span class="CharOverride-8">’’</span> - ఆ సేతువును - ఆత్మను దాటి - సమాధి కాలములో పొంది గ్రుడ్డివాడు గ్రుడ్డితనము లేనివాడు, తాపము పొందినవాడు-- తాపములు లేనివాడును అగును. </p> <p class="Footer ParaOverride-1">10. <span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">తత్ర కాలే</span> - అని సంబంధము -<span class="CharOverride-7"> </span><span class="CharOverride-6">ఆమృత్యుః - ఆత్మ; తత్ర కాలే</span> - సమాధి కాలమున, <span class="CharOverride-6">ప్రభవతి</span> - ప్రభువగును. ఆత్మ సత్య సంకల్పము కలది అని శాస్త్రవచనము. సత్యసంకల్పము వలన విద్వాంసుడు ‘అనన్యాధిపతి’ యగును. మరియొక అధిపతి లేనివాడు- సర్వేశ్వరుడు - అగును. అందువలననే ఆదేశము - హిమవత్పర్వత పార్శ్వభూమి - అనగా భ్రూమధ్య స్థానము - స్వర్గ సదృశము. </p> <p class="Footer ParaOverride-1">11. ఈ శ్లోకమున <span class="CharOverride-8">“</span><span class="CharOverride-6">ఆత్మమిథువ ఆత్మక్రీడ ఆత్మరతిః</span><span class="CharOverride-8">’’ </span>మొదలగు శ్రుతి వాక్యముల అర్థమును సంగ్రహించుచున్నారు. పరదారలు - అను దానికి పరులు - ఆత్మకంటే వేరయినవారు; దారలు - అని సమాసార్థము; స్వః - ఆత్మయే; <span class="CharOverride-6">దారాః</span> - భార్య, అందు - <span class="CharOverride-6">నిరతః</span> - నిండైన ప్రీతికలవాడు; <span class="CharOverride-7">అజవః</span> - బాహ్యలోకమును బాధించినవాడు త్రోసివేసినవాడు.<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">న అవ్యోన్యం బధ్యతే</span><span class="CharOverride-8"> </span>- ఒకరినొకరు చిక్కువడరు. భేదము లేదు కనుక బంధించువాడు, బంధింపబడు వాడు ఉండరని భావము;<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">ద్రవ్యేషు</span> - సంకల్పమాత్రముచేత వచ్చిన ద్రవ్యములయందు,<span class="CharOverride-7"> న విస్మయః</span> ఆశ్చర్యబుద్ధి యుండదు. <span class="CharOverride-6">ఇదం పర్వం యదయ మాత్మా</span><span class="CharOverride-8">' </span>- ఈ సర్వము ఆత్మయే - మొదలైన శ్రుతివాక్యముల వలన సర్వము ఆత్మమే అను నిశ్చయజ్ఞానము కలుగుట దానికి కారణము. </p> <p class="Footer ParaOverride-1"> ఏలయన :<span class="CharOverride-7"> </span><span class="CharOverride-6">పరోహ్యధర్మోనైవాస్తి</span> - అందు పరము - ఆత్మముకంటె వేరయినది; <span class="CharOverride-6">అధర్మము </span><span class="CharOverride-7">-</span> అనృతము మొదలగునది; <span class="CharOverride-6">నాస్తి</span> - లేదు; <span class="CharOverride-6">సందేహః</span> - సందేహము - దేహము మొదలగునదియే ఆత్మయా? మరియొకటియా ఆ అన్యము కూడ కర్తయా? అకర్తయా అది ఒకటియా పెక్కు విధములైనదియా? అను నీ మొదలైన సంశయము కలుగదు. తత్వము అపరోక్షమగుటచే సర్వసంశయములు పటాపంచలగునని వేదము చెప్పినదికదా! </p> <p class="Footer ParaOverride-1">12. <span class="CharOverride-6">ఇహ</span> - ఇందు - అనగా భ్రూమధ్యముననున్నవారు - అనగా యోగులు. సర్వకామములతో క్రమ్ముకొనబడినవారై తిరిగి భూలోకమున కరుదెంతురు.<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">ప్రాణధారణమాత్రమ్</span> - ప్రాణమనగా పరమాత్మ అందు; ధారణమనగా సర్వకామములను ప్రవిలాపనము చేయుట - అది మాత్రమే. అనగా వారు దివ్యభోగములయందు విరక్తులై యుందురు. కామభోగమును అనుభవింపరని భావము.</p> <p class="Footer ParaOverride-1"> మధ్యముల సంగతి. <span class="CharOverride-6">శ్రమేణ -</span> కొందరు యోగైశ్వర్యమును పొంది ధర్మపరులగుదురు వ్యాసనారదాదులు; ఇతరులు ఉపకారము కొరకే వారి సిద్ది తమ భోగమునకు కాదని భావము;<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">నైకృతికాః</span> - ఆత్మవంచనపరులు - దుఃఖితులు;<span class="CharOverride-8"> </span><span class="CharOverride-6">నిర్ధనాః</span> - క్షీణమైన పుణ్యము కలవారు; <span class="CharOverride-6">అపరే</span><span class="CharOverride-8">,</span> ధర్మపరాః ధనివః - యోగమువలన కలిగిన పరోపకారమువలన పుట్టిన ధర్మధనమును పెంపొందించుకొనువారు. </p> <p class="Footer">15. ఆత్మవంచనపరులకు ఈలోకమున శ్రమాధికము కలుగునని భావము. </p> <p class="Footer">16. <span class="CharOverride-6">వార్తాః</span> - కుశలులు; <span class="CharOverride-6">ఉభయమ్</span><span class="CharOverride-8"> </span>- ధర్మము గ్రహింపదగినదనియు, అధర్మము హేయమనియు ; వేద - తెలిసికొనునో; </p> <p class="Footer">17. <span class="CharOverride-6">సోపధమ్</span> - దంభముతో పాటుగ, </p> <p class="Footer">18.<span class="CharOverride-7"> </span><span class="CharOverride-6">తపః</span> - యోగమువలన కలిగెడు ధర్మము </p> <p class="Footer">19. అందు వలన ఇందే ధర్మాధర్మ విచారమును చేయవలయునని చెప్పుచున్నారు; <span class="CharOverride-7">చిన్తా</span> - విచారము. </p> <p class="Footer">20. <span class="CharOverride-6">ఇష్టమ్</span> - మిక్కిలి ఆప్తమైనది.; <span class="CharOverride-6">బ్రహ్మలోకమ్</span> - హిమవత్పార్మ్వము. </p> <p class="Footer">21 <span class="CharOverride-6">తత్ర వై</span> - అందే; <span class="CharOverride-6">జాయన్తే</span> - ఆవిర్భవింతురు. </p> <p class="Footer">22. <span class="CharOverride-6">సత్కారం</span> - యోగమునందు ఆదరమును; <span class="CharOverride-6">ఋచ్ఛన్తి</span> - పొందుదురు లేనిచో నయ్యెడు దోషమును తరువాతి వాక్య భాగముచే చెప్పుచున్నారు. </p> <p class="Footer">23. <span class="CharOverride-7"> </span><span class="CharOverride-6">ఇహైవ </span><span class="CharOverride-7">-</span> ఈ సంసారమునందే; <span class="CharOverride-6">ఉత్తరాం దిశమ్ </span>- హిమత్పార్శ్వభూమిని;</p> <p class="Footer">24. యోగ కళ సిద్ధించుటకు ఆచార్యునే సర్వదా ఆశ్రయింప వలెను. <span class="CharOverride-8">“</span><span class="CharOverride-6">ఆచార్యవాన్ పురుషోవేద</span><span class="CharOverride-8">” </span>- “ఆచార్యుడు కలవాడే పరమాత్మ నెరుగును!” <span class="CharOverride-8">“</span><span class="CharOverride-6">నైషా తర్కేణ మతి రాపనేయా</span><span class="CharOverride-8">”</span> - ‘ఈ బుద్ధిని - తర్కముతో పొందదలపరాదు’ - ఇత్యాది శ్రుతి వాక్యములు దీనినే తెలుపుచున్నవి; <span class="CharOverride-7">నియతాః</span> - శమము; దమము మొదలగువానితో కూడినవారు;<span class="CharOverride-7"> </span><span class="CharOverride-6">బ్రహ్మచారిణః</span><span class="CharOverride-7"> </span>- బ్రహ్మమునందే త్రికరణముల ప్రవృత్తి కలవారు; <span class="CharOverride-6">పన్థానమ్</span> - రాకపోకల మార్గమును- సగుణమైన బ్రహ్మమును, నిర్గుణ వస్తువును పొందెడు ద్వారమును;<span class="CharOverride-7"> విజానన్తి</span> - చక్కగా ఎరుగుదురు. </p> <p class="Footer">25. <span class="CharOverride-6">బ్రహ్మనిర్మితః</span> - వేదము ప్రకాశింప జేసిన; <span class="CharOverride-6">లోకస్య</span> - లోకమునకు సంబంధించిన; <span class="CharOverride-6">ధర్మాధర్మౌ </span>- కర్తవ్యము, అకర్తవ్యము అను విషయములను </p> <p class="Footer">26. <span class="CharOverride-6">విస్మితః</span> - విస్పష్టమైన అద్వైతశాస్త్ర శ్రవణము చేత అచ్చెరువొందినవాడై. </p> <p class="Footer">27. ఏషః - ఈ ప్రత్యగాత్మ; <span class="CharOverride-6">జగతః ప్రసవః</span> - జగత్తునకు కారణమైనది; అని;<span class="CharOverride-6"> నిఖిలేన</span> - మొత్తముగా; </p> <p class="Poem-1"><span class="CharOverride-11">“పరై రదర్శితః పన్థాః శ్రుతియుక్తి బలాన్మయా | </span></p> <p class="Poem2"><span class="CharOverride-11">యథా కథంచి దున్నీతః పణ్డితాః శోధయన్తు తమ్|| </span></p> <p class="Footer"> “ఇది ఇతరులు దర్శింపని మార్గము. శ్రుతి, యుక్తి అనువాని బలముతో నేనెట్లో దీనిని సాధించితిని. పండితులు దీనిని శోధింతురుగాక” - నీలకంఠులు </p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">త్రినవత్యధిక శతతమోఽధ్యాయః </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">2. <span class="CharOverride-6">ఆచార లక్షణాః </span>- ఆచారము - లక్షణముగా - జ్ఞాపకముగా గలవారు, ఆచారమును తెలియగోరువారు. దీనివలన నీవు మంచివాడవు - అని తాత్పర్యము. </p> <p class="Footer">4. ఉపస్పృశ్య - ఆచమనముగావించి; <span class="CharOverride-6">నదీం తరేత్ -</span> నదియందు స్నానమునకై మునగవలయును. అటుపై తర్పణమని భావము. </p> <p class="Footer">5. <span class="CharOverride-6">ఉపతిష్ఠేత</span> - తనగృహ్యమంత్రములతో పూజింపవలయునని భావము; <span class="CharOverride-6">ఇతరామ్</span> - పశ్చిమదిక్కును </p> <p class="Footer">6. <span class="CharOverride-6">పఞ్చార్ద్రః</span> - రెండుచేతులు, రెండుకాళ్లు, నోరు ఈ అయిదింటిని నీటితో బాగుగా కడుగుకొన్నవాడై - అని భావము </p> <p class="Footer">7. <span class="CharOverride-6">ఆర్ద్రపాణిః</span> - ఉత్తరాపోశనము చేసి - ఆ విధముగా తడిసిన చేతితో భోజనము ముగింపవలయునని భావము </p> <p class="Footer">8. <span class="CharOverride-6">శుచిం దేశమ్</span> - యజ్ఞశాల వంటి వానిని; <span class="CharOverride-6">చైత్యమ్</span> - దేవాలయమును. </p> <p class="Footer ParaOverride-1">9. <span class="CharOverride-6">సామాన్యమ్</span> - సాధారణమైనది. వంటలో పదార్థములలో ఒకేతీరు ఉండవలయును. పాకభేదము చేయరాదని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">10. <span class="CharOverride-6">తథా</span> - ఆ విధముగా భోజనము చేయువాడు; <span class="CharOverride-6">ఉపవాసీ</span> - ఉపవాస ఫలము పొందు వాడగునని భావము. </p> <p class="Footer ParaOverride-1">12. బ్రాహ్మణోచ్ఛిష్టమ్ - బ్రాహ్మణులు భుజింపగా మిగిలినది; <span class="CharOverride-6">జనన్యాః హృదయమ్</span> - తల్లి హృదయమువలె; <span class="CharOverride-6">కృతమ్ </span>- బ్రహ్మచే చేయబడినది; దానిని ఉపాసించువారు సత్యమునే - బ్రహ్మమునే పొందుదురని భావము. ఆహారశుద్ధి ఉన్నచో సత్యశుద్ధి కలుగును. సత్యశుద్ధి యున్నచో స్థిరమైన స్మృతి కలుగును. స్మృతికలుగగా ముడులన్నియు విడివడిపోవును అను క్రమముచేత ఆహారశుద్ధి బ్రహ్మమును పొందించునదగునని వేదము చెప్పుచున్నది.</p> <p class="Footer ParaOverride-1">13. <span class="CharOverride-6">లోష్ఠమర్దీ</span> - యజ్ఞవేదికను నిర్మించుటకొరకు మట్టిని పిసుకువాడు; <span class="CharOverride-6">తృణచ్ఛేదీ</span> - దర్భలను తెచ్చుట కొరకు గడ్డిని కోయువాడు; <span class="CharOverride-6">నఖఖాదీ </span>- గోళ్లతో కోసికోసి యజ్ఞశేషమైన మాంసమును భుజించువాడు; <span class="CharOverride-6">నిత్యోచ్ఛిష్టః</span> - నిత్యమగు సోమపానము చేయువాడు; సంకుసుకః - ఫలములందు లంపటము గలవాడై; <span class="CharOverride-6">మహదాయుః</span> - గొప్పఆయువుగల బ్రహ్మమును; <span class="CharOverride-6">న విన్దతే</span> పొందడు - ఇందు హింసగల యజ్ఞాది కర్మమును నిందించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> దీనికి మరియొక విధమగు నర్థమిట్లున్నది. మట్టిపిసుకుట మొదలగు పనులుచేయువాడు సంకుశుకుడగును. శంకుశుకుడనగా మేకునకు కట్టిన చిలుకవంటివాడు పరాధీనుడు; వృధా పండితుడు అని భావము. </p> <p class="Footer">14. <span class="CharOverride-6"> యజుషా</span> - యజుర్వేదము ఎరిగిన వాడగు అధ్వర్యువు యజ్ఞమునందు సంస్కరింపబడిన మాంసమునుకూడ తినరాదు; <span class="CharOverride-6">వృథా మాంసమ్</span> - సంస్కారము పొందని మాంసమును;<span class="CharOverride-6"> పృష్ఠమాంసమ్ </span>- చరమ మాంసము - శ్రాద్ధమున మిగిలినది - అట్టిదానిని తినరాదు; దీనిచేత హింసాయుక్తమైన ధర్మము చేయరాదను నర్థము సిద్ధించుచున్నది. </p> <p class="Footer">15 గృహస్థుడు చేయవలసిన ధర్మమును చెప్పుచున్నారు. <span class="CharOverride-6">కామ్యకర్మఫలమ్</span> - కమనీయమగు కర్మమగు భిక్షాటనమునకు ఫలమైన అన్నాదికమును; <span class="CharOverride-6">గురూణామ్</span> - తల్లిదండ్రులు మొదలగువారికి; సమర్పింపవలయునని భావము. </p> <p class="Footer">17. <span class="CharOverride-6">ధర్మ్యమ్</span> - ఋతుకాలమునకు సంబంధించినది; </p> <p class="Footer">18. <span class="CharOverride-6">హృదయమనగా</span> రహస్యము; <span class="CharOverride-7">తీర్థమ్</span> - గురువు; శుచిః - అగ్నిః; <span class="CharOverride-6">ఆర్యకృతమ్</span> - శిష్టులు ఆచరించినది; <span class="CharOverride-6">చౌష్యమ్</span> - ప్రశంసింపదగినది; <span class="CharOverride-6">వాలమ్</span> - ఆవుతోక; </p> <p class="Footer">19. <span class="CharOverride-6"> ప్రదిష్టమ్ </span>- కర్తవ్యముగా ఉపదేశింపబడినది. </p> <p class="Footer">20 <span class="CharOverride-6">క్రియాపథే</span> - శ్రుతిస్మృతులు చెప్పిన కర్మములను ఆచరించునపుడు; <span class="CharOverride-6">దక్షిణం పాణి ముధరేత్ </span>- యజ్ఞోపవీతి కావలయును -“<span class="CharOverride-6">అజినంవాసోవా దక్షిణత ఉపవీయ దక్షిణబాహు ముద్ధరతేఽవధత్తే సవ్యమితి యజ్ఞోపవీత మేతదేవ విపరీతం ప్రాచీనావీతమ్</span>” అనిశ్రుతి - కుడిచేయి యెత్తి జందెమును ధరించుటకు ఉపవీతమనియు, దీనికి భిన్నమైనది ప్రాచీనావీత మనియు నెరుగదగును. </p> <p class="Footer">21. విప్రులపూజనమే ఉత్తమ పుణ్యము, ఉత్తమకృషి, దానివలె ఫలము కానవచ్చునని భావము. <span class="CharOverride-6">బాద్యతే</span> - స్థిరముగా చేయబడును. బదస్థైర్యే అని ధాతువు. <span class="CharOverride-6">ధాన్యానామ్ బహుకారం</span> - ధాన్యములను మిక్కిలిగా పెంపొందించుట; గోవులనగా ఇంద్రియములు; అవి పొందవలసిన చోటును పొందించునది యగును. </p> <p class="Footer">22 భోజనము పెట్టునపుడు పెట్టువాడు 'సంపన్నమా?' అని యడుగవలయును. తినెడువాడు సుసంపన్నమనవలయును. పానీయ విషయమున తృప్తి కలిగెనా? అనవలయును. 'మిక్కిలితృప్తి' అని త్రావినవాడనవలయును. పాయసము, గంజి మొదలగు వానినిచ్చి ‘<span class="CharOverride-6">శ్రుతమా</span>’ అని యిచ్చువాడు, సుశ్రుతమని గ్రహించువాడును అనవలయును; యవాగువనగా - గంజి; కృసరమనగా ఒక విధమగు పొంగలి. </p> <p class="Footer">23. <span class="CharOverride-6">సంప్రాప్తే</span> - చేయబడగా; <span class="CharOverride-6">విప్రాణామ్ అభినందనమ్</span> - వందనాదికముత సంతోషణము అది ఆయుష్కర మగునని భావము. </p> <p class="Footer">24. <span class="CharOverride-6">ప్రత్యాదిత్యమ్</span> - సూర్యుని కెదురుగా ఉండి; <span class="CharOverride-7">నమేహేత</span> - మూత్రమును వదలరాదు; <span class="CharOverride-6">శకృత్</span>- మలము; </p> <p class="Footer">25. <span class="CharOverride-6">అవరాణామ్</span> - తమ్ములు, చిన్నవారు మొదలగువారికిః </p> <p class="Footer">26. ఆర్యవృత్తమును సేవింపవలయునని చెప్పిరి. ఆ అభివాదనము మొదలగునది దంభము - </p> <p class="Footer"> ఆడంబరముకొరకును చేయవచ్చును. అట్టి యెడ ఆర్యవృత్తము నెట్లు నిర్ణయించుట అను దానికి సమాధానము చెప్పుచున్నారు;<span class="CharOverride-6"> వైకృతమ్</span> - కన్నులలో కానవచ్చెడు వికారము మొదలగునది. <span class="CharOverride-6">నేత్ర వక్త్ర వికారేణ జ్ఞాయతే ఽన్తర్గతం మనః</span>" - 'ముఖనేత్రవికారములు లోపలి మనస్సును తెలుపును' కదా! </p> <p class="Footer">28. <span class="CharOverride-6">పాపమ్</span> - పాపము చేసిన వానిని; పాపమును వెల్లడిచేయవలయును. ధర్మమును ప్రకటింపరాదని భావము. </p> <p class="Footer">29.<span class="CharOverride-6"> నివర్తమానస్య </span>- శాస్త్రపద్ధతుల యందు నిలువని వానికి </p> <p class="Footer">31. <span class="CharOverride-6">మానసమ్</span> - మనస్సుచేత చేయబడినది; సర్వభూతములకు అభయము నొసగవలయునని తాత్పర్యము.</p> <p class="Footer">32. “<span class="CharOverride-6">సహోభౌ చరతాం ధర్మమ్</span>” - ధర్మమును దంపతులు కలిసి నిర్వహింపవలయును అని హోత్రాదిధర్మము దంపతులకు కలిపి విధించియుండగా ధ్యానయోగమను ధర్మమును ఒక్కడే చేయవలయుననుట యెట్లు? అని శంకించి చెప్పుచున్నారు - <span class="CharOverride-6">నాస్తి ధర్మే సహాయతా</span> - స్త్రీ మొదలగు వారి సహాయత కూడదని భావము అయినచో విధికి గతియేమి యన్నచో మనసు ధర్మశూన్యమైనచో బాహ్యసహాయము విధిచేత లభించినను అది అనర్థకమే అని తాత్పర్యము. దీనినే యిట్లు చెప్పుచున్నారు. </p> <p class="Poem-1"><span class="CharOverride-11">“మన సైవ కృతం రామ న శరీర కృతం కృతమ్ ।</span></p> <p class="Poem2"><span class="CharOverride-11">యేనైవాలింగ్యతే కాన్తా తేనై వాలింగ్య తే సుతా ॥” </span></p> <p class="Footer"> రామా! మనస్సుతో చేసినదే చేత . శరీరము చేసినదికాదు. కాంతను కౌగిలించుకొనినవాడే కూతును కూడ కౌగిలించుకొనును. అందువలన స్త్రీలు మొదలగు సహాయుల అపేక్ష గల ధర్మము ననాదరించి మానసికమైన యోగధర్మమునందు మనస్సును నిలుపవలయునని భావము. </p> <p class="Footer">33. దీనినే ప్రశంసించుచున్నారు. <span class="CharOverride-6">యోనిః - ఉత్పత్తి</span> ప్రళయస్థానము. దేవత్వమును గాని మనుష్యత్వమును గాని పొందించునది ధర్మమే యని భావము.<span class="CharOverride-6"> దివి</span> - హృదయాకారమనెడు బ్రహ్మలోకమున; <span class="CharOverride-6">అమృతమ్</span> - కైవల్య కారణమగు ధర్మమే. అట్లే; <span class="CharOverride-6">ప్రేత్యభావే</span> - అపూర్వ దేహ ప్రాప్తియందును; ధర్మము వలననే సుఖము లభించును - అని భావము; </p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">193</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">ఆచారవిధి </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">193</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. పూర్వము మానసికమైన ధర్మము దేవాదులకును యోని యని చెప్పియున్నారు. అందు ధర్మమనుదాని స్వరూపమేమి? అది దేవాదులకు కారణమెట్లగును? అని అడుగుచున్నారు. అధ్యాత్మమ్ - ఆత్మయనగా చిత్తము దానిని గూర్చి ప్రవృత్తమగు యోగధర్మము అధ్యాత్మము; మానవున కిది కర్తవ్యము అని ఏది శాస్త్రమున విచారణకు వచ్చునో అది అధ్యాత్మము. యత్, యథా అను రెండు శబ్దములచేత దాని లక్షణమేమి?, దాని విధానమేమి? అని రెండు ప్రశ్నలను అడుగుచున్నారు. </p> <p class="Footer">2. బ్రహ్మమే ప్రజలకు కారణమని ప్రసిద్ధము. నీవు మానసమగు ధర్మము కారణముగా చెప్పుచున్నావు - ఇది యెట్లు - అని ప్రశ్నతాత్పర్యము. </p> <p class="Footer">3. <span class="CharOverride-6">శ్రేయస్కరతమమ్</span> - శ్రేయస్కరము ధనము మొదలగునది. శ్రేయస్కరతమము ధర్మము, శ్రేయస్కరతమము ధ్యానయోగము; సుఖమ్ - స్వరూపసుఖమేర్పడుటకు కారణమగుటవలన సుఖమైనది.</p> <p class="Footer">4. సృష్టిస్రళయములను గూర్చి వక్కాణించుటయు అధ్యాత్మవ్యాఖ్యలో ఒకభాగమే. ఎట్లనగా - తెలియదగిన ఆత్మఅనునది ప్రత్యగాత్మకంటి ఇతరమైనచో అది ఉపాసనలో భాగమే యగును. కావున దానియందు వినవచ్చెడు జగత్తు పుట్టుకకు కారణమగుట మొదలగునది ఆకులతో నిండిన ఫలమువలె అర్థవాదమే యగును. ద్రవ్యసంస్కార కర్మములందు మరియొక అర్థము చెప్పుటయే తాత్పర్యము కావున ఫలశ్రుతి అర్థవాద మగుననుట గంటలఘోషవలె మిక్కిలి స్పష్టమైన విషయము. స్త్రీ అగ్ని అనుటవలె ఆరోపణతో చెప్పబడిన నీలగ్రీవత్వము, పీతాంబరత్వము, సత్యకామత్వము, సత్యసంకల్పత్వము, జగత్తు ఏర్పడుటకు కారణమగుట మొదలగు గుణముల చేత ఉపాసనకు స్వరూపసిద్ధి ఏర్పడుచున్నది. అక్కడ ఆరోపింపబడిన గుణములే కలవనుకొందము. అయినను ఆత్మ సర్వగుణములతో కూడినదై తెలియదగినదిగా ఉండుటవలన కుండ మొదలగు వానివలె జడముగా భావించుట తప్పనిసరియే యగుచున్నది. ఆత్మ చిన్మయముకదా, దానిగుణములుకూడ చిన్మయములే కనుక ఆ గుణములకు జడత్వము కలుగదు - అన్నచో ఇందు మా ప్రశ్న ఇది - చిన్మయత్వమా, చిద్వికారత్వమా, చిద్రూపత్వమా? - మొదటిదికాదు, “వాచారంభణం వికారో <span class="CharOverride-6">నామధేయమ్</span>” - ‘క్కులు మొదలగుట వికారము - దానితో పేరు ఏర్పడును’ అను శ్రుతి వాక్యమువలన వికారమైనదానికి అనృతత్వము సిద్ధించును. అప్పుడా గుణములు తుచ్ఛములగును. స్వాత్మయందు వృత్తి విరోధ మేర్పడును కనుక చివరిది కాదు. చిత్తే మరియొక చిత్పదార్థముచేత గ్రహింపదగినదగుట సంభవింపదు. ఆవిధముగా గ్రహింపబడెడు చిత్తునకు చిత్తు కాకపోవుట అను స్థితి ఏర్పడును. </p> <p class="Footer"> ఈ విధముగా తెలియదగినదను ఆత్మ ప్రత్యగాత్మకంటె వేరయినది కాదు. ఆ విధముగా సృష్టికి మొదట ఆత్మసృష్టికి ఉపాదానము (ముడివస్తువు) అని చెప్పుట ఆత్మకు, సృష్టికి భేదము లేదని చెప్పుటకే అధ్యాత్మవ్యాఖ్యానమందే సృష్టిప్రళయములజ్ఞానమునకు సమన్వయము కుదురును. కనుక ఆధ్యాత్మప్రసంగమునందు దానికి సంబంధించిన ప్రశ్నసమాధానములందు సృష్ట్యాదుల ఉపన్యాసము హేతుబద్ధము అగును. </p> <p class="Footer"> <span class="CharOverride-6">అచార్యైః పరిదర్శితమ్</span> - పై విషయమున ప్రమాణమును వక్కాణించుచున్నారు. “<span class="CharOverride-6">ఆత్మైవేదం సర్వమ్</span>” “<span class="CharOverride-6">బ్రహ్మైవేదం సర్వమ్</span>” - “ఈ సర్వమును ఆత్మయే, ఈ సర్వమును బ్రహ్మమే” మొదలగు వేదవాక్యముల ద్వారమున ఆచార్యులు దీనిని సమగ్రముగా దర్శించిరి.</p> <p class="Footer"> ప్రీతిం సౌఖ్యం చ విన్దతి - ప్రీతిని - కానవచ్చెడు సుఖమును, <span class="CharOverride-6">సౌఖ్యమ్</span> - సుఖాత్మక భావమును - స్థితిని; <span class="CharOverride-6">విన్దతి</span> - పొందుచున్నాడు. “<span class="CharOverride-6">యోవేద నిహితంగుహాయాం పరమే వ్యోమన్ సోఽశ్నుతే సర్వాన్ కామాన్ సహ</span>” నిష్క్రియం నిష్కలం శాన్తమ్” - మొదలైనశ్రుతులువీని విషయమునే తెలుపుచున్నవి. 'పరమాకాశమున గుహలో నిహితమైయున్న ఆ ఆత్మను తెలిసినవాడు సర్వకామములను అనుభవించును. కావున ఆత్మనెరిగినవాడు పొందు ఫలము సర్వకామములను పొందుట; హితమనగా దానికి సంబంధించిన జ్ఞానము. </p> <p class="Footer">5. ఆధ్యారోప అపవాద న్యాయము ద్వారమున జ్ఞేయమగు బ్రహ్మమును తటస్థలక్షణము ద్వారా తెలుపుచున్నారు. (అధ్యారోపము - ఒకదానియందు మరొకదానిని ఆరోపించి చెప్పుట; అపవాదము - దానిని తొలగించుట; తటస్థ లక్షణము - గుర్తింపవలసిన దానికి దగ్గరలో నున్నవానిని చూపుట ఆ కాకి వాలినయిల్లు - అన్నట్లు) </p> <p class="Footer"> <span class="CharOverride-6">భూతానామ్</span> - జరాయుజములు మొదలగు నాలుగు విధములైన జీవములకు; <span class="CharOverride-6">ప్రభవాప్యయౌ</span> - పుట్టుకస్థానములు, లయము పొందు స్థానములు. </p> <p class="Footer">6. <span class="CharOverride-6">యతః</span> - ఆనందాత్మకమైన ఏబ్రహ్మమువలన; శ్రుతి “<span class="CharOverride-6">ఆనన్దాన్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే ఆనన్దేన జాతాని జీవన్తి ఆనన్దం ప్రయన్త్యభిసంవిశన్తి</span>” - ‘ఈభూతము లన్నియు ఆనందమువలననే కదా పుట్టుచున్నవి. పుట్టినవై ఆనందముతోడనే జీవించుచున్నవి. ఆనందమును గూర్చియే ప్రయాణించుచు అందు లీనమగుచున్నవి’ - అని చెప్పుచున్నది. <span class="CharOverride-6">తాని యాన్తి</span> - సృజింపబడినవై అందే - ఆనందరూపబ్రహ్మమునందే - లయమునందుచున్నవి. <span class="CharOverride-6">మహాభూతాని</span> - పృథివి మొదలగు మహాభూతములు; <span class="CharOverride-6">భూతేభ్యః</span> - జరాయుజములు మొదలగువాని వలన <span class="CharOverride-6">సాగరస్య, ఊర్మయః</span>, <span class="CharOverride-7">యథా </span>- సముద్రమున అలలు పుట్టి అణగిపోయిన విధముగా - </p> <p class="Footer"> ఇచట జరాయుజములు మొదలగు వాని వలన ఆకాశముమున్నగు వాని ఉత్పత్తి ప్రళయములను చెప్పుచు వానికి ఆనందరూపత్వమును ప్రతిపాదించుచున్నారు. ఆకాశము మొదలగువానికి స్వయముగా ప్రకాశించుట మొదలగు లక్షణములుండుట కల్పనామాత్ర మనియు చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1">7. <span class="CharOverride-6">భూతాని</span> - ఆకాశము మొదలగువానిని; <span class="CharOverride-6">భూతాత్మా</span> - జీవుడు పంచభూతములనే దేహాదుల ఆకారములతో పరిణామము చెందినవానిని భావించుచున్నవాడై - “<span class="CharOverride-6">అస్తి ఖల్వన్యోఽపరో భూతాత్మా యోఽయం సితాసితై రభిభూయమానః సదసద్యోని మాపద్యతే</span>” - అని శ్రుతి ప్రసిద్ధి కలదు. మరియొక భూతాత్మ ఇతరముగా కలదు. అది తెల్లని, నల్లని కర్మ ఫలములు పట్టుకొనిత్రిప్పుచుండగా సత్, అసత్ గర్భములను పొందుచున్నది. దీనివలన తాబేటికంటె అవయవములు వేరుకానియట్లు ఆకాశము మొదలగు పంచభూతములు ప్రత్యగాత్మకంటి ఇతరములు కావని తెలియుచున్నది. </p> <p class="Footer ParaOverride-1">8. అవునయ్యా భూతములతో ఏర్పడిన వానివలన భూతముల ఉత్పత్తి యెట్లు సంభవించును? తండ్రి కొడుకు నుండి పుట్టడు గదా! అను ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నాము. విత్తనమునుండి చెట్టు, చెట్టునుండి విత్తనములు, ఆ విత్తనములనుండి మరల మఱ్ఱిచెట్లు - అన్న విధముగా అవి యేర్పడును. అందు ప్రతిబీజమునందును సూక్ష్మస్వరూపముతో మఱ్ఱిచెట్టుగలదు. అంకురించుటకు మొదలిడిన చింతగింజ పొట్టయందు మొత్తము చింతచెట్టు కూర్పు కానవచ్చుచున్నది కదా! అయినచో ప్రత్యగాత్మకంటె వేరుకానిదిగా గ్రహింపబడిన దేహమునందు సూక్ష్మరూపమున మహాభూతములు కలవు. కనుక ప్రత్యగాత్మ ఆత్మతో తుల్యమైనది అనుఅభిప్రాయముతో చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-6">భూతకృత్</span> - ఈశ్వరుడు; <span class="CharOverride-6">సర్వభూతేషు -</span> శరీరములయందు; <span class="CharOverride-6">మహాభూతాని</span> - ఆకాశము మొదలగు మహాభూతములను; <span class="CharOverride-6">అకరోత్, ఏవ</span> - చేసెననుట నిశ్చయము; <span class="CharOverride-6">తేషు</span> - అట్లు చేయబడిన వానియందున్న; <span class="CharOverride-6">వైషమ్యమ్</span> - విడివిడిగా కన్పట్టుట అను విలక్షణత్వమును; <span class="CharOverride-6">జీవః -</span> దేహమే ఆత్మ అను అభిమానము గలజీవుడు; <span class="CharOverride-6">నపశ్యతి</span> - చూడకున్నాడు. దేహమే ఆత్మగా భావించు జీవునకు ఇది ఆకాశము, ఇది వాయువు మొదలగు విధముగా అయిదు భూతములు విడివిడిగా కానరాకున్నవని తాత్పర్యము. దీనిభావమిది - జీవుడు తాను జీవుడే అను అభిమానమును వదలివైచినచో తాను సర్వమునకు కారణము అని గుర్తించును. ఆవదలివైచుట లేని కారణమువలన కలయందు పట్టుకొన్నను దానిని విశ్వసింపకున్నాడు. అందువలన బాహ్యసృష్టి ఆంతరసృష్టి అనువాని సత్యత్వమును మిథ్యాత్వమును నిశ్చయింపజాలకున్నాడు. </p> <p class="Footer">9. జీవుడు జగత్తునకు ఉపాదానము (ముడి పదార్థము) అనుదానిని ప్రకటించుటకై అతనికి ఆత్మభూతమైన దేహమునందు ఆకాశాదుల అంశములను విభజించి చూపుచున్నారు. <span class="CharOverride-7">ఖాని</span> - ఇంద్రియస్వరూపములైన రంధ్రములు; <span class="CharOverride-6">ఆకాశయోనిజమ్</span> - ఆ కాశమే కారణమైనది. దాని వలన పుట్టినది. </p> <p class="Footer">10. <span class="CharOverride-6">పాకః</span> - అన్నాదులేర్పడుటకు కారణమైనది. </p> <p class="Footer">11. <span class="CharOverride-6">పఞ్చ+ఏవ</span> - అయిదే - 'దేహమునందున్న' అను అర్థమును కలుపుకొనవలయును. </p> <p class="Footer">12. ఇంద్రియములు భూతములందంతర్భూతములు - అందే కలిసియున్నట్టివి. మనస్సనెడు కర్తను జీవుడందురు. అతని విజ్ఞానములు వృత్తిరూపములు. ఆ యింద్రియములు మనస్సు కలసిన స్వరూపమే బుద్ధి. అది ఏడవది. క్షేత్రజ్ఞుడు సాక్షిమాత్రముగా నుండును. </p> <p class="Footer">13. <span class="CharOverride-6">చక్షుః</span> - కన్ను - ఇది తక్కిన ముక్కు మొదలగు వానిని కూడ తెలియజేయును. <span class="CharOverride-6">ఆలోచనాయ</span> - విషయములను గ్రహించుటకును; <span class="CharOverride-6">అధ్యవసానాయ </span>- నిశ్చయించుటకు; క్షేత్రజ్ఞః - క్షేత్రజ్ఞుడు, <span class="CharOverride-6">సాక్షివత్ </span>- ఏదియు పట్టనివాడై తెలిసినవానివంటివాడు. సాక్షికికూడ సాక్ష్యము అనునది ఉపాధికనుక ఆత్మధర్మము దానికుండదని చెప్పినట్లయినది. </p> <p class="Footer">14. ఈ సాక్షి అను చైతన్యము రెండు అరికాళ్లు మొదలుకొని పైనున్న శరీరమునంతటిని క్రిందికి మీదికి చూచుచుండును. కనుక పైకి కానవచ్చుచున్న దేహమును, సందులు కలిగిన ఆకాశమే ఉదరముగా గలలోపలి భాగమును మొత్తముగా వ్యాపించియున్నదని భావము. </p> <p class="Footer">15. ఇట్లు బుద్ధి మొదలగువానికి సాక్షిగా నయిన క్షేత్రజ్ఞనకు బ్రహ్మభావమును చెప్పిరి. అట్లు బుద్ధ్యాదులతో కూడియున్న ప్రత్యగాత్మ మహాభూతములను సృష్టించెననియు ఇంతకు ముందు చెప్పియున్నారు. దానిని యుక్తిచేతను, శ్రుతిచేతను ఆలోచింపవలయునని ఈ శ్లోకమున చెప్పుచున్నారు. <span class="CharOverride-6">కృత్ప్నశః</span> - సంపూర్ణముగా; <span class="CharOverride-6">వేదితవ్యాని</span> - పరీక్షింపదగినవి. ఇన్ద్రియాణి - ఇంద్రియములు - ఇది మనస్సును, బుద్ధిని కూడ గ్రహించును. </p> <p class="Footer">16. పై శ్లోకమున చెప్పిన దానినే మరింత రుచి కలిగించుటకై వివరింపగోరుచు అజ్ఞానఫలమును గూర్చి చెప్పుచున్నారు. <span class="CharOverride-7">ఏతామ్</span> - ఈ త్రిగుణాత్మికయగు బుద్దిని - మూల ప్రకృతిని; <span class="CharOverride-6">భూతానామ్</span> - ఆకాశము మొదలగు పంచభూతముల, జరాయుజములు మొదలగు ప్రాణులయు, <span class="CharOverride-6">ఆగతిమ్</span> - పైకివచ్చు స్థానమును; <span class="CharOverride-12">గతిమ్</span> - లయస్థానమును, బుద్ధ్యా - విచారపూర్వకముగా పరిశీలించి; <span class="CharOverride-6">శనైః</span> మెల్లగా - వైరాగ్యము, వివేకమును పెంపొందించుకొనుట అనుక్రమముతో, <span class="CharOverride-6">ఉత్తమం, శమమ్</span> - సుఖమును - ప్రత్యగానందమును, <span class="CharOverride-6">లభతే</span> - పొందును; మెడయందేయున్న బంగారుహారమును మరచినవాడుగుర్తు తెచ్చుకొనుట ద్వారా ఆనందపడినట్లు తత్త్వమసి మొదలగు వేదాంత వాక్యముల ద్వారా తెలిసికొని ఆనందించునని భావము.</p> <p class="Footer">17. భూతముల రాకపోకలనే వివరించుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-6">గుణైః</span> - తమస్సు మొదలగు గుణములచేత;<span class="CharOverride-6"> బుద్ధిః</span> - బుద్ధి; <span class="CharOverride-6">నే</span><span class="CharOverride-6">నీయతే</span> - మరల మరల అతిశయముగా విషయముల స్వరూపముగా (శబ్దము మొదలగునవి విషయములు) రూపొందును; అందువలన; <span class="CharOverride-6">బుద్ధిః, </span>ఏవ, ఇన్ద్రియాణి, ఆపి - మనస్సుతోపాటుగ ఆరైన ఇంద్రియములు బుద్ధియే; <span class="CharOverride-6">భూతాని</span> - ఆకాశము మొదలైన అయిదు భూతములు, జరాయుజములు మొదలైన నాలుగువిధములైన ప్రాణులును; బుద్ధియే. <span class="CharOverride-6">తదభావే</span> - ఆ బుద్ది లేనియెడల; <span class="CharOverride-6">కుతోగుణాః</span> - గుణములకు స్వరూపమే ఉండదు కనుక - అవి లేనివే యగును. </p> <p class="Footer"> దీనిచేత సాంఖ్యమతము చెప్పెడు గుణముల అబాధ్యత్వము, నిత్యత్వము అను సిద్ధాంతమును త్రోసివేసినట్లయినది. </p> <p class="Footer ParaOverride-1"> దీని భావమిది - అది త్రాడు అని తెలియకపోవుటవలన దానిని చూచినపుడు ఏర్పడిన పాము, దానివలన నగు భయము కలుగుచున్నవి. పరీక్షించిచూడగా పాము లేని స్థితి తెలియవచ్చినది. ఉన్నది త్రాడనియు తెలిసినది. అప్పుడు భ్రాంతికి మూలమైన అజ్ఞానము తొలగినది. దానివలన కలిగిన భయము కూడ పోయినది. ఇట్లే బుద్ధి తొలగిపోగా బుద్ధికి చెందిన కార్యము, కారణము కూడ నశించును. ఇచట గుణ శబ్దముచేత సత్వరజస్తమస్సులును, మనస్సుతోపాటు ఆరైన ఇంద్రియములు, వాని విషయములును గ్రహంపబడుచున్నవి. </p> <p class="Footer ParaOverride-1">18. <span class="CharOverride-6">తన్మయమ్ ఏవ</span> - ఆబుద్ధి యొక్క స్వరూపమే; <span class="CharOverride-6">ప్రలీయతే</span> - బుద్ధి ప్రలీనమగునపుడు ఆస్థావర జంగమాత్మకమగు సర్వము ప్రళయము - నామరూపములు లేకుండ పోవుటను పొందును; <span class="CharOverride-6">ఉద్భవతి</span> - బుద్ధి ఏర్పడినపుడు అది యంతయు ఏర్పడును; <span class="CharOverride-6">తస్మాత్, నిర్దిశ్యతే</span> - అందువలన వేదము నందు ఈ విషయము నిర్దేశింపబడుచున్నది. “<span class="CharOverride-6">మనసా హ్యేవ పశ్యతి మనసా శృణోతి</span>” - “మనస్సుచేతనే చూచుచున్నాడు, వినుచున్నాడు. “<span class="CharOverride-6">ప్రాణేభ్యోదేవా దేవేభ్యో లోకాః</span>” - ‘ఇంద్రియముల వలన దేవులు, దేవుల వలన లోకములు’ - మొదలగు మంత్రములు దీనిని నిర్దేశించుచున్నవి. బుద్ధి, మనస్సులకు భేదము లేక పోవుటచేత బుద్ధియే శ్రవణాదులకు సాధ్యమగుచున్నది. శ్రోత్రాదిరూపముతో ప్రాణములైన ఇంద్రియములవలన సూర్యుడు మొదలగు దేవతలు, వాని వలన లోకములు ఏర్పడు చున్నవని మంత్రార్థము</p> <p class="Footer ParaOverride-1">19,20 పై విషయమునే రెండు శ్లోకములతో వివరించుచున్నారు. ఆబుద్ధి దేనిద్వారమున చూచునో దానిని కన్ను అనుచున్నాము, <span class="CharOverride-6">జిహ్వయా -</span> నాలుకగానయిన బుద్ధి రసమును గ్రహించుచున్నది. -అనిభావము అట్లే; <span class="CharOverride-6">త్వచా</span> - చర్మము రూపమైన బుద్ధి స్పర్శను తెలియుచున్నది. </p> <p class="Footer ParaOverride-1">20 అందు హేతువును చెప్పుచున్నారు. <span class="CharOverride-6">విక్రియతే</span> - బుద్ధియే జీవుడను మరియొక పేరుగల కర్తృత్వమును కరణత్వమును పొందుచున్నది. శ్రుతి యిట్లు చెప్పుచున్నది. “<span class="CharOverride-6">స ప్రాణన్నేవప్రాణో నామ భవతి వదన్ వాక్ పశ్యన్ చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్వానో మన స్తాన్య స్య కర్మ నామాన్యేవ</span>” 'అది ప్రాణకార్యము చేయుచు ప్రాణమను పేరుగలది యగుచున్నది. పలుకుచు వాక్కు, చూచుచు కన్ను, వినుచు చెవి, తలపోయుచు మనస్సు అను పేర్లు కలది యగుచున్నది. ఇవి యన్నియు దాని కర్మ నామములే' . సకృత్ - ఈ కార్యములన్నియు ఏక కాలమున జరుగుచున్నవి; దీనివలన ఆకాశము నుండి వాయువు, వాయువునుండి అగ్ని - అని చెప్పిన వాక్యములందు క్రమమును చెప్పుట ఇష్టము కాదు. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనునవి కలిసియే యేర్పడెనని యర్థము. </p> <p class="Footer">21. <span class="CharOverride-6">అధిష్ఠానాని</span> - బుద్ధి రూపాదులను వీనిచేత ప్రకాశింప జేయును గావున ఈ కరణములు అధిష్ఠానములు, <span class="CharOverride-6">బుద్ధేః</span> - కర్రియగుబుద్ధికి; <span class="CharOverride-6">అదృశ్యః</span> - కానరాని చిదాత్మ; <span class="CharOverride-6">అధితిష్ఠతి</span> - తన స్వరూపము యొక్క ఉనికి చేత; <span class="CharOverride-6">తాని</span> - ఆ ఇంద్రియములను; <span class="CharOverride-6">అధితిష్ఠతి</span> - అయస్కాంతము లోహమును వలె, కదలించుచున్నది - పనిచేయించుచున్నది.</p> <p class="Footer">22. దీనినే వివరించుచున్నారు - <span class="CharOverride-6">త్రిషు భావేషు</span> - సత్త్వరజస్తమోమయములైన సుఖదుఃఖ మోహము లనెడు భావములందు; వానినే క్రమముగా చెప్పుచున్నారు. </p> <p class="Footer"> 1. <span class="CharOverride-6">కదాచిల్లభతే ప్రీతిమ్</span> - సుఖము; 2.<span class="CharOverride-6"> కదాచిత్, అమశోచతి</span> - దుఃఖము </p> <p class="Footer">23. 3.<span class="CharOverride-6"> న సుఖేన నదుఃఖేన కదాచిదపివర్తతే</span> - మోహము ఇట్లు మూడు భావముల యందును బుద్ధి మనస్సునందు వర్తించును. మనస్సుద్వారా ఇంద్రియవిషయములందును వర్తించునని తెలియదగును. </p> <p class="Footer">24. <span class="CharOverride-6"> సా, ఇయమ్</span> - ఆయీబుద్ధి; <span class="CharOverride-6">సర్వాత్మికా అపి</span> - అన్ని భావముల స్వరూపము కలదియే అయినను, ఈ భావములను సుఖదుఃఖమోహములను; <span class="CharOverride-6">అతిక్రమ్య, వర్తతే</span> - అతిక్రమించి ప్రవర్తించును; అందు యోగ్యమగు దృష్టాంతమును చూపుచున్నారు. <span class="CharOverride-6">సరితాం భర్తా</span> - నదులను నింపునది; <span class="CharOverride-6">ఊర్మిమాన్</span> - పెద్దఅలలుకలది; <span class="CharOverride-6">సాగరః</span> - సముద్రము; <span class="CharOverride-7">మహావేలామ్; ఇవ</span> - గొప్పదియగు తీరమునువలె </p> <p class="Footer"><span class="CharOverride-8"> దీనిభావమిది - నదులు సముద్రమువలననే ఏర్పడుచున్నవి. సముద్రమునే చేరుకొనుచున్నవి. సముద్ర తరంగములలో లీనమైపోవుచున్నవి. ఇట్లే బుద్ధివలన ఏర్పడిన దేహము, ఇంద్రియములు, విషయములును (శబ్దాదులు) యోగముతో బుద్ధియందు లీనములైపోగా వాని సంస్కారములు బుద్ధి బ్రహ్మాకారము కనుక తిరోధానము పొందుచున్నవి. ఈవిధముగా బుద్ధి గుణాతీత అని చెప్పినట్లయినది. </span></p> <p class="Footer"><span class="CharOverride-8"> కుండను కన్పింపజేయుటలో కన్ను వెలుగు సహకారముతో సమర్థమగుచున్నది. దీపమును కన్పట్టజేయుటలో దానికి ఆ సహకారమక్కరలేదు. ఆ దీపమే ప్రకాశాత్మకము కదా! ఇట్లు బుద్ధివృత్తి చిదాభాస సహకారము తోడనే ఘటాదులను ప్రకాశింపజేయును. </span></p> <p class="Footer"><span class="CharOverride-8"> ఆత్మయందన్ననో ధీవృత్తియే కావలసినట్టిది. ఆనందము ప్రకాశించుచుండగా ధీవృత్తి ఇందుప గింజ గంధమువలె సజాతీయమైన మరియొక వృత్తిని నశింపజేయుచు తానుకూడ లయమైపోవును. అప్పుడు సంస్కారరూపముతోకూడినదై సత్యము మొదలగువాని కార్యములైన సుఖదుఃఖమోహములను అతిక్రమించి పోవును. సుషుప్తియందన్ననో మోహము నశింపదు. అది సుషుప్తికిని, సమాధికిని భేదము.</span></p> <p class="Footer"><span class="CharOverride-8">25. </span><span class="CharOverride-8">అట్లయినచో ఆత్మాకార వృత్తిగల బుద్ధికి గుణాతీతస్థితి ఉన్నట్లు చెప్పినచో జ్ఞానము కలిగిన సమకాలమందే దేహము పడిపోవలయునుగదా! నశించిన బుద్దికి మూలకారణమైన అజ్ఞానము నశింపగా మరల పుట్టుట సంభవింపదు గదా - అని ఆశంకించి సమాధానము చెప్పుచున్నారు. </span><span class="CharOverride-13">అతిభావగతా</span><span class="CharOverride-8"> - సుఖము, దుఃఖము, మోహము అను భావములను దాటిపోయిన, </span><span class="CharOverride-14">బుద్ధిః</span><span class="CharOverride-8"> - బుద్ధి; </span><span class="CharOverride-13">భావే</span><span class="CharOverride-8"> - మనస్సునందు; </span><span class="CharOverride-13">వర్తతే</span><span class="CharOverride-8"> - వృత్తులు - కదలికలు లేని స్థితితో ఉండునని భావము. </span><span class="CharOverride-13">తు</span><span class="CharOverride-8"> - కాని; తరువాత - అనగా పైకి లేచివచ్చుకాలమున; </span><span class="CharOverride-13">ప్రవర్తమానం రజః</span><span class="CharOverride-8"> - ఏర్పడుచున్న రజోగుణము; </span><span class="CharOverride-13">తద్భావమ్</span><span class="CharOverride-8"> - బుద్ధిభావమును; </span><span class="CharOverride-13">అనువర్తతే</span><span class="CharOverride-8"> - అనుసరించి ప్రవర్తించును. పేరుకొన్న నెయ్యి వేడికి కరగి ద్రవముగానైనను, మరల చల్లదనముచేత పేరుకొనిపోయినట్లు బుద్ధి రజోగుణముచేత మరల గట్టిపడునని భావము. </span></p> <p class="Footer"><span class="CharOverride-8"> ఇచట భావమిది - అజ్ఞానము నశించినప్పటికిని వెల్లుల్లి వాసనపట్టిన పాత్రమును శుద్ధిచేసినను ఆ వాసన కొంచెముగా మిగిలియున్నట్లు అంటిపెట్టుకొని యున్న అవిద్య ప్రారబ్ధకర్మమునకు వశమైనదై మరల మరల దేహాదులను ఏర్పరచుచుండును. ప్రారబ్ధ కర్మము పూర్తిగా నశించినపుడు సమూలముగా నశించుటవలన ఏ అడ్డులు లేని కైవల్యము సిద్ధించును.</span></p> <p class="Footer"><span class="CharOverride-8">26. ఆ బుద్ధి ఎపుడు రజస్సుతో స్వరూపమును పొందునో అప్పుడు ఇంద్రియములను ప్రవర్తింప జేయును తతః - దానివలన - విషయసంబంధమువలన; </span><span class="CharOverride-13">సత్త్వమ్</span><span class="CharOverride-8"> - సత్త్వస్వరూపము గల బుద్ధి; విషయముల యాథాత్మ్యజ్ఞానము; </span><span class="CharOverride-13">ప్రవర్తతే </span><span class="CharOverride-8">- ఏర్పడును; </span><span class="CharOverride-13">అట్లే; తమో భావః</span><span class="CharOverride-8"> - తమస్సుచేత - విషయముల అజ్ఞానము చేత - ఏర్పడిన భావము; </span><span class="CharOverride-13">ప్రీతియోగాత్ </span><span class="CharOverride-8">- పురుషుల యందలిరాగాది దోషములవలన ఏర్పడును. అది విషయముల విపర్యాసరూపమైనది. అనగా శుక్తి యందలి తెల్లదనము వెండివలె కానవచ్చుటవంటిది. నిజమైనదో, తారుమారయినదో అయిన జ్ఞానము విషయేంద్రియ సంబంధము వలన పుట్టునని భావము.</span></p> <p class="Footer">27. దాని వలన ప్రీత్యాదులు కలుగును. అవి సత్త్వరజస్తమో గుణాత్మకములు. <span class="CharOverride-6">భావాః</span> - శమము, దమము, కామము, క్రోధము, భయము, విషాదము మొదలగునవి. </p> <p class="Footer">28. బుద్ధి వ్యాఖ్యానమును ప్రయోజనముతో పాటు ముగించుచున్నారు. </p> <p class="Footer">30. తమోగుణము పుట్టగా; సంయుక్తౌ - వెనుకచెప్పిన సుఖదుఃఖ స్పర్శములు కలుగవు. కేవలము మోహమే కలుగునని భావము. </p> <p class="Footer">32. <span class="CharOverride-6">సంరభ్య</span> - భయపడి; దుఃఖమును మరల మరల కూర్చుకొనుటచేత దుఃఖమే వర్ధిల్లును - అని భీతితో దుఃఖమును గూర్చి చింతింపరాదు - అని భావము.</p> <p class="Footer">34. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము అనునవి ఇష్టవస్తువును గూర్చి వినుట, దానిని దర్శించుట, పొందుట అనుభవించుట అనువానివలన కలుగునవి. వీనికి ప్రియము, మోదము, ప్రమోదము, ఆనందము అనియు వ్యవహారము కలదు. <span class="CharOverride-6">ప్రశాన్తచిత్తతా -</span> నిర్వికల్పమైన సుఖము కలుగుట; <span class="CharOverride-6">కథఞ్చిత్</span> - అనుట వలన ఇవి చాల దుర్లభములని తెలియదగును. </p> <p class="Footer">35. <span class="CharOverride-6">హేత్వహేతుభిః</span> - అతుష్టి మొదలగునవి కలుగుటకు కొన్నింటికి హేతువులుండును, కొన్నింటికి ఉండవు అని భావము; అన్నము దొరకకుండుట మొదలగు వానివలన కలుగు అతుష్టి సహేతుకము, అన్ని సంపదలు ఉన్నను అతుష్టి కలుగుట అహేతుకము. </p> <p class="Footer">36. స్వప్నతన్ద్రితా - నిద్రతో కూడిన కునుకుపాటు; </p> <p class="Footer"> కథఞ్చిత్ - దురదృష్టవశమున - అని భావము.</p> <p class="Footer ParaOverride-1">37. <span class="CharOverride-6">దూరగమ్</span> - దుర్లభమైన వస్తువునందును తగులము కలది అని భావము; <span class="CharOverride-6">బహుధాగామి</span> పెక్కు విషయములందు ఒక్క మారుగా పడెడు శీలము; <span class="CharOverride-6">ప్రార్థనా</span> - 'ఇమ్ము' అని లేకిగా అడుగుకొనుట; <span class="CharOverride-6">సునియతమ్</span> - గట్టిగా అడ్డుకొను ప్రవృత్తి కలుగునట్లుగా; </p> <p class="Footer ParaOverride-1">38. వృత్తిని - మనస్సు సంచరించుటను అదుపున నుంచుకొను దాని ఫలమును వివేచించుచున్నారు. సత్త్వమ్ - బుద్ధి సత్త్వము, క్షేత్రజ్ఞః సాక్షి; ఈ రెంటి; <span class="CharOverride-6">అన్తరమ్</span> - భేదము; కాలిన ఇనుపగుండు వలె ఏదిఏది అను వివేకమును మునుపు గ్రహింపని కారణముగా - ఆ భేదమును వివేచించి చూపుచున్నారు. ఒకటి - అనగా సత్త్వము, <span class="CharOverride-6">గుణాన్</span> - అహంకారము మొదలగువానిని; <span class="CharOverride-6">సృజతే</span> - సృజించును; <span class="CharOverride-6">ఏకః</span> - మరియొకటి (క్షేత్రజ్ఞుడు) <span class="CharOverride-6">న సృజతే</span> - సృజింపడు. </p> <p class="Footer ParaOverride-1">39. <span class="CharOverride-6">ఏతౌ</span> - ఈ మేడిపండు, దోమ అనునవి; <span class="CharOverride-6">తయోః</span> -<span class="CharOverride-6"> ఆ సత్త్వ క్షేత్రజ్ఞుల</span>; </p> <p class="Footer">40. <span class="CharOverride-6">ప్రకృత్యా</span> - స్వభావముచేత; </p> <p class="Footer">41. మేడిపండు దోమలవలెగాని; నీరు, చేపలవలె గాని, సత్త్వ క్షేత్రజ్ఞులకు సంయోగము ఉన్నయెడల రెండును సర్వతంత్ర స్వతంత్రములు కావున సంయోగము పరిహరింపరానిదగును కదా అని శంకించి సమాధానము చెప్పుచున్నారు. గుణములు ఆత్మను తెలియజాలవు. క్షేత్రజ్ఞుడు ఎరుగును. కనుక గుణములు జడములు. క్షేత్రజ్ఞుడు చిదాత్మస్వరూపుడు. కనుక చిత్తునకు జడమునకు వాస్తవమైన సంబంధము కుదరదు. దృష్టాంతముగా చెప్పిన చేపయు శరీరములును జడములు. వానికి జడములే అయిన జలాదులతో సంబంధము. </p> <p class="Footer"> దీనినే వివరించుచున్నారు. </p> <p class="Footer"> పురుషుడు గుణములైన దేహము, అహంకారము మొదలగువానిని చూచువాడైనను, వానిని; <span class="CharOverride-6">సంసృష్టాన్</span> - తనతో తాదాత్మ్యమును పొందినవానినిగా; <span class="CharOverride-6">మన్యతే</span> - తలచును;<span class="CharOverride-6"> పురుషుని</span> - గుణములైన ద్రష్ట, దృశ్యము అనువానికి అభేదము సంభవింపదు కదా! నేను గౌరుడను, నేను కాణుడను, నేను సుఖిని, నేను కర్తను అన్న విధముగా అభేదము తెలియవచ్చును. అందువలన ఎడారి, గొప్ప జలాశయములు అనువానికి వలె ఈ రెంటికి ఉన్నట్లు కనపించునట్టి సంబంధము మాత్రమే కలదు. </p> <p class="Footer">42. అట్లు చిదాత్మ గుణములతో తగులము కలది అయినచో కుండలో ఉన్న దీపమువలె ఏ కొంచెమును ప్రకాశింపజేయదుగదా - అను శంకకు సమాధానము చెప్పుచున్నారు. ఇంద్రియములు కుండకుగల చిల్లులవంటివి. వాని ద్వారమున జ్ఞానస్వరూపమగు పరమాత్మ వెలుతురు నొసగునని భావము. దేహమందున్న చిదాత్మ చిల్లులుగల కుండలో నున్న దీపము వంటిదని తాత్పర్యము. ఇన్ద్రియైః, <span class="CharOverride-6">బుద్ధిసప్తమైః </span>- అయిదు ఇంద్రియములు, ఆరవది మనస్సు, ఏడవదియగు బుద్ధి అనువానితో </p> <p class="Footer">43. <span class="CharOverride-6"> సంప్రయోగః</span> - సంబంధము; <span class="CharOverride-6">ధ్రువః</span> - మొదలు చెప్పరానిది - అనాదిసిద్ధము. </p> <p class="Footer">44. సత్త్వక్షేత్రజ్ఞుల సంప్రయోగము నిర్వచింపనలవి కానిదని చెప్పుచున్నారు. ఆత్మ సంగములేనిది, గుణములు లేనిది అగుటవలన జతుకాష్ఠమునకు వలెనో, రూపము, రూపము కలది అనువానికి వలెనో ఆ రెంటికి, ఆశ్రయించినది, ఆశ్రయమైనది అనువాని సంబంధము ఉండదని అర్థము. క్షేత్రజ్ఞానకు ఒకానొక ఆశ్రయము లేదు. దాని మహిమతోడనే ఆది నెలకొనియుండును. </p> <p class="Footer"> పైని చెప్పిన అర్థమున హేతువును తెలుపుచున్నారు. <span class="CharOverride-6">మనః</span> - మనస్సును ; <span class="CharOverride-6">సంసృజతే</span> - నిర్దేశించును - ప్రకాశింపజేయును. మనస్సు మొదలగునదియే సత్త్వము యొక్క కార్యము వ్యక్తపరచును. కాని దాని మూలభూతమైన గుణములు కావు. </p> <p class="Footer">45. అధ్యాస తొలగెడు ఉపాయమును చెప్పుచున్నారు. వృత్తులు అనేకములై ఉండుటను బట్టి; తేషామ్ - అని బహువచనమును వాడిరి. తేషామ్ - దానియొక్క - సత్త్వము యొక్క; రశ్మీన్- కిరణములవంటి ఇంద్రియములను. </p> <p class="Footer">47. ఇట్టి జ్ఞానము కలవారికి కర్మతగులము - అంటు ఉండదని చెప్పుచున్నారు. <span class="CharOverride-6">వారిచరః</span> - నీటి పక్షి - హంస; శ్రుతియు “<span class="CharOverride-6">తం విదిత్వా న కర్మణా లిప్యతే పాపకేన</span>” - ‘ఆ ఆత్మతత్త్యమును తెలిసికొని కర్మముతోడను పాపముతోడను అంటులేనివాడగును’ అని చెప్పుచున్నది. </p> <p class="Footer">48. <span class="CharOverride-6">ఏవం స్వభావమ్</span> – ఈ అంటులేని స్వభావమును; <span class="CharOverride-6">ఏతత్</span> - ఆత్మస్వరూపమును; తన బుద్ధితో నిశ్చయించుకొనునని భావము; </p> <p class="Footer ParaOverride-1">49. ఇట్లెరిగినవానికి జీవన్ముక్తి కలుగునని చెప్పుచున్నారు. <span class="CharOverride-6">స్వభావయుక్త్యా -</span> స్వరూపమునందలి యోగము - కలయిక చేత; <span class="CharOverride-6">యుక్తః</span> - దేహేంద్రియముల తాదాత్మ్యనము వలన ఏర్పడిన అధ్యాస అయిన పరరూపతను విడనాడి స్వభావరూపమైన చక్కనిస్థితిలో కూడినవాడు - అనగా జ్ఞాన సంపన్నుడు; <span class="CharOverride-6">నిత్యమ్</span> - ఎల్లవేళల; <span class="CharOverride-6">గుణాన్</span> - భూతములను, భూతసంబంధములైన వానిని; యోగైశ్వర్యబలము చేత; <span class="CharOverride-6">సృజతే -</span> సృజించును; సాలెపురుగు దృష్టాంతము అభిన్న నిమిత్తత్వమును ఉపపాదించుటకు గ్రహించిరి. (వస్తుసృష్టికి కారణము, ముడిపదార్థము కూడ ఒకటియే యగుట అభిన్ననిమిత్తత్వము.) </p> <p class="Footer ParaOverride-1"> “<span class="CharOverride-6">యస్యానువిత్తః ప్రతిబుద్ధ ఆత్మా</span>” అని మొదలుకొని “<span class="CharOverride-6">స విశ్వకృత్స హి విశ్వస్య కర్మా</span>” అని శ్రుతి చెప్పుచున్నది. ‘జ్ఞానియే విశ్వమునకు కర్త’ - జ్ఞానియే ఆత్మ - అని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">50. ఇట్లు జీవన్ముక్తుడు ప్రారబ్ధకర్మమునకు చిక్కువడిన దేహము కలవాడై పూర్వ సంస్కారవశమున వచ్చిపడిన గుణములతో దృష్టి సమసమయ (చూచిన వెంటనే ఏర్పడినదగు) యగు సృష్టిని చూచుచు యోగైశ్వర్యమగు అణిమాదికముచేతనో, నిర్వికల్పధ్యానముచేతనో మెలగుచుండును - అని చెప్పియున్నారు. ప్రారబ్ధకర్మము సమాప్తిచెందగా గుణములు కుండవలె మరలిపోవునా? లేక త్రాటియందు కాననగు పామువలె తొలగిపోవునా? అను దానిని రెండు శ్లోకములతో చర్చించుచున్నారు.</p> <p class="Footer">52. హృదయగ్రన్ధిమ్ - ఒకదానిపై ఒకటి అధ్యాసమైన దానిని; కాలినయినుపగుండువలె బుద్ధి, క్షేత్రజ్ఞుడు అనువాని ఏకత్వమును; అంతేకదా - క్షేత్రజ్ఞునియందు బుద్ధధర్మములైన దుఃఖాదులు, బుద్ధియందు క్షేత్రజ్ఞధర్మములైన సత్త్వము, చిత్త్వము మొదలగునవి కానవచ్చుచున్నవి. అందుచే అవి రెండును ఒకదానితో నొకటి కలిసి ఒక్కటిగానే ఉన్నట్లు కానవచ్చుచున్నది. అదియే హృదయగ్రంథి; <span class="CharOverride-6">బుద్ధిభేదమయమ్</span> - బుద్ధిచేసిన భేదమయమయిన దానిని; <span class="CharOverride-6">విముచ్య -</span> ఇదిసత్త్వము, ఇతడు పురుషుడు అను విభాగజ్ఞానముతో వదలివైచి; సుఖముగా నుండవలయును. వేదమిట్లే చెప్పుచున్నది. “<span class="CharOverride-6">భిద్యతే హృదయగ్రన్థి శ్ఛిద్యన్తే సర్వసంశయాః</span>” ‘ఆత్మదర్శనమయినపుడు హృదయమునందలి ముడి విడివడి పోవును. సర్వసంశయములు తెగిపోవును<span class="CharOverride-15">᾽</span>. </p> <p class="Footer">53. నదినివలె ఈ జ్ఞానమునందు మునిగి మలినులు - అజ్ఞానమలము కలవారు - శుద్దిని పొందుదురు - అని ఎరుగుము; “<span class="CharOverride-6">నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే</span>” - ‘జ్ఞానముతో తులదూగు పవిత్రమైనది యిందు మరొకటి లేదు<span class="CharOverride-15">᾽</span> అని శ్రుతి. </p> <p class="Footer">54. ఆవలి ఒడ్డును కనుగొనినంత మాత్రమున మనుజుడు కృతకృత్యుడు కాడు. నౌక మొదలగు ఉపాయముతో ఆఒడ్డును చేరుకొన్నవాడే కృతార్థుడు. జ్ఞానవిషయమున మాత్రము జ్ఞానము కలుగుటయే కృతార్థత. మరల ఇంకొక అనుష్ఠానాదికముతో పనిలేదని భావము. </p> <p class="Footer">55. విషయమును ఉపసంహరించుచున్నారు. <span class="CharOverride-6">అధ్యాత్మమ్</span> - ఆత్మయందు - హృదయాకాశమునందు; </p> <p class="Footer"> <span class="CharOverride-6">కేవలమ్</span> - విషయస్పర్శలేని స్థితి; దీని నెరిగినవారు జ్ఞానమును పొందుదురని భావము; </p> <p class="Footer">56. <span class="CharOverride-6">ఏతామ్</span> - దీనిని; ఇచట 'ఇదమ్' అని నపుంసకలింగశబ్దమునే వాడవలయును. కాని ఆగతిమ్ అను విధేయమును బట్టి స్త్రీలింగమును వాడిరి; <span class="CharOverride-6">బుద్ధ్వా</span> - తెలిసికొని - ఈ జ్ఞానమే అన్నింటియందు ప్రత్యగాత్మరూపమున నున్నదియు, సర్వభూతములకు ఉత్పత్తిలయ స్థానమదియే యనియు శాస్త్రమువలన తెలిసికొని - అని భావము; <span class="CharOverride-6">బుద్ధ్యా, అవేక్ష్య</span> - ధ్యానముచేత ఏర్పడిన సూక్ష్మబుద్ధితో నిశ్చయజ్ఞానముపొంది; <span class="CharOverride-6">అనంతతః, శమ్, లభతే</span> - అంతములేని సుఖమును పొందును; </p> <p class="Footer">57. శమము నెట్టివాడు పొందునో వివరించుచున్నారు. <span class="CharOverride-6">యస్య</span> - ఎవనికి; <span class="CharOverride-6">త్రివర్గః</span> - మూడుగుణముల సముదాయము <span class="CharOverride-6">విదితః</span> - తెలియబడినదో; అది క్షీణించుస్వభావము కలదని ఎవడెరుగునో; <span class="CharOverride-6">ప్రేక్ష్య </span>చక్కగా పరికించి - ఏదికృతకమో అది అనిత్యము, కార్యము కనుక, అని గుర్తించి - “<span class="CharOverride-6">తద్యథేహ ర్మచితో లోకః క్షీయతే ఏవ మేవాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే</span>” 'ఇచట కర్మముతో కూడబెట్టుకొన్న లోకము క్షీణించు విధమున, అచట - పరలోకమున పుణ్యముతో కూడ బెట్టుకొన్న లోకమును క్షీణించును' అను శ్రుతి ననుసరించి అర్థకామసుఖములు అనిత్యత్వమును నిశ్చయించుకొని;<span class="CharOverride-6"> విముఞ్చతి</span> - వదలివైచునో - సంన్యసించునో - అనిభావము. అట్టివాడు <span class="CharOverride-6">అవ్విష్య</span> - శ్రవణమననముల చేత నిర్ణయించుకొని; <span class="CharOverride-6">యుక్తః</span> - ధ్యానశీలుడై; <span class="CharOverride-6">నిరుత్సుకః</span> - ఆత్మదర్శనము చేతనే సర్వకామములను పొందువాడగును కావున తక్కినదానియందు కోరికలు లేనివాడగును. </p> <p class="Footer">58. <span class="CharOverride-6">తత్ర, తత్ర</span> - రూపము, శబ్దము మొదలగు వాని యందు; నిజమునకు ఇంద్రియములకు దొరకునది ఆత్మయే కావలయును. కాని అద్దమునందు ముఖమువలె అది మరియొకటి వలె కన్పట్టును. అందువలన భేదము లేనిదానిని భేదముకలదివలె గ్రహించుట కృతార్థత పొందకపోవుటయు, నాశహేతువును అగును. కావున ఇంద్రియములను విషయములవైపునకు పోనీక పట్టుకొన వలయునని భావము; </p> <p class="Footer">59. ఇంతకంటె తెలియదగినది మరియొకటి లేదని చెప్పుచున్నారు. </p> <p class="Footer">60,61. జ్ఞానఫలము దృష్ట అదృష్ట భయ నివారకమని రెండు శ్లోకములతో చెప్పుచున్నారు. <span class="CharOverride-6">భయమ్</span> - సంసార దుఃఖమ్; <span class="CharOverride-6">అవిదుషామ్</span> - త్రాటియందు సర్పమునుగాంచుట అనెడుద్వైత భావము కల అజ్ఞానులకు; కలుగును; అట్టిది; <span class="CharOverride-6">విదుషామ్</span> - జ్ఞానవంతులకు, న - కలుగదు; అజ్ఞానము</p> <p class="Footer"> బంధ హేతువు, జ్ఞానము మోక్షము; <span class="CharOverride-6">అతః</span> - అందువలన; <span class="CharOverride-6">నహి, గతిః, అధికా, అస్తి, కస్యచిత్</span> - గతి అనగా ముక్తి అందరకు ఒకేవిధమైనది, అందు హెచ్చుతగ్గులు లేవు; గుణే, సతి - గుణము పొందుటయో, తొలగించుకొనుటయో అనునది కలిగినపుడు; అతుల్యతామ్ - హెచ్చుతగ్గులస్థితి సంభవించును; నిర్గుణమునందు అట్టిది కలుగదని భావము; </p> <p class="Footer">61. నిష్కామమగు కర్మము పూర్వకర్మదోషమును పరిహరించును; <span class="CharOverride-6">తదుభయమ్</span> - ఆరెండును - ప్రాచీనము, ఇప్పటిది అగు రెండు కర్మములనును; <span class="CharOverride-6">తన్య</span> - జ్ఞానముతో చేయువానికి; అప్రియములేదు, ప్రియమును లేదు - 'గడ్డిపరకను అగ్నిలో వేయగా ఎట్లు నశించునో అట్లే ఆజ్ఞానాగ్నిలో సర్వపాపములు కాలిపోవును అట్లే తామరాకున నీరు అంటనివిధమున ఆత్మతత్త్వ మెరిగిన వానియందు పాపకర్మము అంటదు' అను శ్రుత్యర్థమును ఇచ్చట భావింపవలయును. మోక్షవిషయమున మాత్రము కర్మము కారణము కాదు. <br/>“<span class="CharOverride-7">నస్త్యకృతఃకృతేవ</span>” అనిశ్రుతి - కర్మముచేత మోక్షము కలుగదని భావము. </p> <p class="Footer">62. అజ్ఞానమువలన దృష్టభయము, అదృష్టభయము కలుగునని చెప్పుచున్నారు.<span class="CharOverride-6"> ఆతురమ్</span> - కామక్రోధాది వ్యసనములచే నలుగగొట్టబడిన; <span class="CharOverride-6">లోకమ్</span> - లోకమును; <span class="CharOverride-6">జనః</span> - జనుడు; <span class="CharOverride-6">అసూయతే</span> - తప్పులెన్ని ధిక్కరించును; <span class="CharOverride-6">తత్</span> - ఆ నింద్యమగు కర్మము; తస్య - అతనిని; సర్వతః - అన్ని విధములగు యోనుల యందు, <span class="CharOverride-6">జనయతి</span> - పుట్టించును, ఆతురుడు బ్రతికి నిందలు పొందును, చచ్చి నీచములైన గర్భములందు పుట్టును - అని తాత్పర్యము.</p> <p class="Footer">63. <span class="CharOverride-6">లోకే</span> - లోకమున;<span class="CharOverride-6"> నిరావిశన్ </span>- చక్కగా పరిశీలించిన వాడవై; <span class="CharOverride-6">ఆతురాన్</span> - ఆతురులైనవారిని; <span class="CharOverride-6">పశ్య - చూడు</span>; వారెట్టివారనగా; <span class="CharOverride-6">తత్, తత్, ఏవ, బహు, శోచతః</span> - తాను కోల్పోయిన పుత్రదారాదులను గూర్చి పెల్లుగా ఏడ్చి మొత్తుకొనుచుండువారిని; <span class="CharOverride-6">తత్ర</span> - అందే - అనగా పుత్ర శోకాదుల నాశమునందే; కుశలాన్ - సారమును, అసారమును వివేకించుటలో నేర్పుగలవారై;<span class="CharOverride-6"> అశోచతః</span> - దుఃఖింపనివారిని; <span class="CharOverride-6">పశ్య</span> - చూడుము; ఇట్లు కనుగొని, <span class="CharOverride-6">ఉభయమ్</span> - క్రమముక్తి, సద్యోముక్తి పొందెడు ఉపాసకులు జ్ఞానులు అయిన; <span class="CharOverride-6">సతామ్ </span>- సత్పురుషుల <span class="CharOverride-6">పదమ్</span> - స్థానమును చేరుకొనవలయునని భావము.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">చతుర్నవత్యధిక శతతమోఽ ధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">194</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">అధ్యాత్మ కథనము</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">194</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">పంచనవత్యధిక శతతమోఽ ధ్యాయః </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. ఆత్మతత్త్వమును నిర్ణయించిన తరువాత దానిని సాక్షాత్కరింప జేసికొను ఉపాయమగు యోగమును గూర్చి చెప్పుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-6">చతుర్విధమ్</span> - ఆలంబన భేదమును బట్టి నాలుగు ప్రకారములైనది. ఆ ఆలంబనములను యోగశాస్త్రమున చెప్పియున్నారు. ప్రాణము యొక్క ప్రచ్ఛన్దన, విచారణములను వానిచేత. ప్రవృత్తి విషయవతి యగుట. స్వప్న నిద్రా జ్ఞానాలంబనము. అభిమత ధ్యానము వలన ఇతరాలంబనములకు కూడ వీనియందే అంతర్భావము. </p> <p class="Footer"> దీని అర్థము ఇది - రేచకమునో పూరకమునో అభ్యసించుటవలన వాయువును కదలకుండ చేసి మనస్సును దాని కాలంబనము చేయవలయును. వాయువు స్థిరమైనచో మనస్సు స్థిరమగుట తప్పక అయ్యెడుపని కనుక. లేదా వెలుపల నున్న సూర్యచంద్రులు, వాని కిరణములు, ప్రతిమ మొదలగు వానిని ఆలంబనముగా చేసికొనుట, లోపలివగు ముక్కుకొన, నాలుక కొన అను వానిని చిత్తాలంబనము చేయవలయును. లేదా జాగ్రన్నిద్రలకు నడుమ అస్మితామాత్రముగా తోచెడు దానిని ఆలంబనముగా చేయుట. తన అభిమతమున కనుగుణముగా నీలగ్రీవుని గాని పీతాంబరుని గాని విగ్రహమునో షట్చక్రదేవతాదికమో ఆలంబనముగా చేసికొని చిత్తమును స్థిరముగా చేయవలయును. ఇచట చెప్పవలసినది చాల కలదు. దానిని ముందు ముందు చెప్పెదము. </p> <p class="Footer">2. <span class="CharOverride-6">స్వభావే -</span> స్వరూపమునందు </p> <p class="Footer">4. సర్వ విద్యలయందును సాధారణి యగు ఇతికర్తవ్యతను చెప్పుచున్నారు. నిర్ద్వన్ద్వాః- శీతోష్ణములు, సుఖదుఃఖములు - అను జంటలను ఒకే తీరున సహించువారు; నిత్య సత్త్వస్థాః - నిత్యము సత్వమునందు ప్రకాశము నందు - ఉండువారు; <span class="CharOverride-6">విముక్తాః -</span> లోభాదుల చేత అని కలుపు కొనవలయును - లోభాదులు లేనివారని భావము, <span class="CharOverride-6">నియమేషు</span> - శౌచము, సంతోషము మున్నగు వానియందు ఉండువారు; నిష్ఠావంతులని భావము; <span class="CharOverride-6">అసంగాని</span> - స్త్రీ సంగము మొదలగునవి లేనివి; <span class="CharOverride-6">అవివాదీని</span> - ప్రతి పక్షములు లేనివని భావము; శాంతి అనగా ప్రసన్నత ఇట్టి స్థానములందుండు వారు; </p> <p class="Footer">5. అందు - ఆ స్థానములందు <span class="CharOverride-6">ధ్యానమనగా</span> ఇచట ధ్యేయమగు వస్తువు - దానితో; సంశ్లిష్టమ్ . ఒక్కటిగా నగుటను పొందినది;<span class="CharOverride-6"> ఏకాగ్రమ్</span> - ఒకటియగు ధ్యేయమే అగ్రమునందు విషయముగా స్ఫురించినట్లు; అందు ఉపాయమును చెప్పుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-6">పిండీకృత్య - “మనసాహ్యేవ పశ్యతి, మనసా శృణోతి</span><span class="CharOverride-8">”</span> - ఇత్యాదిగా శ్రుతి చెప్పుచున్నది. జీవుడు మనస్సు ప్రసరింపజేయగా అవి విషయములను తాకును. గురువు చెప్పిన యుక్తిబలముతో జీవుడు ఆ మనస్సుతోడనే యింద్రియములను వెనుకకు - లోపలికి గుంజుకొన్నచో - తాకవు. ఆ విధముగా ఇంద్రియములను మనోమాత్ర స్వరూపముతో నిలుపుటయే పిండీకరణము.</p> <p class="Footer">6. దీనినే మరింత స్పష్టము చేయుచున్నారు. </p> <p class="Footer">7. <span class="CharOverride-6">పఞ్చవర్గ ప్రమాథీని</span> - అయిదింటి సముదాయమును వ్యాకుల పరచునవి; <span class="CharOverride-6">ఏతాని - శబ్ద, స్పర్శ</span>, రూప, రస, గంధములు - అనెడు విషయములను. </p> <p class="Footer">8. ఇంద్రియములతో కలిపి భ్రమపడిన మనస్సును చక్కజేయవలయును - అనగా ధ్యేయమునందే లగ్నమైనదానినిగా చేయవలయును. దీనికి ముందు అయిదైన ఇంద్రియముల సముదాయమును మనస్సున కదలకుండ చేయవలయును. </p> <p class="Footer">9. <span class="CharOverride-6">విసంచారి</span> - విషయములందు తిరుగు శీలము కలది, </p> <p class="Footer"> <span class="CharOverride-6">పఞ్చద్వారమ్</span> - విషయ దేశమునందు చేర్చెడు అయిదు వెలువడు మార్గములు కలది; <span class="CharOverride-6">చలాచలమ్ </span>- చలించెడు విషయములందును కదలనిది; <span class="CharOverride-6">అంతరా</span> - హృదయాకాశమునందు; <span class="CharOverride-6">నిరాలంబమ్ </span>- దేహము మొదలగు ఆలంబనము లేనిదిగా, చేసి; <span class="CharOverride-6">ధ్యాన పథే సమాదధ్యాత్ </span>- నాలుగు విధములైన ధ్యానాలంబనమున, నిలుపవలయును.</p> <p class="Footer">10. <span class="CharOverride-6">ఏషః</span> - మనస్సుతో కూడిన ఇంద్రియములను ముద్దగా చేయుట యనెడు; <span class="CharOverride-6">ధ్యానపథః</span> - ధ్యాన మార్గము. </p> <p class="Footer">11. ఇంత మాత్రమైనను కృతకృత్యత లేకపోదు - అని. అయిదు ఇంద్రియములు - అను అంగములు గల ఆ జీవుని; షష్ఠమ్, <span class="CharOverride-6">ఆంతరమ్</span> - ఆరవదియగు లోపలి అంగము - మనస్సు; <span class="CharOverride-6">పూర్వ సంరుద్ధమ్</span> మునుపు చక్కగా నిరోధింపబడినదైనను; <span class="CharOverride-6">స్ఫురిష్యతి</span> - వేగముగా కదలాడును - ఎట్లనగా మేఘమునందు అతివేగముగా కదలాడుమెరుపువలె- </p> <p class="Footer">13. <span class="CharOverride-6">వాయుపథమ్</span> - నాడీ మార్గమును, పొంది; మనస్సు; <span class="CharOverride-6">భ్రాంతం భవతి</span> - భ్రమించునదియగును. </p> <p class="Footer"> పెక్కు విధములగు రూపములను చూచి - అని కలుపుకొన వలయును. </p> <p class="Footer">14. <span class="CharOverride-6">గతక్లేశః</span> - పొందిన క్లేశములు కలవాడు - అయినను; అనిర్వేదః - యోగమున నిర్వేదము - విచారము - లేనివాడు కావలయునని భావము. <span class="CharOverride-6">అట్లే, గతతన్ద్రిః</span> - అలసత లేనివాడు; <span class="CharOverride-6">అమత్సరీ</span> - పరుల హెచ్చు తనమును సహించువాడు - కావలయును;<span class="CharOverride-6"> ధ్యానేన</span> - ధ్యానముతో - అనగా - ధ్యేయమగు ఆకారము నందు చెదరని ప్రవాహ రూపముతో- </p> <p class="Footer">15. ప్రథమం సమాదధానస్య - ఇంతకు పూర్వము యోగానుష్ఠానము చేయనివానికి; ఆదితః - మొదట; విచారః - విచారమను పేరుకలది; వివేకః - వివేకమను పేరుకలది; వితర్కః - వితర్కమను పేరుకలదియు నగు ధ్యానము ; ఉపజాయతే - అధికారిభేదమును బట్టి కలుగును. </p> <p class="Footer"> వీనిస్థితిగతు లిట్టివి. మధ్యవిధమువారికి సూక్ష్మము, మనస్సు కల్పించినదియగు పీతాంబరుడు మున్నగువారి విగ్రహమునందు చేతస్సు నిలుపుట అనునది విచారధ్యానము. అది సవిచారము, నిర్విచారము అని రెండు విధములు. శబ్దము, దాని యర్థము అను వానిని పేర్కొనుట ద్వారమున భావన ప్రవర్తించినచో అది సవిచారము. అట్లు పేర్కొనుటలేనిది నిర్విచారము. అధమాధికారి విషయమున స్థూలమైన ఆలంబనముగల వితర్కమునందును సవితర్కము, నిర్వితర్కము అను భేదములు కూడనిట్లే ఏర్పడును. </p> <p class="Footer"> అవునయ్యా! విచారమునందో, వితర్కమునందో మానసికమైనదో, భౌతికమైనదో మూర్తియేకదా ఆలంబనము. దానిని ధ్యానించుటచేత భ్రమరకీటన్యాయమువలె ఆమూర్తి సారూప్యమే కదా లభించునది. కైవల్యము కాదుకదా! </p> <p class="Footer"> అన్నచో నిజమే; ధ్యానము భావన, ప్రణిధానము - అని రెండు విధములు. అందు మొదటిది సిద్ధమో, కల్పితమో అయిన విషయముపై ప్రవర్తించును. రెండవది - తనకు తెలియరాని విశేషమును తెలిసికొనుటకై మణిని గ్రహించితిమి. ఇతరుడు దాని తత్త్వమును తెలిపియున్నాడు. ఆతత్త్వమునే కన్ను ప్రయత్నముతో నిశ్చయించుచున్నది. - ఇట్టిది ప్రణిధానము - అనగా వస్తు తత్త్వవిషయము. స్ఫటికము సహజముగా శుద్ధమైనది. ఎఱ్ఱనిదాసానిపువ్వు సన్నిధానమున నుండగా మధ్యవిధము వాడు స్ఫటికము ఎఱ్ఱనిదని భావించును. అధముడు స్ఫటికలక్షణమును పూర్తిగా తుడిచివైచి పద్మరాగమే అని భావించును. దానినే మూఢులలో మూఢుడు వెన్నెలలో ఇంద్రనీలమని తలపోయును. ఇట్లు చిదాత్మ సహజముగా శుద్ధమైనదైనను మాయతో చుట్టబడి యుండుటవలన ఈశ్వరు డగుచున్నాడు. దానియందే బ్రహ్మభావము, అజ్ఞానముచేత తొలగిపోవుటవలన సూత్రాత్మభావమేర్పడుచున్నది. దానియందే అవిద్య మరింత ముదురుటచేత విరాట్టు అనుస్థితి తోచుచున్నది. ఆవస్తువునందు చిత్తమును చెదురుపాటు లేకుండ నిలుపుటవలన తరువాతి తరువాతి అధ్యాసలు తొలగిపోయి తొలుతటి తొలుతటి అధ్యాస నిలిచియుండును. అజ్ఞానము మూలముట్టుగా తొలగినప్పుడు స్ఫటికము తప్ప మఱియొకటి కానరాని విధముగా ఆత్మతత్త్వము ప్రకాశించును. అందు విచారముతో చిత్తము మూర్తిఆకారస్థితిని పొందగా ఆమూర్తిలో ఒక్కొక్క అవయవమును క్రమముగా తొలగించుకొనుచు మూర్తిముఖమునందలి చిరునవ్వునో, కాలిగోటిచంద్రునో భావించుచుండవలయును. అటు పిమ్మట దానిని కూడ వదలివైచి గురువు బోధించిన యుక్తితో విరాట్స్వరూపమున మనస్సును నిలుపవలయును. పిదప పైని చెప్పిన విధముగ నిర్గుణభావన ఏర్పడును. ఆ విధముగా వితర్కమునకు ఆలంబనమైన స్థూలప్రతిమయందు చెదరకుండ నిశ్చలముగా నిలిపిన చిత్తము తత్త్వమును గ్రహించునది యగును.</p> <p class="Footer"> అది అట్టిదేకదా. ప్రతిమయొక్క విరాడ్రూపమగు చేతనము స్థాణువువలె అధ్యస్తత్వముచేత అచేతనతను పొందిన తత్త్వము చైతన్యమేకదా! అదెట్లన్న- తీవ్రమైన పట్టుదలతో చూచినపుడు శుక్తియందలిరజతము మరలిపోవును. శుక్తి ప్రకాశించును. ఈ విధముగా ఈశ్వరుడుగా భావనకు వచ్చెడు మూర్తియొక్క జడత్వము రూపుమాసిపోవును. చైతన్యము సాక్షాత్కరించును. అందువలననే బాణాదులు తమకు ఆరాధ్యులైన శివాదులతోపాటు వ్యవహరించుచున్నారు - అని పెక్కు ఉపాఖ్యానములు తెలుపుచున్నవి. ఆ విధముగా చేతనమూర్తి తత్త్వముకూడ విశ్వరూపమే. దానిని నిశితముగా చూచునపుడు ఆ విశ్వరూపమే కానవచ్చును. దానినే యశోద కృష్ణముఖమునందును, అర్జునుడు కృష్ణదేహమునందును గాంచిరి. ఆయీ వితర్కమువలన పుట్టిన ప్రత్యక్షమును యోగభాష్యము - తత్పరమగు ప్రత్యక్షము శబ్దము, అనుమానము అను ప్రమాణములకు విత్తనము - అని చెప్పినది. </p> <p class="Footer"> అట్లే నిర్విచార పరిపాకమునందును సర్వజ్ఞత్వము ఇట్లు సూత్రింపబడినది - “<span class="CharOverride-6">నిర్విచారవైశారద్యే ఽధ్యాత్మ ప్రసాదః ఋతంభరా తత్రప్రజ్ఞా</span>” నిర్విచారముపంటకు వచ్చునపుడు ఆధ్యాత్మ ప్రసాదము - అచటి ప్రజ్ఞకు ఋతంభర అని పేరు. దానితో వెనుక చెప్పిన విధముగా నిర్గుణప్రతిపత్తి సిద్ధించును. </p> <p class="Footer"> దేహవిస్మరణముచేత బాహ్యమూర్తి ఆకారము తాల్చిన చేతస్సు సర్వవిధముల ఏర్పడినపుడు భృంగముగానైన కీటమునకు పురుగుతనమే ఏర్పడినట్లు అట్టివానికి జీవభావము తొలగిపోయి కేవలము మూర్తి స్వరూపమే కలుగును. ఇదియే మహావిదేహ అను పేరుగలధారణ. దాని నిట్లు సూత్రించిరి. వెలుపల కల్పింపబడని వృత్తి మహావిదేహ. దాని సంయమనము వలన ప్రకాశావరణముల క్షయమగునని సూత్రించిరి. ఇట్లు చెప్పబడిన విచార వితర్కములు వ్యక్తమైన ఆలంబనము కలవి యై మధ్యములకు, అధములకు యోగ్యములగును. అందు గురూపదేశబలమున అవ్యక్తమునందు చిత్తమును నిలిపిన వానికి అత్యంతముగా దేహవిస్మరణము కలుగగా 'ఇది నేనే' 'సర్వుడనైయున్నాను' అను శ్రుతిప్రసిద్ధములైన సర్వాత్మత, సర్వకామ్యత మొదలగు ఈశ్వర గుణములు నెలకొనును. ఉత్తముని ఈస్థితి సానందము. ఆగుణములను ప్రవిలాపనముచేయుట 'అస్మిత' - ఉన్నాడ ననుభావము - మిగిలియున్నది. అట్టియీ సాస్మితము సత్యపురుషునికంటె వేరైనవాడను పేరు కలదియైన హృదయగ్రంథి భేదము ఇచట వివేకశబ్దము కలది యగును. అత్యుత్తముడు, అతిశయమైన వైరాగ్యము కలవాడు, సర్వభోగవాసనలు నశించినవాడునగు సాధకునకు ఐశ్వర్యావిర్భావము లేకున్నను కలుగును. అది ముఖ్యమైనది. సానందమగు వివేకము కూడ దీనియందే అంతర్భవించునని చెప్పగోరి మూడింటి సముదాయమును - “<span class="CharOverride-6">విచారశ్చ, వివేకశ్చ, వితర్కశ్చ</span>” - అని చెప్పిరి. అవ్యక్తమగు ఆలంబనము కలదానిని గూర్చియు భావింపవలసియున్నది. </p> <p class="Footer"> నిద్రకు మొదట, జాగరమునకు అంతమున ఏభావము కలుగునో ఆభావమును భావించుచు ప్రాజ్ఞుడు అక్షయమగు సుఖము ననుభవించును - అని శాస్త్రమున స్పష్టముగా చెప్పిరి. కాని దేహాభిమానము కలవారికి అట్టి అనుభవము గురూపదేశము లేకుండ కలుగుట దుర్లభము, క్లేశసాధ్యము. దీనిని “<span class="CharOverride-6">క్లేశోఽధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్</span>” అను గీతావాక్యముకూడ స్పష్టముగా ప్రకటించి యున్నది. దీనిచేత ప్రాణము ఆలంబనముగా గల గతి వ్యక్తము, అవ్యక్తము అనురెండును ఆలంబనముగా గలది అని తెలియవలయును. ఇట్లు నాలుగు విధములుగానైన యోగపద్ధతులయందు వితర్కము, స్థూలము, సూక్ష్మము, కారణము అను చైతన్యములతో కూడిన విచారము స్థూల కారణచైతన్యములు మూడింటితోడనే ఏర్పడును. వివేకము కారణచైతన్యములు రెంటి తోడనే. బీజములేని కైవల్యరూపమైనది ఫలభూతమని సాధనరూపములగు వీని యందు దానిని లెక్కింపలేదు. </p> <p class="Footer">16. ఇచటి తు శబ్దము అప్యర్థకము - నలగిపోవుచున్నవాడైనను - అని యర్థము. <span class="CharOverride-6">సమాధానమ్</span> - సమాధిని; <span class="CharOverride-6">కారయేత్</span> - చేయనేవలయును; <span class="CharOverride-6">ననిర్వేదమచ్చేత్</span> ఈ యోగము ఫలమునకు రాదని మానివేయుట పనికి రాదని భావము; </p> <p class="Footer">17. అట్లు విరమించుట పనికిరాదనియు, కాలక్రమమున ఫలము తప్పక సిద్ధించుననియు దృష్టాంతముఖమున చెప్పుచున్నారు. <span class="CharOverride-6">కరీషమ్</span> - ఎండినపేడపొడి; దుమ్ము, బూడిద, పిడకలపొడి అనునవి నీటితో తడిపిన మాత్రమున ప్రతిమలు ఏర్పడవు. </p> <p class="Footer">18. పెద్దకాలము నీటిలో నాని చిక్కదనము పొంది ప్రతిమగానగుటకు సమర్థములగును. అట్లే చిత్తము చిరకాల యోగముచేత హృదయమగ్నమైన తత్త్వాకారమును పొందుటకు సమర్థమగునని భావము. </p> <p class="Footer">19. దృష్టాంతార్థమును సమన్వయించుచున్నారు. </p> <p class="Footer"><span class="CharOverride-6"> సంపరిభావయేత్</span> - మూర్త్యాద్యాకారమును పొందించవలయును. క్రమముగా మూర్తిలో ఒక్కొక్క అవయవమును వదలివైచుచు ఆ చిత్తము ఆకారమును కూడ తొలగింపవలయును. </p> <p class="Footer"> దీనిభావమిది - ఏయే ఆలంబనమునందు చిత్తము స్థిరత్వమును పొందునో ఆయాయాకారమును వదలి మెట్లు ఎక్కిన విధముగా పైపై ఆకారమును ప్రవేశింపవలయును. అట్లు అన్ని ఆకారములు </p> <p class="Footer"> మరలిపోయినపుడు; <span class="CharOverride-6">ప్రశమిష్యతి</span> - ప్రకర్షముగా - అత్యధికముగా శమమును పొందును - నిర్వికల్పమగునని తాత్పర్యము. అంతియేకదా - వితర్కము నుండి విచారము, విచారము వలన ఆనందము, ఆనందము నుండి అస్మిత, దానినుండి కైవల్యము అను విక్రమము యోగశాస్త్రమున ప్రసిద్ధమై యున్నది. </p> <p class="Footer">20. మొదట బుద్ది గ్రహింపబడును. అది మనస్సును అయిదు ఇంద్రియముల సముదాయమును, వెనుకచెప్పిన ధ్యానపథమునందు యోగముతో నెలకొల్పి - అనగా ప్రవిలాపనముచేసి - రూపాదులు లేకుండ కలిపివైచి - కాలిపోయిన కట్టెలుగల అగ్నివలె తానును స్వయముగా అణగిపోవును. బ్రహ్మాకారయగు చిత్తవృత్తి యిందుపగింజ గంధమువలె ఇతరములగు వృత్తులను అణగ గొట్టుచు తానుగూడ అణగిపోవునని భావము. </p> <p class="Footer">21. ఐహికమైన పరమ సుఖమువలనను, సర్వాంగసంపన్నమైన సార్వభౌమత్వమువలనను, ఆముష్మికమైన బ్రహ్మపదమువలనను, ఆసుఖము కలుగదు. ఆసుఖము సంయతాత్మనః - నిరుద్ధమైన చిత్తముగల యోగి పొందెడు సుఖము. శ్రుతియు నిట్లు చెప్పుచున్నది. </p> <p class="Poem-1"><span class="CharOverride-16">“</span><span class="CharOverride-17">సమాధినిర్ధూతమలస్య చేతసో </span></p> <p class="Poem2 ParaOverride-3"><span class="CharOverride-17">నివేశితప్యాత్మని యత్సుఖం భవేత్. </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">న శక్యతే వర్ణయితుం గిరా తదా<br/>స్వయం తదన్తఃకరణేన గృహ్యతే</span><span class="CharOverride-16">”</span><span class="CharOverride-17">. </span></p> <p class="Footer"> <span class="CharOverride-8">సమాధి వలన సర్వమలములు తొలగి పోయినది, ఆత్మయందు చక్కగా నెలకొల్పబడినది అగు చేతస్సు పొందెడు సుఖమును మాటతో వర్ణింపనలవి కాదు. అది కేవలము అంతఃకరణము మాత్రమే పట్టుకొన జాలినట్టిది.</span></p> <p class="Footer">22. <span class="CharOverride-6">రంప్యతే</span> - ఆరుచి మరిగినవాడు స్వయముగానే అందు పరమప్రీతిని పొందును. దాని లాభమునందు మొండిపట్టుదల కార్యసాధకముకాదని భావము; <span class="CharOverride-6">నిర్వాణమ్</span> - కైవల్యము; <span class="CharOverride-6">నిరామయమ్</span> - నిర్ద్వైతము. </p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">195</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">ధ్యాన యోగ కథనము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">195</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">షణ్ణవత్యధిక శతతమోఽ ధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. ఇంతకు మునుపు ఏకాంతమున మనస్సును ఏకాగ్రముగా చేసి నిరోధింపవలయునని చెప్పి యున్నారు. అందు జపము మిక్కిలి శ్రేష్ఠమైనదని తెలిసికొని దాని విధి, ఫలము మొదలగువానిని తెలిసికొనగోరి విన్నదానిని ఒకమారు స్మరించుచు అడుగుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-6">చాతురాశ్రమ్యమ్</span> - నాలుగు ఆశ్రమములకు హితమైనది. </p> <p class="Footer">2. కథ - తత్త్వమును తెలియజేసెడు పూర్వవృత్తము. </p> <p class="Footer">4. సాంఖ్యమ్ - వేదాంతవిచారము; యోగః - చిత్తవృత్తి నిరోధము; క్రియాః - కర్మములు; వీని; విధిః - ప్రకాశనము; జాపకశబ్దము విచారశీలుడు, యోగానుష్ఠాత; కర్మఠుడు - అనువీరిలో ఎవనిని చెప్పును - అని ప్రశ్నభావము.</p> <p class="Footer">5. <span class="CharOverride-6">యజ్ఞ విధిః</span> - బ్రహ్మయజ్ఞ విధి </p> <p class="Footer">6. <span class="CharOverride-6">ఆత్ర</span> - ఇందు - ఈ జప విషయము నందు; చ - అనుట మృత్యువు మొదలగు వారిని కూడ గ్రహించును; పురావృత్తమ్ - వెనుక జరిగినది - ఇటుపై నేను నీకు చెప్పబోవుచున్నది. </p> <p class="Footer">7. సాంఖ్యము యోగము అను వానిలో సాంఖ్యమునందు జపక్రియాత్యాగమే అని చెప్పుచున్నారు. వేదాన్తే - సాంఖ్యమను పేరుగల వేదాంగమునందు; జపనమును గూర్చి సంన్యాసమే వర్తించును - అందు కారణమును చెప్పుచున్నారు. '<span class="CharOverride-6">వేదవాదాశ్చ</span>' ఇందలి చకారము హేత్వర్థకము - ఎందువలన ననగా - వేదవాదములన్నియు బ్రహ్మమునందే సిద్ధాంతములు కలవి. శాన్తాః - నివృత్తియే ప్రధానముగా గలవి. ఉపాసన యనునది మానసిక క్రియ అగుటవలన తత్పరమైన జపమునందు వేదాంతముల శాంతత్వము పొసగదని భావము. </p> <p class="Footer"> ఆ మ్నాయము క్రియయే ప్రధానముగా కలది. 'ఆ అర్థము లేనివానికి అనర్థకతయే సిద్ధించును' అని పరమర్షి క్రియా ప్రయోజనము లేనివి సిద్ధమైన అర్థమును తెలుపునవి అగు 'ఇదిగో రాజుపోవు చున్నాడు' వంటి వాక్యములు అనర్థకములే అని చెప్పుటచేత భావించుట అనునది; దమః - అదుపునకు తెచ్చుకొన్న ఇంద్రియములు తత్త్వజ్ఞానము నందు కదలకుండు నట్లుచేయుట;</p> <p class="Footer">8. ఇట్లు బ్రహ్మాత్మైక్య జ్ఞానమునందు జపముతో పనిలేదు - అని చెప్పినప్పటికి ఈ రెండు మార్గములతో జపము మిక్కిలి తొందరగా ఉపకారము చేయునదగుటచేత దాని అపేక్షకలదు, సాక్షాత్కారము కలుగుటలో అపేక్షలేదు అని చెప్పుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-6">సంశ్రితౌ</span> - జపమును అను పదమును కలుపుకొనవలయును. జపము విషయమున ఆ రెండును కలిసియే యుండునట్టివి; <span class="CharOverride-6">న, చ, సంశ్రుతౌ</span> - మరియు సంబంధము లేనివియు నగును.</p> <p class="Footer">9. పై చెప్పినదానినే వివరించుచున్నారు; <span class="CharOverride-6">అత్ర, అపి</span> ఈ రెండు మార్గములందును; <span class="CharOverride-6">మనః సమాధిః</span> - మనస్సును నిగ్రహించుట; <span class="CharOverride-6">ఇన్ద్రియజయః </span>- ఇంద్రియములను అదుపులోనికి తెచ్చుట, అనునవి కలవు. </p> <p class="Footer">10. <span class="CharOverride-6">అగ్నిపరీచారః -</span> అగ్నులపరిచర్యచేయుట; <span class="CharOverride-6">వివిక్తానాం, చ, సేవనమ్</span> - శుద్ధమగు ఆహారాదులను గ్రహించుట, మరియు, ఏకాంత ప్రదేశమును ఎన్నుకొనుట; ధ్యానమ్ - దేనిపై బుద్ధినిలిపితిమో దానియందు తదేకమైన భావనాప్రవాహమును నిలుపుట; <span class="CharOverride-6">తపః</span>- ఆలోచనము - విషయములందు దోషములను భావించుట అనునది; <span class="CharOverride-6">దమః</span> - అదుపునకు తెచ్చుకొన్న ఇంద్రియములు తత్త్వజ్ఞానమునందు కదలకుండునట్లు చేయుట; </p> <p class="Footer">11. <span class="CharOverride-6">విషయ ప్రతి సంహారః</span> విశేషముగా బంధించెడు కామములను అణచివేయుట; <span class="CharOverride-6">శమః</span> - నిలువరించిన మనస్సునకు చెదరుపాటు రానీకుండుట; <span class="CharOverride-6">ఏషః</span> - ఈ మనస్సమాధి మొదలగునది; </p> <p class="Footer"> <span class="CharOverride-6">ప్రవర్తకః </span>- కామనలు కలవానికి స్వర్గాదులను కలుగజేయు జపాంగభూతమైన ధర్మము అని భావము; </p> <p class="Footer"> తరువాత నివర్తక ధర్మమును చెప్పుచున్నాము. వినుము. </p> <p class="Footer">12. జపము చేయువాని నివర్తకమగు యజ్ఞమును వ్యాఖ్యానించుచున్నారు. <span class="CharOverride-6">యథానివర్తతేకర్మ</span> - కర్మనివృత్తి యనగా మోక్షము - అది యెట్లు చక్కగా సిద్ధించునో అట్టి యజ్ఞము నివర్తక మని భావము; దాని ప్రకారమును వివరించుచున్నారు; <span class="CharOverride-6">ఏతత్ సర్వం, పరివర్తయేత్</span> ఈ మనస్సమాధి మొదలగున దంతటిని నిష్కామరూపమైన అనుష్ఠానముగా విపరీతముగా - వ్యతిరేక స్థితికలదిగా - చేయవలయును; </p> <p class="Footer">13. <span class="CharOverride-6">నివృత్తమ్, మార్గమ్</span> - నివృత్తిమార్గమును తెలుపుచున్నారు; <span class="CharOverride-6">వ్యక్తమ్</span> - వెలుపలిదో, లోపలిదో </p> <p class="Footer"> అయిన ఆలంబనము - స్థూలము, లేక సూక్ష్మము అయినది; అవ్యక్తమ్ - సానందము, సాస్మితము అనువానికి ఆలంబనమైనది; <span class="CharOverride-7">అనాశ్రయమ్</span> - విషయముల నుండి తొలగినది. శుద్ధచిన్మాత్రమైనదని యర్థము; </p> <p class="Footer">14. మార్గమును పొందుటలో హేతువును చెప్పుచున్నారు. - కడిమి మొగ్గవలె నుండు హృదయపిండము నుండి బయలుదేరు నాడులు దర్భపరకలవలె మొదలు స్థూలముగా, కొన సూక్ష్మముగా నున్నవి యగును. అగ్రములతో హృదయ పిందమును స్పృశించుచు, మొదళ్లతో బ్రహ్మాండమును నింపియు నుండును. దానినే యిచట చెప్పుచున్నారు. కుశోచ్చయనిషణ్ణః - <span class="CharOverride-6">క్రిందివైపు; కుశహస్తః </span>- ముందువైపు; <span class="CharOverride-6">కుతైః శిఖీ</span> - పైవైపు; <span class="CharOverride-6">కుశైః పరివృతః</span> - అన్నివైపులకు; <span class="CharOverride-6">తస్మిన్ మధ్యే</span> ఆ కుశల సముదాయమునడుమ; హృదయపిండమునందును; కుశైః, ఛన్నః - దర్భలవంటి నాడులతో కప్పబడినవాడై; ఈ పురుషుడు ఉండును; ప్రభలద్వారా ప్రదీపము అంతట వ్యాపించినట్లు పురుషుడు ఆత్మతత్వరూపుడగు పురుషుడు నాడులద్వారా బ్రహ్మాండమంతటిని వ్యాపించియున్నాడని భావము, </p> <p class="Footer ParaOverride-1"> శ్రుతియందును “<span class="CharOverride-6">తావా అస్యైతా హితానామనాడ్యః</span>” అని మొదలుపెట్టి "<span class="CharOverride-6">తస్య వా ఏతస్యపురుషస్య </span><span class="CharOverride-6">ప్రాచీదిక్ప్రాఞ్చః ప్రాణా దక్షిణా దక్షిణే ప్రాణా</span>” - అను నీ మొదలైన వాక్కులద్వారమున ఈ యర్థమే వివరింపబడినది. </p> <p class="Footer"> వార్తికము నందా మంత్రముల యర్థము నిట్లు వ్యాఖ్యానించి యున్నారు. <span class="CharOverride-6">కదమ్బపుష్పవత్సైషా దేవతా హృదయాశ్రయా</span>, </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-17">బహిర్గతాను నాడీషు వివిక్తా హృదయాదధి, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">యథాస్య నాడ్యః పుంసః స్యు రధ్యాత్మం సర్వతోగతాః, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">అధిభూతం తథైవాస్య వాయుమధ్యః సమన్తగాః, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">ఏత స్మాదేవ నిఃసృత్య శరీరాత్సర్వతోగతాః, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">అధిభూతాత్మ నైవాయం నాడీ లక్షణ వర్త్మనా, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">ఆపూర్యేదం జగత్సర్వం స్థిత ఆధ్యాత్మికః పుమాన్, </span></p> <p class="Footer"> అట్లే మూకుడుమూసిన దీపపు వెలుగువలె దారులన్నియు మూసివేయగా హార్దాకాశమున ఒక్కటిగానయిన ప్రజ్ఞానము అనాదియగు సంసారమున చక్కగా అనుభవించిన సమస్త ప్రపంచపు వాసనలతో వాసితమైనదై సర్వమును ప్రకాశింపజేయుచుండును. ఇట్లు చిత్పదార్థము సర్వాత్మకమనుట స్పష్టమగుచున్నది. </p> <p class="Footer">15.<span class="CharOverride-6"> బాహ్యాన్, న, చ, భావయేత్</span> - బాహ్యములను భావింపరాదు - అనుటచేత ఆంతరములను విడచివేయవలయునని చెప్పినట్లయినది; సామ్యమ్ - జీవబ్రహ్మముల ఏకత్వమును; ఉత్పాద్య - ఏర్పరచుకొని; <span class="CharOverride-6">మనసి, ఏవ, మనః, దధత్</span> - మనస్సునందే మనస్సును ప్రవిలాపనము చేయవలయును; ఏలయన - మనస్సు కూటస్థునియందు లయముకాదు అది దాని వికారము కాదు కనుక; మరియు మాయయందును లీనము కాదు - మాయ తుచ్ఛమైనది కనుక, ఇక పరిశేషన్యాయముచేత తనయందే తనకు లయము - అని చెప్పిరి. </p> <p class="Footer">16. తద్ధియా - ఆబుద్ధితో సామ్యబుద్ధితో ప్రత్యక్కుకంటే వేరు కాదనెడు బుద్ధితో, <span class="CharOverride-6">బ్రహ్మ</span> శుద్ధము, బుద్ధము ముక్తము మొదలగు లక్షణములు గల బ్రహ్మమును; నేను దేహము ఇంద్రియములు మొదలగువానికంటె భిన్నమైనవాడను, విశుద్ధుడను అని భావించుచుండవలయును; <span class="CharOverride-6">సంహితామ్</span> యథాయోగ్యముగ ప్రణవగాయత్ర్యాదిరూపమైన సంహితను - జపించుచు; సంన్యస్యతి - చిత్తస్థైర్యసంపత్తి సిద్ధింపగా, సన్న్యసించును; <span class="CharOverride-6">అథ</span> - తరువాత; <span class="CharOverride-6">వా</span> - నిశ్చయముగా; </p> <p class="Footer">17. <span class="CharOverride-6">ధ్యానమ్, ఉత్పాదయతి</span> - ధ్యానమనగా ధ్యేయమగు ఆకారము ఏమాత్రము చెదరిపోకుండ ప్రవాహరూపమున నుండుట - దానిని కలిగించును; సంహిత దానిని పుట్టించు విధానమును చెప్పుచున్నారు; <span class="CharOverride-6">శుద్ధాత్మా </span>- శుద్ధచిత్తుడయి; <span class="CharOverride-6">తపసా</span> - విచారముచేత; <span class="CharOverride-6">దాన్తః</span> - జిజేంద్రియుడై; <span class="CharOverride-7">నివృత్తద్వేష</span><span class="CharOverride-6">కామవాన్</span> - దేనియందును ద్వేషములేని - సర్వభూతములకు అభయము నొసగెడు యోగుల కామము - బ్రహ్మమును పొందుట అనుకోరిక కలవాడు - అగును.</p> <p class="Footer"> 18. <span class="CharOverride-6"> కారణానామ్</span> - కర్మములకు; <span class="CharOverride-6">కార్యాణామ్</span> - ఫలభోగములకును;</p> <p class="Footer">19. <span class="CharOverride-6"> న, ప్రస్థాపయేత్, క్వచిత్</span>- కర్మములను చేయటయందుగాని ఫలభోగముల కర్తృత్వమున గాని కూడునట్లు చేయరాదు. </p> <p class="Footer">20. <span class="CharOverride-6">ధ్యానక్రియాపరః</span> - ధ్యానక్రియయే మిక్కిలిగొప్పదిగా ఎవనికి అభిమతమో అతడు; ధ్యానమునందు శ్రద్ధ కలవాడని భావము; అందువలననే; <span class="CharOverride-6">ధ్యానవాన్</span> - ధ్యానమునందు నిష్ఠ కలవాడు; <span class="CharOverride-6">ధ్యాననిశ్చయః </span>-ధ్యానము ద్వారముగా తత్త్వనిశ్చయముకలవాడు; <span class="CharOverride-6">ధ్యానే</span> - ధ్యానమును ఆలంబనమునందు, <span class="CharOverride-6">సమాధిమ్</span> - చిత్తఏకాగ్రతను; <span class="CharOverride-6">ఉత్పాద్య </span>- ఏర్పరచుకొ<span class="CharOverride-6">ని:</span> <span class="CharOverride-6">తద్, అపి</span> - ఆ ఆలంబనమునుకూడ; <span class="CharOverride-6">త్యజతి</span> - వదలి వేయును. </p> <p class="Footer ParaOverride-1">21. <span class="CharOverride-6"> తప్యామ్, అవస్థాయామ్</span> - వదలివైచిన అన్ని ఆలంబనములు గల ఆ దశయందు; సర్వత్యాగకృ<span class="CharOverride-6">త: </span>- బీజములుకూడ లేని సమాధి కలవానికి; <span class="CharOverride-6">సుఖమ్</span> - ప్రత్యగానందముః <span class="CharOverride-6">విశతే -</span> అనుమాటను క్రింది వాక్యమునుండి తెచ్చి కలుపు కొనవలయును (ప్రవేశించును) ఎవడనగా; నిరిచ్ఛః - యోగఫలములైన అణిమ మొదలగు వానియందును కోరికలు లేనివాడుః <span class="CharOverride-6">ప్రాణావ్</span> ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములను వాని సముదాయరూపమైన లింగ శరీరమును; త్యజతి - వదలును; <span class="CharOverride-6">బ్రాహ్మీం, తనమ్ </span>- బ్రహ్మాత్మకమైన తనువును; <span class="CharOverride-6">సంవిశతే</span> - ప్రవేశించును. </p> <p class="Footer ParaOverride-1"> '<span class="CharOverride-6">సుఖం ప్రవిశతి</span>' అనుట వలన దానిని ప్రవేశించును కాని దానిని వదలి పైకి వెడలిపోవడు - అనునర్థము సిద్దించును. శ్రుతియు అట్లే చెప్పుచున్నది; “<span class="CharOverride-6">యోఽకామో నిష్కామ ఆప్తకామో నతప్య ప్రాణా ఉత్క్రామన్తి అత్రైవ సమవనీయన్తే</span><span class="CharOverride-8">”</span> ‘అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు ఆయిన వాని ప్రాణములు పైకి లేచిపోవు శుద్ధబ్రహ్మము నెరిగినవాడగునతని ఆత్మయందే ఏకీభావముతో - ఒక్కటిగానయిన స్థితితో విలీనములై పోవును’ అని ఆ వాక్యముల కర్థము.</p> <p class="Footer ParaOverride-1">22. <span class="CharOverride-6">బ్రహ్మకాయసుఖమ్</span> - బ్రహ్మకాయమనగా బ్రహ్మస్వరూప సుఖము; <span class="CharOverride-6">న + ఇచ్చతే, తర్హి</span> - కోరని వాడైనచో; <span class="CharOverride-6">ఉత్రామతి</span> - పైకివెడలును; <span class="CharOverride-6">నజాయతే</span> - తిరిగి జన్మమును ఎన్నటికిని పొందడు; అట్టియోగి ఇష్టపూర్వకముగ కైవల్యమునకో బ్రహ్మలోకమునకో అరుగును. కాని సంసారమును పొందడు. <span class="CharOverride-6">మార్గస్థః </span>- దేవయాన మార్గమునందున్నవాడై; శ్రీమద్భాగవతము నందును - “<span class="CharOverride-6">యదిప్రయాస్యన్నృపపారమేష్ఠ్యమ్</span>" ఇత్యాదికము చేత ఈ యర్థమునే ప్రతిపాదించి యున్నారు. </p> <p class="Footer ParaOverride-1">23. <span class="CharOverride-6">ఆత్మబుద్ధ్యా</span> - తత్త్వసాక్షాత్కారముచేత; <span class="CharOverride-6">విరజః -</span> రజోగుణముతో కూడినది కార్యబ్రహ్మభావరూపమైనది. దానికంటే భిన్నమైనది - విరజము; ఆత్యంతికమైన అమృతమును; సమాస్థాయ - చక్కగా రూపొందించుకొని; <span class="CharOverride-6">శాన్తిభూతః</span> - నిష్కాముడు; <span class="CharOverride-6">నిరామయః</span> - జరామరణములు లేనివాడు - అయిన సాధకుడు; <span class="CharOverride-6">విశుద్ధమ్</span> - నిష్కలమైన; <span class="CharOverride-6">ఆత్మానమ్</span> - పరమాత్మ స్వరూపమును;<span class="CharOverride-6"> ప్రతి పద్యతే</span> పొందును.</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">196</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">జాపకోపాఖ్యానమ్ </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">196</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">సప్తనవత్యధిక శతతమోఽ ధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer ParaOverride-1">1. జపపరాయణులకు యోగసిద్ధిని పొందుట ద్వారా చావు, ముదిమి లేకుండు స్థితిని, ఇచ్ఛ కలిగినపుడు దేహమును వదలుట, బ్రహ్మ లోకమున కరుగుట, విశుద్ధ కైవల్యము అనునవి కలుగునని చెప్పి యున్నారు. ఇంతకంటె వేరైన గతియేమైన కలుగునా? అని అడుగుచున్నారు; <span class="CharOverride-6">ప్రాప్తిః</span> - గతి. </p> <p class="Footer ParaOverride-1">2. ఇంతకంటె వేరైన గతులు పూర్వము చెప్పిన గతికంటే హీనములని సూచించుటకై నిరయ పదమును ప్రయోగించి సమాధానము చెప్పుచున్నారు. నిరయము అనగా నరకము. </p> <p class="Footer ParaOverride-1">3. <span class="CharOverride-6">ఏకదేశ క్రియః</span> - పూర్ణమైన అంగములు లేని జపమునందు శ్రద్ధ కలవాడని భావము. </p> <p class="Footer ParaOverride-1">4. <span class="CharOverride-6">అవమానేన</span> - శ్రద్ధలేని మనస్సుతో; ప్రీత్యాదులు లేనివాడు;</p> <p class="Footer ParaOverride-1">5. <span class="CharOverride-6">అహంకార కృతః</span> - దర్పభావము కలవారు; <span class="CharOverride-6">పురుషః</span> - జపమాచరించు పురుషుడని భావము. </p> <p class="Footer ParaOverride-1">6. <span class="CharOverride-6">అభిధ్యా - </span>లౌకికమైన ఫలము నందలి కోరిక; దానితో జపము చేయువారు; <span class="CharOverride-6">యత్ర, ప్రీతిః</span> - అతనికెందు అనురాగముండునో - దాని ఫలభోగ నిమిత్తముగా;<span class="CharOverride-6"> తత్ర తత్ర ఉపపద్యతే</span> - అందందు పుట్టుచుండునని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">7. <span class="CharOverride-6">ఐశ్వర్యమ్ </span>- అణిమ మొదలగు సిద్దులు - అందు ప్రవృత్తి కలవారికి; స ఏవ - వానియందలి రాగమే; <span class="CharOverride-6">తస్య</span> - వానికి;<span class="CharOverride-6"> నిరయః </span>- నరకము. </p> <p class="Footer ParaOverride-1">8. <span class="CharOverride-7">తత్ర </span>- ఐశ్వర్య విషయమున;<span class="CharOverride-6"> మోహితః</span> - రాగముతో మోహపడినవాడు </p> <p class="Footer ParaOverride-1">9. <span class="CharOverride-6">దుర్బుద్ధిః</span> - దుష్టమైన భోగములందు ఆసక్తి కల బుద్ధి కలవాడు; <span class="CharOverride-6">అకృత ప్రజ్ఞః</span> - భోగములు చివరకు చెరచునవి అనెడు జ్ఞానము లేనివాడు; </p> <p class="Footer">11. <span class="CharOverride-6">న సంపూర్ణః, న సంయుక్తః </span>- విరక్తి పొందక కేవలము మొండి తనముతో భోగములను వదలెడు వాడు - అని భావము. </p> <p class="Footer">12. <span class="CharOverride-6">అనివృత్తమ్</span> - ఎటనుండియో వచ్చినది కాదు కావున స్వభావ సిద్ధమైనది; <span class="CharOverride-7">అవ్యక్తమ్</span> - వాక్కునకు, మనస్సునకు అతీతమైనది;<span class="CharOverride-6"> బ్రహ్మణి</span> - బ్రహ్మమునందు - ప్రణవమునందు; <span class="CharOverride-6">స్థితమ్</span> - ఉన్నది - దాని ద్వారా పొందదగినది; తద్భూతః - బ్రహ్మ భావమును పొందినవాడు. </p> <p class="Footer">13. <span class="CharOverride-6">దుష్ప్రజ్ఞానేన</span> - కామములుపై కొన్న బుద్ధిచేత; దోషాః - దోషములు - రాగాదులు; <span class="CharOverride-6">తదాత్మకాః</span> - ఆదుష్ప్రజ్ఞాన రూపములే అయినట్టివి.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">197</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">జాపకుని ఉపాఖ్యానము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">197</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">198</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. ప్రసిద్ధమైన నిరయపదము నర్థమును పట్టుకొని అడుగుచున్నారు. <span class="CharOverride-6">కౌతూహలమ్ - శుభము</span> నాచరించు వానికి అశుభ ఫలమగుట యెట్లు అని ఆశ్చర్యము వలన కలిగిన ఉత్కంఠ. </p> <p class="Footer">2. <span class="CharOverride-6">ధర్మమూలాశ్రయమ్</span> - ధర్మమునకు మూలము వేదమును, పరమాత్మయును - అవి ఆశ్రయముగా కలదానిని, </p> <p class="Footer">3. <span class="CharOverride-6">ఆమూని</span> - ఈ - చెప్పబోయెడు; <span class="CharOverride-6">పరమాత్మనామ్</span> - గొప్ప బుద్ధి కలవారి; దేవానామ్ - దివ్యమగు దేహము కలవారి <span class="CharOverride-6">సంస్థానాని</span> - ఆకారములు, వర్ణాః - తెలుపు, పసుపు మొదలగు రంగులు. </p> <p class="Footer ParaOverride-1">4. <span class="CharOverride-6">ఆక్రీడాః</span> - ఉద్యానవనములు; </p> <p class="Footer">6. <span class="CharOverride-6">పరమాత్మవః స్థానస్య</span> - పరమాత్మకంటె వేరుకాని స్థానమును కోరుకొను వానికి - అని భావము. </p> <p class="Footer">7. దీనినే వర్ణించుచున్నారు. <span class="CharOverride-6">అభయమ్</span> - నశించునను భయము లేనిది; ఎందువలననగా; <span class="CharOverride-6">అనిమిత్తమ్</span> - ఒక కారణముచే ఏర్పడనిది - స్వభావ సిద్ధమైనది; <span class="CharOverride-6">క్లేశ సమావృతమ్, న</span> క్లేశములనగా అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము - అనునవి - వానితో చుట్టబడినది కానిది; (ఆవిద్య - ప్రజ్ఞానము; అస్మిత - ఉన్నాను, అనెడు భావము - అహంకారము, అభినివేశము - ఆయా లౌకిక కార్యములందు పట్టుదల) సంగము లేనిది కనుక వేరుచోటి నుండి కలిగెడు భయము కూడ లేనిదని భావము; <span class="CharOverride-6">ద్వాభ్యామ్ ముక్తః</span> - రెంటితో విడువబడినది - ప్రియులు, ఆప్రియులు అనునవి లేనిది; “<span class="CharOverride-6">అశరీరం వావ సన్తం ప్రియా ప్రియే న స్పృశతః</span>” - ‘శరీరము లేని ఆ సత్పదార్థమును ప్రియా ప్రియములు స్పృశింపవు’ అని వేదము చెప్పుచున్నది; త్రిభిః ముక్తమ్ - ప్రియా ప్రియములకు కారణములైన మూడు గుణములచేత విడువబడినది; (మూడు గుణములు - సత్వరజ స్తమస్సులు) <span class="CharOverride-6">అష్టాభిః ముక్తమ్</span> - ఎనిమిదింటి చేత విడువబడినది - ఇవి ‘పురి’ అను పేరు కలవి. “<span class="CharOverride-6">భూతేన్ద్రియమనో బుద్ధి ర్వాసనా కర్మ వాయవః, అవిద్యా చేత్యముం వర్గ మాహుః పుర్యష్టకం బుధా ః</span>” </p> <p class="Footer"> (1) పంచ భూతములు (2) అయిదు ఇంద్రియములు (3) మనస్సు (4) బుద్ధి (5) వాసన (6) కర్మము (7) వాయువులు (8) అవిద్య - అను వీనిని ఎనిమిది పురములుగా పండితులు చెప్పుదురు - వీని నుండి విడివడినది;<span class="CharOverride-7"> త్రిభిః ముక్తమ్</span> - జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత - అను మూడు భావములతో విడువ బడినది; </p> <p class="Footer">9. <span class="CharOverride-6">సంపద్యతే</span> - పుట్టును, గడచినది, గడవనున్నది మొదలైన వ్యవహారములకు కారణమైనది, అఖండమగు దండము వంటిది అను కాలమనెడు నిత్యము మరియొక తత్త్వము కలదు కదా! దాని ఉపాధి పుట్టినవస్తువునకు మాత్రమే సంబంధించినదని చెప్పుదురు. అందు ఉపాధులే తనకు మున్నగు వ్యవహారములకు కారణములగుచున్నవి. అట్టి కాలముచేత నయ్యెడిదేమి అను అభిప్రాయముతో చెప్పుచున్నారు. 'ప్రభుః' అనుట చేత పరమాత్మ ఆద్యంతములు లేని వస్తువని చెప్పినట్లయినది. </p> <p class="Footer">10. <span class="CharOverride-6">ఆత్మకేవలతామ్</span> - ప్రత్యగాత్మ కంటె జ్ఞాన జ్ఞేయజ్ఞాతృభావములు లేనిదై ఏకాకిత్వము పొందుటను; </p> <p class="Footer"> తత్ర - ఆ పరమ స్థానమున; </p> <p class="Footer">11. స్థానవరస్య - అతిశ్రేష్ఠమగు స్థానము దృష్టిలో </p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">అష్టనవత్యధిక శతతమోఽ ధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">198</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">జాపకోపాఖ్యానమ్</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">198</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">నవనవత్యధిక శతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. ఆయువునకు హద్దు లేర్పరచు దేవత <span class="CharOverride-6">కాలము</span>. ప్రాణములను తీయునది <span class="CharOverride-6">మృత్యువు</span>. పుణ్య పాపముల ఫలములను ఒసగుదేవత <span class="CharOverride-6">యముడు</span>. </p> <p class="Footer">2. <span class="CharOverride-6">సూర్యపుత్రస్య</span> - యముని;</p> <p class="Footer">4. <span class="CharOverride-6">జాపకః</span> - మంత్రమును అధ్యయనము చేయుట యందు శ్రద్ధ కలవాడు; <span class="CharOverride-6">షడంగాని</span> - శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము - అను ఆరు వేదాంగములు, </p> <p class="Footer">5. <span class="CharOverride-6">అపరోక్షమ్</span> - పరోక్షము కానిది; విస్పష్టముగా తత్త్వముతో పాటు తెలియవచ్చినదని భావము. </p> <p class="Footer">6. <span class="CharOverride-6">సోద్యమ్</span> - ఉద్యమనగా అర్థజ్ఞానము - దానితో కూడినది సోద్యము. <span class="CharOverride-7">బ్రాహ్మమ్</span> - బ్రాహ్మణునకు యోగ్యమైన; బ్రహ్మ జ్ఞానమునకు సంబంధించిన; <span class="CharOverride-18">తపః</span> - స్వధర్మానుష్ఠానము. </p> <p class="Footer">7. <span class="CharOverride-6">దేవ్యా</span> - సావిత్రీ దేవి చేత; <span class="CharOverride-6">దర్శితః -</span> దర్శన దానము చేత అనుగ్రహింప బడినవాడు. </p> <p class="Footer">13. <span class="CharOverride-6">సమాధిః</span>- నియమము </p> <p class="Footer">14. <span class="CharOverride-6">నిరయమ్</span> - తరుగువోయెడు స్వర్గమును; <span class="CharOverride-6">నయాతా</span> - అరుగవు; </p> <p class="Footer">16. <span class="CharOverride-6">జప</span> - జపము చేయుము; <span class="CharOverride-6">యత్</span> - దేనిని - నీవు “<span class="CharOverride-6">జప్యే మేరమతాంమనః</span>” అని దేనిని కోరితివో దానిని; </p> <p class="Footer">23. <span class="CharOverride-6">‘ఉత్’</span> - అనగా జపము చేయువాడు అని అర్థము. ‘అవతే - శబ్దం కరోతి’ అని దానికి వ్యుత్పత్తి అట్టి నేను పెక్కు దుఃఖములతో కూడిన సుఖము గల, <span class="CharOverride-6">దేహమ్</span> - ఆ మరియొక దేహమును; <span class="CharOverride-6">న సృజేయమ్</span> - సృజింపను; మరియేమన ఈ దేహము తోడనే ముక్తుడనగుదును - అని భావము. <span class="CharOverride-8">‘</span><span class="CharOverride-6">ఉత్</span><span class="CharOverride-8">’</span> అను శబ్దమునకు సర్వ పాప విముక్తుడు - అను నర్థము కూడ వేదమున చూపబడినది. ‘అట్టి నేను’ అను నర్థము కూడ గ్రహింపవచ్చును. </p> <p class="Footer">25. <span class="CharOverride-6">వినా+అదేహమ్</span> - శరీరము కాని ఆత్మ లేకుండ, అనగా దానిని వదలి - ఆత్మకాని దాని సుఖమునందు నాకు రుచి కాని శ్రద్ధ కాని లేదు, కావున నేనీ దేహమును వదలను అని తాత్పర్యము. </p> <p class="Footer">27. దేహముతో స్వర్గము లభించినను అది జపఫలము కంటె తక్కువదియే యగునను నర్థమును <span class="CharOverride-6">‘నవా'</span> - కాదా! అను పదముల చేత అభివ్యక్తము చేయుచున్నాను.</p> <p class="Footer">39. జాపకునకు ఆముష్మిక సుఖమునందలి నిస్పృహను నిరూపించి ఐహిక సుఖమునందును ఆశలేని తనమును ఆఖ్యాయికాముఖముననే తెలియజేయుచున్నారు. ప్రథితమ్ - మేలైనది - రత్నములు సువర్ణములు మొదలైనది; యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము నని ఆరు కర్మములు బ్రాహ్మణునకు విహితములు. వానిలో ప్రతిగ్రహము కలదు కదా! </p> <p class="Footer">51. <span class="CharOverride-6">కృతమ్</span> - చాలు, వలదు </p> <p class="Footer">54. <span class="CharOverride-6">అపర వక్తవ్యమ్</span> - పలుకదగిన మరియొక మాట </p> <p class="Footer">55. <span class="CharOverride-6">అభిసంధిః </span>- కామము; నిష్కామమైన జపము ఫలము అనంతమని భావము. </p> <p class="Footer">56. <span class="CharOverride-6">దూషయిష్యామి</span> - చెడగొట్టను, మరొక విధముగా చేయజాలనని భావము. </p> <p class="Footer">60. <span class="CharOverride-6">మే</span> - మయా - నా చేత; <span class="CharOverride-6">నిసృష్టమ్</span> - ఇచ్చివేయబడినది;</p> <p class="Footer">63. <span class="CharOverride-6"> న విశిష్యతే</span> - విశేషమును చేయదు. </p> <p class="Footer">64. <span class="CharOverride-6">ఏకాక్షరమ్ </span>- ఏకము అనగా దానికదే సాటి అయినది. అక్షరమనగా నాశనము లేనిది.</p> <p class="Footer">69. <span class="CharOverride-6">స్తోభాః</span> - సామవేదములో ఒక విభాగపుమంత్రములు. </p> <p class="Footer">75. గ్రహణసమయములందు బ్రాహ్మణుడు ప్రతిగ్రహమును ఇష్టపడనియపుడు మరొకవిధముగా దానము చేసినచో అది దాతకు ఫలమును కూర్చునదగును. ప్రతిగ్రహీతకు దోషమంటదు - అన్నభావముతో 'అవివాదమగును' - అను నీ వాక్యమును పరిశీలింపవలయును. ధర్మశాస్త్రమిట్లే చెప్పుచున్నది. </p> <p class="Poem-1"><span class="CharOverride-11">“మనసా పాత్ర ముద్దిశ్య జలమధ్యే జలం క్షిపేత్, </span></p> <p class="Poem2"><span class="CharOverride-11">దాతా తత్ఫల మాప్నోతి ప్రతిగ్రాహీ న దోషభాక్. </span></p> <p class="Footer"> మనస్సుతో యోగ్యుని నుద్దేశించి జలమధ్యమున జలమును విడువవలయును. దాత ఆ ఫలము పొందును. పుచ్చుకొనువానికి దోషమంటదు.</p> <p class="Footer">77. పుణ్యమును దానము చేయుటచేత పుణ్యము పెరుగును. ధనదానమువలె తరుగదు - అని యర్థము. </p> <p class="Footer">84. <span class="CharOverride-6">ద్వౌపురుషౌ </span>- ఇద్దరు పురుషులు - కామక్రోధములు.</p> <p class="Footer">88. ప్రార్థన రాజునకు తగనిది అని అతని కామము వికృతసంజ్ఞ గల పురుషుడు. శాంత స్వభావము కలవాడయ్యు ఙాపకుడు. భిక్షమడిగియు ఇచ్చుచున్న దానిని గ్రహింపడని రాజునెడల కలిగిన క్రోధము విరూపుడు. <span class="CharOverride-6">గోఃఫలమ్</span> - వాక్కుఫలము - ఇచట వాక్కు జపము. జపఫలమని భావము.</p> <p class="Footer">92. ధేమవనగా ఇచట వాక్కు. జపమంత్రమని భావము; విప్రుడనగా పరమేశ్వరుడు; ధర్మప్రాప్త్యర్థము, స్వార్థమునకు కాదు. </p> <p class="Footer">94. నేను రెండు పశువులను దానమొసగుటచేత జపయజ్ఞఫలమును పొందితిని. కనుక ఈతడిచ్చు దానిని నేను కైకొనుట కిష్టపడను - అని అర్థము.</p> <p class="Footer">96. స్వీకరించియు తిరిగి ప్రతిదానము చేసెదనని భావము. </p> <p class="Footer">100. తీసికొనియు మరల ప్రతిదానము చేయుదునని భావము.</p> <p class="Footer">112. నిక్షేపార్థమ్ -తీసికొని దానమొసగుట కొరకు; </p> <p class="Footer">114. సమమస్తు - దానము ప్రతిదానముతో తుల్యమగుగాక. సహైవ - నీకే నిన్ను తిరిగి యిచ్చితిని అని భావము. </p> <p class="Footer">115. ఇందు పుచ్చుకొనువాడు అధికారి - పుచ్చుకొనుటకు యోగ్యుడు కాడు కనుక దాతకు దానసమమగు పుణ్యమే కలుగును. అట్లుకానిచో పుణ్యప్రదానముచేత పెక్కురెట్లు గల పుణ్యవృద్ధి అయ్యెడిదని భావము. కారితః - ప్రవర్తింపబడినది. ఇచట నీవు అనువాడు రాజు.</p> <p class="Footer">118. గతి యనగా ముక్తి; స్థానము - బ్రహ్మలోకము; లోకములు - సూర్యాదులలోకములు. వీనినెట్లు గెలుచునో దానిని చెప్పెదను అను నర్థమును కలుపుకొనవలయును. </p> <p class="Footer">119. విరక్తుడైన వాని ఫలమును చెప్పి రాగముకలవారు పొందెడు లోకములను చెప్పుచున్నారు. </p> <p class="Footer">120. తైజసేవ - తేజోమయమైన - స్వప్నరూపమైన అని యర్థము. </p> <p class="Footer">121. భూమి శరీరమున ఘనపదార్థమునందును పోవును. ఆకాశ శరీరమున అనగా ఆధారములేని చోట కూడ గమనము చేయును అని భావము. సూర్యాదిలోకపాలుర గుణములను ప్రకాశాదులను పొందదని భావము. </p> <p class="Footer">122. తత్ర - అందు - అగ్ని మొదలగు వానియందు, పరమ్ - ఉత్కృష్టమగు; అవ్యయమ్ - మోక్షమును - క్రమముగా కోరుచు; తమేవ - ఆ పరమేష్ఠినే; </p> <p class="Footer">123. అమృతాత్ - పరమేష్ఠి భావరూపమైన మరియొకదానితో సంబంధముగల అమృతభావమునుండి; అమృతమ్ - కైవల్యమను అమృతమును; ప్రాప్తః పొందినవాడై; శాస్త్రీభూతః - కామభావనలు - కోరికలు లేనివాడై; నిరాత్మవాన్ - ఆత్మయనగా ఇచట బుద్ధి - అది కలది అహంకారము; అహంకారభావన లేనివాడై - అని భావము; అందువలననే; బ్రహ్మభూతః - బ్రహ్మమే అయినవాడు; నిర్ద్వన్ద్వః - సుఖదుఃఖాదులకు అతీతుడు, నిరామయః - ద్వైతదర్శనమను జాడ్యము లేనివాడు. </p> <p class="Footer">124. <span class="CharOverride-6">బ్రహ్మస్థానమ్</span> - బ్రహ్మమనెడు స్థానము; <span class="CharOverride-6">అ</span><span class="CharOverride-6">నా</span><span class="CharOverride-6">వర్తమ్</span> - మరల పుట్టుట అనునది లేనివాడు. </p> <p class="Footer">125. లక్షణములనగా జ్ఞాపకములు - తెలియజేయునవి. అవి నాలుగు - ప్రత్యక్షము, అనుమానము, ఆగమము, చేతస్సు - వీనితో హీనము - అనగా ఇవి - రూప, గుణ, సంబంధ, జడత్వాదులు - లేనిది; అందువలననే షడ్భిః హీనమ్ ఆరు ఊర్ములు- తరంగములవంటివి లేనిది. ఆకలిదప్పులనెడు ప్రాణధర్మములు రెండు, చిత్త ధర్మములగు శోకమోహములు రెండు, దేహధర్మములగు జరామృత్యువులు రెండు - వెరసి - ఆరు- ఇవి లేనిది; </p> <p class="Footer"> సషోడశైః - ఆ ఆరు ఊర్ములు పదునారింటిలో కలిసియున్నవి, వానితో, హీనమ్ - లేనిది; ప్రాణము, శ్రద్ధ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియము, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రములు, కర్మము, లోకము, నామము - అనునవి లేనిది. ఆకాశమ్ - ఆకాశమనగా ఇచట కారణ బ్రహ్మము; అతిక్రమ్య - దానిని దాటి; పురుషమ్; ఉపాధులు - శరీరము మొదలగు తొడుగులు - లేని జ్ఞానమే స్వరూపమైన పురుషుని; ప్రతిపద్యతే - పొందును. ఆ అవ్యయతత్త్వముగా నయిపోవునని భావము. </p> <p class="Footer">126. న, ఇచ్ఛతి - పురుషప్రాప్తిని కోరనివాడగునేని; సర్వమ్ - సర్వాత్మకుడగు ఆ ఆకాశమను పేరుగల కారణ బ్రహ్మమును; అధితిష్ఠతి - అధిష్ఠించును. దానియందభిమానము కలవాడై యుండునని భావము; యచ్చ - దేనిని; 'అతడు పితృలోకకాముడైనచో సంకల్పము వలననే అతని పితరులు లేచివత్తురు' అను వేదవాక్యము అర్థముననుసరించి సత్యకాముడు, సత్యసంకల్పుడు అగు విద్వాంసుడగునని చెప్పినట్లయినది.</p> <p class="Footer">127. పరమవైరాగ్యము కలవాడు సర్వలోకములను త్యజించునని భావము. </p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">199</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">జాపకుని ఉపాఖ్యానము</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">199</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-1">ద్విశతతమోఽ ధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1.<span class="CharOverride-6"> ఉత్తరమ్ - తరువాత</span> - ఆయిరువురకు లోకములు సమములని విరూపుడు పలికిన తరువాత; <span class="CharOverride-6">తౌ</span> - ఆ ఇక్ష్యాకు పైప్పలాదులు; <span class="CharOverride-6">తస్యభాషితే -</span> ఆ విరూపుని మాట విషయమున. </p> <p class="Footer">2. <span class="CharOverride-6">యదేతత్</span> - సద్యోముక్తి, క్రమముక్తి, లోకాంతర ప్రాప్తి అను మూడింటి సముదాయమును. </p> <p class="Footer">3. <span class="CharOverride-6">ఆర్హతః</span> - పూజ్యులను.</p> <p class="Footer">7. అఫలా యది - నీ జపఫలము నంతటిని నాకు ధారపోసితివి కనుక నీ సిద్ధిఫలము లేనిదైనను, జపప్రదాన పుణ్యముచేతనే నీ ఫలవృద్ధి కలిగిన కారణమున; <span class="CharOverride-6">జాపకమ్</span> - జపము వలన ఆర్జించిన; <span class="CharOverride-6">ఫలమ్ </span>- ఫలమును; <span class="CharOverride-6">ప్రాప్నుహి</span> - పొందుము. </p> <p class="Footer">8. <span class="CharOverride-6"> ప్రయత్నః </span>- నీకు జపదానము చేయు ప్రయత్నము; </p> <p class="Footer">9. వ్యవసాయం - నిశ్చయమును </p> <p class="Footer">11. <span class="CharOverride-6">సంయోగవిధిః</span> - జీవబ్రహ్మముల ఐక్యమును ప్రతిపాదించు వేదాంతవాక్యములు, <span class="CharOverride-6">స్తోభాః</span> - సామగీతి పూరణము అర్థముగా గల అక్షరములు <span class="CharOverride-6">‘హావుహావు’</span> వంటివి. </p> <p class="Footer">16. <span class="CharOverride-6">అన్యోన్య విధివా</span> - ఒకరినొకరు ఉపకారము చేసికొనుట అనుపనితో;<span class="CharOverride-6"> విషయప్రతిసంహారమ్</span> - విషయములను రూపాదులు ప్రతీపసంహారము - అనగా విషయములకు కారణమైన యింద్రియముల నణచుట చేతనే అణచివేయుటను. </p> <p class="Footer">17. పై పనిలో క్రమమును చెప్పుచున్నారు. మూలాధారము నందలి కుండలిని మేల్కొల్పి పైపై చక్రముల జయము అనుక్రమముచేత; మనసి - హృదయమనెడు అనాహత చక్రమున; స్థాప్య - నిరోధించి; అండున్న మనస్సును, ఒక్కటిగా చేయబడిన ప్రాణాపానములయందు వశముచేసి, దధతుః - పట్టుకొనిరి - అని భావము. </p> <p class="Footer">18. <span class="CharOverride-6">ఉపస్థితకృతౌ</span> - పద్మాసనమును వేసికొన్నవారై, <span class="CharOverride-6">భ్రువోః, అధః</span> - కనుబొమలక్రింద; నాసికాగ్రమ్ - ముక్కుకొనను చూచుచు - తన ముక్కు కొనను తాను చూచుట సాధ్యము కాని పని. ముక్కుకొనను అద్దములో చూడనగును కాని అది ప్రయోజనము లేని పని. అందువలన 'కనుబొమలక్రింద’ అని ప్రత్యేకముగా చెప్పిరి. దానివలన పూర్తిగా కన్నులు మూతపడవు. పడినచో నిద్ర రావచ్చును. పూర్తిగా తెరచుకొనవు. అట్లయినచో లోకదర్శనముచేత విక్షేపము చెదరుట సంభవించును. కనుక అరమోడ్పు కనులతో ఉన్నారని భావము. </p> <p class="Footer"> 'ఉపస్థాప్యోదరే తౌచ' అనియు పాఠము. అపుడు ఉదరమున అనగా స్వాధిష్ఠానమున నెలకొల్పి అని అర్థము. అటుపై మనస్సుతోపాటు; తౌ - ఆ ప్రాణాపానములను; భ్రుకుట్యాం - భ్రూమధ్యదేశమున ఆజ్ఞాచక్రమున, ధారయతః - నిలిపిరి - అని అర్థము. </p> <p class="Footer">19. <span class="CharOverride-6">తథా</span> - చెప్పిన విధముగా; <span class="CharOverride-6">జితాత్మానౌ</span> - చిత్తమును గెలిచినవారు; <span class="CharOverride-6">ఆత్మానమ్</span> - చిత్తమును, ప్రాణపహితముగా; మూర్ధని - సహస్రార కమలమునందు; నిలిపిరి - అని పూర్వముతో అన్వయము. </p> <p class="Footer">20. <span class="CharOverride-6">తాలుదేశమ్ </span>- బ్రహ్మరంధ్రము; <span class="CharOverride-6">ఉద్దాల్య</span> - పగుల గొట్టుకొని. </p> <p class="Footer">23. <span class="CharOverride-6">యోగానామ్ </span>- యోగులయొక్క </p> <p class="Footer">24. <span class="CharOverride-6"> యోగస్య </span>- యోగియొక్క; <span class="CharOverride-6">ఏతేభ్యః </span>- ఇక్కడ ఉన్న ఈ సభ్యులకు; <span class="CharOverride-6">సమాహితమ్ </span>- విహితము. </p> <p class="Footer">25. ఇందు బ్రహ్మముఖమునందు ప్రవేశించుట అను మాటను బట్టి దుఃఖహేతువైన వ్యష్టి లింగవియోగము - (దేహాదుల ఎడబాటు) బ్రహ్మలోకమున కరిగిన జాపకునకు అప్పటికప్పుడు కలుగునని చెప్పినట్లయినది. <span class="CharOverride-6">అచేతయత్</span> - అతనికి బ్రహ్మాత్శైక్యమును తెలిపిన వాడాయెను - అనునది అక్కడ హేతువు. </p> <p class="Footer"> ఈ అర్థమును భగవద్గీత ఇట్లు సంగ్రహించినది. </p> <p class="Poem-1"><span class="CharOverride-17">“సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య</span></p> <p class="Poem2"><span class="CharOverride-17">మూర్ధ్న్యాధా యాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్”.</span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మామనుస్మరన్ </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">యః ప్రయాతి సమద్భావం యాతి వాస్త్యత్ర సంశయః.” </span></p> <p class="Footer ParaOverride-1"> ద్వారములన్నింటిని మూసివైచి మనస్సును హృదయమున నిరోధించి, తన ప్రాణమును తలయందు నిలిపి యోగధారణయందు పూర్తిగా నిలుచును. </p> <p class="Footer ParaOverride-1"> ఓమ్ అను ఒక అక్షరమగు బ్రహ్మమును జపించుచు నన్నే తలపోయుచు ప్రయాణించువాడు నా భావమునే పొందును. సందియము లేదు. </p> <p class="Footer"> ఇతరులు స్మృతి వాక్యమును బట్టి కల్పాంతరమున వ్యష్టిలింగము నుండి ముక్తినందుదురని చెప్పుదురు. </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-17">“బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-17">పరస్యాన్తేకృతాత్మానః ప్రవిశన్తి పరంపదమ్” ఇది ఆ స్మృతి వాక్యము. </span></p> <p class="Footer"> బ్రహ్మతో లీనమగుట సంభవించినపుడు వారందరు కల్పాంతరమున పరమపదమును చేరుకొందురు. </p> <p class="Footer">29. <span class="CharOverride-13">వాంఛితమ్</span> - అనంతమైన సుఖమును - అని భావము. </p> <p class="Footer">30. <span class="CharOverride-6">మహాస్మృతి</span> యనగా వేదసంహిత.<span class="CharOverride-6"> అనుస్మృతులనగా</span> మనువు మొదలగు వారి స్మృతులు.</p> <p class="Footer">31. <span class="CharOverride-6">సాధయే </span>- సాధింతును - మీ యిష్టమును సాధింతునని భావము.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-9">200</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-10">జాపకుని ఉపాఖ్యానము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">200</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> </body> </html>
Cancel
Save Chapter