Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_201-210</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/3/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/3/css/idGeneratedStyles_10.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_201-210" xml:lang="en-GB"> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. వెనుక జపప్రసంగము ననుసరించి యోగము యొక్క శ్రేయస్సును గూర్చియు ప్రస్తావించి యున్నారు. యోగము, జపము అనువాని కానవచ్చు ఫలము చాలగొప్పది అని తెలిపి జపఫలకాలమున బ్రహ్మజ్ఞానమునకు అది ద్వార మగుటను వివరించిరి. ఇట్లు యోగము జ్ఞానమునకు సహాయమా? లేక జ్ఞానఫలమును కలిగించునదియా? అనుభావముతో అడుగుచున్నాడు. జ్ఞానయోగస్య - జ్ఞానమనగా విచారము, దానితో కూడిన యోగము జ్ఞానయోగము. “యోగవిధిని, తత్కారణమగు సాంఖ్యయోగజ్ఞానమును మొత్తముగా తెలిసికొందును" అనునిట్టి వాక్యములందు ఈరెంటికి కలయిక యున్నట్లు తెలియుచున్నది కదా! కనుక జ్ఞాన యోగఫలమేమి? అని మొదటి ప్రశ్న. దానికి సంబంధించి వేదములకు, నియమస్య - అగ్నిహోత్రార్చనము మొదలగు కర్మముల నాచరించుటకు ఫలమేమి? అనిప్రశ్న భావము. <span class="CharOverride-1">భూతాత్మా</span> - జీవుడు. </p> <p class="Footer ParaOverride-1">4. <span class="CharOverride-1">కారణమ్</span> - జగత్తునకు అనుమాట కలుపుకొనవలయును; <span class="CharOverride-1">యత్ర</span> - ఏదినిమిత్తముగా; <span class="CharOverride-1">విధిః</span> - కర్మముల సముదాయము, <span class="CharOverride-1">జ్ఞానే</span> - జ్ఞానము కలుగగా; - ఏ ఫలము కలుగునని విద్యావంతులు గట్టిగా చెప్పుదురో; మన్త్రశబ్దైః- వేదవాక్యముల చేత; <span class="CharOverride-1">అకృతప్రకాశమ్</span> - చక్కగా తెల్లము కానిదేదో పరమాత్మ వాఙ్మనస్సులకు అతీతము కనుక; </p> <p class="Footer ParaOverride-1">5. <span class="CharOverride-1">అర్థశాస్త్రము</span> - మూడు పురుషార్థములకు సంబంధించిన శాస్త్రము; <span class="CharOverride-1">ఆగమః</span> - వేదము; మన్త్రాః - “ఇషేత్వా” మొదలగు వేదములందలి వాక్యములు - అవి కలవారు దేని నుపాసింతురని ప్రశ్నము. అట్లే యజ్ఞము మొదలగు వానితో ఏ సుఖము లభించునో - అది; ఆ వస్తువేది? ఏ విధముగా అది లభ్యమగును. ఏ ప్రదేశమున - అనగా మరియొకతావునందా? ప్రత్యగాత్మయందేనా? అని భావము. </p> <p class="Footer">6. <span class="CharOverride-1">మహీజాః</span> - భూమియందు పుట్టినవి - స్థావరములైన చెట్లు చేమలు, జంగమములైన మనుష్యులు, పశువులు మొదలగునవి. </p> <p class="Footer">7. ఏ విషయమున జ్ఞానమును మనుష్యులు కోరుదురో ఆ విషయమునందు ప్రవర్తింతురు. నాకు పరమము, పురాణము అయిన తత్త్వమును గూర్చి యేమియు తెలియదు. తెలియని దానిని గూర్చి ప్రవర్తించుట మిథ్యాప్రవృత్తియేకదా! అని భావము. </p> <p class="Footer">8. <span class="CharOverride-2">“</span><span class="CharOverride-1">సో ఽహం భగవో మన్త్రవిదే వాస్మి నాత్మవిత్</span><span class="CharOverride-2">”</span> అని శ్రుతి - పూజ్యుడా! అట్టినేను మంత్రముల నెరిగిన వాడనే కాని ఆత్మము నెరిగినవాడను కాను - అనుట చేత ఋగ్వేదాదుల జ్ఞానము ఆత్మజ్ఞానము కాదని శ్లోకభావము; <span class="CharOverride-1">భూతప్రకృతిమ్</span> - ఆకాశము మొదలగు భూతముల మూలకారణమగు ఆత్మతత్త్వమును; <span class="CharOverride-1">న వేద్మి</span> - ఎరుగను.</p> <p class="Footer">10. యత్ర విధిః - కర్మకాండ దేనికై బయలుదేరినదను దానికి సమాధానము </p> <p class="Footer">11. జ్ఞానే ఫలం యత్ - అనుప్రశ్నకు ఉత్తరము. </p> <p class="Footer ParaOverride-1">12. <span class="CharOverride-1">“యచ్చార్థశాస్త్రమ్”</span> మొదలగు ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నారు. <span class="CharOverride-1">కామాత్మకాః</span> - కామమే ప్రధానముగా కలవి; <span class="CharOverride-1">ఛందసి</span> - వేదమునందు; వేదమునందు చెప్పబడిన కర్మములు- యజ్ఞాదులు - కామము ప్రధానముగా గలవి. <span class="CharOverride-1">ఏభిః</span> - వీనితో - కామములతో; <span class="CharOverride-1">విముక్తః</span> - విముక్తి పొందినవాడు; పరమ్ - పరమైన ఆత్మతత్వమును; <span class="CharOverride-1">అశ్నువీత</span> - అనుభవించును; <span class="CharOverride-1">సుఖార్థీ</span> - సుఖములను కోరువాడై; <span class="CharOverride-1">కర్మపథే</span> - కర్మమార్గమున; <span class="CharOverride-1">ప్రవృత్తః</span> - ప్రవర్తించువాడు; <span class="CharOverride-1">నిర్ణయం ప్రయాతి</span> - నరకమున కరుగును. తరువాతి అర్ధశ్లోకముతో దీనిని ఆక్షేపించుచున్నారు. ఇష్టము సుఖమైనది కనుక గ్రహింపదగినది, అనిష్టము దుఃఖము కనుక త్యజింపదగినది. మానవుడు ఈ రెండింటికై కోరును. కర్మములు ఆ కోరికలను తీర్చును. ఇందు దోసమేమి? అని ఆక్షేపణస్వరూపము. </p> <p class="Footer ParaOverride-1">13. “వివిదిషన్తియజ్ఞేన” యజ్ఞముతో బ్రహ్మమును తెలియగోరుచున్నారు - మొదలగు వాక్యమువలన కామభావన లేక కర్మానుష్ఠానము చేయువారికి పరబ్రహ్మమును తెలియవలయునను కోరిక పుట్టును. ఆవిధముగా వారు బ్రహ్మమునందు ప్రవేశింతురు. స్వర్గాదులు సిద్ధించునని ఫలములను గూర్చి వినుటచేత కర్మవిధి కామములనే క్రమ్ముకొనును. అట్లగుట నరకము. కావున కామములనుండి విముక్తి పొందవలయును. బ్రహ్మజ్ఞానముకొరకే యజ్ఞాదుల నాచరింపవలయును. కాని క్షుద్రఫలములకొరకు కాదని శ్లోకతాత్పర్యము. </p> <p class="Footer">14. <span class="CharOverride-1">ఆత్మా</span> - చిత్తము; <span class="CharOverride-1">ఆదిభిః</span> - మొట్టమొదటి వానిచేత - నిత్యములగు కర్మములచేత అని భావము; <span class="CharOverride-1">ఇధ్యమానః</span> - రాగము మొదలగు దోషములు తొలగుటచేత అద్దమువలె ప్రకాశించుచున్నదై; ద్యుతిమాన్ - సత్తు, అసత్తు అను విషయములను చక్కగా తెలిసికొను శక్తి కలది యగును; అందువలననే; <span class="CharOverride-1">సుఖార్థీ</span> - పరమసుఖమగు మోక్షమును కోరునది యగును; <span class="CharOverride-1">పరమ్ -</span> అత్యంతము - కర్మములకు గోచరము కానిది యని భావము; <span class="CharOverride-1">నిరాశిషమ్</span> - ఆశలు లేనిది - ఈ మాటచే వెనుక చెప్పిన “ఆశీస్త్వవచ్చన్దతి” అను మాటను కొట్టివైచుచున్నారు; అట్టి పరబ్రహ్మను; <span class="CharOverride-1">అవైతి</span> - పొందును - తన వృత్తిచే పరబ్రహ్మము వైపు ప్రసరించునని తాత్పర్యము. </p> <p class="Footer">15. బంధమును కలిగించు కర్మములు బంధ నివర్తకము లగుననుట కల్లుత్రావి శుద్ధుడయ్యె నన్నట్లున్నది అను ఆక్షేపమును తొలగించుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-1">ఏతౌ</span> - ఈ మనస్సు, కర్మము అనునవి; <span class="CharOverride-1">సత్పథౌ</span> - బ్రహ్మప్రాప్తికి మార్గములు; ఎట్లో నిరూపించుచున్నారు; ఇది - <span class="CharOverride-1">దృష్టమ్</span> - ప్రత్యక్షము - శ్రుతి దీనిని బోధించుచున్నదని భావము; <span class="CharOverride-1">కర్మ</span> - కర్మము; <span class="CharOverride-1">శాశ్వతమ్</span> - మోక్షహేతువైనను; <span class="CharOverride-1">అన్తవత్,</span> చ - క్షుద్రమైన ఫలము కలదైనను; అందు; <span class="CharOverride-1">మనస్త్యాగః</span> - మనస్సుతో చేయు కర్మఫలత్యాగము; <span class="CharOverride-1">కారణమ్</span> - శాశ్వతమగు ఫలము నిచ్చుటలో కారణమగును;<span class="CharOverride-1"> న, అన్యత్, ఆస్తి </span>- కర్మమును మొత్తముగా వదలివైచుట - అనునది ఉండదు. చేయవలసినది కర్మఫలత్యాగమే కానీ కర్మత్యాగము కాదని ఫలితార్థము.</p> <p class="Footer">16. <span class="CharOverride-1">చక్షుః ప్రణేతా</span> - కన్ను అనెడు నడపించువాడు; <span class="CharOverride-1">నిశాత్యయే</span> - రాత్రి ముగిసిన సమయమున - సూర్యోదయమైన పిదప; <span class="CharOverride-1">తమసా</span> - చీకటితో; <span class="CharOverride-1">అసంవృతాత్మా</span> - కప్పబడని స్వరూపము<span class="CharOverride-1"> <br/>కలవాడై; స్వేన, ఆత్మనా</span> - తన తేజస్సుతో - లేదా సూర్యతేజస్సు వలన కలిగిన వెలుగుతో; వర్జనీయమ్ -ముండ్లు మొదలగు పరిహరింపవలసిన దానిని; <span class="CharOverride-1">పశ్యతి</span> - చూచును; </p> <p class="Footer"> అట్లే జ్ఞానమ్ - బుద్ధి; <span class="CharOverride-1">విజ్ఞానగుణేన</span> - వివేకమగు గుణముతో; యుక్తమ్ - కూడినదై; అశుభమ్ - బ్రహ్మజ్ఞానమునకు ప్రతిబంధకమైన దానిని; <span class="CharOverride-1">పశ్యతి</span> - చూచును - పిదప దానిని తొలగించుకొనునని తాత్పర్యము. </p> <p class="Footer">17. దృష్టాంతమును మరింత వివరించుచు జ్ఞానఫలము యొక్క శ్రేష్ఠతను నిరూపించుచున్నారు. <span class="CharOverride-1">ఉదపానమ్</span> - నుయ్యి </p> <p class="Footer">18. కర్మము అయిదు విధములుగా నుండును. ఆ అయిదు - మంత్రము, అనుష్ఠానము, దక్షిణలు, అన్నదానము, మనోనిగ్రహము అనునవి; మనసః, సమాధిః - మనస్సును ఏకాగ్రము చేయుట - దేవతాధ్యానాదులయందని భావము. ఏ దేవత హవిస్సును గ్రహింపవలయునో ఆదేవతను ధ్యానించుచుండవలయునని శ్రుతి చెప్పుచున్నది. <span class="CharOverride-1">ఫలమ్</span> - ఫలముకలది యగునని యర్థము.</p> <p class="Footer">19. కర్త స్వరూప భేదమును బట్టి కర్మముల ఫలభేదముండునని చెప్పుచున్నారు. </p> <p class="Footer"> కర్మగుణాత్మకము- సాత్త్వికము, రాజసము, తామసము. అట్లే మంత్రము కూడ సాత్త్వికము, రాజసము తామసమని మూడు విధములు - <span class="CharOverride-1">“అగ్నిమీళే”</span> ఇత్యాది మంత్రములు - సాత్త్వికములు, <span class="CharOverride-1">“ఇషేత్వోర్జేత్వా” </span>మొదలగునవి రాజసములు, <span class="CharOverride-1">“సర్వంప్రవిధ్య హృదయం ప్రవిధ్య</span><span class="CharOverride-2">”</span> మొదలగునవి తామసములు. </p> <p class="Footer"> ఇట్లు విధికూడ మూడు విధములు,<span class="CharOverride-1"> </span><span class="CharOverride-2">“</span><span class="CharOverride-1">ఆత్మకామో యజేత</span><span class="CharOverride-2">”</span> - వంటివి సాత్వికములు,<span class="CharOverride-1"> “స్వర్గకామో యజేత” </span>వంటివి రాజసములు, “అభిచరన్ యజేత” వంటివి తామసములు. కర్తృస్వభావమునుబట్టియు ఆభేదములుండునని “మనసోపపత్తిః” అను దానిని బట్టి నిరూపించిరి.<span class="CharOverride-1"> “యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి”</span> - ‘విద్యతో శ్రద్ధతో, ఉపనిషద్జ్ఞానముతో చేయునది మిక్కిలి వీర్యము కలది యగును’ అని విద్యాదులతో కూడిచేయువాడు సాత్త్వికుడు. విద్యాదులు లేనివాడై కేవలము చేయవలయును కనుక చేయువాడయినచో రాజసుడు. ఇతరుల మెప్పుకొరకు చేయువాడు తామసుడు. </p> <p class="Footer"> వారి కర్మములు కూడ క్రమముగా వీర్యవత్తరము, వీర్యవంతము, నిర్వీర్యము - అని మూడు విధములుగా నుండును. </p> <p class="Footer"> ఫలములోని భేదములనుబట్టి ఫలము ననుభవించువారిలో కూడ భేదములు మూడు విధములుగా నుండును. అందు మొదటివాడు సుఖి, రెండవవాడు దుఃఖి, మూడవవాడు మూఢుడు. </p> <p class="Footer">20. ఇందు చెప్పిన శబ్దాదులు కర్మఫలములు. అవి కర్మము ద్వారమున సిద్ధించు లోకమున - స్వర్గమున - అందుబాటు లోనికి వచ్చును. ఇందు చేయుట, అందనుభవించుట అనునిట్టిది అదృష్టఫలము. కాని జ్ఞానమువలన కలుగు ఫలము- ' న సంస్థానగతః' మరణము పొందని వాడు పొందునది - అనగా </p> <p class="Footer"> మరణింపకముందే లభించునది. అనగా దృష్టఫలము. అదృష్టఫలము కంటె దృష్టఫలము గొప్పదికదా! అని శ్లోకభావము. </p> <p class="Footer ParaOverride-1">21. కర్మములవలననే మోక్షము కలిగినచో జ్ఞానమునకు ఫలమేమి? అని శంకించి సమాధానము చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> శరీరముకలవాడు చేసిన కర్మము శరీరముతో కూడినవాడే అయి అనుభవింపవలయును. కర్మఫలమగు దుఃఖాదులకు ఆశ్రయము శరీరమే కాని శరీరములేని ఆత్మకాదు. అందువలన శరీరములేని తనము లక్షణముగా గల మోక్షము శరీరసంబంధమగు కర్మముతో సిద్ధింపదని భావము. </p> <p class="Footer ParaOverride-1">22. అయినచో వాచికమగు జపాదికముతో గాని, మానసమగు ధ్యానాదికముతో కాని మోక్షము సిద్ధింపవలయును గదా - అన్నచో - కాదని చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> వాక్కుతో, మనసుతో చేసిన కర్మము అవికల శరీరముతోడనే అనుభవింపవలసియుండును. దాని కతీతమైన వస్తువు నది కన్పట్టచేయదు. అని భావము. </p> <p class="Footer ParaOverride-1">23. కర్మగుణమ్ - కర్మమునందలి గుణము. సత్త్వము, రజస్సు, తమస్సు అను రూపమైనది - దానిని, ఫలము పొందగోరుచు చేయువాడు - శుభాశుభ కర్మఫలములననుభవించునని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">24. చేప నీటివేగముచేత తనకిష్టములేని వైపునకును పోవును. అట్లే పూర్వకర్మఫలము తన ఇష్టానిష్టములతో సంబంధములేకయే తన్ను చేరుకొనును. ఇట్లు కాగా శుభాశుభ కర్మఫలములు పొంది సంతసించుట, ఏడ్చుట అనునది మూఢతయే కదా అని శ్లోక తాత్పర్యము. </p> <p class="Footer">25. ఇట్లు కర్మగతిని చెప్పి జ్ఞానమును గూర్చి చెప్పెదనని ప్రతిజ్ఞ చేయుచున్నారు. <span class="CharOverride-1">ఆత్మవన్తః</span> - చిత్తమును దృఢముగా అదుపున నుంచుకొన్నవారు. <span class="CharOverride-1">వ్యతి యాన్తి</span> - జగత్తును విశేషముగా అతిక్రమించి ఏ పరమస్థితిని చేరుకొందురో; <span class="CharOverride-1">తత్ - ఆ; పరమ్ </span>- శ్రేష్ఠమైన దానిని గురించి చెప్పెదను వినుము - అని భావము.</p> <p class="Footer">26. రసాదిహీనమైనను, ఒక్కటియైనను అనుభవించెడు జనులకొరకు అయిదయిదు విధములుగా శబ్దాదులను, పంచభూతములను, పంచతన్మాత్రలను, పంచేంద్రియములను ఆబ్రహ్మము సృజించెనని భావము. <span class="CharOverride-1">అవర్ణమ్</span> - అనుటవలన - ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములుగలది రజస్సు, సత్యము, తమస్సు అనువాని రూపమయినది అగు 'ప్రధాన' మనబడు తత్త్వము పరబ్రహ్మముకంటె భిన్నమైనదని భావము. </p> <p class="Footer">27. <span class="CharOverride-1">సత్</span> - ప్రధానము, పరమాణువు మొదలగునది; <span class="CharOverride-1">అసత్</span> - శూన్యము; <span class="CharOverride-1">సదసత్ -</span> నిర్వచింపశక్యము కానిదగు మాయాశబలిత స్వరూపము - పరమాత్మ ఈ మూడును కాదని భావము; అందువలననే, <span class="CharOverride-1">అక్షరమ్</span> - ఎట్టి మార్పులు లేక ఏకరూపముగా నుండు నట్టిది; </p> <p class="Footer"> <span class="CharOverride-1">“నాసదాసీన్నో సదాసీత్తదానీం నాపీద్రజో నో వ్యోమాపరో యత్</span><span class="CharOverride-2">”</span> అనుశ్రుతియందును సృష్టికి పూర్వము సదసద్రజఃశబ్దములచే చెప్పబడెడు ప్రధాన, శూన్య, పరమాణువులును, పరవ్యోమ శబ్దముచేత తెలియనగు మాయాశబలస్వరూపమును జగత్కారణములు కావని చెప్పబడినది.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">ఏకాధిక ద్విశతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Tat"><span class="CharOverride-4">యుధిష్ఠిర ఉవాచ</span> - ధర్మరా జిట్లనెను </p> <p class="Poem-1">కిం ఫలం జ్ఞానయోగస్య వేదానాం నియమస్య చ, </p> <p class="Poem2">భూతాత్మా చ కథం జ్ఞేయ స్తన్మే బ్రూహి పితామహ. 1 </p> <p class="Tat">తాతా! జ్ఞానయోగము ఫలమేమి? వేదములను అధ్యయనము చేయగా కలుగు ఫలమెట్టిది? నియమమునకు ఫలమేమి? జీవుని గూర్చి తెలియదగు విధమేది? దీనిని నాకు తెలియజెప్పుము. </p> <p class="Tat"><span class="CharOverride-4">భీష్మ ఉవాచ</span> -భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1">అత్రా ప్యుదాహ రన్తీమ మితిహాసం పురాతనమ్, </p> <p class="Poem2">మనోః ప్రజాపతే ర్వాదం మహర్షి శ్చ బృహస్పతేః 2 </p> <p class="Tat">ఇందును ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుకొనుచుందురు. అది ప్రజాపతియగు మనువునకును, మహర్షి బృహస్పతికిని అయిన సంవాదము. </p> <p class="Poem-1">ప్రజాపతిం శ్రేష్ఠతమం ప్రజానాం </p> <p class="Poem2">దేవర్షిసంఘప్రవరో మహర్షిః,, </p> <p class="Poem2">బృహస్పతిః ప్రశ్న మిమం పురాణం </p> <p class="Poem2">పప్రచ్ఛ శిష్యోఽథ గురుం ప్రణమ్య. 3 </p> <p class="Tat ParaOverride-1">ప్రజలలో మిక్కిలి గొప్పవాడగు ప్రజాపతిని గురువుగా భావించి దేవర్షుల సముదాయములో శ్రేష్ఠుడు, మహర్షి అయిన బృహస్పతి, శిష్యుడై ప్రణమిల్లి ప్రాతకాలపు ఈప్రశ్నను అడిగెను. </p> <p class="Poem-1">యత్కారణం యత్ర విధిః ప్రవృత్తో </p> <p class="Poem2 ParaOverride-2">జ్ఞానే ఫలం యత్ర వదన్తి విప్రాః, </p> <p class="Poem2 ParaOverride-2">యన్మన్త్ర శబ్దై రకృత ప్రకాశం </p> <p class="Poem2">తదుచ్యతాం మే భగవన్ యథావత్. 4 </p> <p class="Tat ParaOverride-1">ఓ భగవంతుడా! ఈజగత్తునకు కారణమేదో, ఏకారణముగా కర్మకాండము ఏర్పడినదో, జ్ఞానము కలుగగా ఏ ఫలము సమకూడునని విప్రులు చక్కగా వక్కాణింతురో, ఏది మంత్రశబ్దములచేత విస్పష్టముగా తెలియరాదో దానిని ఉన్నదున్నట్లు నాకు తెలియజెప్పుము. </p> <p class="Poem-1">యచ్చార్థశాస్త్రాగమ మన్త్రవిద్భి - </p> <p class="Poem2 ParaOverride-2">ర్యజ్ఞై రనేకై రథ గోప్రదానైః, </p> <p class="Poem2 ParaOverride-2">ఫలం మహద్భి ర్యదుపాస్యతే చ </p> <p class="Poem2">కిం తత్కథం వా భవితా క్వ వా తత్. 5 </p> <p class="Tat">అర్థశాస్త్రములను, ఆగమములను, మంత్రములను తెలిసినవారు పెక్కు యజ్ఞములతోడను, రథములను గోవులను పెల్లుగా దానమిచ్చుటలచేతను, ఇంకను గొప్పవారిచేత ఏఫలము ఉపాసింపబడుచున్నదో అది ఏమి?, దానిని పొందుటెట్లు? ఎందు లభించును? </p> <p class="Poem-1"> మహీ మహీజాః పవనోఽన్తరిక్షం </p> <p class="Poem2 ParaOverride-2">జలౌకస శ్చైవ జలం దివం చ, </p> <p class="Poem2 ParaOverride-2">దివౌకస శ్చాపి యతః ప్రసూతా </p> <p class="Poem2">స్తదుచ్యతాం మే భగవన్ పురాణమ్. 6 </p> <p class="Tat">ఈభూమి, దానియందేర్పడిన స్థావరములు, జంగమములు, వాయువు, అంతరిక్షము, నీటిజీవులు, నీరు, ఆకాశము, దేవతలు ఈ యన్నియు ఎందునుండి పుట్టినవి? అన్నింటికంటె మొదటిదగు ఆతత్త్వమును గూర్చి నాకు తెలియ జెప్పుము. </p> <p class="Poem-1">జ్ఞానం యతః ప్రార్థయతే నరో వై </p> <p class="Poem2 ParaOverride-2">తత స్తదర్థా భవతి ప్రవృత్తిః, </p> <p class="Poem2 ParaOverride-2">న చాప్యహం వేద పరం పురాణం </p> <p class="Poem2">మిథ్యా ప్రవృత్తిం చ కథం ను కుర్యామ్. 7 </p> <p class="Tat">నరుడు ఏ విషయమునందలి జ్ఞానమును మిక్కిలిగా తెలియగోరునో ఆజ్ఞానమునకు సంబంధించి ప్రవృత్తి కలుగును. నేను పరము, పురాణము నైన తత్త్వము నెరుగను. తెలియనిదానియందు ప్రవృత్తి నెట్లు చేయుదును? </p> <p class="Poem-1">ఋక్సామసంఘాంశ్చ యజూంషి చాపి </p> <p class="Poem2 ParaOverride-2">చ్ఛ న్దాంసి నక్షత్రగతిం నిరుక్తమ్, </p> <p class="Poem2 ParaOverride-2">అధీత్య చ వ్యాకరణం సకల్పం </p> <p class="Poem2">శిక్షాం చ భూతప్రకృతిం న వేద్మి. 8 </p> <p class="Tat">ఋక్కులను, సామమంత్రముల సముదాయములను, యజుర్వేద మంత్రములను, ఛందస్సులను, జ్యోతిషమును, నిరుక్తమును, కల్పశాస్త్రముతో పాటు వ్యాకరణమును చదివియు నేను భూతముల ప్రకృతిని తెలియకున్నాను.</p> <p class="Poem-1">స మే భవాన్ శంసతు సర్వమేత- </p> <p class="Poem2">త్సామాన్య శబ్దైశ్చ విశేషణై శ్చ </p> <p class="Poem2">స మే భవాన్ శంసతు తావదేత- </p> <p class="Poem2 ParaOverride-2">జ్జ్ఞానే ఫలం కర్మణి వా యదస్తి. </p> <p class="Poem2 ParaOverride-2">యథాచ దేహా చ్చ్యవతే శరీరీ </p> <p class="Poem2">పునః శరీరం చ యథాఽప్యుపైతి 9 </p> <p class="Tat">తమరు నాకు దీని నంతటిని సామాన్య శబ్దములతోడను, విశేషణములతోడను ఎరుగజెప్పుడు. మరియు ఫలమునందా? కర్మమునందా అనుదానిని కూడ తమరు నాకు బోధింపవలయును. అంతే కాదు ఈ శరీరమునందున్న జీవాత్మ దేహమునుండి ఎట్లు జారిపోవును? మరల శరీరమునం దెట్లు ప్రవేశించును - దీనిని కూడ తమరు తెలియజెప్పవలయును. </p> <p class="Tat"><span class="CharOverride-4">మను రువాచ</span> - మను విట్లు పలికెను </p> <p class="Poem-1">యద్యత్ర్పియం యస్య సుఖం తదాహు- </p> <p class="Poem2 ParaOverride-2">స్త దేవ దుఃఖం ప్రవదన్త్యనిష్టమ్, 10 </p> <p class="Poem2 ParaOverride-2">ఇష్టం చ మే స్యా దితరచ్చ న స్యా – </p> <p class="Poem2 ParaOverride-2">దేతత్కృతే కర్మవిధిః ప్రవృత్తః. </p> <p class="Poem2 ParaOverride-2">ఇష్టం త్వనిష్టం చ న మాం భజేతే- </p> <p class="Poem2">త్యేతత్కృతే జ్ఞానవిధిః ప్రవృత్తః. 11 </p> <p class="Tat">ఎవనికి ఏది ఏది ప్రియమో దానిని సుఖమనియు, ఏది అప్రియమో అది దుఃఖమనియు నందురు. నాకిష్టము కలుగవలయును. అనిష్టము కలుగరాదు అనుకొనుటవలన కర్మవిధి బయలుదేరినది. ఇష్టముగాని అనిష్టముగాని నన్ను చెందవు - అనుభావముతో జ్ఞానవిధి ఏర్పడినది. </p> <p class="Poem-1">కామాత్మకా శ్ఛన్దసి కర్మయోగా </p> <p class="Poem2 ParaOverride-2">ఏభి ర్విముక్తః పర మశ్నువీత, </p> <p class="Poem2 ParaOverride-2">నానావిధే కర్మపథే సుఖార్థీ </p> <p class="Poem2">నరః ప్రవృత్తో నిరయం ప్రయాతి. </p> <p class="Tat">వేదము చెప్పిన కర్మయోగములన్నియు కామప్రధానములు. ఈ కామములు విడనాడినవాడు పరమఫలము ననుభవించును. సుఖములు కోరెడు నరుడు పెక్కువిధములుగల కర్మమార్గమున తిరుగాడుచు నరకమున కరుగుచున్నాడు. </p> <p class="Tat"><span class="CharOverride-4">బృహస్పతి రువాచ</span> - బృహస్పతి యిట్లనెను </p> <p class="Poem-1">ఇష్టం త్వనిష్టం చ సుఖాసుఖే చ </p> <p class="Poem2">సాశీ స్త్వవచ్ఛన్దతి కర్మభి శ్చ. 12 </p> <p class="Tat">ఇష్టము, అనిష్టము, సుఖము దుఃఖముగా నగును. ఆ ప్రార్థన కర్మములతో ప్రార్థించువానిని వ్యాపించును. </p> <p class="Tat"><span class="CharOverride-4">మను రువాచ </span>- మను విట్లు పలికెను. </p> <p class="Poem-1">ఏభి ర్విముక్తః పర మావిశేశ </p> <p class="Poem2 ParaOverride-2">ఏతత్కృతే కర్మవిధిః ప్రవృత్తః, </p> <p class="Poem2 ParaOverride-2">కామాత్మకాంశ్ఛన్దతి కర్మయోగ </p> <p class="Poem2">ఏభి ర్విముక్తః పర మాదదీత. 13 </p> <p class="Tat">కామములను విడనాడి కర్మముల నాచరించినచో నరుడు పరమును బ్రహ్మమును ప్రవేశించును. దానికొరకే కర్మముల అనుష్ఠానము బయలుదేరినది. కాని కర్మయోగము కామాత్మకములనే క్రమ్ముకొనుచున్నది. అందువలన కోరికలను విడనాడినచో బ్రహ్మమునే పొందును. </p> <p class="Poem-1"> ఆత్మాదిభిః కర్మభి రిధ్యమానో </p> <p class="Poem2 ParaOverride-2">ధర్మే ప్రవృత్తో ద్యుతిమాన్ సుఖార్థీ, </p> <p class="Poem2 ParaOverride-2">పరం హి తత్కర్మపథా దపేతం </p> <p class="Poem2">నిరాశిషం బ్రహ్మపరం హ్యవైతి. 14 </p> <p class="Tat">నిత్యములగుకర్మములచేత దోషములు తొలగి ప్రకాశించుచున్న చిత్తము ధర్మమునందు ప్రవృత్తి కలదై కాంతితో వెలిగిపోవుచు మోక్షసుఖమును కోరునదిగా రూపొందును. అటుపై మిక్కిలిగా ఆ కర్మమార్గమునుండి తొలగినది, ఆశలు లేనిదియగు బ్రహ్మమునందు లగ్నమగు స్థితిని పొందును. </p> <p class="Poem-1">ప్రజాః సృష్టా మనసా కర్మణా చ </p> <p class="Poem2">ద్వావేవైతౌ సత్పథౌ లోకజుష్టౌ, </p> <p class="Poem2">దృష్టం కర్మ శాశ్వతం చాన్తవచ్చ </p> <p class="Poem2">మనస్త్యాగః కారణం నాన్య దస్తి. 15 </p> <p class="Tat">జీవులందరు మనస్సుతో కర్మముతో పాటు, సృజింపబడిరి. లోకము తగులముగల ఈ రెండును మంచిదారులే. ఇది ప్రత్యక్షము. శాశ్వతమగు మోక్షమునకు గాని, అంతము గల క్షుద్రఫలమునకు కాని కారణమగు కర్మమునందు మనస్త్యాగము మోక్షసాధకమగును. మరియొకటికాదు. </p> <p class="Poem-1">స్వేనాత్మనా చక్షు రివ ప్రణేతా </p> <p class="Poem2">నిశాత్యయే తమసా సంవృతాత్మా, </p> <p class="Poem2">జ్ఞానం తు విజ్ఞాన గుణేన యుక్తం </p> <p class="Poem2">కర్మాశుభం పశ్యతి వర్జనీయమ్. 16 </p> <p class="Tat">చీకటితో మూసికొనిపోయిన కన్ను అను నాయకుడు రాత్రి కడచినంతనే తన స్వరూపముతో అంతయు చూచునట్లు, జ్ఞానము విజ్ఞానగుణముతో కూడినదై వదలివేయదగిన అశుభ కర్మమును కనుగొనును. </p> <p class="Poem-1">సర్పాన్ కుశాగ్రాణి తథోదపానం </p> <p class="Poem2">జ్ఞాత్వా మనుష్యాః పరివర్జయన్తి </p> <p class="Poem2">అజ్ఞానత స్తత్ర పతన్తి కేచి- </p> <p class="Poem2">జ్జ్ఞానే ఫలం పశ్య యథా విశిష్టమ్. 17 </p> <p class="Tat">పాములను, దర్భముండ్లను, నూతిని చక్కగా తెలిసికొని మనుష్యులు ఆ వంకకు పోకుందురు. కొందరు తెలియక అందు పడుదురు. చూడు! జ్ఞానమునందు ఫలమెంత గొప్పదియో! </p> <p class="Poem-1">కృత్స్న స్తు మన్త్రో విధివత్ప్రయుక్తో </p> <p class="Poem2">యథా యథోక్తా స్త్విహ దక్షిణాశ్చ, </p> <p class="Poem2">అన్నప్రదానం మనసః సమాధిః </p> <p class="Poem2">పఞ్చాత్మకం కర్మఫలం వదన్తి. 18 </p> <p class="Tat">సమగ్రమైన మంత్రము, శాస్త్రముననుసరించి ప్రయోగించిన విధానము, శాస్త్రము చెప్పిన విధముగానున్న దక్షిణలు, అన్నదానము, మనస్సునే కాగ్రము చేయుట అను అయిదు తీరులుగల కర్మము ఫలవంతమగునని చెప్పుదురు. </p> <p class="Poem-1">గుణాత్మకం కర్మ వదన్తి వేదా- </p> <p class="Poem2">స్తస్మా న్మన్త్రో మన్త్రపూర్వం హి కర్మ </p> <p class="Poem2">విధి ర్విధేయం మనసోపపత్తిః </p> <p class="Poem2">ఫలస్య భోక్తా తు తథా శరీరీ. 19 </p> <p class="Tat">వేదములు కర్మమును గుణాత్మకమని చెప్పును. ఆకారణమున మంత్రము కూడ గుణాత్మకము. మంత్రపూర్వకమగు కర్మ కూడ అట్లే. విధియు నట్టిదే మనస్సును బట్టి ఏర్పడు ఫలముకూడ గుణాత్మకముగా నుండును. ఫలమును అనుభవించు భోక్తయు అదే తీరున నుండును. </p> <p class="Poem-1">శబ్దాశ్చ రూపాణి రసాశ్చ పుణ్యాః </p> <p class="Poem2">స్పర్మాశ్చ గన్ధాశ్చ శుభా స్తథైవ, </p> <p class="Poem2">నరో న సంస్థానగతః ప్రభుః స్యా </p> <p class="Poem2">దేత త్ఫలం సిద్ధ్యతి కర్మలోకే. 20 </p> <p class="Tat">చక్కని శబ్దములు, రూపములు, పుణ్యములగు రసములు, స్పర్శలు, ఇంపైన వాసనలు - ఇవి యన్నియు కర్మములఫలములు, కర్మలోకమునందు కలుగును. కాని నరుడు మరణింపక ముందే జ్ఞాన ఫలమునందు అధికారి కావలయును. </p> <p class="Poem-1">యద్య చ్ఛరీరేణ కరోతి కర్మ </p> <p class="Poem2 ParaOverride-2">శరీరయుక్తః సముపాశ్నుతే తత్, </p> <p class="Poem2 ParaOverride-2">శరీర మే వాయతనం సుఖస్య, </p> <p class="Poem2">దుఃఖస్య చాప్యాయతనం శరీరమ్. 21 </p> <p class="Tat">శరీరముతో ఏ యే కర్మము నాచరించునో ఆఫలమును శరీరముతో కూడినవాడై అనుభవించును. సుఖమునకును, దుఃఖమునకును శరీరమే ఆశ్రయము. </p> <p class="Poem-1">వాచా తు యత్కర్మ కరోతి కిఞ్చి- </p> <p class="Poem2 ParaOverride-3">ద్వాచైవ సర్వం సముపాశ్నుతే తత్, </p> <p class="Poem2 ParaOverride-3">మనస్తు యత్కర్మ కరోతి కిఞ్చి - </p> <p class="Poem2">న్మనఃస్థ ఏవాయ ముపాశ్నుతే తత్. 22 </p> <p class="Tat">వాక్కుతో చేసిన కర్మము ఫలము వాక్కుతోడనే నరు డనుభవించును. మనస్సు చేయు పని ఏకొంచెమైనను మనస్సునందున్న వాడయియే నరు డనుభవించును. </p> <p class="Poem-1">యథా యథా కర్మగుణం ఫలార్థీ </p> <p class="Poem2">కరోత్యయం కర్మఫలే నివిష్టః, </p> <p class="Poem2">తథా తథాఽయం గుణసంప్రవిష్టః </p> <p class="Poem2">శుభాశుభం కర్మఫలం భునక్తి. 23 </p> <p class="Tat">ఫలమును కోరువాడై కర్మఫలమునందు మునిగి తేలుచు కర్మగుణమును ఎట్లెట్లు ఆచరించునో అట్లట్లు ఆ గుణములయందు చొరబారినవాడై శుభాశుభ కర్మఫలము ననుభవించును. </p> <p class="Poem-1">మత్స్యో యథా స్రోత ఇవాభిపాతీ </p> <p class="Poem2 ParaOverride-2">తథా కృతం పూర్వ ముపైతి కర్మ, </p> <p class="Poem2 ParaOverride-2">శుభే త్వసౌ తుష్యతి దుష్కృతే తు </p> <p class="Poem2">న తుష్యతే వై పరమః శరీరీ. 24 </p> <p class="Tat">చేప ప్రవాహమున (కు ఎదురుగా) పోవు విధమున పూర్వ మొనరించిన కర్మము పురుషుని చేరుకొనును. దేహమునందలి జీవుడు శుభ ఫలమునందు సంతసించును. దుష్కృతమునందు దుఃఖించును. </p> <p class="Poem-1">యతో జగత్సర్వ మిదం ప్రసూతం </p> <p class="Poem2 ParaOverride-2">జ్ఞాత్వాఽఽ త్మవన్తో వ్యతియాన్తి యత్తత్, </p> <p class="Poem2 ParaOverride-2">యన్మన్త్ర శబ్దై రకృతప్రకాశం </p> <p class="Poem2">తుదుచ్యమానం శృణు మే పరం తత్. 25 </p> <p class="Tat">ఈ జగత్తు మొత్తము దేనినుండి పుట్టినదో, దేనిని తెలిసికొని ఆత్మవంతులు ఈ జగత్తును దాటిపోవుదురో, ఏది మంత్రశబ్దములతో ప్రకాశింపదో ఆ పరమవస్తువును గూర్చి చెప్పుచున్నాను. వినుము. </p> <p class="Poem-1"> రసై ర్విముక్తం వివిధైశ్చ గన్ధై - </p> <p class="Poem2 ParaOverride-2">రశబ్ద మస్పర్శ మరూపవచ్చ, </p> <p class="Poem2 ParaOverride-2">అగ్రాహ్య మవ్యక్త మవర్ణ మేకం </p> <p class="Poem2">పఞ్చ ప్రకారాన్ ససృజే ప్రజానామ్. 26 </p> <p class="Tat">ఆ పరమబ్రహ్మము, రసములు, వివిధములైన గంధములు, శబ్దములు, స్పర్శలును, రూపములును లేనిది. పట్టుకొననలవి కానిది, తక్కిన వస్తువులవలె తెలియరానిది, వర్ణములు లేనిది. ఏకరూపమైనది - అయినను అయిదు విధములుగల ప్రజలను సృజించెను. </p> <p class="Poem-1">న స్త్రీ పుమాన్నాపి నపుంసకం చ, </p> <p class="Poem2">న సన్న చాసత్సదసచ్చ తన్న, </p> <p class="Poem2">పశ్యన్తి యద్బ్రహ్మవిదో మనుష్యా - </p> <p class="Poem2">స్తదక్షరం నక్షరతీతి విద్ధి. 27 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్ష ధర్మపర్వణి <br/>మనుబృహస్పతి సంవాదే ఏకాధిక ద్విశతతమోఽధ్యాయః</span> </p> <p class="Tat">ఆబ్రహ్మము ఆడుది కాదు, పురుషుడు కాడు, పేడియు కాదు. సత్తుకాదు, అసత్తుకాదు. సత్తు అసత్తు అయినదియు కాదు. బ్రహ్మమునెరిగిన మనుష్యులు దానిని దర్శింతురు. అది అక్షరము. నశించునది కాదని యెరుగుము . </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున మనుబృహస్పతి సంవాదము గల రెండువందలయొకటవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-4">మను రువాచ</span> - మను విట్లు పలికెను. </p> <p class="Poem-1">అక్షరాత్ఖం తతో వాయు స్తతో జ్యోతి స్తతో జలమ్, </p> <p class="Poem2">జలాత్ప్రసూతా జగతీ జగత్యాం జాయతే జగత్. 1 </p> <p class="Tat">అక్షరమునుండి ఆకాశము, దానినుండి వాయువు, దానినుండి అగ్ని, దానినుండి నీరు, నీటి నుండి భూమి, భూమినుండి జగత్తు పుట్టును. </p> <p class="Poem-1">ఏతైః శరీరై ర్జల మేవ గత్వా </p> <p class="Poem2">జలాచ్చ తేజః పవనోఽన్తరిక్షమ్, </p> <p class="Poem2">ఖాద్వై నివర్తన్తి న భావిన స్తే </p> <p class="Poem2">మోక్షం చ తేవై పర మావ్నువన్తి. 2 </p> <p class="Tat">ఈ శరీరములతో మరల జలమునే పొంది, దానినుండి అగ్నిని, గాలిని, ఆకాశమును చేరుకొని ఆకాశమును దాటి మరలుచున్నవి. మరియు అవి పరమైన మోక్షమును పొందుచున్నవి. </p> <p class="Poem-1 ParaOverride-5">నోష్ణం న శీతం మృదునాఽపి తీక్ష్ణం </p> <p class="Poem2">నామ్లం కషాయం మధురం న తిక్తమ్, </p> <p class="Poem2">న శబ్దవన్నాపి చ గన్ధవత్త - </p> <p class="Poem2">న్న రూపవత్తత్పర మస్వభావమ్. 3 </p> <p class="Tat">అది వేడిది, చల్లనిది, మెత్తనిది, కఠినమైనది, పులుపు, చేదు, తీపి, ఒగరు మొదలగు రుచులు కలది, శబ్దము, గంధము, రూపము అను గుణములు కలదియు కాదు. ఆ పరమము అస్వభావము. </p> <p class="Poem-1">స్పర్శం తను ర్వేద రసం చ జిహ్వా </p> <p class="Poem2">ఘ్రాణం చ గన్ధాన్ శ్రవణౌ చ శబ్దాన్, </p> <p class="Poem2">రూపాణి చక్షు ర్న చ తత్పరం యద్ </p> <p class="Poem2">గృహ్ణ న్త్యనధ్యాత్మవిదో మనుష్యాః. 4 </p> <p class="Tat">స్పర్శను చర్మము, రసమును నాలుకయు, వాసనలను ముక్కు, శబ్దములను చెవులును, రూపములను కన్ను తెలియును. ఆవిధముగా ఆ పరమైన దానిని అధ్యాత్మజ్ఞానములేని మనుజులు గ్రహింపజాలరు. </p> <p class="Poem-1">నివర్తయిత్వా రసనాం రసేభ్యో </p> <p class="Poem2">ఘ్రాణం చ గన్ధా చ్ఛ్రవణౌ చ శబ్దాత్, </p> <p class="Poem2">స్పర్శా త్త్వచం రూపగుణాత్తు చక్షు - </p> <p class="Poem2">స్తతః పరం పశ్యతి స్వం స్వభావమ్. 5</p> <p class="Tat">నాలుకను రుచులనుండి, ముక్కును గంధములనుండి, చెవులను శబ్దమునుండి చర్మమును స్పర్శనుండి, కంటిని రూపగుణమునుండియు మరలించి పరమైన స్వస్వభావమును యోగి దర్శించును. </p> <p class="Poem-1">యతో గృహీత్వా హి కరోతి యచ్చ </p> <p class="Poem2">యస్మిం శ్చ తామారభతే ప్రవృత్తిమ్, </p> <p class="Poem2">యస్మింశ్చ యద్యేన చ యశ్చ కర్తా </p> <p class="Poem2">యత్కారణం తే సముదాయ మాహుః. 6 </p> <p class="Tat"> కర్త దేనినుండి దేనిని కైకొని దేనియందు ప్రవృత్తిని ఆరంభించునో దేనియందు దేనిచేత ఏది కారణముగా ప్రవర్తించునో దానిని సముదాయమని మునులు చెప్పుదురు. </p> <p class="Poem-1">యద్వ్యాప్య భూ ద్వ్యాపకం సాధకం చ </p> <p class="Poem2">యన్మన్త్ర వత్ స్థాస్యతి చాపి లోకే, </p> <p class="Poem2">యః సర్వహేతుః పరమాత్మకారీ </p> <p class="Poem2">తత్కారణం కార్య మతో మదన్యత్. 7 </p> <p class="Tat">అన్నింటిని వ్యాపించియున్నది, సాధకము, మంత్రమునందు చెప్పినట్లు లోకమున కదలక మెదలక యుండునది, సర్వమునకు కారణమైనది, తనంత తాను సర్వమును చేయునది అగు పరతత్త్వమే ఆకారణము. దీనికంటె వేరైనది కార్యము. </p> <p class="Poem-1">యథా హి కశ్చి త్సుకృతై ర్మనుష్యః </p> <p class="Poem2">శుభాశుభం ప్రాప్నుతే ఽథావిరోధాత్, </p> <p class="Poem2">ఏవం శరీరేషు శుభాశుభేషు </p> <p class="Poem2">స్వకర్మణై ర్జ్ఞానమిదం నిబద్ధమ్. 8 </p> <p class="Tat">ఒకానొక నరుడు చక్కగా ఆచరించిన పనులచేత విరుద్ధము కాని విధముగా శుభమును అశుభమును పొందుచుండును. అట్లే (తన కర్మములవలన ఏర్పడిన) శుభము, అశుభము అయిన శరీరములయందు ఇది కట్టువడి యుండును. </p> <p class="Poem-1">యథా ప్రదీప్తః పురతః ప్రదీపః </p> <p class="Poem2">ప్రకాశ మన్యస్య కరోతి దీప్యన్, </p> <p class="Poem2">తథేహ పఞ్చేన్ద్రియదీప వృక్షా </p> <p class="Poem2">జ్ఞాన ప్రదీప్తాః పరవన్త ఏవ. 9 </p> <p class="Tat">ఎదురుగా వెలిగించి పెట్టిన దీపము తాను ప్రకాశించుచు ఇతరమునకును ప్రకాశమును కలిగించుచున్నది. అట్లే అయిదు ఇంద్రియములనెడు దీపముల వృక్షములు జ్ఞానముచే ప్రకాశింపజేయబడుచు పరాధీనములే యగుచున్నవి. </p> <p class="Poem-1">యథా చ రాజ్ఞా బహవో హ్యమాత్యాః </p> <p class="Poem2">పృథక్ ప్రమాణం ప్రవదన్తి యుక్తాః, </p> <p class="Poem2">తద్వచ్ఛరీరేషు భవన్తి పఞ్చ </p> <p class="Poem2">జ్ఞానైకదేశః పరమః స తేభ్యః. 10 </p> <p class="Tat">ఒకరాజు నియమించిన పెక్కండ్రు అమాత్యులు విడివిడిగా ప్రమాణ వాక్యమును పలుకుచుందురు. అదే విధముగా శరీరములయందు అయిదు ఇంద్రియములు పనిచేయుచుండును. జ్ఞానమునకు ముఖ్యస్థానమగు ఆస్వభావము వానికంటె పరమము. </p> <p class="Poem-1">యథార్చిషో ఽగ్నేః పవనస్య వేగో </p> <p class="Poem2 ParaOverride-2">మరీచయోఽర్కస్య నదీషు చాపః, </p> <p class="Poem2 ParaOverride-2">గచ్ఛన్తి చాయాన్తి చ సఞ్చరన్త్య - </p> <p class="Poem2">స్తద్వచ్ఛరీరాణి శరీరిణాం తు. 11 </p> <p class="Tat ParaOverride-6">అగ్నియెక్క జ్వాలలు, గాలి వేగము, సూర్యుని కిరణములు, నదులయందు నీరు వచ్చుచుండును. పోవుచుండును. సంచరించుచుండును. శరీరుల శరీరములు కూడ అట్టివే. </p> <p class="Poem-1">యథా చ కశ్చి త్పరశుం గృహీత్వా </p> <p class="Poem2 ParaOverride-2">ధూమం నపశ్యే జ్జ్వలనం చ కాష్ఠే, </p> <p class="Poem2 ParaOverride-2">తద్వచ్ఛరీరోదరపాణి పాదం </p> <p class="Poem2">ఛిత్వా న పశ్యన్తి తతో యదన్యత్. 12 </p> <p class="Tat ParaOverride-1">ఒకానొకడు గొడ్డలితో కట్టెలను నరుకును. కాని దానియందున్న అగ్నిని గాని పొగను గాని చూడజాలడు. అట్లే శరీరమునందు పొట్టను, చేతులను, కాళ్ళను నరకియు వానికంటె వేరైన ఆత్మను కనుగొనజాలరు. </p> <p class="Poem-1">తాన్యేవ కాష్ఠాని యథా విమథ్య</p> <p class="Poem-1 ParaOverride-1">ధూమం చ పశ్యే జ్జ్వలనం చ యోగాత్, </p> <p class="Poem2">తద్వత్సబుద్ధిః సమ మిన్ద్రియాత్మా </p> <p class="Poem2 ParaOverride-2">బుద్ధిం పరం పశ్యతి తం స్వభావమ్. 13 </p> <p class="Tat">ఆ కట్టెలనే ఉపాయముతో మథించి అందున్న పొగను, నిప్పును మనుజుడు చూచుచున్నాడు. అట్లే జీవుడు బుద్ధితో కూడినవాడై పరమైన స్వభావమును, బుద్ధిని ఏక కాలమున చూచుచున్నాడు. </p> <p class="Poem-1">యథాత్మనో ఽ ఙ్గం పతితం పృథివ్యాం </p> <p class="Poem2 ParaOverride-2">స్వప్నాన్తరే పశ్యతి చాత్మనోఽ న్యత్, </p> <p class="Poem2 ParaOverride-2">శ్రోత్రాదియుక్తః సమనాః సబుద్ధి </p> <p class="Poem2">ర్లి ఙ్గా త్తథా గచ్ఛతి లిఙ్గ మన్యత్. 14 </p> <p class="Tat ParaOverride-1">కలలో ఒకడు తనదేహము నేలపై పడియుండగా తనకంటె వేరుగా దానిని చూచును. అట్లే మనస్సు బుద్ధి అనువానితో, చెవిమున్నగువానితో కూడినవాడై ఒక స్థూలదేహము నుండి మరియొక స్థూలదేహమునకు జీవు డరుగును. </p> <p class="Poem-1">ఉత్పత్తి వృద్ధి వ్యయ సన్నిపాతై - </p> <p class="Poem2 ParaOverride-2">ర యుజ్యతేఽసౌ పరమః శరీరీ, </p> <p class="Poem2 ParaOverride-2">అనేన లిఙ్గేన తు లిఙ్గ మన్యద్ </p> <p class="Poem2">గచ్ఛ త్యదృష్టః ఫలసన్నియోగాత్. 15 </p> <p class="Tat ParaOverride-1">పుట్టుట, పెరుగుట, తరుగుట, నశించుట అనువానితో ఈ పరమమైన ఆత్మకు అంటుసొంటులు లేవు. ఫల సంబంధముచేత ఎవరికి కానరానిదై ఈ దేహమునుండి మరియొక దేహమున కరుగును. </p> <p class="Poem-1">న చక్షుషా పశ్యతి రూప మాత్మనో </p> <p class="Poem2 ParaOverride-2">న చాపి సంస్పర్శ ముపైతి కిఞ్చిత్, </p> <p class="Poem2 ParaOverride-2">న చాపి తైః సాధయతే తు కార్యం </p> <p class="Poem2">తే తం న పశ్యన్తి స పశ్యతే తాన్. 16 </p> <p class="Tat">మనుజుడు కంటితో ఆత్మరూపమును చూడజాలడు. స్పర్శను ఏ మాత్రమును పొందడు. వానితో ఏ కార్యమును సాధింపడు. అవి అతనిని చూడవు. అతడు వానిని చూచును. </p> <p class="Poem-1">యథా సమీపే జ్వలతోఽనలస్య </p> <p class="Poem2 ParaOverride-2">సంతాపజం రూప ముపైతి కశ్చిత్, </p> <p class="Poem2 ParaOverride-2">న చాపరం రూపగుణం బిభర్తి </p> <p class="Poem2">తథైవ తద్దృశ్యతి రూప మస్య. 17 </p> <p class="Tat ParaOverride-1">సమీపమున మండుచున్న అగ్నిరూపమును వేడిమివలన ఒకడు తెలిసికొను చున్నాడు. మరియొక రూపగుణము అగ్ని తాల్చుటలేదు. అట్లే దానిరూపము తెలియవచ్చుచున్నది. </p> <p class="Poem-1">తథా మనుష్యః పరిముచ్య కాయ - </p> <p class="Poem2 ParaOverride-2">మదృశ్య మన్య ద్విశతే శరీరమ్, </p> <p class="Poem2 ParaOverride-2">విసృజ్య భూతేషు మహత్సు దేహం </p> <p class="Poem2">తదాశ్రయం చైవ బిభర్తి రూపమ్. 18 </p> <p class="Tat">మనుష్యుడు తన దేహమును మొత్తముగా విడచివైచి కనులకు కానరాని మరియొక శరీరమును చేరుకొనుచున్నాడు. మహాభూతములలో తనదేహమును వదలివైచి మరియొక దేహము నాశ్రయించిన రూపమును పొందుచున్నాడు. </p> <p class="Poem-1">ఖం వాయు మగ్నిం సలిలం తథోర్వీం </p> <p class="Poem2 ParaOverride-2">సమన్తతోఽ భ్యావిశతే శరీరీ, </p> <p class="Poem2 ParaOverride-2">నానాశ్రయాః కర్మసు వర్తమానాః </p> <p class="Poem2 ParaOverride-2">శ్రోత్రాదయః పఞ్చ గుణాన్ శ్రయన్తి. 19 </p> <p class="Tat ParaOverride-1">జీవుడు మరణసమయమున ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, నేల అనువానిని దేహమునందలి ఆయా అంశములతో చేరుకొనును. అట్లే చెవి మొదలగునవియు పెక్కు ఆశ్రయములు కలవియై కర్మములయందు ప్రవర్తించుచు అయిదు గుణములను ఆశ్రయించును. </p> <p class="Poem-1 ParaOverride-6">శ్రోత్రం ఖతో ఘ్రాణ మథో పృథివ్యా - </p> <p class="Poem2 ParaOverride-2">స్తేజోమయం రూప మథో విపాకః, </p> <p class="Poem2 ParaOverride-2">జలాశ్రయం తేజ ఉక్తం రసం చ </p> <p class="Poem2">వాయ్వాత్మకః స్పర్శకృతో గుణశ్చ. 20 </p> <p class="Tat">ఆకాశగుణము చెవిగా, భూమిగుణము ముక్కు గానగును. అగ్నిమయమగు రూపము కన్నుగా పాకమునకు వచ్చును. నీటి నాశ్రయించిన తేజస్సు నాలుకగా నగును. వాయు స్వరూపము స్పర్శకొరకు ఏర్పడిన గుణముగా - త్వగింద్రియముగా మారును. </p> <p class="Poem-1">మహత్సు భూతేషు వసన్తి పఞ్చ </p> <p class="Poem2 ParaOverride-2">పంచేద్రియార్థాశ్చ తథేన్డ్రియేషు, </p> <p class="Poem2 ParaOverride-2">సర్వాణి చైతాని మనోనుగాని </p> <p class="Poem2">బుద్ధిం మనో౨ న్వేతి మతిః స్వభావమ్ 21 </p> <p class="Tat">మహాభూతములయిదింటియందును అయిదుగుణములు వసించును. ఆ అయిదు ఇంద్రియముల విషయములును ఇంద్రియములందు నెలకొనియుండును. ఇవి యన్నియు మనస్సు ననుసరించి యుండును. మనస్సు బుద్ధిని, బుద్ధి స్వభావమును అనుసరించును. </p> <p class="Poem-1">శుభా శుభం కర్మ కృతం యదన్య - </p> <p class="Poem2 ParaOverride-2">త్తదేవ ప్రత్యాదదతే స్వదేహే, </p> <p class="Poem2 ParaOverride-2">మనోఽను వర్తన్తి పరావరాణి </p> <p class="Poem2">జలౌకసః స్రోత ఇవానుకూలమ్. 22 </p> <p class="Tat">వెనుక దేహమున చేసిన శుభాశుభ కర్మమునే ఇంద్రియాదులు క్రొత్తది యగు తమ దేహమున గ్రహించును. నీటి ప్రాణులు వాలుగానున్న ప్రవాహము ననుసరించునట్లు అర్థములు బుద్ధిమొదలగునవి మనస్సు ననుసరించును. </p> <p class="Poem-1">చలం యథా దృష్టి పథం పరైతి </p> <p class="Poem2">సూక్ష్మం మహద్రూప మివాభిభాతి, </p> <p class="Poem2">స్వరూప మాలోచయతే చ రూపం </p> <p class="Poem2">పరం తథా బుద్ధిపథం పరైతి. 23 </p> <p class="Tat ParaOverride-4"> <span class="CharOverride-4">ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి <br/>మను బృహస్పతి సంవాదే ద్వ్యధిక ద్విశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat ParaOverride-1">జనుడు దృష్టిపథమును చంచలమైనదిగా ఎట్లు తెలిసికొనుచున్నాడో, సూక్ష్మమైన దానిని గొప్పరూపము కల దానినిగా భావించుచున్నాడో, రూపమును స్వరూపముగా చూచుచున్నాడో అట్లే పరతత్వము బుద్ధి పథమును పొందుచున్నది. </p> <p class="Tat ParaOverride-7">ఇది శ్రీమహా భారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున మను బృహస్పతి సంవాదముగల రెండువందల రెండవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-4">మను రువాచ</span> - మను విట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-8">యదిన్ద్రియై స్తూపహితం పురస్తాత్ </p> <p class="Poem2 ParaOverride-2">ప్రాప్తాన్ గుణాన్ సంస్మరతే చిరాయ, </p> <p class="Poem2 ParaOverride-2">తేష్విన్ద్రియే షూపహతేషు పశ్చాత్ </p> <p class="Poem2">స బుద్ధిరూపః పరమః స్వభావః. 1 </p> <p class="Tat">ఏ జీవచైతన్యము ఇంద్రియములతో కూడుకొన్నదై ముందు లభించిన గుణములను పెద్దకాలము స్మరించుచుండునో అది, ఆ ఇంద్రియములు విలీనములై పోగా తరువాత బుద్ధిరూపమైన పరమస్వభావమై నిలిచియుండును. </p> <p class="Poem-1">యథేన్ద్రియార్థాన్ యుగప త్సమన్తా - </p> <p class="Poem2 ParaOverride-2">న్నోపేక్షతే కృత్స్న మతుల్యకాలమ్, </p> <p class="Poem2 ParaOverride-2">తథా చలం సంచరతే స విద్వాం - </p> <p class="Poem2 ParaOverride-2">స్తస్మాత్స ఏకః పరమః శరీరీ. 2 </p> <p class="Tat ParaOverride-1">ఆ పరముడు ఆత్మ ఒక్కడు. ఇంద్రియార్థములను అన్నివైపుల ఒక్క కాలమునను, పెక్కు కాలములందును మొత్తముగా ఉపేక్షింపడు. అట్లే సాక్షిరూపుడై అన్ని అవస్థల యందును సంచరించుచుండును. </p> <p class="Poem-1">రజస్తమ స్సత్త్య మథో తృతీయం </p> <p class="Poem2 ParaOverride-2">గచ్ఛత్యసౌ స్థానగుణాన్ విరూపాన్,</p> <p class="Poem2 ParaOverride-2">తథేన్ద్రియా ణ్యావిశతే శరీరీ </p> <p class="Poem2">హుతాశనం వాయు రివేన్దనస్థమ్. 3 </p> <p class="Tat">ఈ శరీరి (జీవాత్మ) రజస్సును, తమస్సును, మూడవదియగు సత్త్వమును, బుద్ధి స్థానములైన జాగ్రదాది దశల విరూపములగు గుణములను తెలియు చున్నాడు. అట్లే కట్టెలో నున్న అగ్నిని వాయువువలె, ఇంద్రియములను ఆవేశించును. </p> <p class="Poem-1 ParaOverride-1">న చక్షుషా పశ్యతి రూప మాత్మనో </p> <p class="Poem2 ParaOverride-2">న పశ్యతి స్పర్శన మిన్ద్రియేన్ద్రియమ్, </p> <p class="Poem2 ParaOverride-2">న శ్రోత్రలిఙ్గం శ్రవణేన దర్శనం </p> <p class="Poem2 ParaOverride-2">తథా కృతం పశ్యతి తద్వినశ్యతి. 4</p> <p class="Tat">ఆత్మరూపమును ఎవ్వడును కంటితో చూడజాలడు. ఇంద్రియములకు ఇంద్రియమైన దానిని స్పృశింపజాలడు. అట్లే అది చెవికి తెలియబడునది కాదు. శ్రవణముతో దర్శనము అగును. అపుడు చూచును. కాని అపుడా యింద్రియము నశించును. </p> <p class="Poem-1">శ్రోత్రాదీని న పశ్యన్తి స్వస్వ మాత్మాన మాత్మనా, </p> <p class="Poem2">సర్వజ్ఞః సర్వదర్శీ చ సర్వజ్ఞ స్తాని పశ్యతి. 5 </p> <p class="Tat">చెవి మొదలగు ఇంద్రియములు తమస్వరూపముతో తమస్వరూపమునే చూడజాలవు. సర్వము నెరిగినవాడు, సర్వమును చూచువాడు అగు సర్వజ్ఞుడు వానిని చూచును. </p> <p class="Poem-1">యథా హిమవతః పార్శ్వం పృష్ఠం చన్ద్రమసో యథా, </p> <p class="Poem2">న దృష్టపూర్వం మనుజై ర్న చ తన్నాస్తి తావతా. 6 </p> <p class="Tat">మంచుకొండ ప్రక్కభాగమును, చంద్రుని వెనుక భాగమును మనుజులు చూడలేదు - అన్నంత మాత్రమున అవి లేక పోవుటలేదు కదా! </p> <p class="Poem-1">త ద్వ ద్భూతేషు భూతాత్మా సూక్ష్మో జ్ఞానాత్మవానసౌ,</p> <p class="Poem2">అదృష్టపూర్వ శ్చక్షుర్భ్యాం నచాసౌ నాస్తి తావతా. 7 </p> <p class="Tat">అట్లే సర్వభూతముల యందు సూక్ష్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడైయున్న ప్రత్యగాత్మ మునుపెన్నడు కన్నులకు కానరాకున్నచో అతడు లేడని చెప్పుటకు </p> <p class="Tat">వీలు లేదుకదా! </p> <p class="Poem-1">పశ్య న్నపి యథా లక్ష్మ జగత్సోమేన విన్దతి, </p> <p class="Poem2">ఏవ మస్తి న చోత్పన్నం న చ త న్నపరాయణమ్. 8 </p> <p class="Tat">చంద్రునియందు ప్రతిబింబించిన జగత్తును మచ్చరూపమున చూచుచు కూడ నరుడు తెలియకున్నాడు. ఇట్లు ఆత్మ ఉన్నది. అది పుట్టలేదు. అది పరాయణము కాకుండుటయు లేదు. </p> <p class="Poem-1">రూపవన్త మరూపత్వా దుదయాస్తమనే బుధాః, </p> <p class="Poem2">ధియా సమనుపశ్యన్తి తద్గతాః సవితు ర్గతిమ్. 9<span class="CharOverride-5"> </span></p> <p class="Tat">ఉదయమునందును, అస్తమయమునందును రూపములేని దగుటవలన రూపము కల పదార్థమును, వానిని చూచువారు బుద్ధితో చక్కగా దర్శించుచున్నారు. అట్లే సూర్యుని గతిని కూడ చక్కగా తెలిసికొనుచున్నారు. </p> <p class="Poem-1">తథా బుద్ధిప్రదీపేన దూరస్థం సువిపశ్చితః,</p> <p class="Poem2">ప్రత్యాసన్నం నినీషన్తి జ్ఞేయం జ్ఞానాభిసంహితమ్. 10 </p> <p class="Tat ParaOverride-1">అట్లే చక్కని వివేకము కలవారు బుద్ధి అనెడు పెద్దదీపముతో జ్ఞానమను పేరు కలదియు, మిక్కిలి దూరముగా నున్న జ్ఞేయమును - ప్రపంచమును జ్ఞానమను పేరుగల బ్రహ్మమునుగా పొందగోరుదురు. </p> <p class="Poem-1">న హి ఖల్వనుపాయేన కశ్చిదర్థోఽభిసిద్ధ్యతి,</p> <p class="Poem2">సూత్రజాలై ర్యథా మత్స్యాత్ బధ్నన్తి జలజీవినః. 11 </p> <p class="Tat ParaOverride-1">ఉపాయము లేకుండ ఏదియును లభింపదు గదా! బెస్తవారు వలలతో చేపలను పట్టుకొందురు. </p> <p class="Poem-1">మృగై ర్మృగాణాం గ్రహణం పక్షిణాం పక్షిభి ర్యథా, </p> <p class="Poem2">గజానాం చ గజై రేవ జ్ఞేయం జ్ఞానేన గృహ్యతే. 12 </p> <p class="Tat">మృగములతో మృగములను, పక్షులతో పక్షులను, ఏనుగులతో ఏనుగులను వశముచేసికొను తీరున జ్ఞానముతోడనే జ్ఞేయమును పట్టుకొనవలయును. </p> <p class="Poem-1">అహి రేవ హ్యహే పాదాన్ పశ్యతీతి హి నః శ్రుతమ్,</p> <p class="Poem2">తద్వన్మూర్తిషు మూర్తిస్థం జ్ఞేయం జ్ఞానేన పశ్యతి. 13 </p> <p class="Tat">పాము కాళ్లను పామే చూచునని మాకు వినవచ్చినది. అట్లే ఆకారముగల వానియందే మూర్తియందున్న జ్ఞేయమును జ్ఞానముతో సాధకుడు చూచును. </p> <p class="Poem-1"> నో త్సహన్తే యథా వేత్తు మిన్ద్రియై రిన్ద్రియాణ్యపి,</p> <p class="Poem2">తథై వేహ పరా బుద్ధిః పరం బోధ్యం న పశ్యతి. 14</p> <p class="Tat">ఇంద్రియములతో ఇంద్రియములను తెలియుటకు జనులు ఉత్సహింపరు. అట్లే ఇందును పరయైన బుద్ధి పరమైన బోధ్యమును చూడదు. </p> <p class="Poem-1">యథా చన్ద్రో హ్యమావాస్యా మలిఙ్గత్వా న్న దృశ్యతే, </p> <p class="Poem2">న చ నాశోఽస్య భవతి తథా విద్ధి శరీరిణమ్. 15 </p> <p class="Tat">అమావాస్యనాడు చంద్రుడు, చిహ్నములు లేని కారణముగా, కానరాకుండును. అంతమాత్రమున చంద్రునకు నాశనము లేదుగదా! ఆత్మను కూడ అదేవిధముగా తెలియుము. </p> <p class="Poem-1">క్షీణకోశో హ్యమావాస్యాం చన్ద్రమా న ప్రకాశతే, </p> <p class="Poem2">తద్వ న్మూర్తి విముక్తోఽ సౌ శరీరీ నోపలభ్యతే. 16 </p> <p class="Tat">అమావాస్యనాడు క్షీణించిన స్థూలశరీరము గల చంద్రుడు ప్రకాశింపడు. అట్లే మూర్తి నుండి విముక్తుడగు శరీరి చిక్కకున్నాడు. </p> <p class="Poem-1">యథాకాశాన్తరం ప్రాప్య చన్ద్రమా భ్రాజతే పునః,</p> <p class="Poem2">తల్లిఙ్గా న్తరం ప్రాప్య శరీరీ భ్రాజతే పునః. 17 </p> <p class="Tat">మరియొక అవకాశమును పొంది చంద్రుడు మరల విరాజిల్లుచున్నాడు. అట్లే మరియొక స్థూల దేహమును పొంది ప్రత్యగాత్మ మరల ప్రకాశించుచున్నాడు. </p> <p class="Poem-1">జన్మ వృద్ధిః క్షయశ్చాస్య ప్రత్యక్షేణోపలభ్యతే, </p> <p class="Poem2">సా తు చాన్ద్రమసీ వృత్తి ర్నతు తస్య శరీరిణ:. 18 </p> <p class="Tat">పుట్టుక, పెరుగుదల, నశించుట అనునవి దేహమునకు ప్రత్యక్షముగా కన్పట్టుచున్నవి. అది చంద్రమండలము యొక్క ధర్మము. కాని ఆత్మకు అట్టి స్థితి లేదు. </p> <p class="Poem-1">ఉత్పత్తి వృద్ధివయసా యథా స ఇతి గృహ్యతే, </p> <p class="Poem2">చన్ద్ర ఏవ త్వమావాస్యాం తథా భవతి మూర్తిమాన్. 19 </p> <p class="Tat">ఏర్పడుట, పెరుగుట, వయస్సుచేత అతడే ఇతడని చంద్రుని తెలిసికొనుచున్నాము. అట్లే అమావాస్యనాడును ఆ చంద్రుడే మూర్తికలవాడై యుండెనని తెలియవలయును. </p> <p class="Poem-1">నోపసర్ప ద్విముఞ్చద్వా శశినం దృశ్యతే తమః,</p> <p class="Poem2">విసృజం శ్చోపసర్పంశ్చ తద్వత్పశ్య శరీరిణమ్. 20 </p> <p class="Tat ParaOverride-1">రాహువు చంద్రుని చొరబారుటయో, వదలివైచుటయో స్పష్టముగా తెలియరాదు. అట్లే ఆత్మ ఒక దేహమును వదలి మరియొక దేహమును చేరుకొనుటయు తెలియరాదు. </p> <p class="Poem-1">యథా చన్ద్రార్కసంయుక్తం తమ స్తదుపలభ్యతే, </p> <p class="Poem2">తద్వచ్ఛరీర సంయుక్తః శరీరీత్యుపలభ్యతే. 21 </p> <p class="Tat ParaOverride-1">సూర్యచంద్రుల కలయిక కలవాడు రాహువు అని తెలియవచ్చుచున్నది. అట్లే శరీరముతో కలసియున్నదై ఆత్మ శరీరి యని తెలియవచ్చుచున్నది. </p> <p class="Poem-1">యథా చన్ద్రార్కనిర్ముక్తః సరాహు ర్నోపలభ్యతే,</p> <p class="Poem2">తద్వచ్ఛరీర నిర్ముక్తః శరీరీ నోపలభ్యతే. 22 </p> <p class="Tat ParaOverride-1">చంద్రుడు, సూర్యుడు వదలివైచిన రాహువు కానరాడు. అట్లే తానుగల శరీరమును వదలిన శరీరి ప్రకాశింపడు. </p> <p class="Poem-1">యథా చన్ద్రో హ్యమావాస్యాం నక్షతై ర్యుజ్యతే గతః,</p> <p class="Poem2">తద్వచ్ఛరీర నిర్ముక్తః ఫలై ర్యుజ్యతి కర్మణః. 23</p> <p class="Tat ParaOverride-7"><span class="CharOverride-4">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి <br/>మనుబృహస్పతి సంవాదే త్ర్యధికద్విశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">అమావాస్యను పొందిన చంద్రుడు నక్షత్రములతో కూడియే యున్నాడు. అట్లే శరీరమును వదలిన జీవుడు కర్మఫలములతో కూడి ఉన్నాడు. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున మను బృహస్పతిసంవాదముగల రెండు వందల మూడవ అధ్యాయము. </p> <p class="Poem-1">యథా వ్యక్త మిదం శేతే స్వప్నే చరతి చేతనమ్,</p> <p class="Poem2">జ్ఞాన మిన్ద్రియ సంయుక్తం తద్వత్ప్రేత్య భవాభవే. 1 </p> <p class="Tat">ఈస్థూలదేహము నిద్రించునపుడు చేతనము స్వప్నమున తిరుగాడుచుండును. ఇంద్రియములతో కూడిన లింగశరీరము కూడ నిద్రించును. జ్ఞానము లింగమునుండి విడివడి తిరుగుచుండును. ఇవియే భవము, అభవము అనునవి. </p> <p class="Poem-1">యథామ్భసి ప్రసన్నే తు రూపం పశ్యతి చక్షుషా, </p> <p class="Poem2">తద్వ త్ప్రసన్నేన్ద్రియత్వా జ్జ్ఞేయం జ్ఞానేన పశ్యతి. 2 </p> <p class="Tat">ప్రసన్నమగు నీటియందు జనుడు కంటితో తనరూపమును చూచుచున్నాడు. అట్లే ఇంద్రియములు ప్రసన్నముగా నుండుట వలన జ్ఞేయమును జ్ఞానముతో చూచును. </p> <p class="Poem-1">స ఏవ లులితే తస్మిన్ యథా రూపం న పశ్యతి, </p> <p class="Poem2">తథేన్ద్రియాకులీభావే జ్ఞేయం జ్ఞానే న పశ్యతి. 3 </p> <p class="Tat">ఆ నీరు చెదరినపుడు అట్టివాడే రూపమును చూడజాలడు. అట్లే ఇంద్రియములు చెల్లాచెదరైనపుడు ఆత్మతత్త్వమును బుద్ధియందు పట్టుకొనజాలడు. </p> <p class="Poem-1">అబుద్ధి రజ్ఞానకృతా అబుద్ధ్యా కృష్యతే మనః, </p> <p class="Poem2">దుష్టస్య మనసః పఞ్చ సంప్రదుష్యన్తి మానసాః. 4 </p> <p class="Tat">అవిద్య అజ్ఞానముచేత ఏర్పడునది, అవిద్య మనస్సు నాకర్షించును. మనసు చెడినపుడు మనస్సునకు సంబంధించిన అయిదును (శ్రోత్రాదులు) మిక్కిలిగా పాడైపోవును. </p> <p class="Poem-1">అజ్ఞాన తృప్తో విషయే ష్వవగాఢో న తృప్యతే, </p> <p class="Poem2">అదృష్టవచ్చ భూతాత్మా విషయేభ్యో నివర్తతే. 5 </p> <p class="Tat">అజ్ఞానము చేత తృప్తినందువాడు, విషయములందు మునిగిపోయినవాడునగు జీవుడు అదృష్టముననుసరించి తృప్తినందడు. విషయముల భోగములకై మరలి వచ్చును. </p> <p class="Poem-1">తర్షచ్ఛేదో న భవతి పురుషస్యేహ కల్మషాత్, </p> <p class="Poem2">నివర్తతే తదా తర్షః పాప మన్తగతం యదా. 6 </p> <p class="Tat">పురుషునకు ఇచట దాహము ఆగిపోవుట, పాపమువలన, కలుగదు. ఎప్పుడు పాపము అంతమును పొందునో అప్పుడు తృష్ణ మరలిపోవును. </p> <p class="Poem-1">విషయేషు తు సంసర్గా చ్ఛాశ్వతస్య తు సంశ్రయాత్,</p> <p class="Poem2">మనసా చాన్యథా కాంక్షన్ పరం న ప్రతిపద్యతే. 7 </p> <p class="Tat">విషయములు తగులమువలనను, అదియే శాశ్వతమని ఆశ్రయించుటవలనను మనస్సుతో కోరదగినదానికంటె వేరైనదానిని కాంక్షించుచు పరతత్వమును పొందకున్నాడు. </p> <p class="Poem-1">జ్ఞాన ముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః, </p> <p class="Poem2">యథాఽఽ దర్శతలే ప్రఖ్యే పశ్యత్యాత్మాన మాత్మని. 8 </p> <p class="Tat">పాపకర్మము నశించినపుడు పురుషులకు జ్ఞానము పుట్టును. స్వచ్ఛమైన అద్దమునందు తనస్వరూపమును చూచినట్లు ఆత్మయందు ఆత్మను దర్శించును. </p> <p class="Poem-1">ప్రసృతై రిన్ద్రియై ర్దుఃఖీ తై రేవ నియతః సుఖీ, </p> <p class="Poem2">తస్మా దిన్ద్రియరూపేభ్యో యచ్ఛే దాత్మాన మాత్మనా. 9 </p> <p class="Tat">ఈ విషయములవైపు స్రవించు శీలముగల ఇంద్రియములతో నరుడు దుఃఖము కలవాడగును. వానినే నిలువరించినచో సుఖముకలవాడగును. అందువలన ఇంద్రియరూపముల నుండి ఇంద్రియమును మనస్సుతోడనే నిగ్రహింప వలయును. </p> <p class="Poem-1">ఇన్ద్రియేభ్యో మనః పూర్వం బుద్ధిః పరతరా తతః,</p> <p class="Poem2">బుద్ధేః పరతరం జ్ఞానం జ్ఞానాత్ పరతరం మహత్. 10 </p> <p class="Tat">ఇంద్రియములకంటె మనస్సు వెనుకటిది. దానికంటె మరింత ఆవలిది బుద్ధి. బుద్ధికంటె ఇంకను పరమైనది జ్ఞానము. జ్ఞానముకంటెను ఇంకను మించినది మహత్తు. </p> <p class="Poem-1">అవ్యక్తా త్ర్పసృతం జ్ఞానం తతో బుద్ధి స్తతో మనః,</p> <p class="Poem2">మనఃశ్రోత్రాదిభి ర్యుక్తం శబ్దాదీన్ సాధు పశ్యతి. 11 </p> <p class="Tat">అవ్యక్తమునుండి జ్ఞానము వెలువడును. దానినుండి బుద్ధి, దానినుండి మనస్సు వెలువడును. చెవి మొదలగువానితో కూడిన మనస్సు శబ్దము మొదలగు వానిని చక్కగా పరికించును. </p> <p class="Poem-1">యస్తాం సృజతి శబ్దాదీన్ సర్వాశ్చ వ్యక్తయ స్తథా, </p> <p class="Poem2">విముఞ్చేత్ ప్రాకృతాన్ గ్రామాం స్తాన్ముక్త్యాఽ మృతమశ్నుతే. 12</p> <p class="Tat">శబ్దాదులను, సర్వవ్యక్తులను వదలివైచినవాడును, ప్రకృతివలన నేర్పడు గ్రామములను వదలివైచువాడు వానిని వదలి అమృతమును అనుభవించును. </p> <p class="Poem-1">ఉద్యన్ హి సవితా యద్వత్ సృజతే రశ్మిమణ్డలమ్, </p> <p class="Poem2">స ఏవాస్త మపాగచ్ఛం స్తదేవాత్మని గచ్ఛతి. 13 </p> <p class="Tat">సూర్యుడు ఉదయించుచు కిరణములసముదాయమును సృజించును. అతడే అస్తమించుచు ఆకిరణములసమదాయమును తనయందే కలుపుకొనును. </p> <p class="Poem-1">అన్తరాత్మా తథా దేహ మావిశ్యేన్ద్రియరశ్మిభిః,</p> <p class="Poem2 ParaOverride-9">ప్రాప్యేన్ద్రియగుణాన్ పఞ్చ సోఽస్త మావృత్య గచ్ఛతి. 14 </p> <p class="Tat">అట్లే అంతరాత్మయు దేహమును ఆవేశించి ఇంద్రియములనెడు కిరణములతో ఇంద్రియగుణము లయిందింటిని పొంది మరల అస్తమించును.</p> <p class="Poem-1">ప్రణీతం కర్మణా మార్గం నీయమానః పునఃపునః, </p> <p class="Poem2">ప్రాప్నోత్యయం కర్మఫలం ప్రవృత్తం ధర్మ మాప్తవాన్. 15 </p> <p class="Tat">కర్మము తెచ్చిపెట్టిన దారిలోనికి కర్మముతోడనే తీసికొనిరాబడినవాడై మరల మరల కర్మఫలము ననుభవించును. ప్రవృత్తి ప్రధానమైన ధర్మమును పొందెనుకదా! </p> <p class="Poem-1">విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః, </p> <p class="Poem2">రసవర్జం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. 16 </p> <p class="Tat">ఆహారమును వదలివైచిన దేహికి విషయములు మరలిపోవును. రసము మాత్రము పోదు. పరమును దర్శించినపుడు అతని రసము కూడ మరలిపోవును. </p> <p class="Poem-1">బుద్ధిః కర్మగుణై ర్హీనా యదా మనసి వర్తతే, </p> <p class="Poem2">తదా సంపద్యతే బ్రహ్మ తత్రైవ ప్రళయంగతమ్. 17 </p> <p class="Tat">కర్మగుణములులేనిదై బుద్ధి మనసున ప్రవర్తించునపుడు అతడు బ్రహ్మమే యగును. మనస్సు అందే ప్రళయము నందెను కదా! </p> <p class="Poem-1">అస్పర్మన మశృణ్వాన మనాస్వాద మదర్శనమ్,</p> <p class="Poem2">అఘ్రాణ మవితర్కంచ సత్త్వం ప్రవిశతే పరమ్. 18 </p> <p class="Tat">స్పృశింపనిది, విననిది, రుచి నందనిది, చూడనిది, మూర్కొననిది, తర్కమున కందనిది అగుపరమును సత్త్వము చేరుకొనును. </p> <p class="Poem-1">మనస్యాకృతయో మగ్నా మనస్త్వభిగతం మతిమ్, </p> <p class="Poem2">మతి స్త్వభిగతా జ్ఞానం జ్ఞానం చాభిగతం పరమ్. 19 </p> <p class="Tat">ఆకృతులన్నియు మనస్సునందు మునిగి పోవును. మనస్సు మతిని చేరుకొనును. మతి జ్ఞానమునందు చొరబారును. జ్ఞానము పరమాత్మయందు ప్రవేశించును. </p> <p class="Poem-1">ఇన్ద్రియై ర్మనసః సిద్ధి ర్న బుద్ధిం బుధ్యతే మనః, </p> <p class="Poem2">న బుద్ధి ర్బుధ్యతే వ్యక్తం సూక్ష్మం త్వేతాని పశ్యతి. 20 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>మను బృహస్పతి సంవాదే చతురధికద్విశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">ఇంద్రియములతో మనస్సునకు సిద్ధిలేదు. మనస్సు బుద్ధిని ఎరుగదు. బుద్ధి అవ్యక్తమును తెలియజాలదు. సూక్ష్మము మాత్రము ఈఅన్నింటిని దర్శించును. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్ష పర్వమున మనుబృహస్పతి సంవాదము గల రెండువందల నాలుగవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-4">మను రువాచ </span>- మనువు చెప్పెను. </p> <p class="Poem-1">దుఃఖోపఘాతే శారీరే మానసే చాప్యుపస్థితే, </p> <p class="Poem2">యస్మి న్న శక్యతే కర్తుం యత్నం తం నానుచిన్తయేత్ 1 </p> <p class="Tat">శరీరమునకును, మనసునకును సంబంధించిన దుఃఖరూపమైన యోగవిఘ్నము వచ్చినపుడు యోగాభ్యాసము చేయుటకు సాధ్యముకాని స్థితిలో ఆ విఘ్నమును గూర్చి భావించుచుండరాదు. </p> <p class="Poem-1">భైషజ్య మేత ద్దుఃఖస్య యదేత న్నాను చిన్తయేత్, </p> <p class="Poem2">చిన్త్యమానం హి చాభ్యేతి భూయ శ్చాపి ప్రవర్తతే. 2 </p> <p class="Tat">అట్లు చింతింపకుండుటయే దుఃఖమను ఆరోగమునకు చికిత్స. చింతించుచున్న యెడల నదియే మరల మరల వచ్చిపడును. మరియు తనయందే మెలగుచుండును. </p> <p class="Poem-1">ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యా చ్ఛారీర మౌషధైః, </p> <p class="Poem2">ఏతద్విజ్ఞాన సామర్థ్యం న బాలైః సమతా మియాత్ 3 </p> <p class="Tat">ప్రజ్ఞతో మనస్సునకు చెందినదుఃఖమును, మందులతో శరీరదుఃఖములను రూపుమాపవలయును. పిల్లతనము కలవారు ఈ విజ్ఞానసామర్థ్యమును క్రమ బద్ధము చేయజాలరు. </p> <p class="Poem-1">అనిత్యం యౌవనం రూపం జీవితం ద్రవ్యసఞ్చయః,</p> <p class="Poem2">ఆరోగ్యం ప్రియసంవాసో గృధ్యే త్తత్ర న పణ్డితః. 4 </p> <p class="Tat">యౌవనము, రూపము, బ్రదుకు, ధనములప్రోవు, ఆరోగ్యము, ప్రియులతో కలసి యుండుట - అనునది యంతయు అనిత్యము. తెలివికలవాడు దానియందు లోభపడరాదు. </p> <p class="Poem-1">న జానపదికం దుఃఖ మేకః శోచితు మర్హతి, </p> <p class="Poem2">అశోచన్ ప్రతికుర్వీత యది పశ్యేదుపక్రమమ్. 5 </p> <p class="Tat ParaOverride-6">మందికి చెందిన దుఃఖమును గూర్చి తానొక్కడు కుమిలి పోరాదు. కుమిలిపోకుండ, తాను ప్రతిక్రియను కనుగొన్నచో దానిని ఆచరణలో పెట్ట వలయును. </p> <p class="Poem-1">సుఖా ద్బహుతరం దుఃఖం జీవితే నాస్తి సంశయః,</p> <p class="Poem2">స్నిగ్ధస్య చేన్ద్రియార్థేషు మోహా న్మరణ మప్రియమ్. 6 </p> <p class="Tat ParaOverride-6">బ్రదుకున సుఖముకంటె దుఃఖము మిక్కిలి ఎక్కువ. సంశయము లేదు. ఇంద్రియ విషయములయందు స్నేహముకలవానికి మోహమువలన చావు అప్రియమైన దగును. </p> <p class="Poem-1">పరిత్యజతి యో దుఃఖ సుఖం చాప్యుభయం నరః,</p> <p class="Poem2">అభ్యేతి బ్రహ్మ సోఽత్యన్తం న తే శోచన్తి పణ్డితాః. 7 </p> <p class="Tat ParaOverride-6">సుఖదుఃఖములను రెండింటిని పట్టించుకొనని నరుడు బ్రహ్మమును మిక్కిలిగా పొందును. అట్లు బ్రహ్మమును పొందిన పండితులు శోకింపరు. </p> <p class="Poem-1">దుఃఖ మర్థా హి యుజ్యన్తే పాలనేన చ తే సుఖమ్,</p> <p class="Poem2">దుఃఖేన చాధిగమ్యన్తే నాశ మేషాం న చిన్తయేత్ 8 </p> <p class="Tat ParaOverride-1">అర్థములు - ధనములు - దుఃఖపడి సాధింపవలసినవి. రక్షించుటయందును సుఖము లేదు. దుఃఖముతోడనే నాశమును పొందుచున్నవి. కనుక వానిని గూర్చి చింతింపరాదు. </p> <p class="Poem-1">జ్ఞానం జ్ఞేయాభినిర్వృత్తం విద్ధి జ్ఞానగుణం మనః, </p> <p class="Poem2">ప్రజ్ఞాకరణ సంయుక్తం తతో బుద్ధిః ప్రవర్తతే. 9 </p> <p class="Tat">తెలియదగినదానినుండి ఏర్పడునది జ్ఞానము. కనుకనే మనస్సును జ్ఞానమే గుణముగా గలదిగా ఎఱుగుము. అది జ్ఞానేంద్రియములతో కూడినదై నపుడు బుద్ధి ప్రవర్తిల్లును. </p> <p class="Poem-1">యదా కర్మగుణోపేతా బుద్ధి ర్మనసి వర్తతే, </p> <p class="Poem2">తదా ప్రజ్ఞాయతే బ్రహ్మ ధ్యానయోగసమాధినా. 10 </p> <p class="Tat">కర్మగుణములతో కూడిన బుద్ధి మనస్సునందు ప్రవర్తించునపుడు ధ్యానయోగ సమాధిచేత బ్రహ్మము చక్కగా తెలియవచ్చును. </p> <p class="Poem-1">సేయం గుణవతీ బుద్ధి ర్గుణేష్వే వాభివర్తతే, </p> <p class="Poem2">అపరా దభినిః సృత్య గిరేః శృఙ్గా దివోదకమ్. 11 </p> <p class="Tat">ఇంద్రియాది గుణములు గల అబుద్ధి అజ్ఞానమువలన వెడలినదై, కొండ కొమ్మునుండి జాలువారు నీటివలె, గుణములయందే తిరుగాడుచుండును. </p> <p class="Poem-1">యదా నిర్గుణ మాప్నోతి ధ్యానం మనసి పూర్వజమ్, </p> <p class="Poem2">తదా ప్రజ్ఞాయతే బ్రహ్మ నికషం నికషే యథా. 12 </p> <p class="Tat">అన్నింటికంటె ముందే ఏర్పడియున్న ఆధ్యేయవస్తువు బుద్ధివృత్తియందు గుణములు లేనిదై సిద్ధించునపుడు, ఒరగంటియందు బంగారురేఖవలె, బ్రహ్మము అనుభవమునకు వచ్చును. </p> <p class="Poem-1">మనస్త్వపహృతం పూర్వ మిన్ద్రియార్థ నిదర్శకమ్, </p> <p class="Poem2">న సమక్షగుణాపేక్షి నిర్గుణస్య నిదర్శకమ్. 13 </p> <p class="Tat">మనస్సు ఇంద్రియార్థములను నిరూపించునది కావున అది ముందే రూపుమాసిపోయినది. ఆస్థితి ఇంద్రియములకు చాల దగ్గరగా నున్న గుణమును కోరునట్టిది కాదు. గుణములు లేని దానిని - బ్రహ్మమును - ప్రదర్శించునట్టిది. </p> <p class="Poem-1">సర్వాణ్యేతాని సంవార్య ద్వారాణి మనసి స్థితః,</p> <p class="Poem2">మనస్యేకాగ్రతాం కృత్వా తత్పరం ప్రతిపద్యతే. 14 </p> <p class="Tat">ఇంద్రియములను ద్వారములనన్నింటిని మూసివైచి మనస్సునందు నిలుప వలయును. దానిని కూడ బుద్ధియందు లయమొనర్చి ఏకాగ్రతను సాధింప వలయును. దానితో తరువాతి స్థితిని - పరమాత్మస్థితిని - పొందును. </p> <p class="Poem-1">యథా మహాన్తి భూతాని నివర్తన్తే గుణక్షయే, </p> <p class="Poem2">తథేన్ద్రియాణ్యుపాదాయ బుద్ధి ర్మనసి వర్తతే. 15 </p> <p class="Tat">గుణములగు శబ్దాదులు నశింపగా వాని కార్యములగు మహాభూతములు లయము చెందిన విధముగా మనసునందు లయమొందుచున్న బుద్ధి ఇంద్రియములను గ్రహించియే లయమొందును. </p> <p class="Poem-1">యదా మనసి సా బుద్ధి ర్వర్తతేఽ న్తరచారిణీ, </p> <p class="Poem2">వ్యవసాయగుణోపేతా తదా సంపద్యతే మనః. 16 </p> <p class="Tat">మనసునందు లోపల తిరుగునట్టిదై బుద్ధి ప్రవర్తించునపుడు, అది నిశ్చయాత్మకమగు గుణముతో కూడినదైనను మనస్సే యగును. </p> <p class="Poem-1">గుణవద్భి ర్గుణోపేతం యదా ధ్యానగుణం మనః,</p> <p class="Poem2">తదా సర్వాన్ గుణాన్ హిత్వా నిర్గుణం ప్రతిపద్యతే. 17 </p> <p class="Tat">ధ్యాన గుణముగల మనస్సు గుణములగు శబ్దాదులతోపాటు గుణములను పొందిన దైనపుడు గుణముల నన్నింటిని పట్టుకొని నిర్గుణమగు బ్రహ్మమును పొందును. </p> <p class="Poem-1">అవ్యక్త స్యేహ విజ్ఞానే నాస్తి తుల్యం నిదర్శనమ్, </p> <p class="Poem2">యత్ర నాస్తి పదన్యాసః క స్తం విషయ మాప్నుయాత్. 18 </p> <p class="Tat">అవ్యక్తమునకు సంబంధించిన విజ్ఞానమునందు సమానమగు దృష్టాంత మేదియును లేదు. ఎందు వాగ్వ్యవహారములేదో అట్టి విషయమును పొందువాడెవడు? </p> <p class="Poem-1 ParaOverride-5">తపసా చానుమానేన గుణై ర్జాత్యా శ్రుతేన చ, </p> <p class="Poem2">నినీషే త్పరమం బ్రహ్మ విశుద్ధే నాన్తరాత్మనా. 19 </p> <p class="Tat">తపస్సుచేతను, అనుమానముచేతను, గుణములచేతను, జాతిచేతను, వేదాంతము చేతను, విశుద్ధమగుఅంతరాత్మచేతను ఆపరమబ్రహ్మమును తెలియగోరదగును. </p> <p class="Poem-1">గుణోహీనో హి తం మార్గం బహిః సమనువర్తతే, </p> <p class="Poem2">గుణాభావాత్ర్పకృత్యా వాని స్తర్క్యం జ్ఞేయసమ్మితమ్. 20 </p> <p class="Tat">గుణముల అంటుసొంటులు లేనివాడు ఆపరమాత్మను వెలుపలి ఆకారము లందును సమన్వయించుకొనును. తెలియదగినదిగా ప్రసిద్ధికెక్కిన ఆపరమాత్మ గుణములు లేని కారణముననో, స్వభావసిద్ధముగనో తర్కముల కందనిది. </p> <p class="Poem-1 ParaOverride-3">నైర్గుణ్యా ద్బహ్మ చాప్నోతి సగుణత్వా న్నివర్తతే,</p> <p class="Poem2">గుణప్రచారిణీ బుద్ధి ర్హుతాశన ఇవేన్ధవే. 21 </p> <p class="Tat">గుణములయందు తిరుగమరిగిన బుద్ధి గుణములు లేకుండ చేసికొనుటవలన బ్రహ్మమును పొందును. గుణముల సంపర్కముండుటవలన దానినుండి మరలిపోవును. తడికట్టెయందు అగ్ని ప్రవర్తింపదు. ఎండుకట్టెయందు సుఖముగా </p> <p class="Tat">చొరబడునుగదా! </p> <p class="Poem-1 ParaOverride-10">యథా పఞ్చ విముక్తాని ఇంద్రియాణి స్వకర్మభిః, </p> <p class="Poem2">తథా హి పరమం బ్రహ్మ విముక్తం ప్రకృతేః పరమ్. 22 </p> <p class="Tat">సుషుప్తిదశలో అయిదు ఇంద్రియములును తమ వ్యాపారములనుండి విడివడి పోయినట్లు పరబ్రహ్మము ప్రకృతినుండి సంపర్కము లేని దగును. </p> <p class="Poem-1">ఏవం ప్రకృతితః సర్వే ప్రవర్తన్తే శరీరిణః, </p> <p class="Poem2">నివర్తన్తే నివృత్తే చ స్వర్గం చైవోపయాన్తిచ. 23 </p> <p class="Tat">ఇట్లు జీవులందరు ప్రకృతివలన ప్రవర్తించుచున్నారు. ప్రకృతి మరలి పోయినపుడు ముక్తులగుచున్నారు. అట్టి నివృత్తిలేనిచో స్వర్గమును - ప్రవృత్తి ఫలముగా పొందుచున్నారు. </p> <p class="Poem-1 ParaOverride-11">పురుషః ప్రకృతి ర్బుద్ధి ర్విషయా శ్చేన్ద్రియాణి చ, </p> <p class="Poem2">అహంకారోఽభిమానశ్చ సమూహో భూతసంజ్ఞకః 24 </p> <p class="Tat">పురుషుడు, ప్రకృతి, బుద్ధి, విషయములు, ఇంద్రియము, అహంకారము, అభిమానము అను నీసముదాయము భూతమను పేరు కలిగినట్టిది. </p> <p class="Poem-1">ఏతస్యాద్యా ప్రవృత్తి స్తు ప్రధానా త్సంప్రవర్తతే, </p> <p class="Poem2">ద్వితీయా మిథునవ్యక్తి మవిశేషా న్నియచ్ఛతి. 25 </p> <p class="Tat">ఈ భూతసంఘపు మొదటి సృష్టి ప్రధానమువలన కొనసాగుచున్నది. రెండవసృష్టి విశేషములేకుండుటవలన మిథునధర్మముతో ఏర్పడుటను నియమించు చున్నది. </p> <p class="Poem-1 ParaOverride-3">ధర్మా దుత్కృష్యతే శ్రేయ స్తథాఽశ్రేయోఽప్యధర్మతః, </p> <p class="Poem2">రాగవాన్ ప్రకృతిం హ్యేతి విరక్తో జ్ఞానవాన్ భవేత్. 26 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతిశ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి <br/>మనుబృహస్పతి సంవాదే పఞ్చాధికద్విశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">ధర్మమువలన భూతసంఘము శ్రేయస్సును సాధించుచున్నది. అధర్మమువలన ప్రేయస్సును పొందుచున్నది. రాగముకలవాడు ప్రకృతిని పొందుచున్నాడు. విరక్తుడు జ్ఞానము కలవాడగుచున్నాడు </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున మనుబృహస్పతి సంవాదమున రెండువందల అయిదవ అధ్యాయము </p> <p class="Tat"><span class="CharOverride-4">మను రువాచ </span>- మను విట్లు పలికెను. </p> <p class="Poem-1">యదా తైః పఞ్చభిః పఞ్చ యుక్తాని మనసా సహ, </p> <p class="Poem2">అథ తద్రక్ష్యతే బ్రహ్మ మణౌ సూత్ర మివార్పితమ్. 1 </p> <p class="Tat">ఈ అయిదు విషయములతో అయిదు ఇంద్రియములను మనస్సుతోపాటు నిగ్రహించినపుడు మణియందు నిక్షిప్తమైన సూత్రమువలె బ్రహ్మము దర్శింప బడును. </p> <p class="Poem-1 ParaOverride-12">తదేవ చ యథా సూత్రం సువర్ణే వర్తతే పునః,</p> <p class="Poem2 ParaOverride-2">ముక్తా స్వథ ప్రవాళేషు మృన్మయే రాజతే తథా. 2</p> <p class="Poem-1 ParaOverride-1">తద్వద్గోఽ శ్వమనుష్యేషు తద్వద్ధస్తి మృగాదిషు,</p> <p class="Poem2">తద్వత్కీటపతఙ్గేషు ప్రసక్తాత్మా స్వకర్మభిః. 3 </p> <p class="Tat">అదే సూత్రము సువర్ణమునందు, ముత్యములయందు, పగడములయందు, మట్టిపూసలయందు, వెండినగయందు ఉండును. అట్లే తగులము పొందిన చిత్తము </p> <p class="Tat">కలవాడు తన కర్మములతో ఆవు, గుఱ్ఱము, మనుష్యులు, ఏనుగులు, మృగములు, పురుగులు, పక్షులు అనువాని యందు తిరుగాడుచుండును. </p> <p class="Poem-1">యేన యేన శరీరేణ యద్యత్కర్మ కరోత్యయమ్,</p> <p class="Poem2">తేన తేన శరీరేణ తత్తత్ఫల ముపాశ్నుతే. 4 </p> <p class="Tat">జీవుడు ఏయే శరీరముతో ఏయే కర్మమును చేయునో ఆయాశరీరముతో ఆయాఫలమును అనుభవించును. </p> <p class="Poem-1">యథా హ్యేకరసా భూమి రోషధ్యర్థానుసారిణీ, </p> <p class="Poem2">తథా కర్మానుగా బుద్ధి రన్తరాత్మాను దర్శినీ. 5 </p> <p class="Tat">ఒకేరసము గలదైనను భూమి ఓషధుల లక్షణములను అనుసరించి వేరువేరు పంటలను పండించునది అయినవిధముగా బుద్ధి అంతరాత్మ సాక్షిగా గలది యయినను కర్మముల ననుసరించునది యగును. </p> <p class="Poem-1">జ్ఞానపూర్వా భవే ల్లి ప్సా లిప్సా పూర్వా ఽ భిసన్ధితా, </p> <p class="Poem2">అభిసన్ధిపూర్వకం కర్మ కర్మమూలం తతః ఫలమ్. 6 </p> <p class="Tat">బుద్ధినిబట్టి రాగము, రాగమును బట్టి ప్రయత్నము, ప్రయత్నమునుబట్టి కర్మము, కర్మమూలముగా ఫలము ఏర్పడును. </p> <p class="Poem-1">ఫలం కర్మాత్మకం విద్యాత్ కర్మజ్ఞేయాత్మకం తథా, </p> <p class="Poem2">జ్ఞేయం జ్ఞానాత్మకం విద్యాద్ జ్ఞానం సదసదాత్మకమ్. 7 </p> <p class="Tat">ఫలము కర్మమునుబట్టి, కర్మము జ్ఞేయమునుబట్టి, జ్ఞేయము జ్ఞానమును బట్టి, జ్ఞానము సదసదాత్మకమైనదానిని బట్టి పుట్టునని తెలియదగును. </p> <p class="Poem-1">జ్ఞానానాం చ ఫలానాం చ జ్ఞేయానాం కర్మణాం తథా, </p> <p class="Poem2">క్షయాన్తే యత్ఫలం విద్యా జ్ఞానం జ్ఞేయప్రతిష్ఠితమ్. 8 </p> <p class="Tat">జ్ఞానములు ఫలములు, జ్ఞేయములు, కర్మములు అనువాని క్షయముతుదిని ఏదిఫలమో అది విద్యాజ్ఞానము. అది జ్ఞేయమునందు చక్కగా కుదురుకొని యుండునట్టిది. </p> <p class="Poem-1 ParaOverride-3">మహద్ధి పరమం భూతం యత్ప్రపశ్యన్తి యోగినః, </p> <p class="Poem2">అబుద్ధాస్తం న పశ్యన్తి హ్యాత్మస్థం గుణబుద్ధయః. 9 </p> <p class="Tat">మహత్తు అనునది పరమమగు భూతము. దానిని యోగులు చక్కగా దర్శింతురు. గుణములందే బుద్ధిగల అబుద్ధులు ఆత్మయందున్న దానిని చూడజాలరు. </p> <p class="Poem-1">పృథివీరూపతో రూప మపా మిహ మహత్తరమ్, </p> <p class="Poem2 ParaOverride-2">అద్భ్యో మహత్తరం తేజ స్తేజసః పవనో మహాన్. 10</p> <p class="Poem2 ParaOverride-2">పవనా చ్చ మహ ద్వ్యోమ తస్మా త్పరతరం మనః,</p> <p class="Poem2 ParaOverride-2">మనసో మహతీ బుద్ధి ర్బుద్ధేః కాలో మహాన్ స్మృతః. 11 </p> <p class="Poem2 ParaOverride-2">కాలా త్స భగవాన్ విష్ణు ర్యస్య సర్వమిదం జగత్,</p> <p class="Poem2">నాది ర్న మధ్యం నైవాన్త స్తస్య దేవస్య విద్యతే. 12 </p> <p class="Tat">పృథివి రూపముకంటె నీటిరూపము మిక్కిలి పెద్దది. దానికంటె మహత్తర మైనది అగ్ని. అగ్నికంటె గొప్పది వాయువు. వాయువుకంటె ఆకాశము గొప్పది. దానికంటె మించినది మనస్సు, మనస్సుకంటె గొప్పది బుద్ధి. బుద్ధికంటె కాలము, కాలముకంటె, ఈజగత్తు అంతయు తనదే అయిన విష్ణు భగవానుడు గొప్ప. ఆదేవునకు ఆది, మధ్యము, అంతము లేదు. </p> <p class="Poem-1">అనాదిత్వా దమధ్యత్వా దనన్తత్వాచ్చ సోఽ వ్యయః</p> <p class="Poem2">అత్యేతి సర్వదుఃఖాని దుఃఖం హ్యస్తవదుచ్యతే. 13 </p> <p class="Tat">ఆది మధ్యము, అంతములేనివాడగుటవలన అతడు అవ్యయుడు. సర్వదుః ఖములను అతిక్రమించినవాడు. దుఃఖము అంతము కలది యని చెప్పుదురు. </p> <p class="Poem-1">తద్ర్బహ్మ పరమం ప్రోక్తం తద్ధామ పరమం పదమ్, </p> <p class="Poem2">తద్గత్వా కాలవిషయా ద్విముక్తా మోక్ష మాశ్రితాః 14 </p> <p class="Tat">ఆబ్రహ్మమును పరమమని చెప్పుదురు. ఆతనిస్థానము పరమపదము. దానిని చేరుకొని కాల విషయమునుండి విముక్తులై మోక్షము నాశ్రయింతురు. </p> <p class="Poem-1">గుణేష్వేతే ప్రకాశన్తే నిర్గుణత్వా త్తతః పరమ్,</p> <p class="Poem2">నివృత్తిలక్షణో ధర్మ స్తథా నన్త్యాయ కల్పతే. 15 </p> <p class="Tat">వీరు గుణములయందు ప్రకాశింతురు. ఆపరమైనది గుణములు లేనిది కనుక అంతకు మించినట్టిది. ఆవిధముగా నివృత్తిలక్షణమైన ధర్మము మోక్షమునకు కారణమగును. </p> <p class="Poem-1">ఋచో యజూంషి సామాని శరీరాణి వ్యపాశ్రితాః, </p> <p class="Poem2">జిహ్వాగ్రేషు ప్రవర్తన్తే యత్నసాధ్యా వినాశినః. 16 </p> <p class="Tat">ఋక్కులు, యజుస్సులు, సామములు శరీరములను చేరుకొన్నవై నాలుకకొనల యందు మెలగుచుండును. అవి యత్నముచేత సాధింపబడునవి. వినాశము పొందునట్టివి. </p> <p class="Poem-1">న చైవ మిష్యతే బ్రహ్మ శరీరాశ్రయసంభవమ్, </p> <p class="Poem2">న యత్న సాధ్యం తద్ర్బహ్మ నాదిమధ్యం నచాన్తవత్. 17 </p> <p class="Tat">శరీరము నాశ్రయించి ఆవిర్భావము కలదియైనను బ్రహ్మము ఇట్టిదిగా దొరకునది కాదు. ఆబ్రహ్మము ప్రయత్నముతో సాధింపబడునది కాదు. ఏలయన దానికి ఆది, మధ్యము, అంతము అనునవి లేవు. </p> <p class="Poem-1">ఋచా మాది స్తథా సామ్నాం యజుషా మాది రుచ్యతే, </p> <p class="Poem2">అన్త శ్చాదిమతాం దృష్టో నత్వాది ర్బ్రహ్మణః స్మృతః 18 </p> <p class="Tat">ఋక్కులకు, సామములకు, యజుస్సులకు మొదలు కలదని చెప్పుదురు. ఆది కలవానికి అంతము కానవచ్చుచున్నది. బ్రహ్మమునకు ఆది అనునది తలపునకు రాని విషయము. </p> <p class="Poem-1">అనాదిత్వా దనన్తత్వా త్తదనన్త మథావ్యయమ్, </p> <p class="Poem2">అవ్యయత్వా చ్చ నిర్దుఃఖం ద్వన్ద్వాభావ స్తతఃపరమ్. 19 </p> <p class="Tat">ఆది, అంతములు లేనిదైన కారణమున అది అనంతము, అవ్యయము అగును. అవ్యయమగుటవలన దుఃఖము లేనిదగును. అటుపై ద్వంద్వములు లేనిదగును. </p> <p class="Poem-1">అదృష్టతోఽ నుపాయాచ్చ ప్రతిసన్ధేశ్చ కర్మణః, </p> <p class="Poem2">న తేన మర్త్యాః పశ్యన్తి యేన గచ్ఛన్తి తత్పదమ్. 20 </p> <p class="Tat">అదృష్టము వలనను, ఉపాయములేని కారణమునను, కర్మము ప్రతిసంధివలనను మర్త్యులు దేనితో ఆ బ్రహ్మపదము నెరుగుదురో ఆ మార్గమును కానకున్నారు. </p> <p class="Poem-1">విషయేషు చ సంసర్గా చ్ఛాశ్వతస్య చ దర్శనాత్,</p> <p class="Poem2">మనసా చాన్య దాకాంక్షన్ పరం న ప్రతిపద్యతే. 21 </p> <p class="Tat">విషయములందలి తగులమువలనను, శాశ్వతమును చూచుటవలనను, మనసుతో మరియొక దానిని గట్టిగా పొందగోరుచు నరుడు పరమును పొంద కున్నాడు. </p> <p class="Poem-1">గుణా న్యదిహ పశ్యన్తి తదిచ్ఛన్త్యపరే జనాః, </p> <p class="Poem2">పరం నైవాభికాంక్షన్తి నిర్గుణత్వా ద్గుణార్థినః. 22 </p> <p class="Tat">మఱికొందరు జనులు ఇందు గుణములు చూచిన కారణముగా వానినే కోరుచుందురు. గుణములను కోరువారు నిర్గుణమగుటవలన పరమును నిశ్చయముగా కోరరు. </p> <p class="Poem-1">గుణైర్య స్త్వవరై ర్యుక్తః కథం విద్యా త్పరాన్ గుణాన్,</p> <p class="Poem2">అనుమానాద్ధి గన్తవ్యం గుణై రవయవైః పరమ్. 23 </p> <p class="Tat">తక్కువజాతివైన గుణములతో కూడినవాడు పరములైన గుణముల నెట్లు ఎరుగును? అవయవములైన గుణములతో అనుమానము వలన కదా పరము పొందదగినది! </p> <p class="Poem-1">సూక్ష్మేణ మనసా విద్మో వాచా వక్తుం న శక్నుమః, </p> <p class="Poem2">మనో హి మనసా గ్రాహ్యం దర్శనేన చ దర్శనమ్. 24 </p> <p class="Tat">సూక్ష్మమగు మనస్సుతో దానిని తెలిసికొందుము. కాని వాక్కుతో దానిని చెప్పజాలము. మనస్సు చేత మనస్సు, కంటిచేత కన్ను మాత్రమే గ్రహింపబడునది యగును. </p> <p class="Poem-1">జ్ఞానేన నిర్మలీకృత్య బుద్ధిం బుద్ధ్యా మనస్తథా,</p> <p class="Poem2">మనసా చేన్ద్రియగ్రామ మక్షరం ప్రతిపద్యతే. 25 </p> <p class="Tat">జ్ఞానముచేత బుద్ధిని, బుద్ధిచేత మనస్సును, మనస్సుచేత ఇంద్రియముల సముదాయమును నిర్మలముగా చేసి అక్షరమును పొందగలుగును. </p> <p class="Poem-1">బుద్ధిప్రవీణో మనసా సమృద్ధో </p> <p class="Poem2 ParaOverride-2">నిరాశిషం నిర్గుణ మభ్యుపైతి,</p> <p class="Poem2 ParaOverride-2">పరం త్యజన్తీహ విలోడ్యమానా </p> <p class="Poem2">హుతాశనం వాయు రివేన్ధనస్య. 26 </p> <p class="Tat">బుద్ధివృత్తిని రూపుమాపినవాడు, మనస్సుతో సమృద్ధుడునైన వ్యక్తి ఆశలులేనిది, గుణములు లేనిది అగు పరమాత్మను పొందును. ఆశలతో అల్లకల్లోలముగానయినవారు కట్టెలోని అగ్నిని వాయువువలె పరమును త్యజింతురు. </p> <p class="Poem-1">గుణాదానే విప్రయోగే చ తేషాం </p> <p class="Poem2">మనః సదా బుద్ధిపరావరాభ్యామ్, </p> <p class="Poem2">అనేనైవ విధినా సంప్రవృత్తో </p> <p class="Poem2">గుణాపాయే బ్రహ్మ శరీర మేతి. 27 </p> <p class="Tat">గుణాదానమునందును, వాని ఎడబాటునందును మనస్సు ఎల్లవేళల బుద్ధిపరమైన బ్రహ్మముకొరకు, బుద్ధిఅవరమైన ఐశ్వర్యముకొరకును సిద్ధమగును. ఇదే విధితో గుణములు తొలగిపోవుట యందు మెలగువాడు బ్రహ్మశరీరమును పొందును. </p> <p class="Poem-1">అవ్యక్తాత్మా పురుషో వ్యక్త కర్మా </p> <p class="Poem2">సో ఽ వ్యక్తత్వం గచ్ఛతి హ్యన్తకాలే, </p> <p class="Poem2">తై రేవాయం చేన్ద్రియై ర్వర్ధమానై </p> <p class="Poem2">రాయద్భి ర్వా వర్తతే ఽ కామరూపః 28 </p> <p class="Tat">అవ్యక్తమగు ఆత్మకల పురుషుడు వ్యక్తములగు కర్మములు కలవాడగు చున్నాడు. మరియు అంతకాలమున అవ్యక్తతను పొందును. వృద్ధి పొందుచున్నవి, నలిగిపోవుచున్నవి వలెనున్న ఆ యింద్రియముల తోడనే అకామరూపుడై తిరుగు చుండును. </p> <p class="Poem-1">సర్వై రయం చేన్ద్రియైః సంప్రయుక్తో </p> <p class="Poem2">దేహం ప్రాప్తః పఞ్చభూతాశ్రయః స్యాత్, </p> <p class="Poem2">నాసా మర్థ్యా ద్గచ్ఛతి కర్మణే హ </p> <p class="Poem2">హీనస్తేన పరమేణావ్యయేన. 29 </p> <p class="Tat">సర్వములగు ఇంద్రియములతో కూడి యున్నదై ఈ జీవతత్త్వము దేహమును పొంది పంచభూతములుగా ఆశ్రయముగా నగుచున్నది. పరమము, అవ్యయము నగు తత్త్వము అందులేని కారణముచేత, అసమర్థతవలన అది కర్మముకొరకు పోజాలకున్నది. </p> <p class="Poem-1">పృథ్వ్యాం నరః పశ్యతి నాన్త మస్యా </p> <p class="Poem2">హ్యన్త శ్చాస్యా భవితా చేతి విద్ధి,</p> <p class="Poem2">పరం నయన్తీ హ విలోడ్యమానం </p> <p class="Poem2">యథా ప్లవం వాయు రివార్ణవస్థమ్. 30 </p> <p class="Tat">నరుడు భూమి అంతమును చూడడు. కాని అది దానికి కలదు. అట్లే దుఃఖ సంతతికిని అంతము కలదని ఎరుగుము. సముద్రములో నున్న గడ్డిమున్నగు దానిని ప్రవాహము నకనుగుణముగా గాలి కదలించుచు ఒడ్డునకు చేర్చు విధముగా కర్మములే జీవుని ఒడ్డునకు చేర్చుచున్నవి. </p> <p class="Poem-1">దివాకరో గుణ ముపలభ్య నిర్గుణో </p> <p class="Poem2">యథా భవే దపగతరశ్మి మణ్డలః,</p> <p class="Poem2">యథా హ్యసౌ ముని రిహ నిర్విశేషవాన్ </p> <p class="Poem2">స నిర్గుణం ప్రవిశతి బ్రహ్మ చావ్యయమ్. 31 </p> <p class="Tat">సూర్యుడు కిరణముల సముదాయమును స్వీకరించియు, గుణములను వదలి తొలగిన కిరణముల సముదాయము కలవాడు నగునో అట్లే జీవుడును పోయిన సుఖిత్వాదిధర్మములు కలవాడై అవ్యయము, నిర్గుణమునగు బ్రహ్మమును ప్రవేశించును. </p> <p class="Poem-1">అనాగతం సుకృతవతాం పరాం గతిం </p> <p class="Poem2 ParaOverride-2">స్వయంభువం ప్రభవనిధాన మవ్యయమ్,</p> <p class="Poem2 ParaOverride-2">సనాతనం యదమృత మవ్యయం ధ్రువం </p> <p class="Poem2">నిచాయ్య తత్పర మమృతత్వ మశ్నుతే. 32 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి <br/>మనుబృహస్పతి సంవాదే షడధిక ద్విశతతమోఽధ్యాయః</span> </p> <p class="Tat">రాకడ లేనిది, పుణ్యవంతులకు పరమమగుగతి యయినది, స్వయంభువు, సర్వమునకు ప్రభవము, నిధానము అయినది, సనాతనము, అమృతము, అవ్యయము, ధ్రువము అయిన పరబ్రహ్మమును చక్కగా తెలిసికొని ఆ పరమమగు అమృతత్వమును మానవుడు అనుభవించును. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మనుబృహస్పతి సంవాదముగల రెండువందల ఆరవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-4">యుధిష్ఠిర ఉవాచ </span>- యుధిష్ఠిరు డిట్లనెను. </p> <p class="Poem-1">పితామహ మహాప్రాజ్ఞ పుణ్డరీకాక్ష మచ్యుతమ్, </p> <p class="Poem2">కర్తార మకృతం విష్ణుం భూతానాం ప్రభవాప్యయమ్. 1 </p> <p class="Poem2">నారాయణం హృషీకేశం గోవిన్ద మపరాజితమ్,</p> <p class="Poem2">తత్త్వేన భరతశ్రేష్ఠ శ్రోతు మిచ్ఛామి కేశవమ్. 2 </p> <p class="Tat">మహాప్రాజ్ఞా! తాతా! పుండరీకాక్షుడు, అచ్యుతుడు, సర్వమునకు కర్త తనకు కర్తలేనివాడు, విష్ణువు, సర్వభూతములకు పుట్టుకస్థానమైనవాడు, నారాయణుడు, హృషీకేశుడు, గోవిందుడు, అపరాజితుడు అయిన కేశవుని గూర్చి తత్త్వపూర్వకముగా వినగోరుచున్నాను. </p> <p class="Tat"><span class="CharOverride-4">భీష్మ ఉవాచ</span> - భీష్ము డిట్లు పలికెను. </p> <p class="Poem2">శ్రుతోఽయ మర్థో రామస్య జామదగ్న్యస్య జల్పతః,</p> <p class="Poem2">నారదస్య చ దేవర్షేః కృష్ణ ద్వైపాయనస్య చ. 3 </p> <p class="Tat">జమదగ్ని కొడుకు పరశురాముడు, దేవర్షియగు నారదుడు, కృష్ణద్వైపాయనుడు అనువారి మాటల వలన నాకీ యర్థము వినవచ్చినది. </p> <p class="Poem-1">అసితో దేవల స్తాత వాల్మీకిశ్చ మహాతపాః, </p> <p class="Poem2">మార్కణ్డేయశ్చ గోవిన్దే కథయన్త్యద్భుతం మహత్. 4 </p> <p class="Tat">నాయనా! అసితుడగు దేవలుడు, మహాతపశ్శాలి వాల్మీకి, మార్కండేయుడును </p> <p class="Tat">గోవిందునియందు అద్భుతమైన మాహాత్యమును చెప్పుచుందురు. </p> <p class="Poem-1">కేశవో భరతశ్రేష్ఠ భగవా నీశ్వరః ప్రభుః, </p> <p class="Poem2">పురుషః సర్వమిత్యేవ శ్రూయతే బహుధా విభుః. 5 </p> <p class="Tat">భరతశ్రేష్ఠా! కేశవుడు భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభువు, పురుషుడు, విభువు, సర్వము అని పెక్కు విధముల వినవచ్చుచున్నది. </p> <p class="Poem-1">కింతు యాని విదు ర్లోకే బ్రాహ్మణాః శార్ఙ్గధన్వని,</p> <p class="Poem2">మహాత్మని మహాబాహో శృణు తాని యుధిష్ఠిర. 6 </p> <p class="Tat">యుధిష్ఠిరా! శార్ఙ్గధన్వుడు, మహాత్ముడునగు శ్రీకృష్ణునియందు బ్రాహ్మణు లెరిగిన కర్మములెట్టివో చెప్పెదను. వానిని వినుము. </p> <p class="Poem-1">యాని చాహు ర్మనుష్యేన్ద్ర యే పురాణవిదో జనాః, </p> <p class="Poem2">కర్మాణి త్విహ గోవిన్దే కీర్తయిష్యామి తాన్యహమ్. 7 </p> <p class="Tat">పురాణవేత్తలగు జనులు గోవిందునియందలి యేయేకర్మములను ప్రీతితో చెప్పుకొందురో వానిని కొనియాడెదను. </p> <p class="Poem-1">మహాభూతాని భూతాత్మా మహాత్మా పురుషోత్తమః, </p> <p class="Poem2">వాయు ర్జ్యోతి స్తథా చాపః ఖం చ గాం చాన్వకల్పయత్. 8</p> <p class="Tat">మహాత్ముడు, భూతాత్ముడునగు పురుషోత్తముడు మహాభూతములగు వాయువు, అగ్ని, జలము, ఆకాశము, భూమి అనువానిని సృజించెను. </p> <p class="Poem-1">స సృష్ట్వా పృథివీం చైవ సర్వభూతేశ్వరః ప్రభుః,</p> <p class="Poem2">అప్స్వేవ భవనం చక్రే మహాత్మా పురుషోత్తమః. 9 </p> <p class="Tat">మహాత్ముడు, పురుషోత్తముడు, సర్వభూతేశ్వరుడు నగు ప్రభువు పృథివిని స్పజించి జలములయందే నివాసమును చేసికొనెను. </p> <p class="Poem-1">సర్వతేజోమయ స్తస్మిన్ శయానః పురుషోత్తమః. </p> <p class="Poem2">సోఽ గ్రజం సర్వభూతానాం సంకర్షణ మకల్పయత్. 10</p> <p class="Tat">సర్వతేజోమయుడు, అందు పవ్వళించినవాడునగు పురుషోత్తముడు భూతములన్నింటికి మొదటపుట్టిన సంకర్షణుని సృష్టించెను. </p> <p class="Poem-1">ఆశ్రయం సర్వభూతానాం మనసేతీహ శుశ్రుమ,</p> <p class="Poem2">స ధారయతి భూతాని ఉభే భూతభవిష్యతీ. 11 </p> <p class="Tat">మనస్సుతోపాటుగా అట్లు సృష్టినందిన ఆసంకర్షణుడు సర్వభూతములకు ఆశ్రయమని మేము వినియుంటిమి. అతడు కడచిన, కడవనున్న భూతములను రెండు విధములను పట్టినిలుపుచున్నాడు. </p> <p class="Poem-1">తత స్తస్మిన్ మహాబాహౌ ప్రాదుర్భూతే మహాత్మని,</p> <p class="Poem2">భాస్కర ప్రతిమం దివ్యం నాభ్యాం పద్మ మజాయత. 12 </p> <p class="Tat">ఆ విధముగా మహాబాహువు, మహాత్ముడునగు నతడు పుట్టగా అతని బొడ్డునందు సూర్యునివలె వెలుగొందెడు దివ్యమగు పద్మము పుట్టెను. </p> <p class="Poem-1">స తత్ర భగవాన్ దేవః పుష్కరే భ్రాజయన్ దిశః, </p> <p class="Poem2">బ్రహ్మా సమభవ త్తాత సర్వభూతపితామహః. 13 </p> <p class="Tat">ఆపద్మమునందు, నాయనా! దిక్కులను వెలుగొందజేయుచు, దేవుడు, భగవంతుడు, సర్వభూతములకు పితామహుడునగు బ్రహ్మ పుట్టెను. </p> <p class="Poem-1">తస్మిన్నపి మహాబాహౌ ప్రాదుర్భూతే మహాత్మని, </p> <p class="Poem2">తమసా పూర్వజో జజ్ఞే మధు ర్నామ మహాసురః. 14 </p> <p class="Tat">మహాత్ముడు, మహాబాహువునగు ఆబ్రహ్మ అట్లు పుట్టగా తమోగుణముతో అనాదియగు మధువను మహాసురుడు పుట్టెను. </p> <p class="Poem-1">తముగ్ర ముగ్ర కర్మాణ ముగ్ర కర్మ సమాస్థితమ్, </p> <p class="Poem2">బ్రహ్మణోపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమః. 15 </p> <p class="Tat">ఉగ్రుడు, ఉగ్రకర్ముడు, ఉగ్రమగు కర్మమునందే నిలుకడకలవాడునగు నతనిని, బ్రహ్మకు ఉన్నతిని చేయుచు, పురుషోత్తముడు సంహరించెను. </p> <p class="Poem-1">తస్య తాత వధా త్సర్వే దేవదానవ మానవాః,</p> <p class="Poem2">మధుసూదన మిత్యాహు రృషభం సర్వసాత్వతామ్. 16 </p> <p class="Tat">ఆమధువును వధించుటవలన దేవతలు, దానవులు, మానవులు-అందరును యోగీశ్వరుడగు ఆపురుషోత్తముని మధుసూదనుడని పలికిరి. </p> <p class="Poem-1">బ్రహ్మానుససృజే పుత్రాన్ మానసాన్ దక్షసప్తమాన్,</p> <p class="Poem2">మరీచి మత్ర్యంగిరసం పులస్త్యం పులహం క్రతుమ్. 17</p> <p class="Tat">బ్రహ్మ మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను వారిని, ఏడవవాడగు దక్షుని - ఈ మానసులగు పుత్రులను సృజించెను. </p> <p class="Poem-1">మరీచిః కశ్యపం తాత పుత్ర మగ్రజ మగ్రజః,</p> <p class="Poem2">మానసం జనయామాస తైజసం బ్రహ్మవిత్తమమ్. 18</p> <p class="Tat">మానసపుత్రులలో పెద్దవాడగు మరీచి తేజస్సు రూపమైనవాడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అగు కశ్యపుని మానసపుత్రునిగా పుట్టించెను. </p> <p class="Poem-1">అంగుష్ఠా త్ససృజే బ్రహ్మా మరీచే రపి పూర్వజమ్,</p> <p class="Poem2">సోఽభవ ద్భరతశ్రేష్ఠ దక్షో నామ ప్రజాపతిః. 19 </p> <p class="Tat">బ్రహ్మ తనబొటనశ్రేలినుండి మరీచికంటె ముందున్నవానిని సృజించెను. అతడు దక్షుడను ప్రజాపతి ఆయెను. </p> <p class="Poem-1">తస్య పూర్వ మజాయన్త దశ తిస్రశ్చ భారత,</p> <p class="Poem2">ప్రజాపతే ర్దుహితర స్తాసాం జ్యేష్ఠోఽభవ ద్దితిః. 20 </p> <p class="Tat">అతనికి పూర్వము ప్రజాపతి కూతుండ్రు నలుబది మంది పుట్టిరి. వారిలో పెద్దది దితి. </p> <p class="Poem-1">సర్వధర్మవిశేషజ్ఞః పుణ్యకీర్తి ర్మహాయశాః, </p> <p class="Poem2">మారీచః కశ్యప స్తాత సర్వాసా మభవ త్పతిః. 21 </p> <p class="Tat">ధర్మములన్నింటి విశేషముల నెరిగినవాడు, పుణ్యకీర్తి గొప్పయశస్సు కలవాడు, మరీచి తనయుడునగు కశ్యపుడు వారికి పతి యాయెను. </p> <p class="Poem-1">ఉత్పాద్య తు మహాభాగ స్తాసా మవరజా దశ, </p> <p class="Poem2">దదౌ ధర్మాయ ధర్మజ్ఞో దక్ష ఏవ ప్రజాపతిః. 22 </p> <p class="Tat">ఆ నలువదిమందిలో చివరి పదిమందిని కని పుణ్యాత్ముడు, ధర్మజ్ఞుడునగు దక్షప్రజాపతి వారిని ధర్మునకు ఒసగెను. (భార్యలుగా) </p> <p class="Poem-1">ధర్మస్య వసవః పుత్రా రుద్రా శ్చామిత తేజసః, </p> <p class="Poem2">విశ్వేదేవాశ్చ సాధ్యాశ్చ మరుత్వన్తశ్చ భారత. 23 </p> <p class="Tat">ధర్మునకు వసువులు, అమితమగు తేజస్సుగల రుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, మరుత్వంతులు అనువారు పుత్రులు. </p> <p class="Poem-1">అపరాశ్చ యవీయస్య స్తాభ్యో ఽ న్యాః సప్తవింశతిః, </p> <p class="Poem2">సోమ స్తాసాం మహాభాగః సర్వాసా మభవ త్పతిః. 24 </p> <p class="Tat">వారికి చెల్లెండ్రయిన కన్యలు ఇరువది యేడుగురు మహాభాగుడగుచంద్రుడు వారందరికి పతియాయెను. </p> <p class="Poem-1">ఇతరాస్తు వ్యజాయన్త గన్ధర్వాం స్తురగాన్ ద్విజాన్,</p> <p class="Poem2">గాశ్చ కింపురుషాన్ మత్స్యా నుద్భిజ్జాంశ్చ వనస్పతీన్. 25 </p> <p class="Tat">కశ్యపుని స్త్రీలు తక్కినవారు గంధర్వులను, గుఱ్ఱములను, పక్షులను, గోవులను, కింపురుషులను, చేపలను, ఉద్భిజ్జములను (వృక్షజాతులను) వనస్పతులను పుట్టించిరి. </p> <p class="Poem-1">ఆదిత్యా నదితి ర్జజ్ఞే దేవశ్రేష్ఠాన్ మహాబలాన్, </p> <p class="Poem2">తేషాం విష్ణు ర్వామనోఽ భూద్గోవిన్ద శ్చాభవత్ప్రభుః. 26 </p> <p class="Tat">ఆదితి మహాబలము గలవారు, దేవశ్రేష్ఠులునగు ఆదిత్యులను కనెను. వారిలో విష్ణువు, గోవిందుడునగు ప్రభువు వామనుడును కలడు. </p> <p class="Poem-1">తస్య విక్రమణా చ్చాపి దేవానాం శ్రీ ర్వ్యవర్ధత, </p> <p class="Poem2">దానవాశ్చ పరాభూతా దైతేయీ చాసురీ ప్రజా. 27 </p> <p class="Tat">అతని విక్రమమువలన దేవతల సంపద వృద్ధిచెందెను. దానవులు పరాభవము నొందిరి. దితి సంతానమగు ఆసురసంతతి కూడ పరాభవమునొందెను. </p> <p class="Poem-1">విప్రచిత్తి ప్రధానాంశ్చ దానవా నసృజ ద్దనుః, </p> <p class="Poem2">దితిస్తు సర్వా నసురాన్ మహాసత్త్వా నజీజనత్. 28 </p> <p class="Tat">దనువు విప్రచిత్తి మొదలగు దానవులను సృజించెను. దితి గొప్పబలము గల అసురుల నందరను పుట్టించెను. </p> <p class="Poem-1">అహోరాత్రం చ కాలం చ యథర్తు మధుసూదనః, </p> <p class="Poem2">పూర్వాహ్ణం చాపరాహ్ణం చ సర్వ మేవాను కల్పయత్. 29 </p> <p class="Tat ParaOverride-1">మధుసూదనుడు ఋతువులననుసరించి, రాత్రింబగళ్లు గల కాలము, పూర్వాహ్ణము, ఆపరాహ్ణము అను కాల భాగములను అన్నింటిని ఏర్పరచెను. </p> <p class="Poem-1">ప్రధ్యాయ సోఽసృజ న్మేధాం స్తథా స్థావర జఙ్గమాన్, </p> <p class="Poem2">పృథివీం సోఽసృజ ద్విశ్వాం సహితాం భూరితేజసా. 30 </p> <p class="Tat ParaOverride-1">ఆ మధుసూదనుడు చక్కగా భావనచేసి మేధను, స్థావరజంగమములను, సమస్తము, సహితమునగు పృథివిని గొప్ప తేజస్సుతో సృజించెను. </p> <p class="Poem-1">తతః కృష్ణో మహాభాగః పున రేవ యుధిష్ఠిర,</p> <p class="Poem2">బ్రాహ్మణానాం శతం శ్రేష్ఠం ముఖా దేవాసృజ త్ప్రభుః. 31 </p> <p class="Tat ParaOverride-1">అంత పుణ్యాత్ముడు, ప్రభువునగు (వాసుదేవుడు) తనముఖమునుండి అనంతసంఖ్యలో శ్రేష్ఠులగు బ్రాహ్మణులను సృజించెను. </p> <p class="Poem-1">బాహుభ్యాం క్షత్రియశతం వైశ్యానా మూరుతఃశతమ్, </p> <p class="Poem2">పద్భ్యాం శూద్రశతం చైవ కేశవో భరతర్షభ. 32 </p> <p class="Tat ParaOverride-1">భరతవరేణ్యా! కేశవుడు బాహువులనుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులను, పాదములనుండి శూద్రులను మహాసంఖ్యలో పుట్టించెను.</p> <p class="Poem-1">స ఏవం చతురో వర్ణాన్ సముత్పాద్య మహాతపాః,</p> <p class="Poem2">అధ్యక్షం సర్వభూతానాం ధాతార మకరో త్స్వయమ్. 33 </p> <p class="Tat ParaOverride-1">ఆమహాభావుకుడు ఇట్లు నాలుగువర్ణములను పుట్టించి సర్వభూతములకు అధ్యక్షునిగా బ్రహ్మను స్వయముగా ఏర్పరచెను. </p> <p class="Poem-1">వేదవిద్యావిధాతారం బ్రహ్మాణ మమితద్యుతిమ్, </p> <p class="Poem2">భూత మాతృగణాధ్యక్షం విరూపాక్షం చ సోఽసృజత్. 34</p> <p class="Tat">వేదవిద్యకు రూపకల్పన చేసినవాడు, గొప్పవర్చస్సు కలవాడు నగు బ్రహ్మను, భూతములకు మాతృగణములకు అధ్యక్షుడు అగు విరూపాక్షుని ఆకేశవుడు సృష్టి చేసెను. </p> <p class="Poem-1">సిపితారం చ పాపానాం పితౄణాం సమవర్తినమ్,</p> <p class="Poem2">అసృజత్ సర్వభూతాత్మా నిధిపం చ ధనేశ్వరమ్, 35 </p> <p class="Tat">పాపములను (పాపులను) పితృదేవతలను శాసించెడు సమవర్తిని (యముని) ధనముల కీశ్వరుడగు కుబేరుని సర్వభూతాత్ముడగు ఆ విష్ణువు సృజించెను. </p> <p class="Poem-1">యాదసా మసృజ న్నాథం వరుణం చ జలేశ్వరమ్,</p> <p class="Poem2">వాసవం సర్వదేవానా మధ్యక్ష మకరో త్ప్రభుః. 36 </p> <p class="Tat">జలజంతువులకు నాథుడు, జలములకు ఈశ్వరుడునగు వరుణుని సృజించెను. ఆప్రభువు దేవతలందరకు అధ్యక్షునిగా ఇంద్రుని ఏర్పరచెను. </p> <p class="Poem-1">యావద్యావ దభూ చ్ఛ్రద్ధా దేహం ధారయితుం నృణామ్,</p> <p class="Poem2">తావత్తావదజీవం స్తే నాసీ ద్యమకృతం భయమ్. 37 </p> <p class="Tat">నరులకు దేహమును నిలుపుకొను శ్రద్ధ ఎంతెంతగా కలదో అంతంతగా వారు బ్రదికిరి. వారికి యమునివలన కలుగు భయము లేకుండెను. </p> <p class="Poem-1">న చైషాం మైథునో ధర్మో బభూవ భరతర్షభ,</p> <p class="Poem2">సంకల్పాదేవ చైతేషా మపత్య ముపపద్యతే. 38 </p> <p class="Tat">ఆనాటి వారికి మిథున కర్మరూపమైన ధర్మము (స్త్రీపురుషుల కలయిక) లేకుండెను. సంకల్పమాత్రము చేతనే వారికి సంతానము కలుగుచుండెను. </p> <p class="Poem-1">తత స్త్రేతాయుగే కాలే సంస్పర్శా జ్జాయతే ప్రజా, </p> <p class="Poem2">న హ్య భూ న్మైథునో ధర్మ స్తేషామపి జనాధిప. 39 </p> <p class="Tat">జనాధిపా! అటుపై త్రేతాయుగ సమయమున తాకుటవలన ప్రజ పుట్టెను. ఆకాలమునాటి వారికిని మిథున ధర్మము లేకుండెడిది. </p> <p class="Poem-1">ద్వాపరే మైథునో ధర్మః ప్రజానా మభవ న్నృప,</p> <p class="Poem2">తథా కలియుగే రాజన్ ద్వంద్వ మాపేదిరే జనాః. 40 </p> <p class="Tat">ద్వాపరయుగమున ప్రజలకు మైథునధర్మము ఏర్పడెను. అట్లే రాజా! కలియుగమునందును జంటలుగా నగుటను ప్రజలు పొందిరి.</p> <p class="Poem-1">ఏష భూతపతి స్తాత స్వధ్యక్షశ్చ తథోచ్యతే, </p> <p class="Poem2">నిరపేక్షాం శ్చ కౌన్తేయ కీర్తయిష్యామి తచ్ఛృణు. 41 </p> <p class="Tat">నాయనా! ఇతడు (కేశవుడు) భూతపతి, అందరకు గొప్ప అధ్యక్షుడు. అతనిని గూర్చి ఇంతవరకు చెప్పితిని. ఇక నిరపేక్షులను గూర్చి కౌంతేయా!, వివరించెదను. దానిని వినుము. </p> <p class="Poem-1">దక్షిణాపథజన్మానః సర్వే నరవరాన్ధ్ర కాః, </p> <p class="Poem2">గుహాః పులిన్దాః శబరా శ్చూచుకా మద్రకైఃసహ. 42 </p> <p class="Tat">దక్షిణాపథమున జన్మించినవారు ఆంధ్రకులు, గుహులు, పుళిందులు, శబరులు, చూచుకులు, మద్రులు - వీరు నిరపేక్షులు. </p> <p class="Poem-1">ఉత్తరాపథజన్మానః కీర్తయిష్యామి తా న పి, </p> <p class="Poem2">యౌన కాంబోజ గాన్ధారాః కిరాతా బర్బరైః సహ. 43 </p> <p class="Tat">ఉత్తరాపథమున జన్మించినవారిలో అట్టివారిని గూర్చి చెప్పెదను. యౌనులు, కాంబోజులు, గాంధారులు, కిరాతులు, బర్బరులు. </p> <p class="Poem-1">ఏతే పాప కృత స్తాత చరన్తి పృథివీ మిమామ్, </p> <p class="Poem2">శ్వపాకబల గృధ్రాణాం సధర్మాణో నరాధిప. 44 </p> <p class="Tat">నాయనా! వీరందరు పాప కార్యములు చేయుచు ఈభూమిలో తిరుగు చుందురు. కుక్కమాంసము తినువారు, రాబందులు, గ్రద్దలు అనువానితో సమానులగు వారు. </p> <p class="Poem-1">నైతే కృతయుగే తాత చరన్తి పృథివీ మిమామ్,</p> <p class="Poem2">త్రేతాప్రభృతి వర్ధనే తే జనా భరతర్షభ. 45 </p> <p class="Tat">భరతవరేణ్యా! ఇట్టివారు కృతయుగమున ఈభూమియందు తిరుగాడలేదు. త్రేత మొదలుకొని ఇట్టివారు పెరుగజొచ్చిరి. </p> <p class="Poem-1">తత స్తస్మిన్ మహాఘోరే సన్ధ్యాకాల ఉపస్థితే, </p> <p class="Poem2">రాజానః సమసజ్జన్త సమాసాద్యేత రేతరమ్. 46 </p> <p class="Tat">అంత ఆమహాఘోరమగు సంధికాలము (త్రేతాద్వాపరముల నడిమికాలము) దాపురింపగా రాజులు ఒకరినొకరు తలపడి యుద్ధము లొనర్చిరి. </p> <p class="Poem-1">ఏవ మేష కురుశ్రేష్ఠ ప్రాదుర్భూతో మహాత్మనా, </p> <p class="Poem2">దేవం దేవర్షి రాచష్ట నారదః సర్వలోకదృక్. 47 </p> <p class="Tat">కురుశ్రేష్ఠా! మహాత్ముడగు శ్రీకృష్ణునిచేత ఈ విధముగా ఈభూతసృష్టి ఏర్పడెను. సర్వలోకములను దర్శించు దేవర్షి నారదుడు దేవుని గూర్చి దీనిని చెప్పెను. </p> <p class="Poem-1">నారదోఽ ప్యథ కృష్ణస్య పరం మేనే నరాధిప,</p> <p class="Poem2">శాశ్వతత్వం మహాబాహో యథావ దృరతర్షభ. 48 </p> <p class="Tat">మహాబాహూ! నరాధిపా! నారదుడు కృష్ణుని సమున్నతమగు శాశ్వతత్వమును చక్కగా ఉన్నదున్నట్లు భావించెను. </p> <p class="Poem-1">ఏవ మేష మహాబాహుః కేశవః సత్యవిక్రమః, </p> <p class="Poem2">అచిన్త్యః పుణ్డరీకాక్షో నైష కేవల మానుషః 49 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి మోక్ష ధర్మపర్వణి సర్వ <br/>భూతోత్పత్తి కథనే సప్తాధిక ద్విశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">ఇట్లు ఈమహాబాహువు, సత్యవిక్రముడు, పుండరీకాక్షుడు, చింతింపనలవి కానివాడు. ఈకేశవుడు కేవలము మానుషుడు కాడు. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున సర్వభూతోత్పత్తి కథనముగల రెండువందల యేడవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-4">యుధిష్ఠిర ఉవాచ</span> - యుధిష్ఠిరు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">కే పూర్వ మాసన్ పతయః ప్రజానాం భరతర్షభ,</p> <p class="Poem2">కే చర్షయో మహాభాగ దిక్షు ప్రత్యేకశః స్మృతాః. 1 </p> <p class="Tat">మహాభాగా! మునుపు ఆయాదిక్కులయం దొక్కొక్కదానికి ప్రజలకు రాజులెవరైరి? ఋషులెవ్వరు? </p> <p class="Tat"><span class="CharOverride-4">భీష్మ ఉవాచ</span> - భీష్ము డిట్లు పలికెను. </p> <p class="Poem-1">శ్రూయతాం భరతశ్రేష్ఠ యన్మాం త్వం పరిపృచ్ఛసి, </p> <p class="Poem2">ప్రజానాం పతయో యేఽ స్మిన్ దిక్షు యే చర్షయః స్మృతాః. 2 </p> <p class="Tat">భరతశ్రేష్ఠా! నన్ను నీవడిగిన దానిని గురించి వినుము. ఏ దిక్కులందు ప్రజలకు నాథులెవ్వరో, ఋషులెవ్వరో చెప్పెదను. </p> <p class="Poem-1">ఏకః స్వయంభూ ర్భగవా నాద్యో బ్రహ్మా సనాతనః, </p> <p class="Poem2">బ్రహ్మణః సప్త వై పుత్రా మహాత్మానః స్వయంభువః. 3 </p> <p class="Tat">మొట్టమొదటివాడు, తనకు తానై పుట్టినవాడు, సనాతనుడు అగు భగవానుడు బ్రహ్మ ఒక్కడే. ఆతనికి మహాత్ములగు పుత్రులు ఏడుగురు కలరు. </p> <p class="Poem-1">మరీచి రత్ర్యంగిరసౌ పులస్త్యః పులహః క్రతుః, </p> <p class="Poem2">వసిష్ఠ శ్చ మహాభాగః సదృశో వై స్వయంభువా. 4 </p> <p class="Tat">మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, సాక్షాత్తు స్వయంభువున కెనయగు మహాభాగుడు వసిష్ఠుడు - వీరు ఆ యేడుగురు పుత్రులు. </p> <p class="Poem-1">సప్త బ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః, </p> <p class="Poem2">అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి సర్వా నేవ ప్రజాపతీన్. 5 </p> <p class="Tat">ఈ ఏడుగురును బ్రహ్మలని పురాణములందు నిశ్చయము పొందినవారు. ఇటుపై ప్రజాపతులందరిని గూర్చి వక్కాణించెదను. </p> <p class="Poem-1">అత్రి వంశసముత్పన్నో బ్రహ్మయోనిః సనాతనః,</p> <p class="Poem2">ప్రాచీనబర్హి ర్భగవాం స్తస్మా త్ర్పాచేతసో దశ. 6 </p> <p class="Tat">అత్రివంశమున పుట్టినవాడు, బ్రహ్మయే జన్మకారణమైనవాడు, సనాతనుడు అగు భగవానుడు ప్రాచీనబర్హి. అతనినుండి ప్రాచేతసులు పదుగురు జన్మించిరి. </p> <p class="Poem-1">దశానాం తనయ స్త్వేకో దక్షో నామ ప్రజాపతిః, </p> <p class="Poem2">తస్య ద్వే నామనీ లోకే దక్షః క ఇతి చోచ్యతే. 7</p> <p class="Tat">ఆ పదిమందికి దక్షుడను ప్రజాపతి ఒక్కడే కుమారుడు. అతనికి దక్షుడని, 'క' అని రెండు పేర్లు. </p> <p class="Poem-1">మరీచేః కశ్యపః పుత్ర స్తస్య ద్వే నామనీ స్మృతే, </p> <p class="Poem2">అరిష్టనేమి రిత్యేకే కశ్యపేత్యపరే విదుః. 8 </p> <p class="Tat">మరీచికి కశ్యపుడు పుత్రుడు. అతనికి రెండు పేర్లు కలవు. కొందరు అరిష్టనేమి యందురు. మరికొందరు కశ్యపుడని ఎరుగుదురు. </p> <p class="Poem2">అత్రే శ్చైవౌరసః శ్రీమాన్ రాజా సోమశ్చ వీర్యవాన్, 9 </p> <p class="Poem2">సహస్రం యశ్చ దివ్యానాం యుగానాం పర్యుపాసితా.</p> <p class="Tat"> అత్రి ఔరసపుత్రుడు శ్రీమంతుడు, వీర్యవంతుడు, రాజునగు సోముడు. అతడు వేయి దివ్యయుగముల కాలము తపమాచరించెను. </p> <p class="Poem-1">అర్యమా చైవ భగవాన్ యే చాస్య తనయా విభో, </p> <p class="Poem2">ఏతే ప్రదేశాః కథితా భువనానాం ప్రభావనాః. 10 </p> <p class="Tat">ఆర్యముడనియు నొక ప్రజాపతి కలడు. అతడును, అతని కుమారులును ఈ భువనము లన్నింటికి స్రష్టలై పాలించు శీలము కలవారైరి. </p> <p class="Poem-1">శశబిన్దోశ్చ భార్యాణాం సహస్రాణి దశాచ్యుత, </p> <p class="Poem2 ParaOverride-3">ఏకైకస్యాం సహస్రం తు తనయానా మభూ త్తదా. 11 </p> <p class="Tat ParaOverride-1">శశబిందునికి పదివేలమంది భార్యలు గలరు. వారి కొక్కరికి వేయిమంది చొప్పున పుత్రులు కలిగిరి. </p> <p class="Poem-1">ఏవం శతసహస్రాణి దశ తస్య మహాత్మనః, </p> <p class="Poem2 ParaOverride-3">పుత్రాణాం చ న తే కఞ్చి దిచ్ఛంత్యన్యం ప్రజాపతిమ్. 12 </p> <p class="Tat ParaOverride-1">ఇట్లు ఆ మహాత్మునకు పదినూరు వేల సంఖ్యలవారు కుమారులు కలిగిరి. వారిలో ఏ ఒక్కడును ఏ ఒక్కనిని ప్రజాపతిగా ఉండుటకు ఇష్టపడలేదు. </p> <p class="Poem-1">ప్రజా మాచక్షతే విప్రాః పురాణాః శాశబిన్దవీమ్, </p> <p class="Poem2 ParaOverride-3">సవృష్టి వంశ ప్రభవో మహావంశః ప్రజాపతేః. 13 </p> <p class="Tat ParaOverride-1">చక్కని విద్యారహస్యముల నెరిగినపురాణతత్త్వవేత్తలు శశబిందుని సంతానమును గూర్చి చక్కగా చెప్పుకొనుచుందురు. అతడు వృష్ణివంశమునకు మూలకారణమైనవాడు. ఆ ప్రజాపతిది మహావంశము. </p> <p class="Poem-1">ఏతే ప్రజానాం పతయః సముద్దిష్టా యశస్వినః, </p> <p class="Poem2 ParaOverride-2">అతః పరం ప్రవక్ష్యామి దేవాం స్త్రిభువనేశ్వరాన్. 14 </p> <p class="Tat ParaOverride-1">ఈ కీర్తిమంతులు ప్రజాపతులుగా ప్రసిద్ధి కెక్కిరి. అటుపై మూడులోకములకు నేలికలైన దేవులను గూర్చి చెప్పెదను. </p> <p class="Poem-1">భగోఽంశ శ్చార్యమా చైవ మిత్రోఽథ వరుణ స్తథా, </p> <p class="Poem2 ParaOverride-2">సవితా చైవ ధాతా చ వివస్వాంశ్చ మహాబలః. 15 </p> <p class="Poem2 ParaOverride-2">త్వష్టా పూషా తథై వేన్ద్రో ద్వాదశో విష్ణు రుచ్యతే, </p> <p class="Poem2 ParaOverride-2">ఇత్యేతే ద్వాదిశాదిత్యాః కశ్యప స్యాత్మసంభవాః. 16 </p> <p class="Tat ParaOverride-1">భగుడు, అంశుడు, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, సవిత, ధాత, మహాబలుడగు వివస్వంతుడు, త్వష్ట, పూష, ఇంద్రుడు, విష్ణువు - ఈ పన్నిద్దరు కశ్యపుని కుమారులు ఆదిత్యులు. </p> <p class="Poem-1">నాసత్య శ్చైవ దస్రశ్చ స్మృతౌ ద్వా వశ్వినా వపి,</p> <p class="Poem2 ParaOverride-2">మార్తణ స్యాత్మజా వేతా వష్టమస్య మహాత్మనః. 17 </p> <p class="Tat">మహాత్ముడగు ఎనిమిదవ ఆదిత్యుడు మార్తండుని కుమారులు నాసత్యుడు, దస్రుడు అనువారు. వీరిని అశ్వులనియు నందురు. (మార్తండుడే వివస్వంతుడు). </p> <p class="Poem-1">తే చ పూర్వం సురాశ్చేతి ద్వివిధాః పితరః స్మృతాః, </p> <p class="Poem2">త్వష్టు శ్చై వాత్మజః శ్రీమాన్ విశ్వరూపో మహాయశాః. 18 </p> <p class="Tat">వీరును మొదట దేవతలే. పితృదేవతలు రెండు విధములైనవారు. త్వష్టకుమారుడు విశ్వరూపుడు గొప్ప సంపద, గొప్ప కీర్తి కలవాడు. </p> <p class="Poem-1">అజైక పాదహిర్భుధ్న్యో విరూపాక్షోఽథ రైవతః, </p> <p class="Poem2 ParaOverride-2">హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చ సురేశ్వరః.</p> <p class="Poem2">సావిత్రశ్చ జయన్తశ్చ పినాకీ చాపరాజితః, 19 </p> <p class="Tat">అజుడు, ఏకపాత్తు, అహిర్బుధ్న్యుడు, విరూపాక్షుడు, రైవతుడు, హరుడు, బహురూపుడు, దేవతల కీశ్వరుడగు త్ర్యంబకుడు, పావిత్రుడు, జయంతుడు, ఓటమి యెరుగని పినాకి - వీరును త్వష్టకుమారులే. </p> <p class="Poem2">పూర్వమేవ మహాభాగా వసవో ఽష్టౌ ప్రకీర్తితాః. 20 </p> <p class="Tat">మహాభాగులు ఎనమండుగురు వసువులను గూర్చి మునుపే వివరించితిని.</p> <p class="Poem-1">ఏత ఏవంవిధా దేవా మనో రేవ ప్రజాపతేః, </p> <p class="Poem2">తే చ పూర్వం సురా శ్చేతి ద్వివిధాః పితరః స్మృతాః. 21 </p> <p class="Tat ParaOverride-1">ఈ విధమువారగు ఈ దేవతలందరు మనువను ప్రజాపతికి చెందినవారే. వారు, మొదట దేవతలనువారును తరువాత పితృదేవతలుగా పరిగణింపబడుదురు. </p> <p class="Poem-1">శీలయౌవనత స్త్వన్య స్తథాన్యః సిద్ధసాధ్యయోః, </p> <p class="Poem2">ఋభవో మరుతశ్చైవ దేవానాం చోదితో గణః. 22 </p> <p class="Tat">సిద్ధులు సాధ్యులు అను వారిలో మొదటివారి గణము శీలమును బట్టియు, రెండవవారి గణము యౌవనవమును బట్టియు ఏర్పడినవి. దేవతల గణము ఋభువులు, మరుత్తులుగా అయినది. </p> <p class="Poem-1 ParaOverride-1">ఏవ మేతే సమామ్నాతా విశ్వేదేవా స్తథాశ్వినౌ, </p> <p class="Tat ParaOverride-1">ఈ విధముగా వీరు విశ్వదేవులు, అశ్వులుగా పేరుపొందిరి.</p> <p class="Poem-1">ఆదిత్యాః క్షత్రియా స్తేషాం విశశ్చ మరుత స్తథా,</p> <p class="Poem2">అశ్వినౌ తు స్మృతౌ శూద్రౌ తపస్యుగ్రే సమాస్థితౌ. 23 </p> <p class="Tat ParaOverride-1">వారిలో ఆదిత్యులు క్షత్రియులు, మరుత్తులు, వైశ్యులు, తీవ్రమగు తపస్సునందు నెలకొనియున్న అశ్విదేవతలు శూద్రులు. </p> <p class="Poem-1">స్మృతా స్త్వఙ్గిరసో దేవా బ్రాహ్మణా ఇతి నిశ్చయః, </p> <p class="Poem2">ఇత్యేతం సర్వదేవానాం చాతుర్వర్ణ్యం ప్రకీర్తితమ్. 24 </p> <p class="Tat">అంగిరసులగు దేవులు బ్రాహ్మణులుగా స్మరింపబడిరి. ఇది నిశ్చయము. ఈ విధముగా దేవతలందరిలో నాలుగు వర్ణముల ఏర్పాటు చెప్పబడినది.</p> <p class="Poem-1">ఏతాన్ వై ప్రాత రుత్థాయ దేవాన్ యస్తు ప్రకీర్తయేత్, </p> <p class="Poem2">స్వజా దన్యకృతాచ్చైవ సర్వపాపా త్ప్రముచ్యతే. 25 </p> <p class="Tat">ప్రాతఃకాలమున నిద్రలేచి యీ దేవతలను స్తుతింతువాడు తనంతతానుగా గాని యితరుల ప్రేరణతోగాని చేసిన పాపమంతటినుండి పూర్తిగా విడుదల పొందును. </p> <p class="Poem-1">యవక్రీతోఽథ రైభ్యశ్చ అర్వావసు పరావసూ, </p> <p class="Poem2 ParaOverride-2">ఔశిజ శ్చైవ కక్షీవాన్ బలశ్చాఙ్గిరసఃస్మృతః, 26</p> <p class="Poem2 ParaOverride-2">ఋషి ర్మేధాతిథేః పుత్రః కణ్వో బర్హిషద స్తథా.</p> <p class="Poem2">త్రైలోక్యభావనా స్తాత ప్రాచ్యాం సప్తర్షయస్తథా, 27 </p> <p class="Tat">యవక్రీతుడు, రైభ్యుడు, అర్వావసువు, పరావసువు, ఔశిజుడైన కక్షీవంతుడు, అంగిరసుని పుత్రుడు బలుడు. అట్లే మేధాతిథి పుత్రుడు కణ్వుడు, బర్హిషదుడు, మరియు నేడుగురు ఋషులు, మూడు లోకములకు మార్గదర్శకులగు వీరందరు తూర్పుదిక్కున నుండెడివారు. </p> <p class="Poem2 ParaOverride-13">ఉన్ముచో విముచ శ్చైవ స్వస్త్యాత్రేయశ్చ వీర్యవాన్. 28</p> <p class="Poem2 ParaOverride-2">ప్రముచ శ్చేధ్మవాహశ్చ భగవాం శ్చ దృఢవ్రతః,</p> <p class="Poem2 ParaOverride-2">మిత్రా వరుణయోః పుత్ర స్తథాగస్త్యః ప్రతాపవాన్. </p> <p class="Poem2">ఏతే బ్రహ్మర్షయో నిత్య మాస్థితా దక్షిణాం దిశమ్, 29</p> <p class="Tat">ఉన్ముచుడు, విముచుడు, ఇధ్మవాహుడు, భగవంతుడగు దృఢవ్రతుడు, మిత్రావరుణుల కుమారుడును, ప్రతాపము కలవాడునగు అగస్త్యుడు - ఈ బ్రహ్మర్షులు నిత్యము దక్షిణదిక్కునందు నెలకొనియుండిరి. </p> <p class="Poem-1 ParaOverride-5">ఉషంగుః కవషో ధౌమ్యః పరివ్యాధశ్చ వీర్యవాన్. </p> <p class="Poem2">ఏకతశ్చ ద్వితశ్చైవ త్రితశ్చైవ మహర్షయః, 30 </p> <p class="Poem2 ParaOverride-3">అత్రేః పుత్రశ్చ భగవాం స్తథా సారస్వతః ప్రభుః. </p> <p class="Poem2">ఏతే చైవ మహాత్మనః పశ్చిమా మాశ్రితా దిశమ్, 31 </p> <p class="Tat ParaOverride-1">ఉషంగుడు, కవషుడు, ధౌమ్యుడు, శక్తిసంపన్నుడగు పరివ్యాధుడు, ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అను మహర్షులు, అత్రి కుమారుడు సారస్వతుడు - ఈ మహాత్ములు పడమటిదిక్కున నుండిరి. </p> <p class="Poem-1">ఆత్రేయశ్చ వసిష్ఠశ్చ కాశ్యపశ్చ మహానృషిః. </p> <p class="Poem2 ParaOverride-2">గౌతమోఽథ భరద్వాజో విశ్వామిత్రోఽథ కౌశికః, 32</p> <p class="Poem2 ParaOverride-2">తథైవ పుత్రో భగవా నృచీకస్య మహాత్మనః. </p> <p class="Poem2">జమదగ్నిశ్చ సప్తైతే ఉదీచీ మాశ్రితా దిశమ్, 33</p> <p class="Tat ParaOverride-1">ఆత్రేయుడు, వసిష్ఠుడు, మహర్షియగు కాశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, కుశికగోత్రమువాడగు విశ్వామిత్రుడు, మహాత్ముడగు ఋచీకుని పుత్రుడగు జమదగ్ని అను నీ యేడుగురును ఉత్తరదిక్కున ఉండిరి. </p> <p class="Poem2 ParaOverride-13">ఏతే ప్రతిదిశం సర్వే కీర్తితా స్తిగ్మతేజసః 34</p> <p class="Poem2">సాక్షీభూతా మహాత్మానో భువనానాం ప్రభావనాః.</p> <p class="Poem2">ఏవ మేతే మహాత్మానః స్థితాః ప్రత్యేకశో దిశమ్. 35</p> <p class="Tat ParaOverride-1">ప్రతి దిక్కునను ఉన్నవారు, గొప్ప తేజస్సు కలవారునగు ఋషులను గూర్చి చెప్పితిని. వీరు సాక్షిభూతులు, మహాత్ములు. లోకములన్నింటికి గొప్ప సృష్టికర్తలు. ఈ మహాత్ములు ఒక్కొక్కదిక్కునందు ప్రత్యేకముగా నివసించియుండిరి. </p> <p class="Poem-1">ఏతేషాం కీర్తనం కృత్వా సర్వపాపా త్ప్రముచ్యతే, </p> <p class="Poem2 ParaOverride-2">యస్యాం యస్యాం దిశి హ్యేతే తాం దేశం శరణం గతః</p> <p class="Poem2">ముచ్యతే సర్వపాపేభ్యః స్వస్తిమాం శ్చ గృహాన్ వ్రజేత్. 36</p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మ పర్వణి <br/>దిశాస్వస్తికం నామ అష్టాధిక ద్విశతతమోఽధ్యాయః</span> </p> <p class="Tat">వీరిని స్తుతించి మనుజుడు సర్వపాపములనుండియు ముక్తినందును. ఏయే దిక్కునందున్న వారిని ఆయాదిక్కునందు శరణము పొందినవాడు, సర్వపాపములనుండి విముక్తి పొందినవాడు, శుభములు కలవాడునై గృహముల కరుగును. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున దిశాస్వస్తికమను<br/>రెండువందల యెనిమిదవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-4">యుధిష్ఠిర ఉవాచ</span> - యుధిష్ఠిరు డిట్లనెను. </p> <p class="Poem-1">పితామహ మహాప్రాజ్ఞ యుధి సత్యపరాక్రమ, </p> <p class="Poem2">శ్రోతు మిచ్ఛామి కార్త్న్న్యేన కృష్ణ మవ్యయ మీశ్వరమ్. 1 </p> <p class="Tat">తాతా! మహాప్రజ్ఞాశాలీ! యుద్ధమున సత్యపరాక్రమముగల వీరుడా! అవ్యయుడు, ఈశ్వరుడునగు శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా వినగోరుచున్నాను. </p> <p class="Poem-1">యచ్చాస్య తేజః సుమహ ద్యచ్చ కర్మ పరాకృతమ్,</p> <p class="Poem2">తన్మే సర్వం యథాతత్త్వం బ్రూహి త్వం పురుషర్షభ. 2 </p> <p class="Tat">మిక్కిలి మహిమగల ఈతని తేజమెట్టిదో, పూర్వ మీత డేయే మహాకార్యములను చేసెనో అది యంతయు తత్త్వవ్యాఖ్యానపూర్వకముగా నాకు చెప్పుము. </p> <p class="Poem-1">తిర్యగ్యోని గతో రూపం కథం ధారితవాన్ ప్రభుః, </p> <p class="Poem2">కేన కార్యనిసర్గేణ తమాఖ్యాహి మహాబల. 3 </p> <p class="Tat">ఈ ప్రభుడు ఏపని సంబంధముతో పశుపక్ష్యాదుల కడుపున పుట్టిన రూపమును ఎందుకు ధరించెనో, ఓ మహాబలా! దానిని నాకు చక్కగా వక్కాణింపుము. </p> <p class="Tat"><span class="CharOverride-4">భీష్మ ఉవాచ </span>- భీష్ము డిట్లు చెప్పెను. </p> <p class="Poem-1">పురాఽహం మృగయాం యాతో మార్కండేయాశ్రమే స్థితః,</p> <p class="Poem2">తత్రాపశ్యం మునిగణాన్ సమాసీనాన్ సహస్రశః. 4 </p> <p class="Tat">మునుపొకనాడు నేను వేటకై వెళ్లి మార్కండేయాశ్రమమున నుంటిని. అందు వేలకొలది సంఖ్యలలో ఆసీనులై యున్న మునిగణములను చూచితిని. </p> <p class="Poem-1">తతస్తే మధుపర్కేణ పూజాం చక్రు రథో మయి,</p> <p class="Poem2">ప్రతిగృహ్య చ తాం పూజాం ప్రత్యనన్ద మృషీ నహమ్. 5 </p> <p class="Tat">అంత ఆ ఋషులు మధుపర్కముతో నాయందు మన్నన గావించిరి. నేనా పూజను గ్రహించి మరల ఆ ఋషులను గౌరవించితిని. </p> <p class="Poem-1">కథైషా కథితా తత్ర కశ్యపేన మహర్షిణా, </p> <p class="Poem2">మనః ప్రహ్లాదినీం దివ్యాం తా మిహైకమనాః శృణు. 6 </p> <p class="Tat ParaOverride-1">అచట కశ్యపమహర్షి నాకీ కథను చెప్పెను. మనస్సున పరమానందము కలిగించు దివ్యమైన ఆ కథను దానియందే మనసునిలుపుకొని వినుము. </p> <p class="Poem-1">పురా దానవముఖ్యా హి క్రోధలోభ సమన్వితాః,</p> <p class="Poem2 ParaOverride-2">బలేన మత్తాః శతశో నరకాద్యా మహాసురాః. 7</p> <p class="Poem2 ParaOverride-2">తథైవ చాన్యే బహవో దానవా యుద్ధ దుర్మదాః,</p> <p class="Poem2">న సహన్తే స్మ దేవానాం సమృద్ధిం తా మనుత్తమామ్. 8 </p> <p class="Tat ParaOverride-1">పూర్వము క్రోధము, లోభము పై కొన్న దానవశ్రేష్ఠులు కొందరు బలముతో మదించినవారు నరకుడు మొదలగువారు, యుద్ధమున ఒడలెరుగనివారు వందలకొలదిగా దేవతల మిక్కిలి శ్రేష్ఠమగు ఆ సమృద్ధిని చూచి ఓర్వలేకుండిరి. </p> <p class="Poem-1">దానవై రర్ద్యమానాస్తు దేవా దేవర్షయస్తథా, </p> <p class="Poem2">న శర్మ లేభిరే రాజన్ విశమానా స్తత స్తతః. 9 </p> <p class="Tat ParaOverride-1">దానవులు పీడించుచుండగా దేవతలు, దేవర్షులును సుఖమును పొందనివారై యందందు చొరబారుచుండిరి. </p> <p class="Poem-1">పృథివీ మార్తరూపాం తే సమపశ్యన్ దివౌకసః,</p> <p class="Poem2">దానవై రభిసంస్తీర్ణాం ఘోరరూపై ర్మహాబలై. 10 </p> <p class="Tat ParaOverride-1">ఆ రక్కసులు పిక్కటిల్లిన బలముతో, ఘోరములైన రూపములతో భూమి నంతటిని ఆక్రమించుకొనియుండగా స్వర్గవాసులగు దేవతలు కుమిలి పోవుచున్న భూమిని పరిశీలనతో చూచిరి. </p> <p class="Poem-1">భారార్తా మప్రహృష్టాం చ దుఃఖితాం సంనిమజ్ఞతామ్,</p> <p class="Poem2">అథాదితేయాః సంత్రస్తా బ్రహ్మాణ మిద మబ్రువన్. 11 </p> <p class="Tat ParaOverride-1">భారముతో పీడనొందినది, ఏ మాత్రము హృదయ వికాసము లేనిది, దుఃఖముతో కుమిలిపోవుచున్నది. క్రుంగిపోవుచున్నది యగు భూమిని చూచి ఆదిత్యులు నిండు భయము కలవారై బ్రహ్మతో నిట్లు పలికిరి. </p> <p class="Poem-1">కథం శక్ష్యామహే బ్రహ్మన్ దానవై రభిమర్దనమ్, </p> <p class="Poem2">స్వయంభూ స్తానువా చేదం నిసృష్టోఽత్ర విధి ర్మయా. 12</p> <p class="Tat">బ్రహ్మదేవా! ఈ రాక్షసుల మహాపీడ నెట్లు సహింపగలము? - అనగా బ్రహ్మ దీనికొక ఏర్పాటు నేను చేసియుంచితి నని పలికెను. </p> <p class="Poem-1">తే వరేణాభిసంపన్నా బలేన చ మదేన చ, </p> <p class="Poem2">నావబుధ్యన్తి సంమూఢా విష్ణు మవ్యక్తదర్శనమ్. 13</p> <p class="Tat">వారు వరముతో, బలముతో, మదముతో తెగబలిసినవారై ఒడలెరుగక వ్యక్తము కాని దర్శనము గల విష్ణుని తెలియజాలకుండిరి. </p> <p class="Poem-1">వరాహరూపిణం దేవ మధృష్య మమరై రపి,</p> <p class="Poem2">ఏష వేగేన గత్వా హి యత్ర తే దానవాధమాః. 14</p> <p class="Poem2">అన్తర్భూమిగతా ఘోరా నివసన్తి సహస్రశః,</p> <p class="Poem2">శమయిష్యతి తచ్ఛ్రుత్వా జహృషుః సురసత్తమాః. 15 </p> <p class="Tat">ఆ విష్ణువు వరాహరూపము కలవాడు. అమరులకును అణప నలవికాడు. అట్టివానిని వీరెరుగరు. అతడు వేగముతో నరిగి భూమిలోపల ఘోరరూపములతో వేలకొలదిగా నున్న ఆ దానవాధములను అణచివేయును - అని చెప్పగా విని దేవతలందరు హర్షము నొందిరి. </p> <p class="Poem-1">తతో విష్ణు ర్మహాతేజా వారాహం రూప మాస్థితః,</p> <p class="Poem2">అన్తర్భూమిం సంప్రవిశ్య జగామ దితిజాన్ ప్రతి. 16 </p> <p class="Tat">అంత గొప్పతేజస్సుగలవిష్ణువు వరాహరూపమును తాల్చి భూమిలోనికి చొచ్చుకొనిపోయి ఆ రాక్షసులపైకి వెడలెను. </p> <p class="Poem-1">దృష్ట్వా చ సహితాః సర్వే దైత్యాః సత్త్వ మమానుషమ్,</p> <p class="Poem2">ప్రసహ్య తరసా సర్వే సంతస్థుః కాలమోహితాః. 17 </p> <p class="Tat">దివ్యమైన ఆ సత్త్వగుణపూర్ణుడగు విష్ణువును గాంచి ఆ దైత్యులందరు ఒక్కుమ్మడిగా కాలమోహితులై వడివడిగా ఒక్క పెట్టున నాశమొందిరి.</p> <p class="Poem-1">తతస్తే సమభిద్రుత్య వరాహం జగృహుః సమమ్, </p> <p class="Poem2">సంక్రుద్ధాశ్చ వరాహం తం వ్యకర్షన్త సమస్తతః. 18 </p> <p class="Tat">అంత వారందరు వరాహస్వామి పై బడి ఒక్కమారుగా పట్టుకొనిరి. క్రోధము పైకొన్నవారై అన్నివైపులనుండి ఆ స్వామిని గుంజసాగిరి. </p> <p class="Poem-1">దానవేన్ద్రా మహాకాయా మహావీర్యబలోచ్ఛ్రితాః,</p> <p class="Poem2">నాశక్నువంశ్చ కిఞ్చిత్తే తస్య కర్తుం తదా విభో. 19 </p> <p class="Tat">ఆ దానవేంద్రులు పెద్దపెద్దకాయములు కలవారు. గొప్ప పరాక్రమము, బలము పొంగు లెత్తుచున్నవారు అయినను ఆ స్వామికి ఏ కొంచెమును కీడు చేయజాలనివారైరి. </p> <p class="Poem-1">తతోఽ గచ్ఛ న్విస్మయం తే దానవేన్ద్రా భయం తథా,</p> <p class="Poem2">సంశయం గత మాత్మానం మేనిరే చ సహస్రశః 20 </p> <p class="Tat">అంత నా దానవేంద్రులందరు వేలకొలది అచ్చెరువందిరి. భయపడిరి. తమ విషయమున సంశయమును భావించిరి. </p> <p class="Poem-1">తతో దేవాధిదేవః స యోగాత్మా యోగసారథిః,</p> <p class="Poem2 ParaOverride-2">యోగ మాస్థాయ భగవాం స్తదా భరతసత్తమ. 21</p> <p class="Poem2 ParaOverride-2">విననాద మహానందం క్షోభయన్ దైత్యదానవాన్, </p> <p class="Poem2">సన్నాదితా యేన లోకాః సర్వాశ్చైవ దిశో దశ. 22</p> <p class="Tat">అంత దేవులకు అధిదేవుడు, యోగాత్ముడు, యోగసారథియయిన ఈ భగవంతుడు యోగమును పూన్చుకొని దైత్యులను దానవులను క్షోభ పెట్టుచు ఒక మహానాదమును గావించెను. దానితో లోకములన్నియు, దిక్కులన్నియు మ్రోగిపోయెను. </p> <p class="Poem-1">తేన సన్నాదశబ్దేన లోకానాం క్షోభ ఆగమత్, </p> <p class="Poem2">సంత్రస్తాశ్చ భృశం లోకే దేవాః శక్ర పురోగమాః. 23 </p> <p class="Tat">ఆ పెటపెటలాడు శబ్ధముతో లోకములకు క్షోభ కలిగెను. దేవేంద్రునితో పాటు దేవతలందరు మిక్కిలిగా భయపడిరి. </p> <p class="Poem-1">నిర్విచేష్టం జగ చ్చాపి బభూ వాతిభృశం తదా,</p> <p class="Poem2">స్థావరం జఙ్గమం చైవ తేన నాదేన మోహితమ్. 24 </p> <p class="Tat">జగత్తంతయు మిక్కిలిగా చేష్టలుడిగినదాయెను. ఆ నాదముతో స్థావరము జంగమము అయిన సమస్తము ఒడలెరుగని స్థితికి వచ్చెను. </p> <p class="Poem-1">తత స్తే దానవాః సర్వే తేన నాదేన భీషితాః, </p> <p class="Poem2">పేతు ర్గతాసవశ్చైవ విష్ణు తేజః ప్రమోహితాః. 25 </p> <p class="Tat">అంత నా దానవులందరు ఆ నాదముతో భయపడిపోయిరి. విష్ణుతేజస్సుతో మోహమందిన వారై ప్రాణములు కోల్పడి నేలకొరిగిరి. </p> <p class="Poem-1">రసాతలగత శ్చాపి వరాహ స్త్రిదశ ద్విషామ్, </p> <p class="Poem2">ఖురై ర్విదారయామాస మాంస మేదోఽస్థి సంచయాన్. 26 </p> <p class="Tat">ఆ వరాహము రసాతలమునకు కూడ నరిగి దేవతల పగవారగు రాక్షసుల మాంసములను, మేదస్సును, ఎముకల ప్రోగులను గిట్టలతో చీల్చి చెండాడెను. </p> <p class="Poem-1">నాదేన తేన మహతా సనాతన ఇతి స్మృతః,</p> <p class="Poem2">పద్మనాభో మహాయోగీ భూతాచార్యః స భూతరాట్. 27 </p> <p class="Tat">ఆ మహానాదముచేత మహాయోగి, భూతాచార్యుడు, భూతరాట్టు అయిన పద్మనాభుడు సనాతనుడని తలపులందాడెను. </p> <p class="Poem-1">తతో దేవగణాః సర్వే పితామహ ముపాద్రవన్, </p> <p class="Poem2">తత్ర గత్వా మహాత్మాన మూచు శ్చైవ జగత్పతిమ్. 28 </p> <p class="Tat">అంత దేవతల గుంపులన్నియు బ్రహ్మకడకు పరువు లెత్తెను. అందరిగి జగత్పతియగు ఆ మహాత్మునితో నిట్లు పలికిరి. </p> <p class="Poem-1">నాదోఽయం కీదృశో దేవ నైతం విద్మ వయం ప్రభో, </p> <p class="Poem2">కోఽసౌ హి కస్య వా నాదో యేన విహ్వలితం జగత్. 29 </p> <p class="Tat">ప్రభూ! ఇది యెట్టి నాదమో మేమెరుగకున్నాము. ఇది యేమి? ఎవనిది? దీనితో జగమంతయు కళవళ పడిపోయినది. </p> <p class="Poem-1">దేవాశ్చ దానవా శ్చైవ మోహితా స్తస్య తేజసా . </p> <p class="Tat">దేవతలు దానవులు నందరు దాని తేజస్సుతో మోహితులైరి. </p> <p class="Poem2">ఏతస్మి న్నన్తరే విష్ణు ర్వారాహం రూప మాస్థితః, </p> <p class="Poem2">ఉదతిష్ఠ న్మహాబాహో స్తూయామానో మహర్షిభిః. 30 </p> <p class="Tat">ఇంతలో విష్ణువు వరాహరూపమును తాల్చి మహర్షులందరు కొనియాడుచుండగా పైకి లేచెను. </p> <p class="Tat"><span class="CharOverride-4">పితామహ ఉవాచ</span> - బ్రహ్మ యిట్లు పలికెను. </p> <p class="Poem-1">నిహత్య దానవ పతీన్ మహావర్ష్మా మహాబలః, </p> <p class="Poem2">ఏష దేవో మహాయోగీ భూతాత్మా భూతభావనః. 31 </p> <p class="Poem2">సర్వ భూతేశ్వరో యోగీ ముని రాత్మా తథా ఽఽ త్మనః,</p> <p class="Poem2">స్థిరీభవత కృష్ణోఽయం సర్వ విఘ్న వినాశనః. 32 </p> <p class="Tat">ఈ మహాకాయము గలవాడు, గొప్పబలము కలవాడు, మహాయోగి, భూతాత్ముడు, భూతములను భావించువాడు (రక్షించువాడు) సర్వభూతేశ్వరుడు, యోగి, ముని, ఆత్మమునకు ఆత్మయైనవాడు, సర్వవిఘ్నములను రూపుమాపువాడునగు నీతడు కృష్ణుడు. మీ రందరు కుదురుగా నుండుడు. </p> <p class="Poem-1">కృత్వా కర్మాతి సాధ్వేత దశక్య మమిత ప్రభః, </p> <p class="Poem2 ParaOverride-13">సమాయాతః స్వమాత్మానం మహాభాగో మహాద్యుతిః. 33 </p> <p class="Tat">మిక్కిలి సాధువైన, ఇతరులకు చేయనలవి కాని ఈ కార్యమును చేసి అవధులు లేని కాంతులు గల ఈ మహానుభావుడు, గొప్ప వర్చస్సు గలవాడు ఈ స్వామి తన రూపమును పొందుచున్నాడు. </p> <p class="Poem-1">పద్మనాభో మహాయోగీ మహాత్మా భూతభావనః, </p> <p class="Poem2">న సంతాపో నభీః కార్యా శోకో వాసురసత్తమాః. 34 </p> <p class="Tat">ఈతడు పద్మనాభుడు మహాయోగి మహాత్ముడు భూతముల నెల్ల కాపాడువాడు. దేవతోత్తములారా! మీరు సంతాపము పొందకుడు. భయము వలదు. దుఃఖము పడకుడు. </p> <p class="Poem-1">విధి రేష ప్రభావశ్చ కాలః సంక్షయ కారకః, </p> <p class="Poem2">లోకాన్ ధారయతా తేన నాదో ముక్తో మహాత్మనా. 35 </p> <p class="Tat">ఈతడు విధి. ప్రభావము కలవాడు. సర్వమును లయము చేయు కాల స్వరూపుడు. ఈ లోకముల నన్నింటిని పట్టి నిలుపు ఈ మహాత్ముడు ఈ నాదమును వెలువరించెను. </p> <p class="Poem-1">స ఏష హి మహాబాహుః సర్వలోకన మస్కృతః,</p> <p class="Poem2">అచ్యుతః పుండరీకాక్షః సర్వభూతాది రీశ్వరః. 36</p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి <br/>అన్తర్భూమివిక్రీడనం నామ నవాధిక ద్విశతతమోఽధ్యాయః </span></p> <p class="Tat">ఈ జీవాత్మ స్వరూపుడే మహాబాహువు, సర్వలోకముల నమస్కారములు పొందువాడు, అచ్యుతుడు, పద్మములవంటి కన్నులతో అలరారువాడు. సర్వభూతములకు మొదటివాడు ఈశ్వరుడు. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున అంతర్భూమివిక్రీడనమను రెండువందల తొమ్మిదవ అధ్యాయము. </p> <p class="Tat"><span class="CharOverride-4">యుధిష్ఠిర ఉవాచ </span>- యుధిష్ఠిరు డిట్లు పలికెను. </p> <p class="Poem-1">యోగం మే పరమం తాత మోక్షస్య వద భారత,</p> <p class="Poem2">తమహం తత్త్వతో జ్ఞాతు మిచ్ఛామి వదతాం వర. 1</p> <p class="Tat">తాతా! భారతా! వాగ్విశారదా! నాకు పరమమైన మోక్ష సంబంధమగు యోగమును గూర్చి పలుకుము. నేను దానిని తత్త్వ పూర్వకముగా తెలియ గోరుచున్నాను. </p> <p class="Tat"><span class="CharOverride-4">భీష్మ ఉవాచ</span> - భీష్ము డిట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-6">అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్, </p> <p class="Poem2 ParaOverride-2">సంవాదం మోక్షసంయుక్తం శిష్యస్య గురుణా సహ. 2 </p> <p class="Tat">ఇందును ఒక ప్రాతకాలపు ఇతిహాసమును ఉదాహరింతురు. మోక్ష సంబంధముగా ఇది శిష్యునకు గురువుతోనైన సంవాదము. </p> <p class="Poem-1 ParaOverride-14">కశ్చి బ్రాహ్మణ మాసీన మాచార్య మృషి సత్తమమ్, </p> <p class="Poem2 ParaOverride-2">తేజోరాశిం మహాత్మానం సత్యసంధం జితేన్ద్రియమ్. 3 </p> <p class="Poem2 ParaOverride-2">శిష్యః పరమమేధావీ శ్రేయోఽ ర్థీ సుసమాహితః,</p> <p class="Poem2 ParaOverride-2">చరణా వుపసంగృహ్య స్థితః ప్రాంజలి రబ్రవీత్. 4</p> <p class="Tat ParaOverride-6">చక్కగా కూర్చున్నవాడు, ఋషులలో శ్రేష్ఠుడు, తేజస్సులకు రాశి, మహాత్ముడు, సత్యసంధుడు, జితేంద్రియుడు నగు ఒక ఆచార్యుని కడకు గొప్ప ప్రజ్ఞ కలవాడు, శ్రేయమును కోరువాడు, స్థిరచిత్తము కలవాడునగు ఒక శిష్యు డరుదెంచి పాదముల నంటి నమస్కరించి చేతులు జోడించి యిట్లు పలికెను. </p> <p class="Poem-1">ఉపాసనాత్ ప్రసన్నోఽసి యది వై భగవ న్మమ,</p> <p class="Poem2">సంశయో మే మహాన్ కశ్చి త్తన్మే వ్యాఖ్యాతు మర్హసి, 5</p> <p class="Poem2">కుత శ్చాహం కుతశ్చ త్వం తత్సమ్యగ్ బ్రూహి యత్పరమ్</p> <p class="Tat">భగవంతుడా! నా ఉపాసనవలన నీవు ప్రసన్నుడవైనచో,నాకొక పెద్ద సంశయము కలదు. దీనిని నీవు వివరించి చెప్పవలయును. నేనెటనుండి వచ్చితిని? నీవెటనుండి వచ్చితివి? పరమైనదేది? దానిని నాకు చక్కగా తెలియజెప్పుము. </p> <p class="Poem-1">కథం చ సర్వభూతేషు సమేషు ద్విజసత్తమ, </p> <p class="Poem2">సమ్య గ్వృత్తా నివర్తన్తే విపరీతాః క్షయోదయాః. 6 </p> <p class="Tat">ద్విజసత్తమా! భూతములన్నియు సమములే అయినపుడు చక్కగా సాగవలసిన తరుగుదల, పెరుగుదల అను విపరీతస్థితు లెట్లేర్పడును? </p> <p class="Poem-1">వేదేషు చాపి యద్వాక్యం లౌకికం వ్యాపకం చ యత్, </p> <p class="Poem2">ఏత ద్విద్వన్ యథాతత్త్వం సర్వం వ్యాఖ్యాతు మర్హసి. 7 </p> <p class="Tat">వేదములందును లౌకికము, వ్యాపకము అయిన వాక్యము కలదు. విద్వాంసుడా! దీనిని గూర్చి మూలముట్టుగా అంతయు నాకు వివరింపుము. </p> <p class="Prati"><span class="CharOverride-6">గురు రువాచ</span> - గురు విట్లు పలికెను. </p> <p class="Poem-1 ParaOverride-6">శృణు శిష్య మహాప్రాజ్ఞ బ్రహ్మ గుహ్య మిదం పరమ్, </p> <p class="Poem2">అధ్యాత్మం సర్వవిద్యానా మాగమానాం చ యద్వసు. 8 </p> <p class="Tat">ఓయి బుద్ధిశాలీ! శిష్యా! వినుము. ఇది వేదము నందలి శ్రేష్ఠమగు రహస్యము. ఈ అధ్యాత్మజ్ఞానము సర్వ విద్యలయు, ఆగమములయు ధనము. </p> <p class="Poem-1">వాసుదేవః పర మిదం విశ్వస్య బ్రహ్మణో ముఖమ్, </p> <p class="Poem2 ParaOverride-3">సత్యం జ్ఞాన మథో యజ్ఞ స్తితిక్షా దమ ఆర్జవమ్. 9 </p> <p class="Tat">ఇది సమస్తమైన వేదమునకు ముఖము. శ్రేష్ఠము. సత్యము, జ్ఞానము, యజ్ఞము, తితిక్ష, దమము, ఆర్జవము ఇదియంతయు వాసుదేవుడే. </p> <p class="Poem-1 ParaOverride-6">పురుషం సనాతనం విష్ణుం యం తం వేదవిదో విదుః </p> <p class="Poem2">సర్గ ప్రళయ కర్తార మవ్యక్తం బ్రహ్మ శాశ్వతమ్. 10 </p> <p class="Tat">పురుషుడు, సనాతనుడు, విష్ణువు అని వేదతత్త్వ మెరిగిన వా రెవనిని భావింతురో ఆ తత్త్వము అవ్యక్తము, శాశ్వతమగు బ్రహ్మము. ఆదియే సృష్టికి ప్రళయమునకు కర్త. </p> <p class="Poem-1 ParaOverride-5">తదిదం బ్రహ్మ వార్ష్ణేయ మితిహాసం శృణుష్వ మే, </p> <p class="Poem2 ParaOverride-11">బ్రాహ్మణో బ్రాహ్మణైః శ్రావ్యో రాజన్యః క్షత్రియై స్తథా. 11 </p> <p class="Poem2 ParaOverride-3">వైశ్యో వైశ్యై స్తథా శ్రావ్యః శూద్రైః శూద్రో మహామనాః</p> <p class="Poem2">మాహాత్మ్యం దేవదేవస్య విష్ణో రమితతేజసః. 12 </p> <p class="Tat">ఆ యీ వార్ష్ణే యమను వేదరూపమైన ఇతిహాసమును నానుండి వినుము. బ్రాహ్మణుడు బ్రాహ్మణులతో, క్షత్రియుడు క్షత్రియులతో, వైశ్యుడు వైశ్యులతో, దొడ్డబుద్ధిగల శూద్రుడు శూద్రులతో కలిసి వాసుదేవుని తత్త్వమును వినవలయును. దేవదేవుడు, పట్టనలవికాని తేజస్సుగల వాడునగు ఈ విష్ణుని మాహాత్మ్యమును ఆకర్ణింపవలయును. </p> <p class="Poem-1">అర్హస్త్వమసి కల్యాణం వార్ష్ణేయం శృణు యత్పరమ్,</p> <p class="Poem2">కాలచక్ర మనాద్యన్తం భావాభావస్వలక్షణమ్. 13 </p> <p class="Tat ParaOverride-6">మంగళము పరమమగు కాలచక్రము, తుది మొదళ్లు లేనిది, సృష్టి ప్రళయములు స్వరూపలక్షణముగా గలది యగు వార్ష్ణేయతత్త్వమును అర్హుడవగు నీవు వినుము. </p> <p class="Poem-1">త్రైలోక్యం సర్వ భూతేశే చక్రవ త్పరివర్తతే, </p> <p class="Poem2 ParaOverride-2">యత్తదక్షర మవ్యక్త మమృతం బ్రహ్మ శాశ్వతమ్. </p> <p class="Poem2">వదన్తి పురుషవ్యాఘ్ర కేశవం పురుషర్షభమ్ 14 </p> <p class="Tat ParaOverride-6">సర్వ భూతములకు ప్రభువగు నాతనియందు మూడులోకములు చక్రమువలె తిరుగుచున్నవి. అక్షరము, అవ్యక్తము, అమృతము, బ్రహ్మము, శాశ్వతము అగు తత్త్వముగా పురుష శ్రేష్ఠుడగు కేశవుని పలుకుదురు. </p> <p class="Poem-1 ParaOverride-5">పితౄన్ దేవా నృషీం శ్చైవ తథా వై యక్షరాక్షసాన్,</p> <p class="Poem2">నాగాసురమనుష్యాంశ్చ సృజతే పరమోఽ వ్యయః. 15 </p> <p class="Tat ParaOverride-6">పితృదేవతలను, దేవతలను, ఋషులను, యక్షులను, రాక్షసులను, నాగులను, అసురులను, మనుష్యులను ఆ పరముడు, అవ్యయుడు నగు వాసుదేవుడు సృజించుచున్నాడు. </p> <p class="Poem-1">తథైవ వేదశాస్త్రాణి లోకధర్మాం శ్చ శాశ్వతాన్, </p> <p class="Poem2">ప్రలయం ప్రకృతిం ప్రాప్య యుగాదౌ సృజతే పునః, 16 </p> <p class="Tat">అట్లే వేదములను, శాస్త్రములను, శాశ్వతములగు లోకధర్మములను, ప్రళయమును, ప్రకృతిని పొంది మరల యుగము మొదట సృజించును. </p> <p class="Poem-1">యథార్తా వృతు లిఙ్గాని నానారూపాణి పర్యయే,</p> <p class="Poem2">దృశ్యన్తే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు. 17 </p> <p class="Tat">ఋతువునందు ఋతువు గుర్తులు పెక్కు విధములుగా ఒకప్పుడిది ఒకప్పుడది యన్నట్లు కానవచ్చును. అట్లే యుగాదులయందు భావములును కానవచ్చును. </p> <p class="Poem-1">అథ యద్యద్యదా భాతి కాలయోగా ద్యుగాదిషు, </p> <p class="Poem2">తత్త దుత్పద్యతే జ్ఞానం లోకయాత్రావిధానజమ్. 18 </p> <p class="Tat">కాలయోగమువలన యుగాదులయందు ఏది ఏది యెప్పుడు ప్రకాశించునో లోకయాత్రకు సంబంధించిన విధానమువలన ఏర్పడిన ఆయాజ్ఞానము అప్పుడప్పుడు కలుగుచుండును. </p> <p class="Poem-1">యుగాన్తేఽ న్తర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః, </p> <p class="Poem2">లేభిరే తపసా పూర్వ మనుజ్ఞాతా స్వయంభువా. 19 </p> <p class="Tat">యుగము తుదిని స్వరూపము తెలియకుండ పోయిన ఇతిహాసములతో కూడిన వేదములను బ్రహ్మ ఉపదేశమును పొందిన మహర్షులు తపస్సుతో మరల పొందిరి. </p> <p class="Poem-1">వేదవి ద్వేద భగవాన్ వేదాఙ్గాని బృహస్పతిః, </p> <p class="Poem2">భార్గవో నీతిశాస్త్రం తు జగాద జగతో హితమ్. 20 </p> <p class="Tat">వేదముల నెరిగిన భగవానుడు బ్రహ్మ శిక్ష మొదలగు వేదాంగములను బృహస్పతి, జగత్తునకు హితమైన నీతి శాస్త్రమును శుక్రాచార్యుడును తెలిసికొని తెలియజెప్పిరి. </p> <p class="Poem-1">గాన్ధర్వం నారదో వేద భరద్వాజో ధనుర్గ్రహమ్, </p> <p class="Poem2">దేవర్షి చరితం గార్గ్యః కృష్ణాత్రేయ శ్చికిత్సితమ్. 21 </p> <p class="Tat">నారదుడు సంగీత విద్యను, భరద్వాజుడు ధనుర్విద్యను, గార్గ్యుడు దేవర్షుల చరిత్రను, కృష్ణాత్రేయుడు వైద్యవిద్యను ఎరిగిరి. </p> <p class="Poem-1">న్యాయతన్త్రాణ్యనేకాని తై స్తై రుక్తాని వాదిభిః,</p> <p class="Poem2">హేత్వా గమసదాచారై ర్యదుక్తం తదుపాస్యతామ్. 22 </p> <p class="Tat">వాదపటిమగల ఆయాబుద్ధిశాలులు ఉపదేశించిన పెక్కు న్యాయతంత్రములను - యుక్తి, వేదము, సదాచారము అను ప్రమాణములలో నిరూపించిన వానిని మానవుడు ఉపాసింపవలయును. </p> <p class="Poem-1">అనాద్యం తత్పరం బ్రహ్మ న దేవా నర్షయో విదుః, </p> <p class="Poem2">ఏక స్తద్వేద భగవాన్ ధాతా నారాయణః ప్రభుః. 23 </p> <p class="Tat">తనకొక కారణమని లేని ఆ పరబ్రహ్మమును దేవతలు, ఋషులును ఎరుగరు. దాని నెరిగినవాడు ఒక్క నారాయణుడు మాత్రమే. అతడే ధాత, ప్రభువు. </p> <p class="Poem-1">నారాయణా దృషి గణా స్తథా ముఖ్యాః సురాసురాః </p> <p class="Poem2">రాజర్షయః పురాణాశ్చ పరమం దుఃఖ భేషజమ్. 24 </p> <p class="Tat">నారాయణునివలన ఋషుల గణములు, అట్లే ముఖ్యులగు దేవతలు రాక్షసులు, పూర్వకాలమువారగు రాజర్షులు దుఃఖమునకు ఔషధమైన ఈ పరమ జ్ఞానమును పొందిరి. </p> <p class="Poem-1">పురుషాధిష్ఠితాన్ భావాన్ ప్రకృతిః సూయతే యదా,</p> <p class="Poem2">హేతుయుక్తమతః పూర్వం జగత్సంపరివర్తతే. 25 </p> <p class="Tat">పురుషుడు ఆలోచించిన భావములను ప్రకృతి వెలువరించునపుడు అంతకు మునుపు హేతువులతో కూడిన జగత్తు చక్కగా రూపు దిద్దుకొనును. </p> <p class="Poem-1">దీపాదన్యే యథా దీపాః ప్రవర్తన్తే సహస్రశః, </p> <p class="Poem2">ప్రకృతిః సూయతే తద్వ దానన్త్యా న్నాపచీయతే. 26 </p> <p class="Tat">ఒక దీపమునుండి వేలకొలది దీపములు వెలుగు పొందును. అదేవిధముగా ప్రకృతి తక్కిన వానిని పుట్టించును. అయినను అనంతత్వము నుండి తరుగువోదు. </p> <p class="Poem-1">అవ్యక్తా త్కర్మజా బుద్ధి రహంకారం ప్రసూయతే, </p> <p class="Poem2">ఆకాశం చాప్యహంకారా ద్వాయు రాకాశ సంభవః. 27</p> <p class="Poem2"> వాయో స్తేజ స్తత శ్చాప అద్భ్యోఽథ వసుధోద్గతా,</p> <p class="Poem2">మూల ప్రకృతయో హ్యష్టా జగదేతా స్వ వస్థితమ్. 28</p> <p class="Tat">అవ్యక్తమను తత్త్వమునుండి కర్మమువలన నేర్పడు బుద్ధి అహంకారమును పుట్టించును. అహంకారమునుండి ఆకాశము పుట్టును. వాయువు ఆకాశము నుండి ఏర్పడినట్టిది. వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలములు, దానినుండి భూమియు ఏర్పడినవి. ఇట్లు మూలప్రకృతులు ఎనిమిది. జగత్తు వీనియందు నెలకొని యున్నది. </p> <p class="Poem-1">జ్ఞానేన్ద్రియా ణ్యతః పఞ్చ పఞ్చ కర్మేంద్రియాణ్యపి, </p> <p class="Poem2">విషయాః పఞ్చ చైకం చ వికారే షోడశం మనః. 29 </p> <p class="Tat">ఆ ప్రకృతినుండి అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అయిదు విషయములు, వాని వికారము నందేర్పడిన పదునారవది యగు మనస్సు వెలువడినవి. </p> <p class="Poem-1">శ్రోత్రం త్వక్చక్షుషీ జిహ్వా ఘ్రాణం జ్ఞానేన్ద్రియాణ్యథ,</p> <p class="Poem2">పాదౌ పాయు రుపస్థశ్చ హస్తౌ వాక్కర్మణీ అపి. 30 </p> <p class="Tat">చెవి, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు అనునవి జ్ఞానేంద్రియములు. కాళ్లు, మలవిసర్జన అవయవము, గుహ్యాంగము, చేతులు, నోరు అనునవి కర్మేంద్రియములు. </p> <p class="Poem-1">శబ్దః స్పర్శం చ రూపం చ రసో గన్ధ స్తథైవ చ, </p> <p class="Poem2">విజ్ఞేయం వ్యాపకం చిత్తం తేషు సర్వగతం మనః 31 </p> <p class="Tat">శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనునవి వ్యాపించు లక్షణము గల చిత్తమని తెలియదగినది. వాని నన్నింటిని చేరుకొనునది మనస్సే. </p> <p class="Poem-1">రసజ్ఞానే తు జిహ్వేయం వ్యాహృతే వాక్ తథోచ్యతే, </p> <p class="Poem2">ఇన్ద్రియై ర్వివిధై ర్యుక్తం సర్వం వ్యక్తం మన స్తథా. 32 </p> <p class="Tat">రసమును ఎరుగునపుడు అదియే (మనస్సే) నాలుక. పలుకునపుడు అదియే వాగింద్రియము. ఇట్లు వేర్వేరు ఇంద్రియములతో కూడినదై సర్వమును వ్యక్తము చేయునది మనస్సే.</p> <p class="Poem-1">విద్యాత్తు షోడశైతాని దైవతాని విభాగశః, </p> <p class="Poem2">దేహేషు జ్ఞాన కర్తార ముపాసీన ముపాసతే. 33 </p> <p class="Tat">ఈ పదునారు దేవతలును విడివిడి స్వరూపములతో దేహములందు స్థిరముగా కూర్చున్న జ్ఞానకర్తను ఉపాసించుచున్నవి. </p> <p class="Poem-1">తద్వత్సోమగుణా జిహ్వా గన్ధస్తు పృథివీ గుణః,</p> <p class="Poem2">శ్రోత్రం నభోగుణం చైవ చక్షు రగ్నే ర్గుణ స్తథా,</p> <p class="Poem2">స్పర్శం వాయుగుణం విద్యా త్సర్వభూతేషు సర్వదా. 34</p> <p class="Tat">నాలుక జలగుణము కలది. వాసన నేలగుణము, చెవి ఆకాశము యొక్క గుణము. కన్ను అగ్నిగుణము. స్పర్శ వాయుగుణము. ఇది సర్వభూతములయందు ఎల్లవేళల ఇట్టిదే. </p> <p class="Poem-1">మనః సత్త్వ గుణం ప్రాహుః సత్వ మవ్యక్తజం తథా, </p> <p class="Poem2">సర్వ భూతాత్మ భూతస్థం తస్మా ద్బుధ్యేత బుద్ధిమాన్. 35 </p> <p class="Tat">మనస్సు సత్వగుణమందురు. సత్వము అవ్యక్తమునుండి పుట్టినది. అందువలన అది సర్వభూతముల ఆత్మగానయిన దానియందున్నదిగా బుద్ధి మంతుడు తెలియవలయును. </p> <p class="Poem-1">ఏతే భావా జగత్సర్వం వహన్తి సచరాచరమ్, </p> <p class="Poem2">శ్రితా విరజసం దేవం య మాహుః ప్రకృతేః పరమ్. 36 </p> <p class="Tat">ఈ భావములు చరాచరములతో కూడిన సర్వజగత్తును తాల్చియున్నవి. ప్రకృతి కావలనున్న రజోగుణ స్పర్శ లేని దేవుని ఆశ్రయించి యున్నవి.</p> <p class="Poem-1">నవద్వారం పురం పుణ్య మేతై ర్భావైః సమన్వితమ్, </p> <p class="Poem2">వ్యాప్య శేతే మహా నాత్మా తస్మాత్పురుష ఉచ్యతే 37 </p> <p class="Tat">ఈ భావములతో కూడి యున్నట్టిది, పుణ్యమైనది తొమ్మిది ద్వారములు కలది యగు పురమును వ్యాపించి శయనించును కనుక ఆ గొప్పది యగు ఆత్మను పురుషుడు అని చెప్పుదురు. </p> <p class="Poem-1">అజరః సోఽ మరశ్చైవ వ్యక్తి వ్యక్తోప దేశవాన్, </p> <p class="Poem2">వ్యాపకః సగుణ: సూక్ష్మః సర్వ భూత గుణాశ్రయః. 38 </p> <p class="Tat">ఆ పురుషుడు అజరుడు, అమరుడు, వ్యక్తము, అవ్యక్తము అని వేదమునందు ఉపదేశము కలవాడు. అంతట వ్యాపించు లక్షణము కలవాడు. గుణముల కలయిక కలవాడు, సూక్ష్మస్వరూపుడు, సర్వ భూతములకు గుణములకు ఆశ్రయమైనవాడు. </p> <p class="Poem-1">యథాదీపః ప్రకాశాత్మా హ్రస్వో వా యది వా మహాన్, </p> <p class="Poem2">జ్ఞానాత్మానం తథా విద్యాత్ పురుషం సర్వ జన్తుషు. 39 </p> <p class="Tat">ప్రకాశించుస్వరూపము గల దీపము పొట్టిదో పొడుగుదో అయి వెలుగు చున్నట్లు సర్వప్రాణులయందును పురుషుడు ఆ విధముగా జ్ఞానస్వరూపుడై యుండునని తెలియదగును. </p> <p class="Poem-1">శ్రోత్రం వేదయతే వేద్యం స శృణోతి స పశ్యతి, </p> <p class="Poem2">కారణం తస్య దేహోఽ యం స కర్తా సర్వకర్మణామ్. 40 </p> <p class="Tat">చెవి దేనితో తెలియదగినదానిని తెలియుచున్నదో అదియే వినుచున్నది దానికి ఈ దేహము కారణము. అదియే సర్వ కర్మములకు కర్త. </p> <p class="Poem-1">అగ్ని ర్దారుగతో యద్వ ద్భిన్నే దారౌ న దృశ్యతే,</p> <p class="Poem2">తథైవాత్మా శరీరస్థో యోగేనైవానుదృశ్యతే. 41 </p> <p class="Tat">కట్టెయందు నిప్పు కలదు. కాని కట్టెను చీల్చినచో అది కనబడదు. అట్లే శరీరమునందున్న ఆత్మ యోగముతో మాత్రమే కానవచ్చును. </p> <p class="Poem-1">అగ్ని ర్యథా హ్యుపాయేన మథిత్వా దారు దృశ్యతే, </p> <p class="Poem2">తథైవాత్మా శరీరస్థో యోగే నై వాత్ర దృశ్యతే. 42 </p> <p class="Tat">కొయ్యను రాపిడి పెట్టుట అను ఉపాయముతో దానియందు అగ్ని కానవచ్చుచున్నది. అట్లే శరీరమునందున్న ఆత్మ యోగము లేని కారణముచే కానరాకున్నది. </p> <p class="Poem-1">నదీ ష్వాపో యథా యుక్తా యథా సూర్యే మరీచయః,</p> <p class="Poem2"> సంతతత్వా ద్యథా యాన్తి తథా దేహాః శరీరిణమ్. 43 </p> <p class="Tat">నదులయందు జలములు, సూర్యునియందు కిరణములు ఎట్లు కూడియుండి అవిచ్ఛిన్నముగా ప్రసరించుచుండునో అట్లే దేహములు ఆత్మను చేరుకొనుచున్నవి. </p> <p class="Poem-1">స్వప్నయోగే యథైవాత్మా ప ఞ్చేన్ద్రియ సమాయుతః, </p> <p class="Poem2">దేహ ముత్సృజ్య వై యాతి తథైవాత్మోపలభ్యతే. 44 </p> <p class="Tat">స్వప్న యోగమున ఆత్మ ఇంద్రియము లైదింటితో కూడినదై దేహమును వదలి వెళ్లిన </p> <p class="Tat">తీరున ఆత్మయు దేహమును వదలి తెలియవచ్చును.</p> <p class="Poem-1">కర్మణా బాధ్యతే రూపం కర్మణా చోపలభ్యతే, </p> <p class="Poem2">కర్మణా నీయతేఽన్యత్ర స్వకృతేన బలీయసా. 45 </p> <p class="Tat">మిక్కిలి బలము కలది, తానై చేసికొన్నది యగు కర్మముతో పూర్వ దేహము చెడును. మరియొక దేహమునకు కొనిపోబడుచున్నది. </p> <p class="Poem-1">సతు దేహా ద్యథా దేహం త్యక్త్వాఽన్యం ప్రతిపద్యతే,</p> <p class="Poem2">తథాఽ న్యం సంప్రవక్ష్యామి భూత గ్రామం స్వకర్మజమ్. 46 </p> <p class="Tat ParaOverride-4"><span class="CharOverride-4">ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మ పర్వణి వార్ష్ణే <br/>యాధ్యాత్మ కథనే దశాధికద్విశతతమోఽ ధ్యాయః</span> </p> <p class="Tat">ఆ ఆత్మ ఒక దేహమును విడిచి మరియొక దేహమును పొందు విధముగా తన కర్మములవలన పుట్టిన భూతసముదాయమును కూడ మరియొక దేహమును చేరుకొనునని చెప్పుదును. </p> <p class="Tat ParaOverride-4">ఇది శ్రీ మహాభారతము శాంతి సర్వమున మోక్షధర్మపర్వమున వార్ష్ణే యాధ్యాత్మకథనము గల రెండువందల పదియవ అధ్యాయము.</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">201</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">మనుబృహస్పతుల సంవాదము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">201</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer ParaOverride-1">1. <span class="CharOverride-1">అక్షరాత్</span> - మాయసహాయముగా గల అక్షరము వలన; </p> <p class="Footer ParaOverride-1"> “నో వ్యోమాపరో యత్” అని సృష్టికి పూర్వము మాయాశబలమైన బ్రహ్మము లేదని చెప్పిరి గదా! అట్టి యెడ అక్షరమునందు మాయాసహాయమైన విశేషణము నుంచుట యెట్లు? అని ఆక్షేపము. నిజమే. “తుచ్చేనాభ్వపిహితం యదాసీత్” అని అచటనే మిగిలిన వాక్యము కలదు. తుచ్ఛమైన మిథ్యగా నయిన, తమస్సుచేత; <span class="CharOverride-1">ఆభు</span> - అంతట వ్యాపించు లక్షణము కలది; <span class="CharOverride-1">అపిహితమ్</span> - కప్పబడినది - అను మాటవలన; తమస్సునకు తుచ్ఛము అను పేరు ఉండుటవలన పరమార్థదృష్టితో సర్పముతో త్రాటికి వలె అక్షరత్వమునకు రెండవదానితో కూడి యుండుట లేదనియే తెలియదగును. ఈ విధముగా తుచ్ఛజ్ఞానముచే ఆవృతమైన అక్షరమువలన ముత్తెపు చిప్పవలన వెండి ఏర్పడినట్లు కన్పట్టు విధమున ఆకాశాదుల ఉత్పత్తి కలిగె నని చెప్పుటలో ఏదోషమును లేదు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">పార్థివైః</span> - పృథివీ భాగముతో ఏర్పడిన శరీరములతో; <span class="CharOverride-1">జలం గత్వా</span> - లవణోదక న్యాయము చేత శరీరము కలవారు జలమున స్వరూపము లేకుండ కలిసిపోయి; (నీటిలో పడిన ఉప్పు కరగిపోవుట వంటి స్థితిని లవణోదక న్యాయ మందురు). ఈ విధముగా సృష్టికి విపరీతక్రమమున సంహారము ఇందు చెప్పబడినది. విపరీతక్రమమనగా క్రింది నుండి పైకి పైకి చేరుకొనుతీరు. తేజసః - అగ్ని నుండి; <span class="CharOverride-1">పవనమ్</span> - గాలిని; <span class="CharOverride-1">తతః</span> - దానినుండి; <span class="CharOverride-1">అన్తరిక్షమ్</span> - ఆకాశమును - చేరుకొని అని అర్థము; అంతరిక్షమనగా పంచభూతములలోని ఆకాశము: <span class="CharOverride-1">ఖాత్</span> - మాయాశబలమైన ఖశబ్దముతో చెప్పబడుదానిని దాటి - అని అర్థము; <span class="CharOverride-1">భావినః </span>ఇచట భావమనగా అక్షరము - అది యెవరికీ ఆత్మస్వరూపముగా నుండునో వారు; <span class="CharOverride-1">న నివర్తన్తి</span> - మరల సంసారమును - అజ్ఞానరూపమైన ప్రపంచమును - పొందరు. మఱియేమన వారు పరమమైన మోక్షమును పొందుదురు.</p> <p class="Footer">3. ఇట్లు పరతత్వము తెలియవచ్చినను ఆది యోగమనెడు ఒక్కదానికే పొందదగినదని చెప్పుటకై లక్షణమును చెప్పుచున్నారు. స్వభావమనగా తెలియువాడు, తెలియబడునది, తెలియుట అను లక్షణములు కలది - అది లేనిది - అస్వభావము. </p> <p class="Footer">4. అయినచో రసము మొదలగువానిని తెలియునది ఏది - అనుప్రశ్నకు సమాధానము చెప్పుచున్నారు., తనుః - త్వగింద్రియము; చర్మము మొదలగు ఇంద్రియములు ఆపరమవస్తువును పట్టుకొనజాలవు. ఏలయన - <span class="CharOverride-1">అవధ్యాత్మవిదః</span> - ఆత్మను గూర్చి ప్రవర్తించునట్టి యోగము అధ్యాత్మము - అది - యెఱుగనివారు.</p> <p class="Footer ParaOverride-1">5. <span class="CharOverride-1">వివర్తయిత్వా</span> - ఇంద్రియములను విషయములనుండి మరలించుట మానవప్రయత్నముచేత సాధ్యము కాదు. గురువు ఉపదేశించిన యుక్తి చేత మాత్రమే సాధ్యమగును. దీనిని వార్తిక మిట్లు చెప్పుచున్నది. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">“శాన్తో దాన్త ఉపరత స్తితిక్షుః సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్’’</span> - 'శాంతుడు, దాంతుడు, ఉపరతుడు, తితిక్షువు, సమాహితుడు నై ఆత్మయందే ఆత్మను దర్శింపవలయును' - అను శ్రుతిని వ్యాఖ్యానించు వార్తికము ఇట్లున్నది. </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">“ స్వాతంత్య్రం యేషు కర్తుః స్యాత్ కరణాకరణం ప్రతి </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">తాన్యేవ తు నిషిద్ధాని కర్మాణీహ శమాదిభి’’</span></p> <p class="Footer ParaOverride-1"> కర్తకు చేయుట, చేయక పోవుట అను విషయమున స్వాతంత్య్రము లేనితనము ఎందు కలదో అవి మాత్రమే శమాదులతో నిషిద్ధములగు కర్మములు. </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">“అస్వాతంత్ర్యం తు యేషు స్యాత్ కర్తుః కర్మసు సర్వదా, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">సమాహితో క్త్యాఽ థేదానీం తన్ని రోధో విధీయతే’’ </span></p> <p class="Footer ParaOverride-1"> ఏపనులయందు ఎల్లవేళల కర్తకు అస్వతంత్రత ఉండునో వాని విషయమున ‘సమాహితము’ అను పేరున వానిని నిరోధించుట విధింపబడు చున్నది. </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">“పిణ్డీకృత్యేన్ద్రియగ్రామం బుద్ధా వారోప్య నిశ్చలమ్, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">విషయాం స్తత్స్మృతీ స్త్యక్త్యా తిష్ఠే చ్చిదనురోధతః’’ </span></p> <p class="Footer ParaOverride-1"> ఇంద్రియముల మందను ముద్దగా చేసి బుద్ధియందారోపించి నిశ్చలముగా నొనర్చి విషయములను, వానిస్మృతులను వదలివైచి చిత్పదార్థము వెంటబడి నిలువవలయును. </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">“ఏషో ఽ భ్యుపాయః సర్వత్ర వేదాన్తేషు ప్రతిష్ఠితః, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">తత్త్వమస్యాది వాక్యోత్థ జ్ఞానోత్పత్త్య ర్థ మాదరాత్’’ </span></p> <p class="Footer ParaOverride-1"> వేదాంతవిషయములందన్నియెడల ఇది చక్కగా కుదురుకొన్న శ్రేష్ఠమగు ఉపాయము. 'తత్త్వమసి' మొదలగువానికంటె పై స్థానమున నుండునట్టి పరమును; స్వమ్ - ప్రత్యగాత్మకంటె వేరుకాని దానిని; <span class="CharOverride-1">స్వభావమ్</span> - స్వరూపసత్తామాత్రమును, <span class="CharOverride-1">పశ్యతి</span> - దర్శించును. </p> <p class="Footer ParaOverride-1">6. తే - ఆమునులు; సముదాయమ్ - కర్త మొదలగువాని గుంపును; యత్కారణమ్ - ఏది కారణమైనదిగా; <span class="CharOverride-1">ఆహుః</span> - చెప్పుదురో; అట్టి స్వభావమును దర్శింతురని పూర్వ శ్లోకముతో అన్వయము. </p> <p class="Footer ParaOverride-1"> సముదాయమును వివరించుచున్నారు - యః - ఏవ్యక్తి - కర్త; యేన - దేనితో - జ్ఞానకర్మమునకు కరణమైన దానితో; యత్ - పొందదగిన దేనిని ఉద్దేశించి; <span class="CharOverride-1">యస్మిన్</span> - ఏతావున, ఏ కాలమునందు;</p> <p class="Footer ParaOverride-1"> యస్మిన్ - నిమిత్తముగానైన సుఖము, దుఃఖము అనువాని విషయమున; తామ్ - దానికి అనుకూలమైన ఆ; <span class="CharOverride-1">ప్రవృత్తిమ్</span> - యత్నమును; <span class="CharOverride-1">ఆరభతే</span> - ప్రారంభించి, <span class="CharOverride-1">తత్కర్మ</span> - చూచుట, పోవుట మొదలగు కర్మమును; <span class="CharOverride-1">కరోతి</span> - చేయునో; <span class="CharOverride-1">యతః</span> - ఏరాగద్వేషాదికమువలన; అదృష్టమువలననో, ఈశ్వరేచ్ఛవలననో - గ్రహించి - అట్టి కర్మమును చేయునో - అది స్వభావము - అని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">7. <span class="CharOverride-1">వ్యాపకమ్</span> - ఈశ్వరుడను పేరు గలిగి అంతట వ్యాపించునది; <span class="CharOverride-1">వ్యాప్యమ్</span> - జీవుడను పేరుగలిగి వ్యాపింపబడి యున్నది; ఈరెండును విభువులు, నిత్యములు కనుక తుల్యములు - అందుచే ఒకటి నియమింపబడునది, మరియొకటి నియమించునది అనుస్థితి యిందు లేదు. అందువలన<span class="CharOverride-1"> “అన్తః ప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా’’</span> - ‘లోపల చొచ్చినవాడు, జనులను శాసించువాడు, సర్వాత్ముడు’ మొదలగు వేదవాక్యములకు ఇచట ఇబ్బంది లేదు. ఒకటి రెండు స్వరూపములుగా నుండుటలో ప్రమాణమును చెప్పుచున్నారు. మంత్రవత్- </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">“ఏక ఏవ తు భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచన్ద్రవత్’’ </span></p> <p class="Footer ParaOverride-1"> ‘ఒకే భూతాత్మ ప్రతి భూతమునందును నెలకొని యున్నదై ఒక్క విధముగా పెక్కువిధములుగా, నీటి యందలి చంద్రుని వలె కానవచ్చుచున్నది’ - అను మంత్రమే యిచట ప్రమాణము. భూతములయందలి ఆత్మ నిత్యాత్మగా వ్యాపించి యుండుటవలన ఒక్క స్వరూపముతో నుండును. అన్నింటి సాధక స్వరూపముతో పెక్కు రూపములతో నుండును. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-2">‘</span><span class="CharOverride-1">స్థాస్యతి</span><span class="CharOverride-2">’</span> - అనుటవలన స్థాణుత్వమును చెప్పినట్లయినది. కూటస్థమను శబ్దార్థము ఇచట నన్వయించును. యః ఆత్మకారీ - తనతో ఏకము, అద్వితీయము నై సర్వమును చేయుచుండునది ఆత్మకారి. <span class="CharOverride-1">“తదాత్మానం స్వయ మకురుత’’</span> - ‘అది తన్ను స్వయముగా చేసికొనినది’ అను శ్రుతి యిందు ప్రమాణము. అది పరమమైన కారణము<span class="CharOverride-1"> </span><span class="CharOverride-2">“</span><span class="CharOverride-1">ఆనన్దాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే</span><span class="CharOverride-2">”</span>- ‘ఆనందము వలననే కదా ఈ భూతములన్నియు పుట్టుచున్నవి’ అని శ్రుతి చెప్పుచున్నది. ఆనందమయుడను పేరుగల ఈశ్వరుడు అవాంతర కారణము. శుద్ధతత్త్వ దృష్టితో కార్యము అగును. దానినే <span class="CharOverride-1">“కార్యమతో యదన్యత్’’</span></p> <p class="Footer ParaOverride-1"> అను వాక్యముతో చెప్పిరి.</p> <p class="Footer">8. ఇట్లు స్వభావము పరమకారణమని చెప్పి అది జ్ఞానస్వరూపమనియు మూడు శ్లోకములతో నిరూపించుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-1">సుకృతైః</span> - చక్కగా చేసిన పుణ్యపాపములచేత; స్వకర్మజైః - తనకర్మములచే ఏర్పడిన పుణ్యపాపముల చేత; <span class="CharOverride-1">శుభాశుభేషు, శరీరేషు</span> - శుభములు, అశుభములునైన జడములగు శరీరములందు; ఇదమ్ - ఈ జడము కాని స్వభావమను పేరుగల పరమకారణమగు జ్ఞానము; <span class="CharOverride-1">నిబద్ధమ్ </span>- ఎల్లవేళల జ్ఞాపకమాత్రముగా నిలిచియున్నది; శుభము, అశుభముల వలె జడము అజడము అనునవియు కలిసియే యుండును. ఒకదాని కొకటి విరోధము లేని కారణమున అనిభావము. </p> <p class="Footer">9. చెట్టుపై భాగముననున్న దీపము ఎక్కువ విషయమును ప్రకాశింపజేయును. కాని చెట్టు మొదట (క్రిందిభాగమున) ఉన్నది అట్లు కాదు. ఇట్లే అయిదు ఇంద్రియరూపములైనవి, చైతన్యమనెడు పెద్దదీపము కలవియు నగు వృక్షములు - వృక్షములవలె స్వయముగా వెలుగులేనివి జ్ఞానదీపముచే ప్రకాశించుచున్నవియై పరాధీనములై యున్నవి. వానికి వెలుగు చిత్పదార్థముచేత కలుగుచున్నది కాని సహజముగా కాదని భావము. శ్రుతులు కూడ <span class="CharOverride-1">“యేనా హు ర్మనో మతమ్”</span> దేనితో వాక్కు వెలువడుచున్నదో, కన్నులు చూచుచున్నవో, మనస్సు ఆలోచించుచున్నదో - <span class="CharOverride-1">అది ఆత్మ’</span> - అని చెప్పుచున్నవికదా! </p> <p class="Footer">10. <span class="CharOverride-1">తేభ్యః</span> - ఆయింద్రియములకంటె; జ్ఞానరూపమైన స్వభావము పరమమైనది. </p> <p class="Footer">11. ఈ జ్ఞానము నిత్యమని చెప్పుచున్నారు. శరీరములయందు జ్ఞానము మనస్సు ద్వారా చిక్కుపడియున్నను శరీరములే నశించును గాని జ్ఞానము నశింపదు. </p> <p class="Footer">12. బుద్ధి ఉపాధి, జ్ఞానము అందుండు వస్తువు. ఈ రెండును కానరానివియే అనుదానిని దృష్టాంతముఖమున నిరూపించుచున్నారు; <span class="CharOverride-1">గృహీత్వా</span> - గొడ్డలి చేయవలసిన పనిని చేయించి అని అర్థము; <span class="CharOverride-1">కట్టెను నరికి</span> - అని భావము. </p> <p class="Footer">13. <span class="CharOverride-1">యోగాత్</span> - ఉపాయమువలన - చూచుచున్నాను. అని అనుభవించుచు; <span class="CharOverride-1">ఇన్ద్రియాత్మా</span> - జీవుడు; సబుద్ధిః - బుద్ధితో కూడినవాడై; <span class="CharOverride-1">పరం, బుద్ధిం, చ,</span> సమంపశ్యతి - పరమైన ఆత్మను బుద్ధినికూడ ఏకకాలమున చూచుచున్నాడు. </p> <p class="Footer">14. దేహనాశము కలుగుట మొదలగుదానిద్వారా బుద్ధిఉపాధిగా గల చిదాత్మకు - జ్ఞానస్వరూపమునకు - బాధకలుగదు. అని రెండు శ్లోకములతో చెప్పుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-1">అఙ్గమ్</span> - శరీరము; <span class="CharOverride-1">ఆత్మనః, పృథక్</span> - తన కంటె వేరైనదిగా; స్వప్నాన్తరే - కలనడుమ; <span class="CharOverride-1">పశ్యతి</span> - చూచును;<span class="CharOverride-1"> సమనాః,</span> సబుద్ధిః - మనస్సుతో, బుద్ధితో కూడినవాడై; <span class="CharOverride-1">శ్రోత్రాదియుక్తః</span> - అయిదు జ్ఞానేంద్రియములు, అయిదుకర్మేంద్రియములు, అయిదు ప్రాణములు - అనుపదునేడింటితో కూడినవాడై; మరణమున తాను తన శరీరముకంటె వేరైనవాడని చూచుచు కూడ ఆత్మతో అభిన్నుడనని తెలియజాలక మరొకశరీరముతో కూడినవాడగుచున్నాడు. </p> <p class="Footer"> <span class="CharOverride-1">లిఙ్గాత్ -</span> స్థూలదేహము నుండి; <span class="CharOverride-1">అన్యత్ లిఙ్గమ్ -</span> మరొక స్థూలదేహమునకు, <span class="CharOverride-1">గచ్ఛతి</span> - పోవుచున్నాడు. </p> <p class="Footer">15. <span class="CharOverride-1">సన్నిపాతః</span> - మరణము; <span class="CharOverride-1">ఫలసన్నియోగాత్ -</span> సుఖము, దుఃఖమును కూర్చెడు కర్మసంబంధము వలన; <span class="CharOverride-1">అనేన లిఙ్గేన</span> - శవముగానయిన ఈ దేహముతో; <span class="CharOverride-1">అదృష్టః</span> - చూడబడనివాడై; </p> <p class="Footer ParaOverride-1">16. ఇట్లు ఆత్మకు బుద్ధి తాదాత్మ్యము వలన ఏర్పడిన భ్రాంతి వలన కలిగిన సంసారమును చెప్పి నిజమునకు ఆది సంగములేనిదని చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> -<span class="CharOverride-1"> “న చక్షుషాపశ్యతి”</span> మొదలైనదానిచేత ఇంద్రియములకు అది గ్రాహ్యము కాదని నిరూపించు చున్నారు. <span class="CharOverride-1">“న స్పర్శముపైతి’’</span> - భోక్తగా దానికి సంగములేదనుటను ఇది చెప్పును. <span class="CharOverride-1">నచాపి తైః సాధయతే</span> - కర్తృత్వ రూపమున సంగము లేదని నిరూపించును; తే - అవి - అనగా కన్ను మొదలగునవి; <span class="CharOverride-1">స పశ్యతే తాన్</span> - అనుట వలన ఆత్మసాక్షి మాత్రము - అని చెప్పినట్లయినది. న పశ్యన్తి - ఫలరూపమున దాని స్థితిని చెప్పిరి. </p> <p class="Footer ParaOverride-1">17. ఆత్మకు సంగములేదు కాని కాలినయినుపగుండువలె బుద్ధి తాదాత్మ్యపు భ్రాంతివలన దానికి సంసారము ఉన్నదనిపించునని చెప్పుచున్నారు. <span class="CharOverride-1">రూపమ్</span> - పింగళవర్గము మొదలగునది; ఇక్కడ ఒకడు అనగా కాలినయినుపగుండు మొదలగునది; అగ్ని ఉనికి ఇనుపగుండులో తెలియవచ్చునది. గాని విడిగా దానికి రూపమో గుణమో ఉండదు. అట్లే ఆత్మరూపమైన చైతన్యము దేహమునందు తెలియవచ్చును గాని దేహము చేతనము కాదు. అయినను లోహమునందలి నాలుగు కోణములున్న స్థితి మొదలగునది అగ్నియందు కానవచ్చిన విధముగా ఆత్మయందును దేహగతమగు దుఃఖాదికము తోచును. </p> <p class="Footer ParaOverride-1">18. పైని చెప్పిన దృష్టాంతమును బట్టి ఆత్మ ఏయే శరీరమును పొందునో దాని దాని ధర్మములు ఆత్మయందు భావింపబడుచుండును. అదృశ్యమ్ - తటస్థులకు కానరానిది. <span class="CharOverride-1">తదాశ్రయమ్</span> - మరియొక దేహమునకు ఆశ్రయమైనది; </p> <p class="Footer ParaOverride-1">19. ఇచట ప్రసంగము ననుసరించి పూర్వదేహమును విడుచుట మరియొక దేహమును పొందుట అనుదాని తీరుతెన్నులను వివరించుచున్నారు. (19,20,21 శ్లోకములతో) </p> <p class="Footer ParaOverride-1"> శరీరీ - జీవాత్మ (మరణించుచు - శరీరము నశించునపుడని భావము) ఆకాశము మొదలగు అంశములతో వెలుపలి పంచభూతములగు ఆకాశాదులను చేరుకొనును. ఇట్లే శ్రోత్రము మొదలగు పదునేడును (అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అయిదు విధములైన ప్రాణములు, బుద్ధి, మనస్సు = 17) నానాశ్రయాః - తమకు తమకు ఆశ్రయములైన వానిని పొందినవియై; కర్మసు - వెనుకటి తెలివితో కూడినవగు ఆయాపనులయందు; <span class="CharOverride-1">వర్తమానాః</span> - కలిసిపోయి ప్రవర్తించుచు; పఞ్చగుణాన్- శబ్దము మొదలగు అయిదు గుణములను; శ్రయన్తి - చేరుకొనును. </p> <p class="Footer ParaOverride-1"> దీని అర్థ మిది - స్థూలదేహము నశించినను కర్మముతో కట్టుబడిన పదునేడింటి స్వరూపమైన లింగదేహము నశింపదు. మఱి యేమగుననిన, తృణజలూకాన్యాయము ననుసరించి మరియొక దేహమును చేరుకొనును. (జలగ ఒక గడ్డి పరకనుండి మరియొక గడ్డి పరకను చేరుకొను తీరును తృణజలూకాన్యాయమందురు).</p> <p class="Footer ParaOverride-1"> శ్రుతియు నిట్లు చెప్పుచున్నది-<span class="CharOverride-1"> ‘‘తముత్ర్కామన్తం ప్రాణోఽ నూత్ర్కామతి ప్రాణమనూత్ర్కా మన్తం సర్వే ప్రాణా అనూత్ర్కామన్తి’’</span> - ‘జీవుడు దేహమునుండి పైకి లేచి పోవుచుండగా ప్రాణము వానితో పాటు పైకి లేచిపోవును. ఆప్రాణమును తక్కిన ప్రాణములు అనుసరించును.’ “<span class="CharOverride-1">తం విద్యాకర్మణీ సమన్వారభేతే పూర్వప్రజ్ఞాచేతి’’</span>- ‘ఆజీవాత్మను విద్యాకర్మములు, పూర్వప్రజ్ఞయు వెంటనంటి పోవును.’ అని. జలగ గడ్డిపోచ చివరిదాక వెళ్లి క్రొత్తపరకను పట్టుకొని ముందుదానిని వదలివేయునుగదా! </p> <p class="Footer ParaOverride-1">20. అందు ఏ ఇంద్రియము ఏభూతము గుణము నాశ్రయించునో అనుదానిని వ్యవస్థ చేయుచున్నారు. శ్రోత్రము ఆకాశమునుండి తనగుణమగు శబ్దము నాశ్రయించును. పృథివి గుణమగు గంధము నాసికను చేరుకొనును. విపాకః - కన్ను రూపముగా నున్న తేజస్సుయొక్క పరిణామము తేజోమయమగు రూపము నాశ్రయించును. నీటి నాశ్రయించిన తేజస్సు రసమును తెలియజేయుచు రసనేంద్రియము నాశ్రయించును. వాయుస్వరూపమైనది; <span class="CharOverride-1">స్పర్శకృతః - </span> స్పర్శకొరకు చేయబడిన ఇంద్రియమగు త్వక్కును - చర్మమును చేరుకొనును. శబ్దము మొదలగు వాసనలతో కూడినవియే ఆయి శ్రోత్రము మొదలగునవి ఆయాపనులయందు అల్లుకొని పోవునని భావము. </p> <p class="Footer ParaOverride-1">21. <span class="CharOverride-1">పఞ్చేన్ద్రియార్థాః</span> - అయిదు ఇంద్రియముల అర్థములగు శబ్దము మొదలగు గుణములు; <span class="CharOverride-1">మహత్పు, భూతేషు</span> - అయిదు మహాభూతముల యందు; వసన్తి - ఉండును; అవి అయిదును ఇంద్రియముల యందు <span class="CharOverride-1">ఉండును; సర్వాణి చ, ఏతాని -</span> ఈ అన్నియు - శబ్దాదులు, ఆకాశాదులు, ఇంద్రియములు - అనునవి అన్నియు మనస్సు నందుండును. మనస్సు బుద్ధి, బుద్ధి స్వభావమును అనుసరించును. </p> <p class="Footer ParaOverride-1"> అందుచేత 'ఇంద్రియములు పరములు, ఇంద్రియములకంటె పరమైనది మనస్సు, మనస్సుకంటె విశిష్టమైనది బుద్ధి. దానికంటె ఉత్కృష్టమైనది ఆ ఆత్మ' - అని గీత చెప్పుట సరిపడును. ఈవిధముగా అర్థములకు - శబ్దాదులకు - కారణము ఇంద్రియములు, వానికి మనస్సు, దానికి బుద్ధి, దానికి చిదాత్మ కారణము. ఈ వరుసతో సర్వవాసనలు అంటియున్న బుద్ధియందు సర్వము కలదు. </p> <p class="Footer ParaOverride-1">22. స్వదేహే - తన కర్మముతో ఆర్జించిన నూతన దేహమునందు; ఇంద్రియాదులు, ఆ పూర్వకర్మమునే గ్రహించును. పరావరాణి - అర్థములు - శబ్దాది విషయములు, బుద్ధి మొదలగునవి; పూర్వసంస్కార వశమున ఉత్తర దేహమునందు కర్మములను చేయుచు వదలిపోకుండును. </p> <p class="Footer ParaOverride-1">23. అయినచో ఇట్లు వాసనలసముదాయము పరిహరింపనలవి కానిదైనచో ఇంకమోక్షమును గూర్చి చింతయే అక్కరలేదు కదా అని ఆశంకించి ఈ భ్రమ అనాదికాలముగా వచ్చునది అయినను దీనిని తత్వబుద్ధి కలవాడు కూకటి వ్రేళ్ళతో పెకలించి వేయగలడని ప్రతిపాదించుటకై దృష్టాంతపూర్వకముగా సంసారము భ్రమమూలకమని నిరూపించుచున్నారు.</p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">దృష్టిపథమ్</span> - దృష్టి అనగా జ్ఞానము, దానిని మించిపోని చక్కగా తెలియవచ్చెడు వస్తువు - దాని బాట వంటి బాట - వదలుట గ్రహించుట అను మార్గములు దేనికి కలవో అది - అనగా భ్రాంతివలనకలిగెడు జ్ఞానమని అర్థము; <span class="CharOverride-1">చలమ్</span> - అస్థిరమైన దానిని; <span class="CharOverride-1">పరైతి</span> - జనుడు తొలగించుకొని వస్తు <span class="CharOverride-1">తత్త్వమును</span> గ్రహించుచున్నాడు; నావయందున్నవాడు ఒడ్డునందలి చెట్టు కదలుచున్నట్లు భావించును. అనగా నావకదలికను చెట్టునందు ఆరోపించుచున్నాడు. నావ నిలుకడగా నున్నపుడు ఆ చెట్టు కదలిక భ్రాంతివలన నైనదని ఎట్లు తెలిసికొనునో అట్లే పరమాత్మ కూటస్థమైనదైనను బుద్ధి లక్షణమువలన కూటస్థము కాని దన్నట్లు కన్పట్టుచుండగా ఆబుద్ధి మార్గమును జ్ఞానముతో నిలువరించి సాధకుడు పరతత్వమును పట్టుకొనుచున్నాడు. </p> <p class="Footer ParaOverride-1"> సూక్ష్మముగా నున్న పుస్తకాక్షరమును కంటిని శక్తిమంతము చేయు కంటి అద్దము బలముతో పెద్దరూపము కలదానినిగా చేసికొనును. అట్లే సూక్ష్మమైనను చిదాత్మ తత్త్వము బుద్ధియోగము వలన స్థూల ప్రపంచరూపముగా కన్పట్టును. </p> <p class="Footer ParaOverride-1"> అట్లే తనరూపమును అద్దమునందు ప్రతిబింబరూపముగా చూచును. నిజమునకు తనకంటికి కానరానిదయ్యును ముఖము అద్దముద్వారా కానవచ్చుచున్నది. </p> <p class="Footer ParaOverride-1"> కంటి అద్దమును, అద్దమును తొలగించినచో అక్షరముల పెద్దతనము, ముఖము కానవచ్చుట అనునవి తొలగిపోవును. ఇట్లే చిత్పదార్థముయొక్క స్థూలత్వము, దృశ్యత్వము తొలగిపోవును. కూటస్థమగు ఆత్మ నిర్వికారము, సూక్ష్మము, ఇంద్రియగోచరముకానిది. కాని నావకదలిక, కంటిఅద్దములు, అద్దము అనువంటి వాసనాబలము ద్వారమున వికారములు కలది, స్థూలము, దృశ్యము అయినట్లు తోచుచున్నది. కారణరూపములైన చలనాదులను అరికట్టినచో తత్త్వము అనుభవమునకు వచ్చును. </p> <p class="Footer ParaOverride-1"> ఇట్లు భ్రాంతి అనాది యయినను, దానికంటె తరువాతిది అయిన తత్త్వజ్ఞానము బలముతో రూపుమాసి పోవును. </p> <p class="Footer ParaOverride-1"> బుద్ధి తత్త్వపక్షపాతము కలది కనుక ఒక మారుతొలగిన భ్రాంతి మరల లేచివచ్చుట అనునది సంభవింపదు. అందువలన భ్రాంతిని రూపుమాపుటకై ఆత్మజ్ఞాన విషయమున మానవుడు ప్రయత్నింపవలయునని తాత్పర్యము.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">ద్వ్యధిక ద్విశతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">202</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">మనుబృహస్పతుల సంవాదము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">202</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">త్ర్యధిక ద్విశతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer ParaOverride-1">1. నిర్వికారమునకు వికారిత్వము, సూక్ష్మమునకు స్థూలత్వము, అదృశ్యమునకు దృశ్యత్వము బుద్ధియోగము వలన నేర్పడుచున్నదని వెనుక నిరూపించియున్నారు. కనుక బుద్దికంటె వేరుగా ఆత్మ ఆను పదార్థము ఉండుటకు వీలులేదు కదా! అని శంకించి చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">‘‘ఆత్మేన్ద్రియ మనో యుక్తం భోక్తే త్యాహు ర్మనీషిణః’’</span> ఇంద్రియములతో మనస్సుతో కూడిన ఆత్మయే భోక్త యని బుద్ధిశాలులు చెప్పుదురు - అను శ్రుతి ననుసరించి మనస్సుతో కూడిన ఇంద్రియములతో కూడిన జీవచైతన్యము <span class="CharOverride-1">చిరాయ</span> - పెద్దకాలము; <span class="CharOverride-1">పురస్తాత్</span> - పూర్వము,<span class="CharOverride-1"> ప్రాప్తాన్ గుణాన్</span> - లభించిన విషయములను; <span class="CharOverride-1">సంస్మరతే</span> - వేరు కాలమున స్మరించును; చిన్నప్పుడు నేనిది యనుభవించితిని అన్నట్లు, కోరికలు పుట్టుసమయమున విషయములకు ఇంద్రియములకు సన్నికర్షము ఉండని కారణమున జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత అనువాని వాసనలు కల బుద్ధియే సర్వాత్మతను పొందినదై దానికంటె వేరైన చైతన్యముచేత తెలియవచ్చుచున్నది కనుక బుద్దికంటె మిన్న అయిన చేతనము తప్పక ఉన్నదని తెలియవచ్చుచున్నది. </p> <p class="Footer ParaOverride-1"> ఒకవేళ ఇంద్రియములే విషయవాసలతో వాసితములై బుద్ధితో పొందుచున్నవేమో! అని ఆశంకించి చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">ఇన్ద్రియేషు, ఉపహతేషు</span> - ఇంద్రియములు విలీనములైనపుడు; శబ్దాదులను గ్రహించుటలేదు కదా! <span class="CharOverride-1">పశ్చాత్</span> - పిదప - స్వప్నకాలమున; <span class="CharOverride-1">బుద్ధిరూపః</span> - తెలియు వాడు, తెలియుట, తెలియబడునది అను త్రిపుటీ స్వరూపమైన బుద్ధిరూపము వంటి రూపముగల; <span class="CharOverride-1">పరమః</span> - సర్వోత్కృష్టమైన; <span class="CharOverride-1">స్వభావః</span> - చిద్రూపమైన ఆత్మ; కలదు - </p> <p class="Footer ParaOverride-1"> దీని భావమిది - మెలకువగా నున్నదశలో కుండను కన్ను చూచుచున్నది. అట్లు చూచుటకు వీలు కల్పించు కూటస్థుడు, నిర్వికారుడు అయిన సూర్యుడు కంటికి చూచుశక్తిని, కుండకు ప్రకాశమును చేయుచున్నాడు. ఇట్లు కలయందును తెలియువాడు, తెలియబడునది అను స్వరూపముతో ఉన్న బుద్ధిని, దానికంటె వేరయిన ఉదాసీనమగు ప్రకాశమే తెలియునట్లు చేయవలయును కదా! అందువలన బుద్ధికంటె వేరుగా ఆత్మ ఉన్నదనుట సిద్ధము. అది బుద్ధి తాదాత్మ్యనము అను భ్రాంతితో వికారములు కలది మొదలగు లక్షణములు క్రమ్మికొన్నట్టిది. </p> <p class="Footer ParaOverride-1">2. మనోరథమునందువలె స్వప్నమునందును వాసనామయములైన ఇంద్రియములు ఉండనేయున్నవి. కనుక అందును విశేషములేకుండ బుద్ధియే ప్రకాశింపజేయునది. అట్టి యెడ బుద్ధికంటె వేరుగా చేతన అనుదానికి స్థితిలేదు - అని ఆశంకించి పరిహారము చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">సఃపరమః</span> -ఆ పరముడు - ప్రత్యగాత్మస్వరూపుడు; <span class="CharOverride-1">యుగపత్</span> - ఒక్క కాలమునందును; <span class="CharOverride-1">అతుల్యకాలమ్</span> - పెక్కు కాలములందును; <span class="CharOverride-1">కృత్స్నమ్</span> - కడచిన, కడవనున్న కాలమునకు సంబంధించిన పదార్థసముదాయము నంతటిని; ఇప్పుడో మరియొక జన్మమునందో చూచినదానిని; <span class="CharOverride-1">సమన్తావ్</span> - సన్నిహితముగానున్న; <span class="CharOverride-1">ఇన్ద్రియార్థాన్</span> - ఇంద్రియముల విషయములగు శబ్దము మొదలగు వానిని; <span class="CharOverride-1">న - ఉపేక్షతే</span> - ఉపేక్షింపడు. మరి ప్రకాశింపజేయుచునే యుండునని భావము; <span class="CharOverride-1">తథా</span> - అట్లే; <span class="CharOverride-1">చలమ్</span> - ఒకదానితో నొకటి చొచ్చుకొనిపోవుచు - మూడు అవస్థలయందును - జాగ్రత్, స్వప్న, సుషుప్తి దశలయందును; <span class="CharOverride-1">సఞ్చరతే</span> - తిరుగాడుచునే యుండును; అందువలన; <span class="CharOverride-1">విద్యావ్</span> - అన్నియు తెలిసినవాడు; సాక్షియని తాత్పర్యము; అందువలన నతడు పువ్వులలోని దారమువలె; <span class="CharOverride-1">ఏకః</span> - ఒక్కడు; </p> <p class="Footer ParaOverride-1"> దీని అర్థమిది - కలదశలో భూతకాలమునకు; భవిష్యత్తునకు సంబంధించిన వస్తుజాతమంతయు ఒక్కమారుగా కానవచ్చును. అప్పుడు ఇంద్రియములకు అస్తిత్వమున్నచో భూతకాల విషయాదుల జ్ఞానము ఉండదు. అతీతాదులతో వానికి సాన్నిధ్యము ఉండదు కదా! సమీపతలేని జ్ఞానవిషయమున నన్ననో - అప్పుడు ఇంద్రియములుండుట అను వాగుడు వ్యర్థమైనది. రజ్జూరగాదులయందు వలె అధిష్ఠానజ్ఞానము కొరకు ఇంద్రియముల అపేక్ష ఉండదుకదా! (త్రాటిని సర్పముగా భ్రమతో చూచినపుడు ఇంద్రియము సర్పజ్ఞానమునే తెలుపునుగాని త్రాటితనము చూపదుకదా! అని భావము) ఆత్మకో, బుద్ధికో అధిష్ఠానము ఇంద్రియమనుట పొసగనిది. అందువలన కలలో బుద్ధి యొక్కటే మాత, మేయము, మానము అని మూడింటి స్వరూపముతో ఉన్నదై, దానికంటె భిన్నమైన సాక్షితో ప్రకాశమును పొందుచున్నది. అందువలననే అది మూడుదశలయందును సంచరించుచుండును. </p> <p class="Footer ParaOverride-1"> ఇట్లు బుద్ధికంటె వేరుగా సాక్షిరూపుడగు ప్రత్యగాత్మ కలడని స్పష్టమగుచున్నది. </p> <p class="Footer">3. పైశ్లోకమునందలి <span class="CharOverride-10">“చలం సంస్మరతే”</span> అనుదానిని వివరించుచున్నారు. జాగ్రద్దశ, స్వప్నదశ, సుషుప్తిదశ అనుమూడును ఒక్కొక్కటి మూడు మూడు గుణముల - సత్యాదుల - స్వరూపము కలవియై బుద్దికి స్థానములగును. వాని గుణములను - సుఖదుఃఖాదులను; <span class="CharOverride-1">విరూపాన్ -</span> ఒకదాని కొకటి విలక్షణములయిన వానిని; <span class="CharOverride-1">శరీరీ</span> - శరీరమునందలి <span class="CharOverride-1">ఆత్మ; గచ్ఛతి</span> - తెలియుచుండును; అంతేకాని అనుభవింపదు; దీనికి ప్రమాణభూతమగు శ్రుతికలదు - <span class="CharOverride-1">‘‘స యత్తత్ర పశ్యత్యతిపుణ్యం చ పాపం చానన్వాగతస్తేవ భవత్యసంగో హ్యయం పురుషః’’</span> 'ఆపురుషుడు దానియందలి అతిపుణ్యమును, పాపమును దానివెంటనే పోవుచు సంగములేనిదై చూచుచుండును' ఈవిధముగా సుఖదుఃఖాదులను అనుభవించునది బుద్ధియే దానినుండి కర్తయు అదియే. కాని ఆత్మకు భోక్తయగుట, కర్తయగుట అనునది సిద్ధింపదు. అది కేవలము ఉదాసీనముగా నుండి తెలియునది మాత్రమే యగును. </p> <p class="Footer"> ఈ న్యాయమునే ఇంద్రియములందలి సంచారవిషయమునందును నిరూపించుచున్నారు. జాగ్రదాది అవస్థల మార్గమున నెట్లో ఇంద్రియముల మార్గముచేతను బుద్ధియే సుఖాదులను అనుభవించునది. దీనికొక దృష్టాంతమును చెప్పుచున్నారు - "ఇంధనమునందున్న అగ్నిని వాయువువలె”అని, </p> <p class="Footer"> కట్టెలోనున్న అగ్నియే కట్టెను కాల్చును కాని వాయువు కాదుకదా! వాయువు అగ్నిని మండునట్లు చేయును. ఇట్లే ఇంద్రియములయందున్న బుద్ధియే ఇంద్రియములవలన పుట్టిన సుఖాదికము ననుభవించును. చేతన బుద్ధిని ప్రవర్తింపజేయునదియే కాని తానై అనుభవింపదు.</p> <p class="Footer"> 4. ఇట్లు బుద్దికంటె వేరుగా సాధింపబడిన ఆత్మతత్త్యము కన్ను మొదలగువానికి అగోచరము - అనిచెప్పుచున్నారు. <span class="CharOverride-1">ఆత్మనః</span> - ఆత్మయొక్క; <span class="CharOverride-1">రూపమ్</span> - స్వరూపమును; <span class="CharOverride-1">చక్షుషా</span> - కంటితో; నపశ్యతి చూడడు (మానవుడు); స్పర్శనమ్ - స్పృశించునదియగు చర్మేంద్రియము; </p> <p class="Footer"> <span class="CharOverride-1">నపశ్యతి</span> - చూడదు - తాకదు అని అర్థము; ఏలయన ఆత్మకు రూపస్పర్శాదులు లేవు. ఇందు కారణమును చెప్పుచున్నారు. అది ఇంద్రియములకు ఇంద్రియము. <span class="CharOverride-1">‘‘ప్రాణస్యప్రాణముత చక్షుషశ్చక్షుః శ్రోత్రస్యశ్రోత్రం మనసో యే మనో విదుః’’</span> - 'అది ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, చెవికి చెవి, మనస్సునకు మనస్సు అని విద్వాంసు లెరుగుదురు' - అనుశ్రుతి ఆత్మ ఇంద్రియములను ప్రకాశింపజేయునదియే కాని ఇంద్రియములచేత ప్రకాశింపబడునది కాదని చెప్పుచున్నది. <span class="CharOverride-1">శ్రోత్రలిఙ్గం న </span>- శ్రోత్రముచేత తెలియబడునది కాదు ఆత్మశబ్దములేనిది కావున చెవికి తెలియ వచ్చునది కాదని భావము. తక్కిన ప్రమాణములను కూడ ఇది సూచించును. అయినచో <span class="CharOverride-1">“తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి’’ ‘‘దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా’’</span> - ఆఔషనిషద పురుషునిగూర్చి అడుగుచున్నాను. ‘అతి సూక్ష్మమైన బుద్ధితో చూడబడుచున్నది’ మొదలగు శ్రుతులు ‘ఆత్మ ఉపనిషత్తులకు గమ్యము’, బుద్ధికి తెలియవచ్చునది’ అని చెప్పుట యెట్లు అని శంకించి సమాధానము చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">“ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యః’’</span> - అని ఆత్మను దర్శించుటకే శ్రవణము మొదలగునవి విధింపబడుచున్నవి. (ఆత్మయే చూడబడవలసినది, వినబడవలసినది, భావింపబడవలసినది, నిదిధ్యాసనము చేయవలసినది) అందును తత్, త్వమ్ పదార్థముల అర్థము నెరిగి 'తత్త్వమసి' అను వాక్యమువలన తానే బ్రహ్మము అను స్థితిని పొందినవానికి వేదములు కూడ అవేదములే యగును అని వేదాంత వాక్యములకును అవసరము లేదనియు వినవచ్చుచున్నది. ఇతరున కన్ననో వాక్యార్థ ధ్యానముచేత అది తెలియరాగా మనస్సు కూడ లయమగుటయు వివవచ్చుచున్నది. <span class="CharOverride-1">“తావన్మనో నిరోద్ధవ్యం హృది యావత్ క్షయం గతమ్’’.</span> హృదయమున అజ్ఞానము మొత్తము క్షయము పొందువరకే మనస్సును నిరోధింపవలసియున్నది.' </p> <p class="Footer ParaOverride-1"> అందువలన దీనిని చెప్పిరి - ఏసాధనరూపమైన శబ్దముచేతనో మనస్సుచేతనో ఆత్మను సర్వమును దర్శించునో అది నశించును - అని. ఇట్లు శ్రవణముచేతను వేదాంతవాక్యార్థ విచారముచేతను ఆత్మదర్శనమును, అట్లే అటువంటిదే అయిన పూర్తిగా అస్తమించిన క్రియాకారకాది ద్వైతమును చేయబడినది. శ్రుతియు “యత్ర త్వస్య సర్వ మాత్మైవాభూతత్కేన కం పశ్యేత్" - 'ఎందు ఇతనికి సర్వము ఆత్మయే అయినదో అపుడు దేనితో దేనిని చూచును' అని చెప్పుచున్నది. ఇట్టి వాక్యములు మరియును కలవు. </p> <p class="Footer ParaOverride-1">5. <span class="CharOverride-1">స్వంస్వమ్ ఆత్మానం న పశ్యన్తి</span> - తన తన స్వరూపమును చూడవు. ఇంద్రియము ఇంద్రియ స్వరూపమును చూడజాలదు - అన్నచో పరమాత్మను చూడదని చెప్పనేల? అనిభావము; </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">సర్వజ్ఞః -</span> సర్వుడు, జ్ఞుడు - అని అద్వయ జ్ఞానస్వరూపమాత్రము నీపదము చెప్పును; <span class="CharOverride-1">సర్వదర్శీ</span> - ఆత్మపదార్థము దృశ్యము, ద్రష్టలను ఉభయస్వరూపములు కలది అని ఈపదమున కర్థము; <span class="CharOverride-1">సర్వజ్ఞః</span> - దృశ్యము, ద్రష్టఅనువానికి నిత్యసంబంధము కలదు - అని రెండవమారు ప్రయోగింపబడిన ఈపదమున కర్ణము - కనుక పునరుక్తిలేదు. </p> <p class="Footer ParaOverride-1">6. ఇట్లు ఆత్మవిషయమున సాధక ప్రమాణమును ప్రదర్శించి బాధకము లేకుండుటను కూడ ఈ శ్లోకముతో చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1">7. <span class="CharOverride-1">జ్ఞానాత్మవాన్</span> - జ్ఞానముతో మాత్రమే స్వరూపము కలవాడు - జ్ఞాన స్వరూపుడని యర్థము.</p> <p class="Footer ParaOverride-1">8. ఆత్మ తెలియవచ్చుచుకూడ తెలియరాదు - అని దృష్టాంత పూర్వకముగా చెప్పుచున్నారు. సోమే - అద్దమువంటి చంద్రునియందు; <span class="CharOverride-1">లక్ష్మ యథా</span> - మచ్చ యెట్లో; <span class="CharOverride-1">తథా</span> - అట్లు; జగత్ - జగత్తును; <span class="CharOverride-1">పశ్యన్, అపి,</span> <span class="CharOverride-1">న విన్దతి</span> - జనుడు చూచుచుకూడ తెలియకున్నాడు. ఈజగత్తే చంద్రుని యందు కానవచ్చుచున్నదని తెలియకున్నాడని భావము. మరియు నిట్లు చెప్పుదురు - ఆత్మ మొత్తముగా అవిషయము - తెలియరానిది - కాదు. నేను అను జ్ఞానమునకు విషయమైనది, పరోక్షము కానిది కనుక. ఈవిధముగా తెలియరాని కారణమున ఉత్పన్నమగు జ్ఞానము లేదు. ఆత్మయే బ్రహ్మమైనచో అది తెలియునదే కదా! అన్నచోకాదు. ఆజ్ఞానమున్నను శోకాదులనివృత్తి రూపమగు ఫలము కలుగుట లేదు కదా! కనుక శాస్త్రముతో పనియేమి? అనిశంకించి <span class="CharOverride-1">“ న చ తన్న పరాయణమ్’’</span> - అని చెప్పుచున్నారు. ఆత్మను గూర్చి తెలిసికొనుట పరాయణము కాదని కాదు - అదియే పరాయణము - పరమగతి - అనిభావము. </p> <p class="Footer ParaOverride-1"> శ్రుతియునిట్లు చెప్పుచున్నది - </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">‘‘ యదా చర్మవదా కాశం వేష్టయిష్యన్తి మానవాః,</span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9"> తదా దేవ మవిజ్ఞాయ దుఃఖస్యాన్తో భవిష్యతి’’. </span></p> <p class="Footer ParaOverride-1"> ‘ఆకాశమును చర్మముతో మానవులు కప్పినప్పుడు దేవుని తత్త్వ మెరుగకుండ దుఃఖము అంతము సంభవించును’. ఆకాశమును చర్మముతో కప్పుటయు, తత్త్వమెరుగక దుఃఖవినాశము జరుగటయు రెండును అసంభవములే అని తాత్పర్యము. కావున ఏదో కొంత తెలిసినను మరియొకటిగా భావించినందువలన సరియైన జ్ఞానము కొరకు శాస్త్రము తప్పనిసరిగా అవసరమే. </p> <p class="Footer ParaOverride-1"> భర్జువను నొకడు రాజుకు ప్రియుడు. ఒకనాడు అతడు దూరదేశమున నుండగా తక్కినమంత్రులు భర్జువు మరణించెను, బ్రహ్మరాక్షసుడయ్యెనని చెప్పిరి. భర్జువు తిరిగి తన దగ్గరకు వచ్చినను రాజు బుద్ధి దోషము వలన అతనిని భర్జువుగా చూడకుండెనట - ఆత్మవిషయమున కూడ ఈ న్యాయము వర్తించును. కనుక యథార్థజ్ఞానమునకై శాస్త్రమును ఆశ్రయింపవలయునని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">9. మరియు కానరానివస్తువును కూడ అనుమానప్రమాణముచే తెలియుదురని చెప్పుచున్నారు. స్థూలదృష్టితో రూపముకలదియైనను ఒక వృక్షమును, <span class="CharOverride-1">ఉదయాస్తమనే</span> - పుట్టుసమయమునను, నశించిన సమయమునందును, <span class="CharOverride-1">అరూపత్వాత్</span> - రూపములేని కారణమున; బుధాః విజ్ఞులు; ధియా - బుద్ధి విశేషముచేత; బుధాః - విజ్ఞులు; ధియా - బుద్ధివిశేషము చేత; మట్టి మాత్రమే అయినదిగా; <span class="CharOverride-1">సమనుపశ్యన్తి</span> - ఊహద్వారమున తెలిసికొందురు. “ఆదావన్తే చ యన్నాస్తి వర్తమానేఽపి తత్తథా” - మొదటను, తుదిని లేనిది వర్తమానమునందును లేనిదే యగును’ - అని యందురుగదా! </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">తద్గతాః</span> - దానిని దర్శించువారు; <span class="CharOverride-1">సవితు ర్గతిమ్</span> సూర్యుని గతిని; దూరముగానుండుట యను దోషము చేత ప్రత్యక్షముగా కానవచ్చునదైనను; మరియొక దేశమును చేరుకొనుట అనెడు లింగముచేత బుద్ధితో తెలిసికొనుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> తూర్పున ఉదయించినట్లు పడమటిదిక్కున అస్తమించినట్లు కనబడుటచేత సూర్యుని గమనమును ఊహద్వారా తెలిసికొనుచున్నారని భావము. అట్లే ఆత్మ ప్రత్యక్షము కాకపోయినను ఊహబలమున తెలియవచ్చునదే యగునని భావము. </p> <p class="Footer ParaOverride-1">10. <span class="CharOverride-1">యథా</span> - ఎట్లు; ఇది; <span class="CharOverride-1">దూరస్థమ్</span> - సూర్యుని గతివలె గొప్ప ప్రయత్నముతో తెలియదగినదగు ఆత్మను; <span class="CharOverride-1">బుద్ధిప్రదీపేన</span> - వెనుక చెప్పినవిధముగా బుద్ధి అనెడు పెద్దదీపముతో; <span class="CharOverride-1">సమనుపశ్యన్తి</span> - చూతురు; <span class="CharOverride-1">ప్రత్యాసన్నమ్</span> - మిక్కిలి దగ్గరగానున్న ప్రపంచమును; <span class="CharOverride-1">నినీషన్తి</span> - తెచ్చుకొనగోరెదరు. దేనిని గూర్చి - అనగా; <span class="CharOverride-1">జ్ఞానాభిసంహితమ్</span> - జ్ఞానశబ్దముచేత చెప్పబడు బ్రహ్మమును గూర్చి <span class="CharOverride-1">‘‘సత్యం జ్ఞాన మవన్తం బ్రహ్మ’’ ‘‘విజ్ఞాన మానన్దం బ్రహ్మ’’</span> - ఇత్యాది శ్రుతులు బ్రహ్మమును జ్ఞానశబ్దముతో వ్యవహరించుచున్నవి కదా! కనుక జ్ఞానమను వ్యవహారము కలది బ్రహ్మమే, నినీషన్తి అనగా ఆ ప్రపంచమును బ్రహ్మమునందు ప్రవిలాపనము చేయగోరుదురని భావము. </p> <p class="Footer ParaOverride-1">11. ఇట్లు జ్ఞేయరూపమైన ఆత్మ ఉపాయముచేత మాత్రమే తెలియవచ్చునని దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నారు. </p> <p class="Footer">12. ఉపాదానము ఉపాదేయము అనునవి తత్త్వతః భేదము లేనివి కావున మృగము వంటి జ్ఞానముతో అదే జాతికి చెందినదానితో; <span class="CharOverride-1">జ్ఞేయమ్</span> - ఆత్మపదార్థము; <span class="CharOverride-1">గృహ్యతే</span> - వశము చేసికొనబడునని భావము. భూమి చేత చెట్టును గ్రహించినట్లు. </p> <p class="Footer">13. <span class="CharOverride-1">మూర్తిషు</span> - స్థూలదేహములయందు; <span class="CharOverride-1">మూర్తిస్థమ్</span> - లింగదేహమునందు - కారణదేహమునందున్న; <span class="CharOverride-1">జ్ఞేయమ్</span> - తెలియవలసినదగు ఆత్మమును; <span class="CharOverride-1">జ్ఞానేన</span> - ధీవృత్తితో; <span class="CharOverride-1">పశ్యతి</span> - చూచును; </p> <p class="Footer">14. అయ్యా! ఆత్మ బుద్ధివృత్తికి విషయమైనచో జడము అయిపోదా! అను ఆ శంకకు సమాధానము చెప్పుచున్నారు. - <span class="CharOverride-1">పరా బుద్ధిః</span> - చరమ అయిన ధీవృత్తి (బుద్ధి, వ్యాపారము) <span class="CharOverride-1">పరమ్</span> - శుద్ధమైన; <span class="CharOverride-1">బోధ్యమ్</span> - తెలియదగినదానిని; <span class="CharOverride-1">న పశ్యతి</span> - ఒక కుండను వలె - చూడదు; ఆత్మ ఒక పదార్థము వలె - చూడదు; ఆత్మ ఒక పదార్థము వలె కన్పట్టదని తాత్పర్యము. బ్రహ్మమునందు బుద్ధివృత్తి వ్యాపించుటయే కలదు. కాని ఫలవ్యాప్తి కాదని భావము. దీనిని ఇట్లు చెప్పియున్నారు.</p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9"> </span><span class="CharOverride-11">“</span><span class="CharOverride-9">ఫల వ్యాప్తత్వ మేవేహ శాస్త్రకృద్భి ర్నిరాకృతమ్, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">బ్రహ్మణ్యజ్ఞాన నాశాయ వృత్తివ్యాప్తి రపేక్ష్యతే</span><span class="CharOverride-11">”</span><span class="CharOverride-9"> </span></p> <p class="Footer"> ‘ఇందు శాస్త్రకారులు, ఫలము యొక్క వ్యాప్తిని మాత్రమే నిరాకరింతురు. బ్రహ్మము విషయమున అజ్ఞానము నశించుట కొరకు వృత్తి వ్యాప్తి కావలసియున్నది.’ </p> <p class="Footer"> బ్రహ్మము ఒక ఫలమువలె లభించునది కాదు. బుద్ధివృత్తి అందు ప్రవేశించుటయే జరుగునని భావన. </p> <p class="Footer">15. వృత్తిరూపయయిన ఉపాధి లయము పొందినను బ్రహ్మమే ఉండును. ఉండునది శూన్యము కాదని దృష్టాంతముతో నిరూపించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">అమావాస్యామ్</span> - సూర్యునితో కూడియుండుటను పొంది; <span class="CharOverride-1">అలిఙ్గాత్వాత్</span> - తెలియజేసెడు ఉపాధిలేకుండుట వలన - చంద్రుడు కన్పట్టకుండును; అంతేకాని నశింపడు కదా! అట్లే ప్రత్యగాత్మకును నాశము లేదని భావము. </p> <p class="Footer ParaOverride-1">16. కోశమనగా స్థూలశరీరము; <span class="CharOverride-1">మూర్తివిముక్తః</span> - మూర్తియనగా నిచట <span class="CharOverride-1">వృత్తి</span> - వ్యాపనము - అది లేనిదై అని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">17. ఇట్లు గాఢనిద్ర, సమాధి యనువానియందును ఆత్మకలదని నిరూపించి మరల కనబడుట అను స్థితిచేత అది అన్నిదశలలో ఉన్నట్లు తెలియవచ్చునని చెప్పుచున్నారు. <span class="CharOverride-1">ఆకాశాన్తరమ్</span> - అవకాశ భేదమును; </p> <p class="Footer ParaOverride-1">18. <span class="CharOverride-1">చాన్ద్రమసీ</span> - చంద్రమండల సంబంధమైన; <span class="CharOverride-1">వృత్తిః</span> - ధర్మము, ఇట్లు శరీరమునకే జన్మాదికము కాని ఆత్మకు కాదని అర్థము. </p> <p class="Footer ParaOverride-1">19. ఉత్పత్తి మొదలగు వాని కాలభేదముచేతను, మార్పులయందలి భేదము చేతను శరీరములో భేదము కానవచ్చినను ఆతడే ఈ దేవదత్తుడు అన్నట్లు శరీరమునంది ఆత్మ యొక్క ఏకత్వము తెలియవచ్చుచున్నది. అమావాస్యయందు కానరాకుండుట, తక్కిన తిథులయందు కానవచ్చుట అనునవి యున్నను చంద్రుడు నశింపనివాడై ఏకరూపమున నున్నట్లు తెలియుచునేయున్నది. బాల్యము మొదలగు అవస్థలయందువలె మరియొకదేహమును పొందినప్పుడును ఆత్మ ఒక్కటియే. </p> <p class="Footer">20. దేహము దేహి అనువాని సంబంధము తోచుచున్నను సర్వకాలములందును అది లేదని చెప్పుచున్నారు. చిద్రూపమైన ఆత్మను, అచిద్రూపమైన దేహము, ప్రకాశమును అంధకారము వలె, తాకుటకు గాని వదలుటకు గాని శక్తికలది కాదు - అని భావము. </p> <p class="Footer">21. ఇట్లయినను దేహము లేనిదే దేహికి, దేహి లేనిదే దేహమునకు ప్రకాశము లేదని దృష్టాంతముతో నిరూపించుచున్నారు; తమః - రాహుగ్రహము; <span class="CharOverride-1">చన్ద్రార్క సంయుక్తమ్</span> - చంద్రునితో సూర్యునితో కలసియున్నదై; <span class="CharOverride-1">ఉపలభ్యతే -</span> అదృశ్యమైయున్నను ఉన్నట్లు తెలియవచ్చుచున్నది; అట్లే: <span class="CharOverride-1">శరీరసంయుక్తః</span> <br/>- దేహముతో కూడియున్నవాడై; శరీరీ - శరీరమును తాల్చిన ఆత్మ; ఉప లభ్యతే - ఉన్నదని తెలియవచ్చుచున్నాడు. దేహములేనియపుడును, సుషుప్తియందును స్పష్టముగా ప్రకాశింపదు. </p> <p class="Footer">22. సూర్యుని వదలిన రాహువునకు ప్రకాశము లేదు. అట్లే చైతన్యము లేక జడమైన దేహమునకు ప్రకాశము లేదు. శరీరి ప్రకాశింపడనగా ఉన్నట్లు తెలియరాడు కాని ఉండునని తాత్పర్యము. <span class="CharOverride-1">తద్వచ్ఛరీర నిర్ముక్తః </span>- రాహువువలె ప్రకాశింపని శరీరము తనదిగా ఎవనికి కలదో అతడు తద్వచ్ఛరీరుడు - దానితో విడువబడినవాడు - 'స్వర్గి నశించెను' అనుచోట అతని స్వర్గము నశించె ననియే యర్థము - ఆవిధముగా ఇచట శరీరమాత్రము లభింపక పోవుటయే చెప్పదలచిన విషయము. </p> <p class="Footer">23. అట్లయినచో మరణమున శరీరము ఉండదు. కనుక ఆత్మయు లేదందుమా! అని ఆశంకించి సమాధానము చెప్పుచున్నారు. అప్పుడును మరియొక శరీరము సంబంధముండునని దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నారు.</p> <p class="Footer"> అమావాస్యాం గతః - సూర్యునితో కలసి ఉండుటను పొందిన; చన్ద్రః - చంద్రుడు; <span class="CharOverride-1">నక్షత్రైః</span> - నక్షత్రములతో, యుజ్యతే - కూడియున్నాడు; అమావాస్యనాడు కనబడకున్నను ఇతర సమయములలో చంద్రుడు కన్పట్టుచున్నాడు. ఇట్లే ఒక శరీరముతో కూడియే యున్నాడు. కనుక శరీరము లేనిచో ఆత్మ లేదనుట పొసగదు. </p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">203</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">మనుబృహస్పతి సంవాదము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">203</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">చతురధిక ద్విశతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer ParaOverride-1">1. దేహసంబంధము పరిహరింపరానిదని తెలిసికొని ముక్తిపొందగోరువానికి కళవళపాటు కలుగకుండుగాక అని ఆఉద్వేగము పోగొట్టు సాధనమగుయోగమును చెప్పుగోరుచు దృష్టాంత పూర్వకముగా దేహవియోగ ప్రకారము వివరించు చున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">యథా</span> - ఏవిధముగా; <span class="CharOverride-1">వ్యక్తమ్</span> - పైకి స్పష్టముగా కానవచ్చెడు స్థూలశరీరము; <span class="CharOverride-1">శేతే</span> - నిద్రించుచు; <span class="CharOverride-1">స్వప్నే</span> - కలయందు; <span class="CharOverride-1">చేతనమ్</span> - కారణదేహము; ప్రేత్య - స్థూలదేహమునుండి విడివడి; చరతి - తిరుగుచుండునో - <span class="CharOverride-1">తద్వత్</span> - అట్టిస్థితిని; <span class="CharOverride-1">భవః</span> - సంసారమందురు; <span class="CharOverride-1">తథా</span> - అట్లే; <span class="CharOverride-1">ఇన్ద్రియసంయుక్తమ్ </span>- ఇంద్రియములతో కూడిన - లింగశరీరము కూడ నిద్రించును; సుషుప్తియందు కేవలము జ్ఞానము; <span class="CharOverride-1">ప్రేత్య</span> - లింగశరీరమునుండి వెలువడి; <span class="CharOverride-1">చరతి</span> - తిరుగుచుండును - ఆస్థితిని; అభవః - మోక్షము - అందురు. </p> <p class="Footer ParaOverride-1">2. <span class="CharOverride-1">జ్ఞేయమ్</span> - తెలియదగినదగు ఆత్మను; <span class="CharOverride-1">జ్ఞానేన</span> - బుద్ధితో; <span class="CharOverride-1">పశ్యతి</span> - చూచును. ఆత్మజ్ఞానముచేత ముక్తి పొందును. అదియు ఇంద్రియములను జయించుట వలన సిద్ధించునని భావము.</p> <p class="Footer ParaOverride-1">3. <span class="CharOverride-1">జ్ఞానే</span> - బుద్ధియందు; <span class="CharOverride-1">న పశ్యతి</span> - చూడడు; ఇంద్రియములు చెల్లాచెదరయినపుడు బుద్ధితో ఆతడు ఆత్మపదార్థమును పట్టుకొనజాలడని భావము.</p> <p class="Footer">4. <span class="CharOverride-1">అబుద్ధిః</span> - అవిద్య - అనిత్యము, ఆశుచి, దుఃఖము, ఆత్మకానిది యగు దేహము మొదలగు వానియందు, నిత్యము శుచి, సుఖము, ఆత్మ అను విపరీతబుద్ధి యగుట; <span class="CharOverride-1">అజ్ఞానకృతా</span> - అజ్ఞానముచేత చేయబడినది; దానిచేత; <span class="CharOverride-1">మనః</span> - మనస్సు; <span class="CharOverride-1">ఆకృష్యతే</span> - ఆకర్షింపబడును - రాగాదులు పైకొన్నది; యగును; అట్లగుటయే మనస్సు దుష్టమగుట - దానివలన; పఞ్చ, మానసాః - మనస్సు ప్రధానముగా గల అయిదు; చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము అనునవి; <span class="CharOverride-1">సంప్రదుష్యన్తి</span> - చెడిపోవును. </p> <p class="Footer">5. <span class="CharOverride-1">అజ్ఞానతృప్తః</span> - అజ్ఞానమనగా మోహము, దానితో నిండినది, <span class="CharOverride-1">అవగాఢః</span> - అత్యంతము మునిగిన; భూతాత్మా - జీవుడు; <span class="CharOverride-1">అదృష్టవత్</span> - ధర్మము, అధర్మము అనువానితో కూడిన విధముగా; <span class="CharOverride-1">విషయేభ్యః</span> - విషయములగు శబ్దాదులవలన; <span class="CharOverride-1">న తృప్యతే</span> - తృప్తినందుడు; నివర్తతే - మరలివచ్చును. అనుభవము కొరకు మరల మరల పుట్టుచుండునని భావము. </p> <p class="Footer">6. <span class="CharOverride-1">అన్తగతమ్</span> - నాశనమును పొందినది ; </p> <p class="Footer">7. <span class="CharOverride-1">అన్యథా</span> - సుఖదుఃఖములకు సాధనము కాని దానిని </p> <p class="Footer">8. <span class="CharOverride-1">ప్రఖ్యే</span> - స్వచ్ఛమైన; <span class="CharOverride-1">ఆత్మని</span> - బుద్ధియందు </p> <p class="Footer">9. <span class="CharOverride-1">ప్రసృతైః</span> - జాలువారెడు - ఇంద్రియవిషయములవైపు జారిపోయెడు; <span class="CharOverride-1">ఇన్ద్రియరూపేభ్యః</span> - ఇంద్రియములచేత నిరూపింపబడినవగు శబ్దము మొదలగు వానినుండి; ఆత్మానమ్ - ఇంద్రియమను పేరు గలదానిని; <span class="CharOverride-1">ఆత్మనా</span> - మనస్సు తోడనే; నిగృహ్ణీయాత్ - పట్టి నిలుపవలయును </p> <p class="Footer">10. లవణోదకన్యాయముచేత కారణమునందు కార్యమును లయించుట అను నియమము ననుసరించి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, జ్ఞానము, మహత్తు అనువానిని వెనుకటి వెనుకటి వానిని తరువాతి తరువాతి వానిలో ప్రవిలీనము చేయుటకొరకు వాని కార్య కారణభావమును వివరించుచున్నారు. </p> <p class="Footer"> పూర్వము - ఇచట కారణము అని అర్థము; జ్ఞాన మనగా జీవాత్మ; మహత్తనగా పరమాత్మ. ఇదేవిధముగా శ్రుతియందును ఇంద్రియాదుల ప్రవిలాపనము - నామరూపములు లేకుండ కలిపి వేయుట - కానవచ్చుచున్నది. </p> <p class="Poem-1"><span class="CharOverride-9">యచ్ఛే ద్వాఙ్మనసీ ప్రాజ్ఞ స్తద్యచ్ఛే జ్జ్ఞాన ఆత్మని, </span></p> <p class="Poem2"><span class="CharOverride-9">జ్ఞాన మాత్మని మహతి నియచ్ఛే చ్ఛాప్త ఆత్మని” </span></p> <p class="Footer"> ఈశ్రుతికి అర్థము - <span class="CharOverride-1">ప్రాజ్ఞః</span> - ప్రజ్ఞకలవాడు; <span class="CharOverride-1">వాక్</span> - వాక్కును వాక్కుమొదలగు వానిచేత గ్రహింపదగు ఇంద్రియములను; <span class="CharOverride-1">మనసి,</span> - మనస్సునందు; <span class="CharOverride-1">మనసీ</span> - అని దీర్ఘము ఆర్షము; వాక్కుమొదలగు వ్యాపారములను వదలివైచి మనోమాత్రముగా నిలువవలయునని భావము. </p> <p class="Footer"> <span class="CharOverride-1">తత్</span> - ఆమనస్సును, విషయ వికల్పములకు అభిముఖమైనదానిని; <span class="CharOverride-1">జ్ఞానే</span> - జ్ఞానశబ్దము బోధించెడు బుద్ధియందు; <span class="CharOverride-1">యచ్ఛేత్</span> - కట్టిపడవేయవలయును; <span class="CharOverride-1">జ్ఞావమ్</span> - ఆబుద్ధిరూపమైనజ్ఞానమును; <span class="CharOverride-1">మహతిఆత్మని</span> - భోక్త అయిన తత్వమునందు; నియచ్ఛేత్ - లీనము చేయవలయును; ‘ఉన్నాను' అన్నంతమాత్రముగా ఉండవలయునని భావము? దానినికూడ; <span class="CharOverride-1">శాక్తే ఆత్మని - </span> పరమాత్మయందు; చిట్టచివరి దిక్కుఅయినది, తొలగినసమస్త విశేషములు కలదియగు పరమాత్మయందు; <span class="CharOverride-1">నియచ్ఛేత్</span> - నిలువరింపవలయును. </p> <p class="Footer ParaOverride-1">11. ప్రవిలాపనక్రమమును స్పష్టముగా చెప్పుటకై ఉత్పత్తి క్రమమును చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">అవ్యక్తాత్</span> - శుద్ధము, చిన్మాత్రము అయిన ఆత్మ నుండి; <span class="CharOverride-1">యుక్తమ్</span> - వ్యాపించియున్న - అనిభావము; మనస్సునుండి శ్రోత్రాదులు, వానినుండి శబ్దాదులు వెలువడినవని తాత్పర్యము. ఆవిధముగా సుషుప్తియందు చెవి సర్వశబ్దములతోపాటు లయమగును. మనస్సు సర్వధ్యానములతోపాటు లయమగును - అని యిట్లు ఆత్మయందు విషయములతో కూడిన ఇంద్రియములు, మనస్సు మొదలగు వానిలయము అగును. జాగ్రధవస్థయందు<span class="CharOverride-1"> ‘‘ఏదస్మాదాత్మనః సర్వేప్రాణా యథాయతనం విప్రతిష్ఠన్తే. ప్రాణేభ్యోదేవా దేవేభ్యోలోకాః’’</span> - ఈ ఆత్మవలన సర్వప్రాణములు వాని వాని స్థానములతోపాటు ఏర్పడును. (ఇచట ప్రాణములనగా ఇంద్రియములు) ప్రాణములవలన ఆదిత్యాదులగు దేవతలు, వానివలన లోకములు ఏర్పడునని వినవచ్చుచున్నది. ఇట్లు శబ్దార్థమును చెప్పితిమి. కాని ఈ క్రమము చెప్పుటలో ప్రయోజనమేమి? అన్నచో అసమాధియందు సమాధిభ్రమను తొలగించుటకు - అని చెప్పెదము. </p> <p class="Footer ParaOverride-1"> అదియిట్టిది. వెనుకటి వెనుకటి కక్షనుండి తరువాతి తరువాతి కక్షలోనికి ప్రవేశింపగోరు యోగికి నిరోధింపబడుచున్న చిత్తము దైనందిన (దినదినమునకు సంబంధించిన) లయము యొక్క అభ్యాసమువలన లీనమగును. లేదా భయపడినపక్షివలె ఒకప్పుడు పూర్వావస్థను అప్పటికప్పుడు చేరుకొనును. ఇట్లే లయము, విక్షేపము అను నీరెండును హేయములే అని వినవచ్చుచున్నవి. </p> <p class="Poem-1 ParaOverride-15"><span class="CharOverride-9">“లయవిక్షేప రహితం మనః కృత్వా సునిశ్చలమ్ </span></p> <p class="Poem-1 ParaOverride-15"><span class="CharOverride-9">యదా యాత్యున్మ నీభావం తదా తత్పరమంపదమ్” </span></p> <p class="Footer ParaOverride-1">' ‘మనస్సును, లయములేనిది, విక్షేపము (చెదరుపాటు) లేనిది, మిక్కిలి నిశ్చలమైనదిగా చేసి సాధకుడు ఉన్మనీ భావమును పొందుటయే పరమపదము’ </p> <p class="Footer ParaOverride-1"> అందు స్థూలప్రపంచమునుండి సూక్ష్మమునకు పోవుచు మధ్యలీనమగుట సుషుప్తియే. సూక్ష్మము నుండి కారణమున కరుగుచు లీనమగుట విదేహస్థితి. కారణమునుండి శుద్ధతత్త్వమును చేరుకొనుచు లీనమగుట ప్రకృతిలయము. శుద్ధమును పొందినవాడు జీవన్ముక్తుడు. అందు మొదటివాడు సంసారియే. నడిమివారిద్దరు క్రమముక్తిని పొందినవారు. చివరివాడు సద్యోముక్తిని పొందినవాడు. </p> <p class="Footer ParaOverride-1">12. పైఆర్థమునే వివరించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">త్యజతి</span> - వదలివేయవలయునని భావము; <span class="CharOverride-1">వ్యక్తయః</span> - వ్యక్తులను - శబ్దము మొదలగువానికి ఆశ్రయభూతములయిన ఆకాశము మొదలగువానిని, కారణ శరీరములను; <span class="CharOverride-1">ముక్త్వా</span> - వదలి; విముఞ్చేత్ - హృదయాకాశమున తోచెడు వానిని వదలవలయును; <span class="CharOverride-1">ప్రాకృతాన్</span> - ప్రకృతి వలన పైకిపొడమివచ్చెడు; గ్రామాన్ - గ్రామములవంటివి, అంతఃకరణమనెడు బాటసారికి నడుమ తటస్థపడు మజిలీలవంటివి అయిన స్థూలసూక్ష్మ కారణదేహములను వదలివైచి; అమృతమ్, అశ్నుశే - అమృతమును అనుభవించును. మోక్షానందమందునని భావము. </p> <p class="Footer ParaOverride-1">13. ప్రాకృతాన్ గ్రామాన్ అన్నచోట సాంఖ్యులు చెప్పెడు ప్రకృతికి ఇచట ప్రసంగములేదని, ఇంద్రియాదుల ఉదయాస్తమయములు ఆత్మవే అనియు దృష్టాంతపూర్వకముగా రెండు శ్లోకములతో వివరించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1">14. <span class="CharOverride-1">ఇన్ద్రియగుణాన్</span> - ఇంద్రియములకు భోగ్యములైన రూపము మొదలగువానిని; <span class="CharOverride-1">ఆవృత్య</span> - మరలించుకొని అస్తమించునని భావము.</p> <p class="Footer ParaOverride-1">15. ఇతనికి మరల మరల దేహము వచ్చుట యెట్లో తెలుపుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">ప్రణీతమ్</span> - కర్మముతో తెచ్చిపెట్టబడిన; <span class="CharOverride-1">మార్గమ్</span> - మార్గమును - విషయమును; <span class="CharOverride-1">కర్మణా, ఏవ</span> - కర్మముతోడనే; <span class="CharOverride-1">నీయమానః</span> - పొందింపబడిన వాడగుచు; కర్మఫలమ్ - కర్మముల ఫలమగు, సుఖము మొదలగుదానిని; ప్రాప్నోతి - పొందుచున్నాడు; ఎందువలననగా; ప్రవృత్తమ్ - ప్రవృత్తికి - సంసారమున ప్రవర్తించుటకు - సంబంధించిన; <span class="CharOverride-1">ధర్మమ్</span> - ధర్మమును; <span class="CharOverride-1">ఆప్తవాన్</span> - పొందెను కదా! </p> <p class="Footer ParaOverride-1">16. దీనిని పరిహరించుటకై నివృత్తిధర్మమును ఉపదేశించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">నిరాహారస్య</span> - ఆహరణమే - తెచ్చిపెట్టుకొనుటయే ఆహారము - అనగా విషయభోగము - దానిని వదలివైచినవానికి; <span class="CharOverride-1">విషయాః</span> - శబ్దముమొదలగు అభిలాషలు; వినివర్తన్తే - మరలిపోవును - అట్టివానియందు ప్రవేశింపవు; కాని; <span class="CharOverride-1">రసవర్జమ్</span> - కాని వాసనాత్మకమైన ప్రీతిభావము మాత్రము ఉండును; <span class="CharOverride-1">పరం దృష్ట్వా</span> పరమాత్మను దర్శించిన, <span class="CharOverride-1">అస్య</span> - పొందిన సర్వకామములు కలిగిన పురుషునకు; <span class="CharOverride-1">రసః - అపి</span>, రసము - ఆవాసనాత్మకమైన భావముకూడ; <span class="CharOverride-1">నివర్తతే</span> - వెనుదిరిగిపోవును. భోగముల ఇచ్ఛను వదలి ఆత్మను దర్శించువానికి విషయబంధము తెగిపోవునని భావము </p> <p class="Footer ParaOverride-1">17. కర్మగుణైఃహీనా - కర్మములు గుణములుగానయిన విషయముల తగులములను వదలివైచిన; బుద్ధిః - బుద్ధి; <span class="CharOverride-1">మనసి</span> - మనస్సు ప్రధానముగా నయిన త్వం పదార్థము - నీవు అనెడు భావమునందు (తత్త్వమసి అను మహావాక్యములోని 'త్వమ్' అనుపదమునకు అర్థమునందు; తదా - అప్పుడు మనస్సుకూడ; <span class="CharOverride-1">బ్రహ్మ</span>, సంపద్యతే - బ్రహ్మముగా నగును; ఎందువలన ననగా అందే కదా బుద్ధియు మనస్సును లయమగునది! </p> <p class="Footer ParaOverride-1">18. బ్రహ్మ పదార్థమును వివరించుచున్నారు - స్పర్శాదులు లేని దగుటవలన తాకుట మొదలగు క్రియలకు ఆశ్రయము కానిది. ఇంద్రియములు లేని దగుటచే శ్రవణాది క్రియలు లేనిది. </p> <p class="Footer ParaOverride-1"> అశృణ్వానము, అవితర్కము అనుటచే అనుమాన ప్రమాణమునకు తెలియబడనిది. ఇట్టి పర బ్రహ్మమును; <span class="CharOverride-1">సత్త్వమ్</span> - బుద్ది; <span class="CharOverride-1">ప్రవిశతే</span> - ప్రశేశించును. </p> <p class="Footer ParaOverride-1">19. అధ్యాయతాత్పర్యమును ముగించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">ఆకృతయః</span> - కుండమొదలగు స్వరూపములు; మనస్సంకల్పముచేత ఏర్పడినవి కనుక; మనస్సునందే మగ్నములగును - మునిగిపోవును. మరల కానరాకుండలయమై పోవును. అక్షపాదాచార్యుల సూత్రము కూడ ఇట్లే యున్నది - “దోషనిమిత్తం రూపాదయో విషయాః సంకల్పకృతాః” - “దోషమునకు కారణముగా రూపము మొదలగు విషయములు సంకల్పముచేత చేయబడినవి.' ఇట్లు మనస్సు బుద్ధి యందును, బుద్ధి జీవుని యందునుజీవుడు బ్రహ్మమునందును లయమగునని తాత్పర్యము. </p> <p class="Footer">20. <span class="CharOverride-1">‘సిద్ధిర్న’</span> అనుచోటి నశబ్దము కాకాక్షి న్యాయము ననుసరించి రెండువైపుల అన్వయించును. కార్యముతో కారణమునకు అవ్యాప్తిఉన్న కారణమున ఇంద్రియాదులు తమతమ కారణములైన వాని నెరుగజాలవు. సూక్ష్మమైన చిదాత్మమాత్రము సర్వమును గాంచును. దానితో కూడినపుడు మాత్రము అవి తమ తమ కార్యములను దర్శించును - అని అర్థము.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">204</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">మనుబృహస్పతి సంవాదము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">204</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer">1. <span class="CharOverride-1">దుఃఖోపఘాతే</span> - దుఃఖరూపమైన ప్రతిబంధము - ఆటంకము; అనగా యోగమున విఘ్నము కలిగినపుడని తాత్పర్యము; <span class="CharOverride-1">శారీరే</span> - రోగము మొదలగునది; <span class="CharOverride-1">మానసే</span> - శోకము మొదలగునది; <span class="CharOverride-1">యత్నం</span> - యోగాభ్యాసము - ఏదుఃఖరూపమైన విఘ్నము కలుగునో దానిని గూర్చి చింతించుచుండరాదని భావము. </p> <p class="Footer ParaOverride-1">5. జానపదికమ్ - జానపదులకు - వివేకము లేని వారికి సంబంధించినది; లేక పదిమందికి సంబంధించినది. <span class="CharOverride-1">ఉపక్రమమ్</span> - ప్రతీకారమునకైన ఉపాయమును; </p> <p class="Footer ParaOverride-1">6. మరణమ్ - చావు - అగునని భావము. </p> <p class="Footer ParaOverride-1">7. <span class="CharOverride-1">తే</span> - వారు - బ్రహ్మమును సాధించినవారు; ఇంతవరకు దుఃఖనివృత్తికి ఉపాయమైన వైరాగ్యమును తెలిపి, ఇకపై సుఖప్రాప్తికి ఉపాయమైన బ్రహ్మాత్మజ్ఞానమును గూర్చి చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1">8. <span class="CharOverride-1">‘‘పాలనే చ తే సుఖం న’’</span> - అని సంబంధము - ధనమును పాలించుటయందును సుఖము లేదని తాత్పర్యము. <span class="CharOverride-1">దుఃఖేన చ అధిగమ్యతే -</span> ఎంత దుఃఖ పడినను ఎన్నటికిని లభింపదని భావము.</p> <p class="Footer ParaOverride-1">9. <span class="CharOverride-1">జ్ఞేయ; అభినిర్వృత్తమ్</span> - జ్ఞేయమనగా తెలియదగినది - అహంకారము మొదలుకొని కుండ మొదలగు దానివరకు ఉన్న వస్తుసముదాయము - అది యంతము అవిద్యారూపము. దానిచేత ఏర్పడునది. అందువలననే మనస్సు జ్ఞేయమే గుణముగా గలది.<span class="CharOverride-1"> ప్రజ్ఞా కరణసంయుక్తమ్</span> - ఆమనస్సు, ప్రజ్ఞాకరణములనగా జ్ఞానేంద్రియములు, వానితో కూడినదైనపుడు; బుద్ధిః - విషయములే ఆకారముగా గల వృత్తి; <span class="CharOverride-1">భవతి</span> - ఏర్పడును. </p> <p class="Footer ParaOverride-1">10. బుద్ధిని నిలిపిపట్టుట బ్రహ్మము అభివ్యక్తికి కారణమనుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> కర్మగుణములచేత - కర్మములవలన ఏర్పడిన సంస్కారములతో కూడిన బుద్ధి; <span class="CharOverride-1">మనసి</span> - మననమే స్వరూపముగా గల ధీవృత్తియందు; ప్రవర్తించినచో అదే స్వరూపముగా పరిణమించినచో - అప్పుడు బ్రహ్మము చక్కగా తెలియవచ్చునని భావము. అట్టి వృత్తి పొడము కారణమును చెప్పుచున్నారు; </p> <p class="Footer ParaOverride-1"> ‘<span class="CharOverride-1">ధ్యానయోగసమాధినా</span>’ - ధ్యానమనగా యమనియమాది అంగములతో కూడినది - దేనిని మనస్సున నిలుపు కొనదలచితిమో దాని ఆకారము చెదరకుండునట్టి స్థితి - అదియే యోగము. దానివలన ఏర్పడెడు సమాధితో బ్రహ్మజ్ఞానము కలుగునని ఫలితార్థము. </p> <p class="Footer ParaOverride-1">11. <span class="CharOverride-1">గుణవతీ</span> - ఇంద్రియాదులతో కూడినది; <span class="CharOverride-1">గుణేషు</span> - రూపము మొదలగు గుణములందు; <span class="CharOverride-1">అపరాత్</span> అజ్ఞానమువలన; </p> <p class="Footer ParaOverride-1">12. <span class="CharOverride-1">యదా</span> - ఎప్పుడైతే - అజ్ఞానమునశించిన కాలమునందని భావము; <span class="CharOverride-1">ధ్యానమ్</span> - ధ్యానలక్ష్యమగు వస్తువు; <span class="CharOverride-1">మనసి</span> - బుద్ధివృత్తియందు; <span class="CharOverride-1">ప్రాప్నోతి</span> - తెలియవచ్చునో; <span class="CharOverride-1">పూర్వజమ్</span> - అన్నింటికంటె ముందు ఏర్పడినది - అజ్ఞానమునకును కారణమైనదని భావము; <span class="CharOverride-1">నికషే</span> - ఒరగల్లునందు; <span class="CharOverride-1">నికషమ్, ఇవ</span> - బంగారురేఖవలె; <span class="CharOverride-1">ప్రజ్ఞాయతే</span> - నిస్సంశయముగా తెలియవచ్చును. </p> <p class="Footer ParaOverride-1">13. అదియు ఒక విషయ రూపమున నికషమువలె తెలియవచ్చినచో బ్రహ్మమునకు జడత్వము ఏర్పడదా? అని శంకించి సమాధానము చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> మనః - మనస్సు - అఖండాకారమైన వృత్తి; పూర్వమ్ - అఖండమగు చైతన్యము అభివ్యక్తమగుటకు ముందే; ఆహృతమ్ - ఆఖండమగు బ్రహ్మము ప్రకాశముచేత రూపుమాసిపోయినది - నశించిపోయినది; ఏలయనగా అది ఇంద్రియార్థములగు శబ్దముమొదలగు వానినే చూపగలిగినట్టిది. మరియు దగ్గరగానున్న శబ్దము, రూపము మొదలగువానిని మాత్రమే అపేక్షించునట్టిది. ఆకారణముచేత; నిర్గుణస్య - గుణసంబంధ మేమాత్రమును లేని బ్రహ్మమునకు; అది, నిదర్శకము కాజాలదు. ఇట్లు బ్రహ్మమునకు జడభావము కలుగదు. </p> <p class="Footer ParaOverride-1">14. <span class="CharOverride-1">ద్వారాణి</span> - ద్వారములవంటివగు ఇంద్రియములను; <span class="CharOverride-1">సంవార్య</span> - మూసివైచి; <span class="CharOverride-1">మనసి</span> - మనస్సునందు మనసి - సంకల్పమాత్రముగా ఉన్నవాడై; ఆసంకల్పమునుకూడ; <span class="CharOverride-1">బుద్ధౌ</span> - బుద్ధియందు; <span class="CharOverride-1">కృత్వా</span> ప్రవిలాపనమొనర్చి; <span class="CharOverride-1">ఏకాగ్రతామ్</span> - అస్మి - ఉన్నాను - అని ఆత్మమాత్రాకారభావమును - పొంది; <span class="CharOverride-1">తత్పరం</span> - దానికంటె తరువాతి స్థితిని - బ్రహ్మభావమును; <span class="CharOverride-1">ప్రతిపద్యతే</span> - పొందును. ఇంద్రియములను విషయములందు ప్రవర్తింపనీయక మనస్సును బుద్ధియందు ప్రవిలాపనము - పూర్తిగా లేనితనమును - చెందించి ఏకాగ్రస్థితిని సాధించిన వాడు బ్రహ్మైక్యభావమును పొందునని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">15. <span class="CharOverride-1">గుణక్షయే</span> - గుణములనగా, <span class="CharOverride-1">ఇచట</span>, అయిదుగా విడివడని <span class="CharOverride-1">శబ్దతన్మాత్రాదులు</span>; వాని క్షయము కలుగగా; <span class="CharOverride-1">మహాన్తి, భూతాని</span> - వాని కార్యములగు - అయిదుగా నేర్పడిన భూమిమొదలగు మహాభూతములు; <span class="CharOverride-1">నివర్తన్తే</span> - నశించిపోవును; అట్లే బుద్ధి మననాకార రూపమైన అహంకారమునందు నిలిచిపోవునప్పుడు ఇంద్రియములను తీసికొనియే లయమైపోవునని భావము. </p> <p class="Footer ParaOverride-1">16. <span class="CharOverride-1">వ్యవసాయగుణోపేతా</span> - వ్యవసాయమనగా నిశ్చయము - అదియే గుణము - ధర్మము; దానితో కూడినది అట్టిబుద్ధి; <span class="CharOverride-1">అన్తరచారిణీ</span> - అంతరమనగా అహంకారము నందు - తిరుగాడు నట్టిది అయినచో ఆ అహంకారరూపమైనదే అగును. కుండలము అను ఒక ఆకారమును పొందినను బంగారము బంగారమే యగును కదా! </p> <p class="Footer ParaOverride-1">17. మనస్సు అను పేరుగల అహంకారము మూడుగుణముల స్వరూపమైనట్టిది. అది విజాతీయమగు నిర్గుణమునందు లయమగుచు తనధర్మముతో దానిని కూడ చెడగొట్టును - గుణములు కలదిగా చేయునుగదా - అని శంకించి సమాధానము చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">ధ్యానగుణమ్</span> - ధ్యానముచేత సర్వ ఉత్కృష్ట స్థితిని బొందుట అనుధర్మము గలది యగు; <span class="CharOverride-1">మనః</span> - అహంకారము; <span class="CharOverride-1">గుణవద్భిః</span> - రూపముమొదలగు గుణములుగల విషయములతో పాటు; <span class="CharOverride-1">యదా</span> ఎప్పుడు; <span class="CharOverride-1">గుణోపేతం</span> - గుణములగు సత్త్వము మొదలగు వానిని కూడినది - అనగా మూలప్రకృతిని పొందినది అగునో, <span class="CharOverride-1">తదా - అప్పుడు; సర్వాన్ గుణాన్ హిత్వా</span> సర్వగుణాత్మకమగు అవ్యక్తమును కూడ తాల్చి; <span class="CharOverride-1">నిర్గుణం ప్రతిపద్యతే</span> - గుణములు లేని పరబ్రహ్మస్వరూపమును పొందును. </p> <p class="Footer ParaOverride-1"> సత్త్వము మొదలగునవి ప్రవిలాప్యములు కాని యెడల, వానియందు లీనమైన మనస్సు, సుప్తి, ప్రళయముల యందువలె మరల పైకి లేచివచ్చును. కారణము నాశనము కాలేదు కనుక. అదృష్టము అను పేరుగల మరియెక నిమిత్తము లేని కారణమున పైకి లేచివచ్చుట సంభవింపదు అనరాదు. దానివలన విన్నది నశించుటయ, విన కుండినది కల్పన మగుటయ నను దోషము సంభ వించును. 'తత్త్వమసి' అది నీవే అయి ఉన్నావు అను వాక్యార్ధ జ్ఞానమువలన కృతకృత్యత వినవచ్చుచున్నది. 'దేవుని గూర్చి తెలిసికొని, సర్య పాశములను త్రెంచుకొనవచ్చును' అన్న అర్ధముగల వేద వాక్యమును భట్టి, అహంకారము ప్రధానమున వీనమైపొవుట వలన కృతకృత్యత్వము అను నిమిత్తము అప్రయోజకము–అని నీ సూత్రకారుని వలననే అదృష్టమునకు ప్రయోజకత్వము లేదని చెప్పబడినది. అందువలన సత్త్వము కూడ ప్రవిలాపనీయమే. గునాత్మకమైన దానికి నిర్గుణత కలుగదు. ఏలయన పైన చెప్పిన దోశము వచ్చిపడును కనుక. అందువలన త్రాటి యందు తోచిన సర్పము మొదలగుదానివలె బాధకలుగుటయే దీని ప్రళయము. అట్టి యీ విషయమునే ఇక్కడ చెప్పుచున్నారు. మనస్సు గుణములను ధారణ చేసి నిర్గుణత్వమును పొందును అని. హిత్యా అనునది ధాఞ్ ధాతువురుపము. ఓహాక్ త్యాగే అనుధాతువునుండి ఏర్పడిన రుపము కాదు. హిత్యా–'ఆలంబముగా చేసికొని' అను నర్ధమును చెప్పుకొనవలయును. వదలివైచి అను నర్ధమును తీసికొనరాదు. (అదృ ష్టితోనే తాత్పర్యములో పట్టుకొని అనునర్ధమును గ్రహించుట). గుణాన్ ఉపాదాయ — గుణములను పట్టుకొని ఏలయన కారణమును వదలివైచి కార్యమునకు మరియొకటి ప్రాప్తించుట సంభవింపదు కనుక. మనస్సులయమగుటకు ఆధారభూతమైన బ్రహ్మము నందు మానవ దోష ప్రసక్తి కలుగును–అని భావము.</p> <p class="Footer ParaOverride-1">18. అహంకారము మొదలగునది ముడివస్తువుగా గల అవ్యక్తమను పేరుగల గుణత్రయము స్వరూపము వాక్కులకందనిది అనుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> అవ్యక్తము సత్తు కాదు - <span class="CharOverride-1">‘నేహ నానాస్తి కించన’</span> ఇందు అనేకము అనునది ఏకొంచెమును లేదు - అనుశ్రుతికి కుదరనిది కనుక. అట్లని కుందేటి కొమ్మువలె అసత్తును కాదు. దాని కార్యము ఏర్పడుచున్నది కదా! పోనీ ఉండియు లేనిదనుకొందమా - <span class="CharOverride-1">సదసత్తా - </span>అన్నచో అదియు కాదు. అది విరోధము కదా! - కనుక నిదర్శనము - దృష్టాంతము లేదనుచున్నారు. కనుకనే దానిని పొందుటయు సాధ్యము కాదని చెప్పుచున్నారు. పదన్యాసః - వాక్కుల వ్యవహారము. </p> <p class="Footer ParaOverride-1">19. అందువలన వేదాంత శ్రవణము మొదలగువాని వలన కలిగిన సాక్షాత్కారము చేతనే ఆత్మతత్త్వమును నిశ్చయింపవలయునని చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> తపసా - గాఢమైన ఆలోచన చేత-ధ్యానరూపమైనదాని చేత; అనుమానేన - మననమను పేరుగలదాని చేత - యుక్తులను సమన్వయించుకొనుట చేత అనిభావము; గుణైః - శమము, దమము మొదలగు లక్షణములచేత; <span class="CharOverride-1">జాత్యా</span> - జాతికి ఉచితమైన స్వధర్మాచరణముచేత; <span class="CharOverride-1">శ్రుతేన</span> - వేదాంతవిద్యా శ్రవణముచేత; <span class="CharOverride-1">విశుద్ధేన, అంతరాత్మనా</span> - ఏదోషములు లేని మనస్సుచేత; పరమం బ్రహ్మ - పరబ్రహ్మమును; నినీషేత్ - తెలియగోరవలయును. </p> <p class="Footer ParaOverride-1">20. పైని చెప్పిన విధముగా తత్త్వమును దర్శించువానికి లోపలను, వెలుపలను ఒకే తీరుగా నుండును. </p> <p class="Footer ParaOverride-1"> భేదము కన్పట్టుట యుండదనుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">గుణహీనః</span> - సత్వరజస్తమములను మొదలంట వదలివైచిన జ్ఞాని; <span class="CharOverride-1">తం మార్గమ్</span> - ఆ ప్రపంచము లేని దారిని; <span class="CharOverride-1">బహిః - వెలుపలకూడ; సమనువర్తతే</span> - సమన్వయించుకొని ప్రవర్తించును. లోపలను, బయటను బ్రహ్మమునే పరికించునని భావము. ఏలయనగా - జ్ఞేయము - తెలియదగినదగు ఆబ్రహ్మము నందు గుణములు లేవు. సహజముగా అది అట్లు మాత్రమే తెలియ దగినది. అందువలన నిస్తర్కము - ఇతరప్రపంచ విషయములకు వలె, తర్కింపనలవి కానిది. </p> <p class="Footer ParaOverride-1">21. నైర్గుణ్యాత్ - విషయములవైపు ప్రసరించినది కావున; బుద్ధి; బ్రహ్మ - బ్రహ్మమును; <span class="CharOverride-1">ఆప్నోతి</span> - పొందును. <span class="CharOverride-1">సగుణత్వాత్</span> - గుణములు కలదియైన కారణమున; <span class="CharOverride-1">నివర్తతే</span> - బ్రహ్మమునుండి మరలిపోవును. బ్రహ్మమును చేరజాలనిదగునని భావము; <span class="CharOverride-1">గుణప్రచారిణీ</span> - గుణములయందు - విషయములయందు - తిరుగాడునది; ఇంధనమునందు అగ్నివలె - ఇంధనము తడిగానుండుట సగుణతకు, ఆ తడి లేకపోవుట నిర్గుణత్వమునకును గుర్తుగా భావింపదగును. </p> <p class="Footer ParaOverride-1">22. <span class="CharOverride-1">యథా</span> - ఇచట సుషుప్తిదశయందు అనునర్థమును భావింపవలయును. ఆదశలో ఇంద్రియములకు తమ తమ పనులతో - చూచుట మొదలగు వానితో సంబంధ ముండదు. అట్లే తురీయదశలో - అనగా గుణములకు అతీతమైన దశలో బ్రహ్మానుభవము తప్ప మరియొక అనుభవముండదని తాత్పర్యము. అదియే ప్రకృతికంటె పరమమైన దశ. </p> <p class="Footer ParaOverride-1">23. <span class="CharOverride-1">శరీరిణః</span> - చిదాభాసగల జీవులనబడువారు; <span class="CharOverride-1">ప్రకృతితః</span> - ప్రకృతివలన - అనగా అజ్ఞానము వలన; <span class="CharOverride-1">ప్రవర్తన్తే</span> - ప్రవృత్తిమార్గమున తిరుగుచున్నారు - ప్రపంచజ్ఞానము కలవారగుచున్నారని భావము; <span class="CharOverride-1">నివృత్తే</span> - అజ్ఞానము మరలిపోయినపుడు; <span class="CharOverride-1">నివర్తన్తే</span> - ప్రపంచదృష్టిలేక బ్రహ్మమునందే నిలుచుచున్నారని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">24. <span class="CharOverride-1">పురుషః</span> - జీవుడు; అభిమానః - ఇది యిట్టిదే అను తెలివి; లేదా ఇది ఇట్టిదికాదను తెలివి; </p> <p class="Footer">25. <span class="CharOverride-1">ఏతస్య</span> - ఈ భూతసంఘము యొక్క; ఆద్యా, ప్రవృత్తిః - మొదటి సృష్టి; ప్రధానాత్ - మాయతో శబలితమైన అవ్యాకృతమువలననే; సంప్రవర్తతే - ఏర్పడుచున్నది. ద్వితీయా - తరువాతిదగు రెండవసృష్టి; <span class="CharOverride-1">అవిశేషాత్</span> - ఇచట - విశేషములనగా పంచమహాభూతములు; అవిశేషములనగా - అయిదు తన్మాత్రలు; పదునొకండు ఇంద్రియములు (జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, మనస్సు) అహంకారము అనునవి. ఈ అన్నియు ఒక జాతి అనుదృష్టితో ఏకవచనమును ప్రయోగించిరి. <span class="CharOverride-1">ఈసృష్టి</span> ఈఅవిశేషమువలన; <span class="CharOverride-1">మిథునవ్యక్తిమ్</span> - బీజము, అంకురము అనున్యాయముతో ఏర్పడు అభివ్యక్తిని - ఏర్పడుటను; <span class="CharOverride-1">నియచ్ఛతి</span> - నియమించుచున్నది. ఏ బీజమునకు ఆ అంకురమే అన్న పద్దతిని దాటకుండ చేయుచున్నదని భావము. </p> <p class="Footer"> ఇట్లు కుండ,మూకుడు, బాన మొదలగు విశేష వస్తువులకు అవిశేషము మట్టియే కారణమైనట్లు ఆకాశాది విశేషములకును అవిశేషము ప్రధానమనబడునది యగును గావున సృష్టిఅనునది ప్రవాహనిత్యత్వము లేనిది అని తాత్పర్యము. </p> <p class="Footer">26. <span class="CharOverride-1">ప్రకృతిమ్</span> - ప్రళయకాలమునందు - ప్రకృతిని పొందునని భావము. <span class="CharOverride-1">విరక్తః, తు</span> - విషయములయందు ప్రీతిలేనివాడు; <span class="CharOverride-1">జ్ఞానవాన్</span> - ప్రకృతిని కాదని; జ్ఞానవంతుడగును. ముక్తి నందునని భావము.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">పఞ్చాధిక ద్విశతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">205</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">మనుబృహస్పతి సంవాదము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">205</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer ParaOverride-1">1. ధర్మముకంటె శ్రేయము మిన్నయైనది అనిచెప్పినమాటను వివరించుచు, మొదలిడిన యర్థమును ఈ అధ్యాయముతో ఉపసంహరించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> పఞ్చభిః - శబ్దము మొదలగు అయిదు విషయములతో పాటు, <span class="CharOverride-1">పఞ్చ -</span> అయిదు ఇంద్రియములను; </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">మనసా సహ -</span> కారణమగు మనస్సుతో పాటు; <span class="CharOverride-1">యుక్తాని</span> - నిగ్రహింపబడినవి అయినపుడు - ఇచట మనస్సుతో పాటు బుద్ధిని కూడ గ్రహింపవలయును. శ్రుతియు- </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">“యదా పఞ్చావతిష్ఠనే జ్ఞానాని మనసా సహ </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిమ్” </span></p> <p class="Footer ParaOverride-1"> మనస్సుతోపాటు అయిదు జ్ఞానములు (ఇంద్రియములు) బుద్ధియు ఎందు కదలక నిలిచియుండునో ఆస్థితిని పరమగతి యందురు' అనిచెప్పుచున్నది. ఆత్మ, అనాత్మలు పూర్తిగా భిన్నమైనవి అని మణిసూత్ర దృష్టాంతము తెలుపుచున్నవి. </p> <p class="Footer ParaOverride-1">2,3 ఏకాత్మను నిరూపించుటకు ఈదృష్టాంతముతోడనే అన్నియెడల ఆత్మ వ్యాప్తి కలదని చెప్పుచున్నారు. <span class="CharOverride-1">ప్రసక్తాత్మా</span> - తగులముగల చిత్తము <span class="CharOverride-1">కలవాడు;</span> తగులమునకు కారణము స్వకర్మములు </p> <p class="Footer ParaOverride-1">4. <span class="CharOverride-1">యేన యేవ</span> - పితృదేవతలు, దేవతలు, గంధర్వులు ప్రజాపతి అనువారి నుద్దేశించి చేసెడు; <span class="CharOverride-1">యద్యత్కర్మ</span> - ఏయే యజ్ఞము మొదలగు కర్మము. ఆపితృదేవతాది స్వరూపమతో జీవుడు - కర్మఫలము ననుభవించునని భావము. </p> <p class="Footer ParaOverride-1">5. కర్మభేదము వలన దేహ విశేషసంబంధము కలుగుటలో దృష్టాంతమును చెప్పుచున్నారు. భూమియొక్కటియే బీజములను బట్టి వేరు వేరు పంటలను పండించుచున్నది. <span class="CharOverride-1">అన్తరాత్మానుదర్శినీ</span> - అంతరాత్మ, అనుదర్శి - సాక్షిగా - కలది - అయినను బుద్ధి, <span class="CharOverride-1">కర్మానుగా</span> - పూర్వ కర్మము నను సరించునదియే యగును. </p> <p class="Footer ParaOverride-1">6. <span class="CharOverride-1">జ్ఞానపూర్వా</span> - బుద్దికారణముగా కలదియై;<span class="CharOverride-1"> లిప్సా</span> - పొందవలయుననెడు కోరిక, <span class="CharOverride-1">భవేత్</span> - కలుగును; <span class="CharOverride-1">లిప్సా</span> <span class="CharOverride-1">పూర్వా</span> - లిప్స వెనుకకలదియై; <span class="CharOverride-1">అభిసంధితా</span> - అభిసంధియనగా నేను దీనిని సాధింపవలయునను ప్రయత్నము; దానితో కర్మము; దాని వలన ఫలము కలుగును.</p> <p class="Footer ParaOverride-1">7. <span class="CharOverride-1">ఫలమ్</span> - ఆయాదేహములను పొందెడు రూపముగల ఫలము; <span class="CharOverride-1">కర్మాత్మకమ్</span> - కర్మమువలన నేర్పడునట్టిది; <span class="CharOverride-1">కర్మ</span> - కర్మము; <span class="CharOverride-1">జ్ఞేయాత్మకము</span> - 'ఆహమ్' శబ్దము యొక్క అర్థము నుండి ఏర్పడినది; జ్ఞేయమ్ - అట్టిజ్ఞేయము; జ్ఞానాత్మకమ్ - జీవస్వరూపమైనట్టిది; ఆజ్ఞానము; <span class="CharOverride-1">సదసదాత్మకమ్</span> - సత్తు అయినది, అసత్తు అయినది యగు చిజ్జడ స్వరూపమైనది. </p> <p class="Footer ParaOverride-1">8. <span class="CharOverride-1">జ్ఞానానామ్</span> - చిత్తు జడము అనువాని ముడుల యొక్కయు, <span class="CharOverride-1">ఫలానామ్</span> - ఫలస్వరూపములైన దేహముల యొక్కయు; <span class="CharOverride-1">జ్ఞేయానామ్</span> - తెలియదగినవగు బుద్ధుల యొక్కయు; <span class="CharOverride-1">కర్మణామ్</span> - సంచితములైన (కూడబెట్టుకొనియున్న) కర్మములయు; <span class="CharOverride-1">క్షయాన్తే</span> - నాశనము తుదిని; <span class="CharOverride-1">యత్ ఫలమ్ </span> ఫలమువలె నేది మిగిలియుండునో ఆ ఆత్మతత్త్యప్రకాశము; <span class="CharOverride-1">విద్యాజ్ఞానమ్</span> - విద్యచేత ఏర్పడుజ్ఞానము -బ్రహ్మాకారము గానయిన చరమాంతఃకరణవృత్తిచేత నేర్పడు సాక్షాత్కార రూపమైనది; అది; <span class="CharOverride-1">జ్ఞేయప్రతిష్ఠితమ్</span> - తెలియదగినవస్తువునందు చక్కగా చెదరక నిలిచి యుండునది. </p> <p class="Footer ParaOverride-1">9. జ్ఞేయస్వరూపమను చెప్పుచున్నారు; <span class="CharOverride-1">మహత్</span> - మూడు విధములైన పరిచ్ఛేదములు - విభాగములు - లేనిది - దేశము, కాలము, పాత్రము అనునవి ఆవిభాగములు - అవి లేనిది; అందువలననే అది <span class="CharOverride-1">పరమమ్</span> - ఇచట 'మా' అనగా బుద్ధి అది, పరా - దూరముగా దేనికి ఉన్నదో అది పరమము; <span class="CharOverride-1">భూతమ్</span> - నిత్య సిద్ధమైనది; <span class="CharOverride-1">ఆత్మస్థమ్</span> - బుద్ధియందున్నది; <span class="CharOverride-1">గుణబుద్ధయః</span> - గుణములనగా విషయములు, వానియందు బుద్ధికలవారు; అందువలననే వారు <span class="CharOverride-1">అబుద్ధులు</span> - పరమము నందు బుద్దిలేనివారు. </p> <p class="Footer ParaOverride-1">10. మహత్త్వమును మూడు శ్లోకములతో వివరించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1">11. <span class="CharOverride-1">కాలః</span> - అవ్యక్తమను పేరుగల జగత్కారణము;</p> <p class="Footer ParaOverride-1">12. <span class="CharOverride-1">విష్ణుః</span> - శుద్ధబ్రహ్మము; </p> <p class="Footer">13. మహత్త్యమునకు కారణమైన పరమత్వమును వక్కాణించుచున్నారు. (రెండు శ్లోకములతో) అవ్యయః అపక్షయము - తరిగిపోవుట మొదలైన వికారములు లేనివాడు; <span class="CharOverride-1">అన్తవత్</span> - తెలియువాడు, తెలియబడునది అను విభాగములు కలది; అది దుఃఖము; <span class="CharOverride-1">‘‘యత్రాన్యత్ పశ్యత్యన్యచ్ఛుణోతి తదల్పమ్, అథ యదల్పం తన్మర్త్యం, తద్దుఃఖమ్’’</span> - ఎందు మరియొకదానిని చూచునో, వినునో అది అల్పము. అల్పమైనది మర్త్యము (మరణించు స్వభావముకలది) అది దుఃఖము అని శ్రుతి చెప్పుచున్నది.</p> <p class="Footer">14. ఇచట ధామమనగా - స్థానము - వంటిది - ఆశ్రయము; తద్ - దానిని - పొందదగినదానిని; గత్వా - తెలిసికొని; <span class="CharOverride-1">కాలవిషయాత్</span> - అనిత్యము, దుఃఖాత్మకము అయిన కాల విషయమునుండి; <span class="CharOverride-1">విముక్తాః</span> - విడివడినవారు, మోక్షము నాశ్రయించిన వారగుదురని భావము. </p> <p class="Footer">15. <span class="CharOverride-1">ఏతే</span> - వీరు - ముక్తులు - శుద్ధమైన చిదాత్మకలవారు; <span class="CharOverride-1">గుణేషు</span> - మానము, మేయము అనువాని వ్యవహారముల యందు; <span class="CharOverride-1">ప్రకాశన్తే </span>- ప్రకాశింతురు. </p> <p class="Footer"> మేయములయందు - నిశ్చయముగా తెలియవలసిన వానియందు జ్ఞానరూపముతోడనో, ఘటము, పటము మొదలగు వానియందు సత్త్వరూపముననో స్వరూపముతోడనో - ప్రకాశింతురని భావము. అందువలననే </p> <p class="Poem-1 ParaOverride-16"><span class="CharOverride-9">“అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశ పంచకమ్, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయమ్</span><span class="CharOverride-9">” </span></p> <p class="Footer ParaOverride-1"> ఉన్నది, ప్రకాశించుచున్నది, ప్రియమైనది, రూపము, నామము అని అయిదు అంశములు కలవు. అందు మొదటి మూడును బ్రహ్మరూపము. తక్కిన రెండును జగద్రూపము - అని చెప్పియున్నారు. <span class="CharOverride-1">తతః</span> - ఆ గుణములకంటె; <span class="CharOverride-1">పరమ్</span> - ఉత్కృష్టమైనది; బ్రహ్మము; అది నిర్గుణ స్వరూపము కలదియగుటచేతనే; <span class="CharOverride-1">నివృత్తిలక్షణః</span> - జగత్తునుండి మరలుటయే లక్షణముగా గల శమము, దమము, ఉపరమము మొదలగు రూపములు గల; <span class="CharOverride-1">ధర్మః</span> - ధర్మము; వికల్పము లేని ధర్మమని భావము; అది తెలియబడినదై; <span class="CharOverride-1">ఆనన్త్యాయ</span> - అనంతభావముకొఱకు - మోక్షమునకు; కల్పతే - సమర్థమగును. </p> <p class="Footer ParaOverride-1">16. ఋక్కులు మొదలగు వానిచేత అధ్యయనాది ధర్మములు చెప్పబడుచున్నవి. <span class="CharOverride-1">శరీరాణి</span> - కారణదేహములను; <span class="CharOverride-1">వ్యపాశ్రితాః</span> - వాని సంస్కారకములుగా వానిని పొందుచున్నవి; అంతేకాని ఆధేయములేనివానితో మిన్నయగు చిదాత్మయందు ప్రవేశింపవు. అందువలననే అవి యత్నముతో సాధింపదగినవి. కనుకనే నశించు స్వభావము కలిగినట్టివి. </p> <p class="Footer ParaOverride-1">17. బ్రహ్మమునందు దాని విపర్యయస్థితిని - వ్యతిరేకస్థితిని చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">శరీరాశ్రయసంభవమ్</span> - శరీరము నాశ్రయించి ఆవిర్భావము కలిగిన దానివంటిదైనను, <span class="CharOverride-1">యత్నసాధ్యం, న, భవతి</span> - యత్నముతో సాధింపబడునది కాదు. ఏలయన ఆదిమధ్యములు లేనిది కావున. బ్రహ్మభావము సాధింపబడునదైనచో అనిత్యత్వము కలుగునని యర్థము. లేదా శరీరమును - లింగశరీరమును పుణ్యము, పాపము అను రూపముతో ఆశ్రయించును. కావున శరీరాశ్రయము. దానినుండి ఏర్పడినది - ధర్మస్వరూపము; బ్రహ్మము మాత్రము అ శరీరము - ఉదాసీనము అని భావము. </p> <p class="Footer ParaOverride-1">18. బ్రహ్మభావమునకు కూడ ఆది కలుగుట యున్నచో అది తప్పక నశించునదే యగునని భావము. </p> <p class="Footer">19. <span class="CharOverride-1">అనాదిత్వాత్</span> - ఆది లేని కారణమున - ఆదియనగా పుట్టుక; <span class="CharOverride-1">అనన్తత్వాత్ -</span> అంతములేని కారణమున - అంతమనగా మరణము; <span class="CharOverride-1">అనన్తమ్</span> - సర్వవ్యాపకము; <span class="CharOverride-1">అవ్యయమ్</span> - ఆకాశమువలె మార్పులులేనిది; <span class="CharOverride-1">ద్వన్ద్వాభావః</span> - ద్వంద్వములనగా మానాపమానములు మొదలగునవి, అవి లేనిది. </p> <p class="Footer">20. అవునయ్యా ! ఆ ఆత్మసుఖము ప్రయత్నసాధ్యము కాదు. నిత్యము - అయినచో అందరు దానియందేల ప్రీతి పొందకున్నారు అని ఆశంకించి చెప్పుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-1">అదృష్టతః</span> - భాగ్యము నాలంబించి; <span class="CharOverride-1">అనుపాయాత్</span> - ఉపాయము లేని కారణముగా; ఇచట అదృష్టతః అనునది నాలుగు విధములైన ఆధ్యాత్మికతుష్టులకు ఉపలక్షణము. <span class="CharOverride-1">తథా</span> - అట్లే; <span class="CharOverride-1">కర్మణః</span> - విషయభోగమనెడు కర్మము యొక్క; ప్రతిసన్ధిః - ప్రతీపమైన సంధి - వియోగము - విషయముల నుండి ఉపరమము పొందుట అనునది; దీనిచేత అయిదు విధములగు బాహ్య తుష్టి చెప్పబడినది; <span class="CharOverride-1">తేన</span> - ఆవిధమగు రెండువిధములగు తుష్టి కారణముగా; ఉపాయముల యందు ప్రవర్తింపనివారై; <span class="CharOverride-1">మర్త్యాః</span> - పురుషులు; <span class="CharOverride-1">యేన</span> - ఏ ఉపాయముతో; <span class="CharOverride-1">తత్ పదమ్, గచ్ఛన్తి</span> - ఆ పదమును చేరుకొందురో;<span class="CharOverride-1"> తత్, న పశ్యన్తి</span> - దానిని చూడకున్నారు. </p> <p class="Footer"> సాంఖ్యసప్తమి యందు తుష్టులను ఈ విధముగా వివరించియున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-1">‘‘ఆధ్యాత్మికా శ్చతస్రః ప్రకృత్యుపాదావకాలభాగ్యాఖ్యాః, బాహ్యా విషయోపరమా త్పఞ్చ చతుష్టయోఽభహితాః’</span><span class="CharOverride-1">’</span> దీని అర్థము. 'శాస్త్రము వలన ప్రకృతి పురుషుల వివేకము తెలియవచ్చినది. సాక్షాత్కారము మాత్రము వృత్తిరూపము - ప్రకృతియొక్క పరిణామము. అది స్వయముగా పరిణామక్రమముతో ఏర్పడును. ఇక ధ్యానాయాసముతో పనియేమి?- ఇది ప్రకృతి యను పేరుగల తుష్టి దీనికి <span class="CharOverride-1">అరంభము</span> అని పేరు. </p> <p class="Footer"> ఇంతమాత్రముతో కృతకృత్యత కలుగుటలేదు. ఏలయన అందరకు ఆయాసము లేకుండ వివేకము కలుగునని ఖ్యాతి వచ్చిపడును. దానివలన ప్రవ్రజ్యావిధి (సంన్యాసము) పనికి మాలినదగును. అందువలన ఆ మాత్రముచేతనే కృతకృత్యత కలుగుచుండగా ధ్యానముతో పనియేమి? అనునది ఉపాదానమను పేరుగల తుష్టి - దీనిని సలిలమందురు. </p> <p class="Footer"> సన్యాసము కూడ కాలవిశేషము నపేక్షించుటచేతనే కైవల్యహేతువగును. కనుక ఊరక ఉడికిపోవుట యేల అని ఊరకుండుట కాలమను పేరుగల తుష్టి - దీనికి ఓఘ మని పేరు. </p> <p class="Footer"> కాలము కూడ పూర్వపుణ్యవశమువలననే వివేక సాక్షాత్కారమును కలిగించును. మదాలస పుత్రులు పసివారైనను వారికి వివేకము కలుగలేదా? కనుక ధ్యానాయాసముతో పనియేమి అనెడు తుష్టి భాగ్యమను పేరు కలది. దీనిని <span class="CharOverride-1">వృష్టి</span> అను పేరుతో వ్యవహరింతురు. </p> <p class="Footer"> అదియే యిచట ముఖ్యమైనదగుట వలన ‘అదృష్టతః’ అను పదముచేత గ్రహింపబడినది. దీనిచేతనే దానికి పూర్వమున నున్న తుష్టులకు కూడ ఆక్షేపమువలన లాభము కలుగును. </p> <p class="Footer ParaOverride-1"> విషయములైదు. వానియందలి వైరాగ్యములు కూడ అయిదు విధములు. అందు ధనార్జన విషయమున దుఃఖమును చూచి మనుజుడు పొందెడు ఉపరతి మొదటిది. దీనిని <span class="CharOverride-1">'పారము'</span> అందురు. రాజువలననో దొంగలవలననో ధనము నశింపగా కలిగెడు దుఃఖమును చూచి పొందెడు ఉపరతిని <span class="CharOverride-1">“సుపారము’’</span> అందురు. అనుభవించుటచేతను ధనము తరగిపోవును - అది చూచుటవలన దుఃఖమేర్పడును. దానివలన కలిగెడు ఉపరతి ‘<span class="CharOverride-1">పారాపారము</span>’. భోగమునందును క్షీణించుట మొదలగు దోషములను చూచుటవలన కలిగెడు దానిని <span class="CharOverride-1">‘అనుత్తమాంభము’</span> అందురు. <span class="CharOverride-1">“నానుపహత్య భూతాని భోగ: సంభవతి’’ </span>- భూతములను హింసింపక భోగము కలుగదు. అను న్యాయము ననుసరించి భోగమునందు హింసను చూచుటవలన కలిగెడు ఉపరతి <span class="CharOverride-1">‘ఉత్తమాంభము’</span>. ఇట్లు విషయములను మానుటవలన ఏర్పడు అయిదు తుష్టులను కర్మప్రతిసంధి శబ్దముచేత చెప్పిరి. </p> <p class="Footer ParaOverride-1"> ఇట్లు తొమ్మిది విధములగు తుష్టులు ఏర్పడుచున్నవి. వీని మాత్రముననే కృతకృత్యతను భావించుచు, ఉపాయములయందు ప్రవృత్తి లేనివానికి ఆత్మదర్శనము కలుగదని భావము.</p> <p class="Footer ParaOverride-1">21. ఒకప్పుడు తుష్టులను తొమ్మిదింటిని గెలిచి ధ్యానముతో కుదురుకొన్నవాడైనను, ధ్యానమువలన పుట్టెడు సిద్ధి, తారుమారగుట చేతను ఆత్మతత్వమును తెలియజాలడని చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> ప్రాణులకు విషయములందలి తగులము స్వభావసిద్ధమైనది. విషయములును హృదయాకాశమను పేరుగల బ్రహ్మలోకమును పొందినవి. కనుక శాశ్వతములు. మధుమతియగు యోగభూమి యందున్నయోగికి సంకల్పమాత్రముచేతనే వచ్చిపడునవి. ఆ ఇవి సత్యములు, కామములు, అనృతము చేత మూయబడినవి. దేహమనెడు ఉపాధిచేత కప్పబడినవి. <span class="CharOverride-1">‘‘సంకల్పా దేవాస్య పితరః సముత్తిష్ఠన్తి”</span> - 'సంకల్పముచేతనే అతని తలిదండ్రులు పైకి లేచుచున్నారు' మొదలగు శ్రుతులు దీనిని చెప్పుచున్నవి. ఈ కారణమున విరక్తి నందని యోగి మనస్సుతో మరియొకటి యగు యోగైశ్వర్యసుఖమును కోరుచు సమస్తకామనలను పూర్తిగా దులిపివేసినప్పుడు మాత్రమే పొందదగినదగు పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొనకున్నాడు. </p> <p class="Footer ParaOverride-1"> ఇచట<span class="CharOverride-1"> ‘అన్యత్’</span> - మరియొకటి అను పదము చేత సిద్ధి విపర్యయము - సిద్ధి తారుమారగుట చూపబడినది. సాంఖ్యసప్తతి యను గ్రంథమున సిద్ధులను గూర్చి యిట్లు చెప్పియున్నారు. </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-9">ఊహః శబ్దాఽధ్యయనం దుఃఖవిఘాతా స్త్రయః సుహృత్సాప్తిః</span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">దానం చ సిద్ధయోఽసౌ సిద్ధేః పూర్వోఽంకుశ స్త్రివిధః" </span></p> <p class="Footer ParaOverride-1">1. <span class="CharOverride-1">ఊహ</span> - అనగా వితర్కము. విన్న అర్థమును యుక్తితో చింతించుట, మననము చేయుట అని అర్థము. </p> <p class="Footer ParaOverride-1">2. <span class="CharOverride-1">శబ్దము</span> - శబ్దమువలన పుట్టెడు జ్ఞానము. మోక్షశాస్త్రమును ఉపక్రమ ఉపసంహారముల పర్యాలోచన పూర్వకముగా పొందెడు తాత్పర్య జ్ఞానము. </p> <p class="Footer ParaOverride-1">3. అధ్యయనము - ఉపనిషద్గ్రంథములను పఠించుట, (4,5,6) <span class="CharOverride-1">దుఃఖ విఘాతములు</span> - ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములని దుఃఖములు మూడు విధములు. వాని విఘాతములు కూడ మూడు విధములు. అట్లే (7) సుహృత్ప్రాప్తి - పరవిద్య ననుగ్రహించు సదాచార్యుడు లభించుట; (8) దానము - చిత్తశుద్ధి వలన పుట్టెడు వివేకము కలుగుట; (దైప్ శోధనే - అను ధాతువు రూపమిది) ఇవి అష్టసిద్ధులు. </p> <p class="Footer ParaOverride-1"> ఇందు ఊహ, శబ్దము, అధ్యయనము, సుహృత్ప్రాప్తి అనువానికి క్రమముగా తారము, సుతారము, తారాతారము, రమ్యకము అని పేర్లు. దానము, మూడు విధములైన దుఃఖవిఘాతములు అనువానికి సదాముదితము, ప్రమోదము, ముదితము, మోదమానము అనిపేర్లు. </p> <p class="Footer ParaOverride-1"> ఇవి ప్రజ్ఞాప్రాసాదమునకు సోపానముల వంటివే అయినను కుయోగి విషయమున తారుమారు ఫలముల నొసగునని యగును. దీనినే<span class="CharOverride-1"> ‘‘సిద్ధేః పూర్వోంకుశ స్త్రివిధః’’</span> అను వాక్యము చెప్పుచున్నది. సిద్ధి మోక్షము - అను ఏనుగును మరలించు అంకుశము - ఇది మూడు విధములు. మొదటిది <span class="CharOverride-1">విద్యాది</span> - ఇది యైదు విధములైన మార్పు. రెండవది <span class="CharOverride-1">శక్తి</span> - అది పదునొకండు ఇంద్రియవధములు, బుద్ధివధములతో పాటు అశక్తి అనబడును. చెవుడు మొదలగునవి పదునొకండు ఇంద్రియవధములు. వెనుక చెప్పిన తుష్టులయు, వెనువెంటనే చెప్పిన సిద్ధులయు విపర్యయమువలన నేర్పడు పదునేడు బుద్ధి వధములు. అందు గో బలీవర్దన్యాయముచేత తుష్టులను వేరుచేసి, విపర్యయములు, శక్తి, తుష్టులు అనునవి మూడువిధములైన అంకుశము.<span class="CharOverride-1"> “మనసాచాన్య దాకాంక్షన్”</span> అను వాక్యభాగము దీనినే సూచించుచున్నది. </p> <p class="Footer ParaOverride-1">22. ఇతరమును కోరుటలో హేతువును చెప్పుచున్నారు. <span class="CharOverride-1">గుణాన్</span> - విషయములను; యత్ - ఏ కారణమున; <span class="CharOverride-1">తత్</span> - ఆ కారణము వలన; <span class="CharOverride-1">పరమ్</span> - విషయముల స్పర్శములేని; బ్రహ్మమును; <span class="CharOverride-1">గుణార్థినః</span> - గుణములను కోరెడు పురుషులు. </p> <p class="Footer ParaOverride-1"> గుణములను చూచుచు వానినే కోరువారికి నిర్గుణమగు పరబ్రహ్మమునందు కోరిక పుట్టుట అసంభవమని భావము. </p> <p class="Footer ParaOverride-1">23. అతిమూఢతవలన బాహ్యగుణములు లంపటము గలవారు యోగులకు మాత్రమే పొందదగు పరవిషయములను పొందజాలరు - అని చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> ఆ గుణములకు ఈ గుణములకు సమానత్వమున్నప్పటికిని ఆంతరములైన గుణములు - బ్రహ్మమునకు స్వరూపములవంటివైన సత్యకామాదులచేత పరబ్రహ్మము ఊహకందును. అని<span class="CharOverride-1"> “అనుమానాత్”</span> అను పదముతో చెప్పుచున్నారు. పొగను చూచి నిప్పును తెలిసికొనుచున్నాము. చెట్టు కొమ్మను చూచి దానికి పైభాగమున నున్న చంద్రరేఖను కనిపెట్టుచున్నాము. ఇట్లే సత్యకామాది గుణములచేత పరబ్రహ్మము ఊహకందునని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">24. ఇందు స్వానుభవమును ప్రమాణముగా చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">సూక్ష్మేణ</span> - ధ్యానముతో నిశితమైన;<span class="CharOverride-1"> </span><span class="CharOverride-1">‘‘దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః’’ </span>'సూక్ష్మము, సునిశితము అయిన బుద్ధితో, సూక్ష్మమును దర్శింపగలవారు దానిని చూతురు' - అని శ్రుతియు చెప్పుచున్నది. శబ్దము - చెవి, గంధము - ముక్కు మున్నగు వానియందు ప్రకాశింపబడునది - ప్రకాశింపజేయునది అనువానికి సంబంధించిన ఆకాశము, భూమి అనునవి ఒక్కొక్కటి మాత్రమే ఉపాదానము అను నియమమును ఉండుటవలన ఘటాదుల రూపమును మనస్సే కన్ను మొదలగు ఇంద్రియముల ద్వారా గ్రహించును. అట్లే ద్రష్ట - దృశ్యము అనునవియు దర్శనము అను ఉపాదానమునందు దర్శనముకంటె అభిన్నములే అని అర్థము. </p> <p class="Footer ParaOverride-1">25. ఇట్టి అభేదమునందు హేతువుగా అనుభవమునే చెప్పుచున్నారు. జ్ఞాన మనగా బ్రహ్మాత్మముగా నేర్పడిన బుద్ధివృత్తి, దానితో; <span class="CharOverride-1">బుద్ధిమ్</span> - దేహమే ఆత్మ అను రూపమున కలుషితమైన బుద్ధిని; <span class="CharOverride-1">నిర్మలీకృత్య</span> - సమస్తసంశయములు తొలగినదానిని చేసి; శ్రుతియు<span class="CharOverride-1"> ‘‘భిద్యతే హృదయగ్రన్థి శ్ఛిద్యన్తే సర్వసంశయాః క్షీయన్తే చాప్య పాపాని తస్మిన్ దృష్టే పరాపరే’’</span> ‘ఆ పరావరమైన తత్త్వము తెలియవచ్చునపుడు హృదయపుముడి విచ్చిపోవును. సర్వసంశయములు పటాపంచలగును. అతని పాపములన్నియు నశించిపోవును’ అని చెప్పుచున్నది కదా! </p> <p class="Footer ParaOverride-1"> అట్లే <span class="CharOverride-1">బుద్ధ్యా</span> - బుద్ధితో; మనః <span class="CharOverride-1">అపి</span> - మనస్సు కూడ సంకల్పాత్మకమైనదై సంకల్పించి సంకల్ప రూపముతో స్వప్నాదులతో ఉన్నదానినిగా నిశ్చయించి (ఇట్లు నిశ్చయించుటయే నిర్మలముగా చేయుట) </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">అట్లే, మనసా ఇన్ద్రియగ్రామమ్ నిర్మలీకృత్య</span> - జాగ్రత్కాలమునందును ఇంద్రియ సముదాయము మనోమాత్రమే అని నిశ్చయించి (అదియే నిర్మలీకరణము). </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">అక్షరమ్</span> - క్షరతి - క్షీణించును అను వ్యుత్పత్తిచేత ద్రష్ట - దృశ్యము అనునవియే మార్పుచెందునవి కనుక వికారములు - దానికంటె భిన్నమైనది - చిన్మాత్రము. అది; <span class="CharOverride-1">ప్రతిపద్యతే</span> - పొందబడును. ఆవిధముగా అక్షరతత్త్వము అవగత మగునని భావము. </p> <p class="Footer ParaOverride-1">26. <span class="CharOverride-1">బుద్ధిప్రవీణః</span> - ధ్యానపరిపాకమువలన పుట్టిన చరమవృత్తిని పూర్తిగా వదలివైచినవాడు; అనగా బుద్ధికదలికను నిండుగా అరికట్టినవాడు; <span class="CharOverride-1">మనసా, సమృద్ధః </span>- విచార స్వరూపముగల మనస్సు పుష్కలముగా కలవాడు - శ్రవణమననములను పండించు కొన్నవాడు - అని భావము; <span class="CharOverride-1">నిరాశిషమ్</span> 'ఆశీస్సుఅనగా లభించనిదానిని కోరుట - ఆదిలేనిది - స్వరూపముతోడనే పరమానందాత్మక మైనది కనుక - అందు ఆశలుండవు; <span class="CharOverride-1">నిర్గుణమ్</span> - గుణములు లేనిది - అయిన ఆత్మను; <span class="CharOverride-1">అభ్యుపైతి</span> - పొందును; </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">విలోడ్యమానాః</span> - ఆశలతో ఆకులపాటు పొందుచున్నవారు; <span class="CharOverride-1">ఇంధనస్య</span> - కట్టెలోపల దాగియున్న; <span class="CharOverride-1">హుతాశనమ్</span> - అగ్నిని; <span class="CharOverride-1">వాయుః, ఇవ</span> - గాలివలె; పరమ్ - ఆత్మతత్త్యమును; <span class="CharOverride-1">త్యజన్తి</span> - వదలుదురు. గాలి కట్టెలో గూఢముగా నున్న అగ్నిని రగుల్కొల్ప జాలదు. దాని జోలికి పోకవదలి వేయును. అట్లే ఆశలతో అతలాకుతలమగువారు పరతత్వమును వదలివైచెదరని భావము. </p> <p class="Footer ParaOverride-1">27. పై చెప్పిన యర్థమునే స్పష్టము చేయుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">గుణాదానే </span><span class="CharOverride-2">- </span>గుణములను విషయములను<span class="CharOverride-1"> -</span> తనవైపుగా ఖండనము చేయుట అనగా ఆత్మయందు ప్రవిలాపనము - స్వరూపము లేకుండ కలిపివేయుట - చేయబడగా; గుణములను రూపుమాపివేయగా - అని యర్థము; <span class="CharOverride-1">మనః</span> - మనస్సు; <span class="CharOverride-1">బుద్ధిపరాయ</span> - బుద్ధిదృష్టితో పరమైనది - మిక్కిలి ఉత్కృష్టమైనది - అగు బ్రహ్మము కొరకు; <span class="CharOverride-1">భవతి</span> - అగును. విషయములను ప్రవిలాపనము చేయగా మనస్సు పరబ్రహ్మమును చేరుకొనునని భావము. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">విప్రయోగే</span> - ఆగుణములను ఆత్మతత్త్వముకంటె వేరుగా గ్రహించినచో; <span class="CharOverride-12">మనః</span> - మనస్సు; <span class="CharOverride-1">సదా</span> - ఎల్లప్పుడు; <span class="CharOverride-1">బుద్ధి - అవరాయ</span> - బుద్ధికంటె తక్కువదియగు - బుద్ధి కల్పించుకొన్న బ్రహ్మలోకము తుదిగాగల ఐశ్వర్యము, అవీచి అనునది అంతముగా గల ఆనైశ్వర్యము - దానికొరకు; <span class="CharOverride-1">భవతి</span> - అగును. విషయములను విడిగా చూచినచో ఐశ్వర్యము, అనైశ్వర్యము అనువానిని మనస్సు చేరుకొనునని అర్థము. మనస్సు సుఃఖదుఃఖాత్మకమగునని భావము. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">అనేన, ఏవ, నిధినా</span> - ఈ విధానముతోడనే; <span class="CharOverride-1">గుణాపాయే</span> - గుణములను తొలగించుకొనుటయందు ప్రవృత్తి కలవాడు; <span class="CharOverride-1">బ్రహ్మశరీరమ్</span> - బ్రహ్మస్వరూపమును; <span class="CharOverride-1">ప్రాప్నోతి</span> - పొందును, <span class="CharOverride-1">“బన్దాయ విషయాసక్తం ముక్త్వా నిర్విషయం మవః’’</span> - 'మనస్సు విషయములందు తగులు కొనుట బంధము కొరకు, నిర్విషయమగుట ముక్తి కొరకును అగును' అని పెద్దలమాట. </p> <p class="Footer ParaOverride-1">28. లోకమున భేదము నాలుగు విధములుగా కానవచ్చుచున్నది. 'సువర్ణము కుండలము' అన్నపుడు ఉపాదానోపాదేయములకు సంబంధించిన భేదము (ఉపాదానము - ముడివస్తువు, ఉపాదేయము - దానితో నేర్పడిన వస్తువు ) 'తెల్లని కుండ' అన్నప్పుడు. ఒకటి గుణము - రెండవది అదికలది - ఇదిరెండవ విధమగుభేదము. 'శుక్తి రజతము' - ఇందు అధిష్ఠానము నందు మరొకదానిని భావించుటచేత కలిగిన భేదము మూడవది. దేవదత్తుడు సింహము అన్నచోట సింహమునకు సంబంధించిన గుణముల సంబంధము చేత ఏర్పడెడు భేదము నాలుగవది. </p> <p class="Footer ParaOverride-1"> జీవ బ్రహ్మములకు ఉండెడి భేదము మొదటి విధము కాదు. బ్రహ్మమునకు వికారిలక్షణము ఏర్పడి కూటస్థత అను లక్షణము చెడిపోవును. రెండవదియు కాదు. ఆశ్రయము నశించిననే కాని గుణములు నశింపవు. కనుక ముక్తియందు జీవత్వము నశించినపుడు బ్రహ్మమునకు కూడ నాశము అనునది వచ్చిపడును. మూడవదియు కాదు. ఏలయన మిథ్యగా నయిన జీవునకు ముక్తి నన్వయించుట కుదరదు. </p> <p class="Footer ParaOverride-1"> ఇక మిగిలినది నాలుగవ పక్షము మాత్రమే. అందును <span class="CharOverride-1">“అనన్తం వై మనోఽనన్తా విశ్వేదేవాః’’</span> మనస్సు అనంతము కనుక విశ్వదేవతలు అనంతసంఖ్యలవారు - అని పెక్కింటి సామ్యమువలన మనస్సునందు విశ్వేదేవుల సంపత్తి ఏర్పడుచున్నది. ఆ విధముగా దేహాదులను పెంపొందించుట అనుసంబంధము వలన జీవునియందును బ్రహ్మశబ్దమును వ్యవహరింపవలసివచ్చును. లేదా <span class="CharOverride-1">“యోషా వా గౌతమాగ్నిః’’ </span>- గౌతమ అగ్నియే యోష - స్త్రీ - అనుచోట ప్రతీకమైన స్త్రీ రూపము లేనిదివలె చేసికొని అందు అగ్ని ఉపాసనము చేయవలయునని భావము. అట్లే జీవుడు లేడన్నట్లు చేసికొని మనస్సునందే బ్రహ్మభావమును ఆరోపించుకొని ఉపాసింపవలయును. ఇట్లు జీవునియందును బ్రహ్మభావము నారోపించుకొని అమృతత్వమును కోరువానికి ఉపాసనము <span class="CharOverride-1">“ఆత్మేత్యేవోపాసీత’’</span> ఆత్మ అనియే ఉపాసింపవలయును మున్నగుశ్రుతులయందు - విధింపబడుచున్నదికదా! అని ఆశంకించి చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">అవ్యక్తాత్మా</span> - అవ్యక్తము అనుటచే వాక్కునకు, మనస్సునకు గోచరము కానిది అని చెప్పుటచే మనస్సు మొదలగుదానివలె ప్రతీకత మొదలగుదానిని నిరసించుచున్నారు. ఆత్మ అనుటవలన వ్యాపకమగు ప్రత్యక్చైతన్యమును చెప్పుటచేత కీటభృంగము వలె మరియొక ప్రయత్నముచేత పొందనిది అని చెప్పినట్లయినది. <span class="CharOverride-1">పురుషః</span> - 'పురిశేతే' - పురమునందు ఉండునది అను వ్యుత్పత్తి చేత గౌణాత్మతను - అప్రధానతను - నిరసించుచున్నారు. <span class="CharOverride-1">వ్యక్తకర్మా</span> - దేహాదులగు ఉపాధుల సంబంధముచేత కర్మముల సమవాయము కలది వలె కన్పట్టుచున్నది. అందువలననే వినవచ్చుచున్నది. <span class="CharOverride-1">“ఆరామ మస్య పశ్యన్తి న తం పశ్యతి కశ్చన’’</span> - 'ఆతని ఆరామమును చూతురు గాని అతనిని చూచువాడొక్కడును లేడు.' </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">అన్తకాలే</span> - సుప్తి, ప్రళయము, మోక్షము అనువానిలో ఒకదాని కాలమున - ఆతడు ఎప్పుడును అవ్యక్తుడు ఇంద్రియములకు తెలియబడనివాడే కనుక అతని వ్యక్తత నడుమ తెలియనగుట అబద్దమే. </p> <p class="Footer ParaOverride-1"> ఆ విధముగా అవ్యక్తస్వరూపమగు ఆత్మకు, అవ్యక్తమగు బ్రహ్మముతోపాటు లక్షణభేదము లేదు కనుక భేదము ఏర్పడదు. బింబప్రతిబింబన్యాయముచేత, భేదము - ఉపాధిని బట్టి ఏర్పడునదే కాని సత్యమైనది కాదు. ఆభేదము కూడ ఉపాధిగానయిన అవిద్య తొలగినంతనే ఏమాత్రము మిగులు లేకుండ లయమైపోవును కనుక ‘బ్రహ్మశరీర మే’ ‘బ్రహ్మశరీరమును పొందును’ అనుట యుక్తమే. </p> <p class="Footer ParaOverride-1"> ఇట్లైనచో ఆత్మయందు దుఃఖిత్వము తెలియవచ్చుట యెట్లైనది? అను శంకకు సమాధానము చెప్పుచున్నారు. <span class="CharOverride-1">తైః</span> - ఆప్రసిద్ధములైన; ఇంద్రియములతో; <span class="CharOverride-1">అకామస్వరూపః</span> - కామరహితమగు స్వరూపముగల ఆత్మ - జల సూర్యన్యాయముచేత ఆత్మయందు దుఃఖిత్వము మొదలగునది భ్రమవలన కలుగుచున్నదని భావము. నీటిలో సూర్యుడు కాననగుట భ్రమమే కదా! </p> <p class="Footer ParaOverride-1"> గ్లాయద్భిః వా - ఆ ఇంద్రియముల చేత ఆత్మ దుఃఖపడుచున్నదానివలె కన్పట్టుచున్నదని భావము. ఇచట వా శబ్దము - ఇవ - వలె అనునర్థము కలిగినది. <span class="CharOverride-1">ఆవర్తతే</span> - ఇహపరలోకములయందు తిరుగాడుచున్నది. ఘటాకాశము నందువలె. </p> <p class="Footer"> <span class="CharOverride-1">‘‘అత ఏవ చోపమా సూర్యం ప్రతికృత్తి కాదివత్’’</span> - 'ప్రతిబింబ సూర్యుడు మొదలగు వాని వంటి ఉపమ అందువలననే' అను సూత్రము కూడ ఈ యర్థమునే చెప్పుచున్నది. </p> <p class="Footer"> ఆత్మవిషయమున భేదమును, గతిని శ్రుతులుకూడ నివారించుచున్నవి. </p> <p class="Poem-1 ParaOverride-16"><span class="CharOverride-9">‘‘హ్యయం జ్యోతి రాత్మా వివస్వా నపోభిన్నా బహుధైకోఽ ను గచ్ఛన్ </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">ఉపాధివా క్రియతే భేదరూపో దేవః క్షేత్రేష్వేవ మజోఽ య మాత్మా </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">ఘటసంవృత మాకాశం నీయమానే యథా ఘటే </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">ఘటో నీయేత వాకాశం తద్వజ్జీవో నభోపమః’’ </span></p> <p class="Footer"> ఆత్మయను జ్యోతి ఒక్కటియే. నీటిలో పెక్కు విధములుగా కానవచ్చు సూర్యునివలె, పెక్కు విధములుగా నుండును. ఈ భేదము రూపము ఉపాధివలననైనది. కాని క్షేత్రములయందు అజుడై, దేవుడు నైన ఆత్మ అట్టివాడే. కుండ ఏర్పడగా ఆకాశము కుండచేత సంవృతమై యున్నది. ఘటమును తొలగింప వచ్చును. కాని ఆకాశమును కాదు. ఆవిధముగా జీవుడు ఆకాశము -ఉపమగాగలవాడు. </p> <p class="Footer">29. <span class="CharOverride-1">అయమ్ - ఈ చిదాభాప - చిత్తు</span> - జ్ఞానస్వరూపము వలె కన్పట్టు జీవుడు; <span class="CharOverride-1">దేహమ్</span> - లింగశరీరమును; <span class="CharOverride-1">ప్రాప్తః</span> - పొందినదై; <span class="CharOverride-1">పఞ్చభూతాశ్రయః</span> - స్థూలదేహాకారముగా పరిణమించిన పంచభూతములుగా, వానికి ఆశ్రయముగా; స్యాత్ - అగుచున్నాడు. <span class="CharOverride-1">పరమేణ</span> - బింబముగా అయిన అంతర్యామిచేత; <span class="CharOverride-1">హీనః</span> - హీనుడు - పరమము లేనివాడు, అయిన; <span class="CharOverride-1">గచ్ఛతి</span> - పోడు - పోడు ఇచట పోవుట ఉపలక్షణము. ఏపనియు చేయజాలడని భావము. ఎందువలనననగా - <span class="CharOverride-1">అసామర్థ్యాత్</span> - సమర్థతలేక పోవుట వలన; ఎందుఅనగా, <span class="CharOverride-1">కర్మణే</span> - కర్మముకొరకు - కర్మచేయుటకు తగిన సామర్థ్యము లేకపోవుట వలన ఏపనియు చేయజాలకుండునని భావము. ‘<span class="CharOverride-1">హ</span>’ అను అవ్యయము <span class="CharOverride-1">‘‘ఏన హ్యేన సాధు కర్మ కారయతి’’</span> - ఇదియే మంచి పనిని చేయించుచున్నది - మొదలగు శ్రుతిప్రసిద్ధిని తెలుపుచున్నది. </p> <p class="Footer"> దీనిభావమిది - జలసూర్యుడు, ఘటాకాశము అనువానియందు, కదలిక, గమనము అనువానివలె ఆత్మయందు దుఃఖపడువాని లక్షణము మొదలగునది కన్పట్టినను, పరమార్థమునకు అదిలేదు. మరియు ఉపాధిపక్షపాతిత్వమువలన దానికి దానిని తొలగించుటయందు సామర్థ్యమును లేదు. ఉపాధి పూర్వకర్మము ననుసరించు ఈశ్వరేచ్చచేత చేష్టలకు ఆశ్రయమగుచున్నది. అందువలన ఈశ్వరుడు అంతర్యామి యనుట సముచితము. </p> <p class="Footer">30. ఉపాధిఅంతర్యాములు రెండును అనాదులే, అందువలన నిత్యములే. అందొకటి ప్రవృత్తిని పొందెడిది, ఇంకొకటి ప్రవర్తింపజేయునది అయి యుండగా ఎట్లో చిదాభాసరూపుడగు జీవునకు దుఃఖము చెప్పుచున్నారు. </p> <p class="Footer"> <span class="CharOverride-1">పృథ్వ్యాం నరః పశ్యతి న అన్తమ్</span> - భూమి తుదిని నరుడు చూడడు - అయినను - దానికది కలదు. ఏలయన ఆదియు ఏర్పడిన ఒక ద్రవ్యముకదా! అట్లేః <span class="CharOverride-1">అ</span><span class="CharOverride-1">ప్యాః</span> - ఈ జీవుని కష్టసంతతికి కూడ; <span class="CharOverride-1">అన్తః</span> - అంతము; <span class="CharOverride-1">భవితా</span> - అగును; <span class="CharOverride-1">ఇతి</span> - అని; <span class="CharOverride-1">విద్ధి</span> - ఎరుగుము - ఏలయన అది జన్యము కదా - పుట్టునది కదా! </p> <p class="Footer"> <span class="CharOverride-1">అర్ణవస్థమ్</span> - సముద్రమునందున్న గడ్డి మొదలగువానిని; <span class="CharOverride-1">విలోడ్యమానమ్</span> - గాలిచేతనే కదల్పబడుచున్నదానిని; <span class="CharOverride-1">యథాప్లవం</span> - ప్రవాహమునకు వాలుగా నున్న దానిని; <span class="CharOverride-1">వాయుః</span> - గాలి; పరమ్ - ఒడ్డునకు; నయతి - ఎట్లు చేర్చునో; <span class="CharOverride-1">ఇహ</span> - ఇందును; సంసారసముద్రమున నున్న జీవుడనెడు తెప్పను; <span class="CharOverride-1">కర్మములే</span> - చిత్తశుద్ధి మొదలగువానిని పుట్టించుట ద్వారా; పరమ్ - ఒడ్డునకు - నయన్తి - చేర్చును. <span class="CharOverride-1">“కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః’’</span> - ‘జనకుడు మున్నగువారు కర్మముతోడనే సంసిద్ధిని పొందిరి’ అని గీత చెప్పినది కదా! ఇచట సంసిద్ధియనగా జ్ఞానయోగ్యత. </p> <p class="Footer ParaOverride-1">31. సూర్యకిరణములకు ఉదయాస్తములున్నట్లే చైతన్యము భాసించినవారికిని అవి కలవని చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">గుణమ్</span> - రశ్మిమండలముతో జగత్తు వ్యాపించు లక్షణము అట్లే జీవుడును చిత్తశుద్ధి కలుగగా జ్ఞానోదయము ఏర్పడగా రాత్రింబగళ్లవలె సంసారముయొక్క లయ, ఉదయములను చూచును -అని అర్థము. <span class="CharOverride-1">నిర్విశేషవాన్ </span>- పోయిన సుఖిత్వాదిధర్మములు కలవాడు - అహంకారము తొలగిపోయినవాడని భావము. </p> <p class="Footer ParaOverride-1">32. ప్రకరణమును ఉపసంహరించుచున్నారు. అనాదియగు సంసారమున సర్వమగు సుఖము పురుషునకు ఏదో జన్మమున అందినదే యగును. ఈ అమృతత్వము మాత్రము. <span class="CharOverride-1">అనాగతము</span> - రాకడ అనునది లేనిది. <span class="CharOverride-1">స్వయంభువమ్</span> - పుట్టినది కానిది; పుట్టినదైనచో నాశము తప్పనిదగును కదా!<span class="CharOverride-1"> ప్రభవనిధానమ్ </span>- దేనియందు సమస్తమైన కార్యజాతము పుట్టుచున్నదో, లయము పొందుచున్నదో - అది; <span class="CharOverride-1">అయినను</span>; ఆవ్యయమ్ - ప్రధానమువలె పరిణామములు లేనిది; నిత్యమైనది. మార్పులు గలదానికి నాశము తప్పక కలుగును కావున నిత్యత్వము సంభవింపదు. <span class="CharOverride-1">సనాతనమ్ - అమృతము</span> - ఆదిమధ్యాంతములు లేనిది - అందువలననే, <span class="CharOverride-1">ధ్రువమ్ -</span> కదలింపనలవికానిది; ఇట్టి ప్రత్యగాత్మకంటె వేరుగాని వస్తువును; <span class="CharOverride-1">నిచాయ్య</span> - చక్కగా తెలిసికొని; <span class="CharOverride-1">తత్</span> - ఆ వేదప్రసిద్దమైన; <span class="CharOverride-1">పరమ్</span> - అప్రధానముకాని; <span class="CharOverride-1">అమృతత్వమ్</span> - మోక్షమును; అశ్నుతే పొందును. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">“అపాపమసోమ మమృతా అభూమ’’</span> అని కర్మముతో లభించు అమృతత్వము కూడ కలదు. ఆది గౌణము. ఏలయన కర్మము వలన ఏర్పడుదానికి నిత్యత్వము కలుగదు కదా! శ్రుతియు <span class="CharOverride-1">‘‘తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే’’</span> - ఇచట కర్మముతో కూడబెట్టుకొనిన లోకము క్షీణించినట్లే అచట పుణ్యముచేత కూడబెట్టుకొనబడిన లోకము కూడ క్షీణించును. అని చెప్పుచున్నది. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">“ఆ భూత సంప్లవం స్థాన మమృతత్వం హి భాష్యతే’’</span> అనియు చెప్పుదురు. 'మొత్తముగా భూతములన్నియు ప్రళయము పొందు స్థానమును అమృతత్వముగాచెప్పుదురు.’ </p> <p class="Footer ParaOverride-1"> ముఖ్యమగు అమృతత్వమును పొందినవాడు మాత్రము సంసారమండలమున మరల తిరుగడు. అందువలన సనాతనాదివిశేషములతో కూడిన నిత్యసుఖము మోక్షమను పేరు గలది. అది స్వతస్సిద్ధమైనను అజ్ఞానము వలన లభింపనిది అనిపించును. మెడలో నున్న సువర్ణహారమును మరచిన విధముగా పొందదగినదిగను అనిపించును. ఇది అజ్ఞానము తొలగిన మాత్రమున సిద్ధించును.</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">షడధిక ద్విశతతమోఽ ధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">206</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">మనుబృహస్పతి సంవాదము </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">206</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">సప్తాధిక ద్విశతతమోఽ ధ్యాయః </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer"> వెనుకటి అధ్యాయమున <span class="CharOverride-1">“నిచాయ్య తత్పర మశ్నుతే"</span> అని బ్రహ్మసాక్షాత్కారము మోక్షహేతువని చెప్పియున్నారు. అందు నిర్గుణస్వరూపమును దర్శించుట సగుణ జ్ఞాన పూర్వకముగనే యగునని తలచి సన్నిహితముగా నున్న శ్రీకృష్ణుడు పరమాత్మ యని మహర్షులముఖమున ఇంతకుముందే వినియున్నవాడు కనుక రాజు మతిసంవాదము కొరకు (తనభావన సరియైనదను నిశ్చయజ్ఞానము పొందుట కొరకు) శ్రీకృష్ణతత్వమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. </p> <p class="Footer"> ఇచట పుండరీకాక్షపదము చేత విగ్రహమును చూపించి అందు అచ్యుతత్వాది విశేషణమును భావించుట అసంగతము కదా! కృష్ణశరీరము కూడ ఇతరములకు వలె ఉత్పన్నము అనుపక్షము నందు కూడ అట్లు పుట్టినవారికి జన్మము, వినాశము కలవు కనుక అట్టివారి విగ్రహమునకు కూడ జన్మాదులుండుటను తిరస్కరింపజాలము. విగ్రహమును వివక్షింపని యెడల మనకును అచ్యుతత్వము మొదలగునది సమానమే. అట్టి పుండరీకాక్ష విశేషణము వలన ప్రయోజన మేమి? అన్నచో చెప్పెదము. భూమి, విత్తనము, మొలక, చెట్టు, పండు అను వానితో పోలిక కలిగి పరమేశ్వర రూపములు అయిదుగా నున్నవి. అవి శుద్దము, శబలము, సూత్రము, విరాట్టు, విష్ణువు అనునవి. నేలలో ఓషధులు పుట్టును అను శ్రౌతదృష్టాంతము నకనుగుణముగా నేలవంటి చిత్పదార్థమున దానికంటె అతిరిక్తములు కాని బీజాదులతో తుల్యములయిన మాయ, శబలము మొదలగునవి కలవు. అందు వృక్షమునందున్నదే అయినను పండుట అనునది ఒకే విత్తనము గర్భముగా గలది యగుటవలన బీజము, అంకురము, చెట్టు అనువాని కంటె మిక్కిలిగొప్పది. ఇట్లు విశ్వమను పేరుగల విగ్రహము గల బ్రహ్మము కూడ అనేకములగు శబలాదులకు గర్భమగుటవలన ఈశసూత్రవిరాట్టుల కంటె మిన్నఅయినది. అందువలననే ఛాందోగ్యమున - <span class="CharOverride-1">‘‘ఆదిత్యరూపం పురుషం హిరణ్యశ్మశ్రు ర్హిరణ్యకేశః’’</span> అని విగ్రహధర్మములతో ప్రత్యేకముగా చెప్పి <span class="CharOverride-1">‘‘తస్య ర్క్బ సామచగేష్ణౌ’’</span> అని అతని వ్రేళ్లకణుపులుగా నయిన ఋక్సామ శబ్దములతో చెప్పబడిన సర్వప్రపంచము నిరూపితమైనది. </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-11">“</span><span class="CharOverride-9">దేవానాం కార్యసిద్ధ్యర్థ మావిర్భవతి సా యదా, </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాభిధీయతే</span><span class="CharOverride-11">”</span><span class="CharOverride-9"> </span></p> <p class="Footer"> దేవతల కార్యము సిద్ధించుటకొరకు ఆమూర్తి ఆవిర్భవించినంతనే ఆది ఉత్పన్నమయినది. అప్పుడు అది (మూర్తి) లోకమున ‘నిత్య’గా చెప్పబడినది. అని యిట్లు జీవాదృష్టముల ననుసరించి నిత్యయగు ఆమూర్తి ఆవిర్భావతిరోభావములే ఉత్పత్తిలయశబ్దములచే వ్యవహరింపబడుచున్నవి. అను నీయర్థమును ప్రతిపాదించు ఆగమముతో విరోధమగును - కావున ఆమూర్తి అనిత్య అని శంకింపరాదు. ఇందు చెప్పవలసిన దంతయు పూర్వమే చెప్పియుంటిమి. </p> <p class="Footer"> అందువలన పుండరీకాక్షునియందును అచ్యుతత్వాదిక విశేషణము తగినదే యగును. </p> <p class="Footer"> ఆచ్యుతుడనగా క్షయములేనివాడు. కర్త అనగా కార్యసముదాయమునకు కర్త అని యర్థము. <span class="CharOverride-1">అకృతుడు</span> - ఉత్పత్తి లేనివాడని యర్థము; <span class="CharOverride-1">విష్ణువు</span> - వ్యాపించియున్నవాడు; బీజఫలన్యాయముచేత కారణమునకు కూడ కారణమైనవాడు. అందు వలననే; <span class="CharOverride-1">భూతానామ్</span> - ఆకాశము మొదలగువానికి; <span class="CharOverride-1">ప్రభవాప్యయమ్</span> - యోని; </p> <p class="Footer">2. <span class="CharOverride-1">అపరాజితమ్</span> - దేహాదులధర్మములగు ముదిమి మొదలగు వానిచేత పరాజయము పొందనివాడు; </p> <p class="Footer">3. <span class="CharOverride-1">జల్పతః</span> - జల్పము - వాక్యమువలన - వారి మాటల వలన అని భావము. </p> <p class="Footer">4. <span class="CharOverride-1">మహత్</span> - మాహాత్మ్యము </p> <p class="Footer">5. <span class="CharOverride-1">భగవాన్</span> - </p> <p class="Poem-1 ParaOverride-1"><span class="CharOverride-11">“</span><span class="CharOverride-9">ఐశ్వర్యస్య సమగ్రస్య జ్ఞానస్య యశసః శ్రియః </span></p> <p class="Poem2 ParaOverride-2"><span class="CharOverride-9">వైరాగ్యస్య చ ధర్మస్య షణ్ణాం భగ ఇతీరణా</span><span class="CharOverride-11">”</span><span class="CharOverride-9"> </span></p> <p class="Footer"> సమగ్రమగు ఐశ్వర్యము, జ్ఞానము, యశస్సు, సంపద, వైరాగ్యము, ధర్మము అనునారింటికి 'భగ'మని వ్యవహారము - అట్టి ఆరుగుణములు కలవాడు. <span class="CharOverride-1">ఈశ్వరః</span> అంతర్యామి; <span class="CharOverride-1">ప్రభుః</span> - రాజువలె వెలుపలనుండి సర్వమును నియమించువాడు; విభుః - అంతట వ్యాపించియున్నవాడు. </p> <p class="Footer">6. <span class="CharOverride-1">యాని</span> - కర్మాణి అను తరువాతి శ్లోకము పదముతో సంబంధము - ఏకర్మములను - అని యర్థము. హరి మాహాత్మ్యము అనంతమైనను కొలది మాత్రమును చెప్పెదను అని భావము.</p> <p class="Footer">8. భూతాత్మ అనుటచేత క్రమముగా పదత్రయముతో చెప్పబడిన జీవ - ఈశ - శుద్ధులు వాయువు మొదలగు మహాభూతములను చేసిరనియు, ఆదియు ఇదియు సమానాధికరణములగుట వలన అభేదము కలదనియు చెప్పినట్లయినది. </p> <p class="Footer">9. అందు “తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్” అనుచోట వినవచ్చు ఈక్షణము మొదలుకొని, ప్రవేశమువరకు గల 'ఐశి' అనుసృష్టి చెప్పబడినది. అప్పు - జలములందు "ఆపఃపురుషవచసః” అనుశ్రుతినిబట్టి నీరు పెల్లుగాగల దేహముల యందు - అని అర్థము; </p> <p class="Footer ParaOverride-1">10. జాగ్రత్తు మొదలుకొని విమోక్షమువరకు గల జీవసంబంధమగు సృష్టిని ఇందు చెప్పుచున్నారు. <span class="CharOverride-1">తేజోమయః</span> - వాసనామయుడు జాగ్రద్వాసనామయుడగు స్వప్నమును దర్శించువానియందు తైజసపదమును ప్రయోగించియుండుటవలన ఈ యర్థమును గ్రహించుచున్నాము; <span class="CharOverride-1">తస్మిన్ </span>- ఆజలమయమగు దేహమునందు; <span class="CharOverride-1">సంకర్షణమ్</span> - అహంకారమును; <span class="CharOverride-1">అకల్పయత్</span> - సృజించెను. </p> <p class="Footer ParaOverride-1">11. <span class="CharOverride-1">మనసా</span><span class="CharOverride-2"> - మనస్సుతోపాటు సృజించెనని పూర్వశ్లోకముతో సంబంధము </span><span class="CharOverride-1">సః</span><span class="CharOverride-2"> - ఆసమనస్కమగు ఆహంకారముతోపాటు </span><span class="CharOverride-1">“సోఽహ మిత్యగ్రే వ్యాహర త్తతోఽహం నామాభవత్’’</span><span class="CharOverride-2"> - </span><span class="CharOverride-2">‘</span><span class="CharOverride-2">అతడు మొదట </span><span class="CharOverride-2">‘</span><span class="CharOverride-2">ఆహమ్</span><span class="CharOverride-2">’</span><span class="CharOverride-2"> అని పలికెను. అందువలన అతడు అహంనాముడాయెను</span><span class="CharOverride-2">’</span><span class="CharOverride-2"> అని అహంకారసృష్టిని చెప్పి <br/></span><span class="CharOverride-1">“సోఽబిభేత్ స నారమత’’</span><span class="CharOverride-2"> - </span><span class="CharOverride-2">‘</span><span class="CharOverride-2">అతడు భయపడెను. రమింపకుండెను</span><span class="CharOverride-2">’</span><span class="CharOverride-2"> అను వాక్యముతో భయము, అరతి మొదలుగా గల మనోధర్మము వినవచ్చుటచేత ఆసృష్టియే అందు చెప్పగోరినట్లు తెలియుచున్నది. <br/></span><span class="CharOverride-1">‘‘సైషా బ్రహ్మణోఽతిపృష్టి ర్యన్మర్త్యః సన్నమృతా వసృజత’’</span><span class="CharOverride-2"> ఆయిది బ్రహ్మయొక్క అతిసృష్టి మర్త్యుడైయుండి అమృతులను సృజించెను - అనునది</span><span class="CharOverride-2">’</span><span class="CharOverride-2"> - అనుస్మృతి సామ్యమువలన ఇది జీవసృష్టి ప్రకరణమని నిశ్చయముగా తెలియుచున్నది. </span></p> <p class="Footer ParaOverride-1">12. కలయందువలె వెలుపల ప్రకాశించుచున్నదైనను లోపలనే బ్రహ్మాండము కలదు. అది మానసమగుటవలన - అనుట ఇచట చూపబడినది. <span class="CharOverride-1">‘‘నాభ్యాముపరితిష్ఠతి. విశ్వస్యాయతనం మహత్’’</span> - ‘విశ్వమునకు నెలవైన మహత్తు నాభికి పై భాగమున నున్నది’ అను శ్రుతి యిచట ప్రమాణము. </p> <p class="Footer ParaOverride-1">13. <span class="CharOverride-1">పుష్కరే</span> - బొడ్డుతామరయందు; <span class="CharOverride-1">“అథ యదిద మస్మిన్ బ్రహ్మపురే దహరపుండరీకే వేశ్మ</span><span class="CharOverride-2">”</span> - ‘ఈ బ్రహ్మపురమున దహర పుండరీకమున ఈ నిలయము’ అనుశ్రుతి వాక్యమువలన ఈకమలము లోపలనున్నదియే కాని వెలుపలిది కాదని తెలియదగును. బ్రహ్మపురమనగా బ్రహ్మను తెలిసికొనుస్థానము, దహరమనగా సూక్ష్మము. అతడు సమనస్కుడగు అహంకారము. ఆ కమలమునుండి అన్ని భూతములను సృజించువాడుగా నాయెనని భావము. </p> <p class="Footer ParaOverride-1"> హృదయపుండరీకము మొదలగు తావున నిరుద్ధమగుమనస్సే సర్వేశ్వరుడని పెక్కుమారులు చెప్పియుంటిమి. </p> <p class="Footer ParaOverride-1">14. ఇట్లు హృదయపుండరీకమున బ్రహ్మ ఆవిర్భవింపగా, <span class="CharOverride-1">తమసా</span> - తమోగుణ కార్యభూతుడై మధువనువాడు లయమను మరొక పేరు కలవాడు, యోగమునకు విఘ్నమైనవాడు, దినదినము లయమున అభ్యాసము కలవాడగుటచే, <span class="CharOverride-1">పూర్వజుడు</span> - అనాది; బ్రహ్మను మ్రింగుటకై పుట్టెనని భావము. </p> <p class="Footer ParaOverride-1">15. <span class="CharOverride-1">అపచితిమ్ - ఉన్నతిని; పురుషోత్తమః</span> - చిదాత్మ; యోగమునందు ఉపస్థితమైన లయమును జ్ఞానముచేతనే అంతము చేయవలయునని భావము. ఇది విక్షేపము మొదలగు దానిని కూడ తెలియజేయును. <span class="CharOverride-1">“లయే సంబోధయే చ్చిత్తం విక్షిప్తం శమయే త్పువః</span><span class="CharOverride-2">”</span> - ‘లయవిషయమున చిత్తమును ఎచ్చరింపవలయును. చెదరిన దానిని అణగగొట్టి అంకెకు తీసికొని రావలయు నని సంప్రదాయవేత్తలు చెప్పుదురు. </p> <p class="Footer ParaOverride-1">16. ఇది మొదలుకొని ఆధ్యాయసమాప్తివరకు ఆంతరసృష్టి ప్రపంచ వివరణము. <span class="CharOverride-1">సాత్వతామ్ -</span> ‘సాత్’ అనగా పరమాత్మ - అది కలవారు సాత్వతులు - యోగులని యర్థము. </p> <p class="Footer ParaOverride-1">17. <span class="CharOverride-1">మానసాన్</span> - మానసత్వము యోగిసృష్టికి, మూఢసృష్టికి తుల్యమే అయినను యోగులు మనస్సును జయించినవారు కనుక ఆ సృష్టి దుఃఖము నొసగనిది. మూఢులసృష్టి అట్టిది కాదు కనుక దుఃఖము నొసగునది. జ్ఞానము, అజ్ఞానము అనువాని ముద్దుబిడ్డలే మోక్ష బంధములు - అనునది ప్రసిద్ధమే. <span class="CharOverride-2">“</span><span class="CharOverride-1">అత్ర ద్వయా హ ప్రాజాపత్యా దేవాశ్చాసురాశ్చ తత్రకానీయసా ఏవ దేవా జ్యాయసా అసురాస్త ఏషు లోకేస్వ స్పర్ధన్త</span><span class="CharOverride-2">”</span> - ‘ప్రజాపతి సంతానము దేవులు, అసురులు అని రెండు విధములు. అందు దేవతలు చిన్నవారు. అసురులు పెద్దవారు. ఈ లోకముల విషయమున స్పర్ధ పొందిరి’ అను శ్రుతి ననుసరించి శమము మొదలగు దేవ భావములు శాస్త్రబలముతో సాధింపవలసినవి కనుక అంతకు ముందే సిద్ధముగా నున్న అసురభావములకంటె చిన్నవి. కామము మొదలగు అసురభావములు స్వభావసిద్ధముగా ఏర్పడియున్నవియే కనుక అవి పెద్దవి. (తమ్ములు, అన్నలు) వారిలో వారు తమ్ము ముక్తి నొందించు కొనుటకును, మోహపాశములతో బంధించుకొనుటకు పరస్పరము స్పర్థవహింపగా విష్ణువను పేరు గల సత్యము వృద్ధిపొందగా దేవతలకు జయము, అసురులకు పరాజయము - అని ఆత్మవిమోక హేతువుగానైనదని అఖ్యాయిక తాత్పర్యము. </p> <p class="Footer">25. <span class="CharOverride-1">ఇతరాః</span> - తక్కిన కశ్యపుని భార్యలు; వ్యజాయన్త - కనిరని భావము.</p> <p class="Footer ParaOverride-1">30. <span class="CharOverride-1"> ప్రధ్యాయ - ఆలోచించి; సః - ఆమధుసూదనుడు; 'పృథివి'</span> అనగా పృథివియందున్న సర్వభూతములను అని యర్ధము. </p> <p class="Footer ParaOverride-1">31. శతమనగా అనంతము </p> <p class="Footer ParaOverride-1">33. <span class="CharOverride-1">ధాతారమ్</span> - సమష్టి అహంకారమును; </p> <p class="Footer ParaOverride-1">34. ఆ మధుసూదనునినుండియే చతుర్ముఖుడు మొదలగువారు పుట్టిరనిభావము. </p> <p class="Footer">35. <span class="CharOverride-1">సమవర్తినమ్</span> - యముని; ‘<span class="CharOverride-1">సమవర్తీ పరేతరాట్’</span> అని అమరము. </p> <p class="Footer">41. <span class="CharOverride-1">నిరపేక్షాన్</span> - నిరయమునే - నరకమునే చూచువారిని; పాపాత్ములనని యర్థము. </p> <p class="Footer">47. <span class="CharOverride-1">ప్రాదుర్భూతః</span> - ఏర్పడినది అనుట వలన సర్వము నిత్య సిద్ధమైనదియే. మునుపు లేక క్రొత్తగా ఏర్పడినది కాదని చెప్పినట్లయినది. ఆవిధముగా ‘<span class="CharOverride-1">సర్వభూతోత్పత్తి’</span> అను అధ్యాయనామము సరిపడును; <span class="CharOverride-1">మహాత్మనా</span> - మహాత్ముడగు శ్రీకృష్ణుడు హేతువుగా ఇది ఏర్పడినని భావము. </p> <p class="Footer">49. విగ్రహవిశిష్టుడగు కృష్ణుని జగద్ధేతుత్వ ప్రతిపాదనమును ఉపసంహరించుచున్నారు. <span class="CharOverride-1">కేవలమానుషోన</span> - కేవలము మనుష్యుడు కాదు పరమాత్మయే. అందువలననే ఆచింత్యుడు - ఊహలకందని వాడని భావము. </p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">207</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">సర్వభూతముల ఉత్పత్తిని చెప్పుట</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">207</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">అష్టాధిక ద్విశతతమోఽధ్యాయః </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer"> * వెనుక ధ్యానము కొరకు కృష్ణుని మాహాత్మ్యమును వివరించిరి. అందు ధ్యానమును పాడుచేయు లోపలి శత్రువులు కామాదులు కలవు. వానిని అణచుటకు పూర్వులగు గురువులను స్మరించుట కర్తవ్యమని - ఆ ప్రయోజనముకొఱకు ఈ అధ్యాయమును ప్రారంభించుచున్నారు. <span class="CharOverride-1">‘‘అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ’’</span> అని వేదమున అభ్యారోహ మంత్రము వలె ఇందును నాలుగువర్ణముల వారు సాధారణముగ యోగసోపానముల నెక్కుటకై జపింపబడిన ఇది అన్ని దిక్కులలో నున్న విఘ్నములను అణచునను దృష్టితో ఈ అధ్యాయము <span class="CharOverride-1">‘దిశాస్వస్తిక’ </span>మని పేరు పొందెను. </p> <p class="Footer">10. <span class="CharOverride-1">ప్రదేశాః - ప్రదిశన్తి </span>- ఆజ్ఞాపింతురు అను వ్యుత్పత్తి చేత ప్రదేశులు - ఈశనశీలురు పాలించువారు అని అర్థము; <span class="CharOverride-1">ప్రభావనాః</span> - మిక్కిలి ఎక్కువగా సృష్టిచేయువారు; </p> <p class="Footer">25. <span class="CharOverride-1">స్వజాత్</span> - స్వయముగా తెలిసిగాని తెలియకగాని చేసిన పాపము వలన; <span class="CharOverride-1">అన్యకృతాత్</span> - ఇతరుల సంగమువలన; </p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">208</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">దిశాస్వస్తికము</span><span class="CharOverride-13">*</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">208</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">209</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">నవాధిక ద్విశతతమోఽధ్యాయః </span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer"> *ఈ విధముగా స్వస్త్యయన పూర్వకముగా కృష్ణుని ధ్యానించు పురుషునకు హృదయములో పొడసూపు శ్రీకృష్ణుడు హృదయమున నున్న కామాదులను - యోగమునకు శత్రువులైన వానిని -- నశింపజేయును అను భావముతో అంతర్భూమి విక్రీడనమను పేరుగల ఈ అధ్యాయమున వరాహాఖ్యాయిక ముఖమున ప్రతిపాదించుచున్నారు.</p> <p class="Footer">10. <span class="CharOverride-1">వృథివీమ్</span> - బుద్ధిని, వాసనారూపమైన బీజములకు క్షేత్రముగా నయినదానిని; <span class="CharOverride-1">దానవైః</span> - కామము, క్రోధము మొదలగు చెడ్డ భావములలో; <span class="CharOverride-1">అభిసంస్తీర్ణామ్</span> - అంతట వ్యాపించి యున్నదానిని; </p> <p class="Footer ParaOverride-1">14. <span class="CharOverride-1">వరాహరూపిణమ్</span> - ‘వరం చ తదహశ్చ’ - వరమైన అహస్సు అను వ్యుత్పత్తి చేత శ్రేష్ఠమగు క్రతుసంబంధము - అందు; <span class="CharOverride-1">రూపయితుమ్</span> - ఆవిర్భవించుట, శీలముగా గలవాడు అని యర్థము. ఇచట అహశ్శబ్దము క్రతువనునర్థము కలుగుట<span class="CharOverride-1"> </span><span class="CharOverride-2">“</span><span class="CharOverride-1">ఆహ్నః ఖః క్రతౌ</span><span class="CharOverride-2">”</span> మొదలగు తావులలో కానవచ్చుచున్నది. <span class="CharOverride-1">దానవాః</span> - కామక్రోధాదులగు దుష్టభావములు; </p> <p class="Footer ParaOverride-1">15. <span class="CharOverride-1">అన్తర్భూమిగతాః</span> - ఇచట భూమి అనగా దేహము - దేహములోపల నున్నవారని భావము. </p> <p class="Footer ParaOverride-1">16. <span class="CharOverride-1">విష్ణుః</span> - ఇచట విష్ణువనగా సత్వగుణము, <span class="CharOverride-1">వారాహమ్</span> - యాగాత్మకమైనరూపమును. </p> <p class="Footer ParaOverride-1">17. <span class="CharOverride-1">సత్యమ్</span> - సత్యగుణముగల విష్ణువును, <span class="CharOverride-1">అమానుషమ్</span> - దివ్యమైన - దూరముగా నున్నవానిని కూడ గ్రహింపగల సామర్థ్యము కలదగుట చేత దివ్యము; <span class="CharOverride-1">సంతస్థుః</span> - నాశమొందిరి; 'సమ్' అను ఉపసర్గము పూర్వమున గల స్థాధాతువునకు 'సమాప్తి' అని యర్థము. </p> <p class="Footer">18. పైని ఫలమును చెప్పి ఆనాశక్రమమును ఈ శ్లోకము మొదలుకొని వివరించుచున్నారు. </p> <p class="Footer">27. <span class="CharOverride-1">సవాతవః - సనాత్ అవగా</span> సతతము ఆనతి - <span class="CharOverride-1">చేష్టతే</span> - కదలాడును - ఎల్లవేళల భక్తుల ననుగ్రహించుట కొరకు క్రియాశీలుడగు వాడు సనాతనుడు. ఇచట నాదముతో కూడిన అనునర్థమున సనాదనః అని యుండవలసి యుండగా తకారము నిరుక్తమును బట్టి ఏర్పడినది. నాదముతో కలసి ప్రవర్తించువాడు అని భావము. </p> <p class="Footer">31. <span class="CharOverride-1">మహావర్ష్మా</span> - పెద్దకాయము కలవాడు </p> <p class="Footer">32. <span class="CharOverride-1">ఆత్మా</span> - పారమార్థికమైన స్వరూపము; <span class="CharOverride-1">ఆత్మనః</span> - ఆత్మకు - జీవునకు అని యర్థము </p> <p class="Footer">33. <span class="CharOverride-1">స్వమ్ ఆత్మానమ్</span> - ప్రత్యక్స్వరూపము యొక్క నిజమైన స్థితిని; <span class="CharOverride-1">సమాయాతః</span> - పొందినవాడాయెను. </p> <p class="Footer">36. ఏషః - ఈ జీవుడు - అందువలననే సంతాపము మొదలగునది చేయరాదు - అని భావము. ఆ సంతాపము మొదలగునదియే మూలకారణముగా ఆత్మదర్శనము కాకుండుట అనునది అంతరించి పోయెను. కనుక సంతాపాదికముతో పనిలేదని భావము.</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">అంతర్భూమి విక్రీడనము</span><span class="CharOverride-13">*</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">209</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Footer ParaOverride-1"> * ఇట్లు మూడు ఆధ్యాయములలో ఈశ్వరప్రణిధానమును గూర్చి వివరించిరి. దానివలన మిక్కిలి వేగముగా యోగము సిద్ధించును. యోగమునకు అంతరాయములైన వ్యాధిదుఃఖాదులు నశించును. ఇప్పుడు ప్రధానమైన యోగమును తెలియగోరి అడుగుచున్నాడు. (ఈశ్వర ప్రణిధానము - ఈశ్వరునితో సామీప్యము)</p> <p class="Footer ParaOverride-1">1. <span class="CharOverride-1">పరమమ్</span> - సబీజ యోగముకంటె మిన్నయగు నిర్బిజయోగము; </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">మోక్షస్య</span> - మోక్షమునకు కారణమైన దానిని; </p> <p class="Footer ParaOverride-1">2.3. ఈ రెండు శ్లోకములలో క్రమముగా గురుశిష్యలక్షణములను సూచించుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1">5. <span class="CharOverride-1">కుతః</span> - నీవును నేనును ఏ ఉపాదానము వలన ఏర్పడితిమి. (ఉపాదానము - ముడి వస్తువు వంటిది); కుతః - ఏది నిమిత్తముగా - ఏర్పడితిమి. మన ఇరువురి యిప్పటి స్థితికి మూల పదార్థమేది? సాధన సంపత్తి యెట్టిది? అని ప్రశ్నల భావము. <span class="CharOverride-1">యత్, పరమ్</span> - శ్రేష్ఠమైన ఉపాదానము, నిమిత్తము అయిన దేది? అది తలిదండ్రుల వంటిది, పుణ్యాపుణ్యముల వంటిది అగు నడుమ వచ్చినట్టిది కాదనియు, దానికంటె శ్రేష్ఠమైనదనియు భావము. </p> <p class="Footer ParaOverride-1">6, 7. అయిదు భూతములు స్థూలముగా అందరకు. అన్నింటికి ఉపాదాన కారణములు. కాగా ఎగుడుదిగుళ్లుగానయిన క్షయము, నాశము, ఉదయము - పెంపుదల అనునవి యెట్లు కలుగుచున్నవి? అని ప్రశ్న భావము. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">వేదే</span> - వేదములయందు వర్ణ ధర్మవ్యవస్థాపరమైన వాక్యము కలదు; <span class="CharOverride-1">లౌకికమ్</span> - లోకసంబంధమైనది "బ్రాహ్మణుడు బృహస్పతి స్తవముతో, క్షత్రియుడు రాజసూయముతో, వైశ్యుడు వైశ్యస్తోమముతో యజింపవలయును. అందువలన శూద్రుడు యజ్ఞమున అర్హత లేని వాడు" మొదలగు లౌకికవాక్యము హెచ్చు తగ్గులను నిరూపించుచున్నవి. అట్లే అందరకు వర్తించు' ఏ ప్రాణిని హింసింపరాదు' వంటి వాక్యములు కలవు. ఇది యెట్లు? హేతువు సమానముగా నుండగా కార్యమున విషమ స్థితి ఏర్పడుటకు బీజమేమి? దానిని నాకు వివరింపుము - అని ప్రార్థన. </p> <p class="Footer">8. <span class="CharOverride-1">బ్రహ్మ గుహ్యమ్</span> - వేదముచే గుట్టుగా రక్షింపబడినది; వసు - ధనము - దానివలె రక్షింపదగినది, లేదా ఉపకరించునది. </p> <p class="Footer ParaOverride-1">9. <span class="CharOverride-1">బ్రహ్మణః</span> - వేదము యొక్క ; <span class="CharOverride-1">ముఖమ్</span> - మొదటి పదము ప్రణవము అని అర్థము; ఉపాయము, దానిచే పొందదగినది అనువానికి అభేదము కనుక ప్రణవము మొదలగువానికి వాసుదేవత్వము సిద్దించుచున్నది. </p> <p class="Footer ParaOverride-1">10 ఈ శ్లోకమున ఉపేయ - పొందదగినదాని - స్వరూపమును చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1">11. వార్ష్ణేయమ్ - వృష్టివంశము వారియందు అవతరించిన వాడగు కృష్ణుని, <span class="CharOverride-1">ఇతిహాసమ్</span> - దాని స్వరూపమును ప్రకాశించుటయే తాత్పర్యముగా గల గ్రంథము. </p> <p class="Footer ParaOverride-1">13. వార్ష్ణే యమ్ - కృష్ణుడను పేరుగలది, <span class="CharOverride-1">పరమ్, కాల చక్రమ్</span> - ఆతి పురాతనమగు కాలమనెడు చక్రము. అంతేకాని ఇప్పటిదగు సంవత్సరము కాదని భావము; <span class="CharOverride-1">భావాభావ స్వ లక్షణమ్</span> - సృష్టి ప్రళయములే స్వరూపజ్ఞాపకములుగా కలవానిని; ‘ఆధ్యారోపఅపవాదములతో ప్రపంచరహితమగుతత్త్వము నిరూపింపబడుచున్నది’ - అనున్యాయముననుసరించి మాత్రమే తెలియదగిన తత్త్వము. అంతేకాని కొమ్ముగలది ఆవు అన్నట్లు తెలియదగినది కాదని భావము. </p> <p class="Footer ParaOverride-1">15. అవ్యయః - ఎట్టి మార్పులును లేనివాడు. </p> <p class="Footer ParaOverride-1">16. <span class="CharOverride-14"> </span><span class="CharOverride-10">‘‘బ్రహ్మణో మహతో భూతస్య నిః శ్వసిత మేత ద్య దృగ్వేదః’’</span> - మొదలైన శ్రుతులు వేదకర్తృత్వమును పరమాత్మకు స్పష్టముగా చెప్పుచున్నవి ‘గొప్పదియగు భూతము బ్రహ్మముయొక్క నిట్టూర్పే ఈ ఋగ్వేదము మొదలగునది’ అని ఆ వాక్య భావము. </p> <p class="Footer ParaOverride-1"> <span class="CharOverride-1">ప్రళయమ్</span> - మహదాది కార్యము ఇతనియందు పూర్తిగా లీనమగును కనుక అతడు ప్రలయకాల స్వరూపుడు. <span class="CharOverride-1">ప్రకృతిమ్</span> - ప్రకరోతీతి ప్రకృతిః - అతిశయముగా చేయుచున్నది కనుక ప్రకృతి - ఇట్లు పరమాత్మ లయమునకు ఉత్పత్తికి స్థానమగు మాయాశబలమగు తత్త్వమును గూడ అతడే సృజించునని భావము. శ్రుతియు అట్లే చెప్పుచున్నది - <span class="CharOverride-1">‘‘నాపదాసీన్నో సదాసీ త్తదానీం నాసీద్రజో వ్యోమాపరోయత్’’</span><span class="CharOverride-12"> </span>అను మంత్రమున సత్తు, అసత్తు, రజస్సు అను శబ్దములు తెలిపెడు ప్రధానము, శూన్యము, పరమాణువు అను అనుమానమువలన తెలియవచ్చెడు వానివలె శ్రుతి ప్రతిపాదించెడు పరవ్యోమమునకును, మాయాశబలమను మరియొకపేరు గల సృష్టికంటె ముందు లేనితనమును చెప్పుచున్నదై అదియు పుట్టునదే అని నిరూపించుచున్నది. మాయ తుచ్ఛము, బ్రహ్మము సంగము లేనిది కనుక ఆ రెంటికి ఒక్కటి అగు లక్షణము లేదు. కావున ప్రకృతిని సృజించుచున్నాడు అనుట యుక్తమే. </p> <p class="Footer ParaOverride-1">17. ప్రతి సంవత్సరము వసంతమున మామిడిచెట్లు, గ్రీష్మమున మల్లెలు, వర్షర్తువున కడిమిచెట్లు నియమముగా పూచును. అట్లే ప్రతికల్పమునందును బ్రహ్మ, హరుడు, విష్ణువు సృష్టి ప్రళయ స్థితి కర్తలుగా ఆవిర్భవించుచుందురని భావము. </p> <p class="Footer ParaOverride-1">18. పై అభిప్రాయమునే వివరించుచున్నారు; తత్ తత్ - అది అది ఆయా విషయమునందు <span class="CharOverride-1">లోకయాత్రా విధానజమ్</span> - లోకయాత్ర అనగా వ్యవహారము, దాని విధానము- ప్రమాణముతో ప్రమేయమును తెలిసికొను దానిని - తెలియజెప్పు పద్ధతి; దానివలన ఏర్పడిన; <span class="CharOverride-1">జ్ఞానమ్ - జ్ఞానము</span>; వ్యవహారజ్ఞానము ఉపాధితో కూడినదే కాని ఉపాధిలేనిది కాదని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">19. యుగాన్తే - యుగము ముగియునప్పుడు ; <span class="CharOverride-1">అన్త</span><span class="CharOverride-1">ర్హితాన్</span> - తెలియరాకుండ నిలిచియున్న - అని భావము, పూర్వ యుగమున నున్నవియే యగు వేదములు, ఇతిహాసములు అను వానిని; <span class="CharOverride-1">స్వయంభువా</span> - బ్రహ్మ చేత, <span class="CharOverride-1">అనుజ్ఞాతాః</span> - ఉపదేశము పొందినవారై; మహర్షులు పొందిరని భావము.</p> <p class="Footer ParaOverride-1">20. వేదవేత్త భగవానుడు బ్రహ్మ యనియు వేదాంగములను బృహస్పతి యెరిగెననియు సంబంధము. </p> <p class="Footer ParaOverride-1">22. <span class="CharOverride-1">న్యాయతన్త్రాణి</span> - తర్కము, వైశేషికము, సాంఖ్యము, యోగము మొదలైన దర్శనములు, <span class="CharOverride-1">హేత్వాగమపదాచారైః</span> - హేతువనగా యుక్తి, (అనుమాన ప్రమాణము.) ఆగమ మనగా - వేదము - శబ్ద ప్రమాణము. సదాచార మనగా ప్రత్యక్ష ప్రమాణము- వీనితో దీనిని ఊహింప వలయును. అనగా వీని జ్ఞానము అముఖ్యముగా దానితో తెలియవచ్చు బ్రహ్మము ఉపాసనకు సంబంధించినదే కాని, వేదాంతము చేత మాత్రమే తెలియదగు పరమాత్మ జ్ఞానము కాదని తాత్పర్యము. ఆట్లు ఉపాసింపబడునది బ్రహ్మము కాదని శ్రుతియు చెప్పుచున్నది <span class="CharOverride-1">‘‘తదేవ బ్రహ్మ త్వంవిద్ధి నేదం యదిదముపాసతే’’</span> అదియే బ్రహ్మమని నీ పెరుగుము. దేనిని ఉపాసింతురో అది బ్రహ్మము కాదు. </p> <p class="Footer ParaOverride-1">23. <span class="CharOverride-1">అనాద్యమ్</span> - ఆద్యమనగా కారణము. అది లేనిది అనాద్యము - లేదా- ఆదియందు తెలియవచ్చునది ఆద్యము. ఆది కానిది అనాద్యము. సృష్టి మొదట తెలియరాకుండునది అని భావము. అట్లైనచో దేవతలు తెలియరనుట యెట్లు? అనుదానికి ఒక్క నారాయణుడు మాత్రమే దాని నెరుగును, దేవతలు, ఋషులు అతని అమగ్రహముచే తరువాత తెలిసి కొనిరి - ఆని భావము. </p> <p class="Footer">25 బ్రహ్మజ్ఞానము ఆత్యంతిక దుఃఖమును నివారించునది అని చెప్పి అధ్యారోప అపవాద న్యాయముచే బ్రహ్మమును నిరూపించుచున్నారు, <span class="CharOverride-1">పురుషాధిష్ఠితాన్</span> - పురుషునిచేత- పరమాత్మచేత, <span class="CharOverride-1">ఆధిష్ఠితాన్</span> ఆలోచింపబడిన, <span class="CharOverride-1">భావాన్</span> - భావములను, యదా - ఎప్పుడు, <span class="CharOverride-1">ప్రకృతిః</span> - ప్రకృతి, <span class="CharOverride-1">సూయతే</span> <br/>- వెలువరించుటకు ఉన్ముఖముగా నుండునో, <span class="CharOverride-1">తదా</span> - అప్పుడు; <span class="CharOverride-1">హేతుయుక్తమ్ -</span> ఇచట 'హేతువులనగా ధర్మాధర్మములు; వానితో కూడిన, <span class="CharOverride-1">జగత్</span> - జగత్తు, <span class="CharOverride-1">సంపరివర్తతే</span> - చక్కగా రూపొందును. </p> <p class="Footer">26. హేతు యుక్తమనుమాట ఇక్కడ కూడ అన్వయించును. వత్తి మున్నగు హేతువులుండగా ఒక దీపము నుండి అనేకదీపములు వెలుగొందునట్లు అదృష్టసంబంధమువలన ప్రకృతి మహదాది కార్యముల సముదాయమును కలిగించును. వెలిగించిన దీపమువలె అనంతత్వము నుండి తొలగియు పోదు. ఈశుడు అదృష్టము అనువాని వలన ప్రకృతి సాగుచుండునని భావము. </p> <p class="Footer">27. సృష్టిక్రమమును వివరించుచున్నారు. </p> <p class="Footer"> 'కర్మజా'అను పదమువలన ఈశ్వరుని కంటె కర్మమునకు గల ప్రాబల్యము కానవచ్చుచున్నది. ఆ ఈశ్వరుడు కర్మాపేక్షతోడనే మంచి, చెడు ఫలముల నిచ్చువాడగుచున్నాడు కదా! బుద్ధి యనగా మహత్తత్వము. ఆ విధముగా సృష్టి మొదట కర్మమే ప్రకృతిని ప్రవర్తింపజేయుచున్నదని యర్థము. ఆకాశాది పదములతో శబ్దము మొదలగు తన్మాత్రాదులను తెలియదగును. </p> <p class="Footer">29. అందువలన పురుషుడు అధిష్ఠించియున్న ప్రకృతి మొదలగు నెనిమిదికంటె వేరుగా విషయములనగా శబ్దము మొదలగువానికి ఆశ్రయము లైన స్థూలాకాశము మొదలగునవి - అని అర్థము. వాయువు, ఆకాశము అనువానిని స్పర్శ, శబ్దము అనువానిచేత ఊహించు చున్నాము కనుక అవి విషయము లగుచున్నవి. </p> <p class="Footer">30. <span class="CharOverride-1">వాక్కర్మణీ</span> - అనుచోట 'వాక్' అనగా వాగింద్రియము - ముఖము. కర్మ శబ్దముచేత ఇంద్రియము లన్నింటి కర్మములగు మాట, గ్రహించుట, గమనము, విసర్జనము, ఆనందము అనువానిని తెలియవలయును. </p> <p class="Footer">31. శబ్దాదులు చిత్తమని తెలియదగును. చిత్తమాత్రమే ఉపాదానముగా - ముడి పదార్థముగా గలవి అని తాత్పర్యము. అక్షపాదాచార్యులు చెప్పినదాని నిట అన్వయించుకొనవలయును<span class="CharOverride-1"> “దోష నిమిత్తం రూపాదయో విషయాః సంకల్పకృతాః’’</span>- దోషమునకు నిమిత్తముగా రూపాదులగు విషయములు సంకల్పముచేత చేయబడినవి. </p> <p class="Footer"> ఇట్లు ప్రమేయము - తెలియవచ్చునది - అనునది చిత్తమాత్రముగా చెప్పి ప్రమాణము నిశ్చయ జ్ఞానమును కలిగించుదానిని గూర్చి చెప్పుచున్నారు. <span class="CharOverride-12">తేషు</span> - ఆ యింద్రియముల ; <span class="CharOverride-1">సర్వగతమ్</span> - అన్నింటియందు చేరియున్నది - చెవి మున్నగు రూపములో చేరియున్నది. <span class="CharOverride-1">మనః</span> - మనస్సే. </p> <p class="Footer ParaOverride-17">32. దీనినే స్పష్టము చేయుచున్నారు. <span class="CharOverride-1">రసజ్ఞానే</span> - రసమును - రుచిని - తెలియునపుడు, మనస్సే; <span class="CharOverride-1">ఇయం జిహ్వా</span> - ఈ నాలుక - నాలుక అని రుచిని గ్రహించు కరణముగా మనము వ్యవహరించునది మనస్సే అని తాత్పర్యము.<span class="CharOverride-1"> ‘‘మనసా హ్యేవ పశ్యతి మనసా శృణోతి’’</span> మనస్సుతోడనే చూచుచున్నాడు. 'మనస్సుతోడనే వినుచున్నాడు' మొదలగు శ్రుతులు దీనినే స్పష్టము చేయుచున్నవి. <span class="CharOverride-1">వ్యాహృతే</span> <br/>- శబ్దప్రయోగ సమయమున; <span class="CharOverride-1">ఇదమ్</span> - ఇది; <span class="CharOverride-1">వాక్ </span>- వాక్కు. ఇది జ్ఞానేంద్రియ పంచకమును కర్మేంద్రియ పంచకమును తెలుపును. <span class="CharOverride-1">సర్వమ్</span> - లోపలిదగు బుద్ధి, సుఖము, దుఃఖము మొదలగునది. బాహ్యమైన ఆకాశము, శబ్దము మొదలగునది, అట్లే అవ్యక్తమైన మహత్తు మొదలు ఘటమువరకు అంతయు మనస్సే అని భావము. శ్రుతియు నిట్లు చెప్పుచున్నది. <span class="CharOverride-1">‘‘అసతోఽధి మనోఽ సృజ్యత మనః ప్రజాపతి మసృజత ప్రజాపతిః ప్రజా అసృజత తద్వా ఇదం మనస్యేవ పరమం ప్రతిష్ఠితమ్ యదిదం కిఞ్చ’’</span> ‘అవ్యక్తము నుండి మనస్సు ఏర్పడెను. మనస్సు ప్రజాపతిని సృజించెను. ప్రజాపతి ప్రజలను సృజించెను ఆ విధముగా ఈ సర్వము మనస్సునందే నెలకొని యున్నది.’ </p> <p class="Footer ParaOverride-17">33. షోడశ - పదునారు పది ఇంద్రియములు. మనస్సు, పంచభూతములు, <span class="CharOverride-1">జ్ఞాన కర్తారమ్</span> - విజ్ఞానాత్మను, <span class="CharOverride-1">ఉపాసీనమ్</span> - దేహమునందు నెలకొని యున్నవానిని - అనగా పరమాత్మను - అని అర్థము. ఈ పరమాత్మ ఇంద్రియాదు లన్నింటి సముదాయరూపముగా నుండియు, ఆ అన్నిటికంటె భిన్నముగా నున్నట్లు తెలియ వచ్చుటచేత ఇవి అతనిని ఉపాసించునట్లు చెప్పిరి. </p> <p class="Footer ParaOverride-1">34. <span class="CharOverride-1">సోమగుణః</span> - చంద్రుడు రసాత్మకుడు కనుక జలము. అతని గుణము - కార్యమును చేయునది నాలుక అని భావము. <span class="CharOverride-1">గన్ధః</span> - గంధమును గ్రహించునది. గ్రహింపబడునది అనువానికి అభేదము కనుక గంధమే ఘ్రాణము. <span class="CharOverride-1">స్పర్శమ్</span> - స్పర్శనేంద్రియము - చర్మము; జిహ్వాదులకు జలాది కార్యత్వము వానియందున్న రసాదులను గ్రహించు స్థితివలన నగుచున్నది కనుక గ్రాహ్య గ్రాహకములు సమాన జాతీయములను నియమము దీనిచేత సూచింపబడుచున్నది.</p> <p class="Footer ParaOverride-1">35. <span class="CharOverride-1">సత్త్వ గుణమ్</span> - సత్వకార్యము, <span class="CharOverride-1">అవ్యక్తజమ్</span> - ప్రధాన కార్యము, <span class="CharOverride-1">సర్వభూతాత్మ భూతస్థమ్</span> - సర్వ భూతములకు ఆత్మభూతముగా ఉన్నవాడు - ఈశ్వరుడు అగుచున్నది. -సత్వము సర్వమునకు అంతరంగము అని భావము; <span class="CharOverride-1">బుద్ధ్యేత</span> - సత్వమే తెలియదగినది - అని తెలియ వలయునని భావము. నిజమునకు తెలియవలసినది చిత్పదార్థము. అది సత్యము విశేషముగా కలది యగుట వలన దానిని తప్పక తెలియవలయునని తాత్పర్యము. </p> <p class="Footer ParaOverride-1">36. <span class="CharOverride-1">ఏతే</span> ఈ సత్వము మొదలగునవి - లేదా ఈశుడు మొదలగువారు, <span class="CharOverride-1">విరజసమ్</span> - ఎట్టి ప్రవృత్తియు లేని కూటస్థుడగు పరమాత్మను. </p> <p class="Footer ParaOverride-1">37. నవద్వారమ్ - అయిదు జ్ఞానేంద్రియములు, బుద్ధి మనస్సు, దేహము, ప్రాణము అను తొమ్మిది ద్వారములు కలది, ద్వారములన విషయములను పొందించునవి అని భావము, <span class="CharOverride-1">భావైః</span> - శబ్దము మొదలగు భావములతో;</p> <p class="Footer ParaOverride-1">38 అజరము, అమరము - ఆనుపదములతో దేహధర్మముల స్పర్శ లేకుండుటను చెప్పిరి. వ్యక్తమనగా ఆకారముకలది. అవ్యక్తమనగా ఆకారము లేనిది, ఆ రెండు స్వరూపములు కలది వేదము ఉపదేశించిన తత్త్వము - <span class="CharOverride-1">వ్యక్తావ్యక్తోపదేశవాన్</span> “ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ” బ్రహ్మమునకు రెండురూపములు- మూర్తము అమూర్తము అనునవి - కార్య కారణాత్మ అని తాత్పర్యము, ఇట్టి వాడైనను, <span class="CharOverride-1">వ్యాపకః</span>- కారణాత్మ, <span class="CharOverride-1">సగుణః</span> - యః సర్వజ్ఞః మొదలైన శ్రుతి చెప్పెడు సర్వజ్ఞత మొదలైన గుణములతో కూడినవాడు, <span class="CharOverride-1">సూక్ష్మః</span> - ఇంద్రియములకు అందనివాడు, <span class="CharOverride-1">సర్వభూత గుణాశ్రయః</span> - అన్ని భూతములకు, సత్వము మొదలైన గుణము లన్నింటికి ఆశ్రయమైనవాడు. </p> <p class="Footer ParaOverride-1">39. ఉపాధిని - పొందిన ఆధారభూతమగు దానిని బట్టి ఆ పురుషుడు గొప్పతనమో ఆల్పత్వమునో పొందినవాడైనను దీపము వలె సర్వజంతువులయందును వెలుగొందు వాడాతడే అని భావము. </p> <p class="Footer ParaOverride-1">40. చెవి ఏది కారణముగా వేద్యమగు తన విషయమును అనగా శబ్దమును, వేదయతే - తెలిసికొనుచున్నదో, ఆ కారణ భూతమైనదియే వినుచున్నది. అట్లే, <span class="CharOverride-1">పశ్యతి</span> - చూచుచున్నది దీనిని మిగిలిన విషయములందును అన్వయించుకొనవలయును, శ్రుతులును <span class="CharOverride-1">“యేన శ్రోత్రం శృణోతి యేన చక్షుశ్చ పశ్యతి”</span> దేనితో చెవి వినుచున్నదో దేనిచేత కన్ను చూచుచున్నదో ‘ -ఇత్యాదిగా చెప్పుచున్నవి. <span class="CharOverride-1">అయం దేహః</span> - ఈ దేహము మాత్రము ఆ శబ్దాదులు వినుట మొదలగుదానికి కారణము మాత్రమే కర్త కాదు. ఆ పురుషుడే కర్త, </p> <p class="Footer ParaOverride-1">41. అయినచో ఈ ఆత్మ ఏల కానరాదు అని ఆశంకించి ఉపాయము లేనికారణమున కానరాదని తెలియజెప్పుచున్నారు, <span class="CharOverride-1">అయోగే</span> - అయోగము ఉపాయము - లేని సమయమున, <span class="CharOverride-1">నైవ అనుదృశ్యతే</span> <br/>- ఏవిధముగను కానరాదు, ఇచట యోగమనగా తత్వజ్ఞానాదికమని భావింపదగును. </p> <p class="Footer ParaOverride-1">42. వ్యతిరేకమును చెప్పి అన్వయమును చెప్పుచున్నారు. </p> <p class="Footer ParaOverride-1"> దారు - దారుణి - కట్టెయందు, యోగేవ, ఏవ - యోగము చేత మాత్రమే, మరియొక ఉపాయముచేత కాదని భావము. </p> <p class="Footer ParaOverride-1">43. యోగము లేనిచో దేహ సంబంధము తెగిపోదని తాత్పర్యము, </p> <p class="Footer ParaOverride-1">44. ఆత్మ మరియొక దేహమును పొందుట ఒక శాలలోనికి వెళ్లునట్లు కాదు స్వప్నమునందువలె అని భావము. <span class="CharOverride-1">తథైవ</span> - అట్లే మరణము తరువాత దేహమును వదలి మరియొక దేహమును చేరుకొనునని శాస్త్ర దృష్టితోడనో, యోగము చేతనో తెలియ వచ్చునని భావము. </p> <p class="Footer ParaOverride-1">45. ఏ కారణముచేత దేహాంతరమును పొందునో చెప్పుచున్నారు. <span class="CharOverride-1">కర్మణా</span> - కర్మముతో. <span class="CharOverride-1">రూపమ్</span> పూర్వశరీరము, <span class="CharOverride-1">బాధ్యతే</span> - బాధింపబడును - చెడును. అంతేకాని ఆ దేహమే మరియొక దేహముగా మారదు - అని భావము </p> <p class="Footer ParaOverride-1">46. దీనినే మరింత స్పష్టము చేయుటకై ‘సంప్రవక్ష్యామి’ చక్కగా గట్టిగా తెలియజేయుదును. అని ప్రతిజ్ఞ చేయుచున్నారు</p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-3">దశాధిక ద్విశతతమోఽధ్యాయః</span></p> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1"><span class="CharOverride-7">210</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectLayout-2 _idGenObjectStyleOverride-3"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head2"><span class="CharOverride-8">వార్ష్ణేయాధ్యాత్మ కథనము</span><span class="CharOverride-13"> *</span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1">210</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> </body> </html>
Cancel
Save Chapter