| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 4 |
| Pages | 1 |
| Read Time | 1 Minutes |
Sri Chandramouleeswaraya Namaha
Sri Sankara Bhagavatpadacharya Paramparagatha
His Holiness Sri Kanchi Kamakoti Peetadhipathi
Jagadguru Sri Sankaracharya Swamigal
Srimatham : Samsthanam,
Kancheepuram 631502.
Camp : Gwaliar, MP. Date : 13-11-86
శ్రీరామచరిత్రము ఎన్నిసారులు ఎవరు చెప్పినను వినినను చాలునని అనిపించదు. శ్రీమద్రామాయణములో ధర్మము, మాతృభక్తి, పితృభక్తి, ఆచార్యభక్తి, పతిభక్తి, సహోదరప్రేమ, ఆపత్కాలములలో సంరక్షణ యిటువంటి అనేక ధర్మసూక్ష్మములు చెప్పబడినవి. ఈ రామాయణము విదేశములలోను చదువబడుచున్నది. శ్రీమద్రామాయణము సాగరమునకు సమానమైనది. అట్టి శ్రీమద్వాల్మీ కిరామాయణము బాలకాండము శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన బాలానందినీవ్యాఖ్యతో తాత్పర్యముతో కూడియుండుట చూచి సంతోషపడుచున్నాము. ఈ గ్రంథము అందరును చదువుటచే సదుపయోగము కావలయునని ఆశీర్వదించుచున్నాము.
నారాయణస్మృతి