Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_2</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_2.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_2" xml:lang="te-IN"> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీః</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-23" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీమద్రామాయణము : బాలకాండము</span></p> <p class="Head2" xml:lang="en-GB">అథ ద్వితీయః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">రామాయణప్రారంభము తమసాతీరమున క్రౌంచపక్షిని వ్యాధుడు చంపగా చూచిన వాల్మీకి తన శోకమును శ్లోకరూపమున ప్రకటించుట. బ్రహ్మదేవుడు రామచరితవర్ణనాత్మక మగు కావ్యము రచింపు మని వాల్మీకిని ఆదేశించుట.</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పూజాయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నారదస్య = నారదునియొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా తు = విననంతనే</span>, <span xml:lang="te-IN">వాక్యవిశారదః = వాక్యములయందు పండితుడును</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మమందు బుద్ధి గలవాడును అగు</span>, <span xml:lang="te-IN">మహామునిః = వాల్మీకి మహాముని</span>, <span xml:lang="te-IN">సహశిష్యః = శిష్యులతో కూడినవాడై</span>, <span xml:lang="te-IN">పూజయామాస = పూజించెను.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకిమహాముని ధర్మబుద్ధి కలవాడు</span>; <span xml:lang="te-IN">వాక్యముల విశేషము తెలిసినవాడు. అందుచే నారదుడు చెప్పిన సంక్షేపరామాయణ రూప మగు వాక్యమును వినినంతనే దానిని శ్లాఘించెను. ఆయన శిష్యులు కూడ శ్లాఘించిరి.</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">విశేషార్థము</span><span xml:lang="te-IN"> - వాక్యవిశారదః = వాక్యరూపము లగు సమస్తశాస్త్రములందును పండితుడును</span>, <span xml:lang="te-IN">ధర్మాత్ముడును అగు వాల్మీకి</span>, <span xml:lang="te-IN">నారదస్య-</span>‘‘<span xml:lang="te-IN">నరతీతి నరఃప్రోక్తః పరమాత్మా సనాతనః</span>’’ (<span xml:lang="te-IN">సనాతను డగు పరమాత్మ ప్రపంచముయొక్క సృష్టిస్థితిలయములను నడిపించును గాన నరు డని చెప్పబడుచున్నాడు) అను ప్రమాణమును పట్టి </span>‘<span xml:lang="te-IN">నరః</span>’ <span xml:lang="te-IN">అనగా పరమాత్మ. </span>‘‘<span xml:lang="te-IN">నరసంబన్ధి నారమ్</span>’’ - <span xml:lang="te-IN">పరమాత్మకు సంబంధించిన జ్ఞానము నారము. </span>‘‘<span xml:lang="te-IN">నారం దదాతీతి నారదః</span>’’ - <span xml:lang="te-IN">పరమాత్మకు సంబంధించిన జ్ఞానమును ఇచ్చువాడు నారదుడు. ఆశ్రితులకు బ్రహ్మోపదేశము చేయు అట్టి నారదుని యొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ వేదాంత ప్రసిద్ధ మైన</span>, <span xml:lang="te-IN">వాక్యమును</span>, <span xml:lang="te-IN">వినినంతనే</span>, <span xml:lang="te-IN">మహామునిః = గొప్ప బ్రహ్మానుసంధానము చేయువాడై</span>, <span xml:lang="te-IN">శిష్యులతో కూడిన వాడై</span>, <span xml:lang="te-IN">పూజయామాస = శ్లాఘించెను (అని ప్రాచీనులు).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సమస్త శాస్త్రార్థములు తెలిసికొని జ్ఞానమును కలిగించు కర్మల అనుష్ఠానము చేయుచున్న వాల్మీకి మహర్షి</span>, <span xml:lang="te-IN">బ్రహ్మోపదేశాచార్యు డైన నారద మహర్షి ఉపదేశించిన వేదాంతార్థములు వినినంతనే తాను బ్రహ్మానుభవమును పొందుటయే కాక శిష్యులకు కూడ ఆ అర్థమును ఉపదేశించి శిష్యులతో కూడిన వాడై యెల్లప్పుడును ఆ వేదాంతపరమార్థానందమునే అనుభవించుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆపృష్ట్వెవాభ్యనుజ్ఞాతస్స జగామ విహాయసమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దేవర్షిః = దేవతయును ఋషియును అయిన</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">నారదః = నారదుడు</span>, <span xml:lang="te-IN">తేన = ఆ వాల్మీకిచేత</span>, <span xml:lang="te-IN">తథా = అట్లు</span>, <span xml:lang="te-IN">యథావత్ = యథాయోగ్యముగ</span>, <span xml:lang="te-IN">పూజితః = పూజింపబడినవాడై</span>, <span xml:lang="te-IN">ఆపృష్ట్వైవ = ఆ వాల్మీకిని సంతోషపరచియే</span>, <span xml:lang="te-IN">అభ్యనుజ్ఞాతః = అనుజ్ఞను పొందినవాడై</span>, <span xml:lang="te-IN">విహాయసమ్ = ఆకాశమును</span>, <span xml:lang="te-IN">జగామ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దేవర్షి యైన నారదుడు వాల్మీకిచే యథోచితముగా పూజింపబడినవాడై</span>, <span xml:lang="te-IN">ఆ వాల్మీకిని ఆలింగనాదులచే సంతోషపరచి</span>, <span xml:lang="te-IN">వారి అనుజ్ఞ పొంది</span>, <span xml:lang="te-IN">ఆకాశమార్గమున దేవలోకమునకు వెళ్ళెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">విశేషార్థము</span><span xml:lang="te-IN"> - దేవర్షిః = దేవతలలో జ్ఞానపారంగతు డైన</span>, <span xml:lang="te-IN">సః = ఆ(వాల్మీకికి జ్ఞానోపదేశము చేసిన)</span>, <span xml:lang="te-IN">నారదః = జ్ఞానప్రదాత యగు నారదముని</span>, <span xml:lang="te-IN">తేన = శిష్యుడైన ఆ వాల్మీకమునిచేత</span>, <span xml:lang="te-IN">యథావత్ = గురువును పూజింపవలసినరీతిలో</span>, <span xml:lang="te-IN">పూజితః = పూజింపబడినవాడై</span>, <span xml:lang="te-IN">ఆపృష్ట్వా = సంశయముల నన్నింటిని తీర్చుటచే సంతోషపరచి</span>, <span xml:lang="te-IN">అభ్యనుజ్ఞాత ఏవ = అనుజ్ఞ </span><span xml:lang="te-IN">పొందినవాడైయే</span>, <span xml:lang="te-IN">విహాయసమ్ = ఆకాశ మగుటను (భావప్రధాననిర్దేశము)</span>, <span xml:lang="te-IN">జగామ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దేవతలలో జ్ఞానపారంగతుడును</span>, <span xml:lang="te-IN">ఆశ్రితులకు జ్ఞానము ఇచ్చువాడును అగు నారదమహాముని</span>, <span xml:lang="te-IN">వాల్మీకికి వేదాంత పరమార్థోపదేశము చేసి</span>, <span xml:lang="te-IN">ఆ వాల్మీకినుండి గురుపూజను పొంది</span>, <span xml:lang="te-IN">అతనికి గల సమస్త సంశయములను తీర్చి</span>, <span xml:lang="te-IN">సంతోషపరచెను. వాల్మీకికి పరమార్థోపదేశము చేయుటకు మాత్రమే నారదుడు గురుత్వాభిమానమును కల్పించుకున్నవాడు గాన ఆ యభిమానము కల్పితము. ఉపదేశానంతరము శాశ్వత మగు నిరభిమానత్వమే సిద్ధము. జ్ఞానోపదేశానంతరము వాల్మీకికి గల శిష్యత్వాభిమానము</span>, <span xml:lang="te-IN">నారదుని కున్న గురుత్వాభిమానము రెండును నశించుటవలన</span>, <span xml:lang="te-IN">మరల ఆకాశము వలె నిర్వికల్పమగు దన స్వరూపమును పొందెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స ము హూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్మిన్ = ఆ నారదుడు</span>, <span xml:lang="te-IN">ముహూర్తమ్ = అల్పకాలములో</span>, <span xml:lang="te-IN">దేవలోకమ్ = బ్రహ్మలోకమును</span>, <span xml:lang="te-IN">గతే = పొందగా</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">మునిః తు = వాల్మీకి మహాముని</span>, <span xml:lang="te-IN">జాహ్నవ్యాః = గంగానదికి</span>, <span xml:lang="te-IN">అవిదూరతః = సమీపమున నున్న</span>, <span xml:lang="te-IN">తమసాతీరమ్ = తమసానది గట్టును</span>, <span xml:lang="te-IN">జగామ = పొందెను.</span></p> <p class="Prati ParaOverride-24" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">విశేషార్థములు</span><span xml:lang="te-IN"> :- తస్మిన్ = తన గురు వైన నారద మహాముని</span>, <span xml:lang="te-IN">ముహూర్తమ్ = అల్పకాలమునందే</span>, <span xml:lang="te-IN">దేవలోకమ్ = పరబ్రహ్మయొక్క స్థానమును</span>, <span xml:lang="te-IN">అనగా పరబ్రహ్మ స్వరూపమును</span>, <span xml:lang="te-IN">గతే = పొందగా</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">మునిః = బ్రహ్మానుసంధానము చేయు జ్ఞాని యైన వాల్మీకి</span>, <span xml:lang="te-IN">జాహ్నవ్యాః.. (ఇది వ్యాఖ్యాత్రయసారము).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నారద మహాముని</span>, <span xml:lang="te-IN">వాల్మీకికి ఉపదేశించిన వెంటనే</span>, <span xml:lang="te-IN">వాల్మీకికి ఉపదేశము చేయుటకొరకు కల్పించుకొనిన గురుత్వము మొదలైన అభిమానమును వదలెను. తన యథార్థరూప మగు బ్రహ్మత్వమును పొందెను. పిదప</span>, <span xml:lang="te-IN">వాల్మీకి మహర్షి తాను బ్రహ్మవేత్త అగుటచే తనకు కర్మానుష్ఠానావశ్యకత లేకపోయినను - </span>‘‘<span xml:lang="te-IN">యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరే జనాః</span>, <span xml:lang="te-IN">స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే</span>’’ (<span xml:lang="te-IN">శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతర జనులును ఆచరింతురు. ఆ శ్రేష్ఠుడు దేనిని ప్రమాణముగా గ్రహించునో దానినే లోక మంతయు అనువర్తించును) అని గీతలో చెప్పినట్లు</span>, <span xml:lang="te-IN">ఉత్తమమగు భృగువంశమునందు పుట్టిన వాడును</span>, <span xml:lang="te-IN">బ్రహ్మపుత్రుడైన నారదుని శిష్యుడును</span>, <span xml:lang="te-IN">జితేంద్రియు డగుటచే </span>‘<span xml:lang="te-IN">వాల్మీకి</span>’ <span xml:lang="te-IN">అను సార్థక మైన నామధేయముతో ప్రసిద్ధుడను అగు తానే కర్మానుష్ఠానము చేయకున్నచో</span>, <span xml:lang="te-IN">కర్మానుష్ఠానము తప్ప మరి యొక మార్గము లేని సామాన్యజనులు కూడ కర్మానుష్ఠానమును విడచి వేయుదురు. అట్టివారు ఇటు చేయవలసిన కర్మానుష్ఠానము లేక</span>, <span xml:lang="te-IN">జ్ఞానమార్గమును అనుసరింపజాలక ఉభయభ్రష్టు లగుదురు. అందుచే అట్టి వారికి మార్గము చూపుటకై తాను కర్మానుష్ఠానమును విడువక</span>, <span xml:lang="te-IN">మాధ్యాహ్నికస్నానము చేయుటకై తమసాతీరమునకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స తు తీరం సమాసాద్య తమసాయా మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = ఆ, మహామునిః = వాల్మీకి, తమసాయః = తమసానది యొక్క, తీరమ్ = తీరమును, సమాసాద్య = చేరి, అకర్దమమ్ = బురదలేని, తీర్థమ్ = రేవును, దృష్ట్వా = చూచి, పార్శ్వే = ప్రక్కనే, శిష్యమ్ = శిష్యుని గూర్చి, ఆహ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకిమహర్షి తమసానదీతీరము చేరి</span>, <span xml:lang="te-IN">బురద లేని రేవును చూచి</span>, <span xml:lang="te-IN">ప్రక్క నున్న శిష్యునితో ఇట్లు అనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భరద్వాజ = భరద్వాజుడా సన్మనుష్యమనో యథా = సత్పురుషుని హృదయము వలె</span>, <span xml:lang="te-IN">అకర్దమమ్ = బురద లేనిదియు</span>, (<span xml:lang="te-IN">హృదయపక్షమున </span>‘‘<span xml:lang="te-IN">పాపము లేనిది</span>’’ <span xml:lang="te-IN">అని అర్థము)</span>, <span xml:lang="te-IN">ప్రసన్నామ్బు = </span><span xml:lang="te-IN">నిర్మల మైన జలము కలదియు (</span>‘‘<span xml:lang="te-IN">జలము వలె నిర్మల మైనదియు</span>’’ <span xml:lang="te-IN">అని హృదయపక్షమున అర్థము)</span>, <span xml:lang="te-IN">రమణీయమ్ = సుందరమైన</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">తీర్థమ్ = రేవును</span>, <span xml:lang="te-IN">నిశామయ = చూడుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ భరద్వాజుడా సత్పురుషుని హృదయము వలె నిష్పంకమై</span>, <span xml:lang="te-IN">నిర్మలజలమై</span>, <span xml:lang="te-IN">మనోహరమై ఉండు ఈ రేవును చూడుము.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">విశేషార్థము </span><span xml:lang="te-IN">- ఇచట ఉపమేయము తీర్థము. ఉపమానము సత్పురుషుని హృదయము. ఈ రెండింటికిని సాదృశ్యము అకర్దమత్వము</span>, <span xml:lang="te-IN">ప్రసన్నాంబుత్వము అను సమానధర్మములను పట్టి ఏర్పడినది. అయితే ఉపమేయపక్షమున ఈ పదములకు </span>‘‘<span xml:lang="te-IN">బురద లేకుండుట</span>’’ ‘‘<span xml:lang="te-IN">నీరు నిర్మలముగ ఉండుట</span>’’ <span xml:lang="te-IN">అని అర్థములు. ఈ విధముగ అర్థములో సామ్యము లేకపోయినను శబ్దసామ్యమును పట్టి - అనగా తీర్థమును అకర్దమమే</span>, <span xml:lang="te-IN">సన్మనుష్యమనస్సును అకర్దమమే</span>; <span xml:lang="te-IN">తీర్థము విమలాంబువే</span>, <span xml:lang="te-IN">సన్మనుష్యమనస్సును విమలాంబువే</span>, <span xml:lang="te-IN">అను సామ్యమును బట్టి తీర్థమును సన్మనుష్య మనస్సుతో పోల్చుట జరిగినది.</span></p> <p class="Prati" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">అర్థతః శబ్దతో వాపి మనాక్కావ్యార్థసూచనమ్</span>’’ (<span xml:lang="te-IN">గ్రంథాదియందు అర్థమువలన గాని</span>, <span xml:lang="te-IN">శబ్దమువలన గాని కొంచెము కావ్యకథను సూచించవలెను) అను అలంకారికసరణిని అనుసరించి వాల్మీకిచే- </span>‘‘<span xml:lang="te-IN">అకర్దమమిదం తీర్థమ్</span>’’ <span xml:lang="te-IN">అనుటచే పరిశుద్ధమగు సముద్రసేతు స్థలము జ్ఞాపిత మైనది. (ఇది వ్యాఖ్యాత్రయసారము). </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తాత = నాయనా కలశః = జలపాత్రము</span>, <span xml:lang="te-IN">న్యస్యతామ్ = క్రింద ఉంచబడుగాక. మమ = నాకు</span>, <span xml:lang="te-IN">వల్కలమ్ = నారచీర</span>, <span xml:lang="te-IN">దీయతామ్ = ఇవ్వబడుగాక. ఉత్తమమ్ = శ్రేష్ఠమైన</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">తమసాతీర్థమేవ = తమసానది రేవునే</span>, <span xml:lang="te-IN">అవగాహిష్యే = ప్రవేశించెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>నాయనా జలపాత్రను క్రింద నుంచుము. నాకు నారచీర ఇమ్ము. శ్రేష్ఠమైన ఈ తమసాతీర్థమునందే స్నానము చేసెదను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రాయచ్ఛత మునేస్తస్య వల్కలం నియతో గురోః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మనా = పూజ్యమైన మనస్సు గల</span>, <span xml:lang="te-IN">వాల్మీకేన = వాల్మీకిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈవిధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలుకబడిన</span>, <span xml:lang="te-IN">గురోః = గురువునకు</span>, <span xml:lang="te-IN">నియతః = విధేయుడైన</span>, <span xml:lang="te-IN">భరద్వాజః = భరద్వాజుడు</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">మునేః = వాల్మీకి మహామునికి</span>, <span xml:lang="te-IN">వల్కలమ్ = నారచీరను</span>, <span xml:lang="te-IN">ప్రాయచ్ఛత = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ ప్రకారము</span>, <span xml:lang="te-IN">మహాత్ము డగు వాల్మీకి అడుగగా</span>, <span xml:lang="te-IN">గురువిధేయుడైన భరద్వాజుడు ఆ వాల్మీకికి నారచీర ఇచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేన్ద్రియః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విచచార హ పశ్యం స్తత్సర్వతో విపులం వనమ్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నియతేన్ద్రియః = నిగ్రహింపబడిన ఇంద్రియములు గల</span>, <span xml:lang="te-IN">సః = ఆ వాల్మీకి</span>, <span xml:lang="te-IN">శిష్యహస్తాత్ = శిష్యుని చేతి నుండి</span>, <span xml:lang="te-IN">వల్కలమ్ = నారచీరను</span>, <span xml:lang="te-IN">ఆదాయ = తీసికొని</span>, <span xml:lang="te-IN">విపులమ్ = విశాలమైన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వనమ్ = వనమును</span>, <span xml:lang="te-IN">సర్వతః = అంతటను</span>, <span xml:lang="te-IN">పశ్యన్ = చూచుచు</span>, <span xml:lang="te-IN">విచచార హ = సంచరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>ఇంద్రియనిగ్రహము గల ఆ వాల్మీకి శిష్టుని చేతినుండి ఆ నారచీరను తీసికొని విశాల మైన ఆ వనమునంతను చూచుచు సంచరించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తస్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దదర్శ భగవాంస్తత్ర క్రౌఞ్చయోశ్చారునిస్వనమ్. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యము గల ఆ వాల్మీకి</span>, <span xml:lang="te-IN">తత్ర = ఆ వనమునందు</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ రేవునకు</span>, <span xml:lang="te-IN">అభ్యాశే = సమీపమునందు</span>, <span xml:lang="te-IN">అనపాయినమ్ = ఎడబాటులేనిదై</span>, <span xml:lang="te-IN">చరన్తమ్ = తిరుగుచున్న</span>, <span xml:lang="te-IN">చారునిస్వనమ్ = మంచి ధ్వని గల</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చయోః = క్రౌంచపక్షులయొక్క</span>, <span xml:lang="te-IN">మిథునమ్ = జంటను</span>, <span xml:lang="te-IN">దదర్శ = చూచెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">శాపానుగ్రహాది మాహాత్మ్యము గల వాల్మీకి మహర్షి</span>, <span xml:lang="te-IN">ఆ వనములో</span>, <span xml:lang="te-IN">తమసా తీర్థమునకు సమీపముననే ఎడబాటు లేకుండ తిరుగుచున్న</span>, <span xml:lang="te-IN">మనోహరముగ కూయుచున్న క్రౌంచపక్షుల జంటను చూచెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి.</span> ఇచట కావ్యకథ సూచింపబడినది :-</p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యము గల</span>, <span xml:lang="te-IN">అనగా త్రికాలజ్ఞానము గల</span>, <span xml:lang="te-IN">వాల్మీకి మహర్షి</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ సముద్రమునకు</span>, <span xml:lang="te-IN">అభ్యాశే = సమీపమునందు</span>, <span xml:lang="te-IN">తత్ర = ఆ లంకాపురియందు</span>, <span xml:lang="te-IN">చరన్తమ్ = భోగములను అనుభవించుచున్నదియు</span>, (‘‘<span xml:lang="te-IN">చర గతి భక్షణయోః</span>’’ <span xml:lang="te-IN">అను ధాతువునుండి నిష్పన్న మైనది)</span>, <span xml:lang="te-IN">అనపాయినమ్ = బ్రహ్మవరమువలన చాలకాలమునుండి అపాయము లేనిదియు</span>, <span xml:lang="te-IN">చారునిస్వనమ్ = మనోహరమైన వీణానాదము కలదియు అగు</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చయోః = కుటిలు లగు రాక్షసుల (</span>‘‘<span xml:lang="te-IN">క్రుఞ్చ గతికౌటిల్యాల్పీభావయోః</span>’’ <span xml:lang="te-IN">అను ధాతువునుండి నిష్పన్న మైనది)</span>, <span xml:lang="te-IN">మిథునమ్ = జంటను</span>, <span xml:lang="te-IN">దదర్శ = తెలిసికొనెను (గోవిందరాజులు).</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సముద్రతీరమునం దున్న లంకాపురిలో సమస్తభోగములను అనుభవించుచు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మదేవుని వరముచేత దీర్ఘకాలమునుండి అపాయము లేక</span>, <span xml:lang="te-IN">మనోహరమగు వీణానాదము మొదలగు క్రీడారసములందు తేలుచున్న రాక్షసదంపతులను గూర్చి</span>, <span xml:lang="te-IN">భూతభవద్భవిష్యకాలముల జ్ఞానము గల ఆ వాల్మీకిమహర్షి తెలిసికొనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పాపనిశ్చయః = పాప మైన నిర్ణయము కలవాడును</span>, <span xml:lang="te-IN">వైర నిలయః = వైరమునకు స్థాన మైన వాడును అగు</span>, <span xml:lang="te-IN">నిషాదః = ఒక బోయవాడు</span>, <span xml:lang="te-IN">తస్మాత్ = ఆ</span>, <span xml:lang="te-IN">మిథునాత్ = మిథునమునుండి</span>, <span xml:lang="te-IN">ఏకమ్ = ఒక టైన</span>, <span xml:lang="te-IN">పుమాంసం తు = పురుషపక్షిని మాత్రము</span>, <span xml:lang="te-IN">తస్య పశ్యతః = ఆ వాల్మీకిమహర్షి చూచుచుండగనే ఏ మాత్రము సంకోచము లేక</span>, <span xml:lang="te-IN">జఘాన = చంపెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">క్రూర మైన నిర్ణయము కలవాడును</span>, <span xml:lang="te-IN">పశుపక్ష్యాదుల విషయమున నిష్కారణముగ ద్వేషముతో ప్రవర్తించువాడును అగు ఒక బోయవాడు</span>, <span xml:lang="te-IN">ఆ మహర్షి చూచుచున్నా డనెడు సంకోచ మైనను లేక</span>, <span xml:lang="te-IN">ఆ జంటలో ఒక టగు మగపక్షిని చంపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి. </span>ఈ శ్లోకము కూడ కావ్యకథను సూచించుచున్నది :-</p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN">పాపనిశ్చయః = దుష్టు డను నిశ్చయము గల</span>, <span xml:lang="te-IN">అనగా రావణుడు దుష్టు డని నిశ్చయించిన</span>, <span xml:lang="te-IN">వైరనిలయః = దుష్టులతో వైరమునకు స్థాన మైన</span>, <span xml:lang="te-IN">నిషాదః = సమస్త జగములకును ఆధారభూతు డైన విష్ణువు (</span>‘‘<span xml:lang="te-IN">నిషీదన్తి అత్ర సర్వాణి జగన్తి ఇతి నిషాదః</span>’’ - <span xml:lang="te-IN">వీనియందు సమస్తజగత్తులును ఉండును గాన నిషాదుడు)</span>, <span xml:lang="te-IN">తస్మాత్ మిథునాత్ = ఆ రాక్షసుల జంటనుండి</span>, <span xml:lang="te-IN">ఏకమ్ = ఒక డైన</span>, <span xml:lang="te-IN">పుమాంసమ్ = పురుషుడగు రావణుని</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ జంటలో రెండవదియగు మందోదరి</span>, <span xml:lang="te-IN">పశ్యతః = చూచుచుండగా ఆమెను ఆదరింపక</span>, <span xml:lang="te-IN">అనగా ఆమెను చంపక</span>, <span xml:lang="te-IN">జఘాన = చంపెను. (గోవిందరాజులు).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దుష్టుల విషయమున వైరము గల</span>, <span xml:lang="te-IN">సకల జగదాధారభూతు డగు శ్రీమహావిష్ణువు రావణుడు దుష్టు డని నిశ్చయించి</span>, <span xml:lang="te-IN">ఆ రాక్షసదంపతులలో ఒకడైన రావణుని మాత్రము చంపెను. మందోదరి దుష్టురాలు కాదు గాన ఆమెను చంపలేదు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తం శోణితపరీతాఙ్గం వేష్టమానం మహీతలే</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భార్యా తు నిహతం దృష్ట్యా రురావ కరుణాం గిరమ్. </span><span class="fr">11</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పతినా = భర్తయు</span>, <span xml:lang="te-IN">సహచారిణా = కూడ తిరుగు నదియు</span>, <span xml:lang="te-IN">తామ్రశీర్షేణ = ఎఱ్ఱని తల గలదియు</span>, <span xml:lang="te-IN">మత్తేన = మదించి నదియు</span>, <span xml:lang="te-IN">పత్రిణా = మంచి రెక్కలు గలదియు</span>, <span xml:lang="te-IN">సహితేన = మనస్సాంగత్యము కలదియు అగు</span>, <span xml:lang="te-IN">తేన = ఆ</span>, <span xml:lang="te-IN">ద్విజేన = మగపక్షితో</span>, <span xml:lang="te-IN">వియుక్తా = వియోగము పొందిన</span>, <span xml:lang="te-IN">భార్యా తు = భార్య యైన ఆడపక్షి యైతే</span>, <span xml:lang="te-IN">నిహతమ్ = కొట్టబడినదై</span>, <span xml:lang="te-IN">మహీతలే = భూమిపై</span>, <span xml:lang="te-IN">వేష్టమానమ్ = పొరలుచున్నదియు</span>, <span xml:lang="te-IN">శోణితపరీతాఙ్గమ్ = రక్తముచే కప్పబడిన శరీరము గలదియు అగు</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ మగపక్షిని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">కరుణామ్ = కనికరమును పుట్టించు</span>, <span xml:lang="te-IN">గిరమ్ = వాక్కును</span>, <span xml:lang="te-IN">రురావ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నిషాదునిచే కొట్టబడి నేలపై పొరలుచు</span>, <span xml:lang="te-IN">రక్తముతో నిండిన ఆ మగ పక్షిని భార్య యైన ఆడ క్రౌంచపక్షి చూచినది. తనపై ఎంతో ప్రేమ కలిగి ఎల్లప్పుడును తనతో సంచరించు</span>, <span xml:lang="te-IN">అందమైన రెక్కలు</span>, <span xml:lang="te-IN">ఎఱ్ఱని తలయు గల</span>, <span xml:lang="te-IN">కామముచే మదించిన</span>, <span xml:lang="te-IN">భర్తతో వియోగము చెందిన ఆ క్రౌంచి అతిదీనముగా ఏడ్వ సాగినది.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి. </span><span xml:lang="te-IN">ఈ శ్లోకమునందు మందోదరీ విలాపము సూచిత మైనది. భార్యాతు = మందోదరి</span>, ..., <span xml:lang="te-IN">తామ్రశీర్షేణ = రత్నమయకిరీటముచే ఎర్రగా నుండు తలగలవాడును</span>, <span xml:lang="te-IN">పత్రిణా = వాహనాదులతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">మత్తేన = బ్రహ్మవరములచే మదించినవాడును</span>, <span xml:lang="te-IN">సహితేన = ఇంద్రజిత్కుంభకర్ణాదులతో కూడినవాడును అయిన</span>, <span xml:lang="te-IN">తేన = ఆ</span>, <span xml:lang="te-IN">ద్విజేన = బ్రాహ్మణు డగు రావణునితో</span>, <span xml:lang="te-IN">వియుక్తా</span>, <span xml:lang="te-IN">నిహతం</span>, <span xml:lang="te-IN">మహీతలే</span>, <span xml:lang="te-IN">వేష్టమానం</span>, <span xml:lang="te-IN">శోణితపరీతాఙ్గం</span>, <span xml:lang="te-IN">తం</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా</span>, <span xml:lang="te-IN">కరుణాం</span>, <span xml:lang="te-IN">గిరం</span>, <span xml:lang="te-IN">రురావ (గోవిందరాజులు).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పులస్త్యవంశమునందు పుట్టి</span>, <span xml:lang="te-IN">బ్రహ్మదేవునివలన వరములు పొంది</span>, <span xml:lang="te-IN">ఎదురు లేక </span><span xml:lang="te-IN">గర్వించి</span>, <span xml:lang="te-IN">కుంభకర్ణాదులతో కూడి</span>, <span xml:lang="te-IN">మణిమయకిరీటాలంకృత శిరస్కుడై వెలిగిన తన ప్రియుడైన పెనిమిటిచే మందోదరి విడువబడెను. విష్ణువుచే చంపబడి నేలపై పొరలుచు నెత్తురుతో తడిసి పడి యున్న భర్త యగు రావణుని చూచి ఆమె కనికరము పుట్టు నట్లు ఏడ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తదా తు తం ద్విజం దృష్ట్యా నిషాదేన నిపాతితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">నిషాదేన = బోయవానిచేత</span>, <span xml:lang="te-IN">నిపాతితమ్ = పడగొట్టబడిన</span>, <span xml:lang="te-IN">ద్విజమ్ = పక్షిని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మనః = ధర్మస్వభావు డైన</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">ఋషేః = ఋషికి</span>, <span xml:lang="te-IN">కారుణ్యమ్ = జాలి</span>, <span xml:lang="te-IN">సమపద్యత = కలిగెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>అపుడు ఆ బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగనే ధర్మాత్ముడైన ఆ వాల్మీకిమహర్షికి జాలి కలిగెను.</p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి. </span><span xml:lang="te-IN">కావ్యార్థసూచనము ఈ శ్లోకములో కూడ ఉన్నది. తదా</span>, <span xml:lang="te-IN">నిషాదేన = విష్ణువుచేత</span>, <span xml:lang="te-IN">నిపాతితం</span>, <span xml:lang="te-IN">తం</span>, <span xml:lang="te-IN">ద్విజమ్ = బ్రాహ్మణుడైన రావణుని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మనః</span>, <span xml:lang="te-IN">తస్య</span>, <span xml:lang="te-IN">ఋషేః</span>, <span xml:lang="te-IN">కారుణ్యమ్ = జుగుప్స</span>, <span xml:lang="te-IN">సమపద్యత (గోవిందరాజులు).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ రావణుని విష్ణురూపు డగు రాముడు చంపగా చూచుచున్న ధర్మస్వభావు డైన ఆ వాల్మీకిమహర్షికి - </span>‘‘<span xml:lang="te-IN">అధర్మాత్ముని స్మరణము కూడ అమంగళకరము</span>’’ <span xml:lang="te-IN">అని జుగుప్స కలిగినది.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తతః కరుణవేదిత్వాదధర్మోఽయమితి ద్విజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నిశామ్య రుదతీం క్రౌఞ్చీమిదం వచనమబ్రవీత్. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">ద్విజః = వాల్మీకిమహర్షి</span>, <span xml:lang="te-IN">రుదతీమ్ = ఏడ్చుచున్న</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చీమ్ = ఆడుక్రౌంచపక్షిని</span>, <span xml:lang="te-IN">నిశామ్య = చూచి</span>, <span xml:lang="te-IN">కరుణవేదిత్వాత్ = కరుణ కలవాడగుటవలన</span>, <span xml:lang="te-IN">అయమ్ = ఈ రతికాలవధము</span>, <span xml:lang="te-IN">అధర్మః ఇతి = ధర్మము కాదు అని (తలచి)</span>, <span xml:lang="te-IN">ఇదం వాక్యమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను. </span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ వాల్మీకిమహర్షి ఏడ్చుచున్న క్రౌంచిని చూచి</span>, <span xml:lang="te-IN">దయ గలవాడై</span>, ‘<span xml:lang="te-IN">రతి కాలమందు చంపుట ధర్మము కాదు</span>’ <span xml:lang="te-IN">అని తలచుచు ఇట్లని చెప్పెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN">వి.తతః</span>, ..., <span xml:lang="te-IN">క్రౌఞ్చీమ్ = రాక్షసస్త్రీ యగు మందోదరిని</span>, <span xml:lang="te-IN">నిశామ్య</span>, ..., <span xml:lang="te-IN">అయమ్ = ఈ పరభార్యాపహారము</span>, <span xml:lang="te-IN">అధర్మ ఇతి.... కరుణవేదిత్వాత్ = జుగుప్సపొందినవా డగుటవలన</span>, <span xml:lang="te-IN">ఇదం</span>, .... (<span xml:lang="te-IN">గోవిందరాజులు).</span></p> <p class="Tat ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అటు పిమ్మట వాల్మీకిమహర్షి ఏడ్చుచున్న మందోదరిని చూచి </span>‘<span xml:lang="te-IN">పరభార్య నపహరించిన ఈ రావణు డిప్పుడు ఇట్టి స్థితిని పొందినాడు కాబట్టి పరభార్య నపహరించుట ఎంతమాత్రము ధర్మము కాదు</span>’ <span xml:lang="te-IN">అని తలచి జుగుప్స పొందినవాడై యిట్లని చెప్పెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యత్ క్రౌఞ్చమిథునాదేకమవధీః కామమోహితమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అమ = నిర్భాగ్యుడ వైన</span>, <span xml:lang="te-IN">నిషాద = బోయవాడా త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ కారణమువలన</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చమిథునాత్ = క్రౌంచపక్షుల జంటనుండి</span>, <span xml:lang="te-IN">కామమోహితమ్ = కామముచే మోహము చెందియున్న</span>, <span xml:lang="te-IN">ఏకమ్ = ఒకదానిని</span>, <span xml:lang="te-IN">అవధీః = చంపితివో</span>, (<span xml:lang="te-IN">తత్ = ఆ కారణమువలన)</span>, <span xml:lang="te-IN">శాశ్వతీః = స్థిరములైన</span>, <span xml:lang="te-IN">సమాః = సంవత్సరములపాటు</span>, <span xml:lang="te-IN">ప్రతిష్ఠాం తు = ఉండుటను</span>, <span xml:lang="te-IN">మా గమః = పొందకపోవుదువుగాక.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>నిర్భాగ్యుడ వైన ఓ బోయవాడా నీవు క్రౌంచపక్షిదంపతులనుండి మన్మథపరవశ మైన ఒక దానిని చంపితివి. అందుచే నీవు చాలకాలము జీవించకుందువు గాక.</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి. </span>‘<span xml:lang="te-IN">త్వమగమః</span>’ <span xml:lang="te-IN">అను నపుడు </span>‘<span xml:lang="te-IN">తు</span>, <span xml:lang="te-IN">అమ</span>, <span xml:lang="te-IN">గమః</span>’ <span xml:lang="te-IN">అని పదచ్ఛేదము చేయబడినది.</span></p> <p class="Prati" xml:lang="en-GB">‘<span xml:lang="te-IN">ఇది బ్రహ్మానుగ్రహముచే</span>, <span xml:lang="te-IN">శ్రీమద్వాల్మీకిమహర్షి ముఖమునుండి మొట్టమొదట నిర్గమించిన శ్లోకము గాన ఇది కేవల శాపరూపము కాకూడదు. ఇది ఈ గ్రంథమునకు మంగళము</span>’ <span xml:lang="te-IN">అని పూర్వాచార్యులు చెప్పిరి.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మా నిషాద = లక్ష్మికి నివాసస్థాన మైన విష్ణువా త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ కారణమువలన</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చమిథునాత్ = రాక్షసదంపతు లైన రావణమందోదరులనుండి</span>, <span xml:lang="te-IN">కామమోహితమ్ = కామపరవశ మగు</span>, <span xml:lang="te-IN">ఏకమ్ = ఒక డైన రావణుని</span>, <span xml:lang="te-IN">అవధీః.... శాశ్వతీః = స్థిరము లైన</span>, <span xml:lang="te-IN">సమాః = సంవత్సరములయందు</span>, <span xml:lang="te-IN">ప్రతిష్ఠామ్ = మాహాత్మ్యమును</span>, <span xml:lang="te-IN">అగమః = పొందితివి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ శ్రీనివాసుడా రావణమందోదరు లను రాక్షసదంపతులవద్దకు వెళ్లి</span>, <span xml:lang="te-IN">వారిలో ఒకడును</span>, <span xml:lang="te-IN">మన్మథపరవశుడై సీతాదేవి నపహరించి వాడును అగు రావణుని చంపితివి గాన నీవు శాశ్వతకాలము మాహాత్మ్యము పొందితివి.</span></p> <p class="Prati" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">కావ్యార్థసూచనం కైశ్చిన్నాన్ద్యామేవ నిరూప్యతే</span>’’ (<span xml:lang="te-IN">మంగళశ్లోకమునందే కొందరు కావ్యార్థసూచనము చేయుదురు) అను ఆలంకారికవచనమును అనుసరించి ఇచట రామాయణకథ అంతయు సంక్షేపముగా సూచింపబడినది. </span>‘‘<span xml:lang="te-IN">మా నిషాద</span>’’ <span xml:lang="te-IN">అను శబ్దముచే సీతావివాహపర్యంత మైన బాలకాండకథ సంగ్రహింపబడినది. </span>‘‘<span xml:lang="te-IN">ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః</span>’’ <span xml:lang="te-IN">అనుటచే పితృవచన పరిపాలన మనెడు మాహాత్మ్యమును పొందుటను తెలుపు అయోధ్యాకాండకథ అంతయు సూచింపబడినది. ఈ వాక్యముచేతనే అరణ్యకాండకథ కూడ చూపబడినది. </span>‘‘<span xml:lang="te-IN">క్రౌఞ్చమిథునాదేకమవధీః కామమోహితమ్</span>’’ - <span xml:lang="te-IN">ఈ వాక్యముచే కుటిలు లగు వానరదంపతులైన తారావాలులలో ఒకరును</span>, <span xml:lang="te-IN">సుగ్రీవభార్య నపహరించిన వాడును అగు వాలిని చంపితివి అను అర్థముచే కిష్కింధా కాండకథ కూడ సూచితమైనది. క్రౌఞ్చౌ = అల్పీభూతులు</span>; <span xml:lang="te-IN">అనగా కృశించినవారు. ఈ వాక్యముచేతనే కృశించిన సీతారాములలో ఒకతె యగు సీతాదేవి నపహరించి మిక్కిలి పీడించితివి అని సీతాదేవి విరహదుఃఖమును వర్ణించెడు సుందరకాండకథయును తెల్పబడినది. దీనిచేతనే రాక్షసదంపతు లగు రావణమందోదరులలో ఒక డైన రావణుని చంపితివి అని యుద్ధకాండకథయు గ్రథిత మైనది. మా నిషాద = ఓ శ్రీనివాసుడా అనగా ఓ దైవమా అని యర్థము. ఓ దైవమా పూర్వ మరణ్యవాసమునందు వియోగదుఃఖమును అనుభవించుటచే అత్యంతకృశు లైన సీతారాములలో ఒకతె యైన సీతాదేవిని మరల అరణ్యములో చేర్చి మిక్కిలి పీడించితివి అను ఉత్తరకాండ కథయును చెప్పబడినది. (అందరు వ్యాఖ్యాతల మతము).</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తస్యైవం బ్రువతశ్చిన్తా బభూవ హృది వీక్షతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">బ్రువతః = పలికిన</span>, <span xml:lang="te-IN">వీక్షతః = పరిశీలించుచున్న</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ వాల్మీకిమహర్షియొక్క</span>, <span xml:lang="te-IN">హృది = హృదయమునందు</span>, <span xml:lang="te-IN">శకునేః = పక్షియొక్క</span>, <span xml:lang="te-IN">శోకార్తేన = శోకము చేత ఆర్తుడ నైన</span>, <span xml:lang="te-IN">మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">వ్యాహృతమ్ = పలుకబడిన</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యము</span>, <span xml:lang="te-IN">కిమ్ = ఏమి</span>? <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">చిన్తా = ఆలోచన</span>, <span xml:lang="te-IN">బభూవ = కలిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విధముగ పలికి పరిశీలించుకొనిన</span>, <span xml:lang="te-IN">ఆ వాల్మీకిమహర్షి మనస్సులో - </span>‘‘<span xml:lang="te-IN">ఈ పక్షి యొక్క శోకముచేత దుఃఖితుడ నైన నా నోటినుండి ఏమి యిది ఈ విధముగా వెలువడినది</span>?’’ <span xml:lang="te-IN">అను ఆలోచన కలిగెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> చిన్తయన్ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్ మతిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం స మునిపుఙ్గవః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాప్రాజ్ఞః = గొప్ప పండితుడును</span>, <span xml:lang="te-IN">మతిమాన్ = బుద్ధిమంతుడును అయిన</span>, <span xml:lang="te-IN">సః = ఆ వాల్మీకి</span>, <span xml:lang="te-IN">మతిం చకార = (ఇట్లు) నిశ్చయించెను. సః మునిపుఙ్గవః = ఆ మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="te-IN">శిష్యమ్ = శిష్యునిగూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదం వాక్యమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ చ = పలికెను కూడ.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాపండితుడును</span>, <span xml:lang="te-IN">బుద్ధిమంతుడును అయిన ఆ మునిపుంగవుడు ఒక నిశ్చయము చేసికొని శిష్యునితో ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> పాదబద్ధోఽక్షరసమస్తన్త్రీలయసమన్వితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మే శోకార్తస్య = నేను శోకపీడితుడనై యుండగా</span>, <span xml:lang="te-IN">ప్రవృత్తః = అప్రయత్నముగా బయలు వెడలినదియు</span>, <span xml:lang="te-IN">పాదబద్ధః = నాలుగు పాదములతో కూర్చబడినదియు</span>, <span xml:lang="te-IN">అక్షరసమః = ప్రతిపాదమునందును సమానమైన అక్షరములు కలదియు</span>, <span xml:lang="te-IN">తన్త్రీలయ సమన్వితః = వీణాతంత్రుల పై కూర్చుటకు తగిన లయతో కూడినదియు అగు ఈ వాక్యము</span>, <span xml:lang="te-IN">శ్లోకః = శ్లోకముగా</span>, <span xml:lang="te-IN">భవతు = అగుగాక</span>; <span xml:lang="te-IN">అన్యథా = మరొక విధముగా</span>, <span xml:lang="te-IN">న = కాదు.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>నేను శోకార్తుడ నై ఉండగా నా నోటినుండి బయలుదేరిన ఈ వాక్యము సమాన మైన అక్షరములు గల నాలుగు పాదములలో కూర్చబడినది. వీణ పై కూర్చి నృత్తగీతవాద్యములతో పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున దీనికి శ్లోక మను పేరుతో ప్రసిద్ధి రావలెను. మరొక పేరుతో కాదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రతిజగ్రాహ సన్తుష్ట స్తస్య తుష్టోఽభవద్గురుః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శిష్యస్తు = శిష్యుడును</span>, <span xml:lang="te-IN">బ్రువతః = ఈ విధముగా పలుకుచున్న</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">మునేః = వాల్మీకిమునియొక్క</span>, <span xml:lang="te-IN">అనుత్తమమ్ = అత్యుత్తమ మైన</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = </span>‘<span xml:lang="te-IN">మా నిషాద</span>’ <span xml:lang="te-IN">ఇత్యాది వాక్యమును</span>, <span xml:lang="te-IN">ప్రతిజగ్రాహ = స్వీకరించెను. గురుః = గురువు</span>, <span xml:lang="te-IN">తస్య = అతని విషయమున</span>, <span xml:lang="te-IN">తుష్టః అభవత్ = సంతోషించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకి మాటలను విని శిష్యుడు అత్యుత్తమ మైన </span>‘‘<span xml:lang="te-IN">మా నిషాద</span>’’ <span xml:lang="te-IN">ఇత్యాది వాక్యమును స్వీకరించెను</span>, <span xml:lang="te-IN">అనగా దానిని కంఠస్థము చేసికొనెను. వాల్మీకి అందులకు సంతసించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> సోఽభిషేకం తతః కృత్యా తీర్థే తస్మిన్ యథావిధి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తమేవ చిన్తయన్నర్థముపావర్తత వై మునిః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="te-IN">సః మునిః = ఆ వాల్మీకి మహర్షి</span>, <span xml:lang="te-IN">తస్మిన్ తీర్థే = ఆ తీర్థమునందు</span>, <span xml:lang="te-IN">యథావిధి = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="te-IN">అభిషేకమ్ = స్నానమును</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">అర్థమేవ = విషయమునే</span>, <span xml:lang="te-IN">చిన్తయన్ = ఆలోచించుచు</span>, <span xml:lang="te-IN">ఉపావర్తత వై = ఆశ్రమము వైపు మరలెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట వాల్మీకిమహాముని ఆ తీర్థమునందు యథావిధిగా స్నానము చేసి</span>, <span xml:lang="te-IN">అక్కడ జరిగిన సంఘటనను గూర్చియే ఆలోచించుచు ఆశ్రమము వైపు మరలెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> భరద్వాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్ మునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కలశం పూర్ణమాదాయ పృష్ఠతోఽనుజగామ హ. </span><span class="fr">21</span> </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="te-IN">శిష్యః = శిష్యుడును</span>, <span xml:lang="te-IN">వినీతః = వినయవంతుడును</span>, <span xml:lang="te-IN">శ్రుతవాన్ = శాస్త్రములు తెలిసినవాడును</span>, <span xml:lang="te-IN">మునిః = బ్రహ్మానుసంధానము చేయువాడును అగు</span>, <span xml:lang="te-IN">భరద్వాజః = భరద్వాజుడు</span>, <span xml:lang="te-IN">పూర్ణమ్ = నిండిన</span>, <span xml:lang="te-IN">కలశమ్ = కలశమును</span>, <span xml:lang="te-IN">ఆదాయ = గ్రహించి</span>, <span xml:lang="te-IN">పృష్ఠతః = వెనుక</span>, <span xml:lang="te-IN">అనుజగామ = వాల్మీకిని అనుసరించి వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అప్పుడు</span>, <span xml:lang="te-IN">శాస్త్రపారంగతుడును</span>, <span xml:lang="te-IN">మననశీలుడును</span>, <span xml:lang="te-IN">వినయవంతుడును అగు శిష్యుడైన భరద్వాజుడు</span>, <span xml:lang="te-IN">జలపూర్ణమైన కలశమును తీసికొని వాల్మీకిని వెంబడించెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స ప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మవిత్ = ధర్మములు తెలిసిన</span>, <span xml:lang="te-IN">సః = ఆ వాల్మీకి</span>, <span xml:lang="te-IN">శిష్యేణ సహ = శిష్యునితో కూడ</span>, <span xml:lang="te-IN">ఆశ్రమపదమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="te-IN">ప్రవిశ్య = ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">ధ్యానమ్ = ఆలోచనను</span>, <span xml:lang="te-IN">అనగా</span>, <span xml:lang="te-IN">అంతకు ముందు జరిగిన సంఘటనలను గూర్చి ఆలోచనను</span>, <span xml:lang="te-IN">ఆస్థితః = పొందిన వాడై</span>, <span xml:lang="te-IN">ఉపవిష్టః = కూర్చున్న వాడై</span>, <span xml:lang="te-IN">అన్యాః = ఇతరము లైన</span>, <span xml:lang="te-IN">కథాశ్చ = కథలను కూడ</span>, <span xml:lang="te-IN">చకార = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధర్మవేత్తయైన ఆ వాల్మీకి మహర్షి</span>, <span xml:lang="te-IN">శిష్యునితో గూడ ఆశ్రమము ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">కూర్చున్నవాడై</span>, <span xml:lang="te-IN">అంతకు ముందు జరిగిన పక్షివృత్తాంతాదులనే స్మరించుచు</span>, <span xml:lang="te-IN">ఆ యా విషయములను గూర్చి ముచ్చటించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుఙ్గవమ్. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">లోకకర్తా = లోకములను సృజించువాడును</span>, <span xml:lang="te-IN">ప్రభుః = లోకములకు అధిపతియు</span>, <span xml:lang="te-IN">చతుర్ముఖః = నాలుగు ముఖములు కలవాడును</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్పతేజస్సు కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మా = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="te-IN">మునిపుఙ్గవమ్ = మునులలో శ్రేష్ఠుడైన</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ వాల్మీకిని</span>, <span xml:lang="te-IN">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="te-IN">స్వయమ్ = స్వయముగ</span>, <span xml:lang="te-IN">ఆజగామ = వచ్చెను. </span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అప్పుడు</span>, <span xml:lang="te-IN">లోకములను సృజించిన వాడును</span>, <span xml:lang="te-IN">లోకముల కధిపతియు</span>, <span xml:lang="te-IN">నాలుగు ముఖములు కలవాడును</span>, <span xml:lang="te-IN">గొప్ప తేజస్సు కలవాడును అగు బ్రహ్మదేవుడు ఆ మునిపుంగవుని చూచుటకై స్వయముగ వచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> వాల్మీకిరథ తం దృష్ట్యా సహసోత్థాయ వాగ్యతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రాఞ్జలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితః. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">ప్రయతః = పరిశుద్ధుడైన</span>, <span xml:lang="te-IN">వాల్మీకిః = వాల్మీకి</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ బ్రహ్మదేవుని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">పరమవిస్మితః = మిక్కిలి ఆశ్చర్యము చెందినవాడై</span>, <span xml:lang="te-IN">సహసా = వెంటనే</span>, <span xml:lang="te-IN">ఉత్థాయ = లేచి</span>, <span xml:lang="te-IN">వాగ్యతః = మౌనము వహించిన వాడై</span>, <span xml:lang="te-IN">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడు</span>, <span xml:lang="te-IN">భూత్వా = అయి</span>, <span xml:lang="te-IN">తస్థౌ = నిలబడెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పరిశుద్ధు డైన ఆ వాల్మీకి బ్రహ్మను చూడగనే ఆశ్చర్యచకితుడై</span>, <span xml:lang="te-IN">వెంటనే లేచి</span>, <span xml:lang="te-IN">దోసిలి కట్టి మౌనముగా నిలబడెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి. </span>‘‘<span xml:lang="te-IN">ఊర్ధ్వం ప్రాణా హ్యుత్క్రామన్తి యూనః స్థవిర ఆగతే</span>, <span class="CharOverride-7" xml:lang="te-IN">ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే</span><span class="CharOverride-7">’’</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB">(<span xml:lang="te-IN">పెద్దవారు సమీపమునకు వచ్చుచుండగనే యువకుని ప్రాణములు పైకి లేచిపోవ జూచును. ఎదురుగా వెళ్లి</span>, <span xml:lang="te-IN">వంగి నమస్కారము చేయుటచే ఆ ప్రాణములను మరల పొందును) అని ధర్మశాస్త్రములో చెప్పిన రీతిని బ్రహ్మదేవుని చూడగనే సవినయముగ లేచి నిలబడెనని అర్థము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవన్దనైః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వానామయ మవ్యయమ్. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తమ్ ఏనం దేవమ్ = అట్టి ఈ బ్రహ్మదేవుని</span>, <span xml:lang="te-IN">విధివత్ = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="te-IN">ప్రణమ్య = నమస్కరించి</span>, <span xml:lang="te-IN">అవ్యయమ్ = అవిచ్ఛిన్నమైన</span>, <span xml:lang="te-IN">అనామయంచ = కుశలమును</span>, <span xml:lang="te-IN">పృష్ట్వా = అడిగి</span>, <span xml:lang="te-IN">పాద్యార్ఘ్యాసనవన్దనైః = పాద్యము</span>, <span xml:lang="te-IN">అర్ఘ్యము</span>, <span xml:lang="te-IN">ఆసనము</span>, <span xml:lang="te-IN">నమస్కారము- వీటిచే</span>, <span xml:lang="te-IN">పూజయామాస = పూజించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకి బ్రహ్మదేవుని యథాశాస్త్రముగా నమస్కరించి</span>, <span xml:lang="te-IN">అవిచ్ఛిన్నమగు కుశలమును ప్రశ్నించి</span>, <span xml:lang="te-IN">పాద్యము</span>, <span xml:lang="te-IN">అర్ఘ్యము</span>, <span xml:lang="te-IN">ఆసనము</span>, <span xml:lang="te-IN">వందనము సమర్పించి పూజించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అథోపవిశ్య భగవానాసనే పరమార్చితే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> వాల్మీకయే మహర్షయే సన్దిదేశాసనం తతః. 26</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథ = అటు పిమ్మట</span>, <span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యములు గల బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="te-IN">పరమార్చితే = మిక్కిలి పూజింపబడిన</span>, <span xml:lang="te-IN">ఆసనే = ఆసనమునందు ఉపవిశ్య = కూర్చుండి</span>, <span xml:lang="te-IN">మహర్షయే = మహర్షియైన</span>, <span xml:lang="te-IN">వాల్మీకయే = వాల్మీకికొరకు</span>, <span xml:lang="te-IN">ఆసనమ్ = ఆసనమును</span>, <span xml:lang="te-IN">సందిదేశ = చూపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">భగవంతు డైన బ్రహ్మదేవుడు పరమపూజిత మగు ఉత్తమాసనము పై కూర్చుండి </span>‘‘<span xml:lang="te-IN">నీవు కూడ ఆసనము పై కూర్చుండుము</span>’’ <span xml:lang="te-IN">అని వాల్మీకితో చెప్పెను.</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> బ్రహ్మణా సమనుజ్ఞాతః సోఽప్యుపావిశదాసనే</span>, <span xml:lang="te-IN">ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"> తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః. 27</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సోఽపి = ఆ వాల్మీకికూడ</span>, <span xml:lang="te-IN">బ్రహ్మణా = బ్రహ్మచేత</span>, <span xml:lang="te-IN">సమనుజ్ఞాతః = అనుజ్ఞ ఇవ్వబడినవాడై</span>, <span xml:lang="te-IN">ఆసనే = ఆసనమునందు</span>, <span xml:lang="te-IN">ఉపావిశత్ = కూర్చుండెను. తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">లోకపితామహే = లోకములకు పితామహుడైన</span>, <span xml:lang="te-IN">తస్మిన్ = ఆ బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="te-IN">సాక్షాత్ = ప్రత్యక్షముగా</span>, <span xml:lang="te-IN">ఉపవిష్టే = కూర్చున్నవా డగుచుండగా</span>, <span xml:lang="te-IN">వాల్మీకిః = వాల్మీకి</span>, <span xml:lang="te-IN">తద్గతేనైవ = ఆ క్రౌంచపక్షినే పొందిన</span>, <span xml:lang="te-IN">మనసా = మనస్సుతో</span>, <span xml:lang="te-IN">ధ్యానమ్ = చింతను</span>, <span xml:lang="te-IN">ఆస్థితః = అవలంబించెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకి బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది ఆసనము పై కూర్చుండెను. లోకములకు పితామహు డైనఆ బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చొనియుండగా</span>, <span xml:lang="te-IN">వాల్మీకి</span>, <span xml:lang="te-IN">మనస్సులో ఆ క్రౌంచపక్షినిగూర్చి మాత్రమే ఆలోచించుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణబుద్ధినా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> యస్తాదృశం చారురవం క్రౌఞ్చం హన్యాదకారణాత్. 28</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">యః = ఏ బోయవాడు</span>, <span xml:lang="te-IN">తాదృశమ్ = అట్టి</span>, <span xml:lang="te-IN">చారురవమ్ = మధురమైన ధ్వని గల</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చమ్ = క్రౌంచపక్షిని</span>, <span xml:lang="te-IN">అకారణాత్ = కారణము లేకుండగా</span>, <span xml:lang="te-IN">హన్యాత్ = చంపునో (చంపెనో)</span>, <span xml:lang="te-IN">వైరగ్రహణబుద్ధినా = వైరముచే ఆ పక్షిని పట్టుకొనవలె నను బుద్ధి గల</span>, <span xml:lang="te-IN">పాపాత్మనా = ఆ పాపాత్మునిచే</span>, <span xml:lang="te-IN">కష్టమ్ = భయంకర మగు కార్యము</span>, <span xml:lang="te-IN">కృతమ్ = చేయబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">అట్టి మధురధ్వని గల క్రౌంచపక్షిని నిష్కారణముగా</span>, <span xml:lang="te-IN">ఆ బోయవాడు చంపినాడు కదా ఆ పాపాత్ముడు వైరముచే దానిని పట్టుకొనవలెనను బుద్ధితో ఎంతటి ఘోరకార్యము చేసినాడు </span>’’ <span xml:lang="te-IN">అని ఆలోచించుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> శోచన్నేవ ముహుః క్రౌఞ్చీముపశ్లోకమిమం పునః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జగావన్తర్గతమనా భూత్వా శోకపరాయణః. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శోకపరాయణః = దుఃఖపరవశుడై</span>, <span xml:lang="te-IN">అన్తర్గతమనాః భూత్వా = లోలోపలనే ఏదియో ఆలోచించుకొనుచున్న మనస్సు కలవాడై</span>, <span xml:lang="te-IN">ముహుః = మాటిమాటికి</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చీమేవ = ఆడుక్రౌంచపక్షిని గూర్చియే</span>, <span xml:lang="te-IN">శోచన్ = దుఃఖించుచు</span>, <span xml:lang="te-IN">పునః = మరల</span>, <span xml:lang="te-IN">ఇమం శ్లోకమ్ = ఈ శ్లోకమును</span>, <span xml:lang="te-IN">ఉపజగౌ = గానము చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకి దుఃఖపరవశుడై</span>, <span xml:lang="te-IN">బాహ్యవిషయములపై ప్రవర్తించని మనస్సుతో</span>, <span xml:lang="te-IN">ఆ క్రౌంచిని గూర్చియే విచారించుచు</span>, <span xml:lang="te-IN">మానిషాదేత్యాది శ్లోకమును మరల మరల చదివెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్మునిపుఙ్గవమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా. 30</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">బ్రహ్మా = బ్రహ్మ</span>, <span xml:lang="te-IN">ప్రహసన్ = నవ్వుచు</span>, <span xml:lang="te-IN">తం మునిపుఙ్గవమ్ = ఆ మునిశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఉవాచ = పలికెను. త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">బద్ధః = కూర్చబడినది</span>, <span xml:lang="te-IN">శ్లోకః ఏవ = శ్లోకమే. అత్ర = ఈ విషయమునందు</span>, <span xml:lang="te-IN">విచారణా = ఆలోచన</span>, <span xml:lang="te-IN">న కార్యా = చేయదగినది కాదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రహ్మదేవుడు నవ్వుచు వాల్మీకితో ఇట్లనెను - </span>‘‘<span xml:lang="te-IN">నీవు కూర్చినది శ్లోకమే. ఈ విషయమున సందేహము లేదు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> మచ్ఛన్దాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> రామస్య చరితం సర్వం కురు త్వమృషిసత్తమ. 31</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ</span>, <span xml:lang="te-IN">తే = నీ యొక్క</span>, <span xml:lang="te-IN">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">సరస్వతీ = వాక్కు</span>, <span xml:lang="te-IN">మచ్ఛన్దాదేవ = నాయొక్క ఇచ్ఛ ప్రకారమే</span>, <span xml:lang="te-IN">ప్రవృత్తా = పుట్టినది. ఋషిసత్తమ = ఓ ఋషిశ్రేష్ఠుడా రామస్య </span><span xml:lang="te-IN">= రామునియొక్క</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">చరితమ్ = చరితమును</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">కురు = రచించుము.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>ఓ బ్రహ్మర్షీ నా ఇచ్ఛనే అనుసరించి ఈ వాక్కు నీయందు ఆవిర్భవించినది. ఓ ఋషిశ్రేష్ఠుడా నీవు రాముని చరితము నంతను కావ్యరూపమున రచింపుము.</p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి.</span>‘‘<span xml:lang="te-IN">బ్రహ్మన్</span>’’ <span xml:lang="te-IN">అని సంబోధించుటచే </span>‘‘<span xml:lang="te-IN">నీవును బ్రహ్మ యగు నా అంశమున పుట్టినవాడ వగుటచే నీ ముఖమునుండి నా ఇచ్ఛ ప్రకారము సరస్వతి వెడలినది</span>’’ <span xml:lang="te-IN">అని సూచిత మగుచున్నది. </span>‘‘<span xml:lang="te-IN">ఋషిసత్తమ</span>’’ <span xml:lang="te-IN">అనుటచే </span>‘‘<span xml:lang="te-IN">నానృషిః కురుతే కావ్యమ్</span>’’ (<span xml:lang="te-IN">ఋషి కానివాడు కావ్యము వ్రాయజాలడు) అను న్యాయము ననుసరించి </span>‘‘<span xml:lang="te-IN">నీవు కావ్యము చేయ శక్తి కలవారిలో శ్రేష్ఠుడవు కాబట్టి నీవు రచించిన కావ్యము అన్నింటి కన్నను శ్రేష్ఠ మగును</span>’’ <span xml:lang="te-IN">అని తెలుపబడుచున్నది. (గోవిందరాజులు).</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛ్రుతమ్. </span><span class="fr">32</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మాత్మనః = ధర్మస్వభావుడును</span>, <span xml:lang="te-IN">లోకే = లోకమందు</span>, <span xml:lang="te-IN">గుణవతః = ప్రశస్త గుణములు కలవాడును</span>, <span xml:lang="te-IN">ధీమతః = బుద్ధిమంతుడును</span>, <span xml:lang="te-IN">ధీరస్య = ధైర్యశాలియు అగు</span>, <span xml:lang="te-IN">రామస్య =</span><span xml:lang="te-IN"> రామునియొక్క</span>, <span xml:lang="te-IN">వృత్తమ్ = చరిత్రమును</span>, <span xml:lang="te-IN">తే = నీచేత</span>, <span xml:lang="te-IN">నారదాత్ = నారదునివలన</span>, <span xml:lang="te-IN">యథా = ఏ</span><span xml:lang="te-IN"> విధముగా</span>, <span xml:lang="te-IN">శ్రుతమ్ = వినబడెనో</span>, (<span xml:lang="te-IN">ఆ విధముగా) కథయ = చెప్పుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>రాముడు ధర్మస్వభావుడు. లోకములో ప్రశస్తము లైన గుణములు కలవాడు. పండితుడు. అట్టి రాముని చరిత్రమును నారదునినుండి నీవు వినినది వినినట్లుగ చెప్పుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రామస్య సహసౌమిత్రే రాక్షసానాం చ సర్వశః</span>, 33</p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వైదేహ్యాశ్చాపి యద్వృత్తం ప్రకాశం యది వా రహః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. </span><span class="fr">34</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధీమతః = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="te-IN">సహసౌమిత్రేః = లక్ష్మణునితో కూడిన</span>, <span xml:lang="te-IN">తస్య రామస్య = ఆ రామునియొక్కయు</span>, <span xml:lang="te-IN">రాక్షసానాం చ = రాక్షసులయొక్కయు</span>, <span xml:lang="te-IN">రహస్యం చ = రహస్యమైనదియు</span>, <span xml:lang="te-IN">ప్రకాశం చ = అందరికిని తెలిసినదియు</span>, <span xml:lang="te-IN">సర్వశః = సర్వప్రకారమునైన</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">వృత్తమ్ = చరిత్రము కలదో</span>, <span xml:lang="te-IN">వైదేహ్యాశ్చాపి = సీతాదేవియొక్కయు (అపి శబ్దముచే భరతాదులయొక్కయు అని గ్రహింపవలెను) ప్రకాశం యది వా = అందరకును తెలిసినది గాని</span>, <span xml:lang="te-IN">రహో వా = రహస్యము గాని</span>, <span xml:lang="te-IN">యత్ వృత్తమ్ = ఏ చరిత్ర కలదో</span>, <span xml:lang="te-IN">తచ్చ = అదియు</span>, <span xml:lang="te-IN">అవిదితమపి = తెలియని దైనను</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">విదితమ్ = తెలిసినదిగా</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = కాగలదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">లక్ష్మణసహితు డైన రాముడు</span>, <span xml:lang="te-IN">సీత</span>, <span xml:lang="te-IN">భరతాదులు</span>, <span xml:lang="te-IN">రాక్షసులు - వీరందరి చరిత్రము</span>, <span xml:lang="te-IN">రహస్య మైన దైనను</span>, <span xml:lang="te-IN">ప్రకాశమైన దైనను</span>, <span xml:lang="te-IN">నీకింత వరకును తెలియనిది కూడ ఇపుడు స్పష్టముగ తెలియగలదు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్. </span><span class="fr">35</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అత్ర = ఈ</span>, <span xml:lang="te-IN">కావ్యే = కావ్యమునందు</span>, <span xml:lang="te-IN">తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">వాక్ = వాక్కు</span>, <span xml:lang="te-IN">కాచిత్ = ఒక్కటియు</span>, <span xml:lang="te-IN">అనృతా = అసత్యమైనది</span>, <span xml:lang="te-IN">న భవిష్యతి = కానేరదు</span>, <span xml:lang="te-IN">పుణ్యామ్ = పుణ్యమైనదియు</span>, <span xml:lang="te-IN">మనోరమామ్ = మనోహరమైనదియు అగు</span>, <span xml:lang="te-IN">రామకథామ్ = రాముని కథను</span>, <span xml:lang="te-IN">శ్లోకబద్ధామ్ = శ్లోకబద్ధ మైనదానినిగా</span>, <span xml:lang="te-IN">కురు = చేయుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ కావ్యములో నీవు చెప్పిన ఒక్క మాట యైనను అసత్యము కానేరదు. పుణ్యము</span>, <span xml:lang="te-IN">మనోహరము అయిన రామకథను శ్లోకబద్ధము చేయుము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి. </span><span class="fr">36</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గిరయః = పర్వతములును</span>, <span xml:lang="te-IN">సరితః చ = నదులును</span>, <span xml:lang="te-IN">మహీతలే = భూతలమునందు</span>, <span xml:lang="te-IN">యావత్ = ఎంతవరకును</span>, <span xml:lang="te-IN">స్థాస్యన్తి = ఉండగలవో</span>, <span xml:lang="te-IN">తావత్ = అంతవరకును</span>, <span xml:lang="te-IN">రామాయణకథా = రామాయణకథ</span>, <span xml:lang="te-IN">లోకేషు = లోకములయందు</span>, <span xml:lang="te-IN">ప్రచరిష్యతి = ప్రవర్తింపగలదు. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పర్వతములును</span>, <span xml:lang="te-IN">నదులును భూతలమునం దున్నంతవరకును రామాయణ కథ లోకములలో వ్యాపించి ఉండును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> యావద్రామాయణకథా త్వత్కృతా ప్రచరిష్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి. </span><span class="fr">37</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">త్వత్కృతా = నీచేత రచింపబడిన</span>, <span xml:lang="te-IN">రామాయణకథా = రామాయణకథ</span>, <span xml:lang="te-IN">యావత్ = ఎంతవరకు</span>, <span xml:lang="te-IN">ప్రచరిష్యతి = ప్రచారణలో నుండునో</span>, <span xml:lang="te-IN">తావత్ = అంతవరకును</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">ఊర్ధ్వమ్ = పైన</span>, <span xml:lang="te-IN">అధశ్చ = క్రిందను</span>, <span xml:lang="te-IN">మల్లోకేషు = నా లోకములలో</span>, <span xml:lang="te-IN">నివత్స్యసి = నివసించగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నీవు రచించిన రామాయణకథ ప్రచారములో నున్నంత కాలము</span>, <span xml:lang="te-IN">నీవు నేను సృజించిన ఊర్ధ్వలోకములలోను</span>, <span xml:lang="te-IN">అధోలోకములలోను స్వేచ్ఛగ సంచరించుచు ఉండగలవు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మా తత్రైవాన్తరధీయత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తతః సశిష్యో భగవాన్మునిర్విస్మయమాయయౌ. </span><span class="fr">38</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యము గల</span>, <span xml:lang="te-IN">బ్రహ్మా = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="te-IN">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">తత్రైవ = అచటనే</span>, <span xml:lang="te-IN">అన్తరధీయత = అంతర్ధానము పొందెను. తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="te-IN">సశిష్యః = శిష్యులతో కూడిన</span>, <span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యము గల</span>, <span xml:lang="te-IN">మునిః = వాల్మీకి మహాముని</span>, <span xml:lang="te-IN">విస్మయమ్ = ఆశ్చర్యమును</span>, <span xml:lang="te-IN">ఆయయౌ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">భగవంతు డైన బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికి అచటనే అంతర్ధానము పొందెను. వాల్మీకి మహామునియు</span>, <span xml:lang="te-IN">శిష్యులును చాల ఆశ్చర్యము చెందిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తస్య శిష్యాస్తతః సర్వే జగుః శ్లోకమిమం పునః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ముహుర్ముహుః ప్రీయమాణాః ప్రాహుశ్చ భృశవిస్మితాః. 39</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">తస్య = అతని</span>, <span xml:lang="te-IN">శిష్యాః = శిష్యులు</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">ముహుర్ముహుః = మాటిమాటికిని</span>, <span xml:lang="te-IN">ప్రీయమాణాః = సంతోషించుచున్నవారై</span>, <span xml:lang="te-IN">పునః = మరల</span>, <span xml:lang="te-IN">ఇమం శ్లోకమ్ = ఈ శ్లోకమును</span>, <span xml:lang="te-IN">జగుః = గానము చేసిరి. భృశవిస్మితాః = మిక్కిలి ఆశ్చర్యపడినవారై</span>, <span xml:lang="te-IN">ప్రాహుశ్చ = పరస్పరము చెప్పుకొనిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట వాల్మీకిశిష్యు లందరును మాటి మాటికి సంతోషించుచు మరల ఈ శ్లోకమును పఠించి ఒకరి కొకరు చెప్పుకొనిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సోనువ్యాహరణాద్భూయః శ్లోకః శ్లోకత్వమాగతః. </span><span class="fr">40</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">యః = ఏది</span>, <span xml:lang="te-IN">సమాక్షరైః = సమానమైన సంఖ్య గల అక్షరములతో కూడిన</span>, <span xml:lang="te-IN">చతుర్బిః = నాలుగు</span>, <span xml:lang="te-IN">పాదైః = పాదములతో</span>, <span xml:lang="te-IN">మహర్షిణా = మహర్షిచే</span>, <span xml:lang="te-IN">గీతః = చెప్పబడినదో</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">శ్లోకః = శ్లోకము</span>, <span xml:lang="te-IN">అనువ్యాహరణాత్ = మాటిమాటికి పఠించుటవలన</span>, <span xml:lang="te-IN">భూయః = మరల</span>, <span xml:lang="te-IN">అనగా ఇంకను</span>, <span xml:lang="te-IN">శ్లోకత్వమ్ = శ్లోకత్వమును</span>, <span xml:lang="te-IN">ఆగతః = పొందినది.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సమసంఖ్యాకము లగు అక్షరములతో</span>, <span xml:lang="te-IN">నాలుగు పాదములతో</span>, <span xml:lang="te-IN">కూడినదై</span>, <span xml:lang="te-IN">మహర్షి గానము చేసిన ఈ శ్లోకము</span>, <span xml:lang="te-IN">మాటి మాటికి గానము చేయుటచే ఇంకను శ్లోకత్వమును పొందినది.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి. </span><span xml:lang="te-IN">శ్లోక శబ్దమునకు యశస్సు అని కూడ అర్థము. వాల్మీకి ముఖము నుండి వెలువడిన ఈ శ్లోకము</span>, <span xml:lang="te-IN">శిష్యు లందరును అత్యానందముతో మరల మరల పఠించుటచే అతనికి కీర్తిపతాక మైన దని భావము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తస్య బుద్ధిరియం జాతా మహర్షేర్భావితాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కృత్స్నం రామాయణం కావ్యమీదృ శైః కరవాణ్యహమ్. </span><span class="fr">41</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">కృత్స్నమ్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">రామాయణమ్ = రామాయణమనెడు</span>, <span xml:lang="te-IN">కావ్యమ్ = కావ్యమును</span>, <span xml:lang="te-IN">ఈదృశైః = ఇట్టి శ్లోకములతో</span>, <span xml:lang="te-IN">కరవాణి = చేసెదను అని</span>, <span xml:lang="te-IN">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">బుద్ధిః = బుద్ధి</span>, <span xml:lang="te-IN">భావితాత్మనః = ధ్యానింపబడిన పరమాత్మగల</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">మహర్షేః = వాల్మీకిమహర్షికి</span>, <span xml:lang="te-IN">జాతా = కలిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">రామాయణము నంతను ఈ శ్లోకవృత్తములో రచించెదను</span>’’ <span xml:lang="te-IN">అని పరమాత్మ ధ్యానపరాయణు డగు వాల్మీకి నిశ్చయించుకొనెను. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span> ఉదారవృత్తార్థపదైర్మనోరమై</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్తదాస్య రామస్య చకార కీర్తిమాన్</span>,</p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"> సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినో</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యశస్కరం కావ్యముదారధీర్మునిః. </span><span class="fr">42</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కీర్తిమాన్ = కీర్తి కలవాడును</span>, <span xml:lang="te-IN">ఉదారధీః = గొప్ప బుద్ధి కలవాడును</span>, <span xml:lang="te-IN">మునిః = మననశీలుడును అగు వాల్మీకి</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">యశస్వినః = కీర్తిమంతుడైన</span>, <span xml:lang="te-IN">అస్య రామస్య = ఈ రామునియొక్క</span>, <span xml:lang="te-IN">యశస్కరమ్ = కీర్తిని కలిగించు</span>, <span xml:lang="te-IN">కావ్యమ్ = కావ్యమును</span>, <span xml:lang="te-IN">ఉదారవృత్తార్థపదైః = ఉత్తమ మైన పద్యములును</span>, <span xml:lang="te-IN">అర్థములును</span>, <span xml:lang="te-IN">శబ్దములును గల</span>, <span xml:lang="te-IN">మనోరమైః = మనోహరములైన</span>, <span xml:lang="te-IN">సమాక్షరైః = సమములైన అక్షరములు గల</span>, <span xml:lang="te-IN">శ్లోకశతైః = వందలకొలది శ్లోకములచేత</span>, <span xml:lang="te-IN">చకార = రచించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">కీర్తిమంతుడును</span>, <span xml:lang="te-IN">మహాబుద్ధిమంతుడును అగు వాల్మీకి యశశ్శాలి యగు ఆ రాముని మాహాత్మ్యమును తెలుపునట్టి కావ్యమును</span>, <span xml:lang="te-IN">మనోహరము లైనవియు</span>,<span class="CharOverride-7" xml:lang="te-IN">ఉత్తమము లైన వృత్తములతోడను</span><span class="CharOverride-7">, </span><span class="CharOverride-7" xml:lang="te-IN">శబ్ధార్థములతోడను ప్రకాశించునవియు</span><span class="CharOverride-7">, </span><span class="CharOverride-7" xml:lang="te-IN">సమాక్షరములు కలిగినవియు అగు శ్లోకశతములతో నిర్మించెను.</span><span class="CharOverride-7"> <a/></span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span> తదుపగత సమాససన్ధియోగం</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సమమధురోపనతార్థవాక్యబద్ధమ్</span>,</p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"> రఘువరచరితం మునిప్రణీతం</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్. </span><span class="fr">43</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span>, <span xml:lang="te-IN">బాలకాణ్డే ద్వితీయః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఉపగతసమాససన్ధియోగం = సమాససంధివ్యుత్పత్తులతో కూడినదియు</span>, <span xml:lang="te-IN">సమమధురోపనతార్థ వాక్యబద్ధమ్ = సమానములును</span>, <span xml:lang="te-IN">మధురములును</span>, <span xml:lang="te-IN">అర్థవంతములును అగు వాక్యములతో కూర్చబడినదియు</span>, <span xml:lang="te-IN">మునిప్రణీతమ్ = వాల్మీకిచే రచింపబడినదియు అగు</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">రఘువరచరితమ్ = రామచరితమును</span>, <span xml:lang="te-IN">దశశిరసః = రావణుని</span>, <span xml:lang="te-IN">వధం చ = వధను</span>, <span xml:lang="te-IN">నిశామయధ్వమ్ = చూడండి (వినండి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకిముని రచించిన ఈ </span>‘‘<span xml:lang="te-IN">రామచరితము</span>’’<span xml:lang="te-IN">లో</span>, ‘‘<span xml:lang="te-IN">రావణవధ</span>’’<span xml:lang="te-IN">లో సమాసములు నాతిదీర్ఘములు. సంధులు శ్రావ్యములు. శబ్దవ్యుత్పత్తి శాస్త్రసంమతమైనది. ఇందలి వాక్యములై</span>, <span xml:lang="te-IN">సమములై</span>, <span xml:lang="te-IN">మధురములై</span>, <span xml:lang="te-IN">అర్థభరితములై ఉన్నవి. అట్టి ఈ కావ్యమును వినండి.</span></p> <p class="Prati ParaOverride-25" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో ద్వితీయసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter