Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_16</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_16" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షోడశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">నరరూపమున అవతరించి రావణవధ చేయవలె నని దేవతలు శ్రీమహా విష్ణువును అభ్యర్థించుట. దశరథుడు పుత్రేష్టి చేయుచుండగా అగ్నికుండమునుండి ఆవిర్భవించిన ప్రాజాపత్యపురుషుడు ఆతనికి పాయసము నిచ్చుట. దానిని భుజించి ఆతని భార్యలు గర్భవతు లగుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ.</span><span xml:lang="en-US"> తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సురసత్తమైః = దేవతాశ్రేష్ఠులచేత</span>, <span xml:lang="en-US">నియుక్తః = ఈ విధముగా నియమింపబడిన</span>, <span xml:lang="en-US">నారాయణః దేవః = విష్ణువు</span>, <span xml:lang="en-US">జానన్నపి = తెలిసినవాడే అయినను</span>, <span xml:lang="en-US">సురాన్ = దేవతలను గూర్చి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">శ్లక్ష్ణమ్ = మృదువైన</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఈ విధముగా దేవలతచే నియుక్తు డైన విష్ణువు</span>, <span xml:lang="en-US">తెలిసినవాడే యైనను</span>, <span xml:lang="en-US">తెలియనట్లు దేవతలతో</span>, <span xml:lang="en-US">మధురముగా ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఉపాయః కో వధే తస్య రావణస్య దురాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యమహం తం సమాస్థాయ నిహన్యామృషికణ్టకమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ.</span><span xml:lang="en-US"> దురాత్మనః = దురాత్ము డైన, తస్య రావణస్య = ఆ రావణుని యొక్క, వధే = వధవిషయమును, ఉపాయః = ఉపాయము, కః = ఏమి? యమ్ = ఏ ఉపాయమును, అస్థాయ = అవలంబించి, ఋషికణ్టకమ్ = ఋషులకు భాధను కలిగించుచున్న, తమ్ = నేను, నిహన్యామ్ = చంపుదునో</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఋషులకు బాధలను కలిగించుచున్న</span>, <span xml:lang="en-US">దురాత్ముడైన రావణుని వధించుటకు ఉపాయమేమి</span>? <span xml:lang="en-US">ఆ ఉపాయముచే నేను రావణుని వధించెదను.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్తాస్సురాః సర్వే ప్రత్యూచుర్విష్ణుమవ్యయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తాః = పలకబడిన</span>, <span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">అవ్యయమ్ = నాశరహితుడైన</span>, <span xml:lang="en-US">విష్ణుమ్ = విష్ణువును గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రత్యూచుః = తిరిగి పలికిరి. మానుషీమ్ = మనుష్యసంబంధమైన</span>, <span xml:lang="en-US">తనుమ్ = శరీరమును</span>, <span xml:lang="en-US">ఆస్థాయ = అవలంబించి</span>, <span xml:lang="en-US">సంయుగే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">రావణమ్ = రావణుని</span>, <span xml:lang="en-US">జహి = సంహరించుము.</span></p> <p class="Tat ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>‘‘<span xml:lang="en-US">మనుష్యశరీరమును ధరించి</span>, <span xml:lang="en-US">యుద్ధరంగమున రావణుని వధింపుము</span>’’ <span xml:lang="en-US">అని దేవతలు ప్రత్యుత్తర మిచ్చిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స హి తేపే తపస్తీవ్రం దీర్ఘకాలమరిన్దమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యేన తుష్టోఽభవద్బ్రహ్మా లోకకృల్లోకపూర్వజః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అరింద</span><span xml:lang="en-US">మ = ఓ శత్రువినాశకుడా! సః = అతడు</span>, <span xml:lang="en-US">దీర్ఘకాలమ్ = చాలకాలము</span>, <span xml:lang="en-US">తీవ్రమ్ = తీవ్రమైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను (తపించెను). యేన = దేనిచేత</span>, <span xml:lang="en-US">లోకకృత్ = లోకములను సృజించినవాడును</span>, <span xml:lang="en-US">లోకపూర్వజః = లోకములకు ముందు పుట్టినవాడును అగు</span>, <span xml:lang="en-US">బ్రహ్మా = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">తుష్టః = సంతోషించినవాడై</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెనో.</span></p> <p class="Tat ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>‘‘<span xml:lang="en-US">ఓ! శత్రువినాశకా! ఆ రావణుడు చాలకాలము తీవ్రమైన తపస్సు చేయగా</span>, <span xml:lang="en-US">సర్వలోకములకంటెను పూర్వము జనించినవాడును</span>, <span xml:lang="en-US">సకలలోకస్రష్టయు అగు బ్రహ్మదేవుడు ఆ తపస్సునకు సంతోషించెను.</span>’’</p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నానావిధేభ్యోభూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్. </span><span class="fr">5</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> అవజ్ఞాతాః పురా తేన వరదానే హి మానవాః.</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సంతుష్టః = సంతోషించిన</span>, <span xml:lang="en-US">ప్రభుః = ఆ సర్వసమర్థుడు</span>, <span xml:lang="en-US">తస్మై = ఆ</span>, <span xml:lang="en-US">రాక్షసాయ = రాక్షసునకు</span>, <span xml:lang="en-US">మానుషాత్ అన్యత్ర = మనుష్యులు తప్ప</span>, <span xml:lang="en-US">నానావిధేభ్యః = అనేకవిధములైన</span>, <span xml:lang="en-US">భూతేభ్యః = ప్రాణు</span><span xml:lang="en-US">లనుండి</span>, <span xml:lang="en-US">భయమ్ = భయము</span>, <span xml:lang="en-US">న = లేదు</span>, <span xml:lang="en-US">అని</span>, <span xml:lang="en-US">వరమ్ = వరమును</span>, <span xml:lang="en-US">ప్రదదౌ = ఇచ్చెను.</span><span xml:lang="en-US"> </span><span xml:lang="en-US">పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">వరదానే = వరదానసమయమునందు</span>, <span xml:lang="en-US">తేన = వానిచేత</span>, <span xml:lang="en-US">మానవాః = మానవులు</span>, <span xml:lang="en-US">అవజ్ఞాతాః = అనాదరము చేయబడినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>‘‘<span xml:lang="en-US">సంతోషించిన ఆ బ్రహ్మదేవుడు - </span>‘‘<span xml:lang="en-US">మనుష్యులు తప్ప మరి ఏ ఇతర ప్రాణులనుండియు నీకు భయము లేకుండుగాక</span>’’ <span xml:lang="en-US">అని ఆ రాక్షసునకు వరము నిచ్చెను. ఎందువల్ల ననగా</span>, <span xml:lang="en-US">వరదానసమయమున అతడు (రావణుడు) మానవుల విషయమున అనాదరమును చూపెను.</span>’’</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవం పితామహాత్తస్మాద్వరం ప్రాప్య స దర్పితః</span>, 6</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"> ఉత్సాదయతి లోకాంస్త్రీన్ స్త్రియశ్చాప్యపకర్షతి. </p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్మాత్తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతప. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">తస్మాత్ = ఆ</span>, <span xml:lang="en-US">పితామహాత్ = బ్రహ్మదేవునినుండి</span>, <span xml:lang="en-US">వరమ్ = వరమును</span>, <span xml:lang="en-US">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">దర్పితః = గర్వించినవాడై</span>, <span xml:lang="en-US">త్రీన్ = మూడు</span>, <span xml:lang="en-US">లోకాన్ = లోకములను</span>, <span xml:lang="en-US">ఉత్సాదయతి = పీడించుచున్నాడు</span>, <span xml:lang="en-US">స్త్రియః = స్త్రీలను</span>, <span xml:lang="en-US">అపకర్షతి చ = బలాత్కరించుచున్నాడు కూడా. తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">పరంతప = ఓ శత్రుసంహారకుడా!, తస్య = వానియొక్క</span>, <span xml:lang="en-US">వధః = వధ</span>, <span xml:lang="en-US">మానుషేభ్యః = మనుష్యులనుండి</span>, <span xml:lang="en-US">దృష్టః = చూడబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>‘‘<span xml:lang="en-US">ఈ విధముగ బ్రహ్మదేవునినుండి వరమును పొంది</span>, <span xml:lang="en-US">అతడు దృప్తుడై మూడు లోకాలను పీడించుచున్నాడు. స్త్రీలను బలాత్కరించుచున్నాడు. వానిని సంహరింప గలవారు మనుష్యులు మాత్రమే.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితరం రోచయామాస తదా దశరథం నృపమ్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">సురాణామ్ = దేవతలయొక్క</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ఆత్మవాన్ = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="en-US">విష్ణుః = విష్ణువు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">దశరథం నృపమ్ = దశరథమహారాజును</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రినిగా</span>, <span xml:lang="en-US">రోచయామాస = ఇష్టపడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> బుద్ధిమంతుడైన విష్ణువు దేవతల ఈ వాక్యమును విని</span>, <span xml:lang="en-US">అప్పుడు</span>, <span xml:lang="en-US">దశరథుని తండ్రిగా చేసికొనవలెనని ఇచ్ఛయించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స చాప్యపుత్రో నృపతిస్తస్మిన్ కాలే మహాద్యుతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అయజత్పుత్రియామిష్టిం పుత్రేప్సురరిసూదనః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్మిన్ కాలే = ఆ సమయమునందు</span>, <span xml:lang="en-US">మహాద్యుతిః = గొప్పకాంతికలవాడును</span>, <span xml:lang="en-US">అరిసూదనః = శత్రువులను నశింపచేయువాడును అగు</span>, <span xml:lang="en-US">సః నృపతిః = ఆ రాజు</span>, <span xml:lang="en-US">అపుత్రః = పుత్రులు లేనివాడై</span>, <span xml:lang="en-US">పుత్రేప్సుః = పుత్రులను పొందదలచినవాడై</span>, <span xml:lang="en-US">పుత్రియామ్ ఇష్టిమ్ = పుత్రులను కలిగించు ఇష్టిని</span>, <span xml:lang="en-US">అయజత్ = యజించెను (చేసెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">శత్రుసంహారకుడును అగు దశరథుడు</span>, <span xml:lang="en-US">పుత్రులు లేకపోవుటచే</span>, <span xml:lang="en-US">అదే సమయమున</span>, <span xml:lang="en-US">పుత్రులను ఇచ్చు ఒక యాగమును చేయుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స కృత్వా నిశ్చయం విష్ణురామన్త్య్ర చ పితామహమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అన్తర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">విష్ణుః = విష్ణువు</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = నిశ్చయమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">పితామహమ్ = బ్రహ్మదేవుని</span>, <span xml:lang="en-US">ఆమన్త్య్ర = వీడ్కొని</span>, <span xml:lang="en-US">దేవైః = దేవతలచేతను</span>, <span xml:lang="en-US">మహర్షిభిః = మహర్షులచేతను</span>, <span xml:lang="en-US">పూజ్యమానః = పూజింపబడుచున్న వాడై</span>, <span xml:lang="en-US">అన్తర్ధానం గతః = అంతర్ధానము పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> విష్ణువు ఈ విధముగా నిశ్చయించుకొని</span>, <span xml:lang="en-US">బ్రహ్మదేవుని వీడ్కొని</span>, <span xml:lang="en-US">దేవతలచేతను</span>, <span xml:lang="en-US">మహర్షులచేతను పూజింపబడుచున్న వాడై అంతర్ధానము పొందెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతో వై యజమానస్య పావకాదతులప్రభమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్. </span><span class="fr">11</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కృష్ణరక్తామ్బరధరం రక్తాస్యం దున్దుభిస్వనమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రు ప్రవరమూర్ధజమ్. </span><span class="fr">12</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శుభలక్షణసమ్పన్నం దివ్యాభరణభూషితమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శైలశృంగసముత్సేధం దృప్తశార్ధూలవిక్రమమ్. </span><span class="fr">13</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దివాకరసమాకారం దీప్తానలశిఖోపమమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తప్తజామ్బూనదమయీం రాజతాంతపరిచ్ఛదామ్. </span><span class="fr">14</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దివ్యపాయససంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">యజమానస్య = యాగము చేయుచున్న ఆ దశరథునియొక్క</span>, <span xml:lang="en-US">పావకాత్ = అగ్నినుండి</span>, <span xml:lang="en-US">అతులప్రభమ్ = సాటిలేని కాంతి కలదియు</span>, <span xml:lang="en-US">మహావీర్యమ్ = గొప్ప వీర్యము కలదియు</span>, <span xml:lang="en-US">మహాబలమ్ = గొప్ప బలము గలదియు</span>, <span xml:lang="en-US">కృష్ణరక్తామ్బరధరమ్ = నల్లని ఎఱ్ఱని వస్త్రములను ధరించినదియు</span>, <span xml:lang="en-US">రక్తాస్యమ్ = ఎఱ్ఱని ముఖము కలదియు</span>, <span xml:lang="en-US">దున్దుభిస్వనమ్ = దుందుభిధ్వని వంటి ధ్వని కలదియు</span>, <span xml:lang="en-US">స్నిగ్ధహర్యక్షతనుజశ్మ శ్శుప్రవరమూర్ధజమ్ = మెత్తగా నున్న సింహరోమసదృశము లైన మీసములును శ్రేష్ఠము లైన కేశములును కలదియు</span>, <span xml:lang="en-US">శుభలక్షణసంపన్నమ్ = శుభలక్షణములతో కూడినదియు</span>, <span xml:lang="en-US">దివ్యాభరణభూషితమ్ =</span><span xml:lang="en-US"> దివ్యములైన ఆభరణములచే అలంకరింపబడినదియు</span>, <span xml:lang="en-US">శైలశృఙ్గసముత్సేధమ్ = పర్వతశిఖరము</span><span xml:lang="en-US"> వంటి ఔన్నత్యము కలదియు</span>, <span xml:lang="en-US">దృప్తశార్దూల విక్రమమ్ = గర్వించిన పెద్దపులి వంటి నడక గలదియు</span>, <span xml:lang="en-US">దివాకరసమాకారమ్ = సూర్యునితో సమానమైన ఆకారము కలదియు</span>, <span xml:lang="en-US">దీప్తానలశిఖోపమమ్ = ప్రజ్వలించుచున్న అగ్నిశిఖతో సమాన మైనదియు అగు</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్ప</span>, <span xml:lang="en-US">భూతమ్ = భూతము</span>, <span xml:lang="en-US">తప్తజామ్బూనదమయీమ్ = కరిగిన బంగారముతో చేయబడిన</span>, <span xml:lang="en-US">రాజతాన్తపరిచ్ఛదామ్ = వెండితో చేయబడిన మూత కల</span>, <span xml:lang="en-US">దివ్యపాయససంపూర్ణామ్ = దివ్యపాయసముతో నిండిన</span>, <span xml:lang="en-US">మాయామయీమివ = మాయానిర్మితమా అన్నట్లున్న</span>, <span xml:lang="en-US">విపులామ్ = పెద్దదైన</span>, <span xml:lang="en-US">పాత్రీమ్ = పాత్రను</span>, <span xml:lang="en-US">ప్రియామ్ = ప్రియురాలైన</span>, <span xml:lang="en-US">పత్నీమివ = భార్యను వలె</span>, <span xml:lang="en-US">స్వయమ్ </span><span xml:lang="en-US">= స్వయముగ</span>, <span xml:lang="en-US">దోర్భ్యామ్ = రెండుచేతులతో</span>, <span xml:lang="en-US">ప్రగృహ్య = గ్రహించి</span>, <span xml:lang="en-US">ప్రాదుర్భూతమ్ = ఆవిర్భవించెను</span><span xml:lang="en-US">.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథుడు యజ్ఞము చేయుచుండగా ఆ అగ్నికుండమునుండి సాటిలేని కాంతి గల ఒక మహాభూతము ఆవిర్భవించెను. దాని బలపరాక్రమములు అసాధారణములు. అది నలుపు-ఎరుపురంగులు గల వస్త్రమును ధరించెను. ముఖము ఎఱ్ఱగ నుండెను. దాని కంఠధ్వని దుందుభిధ్వని వలె గంభీరముగ నుండెను. మెత్తగా నున్న దాని రోమములును</span>, <span xml:lang="en-US">మీసములును</span>, <span xml:lang="en-US">వెంట్రుకలును సింహముజూలు రంగులో ఉండెను. పర్వతశిఖరము వంటి ఔన్నత్యము గల ఆ భూతముయొక్క నడక దర్పముతో కూడిన పెద్దపులి నడక వలె నుండెను. దాని ఆకారము సూర్యుని ఆకారము వలెను</span>, <span xml:lang="en-US">అది ప్రజ్వలించుచున్న అగ్నిశిఖ వలెను ఉండెను. ఆ భూతము తన రెండు చేతులతో ఒక మేలిమి బంగారు పాత్రను</span>, <span xml:lang="en-US">ప్రియురా లైన భార్యను వలె</span>, <span xml:lang="en-US">ఆత్యాదరముతో తీసికొనివచ్చెను. దివ్యపాయసముతో నిండి యున్న ఆ బంగారుపాత్రపై వెండి మూత యుండెను. అది మాయచే నిర్మింపబడినదా అన్నట్లు అత్యద్భుతముగ నుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సమవేక్ష్యాబ్రవీద్వాక్యమిదం దశరథం నృపమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దశరథం నృపమ్ = దశరథమహారాజును</span>, <span xml:lang="en-US">సమవేక్ష్య = చూచి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. నృప = ఓ రాజా! ఇహ = ఇచటికి</span>, <span xml:lang="en-US">అభ్యాగతమ్ </span><span xml:lang="en-US">= వచ్చిన నన్ను</span>, <span xml:lang="en-US">ప్రాజాపత్యం = ప్రజాపతి నుండి వచ్చిన</span>, (<span xml:lang="en-US">ప్రజాపతికి సంబంధించిన)</span>, <span xml:lang="en-US">నరమ్ = పురుషునిగా</span>, <span xml:lang="en-US">విద్ధి = తెలుసుకొనుము.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఆ భూతము దశరథమహారాజును చూచి ఇట్లు పలికెను. </span>‘‘<span xml:lang="en-US">ఓ రాజా! నేను ప్రజాపతి పంపగా ఇచటకు వచ్చినాను.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాఞ్జలిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భగవన్ స్వాగతం తేఽస్తు కిమహం కరవాణి తే. </span><span class="fr">17</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః పరమ్ = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">కృతాఞ్జలిః = కట్టబడిన దోసిలి </span><span xml:lang="en-US">కలవాడై</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను. భగవన్ = ఓ పూజ్యుడా! తే = నీకు</span>, <span xml:lang="en-US">స్వాగతమ్ = స్వాగతము</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక. అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">కిమ్ = ఏమి</span>, <span xml:lang="en-US">కరవాణి </span><span xml:lang="en-US">= చేయుదును.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> పిదప ఆ రాజు చేతులు జోడించి -- </span>‘‘<span xml:lang="en-US">పూజ్యుడా! నీకు స్వాగతము. నీ కొరకు నేనేమి చేయుదును</span>?’’ <span xml:lang="en-US">అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోఽబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాజన్నర్చయతా దేవానద్య ప్రాప్తమిదం త్వయా. </span><span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథో = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">ప్రాజాపత్యః నరః = ప్రజాపతి పంపగా వచ్చిన ఆ పురుషుడు</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. రాజన్ = ఓ రాజా!, దేవాన్ = దేవతలను</span>, <span xml:lang="en-US">అర్చయతా = పూజించుచున్న</span>, <span xml:lang="en-US">త్వయా = నీచేత</span>, <span xml:lang="en-US">అద్య = ఈ రోజున</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఇది</span>, <span xml:lang="en-US">ప్రాప్తమ్ = పొందబడినది.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఆ ప్రాజాపత్యపురుషుడు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను. </span>‘‘<span xml:lang="en-US">రాజా! నీవు దేవతలను అర్చించుచున్నందుకు ఫలితముగా నేడు ఇది నీకు లభించినది.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇదం తు నృపశార్దూల పాయసం దేవనిర్మితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రజాకరం గృహాణ త్వం ధన్యమారోగ్యవర్ధనమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నృపశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా! దేవనిర్మితమ్ = దేవతలచేత నిర్మింపబడినదియు</span>, <span xml:lang="en-US">ప్రజాకరమ్ = సంతానమును ఇచ్చునదియు</span>, <span xml:lang="en-US">ధన్యమ్ = ధనము నిచ్చునదియు</span>, <span xml:lang="en-US">ఆరోగ్యవర్ధనమ్ = ఆరోగ్యమును వృద్ధి పొందించునదియు అగు</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">పాయసమ్ = పాయసమును</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">గృహాణ = గ్రహించుము.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>‘‘<span xml:lang="en-US">ఓ రాజశ్రేష్ఠుడా! ఈ పాయసము దేవతలు నిర్మించినది. సంతానము నిచ్చును</span>; <span xml:lang="en-US">ధనమును ఇచ్చును</span>; <span xml:lang="en-US">ఆరోగ్యమును పెంచును</span>; <span xml:lang="en-US">దీనిని తీసికొనుము.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. భార్యాణామనురూపాణామశ్నీతేతి ప్రయచ్ఛ వై</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తాసు త్వం ప్రాప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నృప = ఓ రాజా! అశ్నీత = భుజింపుడు</span>, <span xml:lang="en-US">ఇతి = అని చెప్పి</span>, <span xml:lang="en-US">అనురూపాణామ్ = తగిన</span>, <span xml:lang="en-US">భార్యాణామ్ = భార్యలకు</span>, <span xml:lang="en-US">ప్రయచ్ఛ వై = ఇమ్ము. యదర్థమ్ = ఏ పుత్రులకొరకై</span>, <span xml:lang="en-US">యజసే </span><span xml:lang="en-US">= యాగము చేయుచున్నావో</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = అట్టి పుత్రులను</span>, <span xml:lang="en-US">తాసు = వారియందు</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">ప్రాప్స్యసే = పొందగలవు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>‘‘<span xml:lang="en-US">రాజా! </span>‘<span xml:lang="en-US">తినుడు</span>’ <span xml:lang="en-US">అని చెప్పి ఈ పాయసమును తగిన భార్యల కిమ్ము. నీవు పుత్రులకొరకై యాగము చేయుచున్నావు కదా. ఆ భార్యలయందు నీకు పుత్రులు జనించగలరు.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్య తామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పాత్రీం దేవాన్నసంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీమ్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నృపతిః = రాజు</span>, <span xml:lang="en-US">తథేతి = అటులనే చేసెదను అని పలికి</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">దేవాన్నసంపూర్ణామ్ = దేవతలచే వండబడిన అన్నముతో నిండినదియు</span>, <span xml:lang="en-US">దేవదత్తామ్ = దేవతలచేత ఇవ్వబడినదియు</span>, <span xml:lang="en-US">హిరణ్మయీమ్ = బంగారు వికారమైనదియు అగు</span>, <span xml:lang="en-US">పాత్రీమ్ = పాత్రను</span>, <span xml:lang="en-US">శిరసా = శిరస్సుతో</span>, <span xml:lang="en-US">ప్రతిగృహ్య = స్వీకరించి</span>, <span xml:lang="en-US">ప్రీతః = సంతోషించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథుడు</span>, <span xml:lang="en-US">దేవతలు వండిన అన్నముతో నిండిన</span>, <span xml:lang="en-US">దేవతలు పంపిన</span>, <span xml:lang="en-US">ఆ బంగారు పాత్రను శిరస్సు వంచి</span>, <span xml:lang="en-US">సవినయముగ అందికొని సంతోషించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అభివాద్య చ తద్భూతమద్భుతం ప్రియదర్శనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ముదా పరమయా యుక్తశ్చకారాభిప్రదక్షిణమ్. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమయా = గొప్పదైన</span>, <span xml:lang="en-US">ముదా = సంతోషముతో</span>, <span xml:lang="en-US">యుక్తః = కూడినవాడై</span>, <span xml:lang="en-US">అద్భుతమ్ = ఆశ్చర్యకర మైనదియు</span>, <span xml:lang="en-US">ప్రియదర్శనమ్ = సంతోషజనకమైన దర్శనము కలదియు అగు</span>, <span xml:lang="en-US">తత్ భూతమ్ = ఆ భూతమును</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">అభిప్రదక్షిణమ్ = ప్రదక్షిణమును</span>, <span xml:lang="en-US">చకార = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మిక్కిలి సంతోషించిన దశరథుడు</span>, <span xml:lang="en-US">చూచెడివారికి సంతోషము కలిగించు</span>, <span xml:lang="en-US">ఆ అద్భుతమైన భూతమునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతో దశరథః ప్రాప్య పాయసం దేవనిర్మితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">దశరథః = దశరథుడు</span>, <span xml:lang="en-US">దేవనిర్మితమ్ = దేవతలచే నిర్మింపబడిన</span>, <span xml:lang="en-US">పాయసమ్ = పాయసమును</span>, <span xml:lang="en-US">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">విత్తమ్ = ధనమును</span>, <span xml:lang="en-US">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">అధనః ఇవ </span><span xml:lang="en-US">= దరిద్రుడు వలె</span>, <span xml:lang="en-US">పరమప్రీతః = మిక్కిలి సంతసించినవాడు</span>, <span xml:lang="en-US">బభూవ = అయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథుడు దేవతలు నిర్మించిన ఆ పాయసము లభించుటచే</span>, <span xml:lang="en-US">ధనము లభించిన నిరుపేద వలె చాల సంతసించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతస్తదద్భుతప్రఖ్యం భూతం పరమభాస్వరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంవర్తయిత్వా తత్ కర్మ తత్రైవాన్తరధీయత. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అద్భుతప్రఖ్యమ్ = అద్భుత మైన ఆకారము కలదియు</span>, <span xml:lang="en-US">పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించునది అగు</span>, <span xml:lang="en-US">తత్ భూతమ్ = ఆ భూతము</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">కర్మ = పనిని</span>, <span xml:lang="en-US">సంవర్తయిత్వా = చేసి</span>, <span xml:lang="en-US">తత్రైవ = అచటనే, అంతరధీయత = అంతర్ధానము చెందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అద్భుత మైన ఆకారముతో పరమతేజోవంత మగు ఆ భూతము</span>, <span xml:lang="en-US">ఆ పని చేసి అచటనే అంతర్ధానము చెందెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. హర్షరశ్మిభిరుద్ద్యోతం తస్యాన్తఃపురమాబభౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">హర్షరశ్మిభిః = ఆనందకిరణములచేత</span>, <span xml:lang="en-US">ఉద్ద్యోతమ్ = వెలుగొందుచున్న</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">అన్తఃపురమ్ = అంతఃపురము</span>, <span xml:lang="en-US">అభిరామస్య = మనోహరుడైన</span>, <span xml:lang="en-US">శారదస్య = శరత్కాలమునకు సంబంధించిన</span>, <span xml:lang="en-US">చన్ద్రస్య = చంద్రునియొక్క</span>, <span xml:lang="en-US">అంశుభిః = కిరణములచేత</span>, <span xml:lang="en-US">నభః ఇవ = ఆకాశము వలె</span>, <span xml:lang="en-US">ఆబభౌ = ప్రకాశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> సంతోషకాంతులతో వెలుగొందుచున్న దశరథాంతఃపురము</span>, <span xml:lang="en-US">మనోహరుడైన శరచ్చంద్రుని కిరణములచే ఆకాశము వలె ప్రకాశించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సోఽన్తఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రియం త్విదమాత్మనః. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">అన్తఃపురమ్ = అంతఃపురమును</span>, <span xml:lang="en-US">ప్రవిశ్యైవ = ప్రవేశించగనే</span>, <span xml:lang="en-US">కౌసల్యామ్ = కౌసల్యను</span><span xml:lang="en-US"> గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. ఆత్మనః = నీకు</span>, <span xml:lang="en-US">పుత్రియమ్ = పుత్రులను కలుగజేయు</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">పాయసమ్ = పాయసమును</span>, <span xml:lang="en-US">ప్రతిగృహ్ణీష్వ = స్వీకరించుము.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అతడు అంతఃపురములో ప్రవేశించి - </span>‘‘<span xml:lang="en-US">నీకు పుత్రులను కలిగించు ఈ పాయసమును తీసికొనుము</span>’’ <span xml:lang="en-US">అని కౌసల్యతో పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః. </span><span class="fr">27</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్థకారణాత్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమమ్. </span><span class="fr">28</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనుచిన్త్య సుమిత్రాయై పునరేవ మహీపతిః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">నరపతిః = రాజు</span>, <span xml:lang="en-US">కౌసల్యాయై = కౌసల్యకు</span>, <span xml:lang="en-US">పాయసార్ధమ్ = పాయసములో సగమును</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను. నరాధిపః = రాజు</span>, <span xml:lang="en-US">అర్ధాత్ = మిగిలిన సగమునుండి</span>, <span xml:lang="en-US">అర్ధమ్ = సగభాగమును</span>, <span xml:lang="en-US">సుమిత్రాయై అపి = సుమిత్రకు కూడ</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను. అవశిష్టార్ధమ్ </span><span xml:lang="en-US">= మిగిలిన దానిలో సగమును</span>, <span xml:lang="en-US">పుత్రార్థకారణాత్ = పుతప్రయోజనమనే కారణమువలన</span>, <span xml:lang="en-US">కైకేయ్యై = కైకేయికి</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను. మహీపతిః = రాజు</span>, <span xml:lang="en-US">అనుచిన్త్య = ఆలోచించి</span>, <span xml:lang="en-US">పాయసస్య = పాయసము యొక్క</span>, <span xml:lang="en-US">అమృతోపమమ్ = అమృతముతో సమాన మైన</span>, <span xml:lang="en-US">అవశిష్టార్ధమ్ = మిగిలిన సగమును</span>, <span xml:lang="en-US">పునరేవ = మరల</span>, <span xml:lang="en-US">సుమిత్రాయై = సుమిత్రకు</span>, <span xml:lang="en-US">ప్రదదౌ = ఇచ్చెను. ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">తాసాం భార్యాణామ్ = ఆ భార్యలకు</span>, <span xml:lang="en-US">పృథక్ = వేరు వేరుగా</span>, <span xml:lang="en-US">పాయసమ్ = పాయసమును</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథుడు అప్పుడు పాయసములో సగముభాగమును కౌసల్య కిచ్చెను. మిగిలిన సగము భాగములోని సగము భాగమును (అనగా నాల్గవ భాగమును) సుమిత్ర కిచ్చెను. మిగిలిన దానిలో సగము భాగమును అనగా ఎనిమిదవ భాగమును కైకేయికి ఇచ్చెను. మిగిలిన ఎనిమిదవ భాగమును మరల ఆలోచించి</span>, <span xml:lang="en-US">సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగా రాజు భార్యలు ముగ్గురికిని వేరు వేరుగా పాయసము నిచ్చెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఈ శ్లోకాలకు ఈ అర్థమే పదానుసారి యైన అర్థము. కొందరు వ్యాఖ్యాతలు ఈ అర్థాలను ఇటు లాగి అటు లాగి వేరువేరుగా చెప్పి ఉన్నారు. అధ్యాత్మ రామాయణాదులలో ఉన్న విషయాలను సమన్వయించుకొనుట కొరకు</span>, <span xml:lang="en-US">అట్లే విష్ణువు నాలుగు భాగాలు అయి దశరథుని నలుగురు కుమారులుగా జనింప నిశ్చయించెను అని వెనుక చెప్పిన దానిని పట్టి పాయసము కూడా ఏ భార్యకు ఎంత భాగము వచ్చినది</span>, <span xml:lang="en-US">నాల్గవభాగమా</span>, <span xml:lang="en-US">ఎనిమిదవభాగమా- ఇలాంటి ప్రశ్నలు వేసుకొని వేరువేరు విధాల వ్యాఖ్యానాలు చేసినారు. స్పష్టముగ ఉన్న శ్లోకాల అర్థాలను మన ఇచ్చ వచ్చి నట్లు మార్పుచేయుట సమంజసము కాదు. ఇట్టి వ్యాఖ్యానాలు కేవలము అల్పజ్ఞులకు దిగ్భ్రాంతి కలిగించుటకు మాత్రమే ఉపయోగించును.</span></p> <p class="Prati" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాత్మానం చతుర్విధమ్</span>’’ ‘‘<span xml:lang="en-US">తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్</span>’’ <span xml:lang="en-US">ఇత్యాదివాక్యాలకు - విష్ణువు నాలుగు ముక్కలుగా అయిపోయి రామాదిరూపాలలో జనించినా డని కాదు. అనంతస్వరూపానికి భాగము లనగా ఏమి</span>? <span xml:lang="en-US">విష్ణువు రామాద్యవతారము లెత్తినపుడు వైకుంఠము కాళీగా ఉండెనా </span>? <span xml:lang="en-US">రాముని రూపములో విష్ణువు వచ్చెను కదా</span>; <span xml:lang="en-US">పరశురాముని విషయమేమైనట్లు. అతడు కూడ విష్ణ్వవతారమే అని చెప్పుట కూడ ఉన్నది కదా </span>? <span xml:lang="en-US">రూపరహితుడు</span>, <span xml:lang="en-US">దేశకాలాది పరిచ్ఛేదాతీతుడు అయిన పరమాత్మ నామరూపాలతో దేశకాలపరిచ్ఛిన్నుడుగా కనబడుటయే అవతారము. అనంత స్వరూపునకు</span>, <span xml:lang="en-US">అప్రమేయునకు భాగ కల్పనయే అసంగతము. ఆ పారమేశ్వరశక్తియే వివిధరూపములలో అవతరించినది అని చెప్పుట యుక్తము. రాముడు విష్ణువులో అర్ధభాగ మనీ</span>, <span xml:lang="en-US">లక్ష్మణుడు చతుర్థభాగ మనీ</span>, <span xml:lang="en-US">భరతుడు అష్టమభాగ మనీ</span>, <span xml:lang="en-US">శత్రుఘ్నుడు కూడ అష్టమభాగ మనీ ముందుగా నిర్ణయించుకొని</span>, <span xml:lang="en-US">పాయసము కూడ ఆ విధముగా పంచిననే కుదురు నని అనుకొని ఇష్టము వచ్చినట్లు చేసిన వ్యాఖ్యలు</span>, <span xml:lang="en-US">ఆ వ్యాఖ్యాతలు ఎంతటి ప్రాచీను లైనను</span>, <span xml:lang="en-US">అమోదకరములు కావు. లక్ష్మణుడు ఆదిశేషావతారమని కూడ సంప్రదాయ మున్నది కదా. దాని సమన్వయము చేయుట ఎట్లు </span>? <span xml:lang="en-US">శ్రీరాముడు అర్ధావతార మని చెప్పుట </span>‘‘<span xml:lang="en-US">వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే</span>’’ <span xml:lang="en-US">అని విశ్వసించినవారికి అంతగా అంగీకారయోగ్యము కాదు. వారికి శ్రీరాముడు పూర్ణావతారము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాస్త్వేతత్పాయసం ప్రాప్య నరేన్ద్రస్యోత్తమాః స్త్రియః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంమానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతసః. </span><span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరేన్ద్రస్య = రాజుయొక్క</span>, <span xml:lang="en-US">ఉత్తమాః = ఉత్తమలైన</span>, <span xml:lang="en-US">తాః = ఆ</span>, <span xml:lang="en-US">స్త్రియః = భార్యలు</span>, <span xml:lang="en-US">సర్వాః = అందరును</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">పాయసమ్ = పాయసమును</span>, <span xml:lang="en-US">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">ప్రహర్షోదితచేతసః = పుట్టిన సంతోషము గల మనస్సులు కలవారై</span>, <span xml:lang="en-US">సంమానమ్ = బహుమానమునుగా</span>, <span xml:lang="en-US">మేనిరే = భావించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఉత్తమగుణవతు లగు ఆ రాజభార్య లందరును ఆ పాయసము లభించినందులకు చాల సంతోషించిన మనస్సులతో దానిని గొప్ప బహుమానముగా భావించిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహీపతేరుత్తమపాయసం పృథక్</span>,</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> హుతాశనాదిత్యసమానతేజస</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహీపతేః = రాజుయొక్క</span>, <span xml:lang="en-US">తాః ఉత్తమ స్త్రియః = ఆ ఉత్తమ భార్యలు</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ఉత్తమపాయసమ్ = ఉత్తమమైనపాయసమును</span>, <span xml:lang="en-US">పృథక్ = వేరుగా</span>, <span xml:lang="en-US">ప్రాశ్య = భుజించి</span>, <span xml:lang="en-US">హుతాశనాదిత్యసమానతేజసః = అగ్ని తోడను సూర్యనితోడను సమానమైన తేజస్సుక లవారై</span>, <span xml:lang="en-US">చిరేణ = చాల కాలమునకు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">గర్భాన్ = గర్భములను</span>, <span xml:lang="en-US">ప్రతిపేదిరే = పొందిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఉత్తమగుణవతు లగు ఆ దశరథుని భార్యలు ఆ ఉత్తమ మైన పాయసము భుజించి</span>, <span xml:lang="en-US">అగ్న్యాదిత్యుల వంటి తేజస్సుతో ఒప్పుచు</span>, <span xml:lang="en-US">చాలకాలము తరువాత</span>, <span xml:lang="en-US">అప్పుడు గర్భములను ధరించిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి.</span>‘<span xml:lang="en-US">చిరేణ</span>’ <span xml:lang="en-US">అనగా ఎప్పుడో పుత్రవతులు కావలసిన వారు</span>, <span xml:lang="en-US">ఇంతకాలమునకు ఇపుడు గర్భవతు లైరి అని భావము.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB">మూ. తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః</span>,</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సురేన్ద్రసిద్ధర్షిగణాభిపూజితః. </span><span class="fr">32</span></p> <p class="Prati ParaOverride-11" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <span xml:lang="en-US">బాలకాణ్డే షోడశః సర్గః.</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">ప్రరూఢగర్భాః = ఆవిర్భవించిన గర్భములు గల</span>, <span xml:lang="en-US">తాః స్త్రియః = ఆ భార్యలను</span>, <span xml:lang="en-US">ప్రసమీక్ష్య = చూచి</span>, <span xml:lang="en-US">ప్రతిలబ్ధమానసః = మరల పొందబడిన మనస్సు కలవాడై</span>, <span xml:lang="en-US">త్రిదివే = స్వర్గమునందు</span>, <span xml:lang="en-US">సురేన్ద్ర సిద్ధర్షిగణాభిపూజితః = దేవేంద్రునిచేతను</span>, <span xml:lang="en-US">సిద్ధులచేతను</span>, <span xml:lang="en-US">ఋషిగణములచేతను పూజింపబడిన</span>, <span xml:lang="en-US">హరిః యథా = విష్ణువు వలె</span>, <span xml:lang="en-US">హృష్టః = సంతసించినవాడు</span>, <span xml:lang="en-US">బభూవ = ఆయెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథుడు గర్భవతు లైన భార్యలను చూచి స్వస్థచిత్తుడై</span>, <span xml:lang="en-US">స్వర్గమునందు దేవేంద్ర సిద్ధఋష్యాదులచే పూజింపబడిన విష్ణువు వలె సంతసించెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> కొందరు వ్యాఖ్యాతలు </span>‘<span xml:lang="en-US">హరిః</span>’ <span xml:lang="en-US">అనగా ఇంద్రు డనియు</span>, ‘‘<span xml:lang="en-US">సురేన్ద్ర</span>’’ <span xml:lang="en-US">అనగా దేవతాశ్రేష్ఠులనియు అర్థము వ్రాసిరి. విష్ణువు వైకుంఠములో నుండును గాని స్వర్గములో ఎట్లుండు నని వారి ఆశయము. వాల్మీకి ఎచ్చటను వైకుంఠమును పేర్కొనలేదు. హరిబ్రహ్మాదులందరును స్వర్గనివాసులే.<a/></span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో పదియారవసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter